శ్వాశకోశ వ్యాధులకు మందు… ఔషధ మొక్క ‘ఆడ్డసరం’

అడ్డసరం ఒక పెద్ద పొద. ఇది వ్యర్థ భూముల్లోను, రోడ్ల ప్రక్కన గుంపులు, గుంపులుగా పెరుగుతుంది. ఆకులు సామాన్యంగా, ఎదురెదురుగా ఏర్పడతాయి. తెల్లరంగులో క్యాప్సూల్ ఆకారంలో వుంటాయి.

సాధారణ నామం: వసాకా
శాస్త్రీయ నామం: అడతొడవాసికా
కుటుంబం: అకాంతేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • అడ్డసరం ఆయుర్వేదంలో శ్వాస కోశ వ్యాధులకు మంచి మందు.
    దగ్గు, ఆస్త్మా నివారణకు ఉపయోగించే ఆయుర్వేద ఔషధాలలో అడ్డసరం ఒక ముఖ్య పదార్థం.
  • బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు, గొంతు సమస్యలను నివారించడానికి అడ్డసరం సాధారణంగా, సులభంగా లభించే సురక్షిత ఔషధ మొక్క.
  • అడ్డసరాన్ని దగ్గు, ఆస్త్మా, శ్వాసకోశవ్యాధులు, సాధారణ జలుబు, సైనసైటిస్, క్రానిక్ బ్రాంకైటిస్, గొంతునొప్పి, టాన్సిల్స్, అల్సర్, ఎసిడిటి, బ్లీడింగ్ డిసార్డర్స్, గౌట్, అధిక యుటెరస్ బ్లీడింగ్, యురేనియా చికిత్సలో ఉపయోగిస్తారు.
  • అడ్డసరం ఆకు రసాన్ని త్రాగిస్తే ఆస్త్మా, దగ్గు, జ్వరం, కడుపునొప్పి, క్షయ, మలేరియా, బెణుకులు, అజీర్ణ వ్యాధులు నివారించబడతాయి.

వ్యవసాయరంగంలో …

  • అడ్డసరం ఒక పురుగు మందు మొక్క. అడ్డసరం ఆకు ద్రావణం స్ఫోడోఫ్టెరా లిట్టోరాలిస్‌పై యాంటీ ఫీడెంట్ చర్య ప్రదర్శిచింది. (సాడెక్, 2003)
  • అడ్డసరం అసిటోన్ మరియు మిథనాల్ క్రూడ్ ఆకు ద్రావణాలు బ్రెవికోరినె బ్రాసికె పిల్ల పురుగులు, పెద్ద పురుగులపై అదిక మరణ శాతాన్ని నమోదు చేశాయి (హైఫా – ఆలి, 2016)
  • అడ్డసరం ఆల్కహాల్ ద్రావణం క్యాబేజీ సీతాకోకచిలుక, పియరిస్ బ్రాసికె, 3వ దశ లార్వాలపై అధిక యాంటి ఫీడెంట్ చర్య ప్రదర్శించింది. (బాజ్‌పాయ్ – చాండీల్, 2009).
  • అడ్డసరం ఆకుద్రావణం ఆకులు తినే పురుగులు, రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారిస్తుంది. (రాఘవేంద్ర అతని అనుచరులు, 2016)
  • అడ్డసరం ఆకు ద్రావణం తయారీకి కావలసిన పదార్థాలు: అడ్డసరం ఆకులు (1కిలో)

తయారీ విధానం: ఒక కిలో అడ్డసరం ఆకులను నూరి 10 లీటర్ల నీటిలో కలిపి 24 గంటలు కదపకుండా వుంచి ఆ తర్వాత పలుచని గుడ్డద్వారా వడపోసి పిచికారి చేయాలి.

  • అడ్డసరం ఆకులలో ఉండే వాసిసిన్, వాసిసినోన్, అడతోడిన్ పురుగుల పై వికర్షక మరియు కీటకనాశక ప్రభావాలు చూపుతాయి. (ఎమిమాల్ విక్టోరియా, 2010 నాండ్రె అతని అనుచరులు, 2012)
  • అడ్డసరం – కానుగ ఆకులు కషాయం

అడ్డసరం – కానుగ ఆకుల కాషాయం

తయారు చేసే విధానం

  • అడ్డసరం, కానుగ ఆకులు సేకరించి శుభ్రపరుచుకోవాలి.
  • ఆకుల బరువుకు 16 రెట్ల నీరు కలపాలి.
  • ఆకులను సన్నగా తిరిగి ఒక కుండాలో పోసి మరగ వేయాలి.
  • పాత్రలోని కషాయం సగమయ్యే వరకు సన్నని సెగమీద మరిగించి, క్రిందికి దంచి వడపోయాలి.
    మొతాదు: లీటరు నీటికి 10 మీ.లీ. కషాయం చొప్పున కలిపి పంటపై పిచికారి చేయాలి.
    నివారించబడే పురుగులు: తెల్లదోమ, పచ్చదోమ.
Read More

పంట పెరుగుదల, దిగుబడి, నాణ్యత పెంపుకు ‘దశగవ్య’

పంచగవ్యలోని దేశీ ఆవుపేడ, ఆవుమూత్రం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి అనే 5 పదార్థాలతోపాటు ఇంకొక 5 మొక్కల కషాయాలను ఉపయోగించి తయారుచేసే సేంద్రియ ఉత్పత్తి “దశగవ్య”.
దశగవ్య తయారీకి కావలసిన మొక్కలు : వేప, జిల్లేడు, వావిలి, ఉమ్మెత్త, జట్రోఫా, కానుగ, అడ్డసరం (అడతొడా)

తయారు చేసే పద్ధతి : విడివిడిగా 1:1 నిష్పత్తిలో 1 కి. మొక్కల ఆకులను ఒక లీటరు ఆవు మూత్రంలో 10 రోజులు నానబెట్టి, వడపోసిన కషాయాన్ని 1 లీ. తీసుకుని 5 లీ. పంచగవ్యతో కలపాలి. ఈ మిశ్రమాన్ని 25 రోజులు నిల్వ వుంచి బాగా కలియ త్రిప్పి పంచగవ్యలో ఆకుల కషాయం పూర్తిగా కలిసి పోయేలా చూడాలి.

ఉపయోగించే పద్ధతి : దశగవ్య ద్రావణాన్ని వడపోస్తే స్ప్రేయర్ నాజిల్‌లో చెత్త, చెదారాలు అడ్డుపడకుండా ఉంటాయి.

  • 3 లీ. దశగవ్య ద్రావణాన్ని 100 లీ. నీటిలో కలిపి పంటలపై పిచికారి చేయాలి. కూరగాయలు, పండ్ల తోటల్లో పంట పెరుగుదల దశలో వారినికొకసారి పిచికారి చేయాలి.
  • విత్తనాలను విత్తే ముందు 3 శాతం ద్రావణంలో 20 నిమిషాలు నానబెట్టి మరునాడు ఉదయం విత్తితే మొలక శాతం పెరుగుతుంది.
  • నారు మొక్కల వేర్లను నాటే ముందు 20 నిమిషాలు దశ గవ్యద్రావణంలో ముంచి నాటితే వేర్లు వృద్ధి చెందుతాయి.

దశగవ్య వాడకం వలన కలిగే ప్రయోజనాలు

  • పంట పెరుగుదల, దిగుబడి, నాణ్యత పెరుగుతాయి.
  • పేనుబంక, తామరపురుగులు, నల్లులు, ఇతర రసం పీల్చే పురుగులు నివారించబడతాయి.
  • ఆకుమచ్చ, ఆకు మాడు తెగులు, బూడిద తెగులు అరికట్టబడతాయి.
Read More

పురుగులు, తెగుళ్ళ నివారణకు మ్యాజిక్ కంపోస్టు

కావలసిన పదార్థాలు
పశువుల పేడ : 1 కిలో
పశువుల మూత్రం : 1 లీటరు
వేప ఆకులు, కానుగ ఆకులు, జిల్లేడు ఆకులు : 1 కిలో (ఒక్కొక్కటి)
బెల్లం : 50 గ్రా.

తయారు చేసే విధానం : ఒక కుండ తీసుకొని పైన చెప్పిన చెట్ల ఆకులన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి కుండలో వేసి దానికి పశువుల పేడ, మూత్రం కలిపి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి కుండను బట్టతో కప్పి ఉంచి వారం రోజుల పాటు నీడలో ఉంచాలి. వారం రోజుల తరువాత దానిలోని మిశ్రమాన్ని వడపోసి దానికి నీటిని కలిపి పంటపై పిచికారి చేసుకోవాలి.

  • చిన్న మొక్కలకు ఒక భాగం మిశ్రమానికి 60-70 రెట్ల నీటిని కలిపి, పెద్ద మొక్కలకైతే 30-40 రెట్ల నీటిని కలిపి పిచికారి చేసుకోవాలి.
  • ఈ కషాయాన్ని విత్తనశుద్ధికి కూడా ఉపయోగించవచ్చు.
  • పురుగులను, తెగుళ్ళను నివారించడానికి ఇది బాగా పనిచేస్తుంది.
  • చెదలు సమస్యగా ఉన్నచోట మ్యాజిక్ కంపోస్టు తయారీలో ఆముదం లేదా సీతాఫలం ఆకులు కలిపి తయారు చెయ్యాలి.

పంటల ఎదుగుదలకు మిశ్రమం :
పశువుల పేడ : 100 కిలోలు
పశువుల మూత్రం : 100 లీటర్లు
వేరుశనగ చెక్క (పిండి) : 100 కిలోలు

పై మూడు పదార్థాలను ఒక పాలిథిన్ పట్టాపై వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం ఒక ఎకరం పొలానికి సరిపోతుంది. మిశ్రమాన్ని పొలంలో సమంగా పడేలా చల్లుకోవాలి. దీనిని వాడటం వలన పంటలకు కావలసిన పోషక పదార్థాలు లభించి పంటలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. దీనిని అన్ని పంటలలోనూ వాడుకోవచ్చు.

Read More

ఔషధ మొక్క… అక్కలకర్ర

అక్కల కర్ర ఒక చిన్న, నిలువుగా పెరిగే పూల మొక్క. ఇది వేగంగా పెరిగి బంగారం రంగు, ఎరుపురంగు పూలగుత్తులను కలిగి ఉంటాయి. దీని ఆకులు, పూల గుత్తులు పళ్ళనొప్పులను తగ్గించే బాధ నివారణ కారకం కలిగి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా దీనిని అలంకరణ మొక్కగా, ఔషధ మొక్కగా పెంచుతారు. కాండాలు నిలువుగా లేదా నేలపై ప్రాకుతూ ఎరుపు రంగులో నూగు లేకుండా ఉంటాయి. ఆకులు వెడల్పుగా అండాకారం నుండి ముక్కోణాకారంలో ఉంటాయి. ఆకులు 5-11 సెం.మీ. పొడవు, 4-8 సెం.మీ. వెడల్పుండి అంచులు మొనతేలిన పళ్ళు కలిగిఉంటాయి. పూల గుత్తులు ఒకటిగా ఎకీన్లు (కాయలు) నల్లగా, 2-2.5 మి.మీ. పొడవుంటాయి.

సాధారణ నామం: టూతేక్‌ప్లాంటే, పారాక్రెస్
శాస్త్రీయ నామం: ఆక్మెల్లా ఒలరేసియ

కుటుంబం: ఆస్టరేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • అక్కలకర్రను విస్తృతంగా పంటినొప్పి, గొంతు, చిగుళ్ళ చికిత్సలో ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా తాజా పూలగుత్తులు లేదా ఎండబెట్టి పొడిచేసిన పూలగుత్తులను ఉపయోగిస్తారు. కాని వేర్లు, ఆకులను కూడా సిఫారసు చేస్తున్నారు.
  • డిసెంట్రి, కీళ్ళనొప్పుల చికిత్సలో కూడా ఉపయోగించవచ్చు. రోగనిరోధక వ్యవస్థను కూడా పెంచుతుంది.
  • లాలాజలం ఉత్పత్తిని పెంచుతుంది. వేసవిలో వచ్చే జ్వరం నయం చేయడానికి ఉపయోగపడుతుంది.
  • మలేరియా చికిత్సలో ఉపయోగిస్తారు. ఆకులను బాక్టీరియా, శిలీంద్రాల వల్ల కలిగే చర్మవ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.
  • గాయాలను త్వరగా నయం చేస్తుంది. జలుబు, ఫ్లూ రోగాల నుండి కాపాడుతుంది.

వ్యవసాయరంగంలో …

  • అక్కలకర్ర ఆకుల డైక్లోరోమిథేన్ ద్రావణం పరీక్షించిన అన్ని బాక్టీరియాలపై యాంటిబాక్టీరియాల్ చర్యని ప్రదర్శించింది. ఎస్కెరిచియా కోలై > స్టెఫైలోకోకస్ ఆరియస్ > ప్రోటియస్ వుల్గారిస్ > బాసిల్లస్ సబ్‌టైలిస్ > క్లెబ్సియెల్లా న్యుమోనియాపై ఈ క్రమంలో యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది. డైక్లోరోమిథేన్ ద్రావణం అసిటోన్, నీటి ద్రావణాల కన్నా వంగకాయతొలుచు పురుగు, ల్యూసినాయిడెస్ ఆర్బొనాలిస్‌పై అధిక యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది. ఈ ద్రావణం ఆల్కలాయిడ్స్, టెర్పెనాయిడ్స్, ఫైటోస్టిరాల్స్, సపోనిన్స్, స్టీరాయిడ్, టానిన్స్, ఫినాలిక్ కాంపౌండ్స్‌ని కలిగి ఉంది (పవున్‌రాజ్, అతని అనుచరులు, 2014)..
  • అక్కలకర్రక్రూడ్ హెక్సేన్‌ద్రావణం టూటా ఆబ్సల్యూటపై అధిక కీటకనాశక చర్యను ప్రదర్శించింది. ఈ ద్రావణాన్ని టమాట పంటనాశించే టూటాఅబ్సల్యూట పురుగుల నివారణలో ఉపయోగించవచ్చు. ఈ ద్రావణం నుంచి వేరు చేసిన ఆల్కమైడ్స్ టూటా ఆబ్సల్యూట నివారణ కార్యక్రమాలలో పురుగు మందులుగా ఉపయోగించవచ్చు. వీటిలో స్పైలాంతాల్ ముఖ్యమైనది. ఇది అత్యధిక కీటకనాశక చర్య కలిగి, బదనిక, సోలెనాప్సిస్ సీవిస్సిమకు ఎటువంటి హాని కలిగించదు. (మోరినో, అతని అనుచరులు, 2011)
  • స్పైజలాంతాల్ యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్, లార్విసైడల్ లక్షణాలను కలిగి ఉంది (శర్మ, అతని అనుచరులు, 2010).
  • అక్కలకర్ర ద్రావణాలు ఈడెసఈజిప్టి, అనోఫెలెస్ స్టెఫెన్సి, అనోఫెలెస్ క్యూలిసిఫేసీస్, క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్‌పై కీటకనాశక చర్యను ప్రదర్శించాయి (అమర్ అండ్ మెహిహోర్మ్, 2006; పాండె, అతని అనుచరులు, 2007; సరాఫ్ అండ్ దీక్షిత్, 2002).
  • స్పెలాంతాల్ ఆస్పర్ౙిల్లస్ స్పీసీస్‌పై ఫంగిస్టాట్ మరియు ఫంగిసైడల్ చర్య ప్రదర్శించింది (కౌటిన్‌హా, అతని అనుచరులు, 2006).
  • స్పైలాంతాల్ అనేక జీవ చర్యలను కలిగి ఉంది (డుబే, అతని అనుచరులు, 2013)
  • స్పైలాంతాల్ యాంటిఫంగల్ (డూబే, అతని అనుచరులు, 2013), బాక్టీరియోస్టాటిక్ (మోలినాటోర్రెస్, అతని అనుచరులు, 2004), ఇన్‌సెక్టిసైడల్ (కడిర్, అతని అనుచరులు, 1989; శర్మ, అతని అనుచరులు, 2012; మోరెనో, అతని అనుచరులు, 2012); యాంటిమలేరియల్ (శర్మ, అతని అనుచరులు, 2012); ఈడెసఈజిప్టి, హెలికోవర్పా జియానియోనేట్స్‌పై యాంటిలార్విసైడల్ చర్యలు (రామ్‌సేవక్, అతని అనుచరులు, 1999) ప్రదర్శించింది.
  • హెచ్. లాంగిపెస్‌వేర్ల నుండి వేరు చేసిన స్పైలాంతాల్ మరియు ఇతర ఆల్కమైడ్లు స్ల్కీరోషియం రాల్ఫిసి, స్ల్కీరోటినియాసెపివొరం, ఫైటోఫ్తొరా ఇన్‌ఫెస్టాన్స్, రైజోక్టోనియా సొలాని ఎజి3 మరియు ఎజి5 శిలీంద్రాల పెరుగుదలనరికట్టాయి (మోలినాటోర్రెస్, అతని అనుచరులు, 2004).
  • స్పైలాంతాల్ బాసిల్లస్ సబ్‌టైలిస్, ఎస్కరిచియా కోలి, శకారోమైసిస్ సెరెవిసియా పెరుగుదలను కూడా అరికట్టింది (మోలినొటోర్రెస్, అతని అనుచరులు, 2004).
  • స్పైలాంతస్ క్యాల్వ లోని స్పైలాంతాల్ ఫ్యుజేరియం ఆక్సిస్పోరం, ట్రైకోఫైటాన్ మెంటగ్రోఫైటెస్ పై యాంటిఫంగల్ చర్య ప్రదర్శించింది (రాయ్, అతని అనుచరులు, 2004).
  • స్పైలాంతాల్ కీటకనాశినిగా కూడా ఉపయోగపడుతంది (కడిర్, అతని అనుచరులు, 1989; స్పెల్‌మన్, అతని అనుచరులు, 2011; శర్మ, అతని అనుచరులు, 2012). బ్రోకోలి వంటి క్యాబేజి జాతి కూరగాయల పంటలనాశించే డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లాని చంపింది (శర్మ, అతని అనుచరులు, 2012). సొలనేసి జాతి మొక్కలనాశించే టమాట లీఫ్‌మైనర్, టూట ఆబ్సల్యూటని కూడా చంపింది. (మోరెనో, అతని అనుచరులు, 2012).
  • స్పైలాంతాల్ నత్త, ఫైసా ఆక్సిడెంటాలిస్‌పై బలమైన మొల్లస్కిసైడల్ చర్యను ప్రదర్శించింది (జాన్స్, అతని అనుచరులు, 1982).
  • అక్కలకర్ర మొక్కపొడి (3%, 5%), మొక్కజొన్నగింజల నిల్వ సమయంలో ఆశించే సైటోఫిలస్ జియామెయిస్ వీవిల్స్ మరణ శాతాన్ని పెంచి, విడుదలయ్యే పెద్దపురుగుల శాతాన్ని తగ్గించి గింజలను కాపాడుతుంది. గింజల మొలకశాతంపై ఎటువంటి దుష్ప్రభావం చూపదు (ఓగ్బాన్, అతని అనుచరులు, 2015).
Read More

అధిక పోషక పదార్థాలు గల ‘నాడెప్ కంపోస్ట్

నాడెప్ కంపోస్ట్ పద్ధతిని నారాయణ్ డియోరావ్ పండరి పాండే అనే మహారాష్ట్ర రైతు అభివృద్ధి చేశారు. నాడెప్ కంపోస్టు పద్ధతి ప్రత్యేకంగా పశువులు లేని రైతులకు మంచి ప్రత్యామ్నాయం.

కంపోస్ట్ పిట్ పరిమాణం: పొడవు: 10 అడుగులు, వెడల్పు: 6 అడుగులు, ఎత్తు : 3 అడుగులు. ఒక అడుగు ఎత్తు వరకు ఇటుకల మధ్య ఎటువంటి ఖాళీలు ఉండకూడదు. తర్వాత ఒక్కో ఇటుకకు మధ్య 6 అంగుళాల ఖాళీ ఉండాలి.

కంపోస్టు తయారీకి కావలసిన పదార్థాలు :

  • పంట అవశేషాలు లేదా ఎండు / పచ్చి ఆకులు – 1350-1400 కి.
  • పశువుల పేడ లేదా బయోగ్యాస్ / గోబర్ గ్యాస్ స్లర్రీ – 98-100 కి.
  • జల్లెడ పట్టిన మట్టి – 1675 కి.
  • నీరు – 1350-1400 లీ.
    కంపోస్ట్ తయారు చేసే పదార్థాలను పిట్‌లో నింపే ముందు గోడలను పేడతో అలకాలి. నాడెప్ కంపోస్ట్ తయారీలో ముఖ్య అంశం పిట్‌ని కావలసిన పదార్థాలతో 24 గంటలలోపు ఒకేసారి నింపడం.
  • మొదటి పొరః 6 నుంచి 10 అంగుళాల వరకు పంట అవశేషాలు, ఆకులు మొదలైనవి.
  • రెండవ పొర : 4 కిలోల పేడను 100 లీ. నీటిలో కలిపి మొదటి పొరపై చల్లాలి.
  • మూడవ పొర : 60 కిలోల మట్టిని పొరలాగా చల్లాలి.

పై విధంగా 10Ð12 పొరలుగా కంపోస్ట్ పిట్ నింపడం పూర్తి చేయాలి. అలా నింపిన తర్వాత, జీవ పదార్థాన్ని 3 అంగుళాల మందంగల మట్టితో కప్పి పేడ మరియు మట్టి పేస్టుతో అలకాలి.

కంపోస్ట్ పిట్‌ని నింపిన 15-20 రోజుల తర్వాత నాడెప్ కంపోస్ట్ పిట్ 2 అడుగులు కుంగడం జరుగుతుంది. కుంగిన పిట్‌ని పైన పేర్కొన్న విధంగా 2-3 పొరలు నింపి మరలా పేడ మరియు మట్టి పేస్టుతో అలకాలి. తర్వాత 3 నెలల వరకు, 10-15 రోజులకొకసారి నీరు చిలకరించడానికి తప్ప కదిలించరాదు. మొత్తం కంపోస్ట్ పిట్‌ని తాటాకులతో కప్పాలి. ఎటువంటి పరిస్థితులలోను బీటలు ఏర్పడకుండా చూడాలి. ఒకవేళ ఏర్పడితే వెంటనే వాటిని స్లర్రీతో నింపాలి. 90-120 రోజుల తర్వాత సుమారు 2.5 టన్నుల కంపోస్టు తయారవుతుంది. ఈ కంపోస్ట్ ఎరువులో నత్రజని 1.0 శాతం, భాస్వరం 0.5 శాతం, పొటాష్ 1.2 శాతం ఉంటాయి. సాధారణ కంపోస్టు పద్ధతిలో తయారైన కంపోస్టు కంటే 3-4 రెట్లు పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి.

ప్రయోజనాలు : రసాయన ఎరువుల ఖర్చు తగ్గుతుంది. భూసారం పెరుగుతుంది. పంట దిగుబడి పెరుగుతుంది. సేంద్రియ పంటల సాగుకు దోహదపడుతుంది. బయట ఉత్పాదకాలపై ఆధారపడటం తగ్గుతుంది.

Read More

ఔషధ మొక్క… ఉత్తరేణి

ఏకవార్షిక లేదా బహువార్షిక మొక్క. ఇది ప్రపంచంలో అన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. అనేక ప్రదేశాలలో కలుపు మొక్కగా పెరుగుతుంది. ఉత్తరేణి నిలువుగా 2 మీ. ఎత్తు వరకు పెరిగే మొక్క. దీని కాండం మొదలులో కొయ్యలా తయారవుతుంది. ఆకులు చిన్నకాడలు కలిగి పైవైపు ముదురు ఆకుపచ్చ రంగులోను, క్రిందివైపు లేత ఆకుపచ్చ రంగులోను ఉంటాయి. ఆకులు గుడ్డు ఆకారంలో ఉంటాయి. పూవులు చిన్నవిగా, ఆకుపచ్చ, తెలుపు రంగులో ఉంటాయి. పూలు పెరిగిన కొద్దీ క్రిందికి వంగి కాండానికి దగ్గరగా వత్తుకుంటాయి. కాయలు పదునైన మొనలతో నారింజ రంగు నుండి ఎరుపు ఊదారంగులో ఉంటాయి.

సాధారణ నామం : చాఫ్ ఫ్లవర్ శాస్త్రీయ నామం : అకిరాంథస్ ఆస్పెర కుటుంబం: అమరాంతేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • వినాయక చవితి రోజు జరిపే గణేశ వ్రత పూజలో ఉపయోగించే 21 ఆకులలోఇది ఒకటి. ఈ మొక్క రసాన్ని గోడకు వేసే సున్నంలో ఒక ముఖ్య పదార్థంగా ఉపయోగిస్తారు.
  • ఉత్తరేణి భారతీయ సంస్కృతిలో ముఖ్య స్థానాన్ని ఆక్రమించింది. దీనిని పూర్వకాలం నుండి ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా ఉపయోగిస్తున్నారు.
  • ఉత్తరప్రదేశ్‌లో ప్రజలు దీనిని గర్భస్రావానికి మందుగా ఉపయోగించేవారు.
  • ఉత్తరేణిని పశువుల వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. ఆస్త్మా, దురదలు, హిస్టీరియా, చర్మవ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు.
  • వేర్లను క్యాన్సర్, గాల్‌బ్లాడర్‌లో రాళ్ళు ఏర్పడినప్పుడు చికిత్సకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • ఉత్తరేణి ఇథైల్ ఎసిటేట్ ద్రావణం వంగ పంట నాశించి తీవ్ర నష్టం కలిగించే అక్షింతల పురుగు, హెనోసెపిలాక్నా విజింటియాక్టోపంక్టేటపై అత్యధిక యాంటిఫీడెంట్, కీటకనాశక చర్యలను ప్రదర్శించింది (జయశంకర్, అతని అనుచరులు, 2013).
  • తంగేడు, గన్నేరు, ఉమ్మెత్త, ఈశ్వర వేరు, అరిస్టొలోకియా బ్రాక్టియేట, అడవి ఆముదం (జట్రోఫాకర్కాస్), వేప, ఐలాంతాస్ ఎక్సెల్సా,తుమ్మి (ల్యూకాస్ ఆస్పెరా), జిల్లేడు ముడి పదార్థాలను ఉపయోగించి తయారు చేసిన సహజ హెర్బల్ పురుగు మందు పంటలలో పురుగులు, తెగుళ్ళను నివారిస్తుంది. ఈ హెర్బల్ మొక్కలన్నిటినీ ఎండబెట్టి పొడిచేసి ఆవుపేడ, ఆవు మూత్రంతో కలిపి 20 రోజులు పులియబెట్టాలి. 1 లీ. పులిసిన ద్రావణాన్ని 20 లీ. నీటిలో కలిపి పంటలపై పిచికారి చేయాలి. దీనినుపయోగించడం వలన మొక్కలలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
  • ఉత్తరేణి ఇథైల్ అసిటేట్ ద్రావణం ఈడెస్ ఈజిప్టి, క్యూలెక్స్ క్వింక్విఫాసియేటస్ లార్వాలను అత్యధికంగా చంపింది (భగవాన్,అ తని అనుచరులు, 2008).
  • ఉత్తరేణి కాండంలోని ఎసెన్షియల్ ఆయిల్ ఆస్పర్ౙిల్లస్ కార్నియస్ శిలీంద్ర పెరుగుదలను 300 పిపియం వద్ద అరికట్టింది (మిశ్రా, అతని అనుచరులు, 1992).
  • ఉత్తరేణి ఇథైల్ అసిటేట్ ద్రావణం ఆలుగడ్డ, వంగ పంటల ఆకులను తిని అధికంగా నష్టపరిచే హెనోస్ ఎపిలాక్న విగ్నింట యాక్టోపంక్టేటని నివారిస్తుంది (కుప్పుసామి ఎలుమలై, అతని అనుచరులు, 2014).
Read More

వివిధ పంటలపై ‘పంచగవ్య’ ప్రభావం

‘పంచ’ అంటే అయిదు. ‘గవ్య’ అంటే గోమాత నుండి లభించే పదార్థాలు. గోమాత నుండి లభించే ఐదు ఉత్పత్తులను – పాలు, పెరుగు, పేడ, మూత్రం, నెయ్యి – సరైన నిష్పత్తిలో కలిపి పులియబెడితే వచ్చే ఉత్పత్తినే “పంచగవ్య’ అంటారు. పంచగవ్య ఒక సమర్థవంతమైన సేంద్రియ ఎరువు. ఇది పురుగులకు వికర్షిణిగా పనిచేస్తుంది. పంచగవ్యపై జరిపిన అనేక అధ్యయనాలలో 3 శాతం ద్రావణం సమర్థవంతంగా మొక్కల పెరుగుదలకు, పురుగులు, తెగుళ్ళు ఆశించకుండా కాపాడటానికి పని చేస్తుందని తేలింది. వివిధ మొక్కలకు వివిధ నిష్పత్తులతో ప్రయోగాలు చేయవచ్చని సూచించబడింది.
పంచగవ్య మొక్కల పెరుగుదలకే కాకుండా, చీడపీడలకు తట్టుకునే శక్తిని కూడా ఇస్తుంది. దీనిని అన్ని రకముల మొక్కలపై వాడుకోవచ్చు. నారుమళ్ళకు బాగా శ్రేష్ఠం.

మామిడి : ఆ అధిక ఆడ పుష్పాలతో పూత సాంద్రతను పెంచుతుంది. ఆ పండ్లు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఏర్పడతాయి. క్రమం లేకుండా లేదా సంవత్సరం విడిచి సంవత్సరం పండ్లు ఏర్పడటం ఉండదు. ఆ గది ఉష్ణోగ్రత వద్ద పండ్ల నిల్వగుణాన్ని 12 రోజులు పెంచుతుంది. ఆ పండ్ల రుచి, వాసన అద్భుతం.

జామ : అధిక టోటల్ సాల్యుబుల్ షుగర్స్ ఆ పండ్ల నిల్వ గుణం 5 రోజులు పెరుగుతుంది.

పసుపు : దిగుబడులు 22% పెరుగుతాయి. ఆ అతి పొడవాటి చిల్ల కొమ్మలు. ఆ ¢డైనేజి నష్టాన్ని తగ్గిస్తుంది. ఆ తల్లి, చిల్ల కొమ్మల నిష్పత్తిని తగ్గిస్తుంది. ఆ పురుగులు, తెగుళ్ళను తగ్గించే తూనీగ, సాలీడులను వృద్ధి చేస్తుంది. ఆ తల్లి, విత్తన కొమ్మలకు ఎక్కువ ధర లభిస్తుంది. ఆ కుర్కుమిన్ పరిమాణాన్ని పెంచుతుంది.

నిమ్మ : సంవత్సరం పొడవునా పూత ఏర్పడేలా చేస్తుంది. ఆ పండ్లు పుష్టిగా, మంచి వాసన కల్గి ఉంటాయి. ఆ నిల్వ గుణం 10 రోజులు పెరుగుతుంది.

అరటి : సాగు నీటిలో కలిపి పారించడం, పిచికారి చేయడంతోపాటు 3% ద్రావణాన్ని (100 మి.లీ.) మగపూవుని తొలగించిన తర్వాత గెల చివర పాలిథిన్ సంచిలో పోసి కట్టాలి. గెల పరిమాణం ఒకే మాదిరిగా ఉంటుంది. గెల కోత సాధారణ పంటలలో కన్నా ఒక నెల ముందే జరుగుతుందని గమనించడమైనది. గెల పైభాగంలో, అడుగు భాగంలో వున్న హస్తాల పరిమాణం ఒకే మాదిరిగా వుంటుంది.

మల్లె : అరుదైన సువాసన, పరిమళం. ఆ మొగ్గ తొలుచు పురుగు ఆశించదు. ఆ సంవత్సరం పొడవునా పూత వస్తుంది.

Read More

ఔషధ మొక్క మురిపిండ

మురిపిండ / కుప్పింట / హరిత మంజరిగా పిలువబడే హరిత మంజరి ఏకవార్షిక హెర్బల్ మొక్క. ఇది ఒక కలుపు మొక్కగా అన్ని చోట్లా కన్పిస్తుంది. దీని పూలగుత్తులు కప్పులాంటి ఆకారంలో కప్పబడి ఉంటాయి. పూలు అతి చిన్నవిగా ఉంటాయి. ఈ మొక్క నిటారుగా 1.2 మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకులు వెడల్పుగా అండాకారంలో ఉంటాయి. ఈ మొక్క 1.2-6.55þ14 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకు మొదలు గుండ్రంగా ఉంటుంది. ఆకుకాడ 1.5 నుండి 5.5 సెం.మీ. పొడవుంటుంది. పూలకాడలు 2.5 నుండి 6 సెం.మీ. పొడవుంటాయి. పూలకాడ క్రింది భాగంలో ఆకుపచ్చ రంగులో ఆడపూలు ఉంటాయి. కాండం పొడవునా దళసరి ఈనెలలో నూగు కలిగి ఉంటుంది. కాయ 1.5þ2 మి.మీ. పరిమాణంలో 3 చీలినట్లున్నభాగాలతో నూగు కలిగి ఉంటుంది. మురిపిండ ఒక మీటరు ఎత్తు పెరిగే ఏకవార్షిక మొక్క. ఆకులు దాదాపు వృత్తాకారంలో ఉండి, కణుపుకు ఒకటి చొప్పున ఏర్పడతాయి. ఆకు అంచులకు దంతాల వంటి నొక్కులుంటాయి. ఆడ, మగ పుష్పాలు వేర్వేరుగా ఒకే మొక్కపై ఏర్పడతాయి. ఫలాలు గుండ్రంగా ఉండి ఒకే విత్తనం కలిగి ఉంటాయి. పుష్పాలు, ఫలాలు సంవత్సరం పొడవునా మొక్కపై ఏర్పడతాయి. మురిపిండ మొక్కలు తొలకరి వర్షాలు పడిన వెంటనే భూమిపై మొలకెత్తి వర్షాకాలంలో ఏపుగా పెరుగుతాయి. ఇవి పంటపొలాలలోను, బీడు భూములలోను, కంచెల వెంబడి కలుపు మొక్కలుగా పెరుగుతాయి. మురిపిండ మొక్కలో అకాలైఫిన్, అరంటియమైడ్, కాన్నాబినాల్, ఫ్లేవకెంఫెరాల్, సక్సినిమైడ్ వంటి అనేక రసాయనాలుంటాయి.

సాధారణ నామం : ఇండియన్ అకలైఫా / ఇండియన్ నెటిల్ / ఇండియన్ కాపర్ లీఫ్ శాస్త్రీయ నామం : అకలైఫా ఇండికా కుటుంబం: యూఫర్బియేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • కుప్పింట అనేక సంప్రదాయ ఔషధ ప్రయోజనాలు కలిగి, వాంతిమందుగా, విరేచనకారిగా, నులిపురుగుల నివారిణిగా, గజ్జి నివారిణిగా ఉపయోగపడుతుంది.
  • నూరిన ఆకుల రసానికి ఉప్పు కలిపి లేదా కషాయంగా తీసుకుని గజ్జి చర్మవ్యాధులను నివారించుకోవచ్చు. దీని కషాయం ఆస్త్మా చికిత్సకి, కాలేయం, మూత్రపిండాలను శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది.
  • వేరు కషాయం విరేచనకారిగా పని చేస్తుంది.
  • ఆకులను కంటి జబ్బుల చికిత్సలో ఉపయోగిస్తారు. ఆకుపొడిని గాయాల చికిత్సకు ఉపయోగిస్తారు.
  • భారతదేశంలో కుప్పింటని ఉబ్బసం, న్యుమోనియా చికిత్సకుపయోగిస్తారు. ఆఫ్రికా, ఇండియాలలో దీని ఆకులను కూరవండుకుని తింటారు.

వ్యవసాయరంగంలో …

  • కుప్పింట యాంటిఆక్సిడెంట్, యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్, యాంటిఇన్‌ఫ్లమేటరి, యాంటిఅల్సర్, యాంటిహెల్మింటిక్, యాంటిక్యాన్సర్, యాంటివీనోమ్ చర్యలు కలిగి ఉంది (సుధాకర్, అతని అనుచరులు, 2016).
  • కుప్పింట మిథనాల్ ద్రావణాలు పంటలలో తెగుళ్ళు కలిగించే గ్జాంతోమోనాస్ కాంపెస్ట్రిస్ బాక్టీరియా పెరుగుదలను గణనీయంగా అరికట్టింది (జాన్ డిబ్రిట్టె, అతని అనుచరులు, 2011).
  • కుప్పింట కాండం, బెరడు ద్రావణాలు మిడత, ఎపాక్రోమియా స్పీ. పై విషచర్యను ప్రదర్శించింది. (పుట్టరుద్రయ్య అండ్ భాటియా, 1955).
  • కుప్పింట బెరడు, ఆకుపొడులు, వాటి ఇథనాల్ ద్రావణాలు గొంగళిపురుగు, యూప్రోక్టిస్ ఫ్రెటిర్నా మరియు డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లాలపై కీటక నాశక చర్యను ప్రదర్శించాయి (మెకిండూ, 1983).
  • కుప్పింట మొక్కలు పంటలలో శత్రు పురుగుల సహజ జీవనియంత్రణ కారకాలైన మిత్ర పురుగులకు ఆశ్రయమిస్తాయి (టిఎనఎయు అగ్రిటెక్‌పోర్టల్) కుప్పింట మొక్క భూమిలోని విషపూరిత లోహాలైన సీసం (లెడ్), నికిల్, క్రోమియం, కాడ్మియంలను గ్రహించి నిల్వ చేసుకుంటుంది. అందువలన ఈ లోహాలతో కలుషితమైన భూముల నుండి వీటిని తొలగించడానికి ఈ మొక్కను సిఫారసు చేయవచ్చు. (సుభాషిణి అండ్ స్వామి, 2015)
  • ఈ మొక్కలో ఉన్న “కన్నాబినాల” అనే రసాయనం కీటకాలకు అభివృద్ధి నిరోధకంగా, క్రిమిసంహారకంగా పనిచేస్తుంది. వీటి ఆకులను ‘పంచపత్ర కషాయం’ తయారీలో ఉపయోగించవచ్చు.
  • ఈ కషాయాన్ని రైతులు స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఇది స్పర్శ చర్య, ఉదర చర్య కలిగి ఉంటుంది. అందువలన ఈ కషాయం ఒక శక్తివంతమైన కీటకనాశనిగా పనిచేసి పురుగులను అదుపులో ఉంచుతుంది.
  • మురిపిండ ఆకు కషాయం (10 శాతం) ఆల్టర్నేరియా హీలియాంథి (ప్రొద్దుతిరుగుడు ఆకుమాడు తెగులు) శిలీంద్రం పెరుగుదలను (78.38%), బీజోత్పత్తిని (85.90%), బీజాలు మొలకెత్తడాన్ని (52.48%) నివారించింది.
  • వీటి ఆకుల ద్రావణానికి అపరాల నిల్వలో ఆశించే పుచ్చు పురుగును నివారించే శక్తి ఉన్నట్లు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. దీనికి శిలీంద్ర నాశని లక్షణాలు కూడా ఉన్నాయి (జయకుమార్ సోలమన్, తమిళనాడు).
  • దోమల లార్వాలను నిర్మూలించే గుణం ఈ కషాయానికుందని కెల్మ్ (1997) పరిశోధనలు తెలియజేశాయి. పత్తి పంటలో ఆకులను తినే పురుగులు, ఎర్రనల్లి నివారణకు ఈ కషాయాన్ని ఉపయోగించవచ్చు.
  • మురిపిండ ఆకులు చాలా ఘాటైన వాసన కల్గి ఉంటాయి కనుక ఈ కషాయాన్ని పంటలపై పిచికారి చేస్తే, దీనిలోని రసాయనాలు కీటకాలకు ఆహార భక్షక నిరోధకాలుగా పనిచేస్తాయి (రఘునాథ్).
  • శ్రీగోమాత గాయత్రి ఆర్గానిక్స్ కుప్పింట మొక్కనుపయోగించి బహుళ పంటలలో విస్తృతంగా ఉపయోగించే వ్యవసాయ పురుగుమందుని తయారు చేశారు. దీని తయారీకి కావలసిన మొక్కల పదార్థాలు : పసుపు, వేప, మిరప, అల్లం, ఉల్లి, జిల్లేడు (కలోట్రాపిస్ జైగాంటియా, కలోట్రాపిస్ ప్రోసెరా), బొప్పాయి, కానుగ, తులసి, పొగాకు, లాంటానా, ఉమ్మెత్త, కుప్పింట, ఆముదం, సింబోపోగాన్ సిట్రేటస్, ఆముదం మొక్క, సదాపుష్ప (కాథరాంతస్ రోసియస్), గన్నేరు. వావిలి, ఉల్లి, మిరియాలు, సీతాఫలం, టేకు, వస, నీలగిరి చెట్టు, జట్రోఫా, పుదీన, గరిక, గోమూత్రం, గోమయం.
  • ఈ పురుగుమందు అనేక పంటలలో పురుగులను సంహరిస్తుంది. మొక్కలలో పురుగులు, తెగుళ్ళు, వైరస్‌ల నిరోధకశక్తిని పెంచుతుంది. తెగులుకారక సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. అనేక పురుగులను వికర్షిస్తుంది. శిలీంద్రాలు, లార్వాలు, క్రిములు, బాక్టీరియా, నులిపురుగులు, గుల్లలు, నత్తలను చంపుతుంది. దీనినుపయోగిస్తే ఇంకే పురుగుమందును వాడవలసిన అవసరం లేదు.
    మోతాదు : 3% (30 మి.లీ./లీ.) పురుగుమందు పిచికారి చేయాలి., ఎకరానికి 35 లీ. ఒకసారి పిచికారి చేయడానికి ఉపయోగించాలి.
    నిల్వ కాలం : 3 సంవత్సరాలు
  • కుప్పింట ఆకుల పొడి నీటి ద్రావణం (0.05 గ్రా./లీ.) టమాట కాయనాశించే బాక్టీరియం, క్ౙాంతోమోనాస్ వెసికటోరియాపై బాక్టీరియానాశక చర్యను ప్రదర్శించింది (అడెడైర్, అతని అనుచరులు, 2017).
  • 5% కుప్పింట బెరడు ఆల్కహాల్ ద్రావణం 98% ప్లూటెల్లా మాక్యులిపెన్నిస్ మరియు పెరికేలియా రిసిని, 50% ప్రొడీనియాలిటూర, 40% క్రోసిడిలోమియా బైనొటాలిస్, 100% యూప్రూటిస్ ఫ్రెటర్నా లార్వాలను చంపింది. (పుట్టురుద్రయ్య అండ్ సుబ్రమణియన్, 1958).
  • కుప్పింట మొక్కలో టానిన్స్, టెర్పెనాయిడ్, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. కుప్పింట ద్రావణం వేరుశనగ పంట నాశించే ఆస్పర్ౙిల్లస్ నైగర్, ఫ్యుజేరియం ఆక్సిస్పోరం శిలీంద్రాల పెరుగుదలను గరిష్టంగా అరికట్టింది (రాధిక, ఆమె అనుచరులు, 2016).
Read More

వరిలో నేరుగా విత్తు సాగు విధానం – మెళకువలు

ఆవశ్యకత :
ఉత్తర కోస్తా జిల్లాలలో ఖరీఫ్ పంటకాలంలో వరి ప్రధానమైన పంట, సుమారు 5 లక్షల 20 వేల ఎకరాలలో సాగు చేయబడుతుంది, అందులో సుమారు 50 శాతం విస్తీర్ణం నేరుగా విత్తే (ఎదసాగు) పద్దతిలోనే సాగు అవుతుంది. సాగు ఖర్చులు పెరగడం, కూలీలు సకాలంలో అందుబాటులో లేకపోవడం, కూలీల ఖర్చు పెరగడం వలన రైతులు నేరుగా విత్తే పద్ధతిలో వరిసాగువైపు మరలుతున్నారు.

మారిన వాతావరణ పరిస్థితులలో తక్కువ నీటితో లాభదాయక దిగుబడులు పొందడం వరిలో నేరుగా విత్తు విధానం ద్వారా సాధ్యం. అంతేకాకుండా ఈ సాగువిధానం వలన కొంతవరకు మీథెన్ వాయువు విడుదల తగ్గటం వలన పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. అలాగే నీటి వినియోగం 25% ఊడ్పు పద్ధతి మీద తగ్గుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకోవచ్చు. ప్రతికూల పరిస్థితులలో వరిసాగు ఆలస్యం అయినపుడు నేరుగా వరి విత్తుసాగు పద్దతిలో సాగుచేయడం వలన సమయం ఆదా అవుతుంది.

నేరుగా విత్తే వరి సాగు చేయుటవలన లాభాలు :-

  1. తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకోవచ్చు.
  2. నారుమడి పెంపకం, నాట్లకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. సుమారు ఎకరానికి 2500 నుండి 3000 రూపాయల వరకు కూలీల ఖర్చు ఆదా అవుతుంది.
  3. చెరువుల క్రింద, కాలువల క్రింద సాగుచేసే పరిస్థితులలో నాట్లు ఆలస్యం కాకుండా సకాలంలో పంటను సాగు చేయవచ్చు.
  4. విత్తన మోతాదు 40-50 శాతం తగ్గుతుంది.
  5. పంట పడిపోదు, పంట వారం నుండి 10 రోజుల ముందు కోతకు వస్తుంది.
  6. పురుగులు, తెగుళ్ళు సమస్య కొంతవరకు తక్కువగా ఉంటుంది.
  7. నీటిని ఆదా చేసుకోవచ్చు.
  8. కోత యంత్రాలతో సులువుగా పంట కోత చేపట్టవచ్చు.

నేరుగా విత్తే వరిలో అదిక దిగుబడికి కీలక యాజమాన్య పద్దతులు
రకాల ఎంపిక :-

ముంపు ప్రాంతాలకు / లోతట్టు ప్రాంతాలకు అనువైన రకాలు :
ఎం.టి.యు – 1061 (ఇంద్ర) ఎం.టి.యు – 1064 (అమర), ఆర్.జి.ఎల్-2537 (శ్రీకాకుళం సన్నాలు) ఎత్తు పెరిగి, కాండం దృడంగా వుండి, పడిపోని రకాలను సాగుచేసుకోవాలి.
సాధారణ కాలువ ప్రాంతాలు, చెఱువుల క్రింద వరి సాగుకు అనువైన రకాలు :
ఎం.టి.యు – 3291 (సోనామసూరి), ఎం.టి.యు-1210 (సుజాత), ఎం.టి.యు -7029 (2), ఎం.టి.యు -1121 (శ్రీదృతి), ఎం.టి.యు-1224 (మారుటేరు సాంబ) బి . పి టి -5204
కాలువ చివరి భూములు ఆలస్యంగా విత్తే ప్రాంతాలకు అనువైన రకాలు :
ఎం.టి.యు – 1156 (తరంగిణి), ఎం.టి.యు – 1153 (చంద్ర) ఎన్.ఎల్.ఆర్- 34449,
ఆర్.ఎన్.ఆర్ – 15048

నేల తయారీ : తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకొని పలుమార్లు దున్ని మెత్తని దుక్కి
చేసినట్లయితే కలుపు సమస్యను కొంతవరకు అదిగమించవచ్చు. ఆఖరి దుక్కిలో సిఫారసు మేరకు పోషకాలు వేసి కలియదున్ని బాగా చదును చేయాలి. నేల సుమతులంగా / చదునుగా లేనట్లయితే తేమ సరిగా అందక మొలక సరిగా రాదు. పంట ఎదుగుదల కూడా సమానంగా ఉండదు, నీటి యాజమాన్యం సమస్యఅవుతుంది. అఖరు దుక్కిని రోటావేటర్‌తో వేసుకోవడం మంచిది.
వాలును బట్టి నీరు బయటకి పోవుటకు వీలుగా ప్రతి 2 మీటర్లకు బాటలు చేసుకోవడం వలన తర్వాత ఎరువులు వేయుటకు, సస్యరక్షణ చర్యలు చేపట్టుటకు ఉపయోగపడటమే కాకుండా దోమపోటు ఎక్కువగా ప్రభలకుండా వుంటుంది.

విత్తన మోతాదు : ఎకరానికి 16Ð20 కిలోల విత్తనము ఉపయోగించాలి.

విత్తన శుద్ధి : విత్తేముందు సూడోమోనాస్‌తో విత్తన శుద్ధిచేయాలి.

విత్తే విధానం: శుద్ధిచేసిన విత్తనాన్ని నేరుగా చదును చేసిన పొలంలో వెదజల్లడం ద్వారా గాని
20 సెం.మీ. దూరంలో నాగటి సాలు వెనకగాని, గొర్రుతోగాని, ట్రాక్టరుతో నడిచే ఎరువులు మరియు విత్తనాన్ని ఒకేసారి వేసే గొర్రుతో (ఫర్టికమ్ సీడ్ డ్రిల్) గాని వేసుకోవాలి.

విత్తనాన్ని ఎక్కువ లోతులో వేసినట్టయితే మొలకశాతం దెబ్బతినే అవకాశం ఉంది. కనుక పై పోరల్లో సుమారు (2.5 – 5 సెం.మీ) లోతులో వేసుకోవాలి.

దమ్ముచేసి సాగు చేయు పద్ధతిలో మొలకెత్తిన విత్తనాలను దమ్ము చేసిన పొలాల్లో వెదజల్లడం ద్వారా లేదా డ్రమ్‌సీడరు ద్వారా విత్తుకోవచ్చు.

మొక్కలు లేనిచోట కొత్త మొక్కలు వేసుకొనుట :

వేదజల్లు పద్ధతిలో సాగు చేయు రైతులు విత్తే రోజే ఎకరానికి అరసెంటు నారుముడి పోసుకున్నట్లయితే అధిక వర్షాల వలన లేదా పల్లపు ప్రాంతాలలో మొక్కలు చనిపోయి ఖాళీలు
ఏర్పడిన ప్రాంతాలలో ఈ నారును ఉపయోగించడం వలన కావలసిన మొక్కల సాంధ్రత ఉంటుంది. అలాగే ఒత్తుగా ఉన్న మొక్కలు తగ్గించి పలుచగా ఉన్న ప్రాంతాలలో నాటుకోవచ్చు. మంచి దిగుబడికి పొలం తయారీ సమయంలో ఎకరానికి 8 – 10 టన్నుల పశువుల గెత్తం వేసుకోవాలి.

ఎరువుల యాజమాన్యం: నేరుగా విత్తే వరి పొలాలలో భూ ఆరోగ్యానికి, సేంద్రీయ కర్బనం పెంచడం కోసం
తొలకరి వర్షాలకు పెసర వంటి అపరాల పంటలు వేసి భూమిలో కలియదున్నుకోవాలి.

జీవన ఎరువులను తప్పని సరిగా వేసుకోవాలి. ఎకరానికి 500మి.లీ. అజోస్పైరిల్లం 500 మి.లీ.లు పాస్పోబాక్టీరియాను 100 కిలోల పశువుల గెత్తంతో కలిపి విత్తిన తరువాత తగు తేమ వున్నపుడు వేసుకోవాలి. సిఫారసు చేసిన పోషకాలను తప్పనిసరిగా అందించాలి.

కలుపు యాజమాన్యం : కలుపును మనుషుల సహాయంతో మొదటగా నిర్మూలించి, సరైన సమయంలో నీరు పెట్టి, ఆ నీటిలో సిఫారసు చేసిన మోతాదులో అజొల్లాను వేయాలి.

నీటి యాజమాన్యం : పంటకు 7-10 రోజుల కొకసారి అవసరం మేరకు తడులు పెట్టాలి.

ఈ పద్ధతిలో ఎల్లప్పుడు నీరు నిలువ ఉంచవలసిన అవసరం లేదు. అయితే పంటకు కావలసిన తేమను అందించి పంట కీలక దశల్లో బెట్టకు గురి కాకుండా చూసుకోవాలి. నీటి లభ్యతనుబట్టి విత్తనము ఎద పెట్టిన 30 నుంచి 40 రోజుల్లో పొలంలో నీరు పారించి మాగాణి వరి మాదిరిగా మార్చుకోవాలి.

విత్తిన దగ్గర నుండి మొదటి 30 రోజులు ఆరుతడి నీటి యాజమాన్యం పాటించాలి. వర్షాలు పడిన తరువాత లేదా కాలువలకు చెఱువులకు నీరు అందుబాటులో ఉన్నపుడు సాధారణ మాగాణి నాట్లు వరి మాదిరి నీటి యజమాన్యం చేపట్టాలి. దుబ్బుచేసే దశలు 1-2 అంగుళాలు మేర నీటిని ఉంచి, పూత దశ నుండి గింజనిండే దశ వరకు 2-4 అంగుళాల నీటిని ఉంచడం ద్వారా అదిక పిలకలు, వెన్నులు వచ్చి దిగుబడి పెరుగుతుంది.
సస్యరక్షణ చర్యలు : నాట్లు పద్ధతిలో లాగానే పురుగు ఉధృతిని గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

డా॥ ఎం.ఎం.వి.శ్రీనివాసరావు, డా॥ కె. లక్ష్మణ , ప్రధాన శాస్త్రవేత్తలు, ఏరువాక కేంద్రం, విజయనగరం. ఫోన్: 94401 23223

Read More

లోడర్, ఎక్సవేటర్ యంత్రాలతో రైతులకు మేలు : మంత్రి తుమ్మల

ఆధునిక వ్యవసాయంలో యాంత్రీకరణకు అత్యంత ప్రాధాన్యత ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాదాపూర్ హైటెక్స్‌లో నిర్వహిస్తున్న ‘ఎర్త్‌కాన్ ఎక్స్‌పో-2026’ ఎక్సిబిషన్లో ఎక్స్‌సీఏ (XCA) సంస్థ ప్రతినిధులు ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శించిన మంత్రి తుమ్మల, స్టాల్‌లో ప్రదర్శించిన లోడర్, ఎక్సవేటర్ యంత్రాల పనితీరును స్వయంగా పరిశీలించి మాట్లాడుతూ, లోడర్, ఎక్సవేటర్ వంటి యంత్రాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. వ్యవసాయ రంగంలో కూలీల కొరత తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి యంత్రాలు రైతులకు పెద్ద ఎత్తున ఉపయుక్తమవుతాయని, తక్కువ సమయంలో వ్యవసాయ పనులను పూర్తి చేసుకునేందుకు తోడ్పడతాయని తెలిపారు. రైతులకు పొలంలో సులభంగా ఉపయోగపడే పోర్టబుల్ యంత్రాలను తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకువచ్చిన ఎక్స్‌సీఏ (XCA) సంస్థ ప్రతినిధులను మంత్రి అభినందించారు. వ్యవసాయ రంగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ తరహా వినూత్న యంత్రాలకు మార్కెట్లో మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో చేర్చితే 40 శాతం సబ్సిడీ
ఈ యంత్రాలను వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో చేర్చినట్లయితే రైతులకు 40 శాతం సబ్సిడీతో అందించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం డీజిల్‌తో నడుస్తున్న ఈ యంత్రాలకు ప్రత్యామ్నాయంగా బ్యాటరీతో పనిచేసే నమూనాలను కూడా త్వరలో మార్కెట్‌లోకి తీసుకురావాలని సంస్థ యాజమాన్యానికి సూచించారు. బ్యాటరీ ఆధారిత యంత్రాలు కనీసం 6 నుంచి 7 గంటల పాటు నిరంతరాయంగా పనిచేసే విధంగా రూపకల్పన చేయాలని కోరగా, త్వరలోనే అలాంటి యంత్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

2027 నాటికి ఈవీ హైడ్రాలిక్ ఎక్సవేటర్ లక్ష్యం
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 1.5 టన్నుల సామర్థ్యం గల మినీ హైడ్రాలిక్ ఎక్సవేటర్ ఈవీ మోడల్‌ను 2027 నాటికి మార్కెట్‌లోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. అలాగే వినియోగదారుల కోసం ప్రత్యేక డెమో జోన్ ఏర్పాటు చేయడంతో పాటు, ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

Read More