ఐలాంతస్ ఒక ఆకులు రాల్చే వేగంగా పెరిగే చెట్టు. పెద్ద చెట్లు 80 అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఇది నున్నని కాండం, పాలిపోయిన బూడిద రంగుబెెరడు కలిగి ఉంటుంది. కాడలు లేత చెస్ట్నట్ గోధుమ రంగులో వుంటాయి. పెద్ద కాంపౌండ్ ఆకులు 1-4 అడుగుల పొడవుండి, ఒక దాని తర్వాత ఒకటి ఏర్పడుతుంది. ప్రతి పెద్ద ఆకు 10-41 చిన్న అకులు కలిగి వుంటుంది. ప్రతి చిన్న ఆకు అడుగు అంచున ఎక్కువ గ్రంథులు గల పళ్ళను కలిగి ఉంటుంది. ఆకుల అంచులు పూర్తిగా పళ్ళు లేకుండా ఉంటాయి. ఐలాంతస్‌లో మగ, ఆడ పూలు వేర్వేరు చెట్లలో ఏర్పడతాయి. పూలు పెద్ద గుత్తులలో ఏర్పడతాయి. పూలు చిన్నవిగా, పాలిపోయిన పసుపు నుండి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. బల్లపరుపు, మెలి తిరిగిన రెక్కలున్న కాయలు ఆడ చెట్లపై ఏర్పడతాయి ప్రతి కాయ ఒకే గింజను కలిగి ఉంటుంది. ఇవి చెట్లపై చాలా కాలముంటాయి. కొయ్య మొత్తగా, బలహీనంగా, క్రీంతో కూడిన తెలుపు నుండి లేత గోధుమ రంగులో ఉంటుంది. చెట్టు అన్ని భాగాలు ప్రత్యేకంగా ఆకులు, పూలు కాల్చిన గింజ వాసన కలిగి ఉంటాయి.
సాధారణ నామం : ఐలాంతస్ / గ్రీఆఫ్ హోవెన్ శాస్త్రీయ నామం : ఐలాంతస్ ఆల్టిస్సిమ కుటుంబం: సీమరూబేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
కాండం, వేరు ఎండిన బెరడుని ఔషధంగా ఉపయోగిస్తారు. ఐలాంతస్ చెట్టుని డయేరియా, ఆస్త్మా, మూర్ఛ రోగం, పోట్లు, వేగంగా గుండె కొట్టుకోవడం, గనోరియా, మలేరియా, టేప్ వర్మ్స్ చికిత్సలో ఉపయోగిస్తారు. దీనిని టానిక్‌గా కూడా ఉపయోగిస్తారు.
చైనాలో ఈచెట్టు బెరడుని డిసెంట్రి, ఇతర కడుపులో సమస్యల చికిత్సకు ఉపయోగిస్తారు. ఈ హెర్బల్ ద్రావణాన్ని త్రాగటం వలన 82 డిసెంట్రిరోగులలో 81 మందిలో డిసెంట్రి నివారించబడింది.
వేరు బెరడు టింక్ౘ్రుని కార్డియక్ పాల్పిటేషన్స్, ఆస్త్మా, మూర్ఛరోగం నివారణలో విజయవంతంగా ఉపయోగిస్తారు. ఆకులు, కాండం బెరడు, వేర్లను అల్సర్లు, దురదల చికిత్సలకు ఉపయోగిస్తారు. కొరియాలో వేరు బెరడుని దగ్గు, గ్యాస్ట్రిక్, ప్రేవులలో సమస్యల చికిత్సకు ఉపయోగిస్తారు.కాయలను డిసెంట్రి చికిత్సలో ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో …
ఐలాంతస్ నుండి తయారు చేసిన ద్రావణాలు అకారిసైడల్ చర్యలను కలిగి వుండి టెట్రానికస్ టెలోరియస్‌ని సమర్థవంతంగా చంపాయి (కోవ్‌టనెంకో, అతని అనుచరులు)
ఐలాంతస్ వేరు ద్రావణం నుండి వేరుచేసిన ఐలాంతోన్ బఠాణి పంటనాశించే పేనుబంక, అనిర్టోనిఫాస్ పైసంని అత్యధికంగా చంపింది (డిఫియో, అతని అనుచరులు, 2009)
ఐలాంతస్ ఆకు ద్రావణం నుండి వేరుచేసిన ఐలాంతోన్ హెర్బిసైడల్ చర్యను ప్రదర్శించి ఆల్ఫాల్సా (మెడికాగోసటైన) విత్తనాలను మొలకెత్తకుండా చేసింది. భవిష్యత్తులో ఐలాంతోస్‌ని ఒక సహజ ఉత్పత్తి కలుపుమందుగా ఉపయోగించవచ్చు. (బార్బారాస్లాడోంజ, అతని అనుచరులు, 2014).
ఐలాంతస్ ద్రావణం నుండి వేరు చేసిన క్వాసినాయిడ్స్ (అలియాంతోన్, చపార్రినోన్, గ్లాకారూబినోన్, 13 (18) డిహైడ్రోగ్లాకారూబినోస్, షినుజాలాక్టోన్ హెచ్ స్పోడోప్టెరా లిట్టొరాలిస్‌పై తీవ్ర విషప్రభావం, ఆహారాన్ని తీసుకోవడాన్ని అరికట్టడం ద్వారా అధిక సమర్ధవంతంగా చంపాయి. ఐలాంతస్ ఆకుల మిథనాల్ ద్రావణాలను సీతాకోకచిలుక జాతుల లార్వాలను నివారించే వృక్షసంబంధ పురుగుమందులను వృద్ధి చేయడానికి ఉపయోగించవచ్చని ఫలితాలు వెల్లడించాయి (పవేల, అతని అనుచరులు, 2014).
ఐలాంతస్ క్యూలెక్స్ క్వింక్విఫాసియేటస్‌పై లార్విసైడల్ ప్రభావాన్ని చూపింది. (పవేల, 2009, జేబ్రి అండ్ బాలియోఅమర్, 2014). ఐలాంతస్ బెరడు నూనె ట్రైబోలియం కాస్టానియం, ఒరైజీఫిలస్ సురినామెన్సిస్, సైటోఫిలస్ ఒరైజే, లైపోసెలిస్ పీట పెద్ద పురుగులను గణనీయంగా వికర్షించింది.
ఐలాంతస్ బెరడు నూనె సైటోఫిలస్ ఒరైజెపై బలమైన స్పర్శ, విషపూరిత చర్యను కూడా ప్రదర్శించింది. అంతేగాక, ఐలాంతస్ బెరడునూనె ఒరైజీఫిలస్ సురినామెన్సిస్, సైటోఫిలస్ ఒరైజెలపై ఫ్యూమిగెంట్ చర్యను కూడా ప్రదర్శించింది (లు అండ్ ఉ, 2009).
ఐలాంతస్ ముదిరిన చెట్లు ఒకటి లేదా ఎక్కువ విత్తనాలు మొలకెత్తడం, మొక్కలు పెరగడాన్ని అరికట్టే శక్తివంతమైన కాంపౌండ్స్‌ని ఉత్పత్తి చేస్తాయి. అరికట్టే చర్య వేర్ల బెరడులో ఎక్కువగాను, ఆకులలో మధ్యమంగాను, కొయ్యలో తక్కువగాను ఉంటుంది. వేరు బెరడులోని అరికట్టే పదార్థాలు మొక్కలు మొలవక ముందు, మొలచిన తర్వాత పిచికారి చేసినపుడు బలమైన హెర్బిసైడల్ ప్రభావాలను చూపాయి. మొక్కలు మొలిచిన తర్వాత పిచికారి చేస్తే ప్రభావాలు గణనీయంగా ఉంటాయి. ఐలాంతస్‌లోని అల్లెలో కెమికల్స్ శక్తివంతమైన సహజ ఉత్పత్తి కలుపు మందులను అభివృద్ధి చేయగల సామర్థ్యమున్నవని ఫలితాలు వెల్లడించాయి (హెల్సె, 1990)
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి
గార్బేజ్ ఎంజైమ్‌ను థాయ్‌లాండ్‌కి చెందిన డా. రోసుకాన్ ఆవిష్కరించారు.
తయారీవిధానం : కూరగాయలు, పండ్ల తొక్కలు, ముక్కలు, మార్కెట్లో చెత్త కుప్పలో వేసిన మిగలపండిన పండ్లు, కూరగాయల వ్యర్థాలకు కొంచెం నల్లబెల్లం లేదా మొలాసెస్ లేదా సేంద్రియ పంచదార కలిపి 90 రోజులు మురగబెడితే గార్బేజ్ ఎంజైమ్ తయారవుతుంది.
కావలసిన పదార్థాలు :
మూత బిగుతుగా పెట్టడానికి వీలుపడే గాజు లేదా ప్లాస్టిక్/ఫైబర్ డ్రమ్ము
కూరగాయలు, పండ్ల వ్యర్థాలు (తొక్కలు, మొక్కలు కుళ్ళినవి 3 పాళ్ళు)
నల్లబెల్లం లేదా మొలాసెస్ లేదా సేంద్రియ (బ్రౌన్) సుగర్ – 1 పాలు
నీరు Ð 10 పాళ్ళు
పైవాటినిన్నంటినీ బాగా కలపాలి. దుకాణాల్లో మిగిలిపోయిన, కుళ్ళిపోయిన కూరగాయలు, పండ్లను ముక్కలు చేసి కలపవచ్చు. మిగిలిపోయిన అన్నం, కూరలు కూడా కలపవచ్చు. ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి గాలిచొరబడకుండా గట్టిగా మూత బిగించాలి. ఎండ తగులకుండా సాధారణ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచాలి. మొదటి 30 రోజుల పాటు, రోజుకోసారి మూత తీసి వాయువులు బయటికి వెళ్ళాక, మరలా గట్టిగా మూత బిగించాలి. ఆ తర్వాత 60 రోజుల పాటు మూత తీయనక్కర్లేదు. 90 రోజులకు గార్బేజ్ ఎంజైమ్ సిద్ధమవుతుంది. ద్రావణం పులియటం వల్ల తెల్లటి పొర ఏర్పడుతుంది. మొత్తం 90 రోజులు గడిచాక ద్రావణాన్ని వడపోసి నిల్వ చేసుకుని 60 రోజుల వరకు వాడుకోవచ్చు. వడపోతలో వచ్చిన వ్యర్థాలను ఎండబెట్టి మొక్కలకు ఎరువుగా వాడవచ్చు. లేదా మళ్ళీ గార్బేజ్ ఎంజైమ్ తయారీకి వాడవచ్చు.
ప్రయోజనాలు : దీనిలో ఉన్న సూక్ష్మ జీవరాశులు, ఔషధ గుణాలు నేలను సారవంతం చేస్తాయి. ఇది సహజ ఎరువుగా, కీటకనాశినిగా, శిలీంద్ర, బాక్టీరియా, వైరస్ తెగుళ్ళ నివారణిగా పనిచేస్తుంది. దీనిని వాడితే పంటల్లో నత్రజనిని గ్రహించే శక్తి పెరుగుతుంది. దీనిని నీటిలో తగినపాళ్ళలో కలిపి వాడుకోవాలి.
ఎరువుగా : 1:1000 పాళ్ళలో కలిపి నేలలో పోయవచ్చు. లేదా పంటలపై పిచికారి చేయవచ్చు.
పురుగులు / తెగుళ్ళ నివారణకు : 1:100 పాళ్ళలో కలిపి పిచికారి చేయవచ్చు.
దిగుబడి పెంచడానికి : 1:500 పాళ్ళలో కలిపి పిచికారి చేయాలి.
ఇది 30-60 సెం.మీ. పొడవుతో కండగల ఆకులు గల బహువార్షిక పొద. ఆకులు పదునుగా, అంచులు రంపపు పండ్ల వలే ఉంటాయి. ఇది 2 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. 10 సంవత్సరాల తర్వాత మొక్కలు పూతకు వస్తాయి. పూలు పసుపు పచ్చగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఆకుల కండలో తేమ ఎక్కువగా ఉండడం వలన ఎడారి ప్రాంతాలలో, మెట్ట ప్రాంతాలలో ఈ మొక్క బాగా పెరుగుతుంది. ఇది పిలకల ద్వారా వ్యాప్తి చెందుతుంది.
సాధారణ నామం : అగేవ్/సెంచురీప్లాంట్/రాకాసిమొక్క శాస్త్రీయ నామం : అగేవ్ అమెరికానా కుటుంబం: అగేవేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
దీని ఆకులు మరియు వేర్లు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. ఆకులలో ఐసోఫ్లేవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, కౌమారిన్స్, విటమిన్ ఎ, బి1, బి2, సి, డి, కె మొదలగునవి ఉంటాయి. ఆకుల నుండి లభించే నార అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.
కిత్తనార మంచి విరేచనకారి. స్కర్వి, సిఫిలిస్, క్యాన్సర్, జీర్ణకోశ వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు.
క్షయ, పచ్చ కామెర్లు, లివర్ వ్యాధుల నివారణకు కూడా ఉపయోగపడుతుంది.
వ్యవసాయరంగంలో …
కిత్తనార ఆకుల ద్రావణం స్పర్శ, ఉదర విష చర్యల ద్వారా వరి పంటనాశించే ఆకుముడత పురుగుని నివారిస్తుంది (భాస్కరన్ అండ్ నారాయణసామి, 1995ఎ, ఉపాధ్యాయ్, అతని అనుచరులు, 2001).
కిత్తనార ఆకులను నిల్వ ధాన్యంలో ఆశించే పురుగుల నివారణకుపయోగిస్తారు. (గ్రెయిన్గే అండ్ అమ్మద్, 1988).
కిత్తనార మొక్కలనారనుపయోగించి తాడు తయారు చేస్తారు. టాంజెనియాలో దీని ఆకుల రసాన్ని చెదల నివారణలో పురుగు మందుగా ఉపయోగిస్తారు (ఎమఋగ్వా, 2009).
కెన్యాలో ఈ మొక్కను ఇంటిలోపల, వెలుపల అలంకరణ మొక్కగాను, వ్యవసాయ క్షేత్రాలలో జీవకంచెగాను ఉపయోగిస్తారు. (ఎమఋగ్వా, 2009) కిత్తనార ఆకులలో వోలటైల్ ఆయిల్, సపానిన్స్, వేర్లలో క్రిస్టలైన్ సపానిన్స్ ఉంటాయి. కిత్తనార ఆకుల రసం పూసిన వాల్ పేపర్ చెదలను నివారిస్తుంది (చోప్రా అండ్ చోప్రా, 1933).
కిత్తనార (అగేవ్ టెక్విలానా) ఆకులు ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, సపానిన్స్, టానిన్స్, ట్రైటెర్పీన్లు మరియు/లేదాస్టీరాయిడ్స్ కలిగి ఉండి వీటి రసం సిల్వర్ లీఫ్ తెల్లదోమ, బెమిసియా టబాసి మరియు నులిపురుగుల్ని 100% చంపింది (హెర్బర్డ్ డాక్టర్, అతని అనుచరులు, 2016)
వివిధ పంటలనాశించే పురుగుల నివారణకు వేప, పసుపు, వావిలాకు, గ్లెåరిసిడియా, ఆముదం, అరిస్టొలోకియా, అల్లం, కిత్తనార, సీతాఫలం, ఉమ్మెత్త, జిల్లేడు, మునగ, తూటాకు (ఐపోమియా), కొతిమీర ఆకులను వికర్షక, కీటకనాశక చర్యలు గల పురుగు మందులుగా ఉపయోగిస్తారు (నారాయణసామి, 2002).
కిత్తనార (అగేవ్ అమెరికానా, అగేవ్ఫెరాక్స్, అగేవ్ మోంటానా, అగేవ్ స్క్రాబ్రా, అగేవ్ మార్ౙినేట) ఆకుల క్రూడ్ ద్రావణాలను మాక్రోఫోమినా ఫేసియోలినా, ఆల్టర్నేరియా పోరి, ఆస్పర్ౙిల్లస్ అవమోరి, ఆస్పర్ౙిల్లస్ నైగర్, ఫ్యుజేరియం ఉడం, ఫ్యుజేరియం సొలానిల పెరుగుదలపై పరీక్షించారు. అన్ని ఆకుల ద్రావణాలు మాక్రోఫోమినా ఫేసియోలినా శిలీంద్ర పెరుగుదలను అత్యధికంగా అరికట్టాయి. అగేవ్ స్పీసిస్ ఆకుల నుండి వేరు చేసిన యాంటిఫంగల్ కాంపౌండ్‌ని వివిధ పంటలలో తెగుళ్ళ నివారణకు పర్యావరణహిత మొక్క ఆధారిత శిలీంద్రనాశనులుగా ఉపయోగించవచ్చు. (మహర్షి అండ్ ఠాకర్, 2014).
అగేవ్ స్పీసీస్ మరియు ఒపన్షియా స్పీసీస్ లని పూర్వకాలం నుండి వాణిజ్యపరంగా ఇథనాల్ ఉత్పత్తికి వినియోగిస్తున్నారు. ఈ రెండింటి జాతులు వేడి, పొడి వాతావరణాలలో తక్కువ నీటిని సమర్ధవంతంగా వినియోగించుకుని ఎక్కువ జీవపదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి (కుష్మాన్, అతని అనుచరులు, 2015).
ఒక కిలో కిత్తనార ఆకులను రాగిపాత్రలోని 10 లీ. వేడి నీటిలో ముంచి 24 గంటలు నిల్వ ఉంచాలి. తర్వాత ద్రావణాన్ని వడపోసి పంటపై పిచికారి చేసి వరి పంట నాశించే ఆకుముడత పురుగుని నివారించవచ్చు.(జీన్టెక్, 1998).
కిత్తనారు మొత్తం మొక్క ద్రావణం వికర్షక, పురుగు నాశక చర్యలు కలిగి చెదల నివారణ లక్షణాలు కలిగి ఉంది.
1 కి. ఐపోమియా ఫిస్ట్యులా, 1 కి. కిత్తనార, 1 కి. ఉమ్మెత్త, 1కి. కానుగ, 1కి. సీతాఫలం, 1 కి. ఆర్ౙిమోన్ మెక్సికానా ఆకులను ముక్కలు చేసి పెద్దకుండలోని 10 లీ. ఆవుమూత్రంలో కనీసం 10 రోజులు నానబెట్టాలి. 10 రోజుల తర్వాత వడపోసి పురుగులాశించిన కూరగాయల పంటలపై పిచికారి చేయాలి. ఈ ద్రావణం కూరగాయల పంటలనాశించే కాయతొలుచు పురుగులు, ఆకుతినే పురుగులు, వేర్లను నష్టపరిచే పురుగులను సమర్ధవంతంగా నివారిస్తుంది.
ద్రాక్ష నాటడానికి 3 నెలల ముందు 10 అ. దూరంలో పొడవాటి కందకాల (ట్రెంచెస్)ను త్రవ్వాలి. ఈ కందకాలలో కోలింగి (టెఫ్రోసియా పర్పురియా), కిత్తనార (అగేవ్ స్పీసీస్) జిల్లేడు వంటి పచ్చి ఆకు ఎరువులను వేసి మట్టితో కప్పి కుళ్ళనివ్వాలి (రోహిణిరెడ్డి)
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి
వర్మి వాష్ తయారీ విధానం: 200 లీ. డ్రమ్ముని తీసుకుని, దాని అడుగు భాగం నుండి కొంచెం పైన కుళాయి బిగించాలి. డ్రమ్ములోపల 15 సెం.మీ. వరకు ఇసుకపోసి, ఇసుకపై డ్రమ్ముపై వరకు ఎర్రమట్టి పోయాలి. దానిపైన పేడ, కూరగాయల వ్యర్థాలను వేసి వానపాములను వదలాలి. ప్రతిరోజూ డ్రమ్ములో 2 లీ. నీటిని పోస్తూ ఉండాలి. ఇలా 15 రోజులు చేసిన తర్వాత డ్రమ్ములోని నీటిని కుళాయి ద్వారా పాత్రలో సేకరించి 15 రోజుల కొకసారి మొక్కలపై పిచికారి చేయాలి. డ్రిప్ ద్వారా వారానికొకసారి పంపించాలి. దీనివలన మొక్కలు ఆరోగ్యవంతంగా పురుగులు, తెగుళ్ళు సోకకుండా పెరుగుతాయి.
ఉద్యానవనం (Horticulture) వ్యవసాయ రంగంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన విభాగం. కూరగాయలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మరియు సుగంధ మొక్కల సాగు ఉద్యాన పంటల పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం వినియోగదారులు ఆరోగ్యకరమైన, రసాయన అవశేషాలు లేని ఆహార ఉత్పత్తులను కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సేంద్రియ ఉద్యానవనం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ఉద్యాన పంటలు అధిక విలువ కలిగిన పంటలు కావడంతో వీటిలో నాణ్యత, రుచి, నిల్వ సామర్థ్యం మరియు మార్కెట్ విలువకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. సేంద్రియ ఉత్పత్తుల వినియోగం ద్వారా ఈ లక్ష్యాలను సాధించవచ్చు. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, పంటల ఎదుగుదలను ప్రోత్సహించడం, దిగుబడిని పెంచడం మరియు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడడం వంటి అనేక ప్రయోజనాలను సేంద్రియ ఉత్పత్తులు అందిస్తాయి.
ఉద్యాన పంటలలో సేంద్రియ ఉత్పత్తుల అవసరం
ఉద్యాన పంటల సాగులో రసాయన ఎరువులు మరియు పురుగుమందుల అధిక వినియోగం వల్ల నేలలో సేంద్రియ పదార్థాల శాతం తగ్గిపోతుంది. ఫలితంగా నేల నిర్మాణం దెబ్బతిని, సూక్ష్మజీవుల కార్యకలాపాలు తగ్గి, మొక్కల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
సేంద్రియ ఉత్పత్తుల వినియోగం వల్ల:
నేల సారవంతత పెరుగుతుంది.
పండ్లు మరియు కూరగాయల నాణ్యత మెరుగుపడుతుంది.
నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది.
రసాయన అవశేషాలు తగ్గుతాయి.
ఉత్పత్తులకు మార్కెట్లో అధిక ధర లభిస్తుంది.
జీవామృతం – ఉద్యాన పంటలకు జీవశక్తి జీవామృతం సహజ వ్యవసాయంలో అత్యంత ముఖ్యమైన సేంద్రియ ద్రవ ఎరువు. ఇది కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులను కలిగి ఉండి నేల జీవక్రియలను ఉత్తేజపరుస్తుంది. తయారీకి కావలసిన పదార్థాలు
దేశీయ ఆవు పేడ – 10 కిలోలు
ఆవు మూత్రం – 10 లీటర్లు
బెల్లం – 2 కిలోలు
శనగపిండి – 2 కిలోలు
పొలం మట్టి – 1 కిలో
నీరు – 200 లీటర్లు
ఉద్యాన పంటలలో ప్రయోజనాలు
టమోటా, వంకాయ, మిరప, బెండ వంటి కూరగాయలలో వేగవంతమైన పెరుగుదల.
మామిడి, జామ, బత్తాయి వంటి పండ్ల తోటలలో వేర్ల అభివృద్ధి.
పుష్ప పంటలలో అధిక పుష్పోత్పత్తి.
నేలలో పోషకాల లభ్యత పెరుగుదల.
పంచగవ్య – సహజ వృద్ధి ప్రేరకం
పంచగవ్యలో మొక్కల పెరుగుదలకు అవసరమైన అనేక జీవక్రియాత్మక పదార్థాలు ఉంటాయి. ఉద్యాన పంటలపై ప్రభావం పుష్పించే శాతం పెరుగుతుంది.
పండ్ల పరిమాణం మరియు బరువు మెరుగుపడుతుంది.
పూల రంగు మరియు నాణ్యత పెరుగుతుంది.
కోత అనంతర నిల్వ సామర్థ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా మల్లె, చామంతి, గులాబీ వంటి పుష్ప పంటలలో పంచగవ్య వినియోగం మంచి ఫలితాలను ఇస్తుంది.
వర్మికంపోస్ట్ – సేంద్రియ పోషకాల నిల్వ
వర్మికంపోస్ట్‌ను “బ్లాక్ గోల్డ్” అని కూడా పిలుస్తారు. ఇది మొక్కలకు అవసరమైన స్థూల మరియు సూక్ష్మ పోషకాలను సమృద్ధిగా అందిస్తుంది. ఉద్యాన పంటలలో ప్రయోజనాలు
కూరగాయలలో అధిక దిగుబడి.
పండ్ల తోటలలో నేల ఆరోగ్యం మెరుగుదల.
పూల పంటలలో నాణ్యమైన పుష్పోత్పత్తి.
మొక్కల వేర్ల అభివృద్ధి.
వర్మివాష్
వర్మివాష్‌లో వృద్ధి హార్మోన్లు, ఎంజైములు మరియు సూక్ష్మపోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వినియోగం 5–10 శాతం ద్రావణంగా ఆకులపై పిచికారీ.
నర్సరీ మొక్కల పెరుగుదలలో వినియోగం.
ఆకుల పచ్చదనం మరియు కిరణజన్య సంయోగక్రియ పెరుగుదల.
బీజామృతం ఉద్యాన పంటల విత్తనాలు మరియు నారు శుద్ధి కోసం బీజామృతం ఉపయోగిస్తారు. ప్రయోజనాలు
విత్తన వ్యాధుల నివారణ.
మొలక శాతం పెరుగుదల.
వేప ఆధారిత సేంద్రియ కీటకనాశకాలు ఉద్యాన పంటలలో వేపగింజల సారం (NSKE) విస్తృతంగా ఉపయోగించబడుతోంది. ప్రయోజనాలు
తెల్లదోమ, పేను, తామర పురుగుల నియంత్రణ.
పర్యావరణానికి హాని లేకపోవడం.
ప్రయోజనకర కీటకాలకు రక్షణ.
అగ్నాస్త్రం అగ్నాస్త్రం అనేది ప్రకృతి వ్యవసాయంలో వివిధ రకాల పురుగులను (ఆకుముడుచు పురుగు, కాండం తొలిచే పురుగు, మొదలైనవి) నివారించడానికి ఉపయోగించే ఒక అద్భుతమైన జీవ కీటకనాశిని. పదార్థాలు: • నాటు ఆవు మూత్రం: 10 – 15 లీటర్లు • వేపాకు పేస్ట్: 5 కిలోలు • పచ్చిమిర్చి పేస్ట్: 500 గ్రాములు • వెల్లుల్లి పేస్ట్: 250 – 500 గ్రాములు • పొగాకు: 500 గ్రాములు లేదా 1 కిలో
తయారీ విధానం:
ఒక మట్టి కుండలో ఆవు మూత్రం పోసి, పైన పేర్కొన్న పదార్థాలన్నింటినీ కలపాలి.
ఈ మిశ్రమాన్ని 5 సార్లు బాగా మరిగించాలి (ఉడకబెట్టాలి).
తర్వాత దీనిని 24 నుండి 48 గంటల పాటు పులియబెట్టాలి (ఫెర్మెంట్ చేయాలి).
చివరిగా, ఈ ద్రావణాన్ని పలుచని గుడ్డతో వడకట్టుకోవాలి.
ఉపయోగించేపద్ధతి: ఒక లీటరు అగ్నాస్త్రం ద్రావణానికి 15 నుండి 20 లీటర్ల నీటిని కలిపి పంటలపై పిచికారీ చేసుకోవాలి.
బ్రహ్మాస్త్రం. వ్యవసాయంలో పురుగులను నివారించడానికి ఉపయోగించే సేంద్రియ పురుగుమందు ‘బ్రహ్మాస్త్రం’. కావలసిన పదార్థాలు: • ఆవు మూత్రం: 20 లీటర్లు • ఆకులు (పేస్ట్): 2 కేజీలు (వేప, కానుగ, సీతాఫలం, బొప్పాయి, మరియు దానిమ్మ లేదా జామ ఆకులు)
తయారీ విధానం:
ఒక పెద్ద ప్లాస్టిక్ లేదా మట్టి పాత్రలో 20 లీటర్ల ఆవు మూత్రాన్ని తీసుకోవాలి.
పైన పేర్కొన్న ఆకులను మెత్తగా దంచి లేదా గ్రైండ్ చేసి ఈ మూత్రంలో కలపాలి.
పాత్రను మూతతో గట్టిగా కప్పి, 24 నుండి 48 గంటల పాటు పులియనివ్వాలి.
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఈ మిశ్రమాన్ని కర్రతో తిప్పాలి.
48 గంటల తర్వాత ఈ మిశ్రమాన్ని పలుచని గుడ్డతో వడకట్టుకోవాలి.
ఉపయోగించేపద్ధతి: 1 లీటర్ బ్రహ్మాస్త్ర ద్రావణానికి 10 లీటర్ల నీటిని కలిపి (1:10 నిష్పత్తిలో) పంటలపై పిచికారీ చేయాలి. • ఇది లార్వాలు, గొంగళి పురుగులు మరియు రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారిస్తుంది. దీనిని 6 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు
ఫిష్ అమైనో ఆసిడ్ : అనేది మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడే ఒక అద్భుతమైన సేంద్రీయ ద్రవ ఎరువు. దీనిని “మీనామృతం” అని కూడా పిలుస్తారు. ఇందులో నత్రజని (Nitrogen) మరియు అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.
కావలసిన పదార్థాలు • చేపల వ్యర్థాలు : 1 కిలో (చేప తలలు, తోకలు, పేగులు) • నల్ల బెల్లం : 1 కిలో (సమాన పద్ధతిలో 1:1 నిష్పత్తి) • ప్లాస్టిక్ డబ్బా: గాలి చొరబడని మూత ఉన్నది
తయారీ విధానం
చేపలను కోయడం: చేపల వ్యర్థాలను చిన్న ముక్కలుగా కట్ చేసి ప్లాస్టిక్ డబ్బాలో వేయండి.
బెల్లం కలపడం: బెల్లాన్ని పొడి చేసి, చేప ముక్కలతో బాగా కలపండి.
మూత పెట్టడం: డబ్బా మూతను గాలి చొరబడకుండా గట్టిగా పెట్టండి.
నిల్వ ఉంచడం: దీనిని 30 నుండి 40 రోజుల పాటు నీడలో ఉంచాలి.
గ్యాస్ తీయడం: మొదటి 10 రోజులు రోజూ ఉదయం ఒకసారి మూత కొద్దిగా తీసి గ్యాస్ బయటకు పోయాక మళ్ళీ గట్టిగా పెట్టండి.
వడకట్టడం: 40 రోజుల తర్వాత ముదురు గోధుమ రంగు ద్రవం తయారవుతుంది. దీనిని వడకట్టి గాజు లేదా ప్లాస్టిక్ సీసాలో నిల్వ చేసుకోండి.
ఉపయోగించేపద్ధతి: స్ప్రే చేయడానికి: 1 లీటరు నీటికి 2 నుండి 3 ml ద్రావణం కలిపి మొక్కల ఆకులపై పిచికారీ చేయాలి. • మొదళ్లలో పోయడానికి: 1 లీటరు నీటికి 5 ml కలిపి మొక్కల వేర్ల దగ్గర పోయవచ్చు. • సమయం: ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే వాడాలి.
ఉపయోగాలు • మొక్కలు త్వరగా పెరగడానికి సహాయపడుతుంది. • ఆకులు పచ్చగా, బలంగా మారుతాయి. • పూత మరియు కాపు ఎక్కువగా వస్తుంది. • నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది.
మొక్కలు మరియు ఇంటి వ్యర్థాల నుండి సేంద్రీయ ఎరువు (Compost) తయారు చేయడం ద్వారా భూమి సారాన్ని అద్భుతంగా పెంచవచ్చు. ఇది మొక్కలకు కావలసిన అన్ని రకాల పోషకాలను అందిస్తుంది.
కావలసిన పదార్థాలు • పచ్చి వ్యర్థాలు ( నత్రజని): 1 వంతు (పచ్చి ఆకులు, కూరగాయల తొక్కలు, పండ్ల వ్యర్థాలు, పశువుల పేడ). • ఎండిన వ్యర్థాలు (కర్బనం): 2 నుండి 3 వంతులు (ఎండుటాకులు, వరి గడ్డి, పొట్టు, చెక్క పొట్టు, కట్ చేసిన పత్తి లేదా కంది కట్టెలు). • త్వరగా కుళ్ళడానికి (Microbes): పశువుల పేడ నీళ్ళు (Cow dung slurry) లేదా పాత కంపోస్ట్ ఎరువు. గుంత లేదా కుప్ప పద్ధతి
స్థలాన్ని ఎంచుకోవడం: తోటలో నీడగా ఉండే, నీరు నిలవని ఎత్తైన ప్రదేశాన్ని ఎంచుకోండి.
మొదటి పొర (Base Layer): నేలపై 6 అంగుళాల మందంతో ఎండుటాకులు, చిన్న కొమ్మలు లేదా వరి గడ్డిని పరవండి. ఇది గాలి ప్రసరణకు సహాయపడుతుంది.
రెండవ పొర (Green Layer): దీనిపై 6 అంగుళాల పచ్చి వ్యర్థాలు లేదా కూరగాయల తొక్కలను వేయండి.
పేడ నీళ్ళు చల్లడం: దీనిపై పేడ నీళ్ళను చల్లి, కొద్దిగా పాత మట్టిని చల్లండి. ఇది కుళ్ళింపజేసే సూక్ష్మజీవులను పెంచుతుంది.
పొరలు పునరావృతం చేయడం: డబ్బా లేదా కుప్ప 3 నుండి 4 అడుగుల ఎత్తు వచ్చే వరకు ఎండు వ్యర్థాలు, పచ్చి వ్యర్థాల పొరలను ఒకదానిపై ఒకటి మార్చి మార్చి వేయండి. • తేమ శాతం: కుప్పపై అప్పుడప్పుడు నీరు చల్లాలి. పిండిన స్పాంజ్ లాగా తేమ ఉండాలి, కానీ నీరు కారకూడదు. • కలపడం : ప్రతి 15 నుండి 20 రోజులకు ఒకసారి కుప్పను పారతో బాగా పైకి, కిందకి కలపాలి. దీనివల్ల వ్యర్థాలకు గాలి (ఆక్సిజన్) అంది త్వరగా కుళ్ళుతాయి. • వేడి: కుళ్ళే ప్రక్రియలో కుప్ప మధ్యలో వేడి పుడుతుంది. ఇది కలుపు మొక్కల విత్తనాలను, హానికరమైన బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది.
ఎరువు తయారీ సమయం వాతావరణాన్ని బట్టి 2 నుండి 4 నెలల్లో నల్లటి, పొడి పొడిగా ఉండే వాసన లేని సేంద్రీయ ఎరువు తయారవుతుంది. దీనిని పంటలకు వాడుకోవచ్చు. ఉద్యాన పంటలలో సేంద్రియ ఉత్పత్తుల పాత్ర
సేంద్రియ ఉత్పత్తులు కేవలం పోషకాలను అందించడమే కాకుండా మొత్తం పంట వ్యవస్థను బలోపేతం చేస్తాయి. కూరగాయలలో నాణ్యత పెరగడం, పండ్లలో తీపి మరియు రుచి మెరుగుపడడం, పుష్ప పంటలలో ఎక్కువకాలం తాజాగా ఉండడం వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ప్రస్తుతం సేంద్రియ కూరగాయలు మరియు సేంద్రియ పండ్లు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉంది. అందువల్ల ఉద్యాన రైతులు సేంద్రియ ఉత్పత్తుల వినియోగం ద్వారా అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది.
ముగింపు ఉద్యాన పంటల స్థిరమైన అభివృద్ధికి సేంద్రియ ఉత్పత్తులు కీలకమైనవి. జీవామృతం, పంచగవ్య, వర్మికంపోస్ట్, వర్మివాష్ మరియు వేప ఆధారిత సేంద్రియ కీటకనాశకాలు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచి, నాణ్యమైన దిగుబడులను అందిస్తాయి. పెరుగుతున్న సేంద్రియ ఉత్పత్తుల మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఉద్యాన రైతులు సేంద్రియ పద్ధతులను విస్తృతంగా అవలంబించడం అవసరం. సేంద్రియ ఉద్యానవనం రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు వినియోగదారులకు సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే మార్గంగా నిలుస్తుంది.
డాక్టర్.టి .తేజస్విని , డాక్టర్ . టీ .థామ్సన్ , డాక్టర్. ఎం.జి.బాల హుస్సేని డాక్టర్ . వైస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, వెంకటరామన్నగూడెం. Ph: 9494963291
సాధారణ నామం : కొండపిండి/పిండికూర శాస్త్రీయ నామం : ఏర్వ లానాట కుటుంబం: అమరాంథేసి
పిండి దొండ కొయ్యలాంటి కాండం కలిగి భూమిపై ప్రాకే మొక్క లేదా మెత్తగా వుండే బహువార్షిక మొక్క. కొన్నిసార్లు మొక్క మొదటి సంవత్సరంలోనే పూతకు వస్తుంది. పిండిదొండ సాధారణంగా భారతదేశంలో అన్ని చదరపు ప్రాంతాలలో పెరిగే కలుపు మొక్క. దీనివేరు కర్పూరం వంటి వాసన కలిగి ఉంటుంది. దీని ఎండిన పూలను బ్యూకల్లాన్, బూర్‌పేర్లతో అమ్ముతారు. దశపుష్పాలు అనే పవిత్ర పూలలో ఇది ఒకటి. ఇది కొమ్మలు, కొయ్యలాంటి వేరు వ్యవస్థ కలిగిన వార్షిక మొక్క. కాండాలు ఎక్కువగా పక్కకు ప్రాకుతూ దూరంగా విస్తరిస్తాయి. కొన్నిసార్లు 6 అ. పొడవు వరకు విస్తరిస్తాయి. కాడలు లేని ఆకులు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడతాయి. అవి కోడిగుడ్డు ఆకారంలో 0.5 అం. నుండి 1.5 అం. పొడవుంటాయి. ఆకు ఆండానికి అతికి వుండేచోట నుండి రెండు లేదా మూడు పూలతో చిన్న గుత్తులు ఏర్పడతాయి. పూలు 0.1 అం. పొడవుతో పింక్, ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ రంగులలో ఉంటాయి.
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
వేర్లతో సహా మొక్క అన్ని భాగాలు వివిధ ఉపయోగాలు కలిగి ఉన్నాయి., ఇది మనుషులకు, పశువులకు ఆహారంగా ఉపయోగపడుతుంది.
మొక్క ఆకులు సూప్ తయారీలో లేదా ఆకుకూరగా ఉపయోగపడుతుంది. ఈ మొక్క పశువులు, కోళ్ళకు మేతగా పనికి వస్తుంది. ఈ మొక్క యాంటి మైక్రోబియల్ లక్షణాలు కలిగి చర్మవ్యాధుల కారకాల నుండి రక్షిస్తుంది., మూత్ర వర్థకంగా పనిచేస్తుంది.
నొప్పి, వాపు తగ్గించడానికి సహాయపడుతుంది. కడుపులోని పరాన్నజీవి నులి పురుగులను నివారిస్తుంది.
మొలల నుండి రక్తం స్రవించడాన్ని అరికడుతుంది. మూత్ర పిండాలు, గాల్‌బ్లాడర్‌లోని రాళ్ళను తొలగిస్తుంది. ఈ మొక్క ఒక ఔషధ టానిక్‌లా ఉపయోగపడుతుంది. జ్ఞానశక్తిని పెంచుతుంది. తలనొప్పి, కడుపునొప్పి, జీర్ణ సమస్యల చికిత్సకుపయోగిస్తారు. మెడ, వెన్నునొప్పులు, జ్వరం, మూత్ర సమస్యలను సమర్ధవంతంగా నివారిస్తుంది.
హెపటైటిస్, లివర్ వాపులను సమర్ధవంతంగా నివారిస్తుంది. అనీమియా, ఆల్ౙిమర్, ఆర్థ్రెåటిస్, కొలెస్టరాల్, ఊపిరితిత్తుల సమస్యలు, రక్తప్రసరణ వంటి ఆరోగ్య సమస్యల చికిత్సలో ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో …
పిండి దొండ ఆకుల బెంజీన్ ద్రావణం ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్ శిలీంద్ర పెరుగుదలను గరిష్టంగా అరికట్టింది. పూల బెంజీన్ ద్రావణం ట్రైకోస్పరా అసాహిపై యాంటిఫంగల్ చర్యను ప్రదర్శించింది. వేరు అసిటోన్ ద్రావణం కాండిడా పారాప్సిలాసిస్, ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ట్రైకోస్పరా అసాహి, మ్యూకార్ ఇండికస్‌పై ఆకులు, పూల ద్రావణాల కన్నా అధిక యాంటి ఫంగల్ చర్యలను ప్రదర్శించింది (విద్య అండ్ ఉదయకుమార్, 2017).
పిండిదొండ, అకలైఫా ఇండికా, ఫిల్లాంతస్ అమర ఆకుల మిథనాల్ ద్రావణాలు పంటలలో బాక్టీరియా తెగుళ్ళు కల్గించే క్ఖా0తోమోనాస్ కాంపెస్ట్రిస్, మానవులలో వ్యాధులు కలిగించే యూరోనోమస్ హైడ్రోపిలా బాక్టీరియాల పెరుగుదలను సమర్ధవంతంగా అరికట్టాయి (బ్రిట్టో, అతని అనుచరులు, 2011).
పిండిదొండ వేరు ద్రావణం శనగ పంటనాశించే రూట్‌నాట్ నెమటోడ్, మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిటాపై నెమటిసైడల్ చర్యను ప్రదర్శించింది (మురుగేశ్వరి, ఆమె అనుచరులు, 2016).
పిండిదొండ ద్రావణం చెరకు పంటలో నారు మొక్కల మాడుతెగులు, విత్తన మొలక శాతం తగ్గించే కర్వులేరియాల్యునేటని సమర్ధవంతంగా నివారించింది (నందిని అండ్ అంజనా, 2015).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు 9676797777కు సంప్రదించండి
1.5 లీటర్లు మంచి నీరు ముందుగా మూడు రకాల ఆకులను మెత్తటి గంధంలా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెరుగులో కలపాలి. దీనికి నీరును చేర్చాలి. దీనిని ఒక కుండలో పోసి మూతికి గుడ్డ కట్టాలి. కుండలోని మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తిర్లమర్ల కలపాలి (కుడి నుంచి ఎడమకు ఎడమ నుంచి కుడికి). పదిహేను, ఇరవై రోజుల తరువాత సేంద్రియ జీవ రసాయనం తయారవుతుంది. తయారైన జీవ రసాయనాన్ని 20 లీటర్ల నీటిలో కలిపి పొలం మీద పిచికారి చేయాలి. ఇది ఒక ఎకరా పొలానికి సరిపోతుంది. పిచికారీని ఆకుల మీదే చేయాలి. తెల్లవారుజామున లేదా సాయంత్రం పొద్దు గూంకే వేళలో పిచికారి చేస్తే సత్ఫలితాలు సాధించవచ్చు. ఇది వివిధ రకాల కీటకాలనాశినిగానే కాక మొక్కలకు పోషకాలను అందించి పెరుగుదలకు దోహదపడుతుంది. ఇది సాగు ఖర్చును తగ్గించడమే కాకుండా రసాయనాల వలన వాతావరణం, నేల విషపూరితం కాకుండా కాపాడుతుంది.
ఎన్. గోపాల్‌క్రిష్ణన్ అనే అభ్యుదయ రైతు గుడ్లు, నిమ్మకాయలతో మొక్కల పెరుగుదలకు హార్మోన్ తయారు చేశారు. తమిళనాడులో అనేక మంది దీనిని ఉపయోగించి లాభాలు పొందుతున్నారు. ఆయన దీని తయారీ విధానం గురించి రైతులకు శిక్షణ ఇస్తున్నారు.
కావల్సిన వస్తువులు – తయారీ విధానం
20-25 నిమ్మకాయలు
250 గ్రాముల బెల్లం
10-15 కోడి లేక బాతు గుడ్లు ఒక బకెట్లో నిమ్మకాయల రసాన్ని తీయాలి. దీనిలో బెల్లాన్ని కరగబెట్టాలి. ఈ రసంలో గుడ్లు మునిగేటట్లు ఉంచి గాలి చొరబడకుండా బకెట్‌కు మూత పెట్టి నీడలో పది రోజుల పాటు ఉంచాలి. గుడ్లు పెంకుతో సహా రసంలో కరిగి రబ్బరు బంతుల్లా తయారవుతాయి. పది రోజుల తరువాత రబ్బరు బంతుల్లా మారిన గుడ్లను చేతులతో నలిపి దాన్ని బాగా కలియబెట్టాలి. తరువాత దీనికి అంతే మొత్తంలో మరోసారి బెల్లం రసాన్ని కలపాలి. ఉదాహరణకు బకెట్లో రెండు లీటర్ల రసం ఉందంటే దానికి మరో రెండు లీటర్ల బెల్లం రసాన్ని కలపాలి. తిరిగి బకెట్‌కు గట్టిగా మూత పెట్టి మరో పది రోజులు ఉంచాలి. పది రోజుల తరువాత దీన్ని పంటల మీద ఉపయోగించవచ్చు. 10Ð15 మి.లీ. రసాన్ని ఒక లీటర్ నీటిలో కలిపి పంటల మీద స్ప్రే చేయాలి.
ఏ పంటలకు ఉపయోగపడుతుంది? ఈ సేంద్రియ హార్మోన్‌ను వరి, గోధుమ, అరటి, కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు అన్నింటి మీద స్ప్రే చేయవచ్చు. పిచికారి వేళలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఉదయం, సాయంత్రం పొద్దు మునిగే ముందు పిచికారి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. దీనికి పంచగవ్య, వర్మివాష్‌లను కూడా కలిపి వాడవవచ్చు. ద్రావణం తయారు చేసేటప్పుడు మూతకు చిన్న చిన్న రంధ్రాలు పెడితే మంచిది. దీనిని ఆరు మాసాల వరకు నిలువ చేసుకోవచ్చు.
ఆదికాలంలోనే భారతీయ వ్యవసాయ శా¢స్తం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ప్రసిద్ధ ప్రాచీన వ్యవసాయ శా¢స్తవేత్తలు ప్రాచీన రుషులు, పరాశరుడు, సురపాలుడు తదితరులు అతద్భుతమైన పరిశోధనలు జరిపి గ్రంథస్థం చేశారు. సురపాల మహర్షి రాసిన వృక్షాయుర్వేదంలో కునపజలం అనే ద్రావణ ఎరువుని ప్రస్తావించారు. సంస్కృతంలో కునప అంటే మృత కళేబరం. జలం అంటే నీరు. అంటే శవం కంపుకొట్టే నీరని అర్థం. ఇది మొక్కలకు పోషక ద్రావణంగానూ ఉపయోగపడుతుంది. దీన్ని చేపల వ్యర్థాలతోనూ, కోడిమాంసం వ్యర్థాలతోనూ, పంది, జింక, ఇతర అడవి జంతువుల మాంసంతోనూ తయారుచేసేవారు. అడవులు అంతరించి జంతువులు కనుమరుగవుతున్న కాలంలోనే ప్రస్తుతం చేపల వ్యర్థాలు, కోడి మాంసం వ్యర్థాలతోనూ తయారు చేసుకోవచ్చు. కోడి మాంసపు వ్యర్థాలతో చేసేదాన్ని కుక్కుట కునప అంటారు.
ఆవు పేడ, పంచితం, పాలు, పెరుగు, నెయ్యి తదితరాలతో తయారుచేసే ‘కునపజలం’ పంటలు ఏపుగా పెరగడానికి.. పురుగులు, తెగుళ్ల ఉధృతిని అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. అయితే, మాంసం, వరిపొట్టు కూడా కలిపి కునపజలం తయారుచేస్తే, మరింత శక్తివంతంగా పనిచేస్తుందంటున్నారు సికింద్రాబాద్‌కు చెందిన విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త (ప్లాంట్ పాథాలజిస్ట్) ఇక్రిశాట్ మాజీ డిప్యూటీ డైరెక్టర్ అయిన డా॥ వై.ఎల్.నెనె. ఒక్క మాటలో చెప్పాలంటే సాధారణ కునపజలం కన్నా ఈ కునపజలం అత్యంత శక్తివంతంగా పనిచేస్తుందని డా॥ నెనె అంటున్నారు.
తయారీకి కావాల్సిన పదార్థాలు: ఆవు పేడ 5 కిలోలు, పంచితం 4 లీటర్లు, పాలు 3 లీటర్లు, పెరుగు 2 లీటర్లు, నెయ్యి కిలో, మాంసం (గొడ్డు మాంసం తప్ప ఏదైనా) 3 కిలోలు, వరిపొట్టు 2 కిలోలు, చెరకు రసం 3 లీటర్లు లేదా నల్లబెల్లం కిలో, లేత కొబ్బరినీరు 2 లీటర్లు, బాగా మగ్గిన అరటిపండ్లు 12, కల్లు 3 లీటర్లు.
తయారుచేసే పద్ధతి: మాంసాన్ని, వరిపొట్టును ఉడకబెట్టిన తర్వాత మాత్రమే కునపజలం తయారీలో వాడాలి. మాంసంలో అధిక పోషకాలుంటాయి. వరిపొట్టులో సిలికా ఉంటుంది. పురుగులు, తెగుళ్లను తట్టుకునే శక్తిని సిలికా పెంపొందిస్తుంది. ఉడకబెట్టిన మాంసం, వరిపొట్టుతో పాటు పేడ, పంచితాలను వెడల్పాటి మూతిగల మట్టి లేదా ప్లాస్టిక్ తొట్టి లేదా డ్రమ్ములో కలిపి, పాత్రపై పలుచని వస్త్రాన్ని కప్పి, నీడగా ఉండే ప్రాంతంలో రెండు వారాలు పులియనివ్వాలి. ప్రతి ఉదయం, సాయంత్రం సవ్యదిశలో కొద్దిసేపు కర్రతో కలపాలి. 2 వారాల తర్వాత మిగతా వాటిని కూడా కలిపి మరో వారం రోజులు పులియబెట్టాలి. ఆ తర్వాత వడకట్టి వాడుకోవచ్చు. ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది.
ఉపయోగించే విధానం: ఎకరానికి 100-150 లీటర్ల నీటిలో 3 లీటర్ల కునపజలాన్ని కలిపి 20 రోజుల వ్యవధిలో 3 నుంచి 4సార్లు పంటలపై పిచికారీ చేయాలి. ఈ మధ్యలో వర్షం కురిస్తే 1 లేదా 2 సార్లు అదనంగా పిచికారీ చేయాలి.
ఉపయోగాలు: ముఖ్యంగా పత్తి, మిరప, వరి, కూరగాయలు, పండ్ల తోటలపై బాగా పనిచేస్తుంది. దీనివల్ల పంట గింజల బరువు పెరుగుతుంది. పురుగులు, తెగుళ్లు పంటలను ఆశించవు. పంట ఏపుగా పెరుగుతుంది. పండ్ల నాణ్యత పెరిగి సహజసిద్ధమైన రంగు, రుచి, వాసన వస్తుంది. కూరగాయ పంటల నాణ్యత పెరిగి మంచి మెరుపు వస్తుంది.
దిగుబడిని పెంచే కునపజలం కావలసిన పదార్థాలు : మాంసం-1 కిలో; మినప పప్పుపొడి -1/4 కి.; నువ్వులు- 1/4 కి.; నల్లబెల్లం- 1/4 కి.; ఆవుపాలు – 1 లీటరు; ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె – 50 గ్రాములు; మంచి నీరు – 5 లీటర్లు
తయారు చేసే విధానం : మాంసాన్ని నీటిలో వేసి సన్నని మంటపై సగం కషాయం అయ్యే వరకు ఉడికించాలి. 2 గంటలు చల్లార్చి పలుచని గుడ్డతో వడపోయాలి. సన్నని మంటపై మళ్ళీ మరగించాలి. పొంగువచ్చిన తర్వాత మినపపిండి, దంచిన నువ్వులు, బెల్లం వేసి కలియబెడుతూ ఉండాలి. పొంగు వచ్చిన వెంటనే పాత్రను దించి, చల్లార్చి, మట్టికుండలో పోయాలి. అందులో ఆవుపాలు పోసి, కుండపైన మూకుడు పెట్టి గట్టి గుడ్డతో వాసిన కట్టి పెంట పోగు కింద లేక మట్టి గుంతలో పాతి పెట్టాలి. 11వ రోజు బయటకు తీసి కషాయాన్ని వడపోయాలి. ఈ కషాయాన్ని వేరొక కుండలో పోసి దానికి నెయ్యి లేక నూనె కలిపి పాత్రపై మూకుడు పెట్టి ఒక ప్లాస్టిక్ కాగితంలో ఉంచి గట్టిగా తాడుతో కట్టి 10 రోజులు చీకటి గదిలో ఉంచాలి. 11వ రోజు నుంచి ఈ కషాయాన్ని ఉపయోగించవచ్చు. 3 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి ఏ పంటపైనన్నా పిచికారి చేయవచ్చు. పంటకాలంలో రెండుసార్లు పిచికారి చేయవచ్చు. ఇది ప్రభావశీల ఔషధం. పంట దిగుబడి 20% పెరుగుతుంది.
ఆయిల్‌పామ్ పంటలో ఆశించిన స్థాయిలో నాణ్యమైన గెలలు మరియు అధిక దిగుబడి సాధించాలంటే సరైన పోషకాలు, నీటి యాజమాన్యంతో పాటు ఆకుల యాజమాన్యం (Frond Management) అత్యంత కీలకమైనది. తోటలోని చెట్లకు ఉండే ఆకుల సంఖ్య, వాటిని కత్తిరించే విధానం మరియు కత్తిరించిన ఆకులను సర్దే పద్ధతులపైనే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ఆయిల్‌పామ్ రైతులకు ఉపయోగపడే పూర్తి స్థాయి ఆకుల యాజమాన్య పద్ధతులు మరియు అనుసరించే విధానం
చెట్టుకు ఉండవలసిన ఆకుల సంఖ్య (Optimum Leaf Count) ఆయిల్‌పామ్ చెట్టు సూర్యరశ్మిని గ్రహించి పిండిపదార్థాలను తయారుచేసుకోవడానికి ఆకులు ఎంతో అవసరం. అవసరానికి మించి ఆకులను కత్తిరించడం (Over-pruning) వల్ల దిగుబడి క్రమంగా తగ్గుతుంది. • చిన్న వయసు తోటలు (1-3 సంవత్సరాలు): చెట్టుకు ఉన్న అన్ని పచ్చని ఆకులను అలాగే ఉంచాలి. కేవలం ఎండిపోయిన ఆకులను మాత్రమే తీసివేయాలి. • దిగుబడినిచ్చే తోటలు (4-10 సంవత్సరాలు): ప్రతి చెట్టుకు కనీసం 40 నుండి 48 పచ్చని ఆకులు ఉండేలా చూసుకోవాలి. అంటే గెల కింద కనీసం రెండు వరసల ఆకులు ఉంచాలి. • పెద్ద వయసు తోటలు (10 సంవత్సరాలు పైబడినవి): ప్రతి చెట్టుకు కనీసం 32 నుండి 40 ఆకులు ఉండాలి. గెల కింద ఒక వరస ఆకును తప్పనిసరిగా ఉంచాలి.
ఆకులను కత్తిరించే సరైన పద్ధతి (Pruning Technique) ఆయిల్‌పామ్ తోటల్లో ఆకుల యాజమాన్యానికి సంబంధించి అంతర్జాతీయంగా మరియు శాస్త్రవేత్తలచే సిఫార్సు చేయబడిన ఒక అద్భుతమైన సూత్రం “9-3 క్లాక్ రూల్” (9-3 Clock Rule). సాధారణంగా రైతులు ఏ ఆకులను ఉంచాలి, వేటిని కత్తిరించాలి అనే విషయంలో గందరగోళానికి గురవుతుంటారు. ఈ క్లాక్ రూల్ (గడియార నియమం) ద్వారా ఆకుల కత్తిరింపు చాలా సులువుగా నిర్వహించవచ్చు.
గడియార నియమం (9-3 Clock Rule) అంటే ఏమిటి? మనం గడియారాన్ని చూసినప్పుడు 9 గంటల ముల్లు ఎడమవైపు సమాంతరంగా, 3 గంటల ముల్లు కుడివైపు సమాంతరంగా ఉంటాయి. ఆయిల్‌పామ్ చెట్టును కూడా ఒక పెద్ద గడియారంగా ఊహించుకుంటే, చెట్టు మధ్య భాగం నుండి సమాంతరంగా ఇరువైపులా విస్తరించి ఉండే ఆకులను ఈ సమయాలతో పోలుస్తారు. • నియమం యొక్క ముఖ్య ఉద్దేశం: చెట్టు కాండం నుండి భూమికి సమాంతరంగా (Horizontal) ఇరువైపులా ఉండే ఆకుల కంటే క్రింది భాగంలో ఉన్న ఆకులను మాత్రమే కత్తిరించాలి. • 9 మరియు 3 గంటల స్థానం: గడియారంలో 9 నుండి 3 గంటల రేఖకు పైభాగంలో ఉండే ఆకులను ఎట్టిపరిస్థితుల్లోనూ కత్తిరించకూడదు.
ఈ నియమాన్ని ఎలా పాటించాలి?
సమాంతర రేఖను గుర్తించడం: చెట్టు వద్ద నిలబడి, కంటిచూపు మేర సమాంతరంగా (horizontal) ఉండే ఆకులను (9 మరియు 3 గంటల స్థానాలు) గుర్తించండి.
గెలల కింద ఆకులు: సాధారణంగా ఆయిల్‌పామ్ చెట్టులో గెలలు ఈ సమాంతర రేఖకు పైభాగంలో లేదా రేఖకు సరిగ్గా ఆనుకుని ఉంటాయి.
కత్తిరింపు పరిమితి: కేవలం 9 గంటల మార్కు మరియు 3 గంటల మార్కు కంటే క్రిందికి వేలాడుతున్న, లేదా ఎండిపోయిన ఆకులను మాత్రమే నరకాలి.
రెండు వరుసల సూత్రం: గెల బరువును మోయడానికి మరియు దానికి సరైన పోషకాలు అందడానికి, గెల ఉన్న మట్ట కింద కనీసం 1 నుండి 2 వరుసల పచ్చని ఆకులు (సమాంతర రేఖ పరిధిలో ఉన్నవి) ఖచ్చితంగా మిగిలి ఉండాలి.
9-3 క్లాక్ రూల్ పాటించడం వల్ల కలిగే లాభాలు • అధిక దిగుబడి (High Yield): చెట్టుకు కావలసినన్ని పచ్చని ఆకులు (సుమారు 40-48) లభించడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ బాగా జరిగి, గెలలు పెద్ద పరిమాణంలో ఊరుతాయి. • ఆడ పూల సంఖ్య పెరుగుదల: అవసరానికి మించి ఆకులు కత్తిరిస్తే (Over-pruning) చెట్టు ఒత్తిడికి లోనై మగ పూలు ఎక్కువగా వస్తాయి. ఈ రూల్ పాటించడం వల్ల ఆడ పూల సంఖ్య పెరిగి దిగుబడి స్థిరంగా ఉంటుంది. • గెలల రక్షణ: గెలల కింద ఉండే ఆకులు గెలలకు ఒక సపోర్టులా పనిచేస్తాయి. గెలలు కిందపడిపోకుండా లేదా కాండం నుండి విడిపోకుండా ఇవి కాపాడతాయి. • సులువైన కోత: ఏ ఆకులను ఉంచాలో కార్మికులకు సులభంగా అర్థమవుతుంది. దీనివల్ల తోట పని వేగంగా జరుగుతుంది.
గెలలు కోసే సమయంలో మరియు ఆకులను కత్తిరించేటప్పుడు (Pruning) కొన్ని జాగ్రత్తలు పాటించాలి: • మట్టను దగ్గరగా నరకడం: ఆకులను కత్తిరించేటప్పుడు కాండానికి వీలైనంత దగ్గరగా, నిలువుగా కాకుండా వాలుగా కత్తిరించాలి. • పంగలు మిగల్చకూడదు: కాండంపై ఎక్కువ పొడవు మట్టలను (Frond butts) వదిలేయకూడదు. అలా వదిలేస్తే, ఆ పంగలలో వర్షపు నీరు చేరి కుళ్లిపోవడం లేదా ఎలుకలు, పురుగులు ఆశ్రయం పొందడం జరుగుతుంది. • వ్యాధి సోకిన ఆకులు: పొడి తెగులు (Leaf blight) లేదా ఇతర వ్యాధులు సోకి పూర్తిగా ఎండిపోయిన ఆకులను వెంటనే తొలగించి తోట బయట పడేయాలి.
కత్తిరించిన మట్టల పునరుద్ధరణ / సర్దడం కత్తిరించిన ఆయిల్‌పామ్ మట్టలను తోటలోనే సరైన పద్ధతిలో అమర్చడం ద్వారా భూమికి ఎంతో మేలు జరుగుతుంది. దీనిని ఫ్రాండ్ స్టాకింగ్ అంటారు. • ఎల్-షేప్ (L-Shape) లేదా యూ-షేప్ (U-Shape) పద్ధతి: రెండు చెట్ల మధ్య వరుసలలో లేదా చెట్ల చుట్టూ పాదులకు ఇబ్బంది లేకుండా మట్టలను ఒక పద్ధతి ప్రకారం అమర్చాలి. • మల్చింగ్ (మట్టి తేమ సంరక్షణ): ఈ మట్టలను చెట్ల మధ్య వరుసల్లో వేయడం వల్ల సూర్యరశ్మి నేరుగా భూమిపై పడక తేమ ఆవిరి కాకుండా ఉంటుంది. • సేంద్రీయ ఎరువుగా మార్పిడి: కాలక్రమేణా ఈ ఆకులు కుళ్లిపోయి భూమికి అవసరమైన హ్యూమస్ (సేంద్రీయ కర్బనం) మరియు పొటాషియం వంటి పోషకాలను అందిస్తాయి. దీనివల్ల ఎరువుల ఖర్చు తగ్గుతుంది. • కలుపు నివారణ: మట్టలు పరిచిన చోట కలుపు మొక్కలు మొలకెత్తవు.
ముఖ్యమైన సూచనలు:
వేసవి కాలంలో ఆకులను ఎక్కువగా కత్తిరించకూడదు. ఇది చెట్టుపై ఒత్తిడిని పెంచుతుంది.
మట్టలు కత్తిరించడానికి ఉపయోగించే కత్తులు లేదా చిక్కం (Chisel/Sickle) బాగా పదునుగా ఉండాలి, తద్వారా కాండం దెబ్బతినకుండా ఉంటుంది.
మట్టలను ఎట్టిపరిస్థితుల్లోనూ తోటలో పెట్టి తగులబెట్టకూడదు. దీనివల్ల మిత్రపురుగులు చనిపోవడమే కాకుండా చెట్లకు నష్టం జరుగుతుంది.
రైతులకు గమనిక: గెలలు కోయడం సులువుగా ఉంటుందని చాలామంది రైతులు ఆకులను ఎక్కువగా కత్తిరిస్తుంటారు. ఇది చాలా తప్పు. ఆకులు తగ్గితే చెట్టు తక్కువ ఆహారాన్ని తయారుచేసుకుని, మగ పూత ఎక్కువగా వచ్చి గెలల సంఖ్య తగ్గిపోతుంది.
డా. పి. నీలిమ, డా. డి. స్రవంతి, డా. బి. దీపక్ రెడ్డి, డా. ఎన్. జమీమా, డా. ఆర్. రమేష్, డా. ఐ. కృష్ణ తేజ, డా. ఐ. వి. శ్రీనివాస రెడ్డి మరియు డా. జె. హేమంత కుమార్, వ్యవసాయ కళాశాల, అశ్వారావుపేట, భ. కొత్తగూడెం జిల్లా- 507 301