అడ్డసరం ఒక పెద్ద పొద. ఇది వ్యర్థ భూముల్లోను, రోడ్ల ప్రక్కన గుంపులు, గుంపులుగా పెరుగుతుంది. ఆకులు సామాన్యంగా, ఎదురెదురుగా ఏర్పడతాయి. తెల్లరంగులో క్యాప్సూల్ ఆకారంలో వుంటాయి.
సాధారణ నామం: వసాకా
శాస్త్రీయ నామం: అడతొడవాసికా
కుటుంబం: అకాంతేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
- అడ్డసరం ఆయుర్వేదంలో శ్వాస కోశ వ్యాధులకు మంచి మందు.
దగ్గు, ఆస్త్మా నివారణకు ఉపయోగించే ఆయుర్వేద ఔషధాలలో అడ్డసరం ఒక ముఖ్య పదార్థం. - బాక్టీరియా ఇన్ఫెక్షన్లు, గొంతు సమస్యలను నివారించడానికి అడ్డసరం సాధారణంగా, సులభంగా లభించే సురక్షిత ఔషధ మొక్క.
- అడ్డసరాన్ని దగ్గు, ఆస్త్మా, శ్వాసకోశవ్యాధులు, సాధారణ జలుబు, సైనసైటిస్, క్రానిక్ బ్రాంకైటిస్, గొంతునొప్పి, టాన్సిల్స్, అల్సర్, ఎసిడిటి, బ్లీడింగ్ డిసార్డర్స్, గౌట్, అధిక యుటెరస్ బ్లీడింగ్, యురేనియా చికిత్సలో ఉపయోగిస్తారు.
- అడ్డసరం ఆకు రసాన్ని త్రాగిస్తే ఆస్త్మా, దగ్గు, జ్వరం, కడుపునొప్పి, క్షయ, మలేరియా, బెణుకులు, అజీర్ణ వ్యాధులు నివారించబడతాయి.
వ్యవసాయరంగంలో …
- అడ్డసరం ఒక పురుగు మందు మొక్క. అడ్డసరం ఆకు ద్రావణం స్ఫోడోఫ్టెరా లిట్టోరాలిస్పై యాంటీ ఫీడెంట్ చర్య ప్రదర్శిచింది. (సాడెక్, 2003)
- అడ్డసరం అసిటోన్ మరియు మిథనాల్ క్రూడ్ ఆకు ద్రావణాలు బ్రెవికోరినె బ్రాసికె పిల్ల పురుగులు, పెద్ద పురుగులపై అదిక మరణ శాతాన్ని నమోదు చేశాయి (హైఫా – ఆలి, 2016)
- అడ్డసరం ఆల్కహాల్ ద్రావణం క్యాబేజీ సీతాకోకచిలుక, పియరిస్ బ్రాసికె, 3వ దశ లార్వాలపై అధిక యాంటి ఫీడెంట్ చర్య ప్రదర్శించింది. (బాజ్పాయ్ – చాండీల్, 2009).
- అడ్డసరం ఆకుద్రావణం ఆకులు తినే పురుగులు, రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారిస్తుంది. (రాఘవేంద్ర అతని అనుచరులు, 2016)
- అడ్డసరం ఆకు ద్రావణం తయారీకి కావలసిన పదార్థాలు: అడ్డసరం ఆకులు (1కిలో)
తయారీ విధానం: ఒక కిలో అడ్డసరం ఆకులను నూరి 10 లీటర్ల నీటిలో కలిపి 24 గంటలు కదపకుండా వుంచి ఆ తర్వాత పలుచని గుడ్డద్వారా వడపోసి పిచికారి చేయాలి.
- అడ్డసరం ఆకులలో ఉండే వాసిసిన్, వాసిసినోన్, అడతోడిన్ పురుగుల పై వికర్షక మరియు కీటకనాశక ప్రభావాలు చూపుతాయి. (ఎమిమాల్ విక్టోరియా, 2010 నాండ్రె అతని అనుచరులు, 2012)
- అడ్డసరం – కానుగ ఆకులు కషాయం
అడ్డసరం – కానుగ ఆకుల కాషాయం
తయారు చేసే విధానం
- అడ్డసరం, కానుగ ఆకులు సేకరించి శుభ్రపరుచుకోవాలి.
- ఆకుల బరువుకు 16 రెట్ల నీరు కలపాలి.
- ఆకులను సన్నగా తిరిగి ఒక కుండాలో పోసి మరగ వేయాలి.
- పాత్రలోని కషాయం సగమయ్యే వరకు సన్నని సెగమీద మరిగించి, క్రిందికి దంచి వడపోయాలి.
మొతాదు: లీటరు నీటికి 10 మీ.లీ. కషాయం చొప్పున కలిపి పంటపై పిచికారి చేయాలి.
నివారించబడే పురుగులు: తెల్లదోమ, పచ్చదోమ.

