ఏటా 6.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టిస్తాం

సంవత్సరానికి 6.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించి రానున్న ఐదేళ్ళలో 35 లక్షల ఎకరాలకు కొత్తగా నీరందిస్తామని తెలంగాణా నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమకుమార్‌ రెడ్డి వెల్లడించారు. గంధమల్ల జలాశయానికి త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని కూడా చెప్పారు. శ్రీశైలం ఎడమ కాల్వ ప్రాజెక్ట్‌ (ఎస్‌ఎల్‌బీసీ)ను మూడేళ్ళలో పూర్తి చేసి 4 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని, డిండి, శివన్నగూడెం పూర్తి చేసి నల్లగొండ జిల్లాలోని ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

Read More

రైతు అడిగిన వెంటనే … సూక్ష్మసేద్యం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రైతులు అడిగిందే తడవుగా సూక్ష్మ సేద్య పథకం మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతు తన వాటా సొమ్మును చెల్లించిన వెంటనే రైతు పొలంలో సూక్ష్మసేద్య పరికరాలను బిగించేలా కొత్త పథకాన్ని అమలు చేయనుంది. ఉద్యాన రంగాన్ని ప్రోత్సహించే క్రమంలో సూక్ష్మసేద్య పథకంపై దృష్టి పెట్టింది. అవసరమున్న ప్రతి రైతుకూ ఈ పథకాన్ని వర్తింపచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది 7 లక్షల 50 వేల ఎకరాలకు సూక్ష్మ సేద్య పరికరాలను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. సూక్ష్మసేద్య పరికరాలు సమకూర్చేందుకు 33 కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు ఇటీవల సమావేశమయ్యి ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read More

వేగంగా నిండుతున్న సాగర్‌

నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ వేగంగా నిండుతోంది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.05 టీ.ఎం.సీలు కాగా గురువారం సాయంకాలానికి 182.95 టీ.ఎం.సీలకు చేరుకుంది. ఒక్క రోజులో 20.98 టీ.ఎం.సీల నీటి నిల్వ పెరిగింది. సాగర్‌ వద్ద 3.69 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు అవుతోంది. శ్రీశైలం జలాశయానికి ఎగువనుంచి 4.64 లక్షల క్యూసెక్కులు నీరు వస్తుంది. దీంతో 10 గేట్లు తెలంగాణ, ఎ.పి. విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్ల ద్వారా 5.18 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు.

Read More

సాగునీటికి పెద్దవాటా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ రాబోయే నాలుగు నెలల కాలానికి ప్రతిపాదించారు. ఈ బడ్జెట్‌లో జల వనరుల కూటమికి పెద్దపీట వేసింది. భారీ, మధ్యతరహా, చిన్న నీటి పారుదలకు 13,308.50 కోట్లు పెట్టుబడిగా వ్యయంగా కేటాయించి నీటిపారుదలకు భారీగా నిధులు ఇచ్చింది. తాజా కేటాయింపుల్లో పోలవరం నిధులు కూడా కలిపి ఉంటాయి. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఎత్తిపోతల నీటిని మళ్లించేందుకు ఆ కాలువ పనులు ఏడాదిలోగా పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది.

Read More

సేంద్రియ, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి

తెలంగాణ రాష్ట్రంలో సేంద్రియ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, ప్రకృతి వ్యవసాయ నిపుణుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్‌ పాలేకర్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులను కోరారు. శాసనసభ ప్రాంగణంలో సీఎంను, వ్యవసాయ శాఖమంత్రిని విడివిడిగా కలిశారు. సహజ వ్యవసాయ విధానాలు, వాటిపై రైతులకు కల్పిస్తోన్న అవగాహన కార్యక్రమాల గురించి సీఎం పాలేకర్‌ని అడిగి తెలుసుకున్నారు. గో-ఆధారిత సహజ వ్యవసాయ విధానాలపై తాను రాసిన పుస్తకాన్ని పాలేకర్‌ సీయం రేవంత్‌రెడ్డికి అందజేశారు.

Read More

నాగార్జునసాగర్‌కు నీటి విడుదల

కృష్ణానది ఎగువ ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ఆల్మట్టి, తుంగభద్ర, నారాయణపూర్‌ జలాశయాలకు వరద కొనసాగుతోంది. వాటి నుంచి అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి ప్రవాహం పెరుగుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 580 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 512.40 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టి.ఎం.సి.లు కాగా ప్రస్తుతం 135.78 టిఎంసీలు నీటి నిల్వ ఉంది. వరద ప్రవాహం భారీగా వస్తుండడంతో మూడు గేట్లను ఎత్తిన కర్నూలు చీఫ్‌ ఇంజనీర్‌ కబీర్‌ భాషా ఒక్కో గేటు నుంచి 27 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశారు. 6,7,8 గేట్లను ఎత్తడం ద్వారా మొత్తం 81 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. దీంతో కృష్ణానది పరవళ్ళు తొక్కుతోంది.

Read More

24 గంటల్లో లక్షన్నర లోపు రుణమాఫీ

మూడు విడతలుగా రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండో విడతలో భాగంగా జులై 30వ తేదీనాడు లక్షన్నర రూపాయలలోపు తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేయనుంది. రేపు (మంగళవారం) మధ్యాహ్నం 12 గంటలకు 2వ విడత రుణమాఫీని తెలంగాణ సీయం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తిచేశారు. రేపు ఏర్పాటుచేసే రుణమాఫీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడతారు.

Read More

నాగార్జున సాగర్‌కి నీటి ప్రవాహం మొదలయ్యింది

కర్ణాటక పరిధిలో కృష్ణానది ఉప్పొంగుతుంది. అక్కడి ఆలమట్టి, నారాయణపూర్‌ జలాశయాలు వరద నీటితో తొణికిసలాడుతున్నాయి. శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజక్ట్‌ నుంచి 2,50,783 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 7,286 క్యూసెక్కుల వరద వస్తోంది. కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 45,236 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. శ్రీశైలం జలాశయంలో శుక్రవారం సాయంకాలానికి 109.0060 టి.ఎం.సీలుగా నీటి నిల్వ నమోదయ్యింది. నాగార్జున సాగర్‌కి నీటి ప్రవాహం మొదలయ్యింది.

Read More

ధరణిలో సవరణలకు ప్రజాభిప్రాయ సేకరణ

తెలంగాణ రాష్ట్రంలో భూసమస్యల శాశ్వత పరిష్కారానికి విస్తృతస్థాయి సంప్రదింపులు చేపట్టాలని, ప్రజల నుంచి సలహాలు, సూచనలు సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. భూములకు సంబంధించిన సమస్యలు నానాటికి ఎక్కువవుతుండడముతో సమగ్ర చట్టం రూపొందించాల్సి ఉందన్నారు. భూదాన్‌, పోరంబోకు, బంచరాయి, ఇనాం, కాందిశీకుల భూములున్న ఒక మండలాన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి అక్కడ ఎదురవుతున్న సమస్యలపై అధ్యయనం చేసి ఒక నివేదిక రూపొందించినట్లయితే ఇలాంటి సమస్యలన్నింటిపై పూర్తి స్పష్టత ఏర్పడి తుది నిర్ణయం తీసుకుంటానికి అవకాశం కుదురుతుందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Read More