ప్రకృతి సేద్యంలో మార్గదర్శిగా ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి సేద్యం ప్రపంచానికే ఆదర్శం అని రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రకృతి సేద్య కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో గుల్బెంకియన్‌ అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. పంటల బీమాకు సంబంధించి రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా మెరుగైన పథకాన్ని అమలు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు ఇబ్బంది లేకుండా మార్క్‌ఫెడ్‌ ద్వారా జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి రూ. 3,200 కోట్ల రుణాన్ని తీసుకునేందుకు హామీ ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Read More

రేపే రూ. లక్ష లోపు రుణమాఫీ

3 దఫాలుగా రుణమాఫీ చేయాలని ఈ రోజు జరిగిన తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ సమావేశంలో రేవంత్‌ రెడ్డి అన్నారు. లక్ష రూపాయలలోపు ఉన్న రుణాలను రేపు (గురువారం) సాయంత్రం 4:00 గం.ల లోపు రుణమాఫీ జరుగుతుందన్నారు. ఇందుకుగాను 7 వేల కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాలో జమచేయనున్నట్లు చెప్పారు. జులై నెలాఖరులోగా లక్షన్నర రూపాయల రుణమాఫీ, ఆగస్టులో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

Read More

భూమి పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ అమలు.. కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు

రైతులందరికీ శుభవార్త. తొలివిడతగా ఈ నెల 18 వ తేదీ నాటికి అర్హులైన రైతులందరికీ లక్ష రూపాయల మేరకు రుణమాఫీ కానుంది. రుణ మాఫీకి రేషన్ కార్డు నిబంధన పెట్టారన్న అంశంపైన ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. పాస్ బుక్ ఆధారంగానే రైతు కుటుంబానికి రూ. 2 లక్షల పంట రుణ మాఫీ వర్తిస్తుందని చెప్పారు. కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు.

Read More

రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల

తెలంగాణా ప్రభుత్వం పంటల రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఒక్కొక్క కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 13 వరకు తీసుకున్న పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తుంది. రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్‌కార్డు ప్రామాణికం అని తెలిపింది. రుణ మాఫీ కోసం ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌ ఏర్పాటు చేయనున్నారు. రుణమాఫీ నగదును నేరుగా లబ్దిదారుల రుణఖాతాల్లోనే జమ చేస్తారు. ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్ము విడుదల చేయనున్నారు. రుణమాఫీపై రైతుల సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయబోతుంది. రైతు సమస్యలుంటే 30 రోజుల్లో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Read More

ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న ప్రకృతి సేద్యానికి పోర్చుగల్‌ పురస్కారం

గత కొన్ని సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది రైతులు పాటిస్తున్న సుస్థిర వ్యవసాయానికి, అందుకు మార్గదర్శకంగా నిలిచిన ప్రకృతి వ్యవసాయ సంస్థకు ప్రతిష్ఠాత్మక గుల్బెంకియన్‌ ప్రైజ్‌ ఫర్‌ హ్యూమానిటీ అవార్డు లభించింది. పోర్చుగల్‌లోని లిస్బన్‌లో ఏపీసీఎన్‌ఎఫ్‌ తరఫున రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక వైస్‌ఛైర్మన్‌ టి. విజయ్‌కుమార్‌, ప్రకృతి వ్యవసాయ మహిళా ఛాంపియన్‌ రైతు నెట్టెం నాగేంద్రమ్మ ఈ అవార్డును అందుకున్నారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు 2014-15లో అప్పటి సీయం చంద్రబాబు ఈ సంస్థను నెలకొల్పి నిధులు సమకూర్చారు. 2018లో యూఎన్‌ఈపీ అవార్డు సైతం ఈ సంస్థకు దక్కింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సహజ విధానాల ద్వారా సుస్థిర వ్యవసాయం సాధ్యమని నిరూపించినందుకు పోర్చుగల్‌కు చెందిన ప్రముఖ దాతృత్వ సంస్థ గుల్బెంకియన్‌ పౌండేషన్‌ తాజా పురస్కారాన్ని అందజేసింది.

Read More

పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం 50% పెరిగింది

2024-25 ఖరీఫ్‌ సీజనులో పప్పుధాన్యాల సాగు 50 శాతానికి పైగా పెరగటంపై కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఖరీఫ్‌ పంటల పరిస్థితిపై అధికారులతో సమీక్ష జరిపిన సందర్భంలో ఈ విషయాన్ని వెల్లడించారు. పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నాము కాబట్టి ఈ దిశగా రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పప్పుధాన్యాలలో ముఖ్యంగా కంది సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం… గడచిన వారాంతానికి పప్పుధాన్యాల సాగు 36.81 లక్షల హెక్టార్లకు పెరిగింది. ఇది గత సంవత్సరం 23.78 లక్షల హెక్టార్లతో పోల్చుకుంటే 50 శాతం పెరుగుదల నమోదు అయ్యింది.

Read More

పోలవరం కట్టకముందే ఉత్తరాంధ్రకు నీరు

గోదావరి నదిపై కడుతున్న పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి కాకుండానే ఉత్తరాంధ్రకు నీరు అందిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందుకుగాను పురుషోత్తమ పట్నం, పుష్కర ఎత్తిపోతల పథకాల ద్వారా 2,500 క్యూసెక్కుల గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు అందిస్తామని అనకాపల్లి పర్యటనలో చంద్రబాబు అన్నారు. పోలవరం ఎడమకాలువ 214 కి.మీ. మేర నిర్మించాలి. ముందు 800 కోట్ల రూపాయలతో 93 కి.మీ. వరకు కాలువను నిర్మించుకుంటే 2.2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందివ్వటానికి అవకాశం ఉంది కనుక ఈ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు.

Read More

పెరుగుతున్న ఆలమట్టి నీటిమట్టం

కృష్ణా బేసిన్‌లో ఎగువన కురుస్తున్న వర్షాలతో ఆలమట్టికి క్రమంగా వరద పెరుగుతూ ఉంది. బుధవారానికి ఆలమట్టి నీరు 84,645 క్యూసెక్కులకు చేరింది. ఇంకో 40 టి.యం.సీలు వస్తే గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలే అవకాశం ఉంది. నారాయణపూర్‌లో మరో 10 టి.యం.సీలకు మాత్రమే అవకాశం ఉంది. తుంగభద్రలోకి కూడా కొంత ప్రవాహం పెరిగింది. అయితే ఈ ప్రాజక్ట్‌ నిండటానికి మరో 80 టి.యం.సీలు అవసరం. గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్ట్‌లలోకి నీటి ప్రవాహాలు నామమాత్రంగానే ఉన్నాయి.

Read More

6.62 లక్షల క్వింటాళ్ళ విత్తనాలపై 309 కోట్ల రూపాయల రాయితి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ఖరీఫ్‌ సీజనులో 6.62 లక్షల క్వింటాళ్ళ విత్తనాలపై 309 కోట్ల రూపాయల రాయితీని రైతులకు అందించనుంది. ఇందులో 3.15 లక్షల క్వింటాళ్ళ వేరుశనగ, 95 వేల క్వింటళ్ళ పచ్చిరొట్ట విత్తనాలు, 2.29 లక్షల క్వింటాళ్ళ వడ్లు, 22,150 క్వింటాళ్ళ పప్పుధాన్య విత్తనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 3.50 లక్షల క్వింటాళ్ళ విత్తనాలు పంపిణీ చేశారు. గతంలోని రాయితి పథకాలను తిరిగి పునరుద్ధరిస్తారని రైతులు ఎదురు చూస్తున్నారు.

Read More

సేద్య రంగానికి రూ. 2.64 లక్షల కోట్లు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల ద్వారా వ్యవసాయ రంగానికి రూ. 2.64 లక్షల కోట్ల రుణాలు అందజేయనున్నారు. ఇందులో పంట రుణాల క్రింద 1.66 లక్షల కోట్లు అందజేయనున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కూడా రుణ లక్ష్యం గత సంవత్సరంతో పోల్చుకుంటే 26% పెంచారు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, మత్స్య, వ్యవసాయ యాంత్రీకరణ, వ్యవసాయంలో మౌలిక సౌకర్యాల కల్పనకు రు. 32,600 కోట్ల రుణాలు అందించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన 2024-25 రుణ ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.

Read More