లక్ష్యానికి ఆమడ దూరంలో ఆయిల్‌పామ్ సాగు
ఆయిల్‌పామ్ పంటను పెద్ద ఎత్తున సాగు చేయిస్తామని, రైతులను అన్నివిధాలా ప్రోత్సహిస్తామని, పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఆయిల్ పామ్ కంపెనీలు చేతులెత్తేస్తున్నాయి. 2024-25లో లక్ష ఎకరాల లక్ష్యాన్ని కంపెనీలకు నిర్దేశిస్తే కంపెనీలు కేవలం 12,488 ఎకరాల్లోనే ఆయిల్ పామ్ పంటను వేయించాయి. లక్ష్యసాధన కోసం ప్రభుత్వం కంపెనీలకు సహకరిస్తున్నప్పటికీ కంపెనీల నిర్లక్ష్యం కొనసాగుతుంది. కంపెనీల పనితీరులో మార్పు రాకపోతే ఒప్పందాలను రద్దు చేసి ఇతరులకు ఇస్తామని వ్యవసాయశాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు కంపెనీలను హెచ్చరించారు.










