మూడు విడతలుగా రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండో విడతలో భాగంగా జులై 30వ తేదీనాడు లక్షన్నర రూపాయలలోపు తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేయనుంది. రేపు (మంగళవారం) మధ్యాహ్నం 12 గంటలకు 2వ విడత రుణమాఫీని తెలంగాణ సీయం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తిచేశారు. రేపు ఏర్పాటుచేసే రుణమాఫీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు.

29 Jul, 2024
