కావలసిన పదార్థాలు
వేపాకు : 1 కిలో
కానుగ : 1 కిలో
బిల్వం (మారేడు) : 1 కిలో
విషముష్టి : 1/2 కిలో
వావిలాకు : 1 కిలో
తంగేడు : 1 కిలో
సీతాఫలం : 1/2 కిలో
పిచ్చి తులసి : 1 కిలో
పుదీనా : 1/2 కిలో
పాల కొడిస : 1/2 కిలో
కొత్తిమీర : 1/2 కిలో
నేరేడు : 1 కిలో
నేలవేము : 1/2 కిలో
యూకలిప్టస్ : 1 కిలో
అత్తాకోడలు ఆకు : 1 కిలో (లాంటానా)
తయారు చేసే పద్ధతి :
- పైన చెప్పిన వాటిలో ఏవైనా 5 రకాల ఆకులు పైన చెప్పిన మోతాదులో తీసుకోవాలి.
- వాటి ఆకులు విడదీసి, ఒక కుండలో వేసి 10 లీటర్ల నీరు పోయాలి.
- ఒక రాత్రంతా అలాగే ఉంచాలి.
- మర్నాడు ఆ కుండను వేడి చేయాలి.
- ద్రావణం సుమారు 5 లీటర్లు అయ్యేవరకూ వేడిచేస్తూ, మధ్య మధ్యలో ఒక కర్రతో బాగా కలపాలి.
- తర్వాత కుండను బాగా చల్లార్చాలి.
- కషాయాన్ని వడపోసి, దానికి 100 గ్రాముల సబ్బుపొడిని లేదా 500 గ్రా. కుంకుడుకాయ రసాన్ని కలపాలి.
- ఈ విధంగా తయారైన కషాయాన్ని 100-150 లీటర్ల చల్లని నీళ్ళలో కలిపి ఒక ఎకరాకు సాయంత్రం వేళ పంటపై పిచికారి చేయాలి.
నివారించే పురుగులు :
- రసం పీల్చే పురుగులు, 2. చిన్న చిన్న లార్వాలు
- ఆకులు తినే మిడతలు, 4. కాయ తొలిచే పురుగులు
ఎన్నిసార్లు వాడాలి?
- ఈ కషాయం ఒక ఎకరాకు ఒకసారికి సరిపోతుంది.
- అన్ని పంటలలో వాడవచ్చు.
- పురుగుల తీవ్రతను బట్టి 2-3 సార్లు వాడవచ్చు. (ఉదా. మిరప, ప్రత్తి)
- వరి పంటలో 1-2 సార్లు వాడవచ్చు.
- వేరుశనగ, పొద్దుతిరుగుడులో 1-2 సార్లు వాడవచ్చు.
తీసుకోవలసిన జాగ్రత్తలు :
- కుండలో కషాయాన్ని వేడిచేసేటప్పుడు, మ°క్కుకు గుడ్డ కట్టుకోవాలి.
- కషాయాన్ని సాయంత్రం వేళల్లో పిచికారి చేసుకోవాలి.
- కషాయాన్ని 3 రోజులలోపు ఉపయోగించాలి. ఎక్కువ కాలం నిల్వ ఉంచరాదు.
ఎలా పనిచేస్తుంది ?
- పైన తెలిపిన వివిధ రకాల ఆకులలో ఎన్నో రకాల ‘ఆల్కలాయిడ్లు’ ఉండుట వలన పురుగుల నియంత్రణలోనే కాకుండా కొన్ని రకాల తెగుళ్ళను అరికట్టడంలో కూడా ఉపయోగపడుతుంది.
ఉపయోగాలు :
- ఈ కషాయం చాలా శక్తివంతమైనది. అందువల్ల రైతులు దీనిని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి.
- పంట లేత దశలలో (30-45 రోజులు) దీనిని తక్కువ మోతాదులో వాడుకోవాలి. (తయారు చేసిన ద్రావణం ఎకరాకు 2 లీటర్లు 100 లీ. నీటికి కలిపి వాడుకోవాలి).
- నారుమడులలో దీనిని వాడరాదు. నారుమడి మాడిపోయే ప్రమాదం ఉంది.

