వండని వంట… అటుకుల దద్దోజనం
కావాల్సిన పదార్థాలు
- అటుకులు
- పెరుగు
- క్యారెట్ తురుము
- బీట్రూట్ తురుము
- పచ్చిమిర్చి
- ఉల్లిపాయ ముక్కలు
- కొత్తిమీర తరుగు కొద్దిగా…
- ఒక నిమ్మ చెక్క
- రుచికి తగినంత ఉప్పు
తయారుచేయు విధానం: అటుకులు కడిగి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
ఆ తరువాత అటుకుల్లో పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, క్యారెట్, బీట్రూట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ, నిమ్మరసం అన్నీ కలుపుకుంటే అటుకుల దద్దోజనం సిద్ధం!
(గమనికః అటుకులు పాక్షికంగా వండిన వంట కిందికి వస్తాయి)
- మెహర్ శాంతి కర్రి, అర్తమూరు, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

