ఇది 5 మీ. ఎత్తు వరకు పెరిగే తీగ జాతి మొక్క. తీగకు బాగా ముళ్ళుంటాయి. ఎడమవైపుకు మెలి తిరుగుతుంది. కణుపుకు ఒకటి చొప్పున పత్రములు వస్తాయి. బల్బిల్స్ ఉండవు. దుంపలు కొద్దిగా నొక్కబడి, గుండ్రంగా ఉంటాయి. అప్పుడప్పుడు గుండ్రటి తమ్మెలుగా కనపడుతుంది. భూమికి దగ్గరగా లోపల తయారవుతుంది. దుంప చర్మం ఎండుగడ్డి లేదా బూడిద రంగులోను, లోపలి కండ నిమ్మ పసుపు రంగులో ఉండి విషపూరితంగా ఉంటుంది. దుంపలలో అల్బుమినాయిడ్లు (7.2 -9.12%), బూడిద (4.054-.61%), కొవ్వు (0.97-1.1%), కార్బోహైడ్రేట్లు (81.45-81.89%), పీచు (3.28-6.28%), భాస్వరము (0.52-0.77%) కలిగి ఉంటాయి. దీని దుంప కంద దుంపను పోలియుంటుంది. ఈ దుంప పులి అడుగువలె ఉంటుంది కనుక దీనిని పులి దుంప అంటారు.
సాధారణ నామం : టైగరఫుట్ డయాస్కోరియా, తెల్లగినిగెడ్డలు శాస్త్రీయ నామం : డయోస్కోరియా హిస్పిడ కుటుంబం: డయోస్కోరియేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
దుంపలలో డయాస్కోరిన్ అనబడు విషపదార్థం (0.19%) ఉంటుంది.
ఇది విషపూరితమైన దుంప. దీని రసం పాము కాటుకు విరుగుడుగా వాడుతారు. కరువు పరిస్థితులలో దీనిని ఏడు దినాలపాటు పారే నీళ్ళలో నానబెట్టి వండుకుని తింటారు.
వ్యవసాయరంగంలో …
పులిదుంప నీటి ఆధారిత క్రూడ్ ద్రావణం (5%) కర్రపెండలాన్నాశించు పొలుసు పురుగు, సూడౌలాకాస్పిస్ పెంటగోనాని అత్యంత సమర్ధవంతంగా నివారించింది (వాస్క్వెజ్, 1991).
పులిదుంప దుంపలో ఉండే టోటాకోరిన్ అనే రసాయనం (5%) ద్రావణం పేను బంకను అత్యంత సమర్ధవంతంగా నివారించింది. కాని 25% వరి నల్లులను మాత్రమే చంపింది (సులిట్, 1967).
స్పోడోపైరాలిట్టొరాలిస్ లార్వాలు డయోస్కోరియా బటాటాస్ ఆకులను ఆహారంగా తీసుకోలేవు (వాడ, అతని అనుచరులు, 1970).
పులిదుంప దుంప నుండి వేరు చేసిన డయాస్కోరిన్, డయాస్కోరిన్ ఎనఆక్సైడ్ క్యాబేజి డైమండ్ బ్యాక్‌మాత్, ఫ్లూటెల్లాక్ౙెåలోస్టెల్లా, రైస్ ఆర్మివర్మ్, సూడలెటియాసపరేట లార్వాలను ఆకులను తినకుండా నివారించాయి (బనాగ్, అతని అనుచరులు, 2005).
కామాక్షి చెట్టు మొదలు లావుగా ఉండి మందమైన కార్క్ వంటి బెరడుతో కప్పబడి ఉంటుంది. చెట్టు చివరన పొడవాటి, ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు, మెరిసే ఆకులు ఏర్పడతాయి. ప్రతి ఆకు 150 నుండి 170 సెం.మీ. పొడవుండి 54 నుండి 110 చిన్న ఆకులు కలిగి ఉంటుంది.. మగ కామాక్షి మొక్కలు పసుపుగోధుమ రంగు అండాకారపు కోన్స్ కలిగి ఉంటాయి. ఇవి 24-48 సెం.మీ. పొడవు, 12-18 సెం.మీ. వ్యాసం కలిగి ఉంటాయి. ఆడ మొక్కలో కోన్స్ ఏర్పడవు. అవి పొడవాటి, ఆకువంటి స్పోరోఫిల్స్‌పై గింజలు కలిగి ఉంటాయి. అవి కురచగా, వత్తుగా ఉన్న నారింజ రంగు నూగు కలిగి 20-35 సెం.మీ. పొడవుంటాయి. కామాక్షి గింజలు చిన్నవిగా 3-9 మి.మీ. పొడవుండి లేత ఎరుపుపసుపు రంగు గుజ్జుతో కప్పబడి ఉంటాయి. చెట్టు 3-5 మీ. ఎత్తు పెరుగుతుంది.
సాధారణ నామం : సాగోపామ్ శాస్త్రీయ నామం : సైకాస్ సిర్సినాలిస్ కుటుంబం: సైకడేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
పుప్పొడి నార్కోటిక్, కామాక్షి మొక్క బెరడు, గింజలను నూరి నూనెతో కలిపి పేస్టు చేసి గాయాలు, వాపులపై పట్టీగా వేస్తారు.
లేత ఆకుల రసాన్ని వాంతుల చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ మొక్క పిత్ నుండి సగ్గుబియ్యం తయారు చేస్తారు. ఆకుల కషాయాన్ని దగ్గు నివారణకు త్రాగుతారు.
వ్యవసాయరంగంలో
సంప్రదాయ వ్యవసాయంలో కామాక్షి పూలను పురుగుల యాజమాన్యంలో ఉపయోగిస్తారు. దీని మగపూలు కుళ్ళినపుడు ఒక ఘాటైన వాసనని విడుదల చేస్తాయి (మమన్నన్ & నటరాజన్, 2010).
కామాక్షి మగచెట్టు, పూవులను కోసి వరి పంట స్థాయి కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న కర్రలకు కట్టాలి.
ఈ కర్రలను గడ్డితో చుట్టి పూలను కట్టి వరి పొలంలో 10-15 చోట్ల పాతాలి. వీటి వాసనకు కంకినల్లి పెద్ద పురుగులు వికర్షింపబడి 2 వారాల పాటు పొలంలోకి ప్రవేశించలేవు. ఈ సమయానికి పాలుపోసుకునే దశ పూర్తయి, పంట పరిపక్వ దశకు చేరుకుంటుంది.
కామాక్షి పూలలో ఉన్న సైకాస్టిన్ అనే రసాయనం కీటకనాశక మరియు నిరోధక లక్షణాలు కలిగి ఉంది. శ్రీలంక వరి రైతులు ‘కెమ్ కామ’ పద్ధతులు అనే పురుగు యాజమాన్య పద్ధతులను మొక్క ఆధారిత పదార్థాలు మరియు సాగు పద్ధతులనుపయోగించి వృద్ది చేశారు. మొక్కలలోని రసాయన పదార్థాలను గురించి అవగాహన లేనప్పటికీ శ్రీలంక వరి రైతులు ఈ విజయవంతమైన సస్యరక్షణ పద్ధతిని వృద్ధి చేయడానికి కొన్ని దేశీయ మొక్కలను గుర్తించారు. ఈ కెమ్ పద్ధతులు పురుగు మందు ప్రభావం, జిగట ఎరలు, దీపపు ఎరలు వంటి వివిధ రకాల చర్యలను కలిగి ఉంటాయి. ఆధునిక విజ్ఞానం వృద్ధి చెందడంతో, కెమ్ పద్ధతిలో దాగి ఉన్న రహస్యాలను ఏ మొక్క ఆధారిత రసాయనం ఏ పురుగుకి సరైన ఎంపిక అనే విషయాన్ని పరిశోధించవచ్చు. వరి పొలాల దగ్గర కదురు (సెర్బెరమ్‌గడ్డి) కర్రలను మంట పెట్టడం వల్ల దీపపు ఎరతో పాటు రసాయన వికర్షకాన్ని కూడా పురుగుల నివారణకు ఉపయోగించినట్లు పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇది ఒక ‘కెమ్ కామ’ పద్ధతి. కామాక్షి పూలలో సైకాసిన్ ఒక ముఖ్య రసాయనం. దీనికి కీటకనాశక మరియు కీటక నిరోధక లక్షణాలున్నాయి. దీని ద్వారా ఆధునిక శాస్త్రీయ పరిశోధనలు పురాతన కెమ్ పద్ధతిలో పోలి వున్నాయని విశదమయింది. ఇటువంటి చర్యలు గల అనేక మొక్క జాతులున్నాయి. జిల్లేడు, మీలియా, క్రోటాన్ లాసిఫర్, యూఫర్బియా యాంటిక్సోరం సంప్రదాయ పద్ధతులతో సరితూగుతున్నాయి. ఇవి పర్యావరణహిత పద్ధతులు.
సంప్రదాయ ‘కెమ’ పద్ధతులు మొక్క: క్రోటాన్ లాసిఫెర నివారించబడే పురుగు: వరి కంకినల్లి పనిచేసే విధానం: మొక్కల కట్టను వరి పొలంలో మొక్కలపై లాగుతూ పోతే వికర్షక చర్యవల్ల నివారించడతాయి.
మొక్క: కదురు నివారించబడే పురుగు: వరి కంకినల్లి పనిచేసే విధానం: వరి పొలాల దగ్గర మంటలు వేయడం ద్వారా దీపపు ఎరలా పురుగులను ఆకర్షిస్తుంది.
మొక్క: కామాక్షి నివారించబడే పురుగు: వరి కంకినల్లి పనిచేసే విధానం: కామాక్షి మగపూవు కుళ్ళేటపుడు ఘాటైన వాసన విడుదల చేస్తుంది. ఈ మగపూవుని ఉదయం వేళలో కత్తిరించి ఈ భాగాలను కర్రలకు కట్టి వివిధ ప్రాంతాలలో పాతాలి. మరుసటి రోజు ఈ పూల భాగాలపై నీరు చల్లాలి.
మొక్క: మీలియా నివారించబడే పురుగు: వివిధ పురుగులు పనిచేసే విధానం: ఘాటైన వాసన గల మీలియా ద్రావణాన్ని తాటాకులపై చల్లి వరి పొలంలో వివిధ ప్రదేశాలలో ఉంచుతారు. ఈ ద్రావణంలోని ఆల్కలాయిడ్లు, ఫ్లేవనాయిడ్స్, టానిన్స్, టెర్పెనిన్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ పురుగులను తినకుండా, గుడ్లు పెట్టకుండా నిరోదిస్తాయి.
మొక్క: జిగట ఎరలు నివారించబడే పురుగు: రసంపీల్చే పురుగులు పనిచేసే విధానం: ఇతర పురుగులు విసనకర్ర, కర్ర లేదా తాడుకి జిగురు పూసి (జిల్లేడు, పాలపొద పాలు) పంటపై కదిలిస్తే పురుగులు జిగురుకు అంటుకుంటాయి.
మొక్క: దీపపు ఎరలు నివారించబడే పురుగు: ఎగిరే పురుగులు పనిచేసే విధానం: మధుకా లాంగిఫోలియా, వేప, కనారం జీవానికం నూనె ద్రావణాలతో దీపాలను వెలిగించి పెడితే ఆకర్షింపబడిన పురుగులను నాశనం చేయాలి. (విడనపతిరాన అండ్ దస్సనాయకె, 2013).
కామాక్షి ఓవ్యూలఎండోటెస్టా మిథనాల్ ద్రావణం బాసిల్లస్ సెరియస్, స్టఫైలోకోకస్ ఆరియస్, ఎస్కరిచియా కోలి, క్ౙాంతోమోనాస్ కాంపెస్ట్రిస్ మాల్వేసియారం లపై వాంకోమైసిన్, పెనిసిలిన్, బాక్టీరిమైసిన్ (యాంటిబయాటిక్స్) కన్నా గణనీయంగా అధిక యాంటీబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది (కల్పశ్రీ అండ్ దవీష, 2013).
వరిలో కాండం తొలుచు పురుగు ఆశించడం గమనించగానే కామాక్షి పూలను నలగ్గొట్టి పొలంలో నిల్వ ఉన్న నీటిలో కలపాలి (విమలకీర్తి, 2002), అమువిత గమ 2002).
కామాక్షి, వేప, నిమ్మగడ్డి, పొగాకు ఆకులను నీటిలో వేసి మరగించి కొంత సమయం నానబెట్టాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వడపోసి 2-4 రోజులు నిల్వ ఉంచాలి. తర్వాత కూరగాయల పంటపై పిచికారి చేస్తే ఈ ద్రావణం ఆకుతొలిచే పురుగు, దీపపు పురుగులు, ఆకుగూడు పురుగు, కొమ్మునల్లి, వీవిల్స్, లార్వాలు, చిత్తపురుగులను వికర్షిస్తుంది (ఒకులోన్‌లోల అండ్ అకిన్‌రిన్నోల, 2013).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
కొతిమీర 50 సెం.మీ. ఎత్తు పెరిగే మెత్తని మొక్క. ఆకులు అనేక ఆకారాలలో ఉంటాయి. మొక్క మొదలు వద్ద ఆకులు వెడల్పుగా ఉండి అనేక భాగాలుగా ఉంటాయి. పూత వచ్చే కాండాలపై ఆకులు సన్నగా ఈకలులా ఉంటాయి. పూలు చిన్న అంబెల్‌పై ఏర్పడతాయి. తెలుపు లేదా లేత పింకు రంగులో ఉంటాయి. కాయ గుండ్రంగా 2-6 మి.మీ. పొడవు, 3-5 మి.మీ. వ్యాసం కలిగి ఉంటుంది.
సాధారణ నామం : కోరియాండర్ శాస్త్రీయ నామం : కోరియాండ్రం సెటైవం కుటుంబం: ఎపియేసి (అంబెల్లిఫెరే)
ఉపయోగాలు : ఔషధరంగంలో …
కొతిమీర బహుళ ఆరోగ్య ప్రయోజనాలు గల మొక్క. ఇది అద్భుతమైన ఆకలిని కలిగిస్తుంది. కడుపులో జీర్ణాశయంలో అనేక ఎంజైములు, జీర్ణ రసాలు స్రవించడానికి సహాయపడుతుంది. జీర్ణశక్తిని పెంచి విరేచనం సాఫీగా అయేలా చేస్తుంది. ఇది ఆహారంలో పీచు పదార్థం అందిస్తుంది. జీర్ణకోశంలో వాయువులను విడుదల చేస్తుంది. మలబద్దకం, మొల్లలు, కడుపునొప్పికి ప్రయోజనకారి. దగ్గు తగ్గించడానికి, నోటి దుర్వాసన పోగొట్టడానికి ఉపయోగపడుతుంది. ఒక అద్భుత యాంటిసెప్టిక్. కఫాన్ని తగ్గించి, జ్వరాన్ని పోగొట్టి చల్లదనాన్ని ఇస్తుంది.
కొతిమీరలో అనేక పోషక విలువలుండటం వలన దీనిని “ప్రపంచ అద్భుత హెర్బల్ మొక్క”గా పరిగణిస్తారు. ఇది అనేక పోషకాలు, యాంటిఆక్సిడెంట్లు, ఎసెన్షియల్ ఆయిల్స్, యాంటిసెప్టిక్, బాధనాశక, ఉత్తేజిత, శిలీంద్రనాశక లక్షణాలు కలిగి ఉంటుంది.
కొతిమీర విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, ఎసెన్షియల్ ఆయిల్స్, ఆమ్లాలు సమృద్ధిగా కలిగి ఉంటుంది. ఆకులలో కాల్షియం, పొటాషియం, ఐరన్, మాంగనీస్, సోడియం ఉంటాయి.
కొతిమీరలో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్ కీళ్ళ నొప్పుల వల్ల కలిగే శరీర వాపుని తగ్గిస్తుంది. మొటిమలను తొలగిస్తుంది. గ్యాస్ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. కండ్ల కలక చకిత్సకు అద్భుత ఔషధం కొతిమీరలో ఉండే బీటాకెరోటిన్, యాంటిఆక్పిడెంట్లు కంటి సంబంధిత సమస్యలను నివారిస్తాయి. నోటి పుండ్ల నివారణకు ఇంటిమందు. ఎముకలను బలపరుస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలను నివారిస్తుంది. రుతు సమస్యలకు మహిళలు 5 గ్రా. కొత్తిమీర, ఒక చెంచా పంచదార అర లీటరు నీటిలో కలిపి మరగించిన కషాయాన్ని వడపోసి రోజుకి 3 సార్లు సేవించాలి. కేశ నష్టాన్ని తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది. కోలన్ క్యాన్సర్‌ని నివారిస్తుంది.
కొతిమీర చట్నీ తయారు చేసి వడ్డించవచ్చు. పొడి చేసిన గింజలను కేకుల తయారీలో ఉపయోగించవచ్చు. గ్రైప్ వాటర్ తయారీలో ఉపయోగిస్తారు. కొతిమీర యాంటిసెప్టిక్, అనాల్ౙెసిక్, అఫ్రోడియాసిక్, యాంటిస్పాస్మోడిక్, డియోడరెంట్, ఫంగిసైడల్, స్టిమ్యుటెంట్, స్టమకిక్, యాంటి బయాటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. కొతిమీరలో ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. యాంటిక్యాన్సర్, యాంటిమైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
వ్యవసాయరంగంలో
కొతిమీర గింజలలోని ఎసెన్షియల్ ఆయిల్‌లో లినలూల్ (57.57%), జిరానిల్ అసిటేట్ (15.09) ఎక్కువగా ఉంటాయి. ఈ రసాయనాలు ట్రైబోలియం కాస్టానియం కంటే కొల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌పై అధిక కీటకనాశక చర్యను ప్రదర్శించాయి. (ఖని, రహ్‌దారి, 2012).
టమాట పంటలో కొతిమీరని అంతరపంటగానే వేయడం వల్ల వివిధ రసం పీల్చే పురుగులు, తెల్లదోమ (బెమిసియా టబాసి), పేనుబంక (ఎఫిస్‌గాసిపి), జాసిడ్స్ (ఎంపోవాస్కాస్పీసీస్), తామర పురుగులు (త్రిప్స్ టబాసి), రెండు మచ్ౘ్ల ఎర్రనల్లి (టెట్రానైకస్ అర్టికె) సమర్ధవంతంగా, గణనీయంగా నివారించబడ్డాయి. ఈ పరిశోధనా ఫలితాలు ఆర్థిక పంటలతో ఆకర్షక మొక్కలను పెంచే పద్ధతిని సమగ్ర సస్యరక్షణ పథకాలలో ఒక భాగంగా సిఫారసు చేసి ఆర్థిక పంటలను పురుగుల బారి నుండి రక్షించవచ్చని వెల్లడించాయి (అబోషనాబ్, అతని అనుచరులు, 2017).
సహజ సుగంధపంటలైన పైపర్‌నైగ్రం, క్యూమినం సిమ్నియం, సిన్నమోమం వెరం, అల్లియం సెటైవం, కోరియాండ్రం సెటైనం, కర్కుమ, ఫీనిక్యులం వుల్గేర్, ట్రైగొనెల్లా ఫీనం గ్రీకం, సైజిగియం ఆరోమాటికం, క్యాప్సికం, జింజిబర్ అఫిసినాలిస్, మురయూ కోయినిగీ, బ్రాసికా నైగ్రా, సోడియం క్లోరైడ్‌లను కలిపిన మిశ్రమాన్ని పాటింగ్ మట్టితో కలిపి మొక్కలకు వేయాలి. ఈ జీవ పురుగు మందు వికర్షక చర్య, జీర్ణాశయంలో నిలిచిపోవడం, పక్షవాతం, ఊపిరాడకుండా చేయడం ద్వారా పురుగులను నివారిస్తాయి. ఈ జీవమందుని పొడిరూపంలో లేదా ద్రవరూపంలో పంటపై పిచికారి చేసి పురుగులను 48-72 గంటలలో నివారించవచ్చు. (గండిఐషాడోటి, 2012). ఈ జీవ పురుగు మందుని చ.మీ.కి. 100-500 గ్రా. చొప్పున వేయాలి.
జాన్‌కౌస్కా & జైట్కా (2016) క్యారట్ పంటలో కొతిమీర (కోరియాండ్రం సెటైవం), సమ్మర్ సావొరి (సాటురేజ హార్టెన్సిస్) అంతర పంటలప్రభావంపై అధ్యయనం చేశారు. అంతర పంటలు క్యారట్‌రస్ట్‌ఫ్లెå (సైలారోజే) వలన వేర్లకు కలిగే నష్టాన్ని గణనీయంగా తగ్గించాయి. అంతర పంటలు వేసిన క్యారట్ క్షేత్రంలో ఆకులపై సిల్లిడ్ (ట్రైయజా విరిడ్యులా), పేనుబంక, వేర్లపై నులిపురుగుల నష్టం గణనీయంగా తక్కువగా ఉంది. కొతిమీర, సావరి అంతర పంటలుగా వేయడం వలన క్యారట్ పంటలో ప్రయోజనకర కీటకాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రయోగాలు జరిపిన అన్ని సంవత్సరాలలో కొతిమీరని అంతర పంటగా వేసిన క్యారట్ క్షేత్రంలో బదనికలు అక్షింతల పురుగులు, సిర్పిడ్ ఈగల సంఖ్య అధికంగా ఉంది.
కొతిమీరలో ఉన్న లిమలూల్ (68.2%), పైనీన్ (5.5%), టెర్పినిన్ (5.5%) అనే ఎసెన్షియల్ ఆయిల్స్ నిల్వ ధాన్యంలో ఆశించే అకాంతోసెరిడస్ ఒబ్టెక్షన్‌పై ఫ్యూమిగెంట్ చర్యను ప్రదర్శించాయి (రిగ్నాల్ట్‌రోగర్, 1997).
కొతిమీర మొక్కలు పురుగుల సహజశత్రువులైన అల్లిక రెక్కల పురుగు (క్రైసోవా), అక్షింతల పురుగులు (కాక్సినెల్లిడ్స్), హోవర్ ఈగలు, పరాన్నజీవులైన చిన్న కందిరీగలను ఆకర్షిస్తాయి.
కాలీఫ్లవర్ పంటనాశించే డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లాకెå్ౙలోసెల్లా సమగ్ర సస్యరక్షణ పథకంలో కొతిమీరని కాలీఫ్లవర్‌లో అంతర పంటగా వేయడం ఒక పద్ధతి.
కాలీఫ్లవర్ పంటలో డైమండ్ బ్యాక్ మాత్ యాజమాన్యానికి సిఫారసు చేసిన సమగ్ర సస్యరక్షణ పథకం క్ర.సం. ట్రీట్‌మెంట్ మోతాదు/ప్లాట్ ఎన్నిసార్లు ఉపయోగించాలి 1. కొతిమీరని అంతర పంటగా సాగు చేయడం అర కిలో విత్తనం ఒకసారి 2. రసాయన పురుగుమందు లోర్స్‌బాన్ (2%) పిచికారి 16 మి.లీ/8 లీ. 3 సార్లు 3. 2% వేపగింజల కషాయం పిచికారి 16 మి.లీ./8 లీ. 3 సార్లు 4. 2% వేపనూనె పిచికారి 16 మి.లీ./8 లీ. 3 సార్లు 5. జీవనియంత్రణట్రైకోగ్రామాకిలోనిస్ (పారసైటాయిడ్) ప్యూపాల కార్డు (పర్వీన్, ఖాన్)
కొతిమీర గింజలలోని ఎసెన్షియల్ ఆయిల్ స్పోడోప్టెరా లిట్టొరాలిస్ 3వ దశ లార్వాలపై అత్యధిక ఫ్యూమిగెంట్ చర్యను ప్రదర్శించింది. (సౌగ్విర్, అతని అనుచరులు, 2013).
కూరగాయల సాగులో కొతిమీరను సహవాస పంటగా వేస్తే పేనుబంకను వికర్షిస్తుంది. ఎర్రనల్లి, పొటాటో బీటిల్స్ ఆశించకుండా చేస్తుంది. కొతిమీర సహజ శత్రువుల జీవిత కాలాన్ని పెంచుతుంది. అల్లిక రెక్కల పురుగు, హోవర్ ఈగ, ట్రైకోగ్రామా కిలోనిస్ పారసైటాయిడ్‌ని ఆకర్షిస్తుంది (టినాకా, 2014).
ఇర్వింగ్, అతని అనుచరులు (2014) కొత్తిమీర డాలికోగెనిడియా టస్మానికా సహజ శత్రువు జీవిత కాలాన్ని పెంచుతుందని నిరూపించారు.
కొతిమీర నుండి సృష్టించిన కొత్త సస్యరక్షణ ఎసెన్షియల్ ఆయిల్ ఉత్పత్తులు మూడు పేనుబంక జాతులు మాక్రోసైఫం రోజే, ఎఫిస్ నెరీ, ఎఫిస్ పోమి లపై గట్టి కీటకనాశక చర్యను ప్రదర్శించాయి (అటనసోప, 2017).
బెల్‌పెప్పర్‌లో అధిక నష్టం కలిగించే యూరోపియన్ కార్న్‌బోరర్, ఆస్ట్రినియా న్యూబిలాలిస్ సంరక్షణ జీవనియంత్రణకు అధ్యయనం జరిపారు. కొతిమీర, డిల్, బక్‌వీట్ అంతర పంటలను 3 బదనికలు చిన్నపైరేట్‌నల్లి (ఓరియస్ ఇన్సిడియోసస్), పింక్ మచ్చల అక్షింతల పురుగు (కోలియోయెగిల్లా మాక్యులేటస్), ఆకుపచ్చ అల్లిక రెక్కల పురుగు (క్రైసోపాస్పీ.)ని ఆకర్షించడానికి ఎంచుకున్నారు. వీటిని బెల్ పెప్పర్ ప్లాట్ల దక్షిణహద్దులో ఒకదాని తర్వాత ఒకటి 5వరుసల్లో నాటారు. బెల్ పెప్పర్ పంటలో కొతిమీర, డిల్‌ని కలిపి రెండు వరుసల్లో నాటారు. బక్ వీట్‌ని పంటలేని భూమిలో ఒక వరుసలో నాటారు.
పరిశోధనా ఫలితాలు అంతర పంటలు బెల్‌పెప్పర్‌ని తీవ్రంగా ఆశించే యూరోపియన్ కార్న్‌బోరర్‌ని సమర్ధవంతంగా నివారించాయని వెల్లడించాయి. అంతర పంటలు చిన్నపైరేట్ నల్లి, పింక్ మచ్చల అక్షింతల పురుగులు అధికంగా యూరోపియన్ కార్న్‌బోరర్ గుడ్లను తినడాన్ని ప్రోత్సహించాయి. (బికర్‌టన్, హోమిల్టన్, 2017).
ఫాబా చిక్కుడు రకాలలో కొతిమీరని అంతరపంటగా వేయడం వలన పేనుబంక పురుగులు, ఎఫిస్ క్రాక్సివొర గణనీయంగా తగ్గిపోయాయి. బదనికలు, గింజ దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ప్లాట్ చుట్టూ కొతిమీర స్ట్రిప్ వేసిన 843 రకం ఫాబి చిక్కుడు ప్లాటులో అతి తక్కువ పేను బంక పురుగుల సంఖ్య నమోదైంది (రిజ్క్, 2011).
గ్రీన్‌హౌస్ టమాట సాగులో తెల్లదోమ, ట్రైఎల్యురాడెస్ వేపొరేరియంపై వికర్షక పంటలు తులసి, పుదిన, డిల్, వెల్లుల్లి, ఉల్లి, పార్ల్సీ, కొతిమీర ప్రభావంపై అధ్యయనం చేపట్టారు. ముందుగా వికర్షక పంటల విత్తనాలను చల్లి తర్వాత టమాట నారు మొక్కలను నాటారు. కొతిమీరపై అతి తక్కువ తెల్లదోమలు నమోదవడం వలన దీనిని అత్యుత్తమ వికర్షక మొక్కగా సిఫారసు చేశారు (తస్లి, అతని అనుచరులు, 2017).
కొతిమీర పురుగు వికర్షిణిగా పనిచేస్తుంది. కొతిమీర కషాయం తయారు చేయడానికి 200 గ్రా. ధనియాలను దంచి 1 లీ. నీటిలో కలిపి 10ని. మరిగించాలి. తర్వాత ఈ కషాయాన్ని 2 లీ. నీటిలో కలపాలి. ఉదయంవేళ ఈ కషాయాన్ని 2 లీ. నీటిలో కలిపి పురుగాశించిన మొక్క భాగాలపై పిచికారి చేసి ఎర్రనల్లిని నివారించవచ్చు. (పట్నాయక్, 2017).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
వామింట ఆకుల కషాయం క్యాబేజి, కాలీ ఫ్లవర్‌ను ఆశించే డైమండ్ బ్యాక్ మాత్ పురుగులను నివారిస్తుంది. వంగ పంటనాశించే పొగాకు లద్దె పురుగు, పేనుబంకను నివారించే గుణం వామింట కషాయానికి వుంది. వామింట ఆకులను “పంచపత్ర కషాయం” తయారీలో కూడా ఉపయోగించుకోవచ్చు. పంచపత్ర కషాయాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సేంద్రియ వ్యవసాయ రైతులు అనేక పంటల్లో సస్యరక్షణకు వినియోగిస్తున్నారు.
శిలీంద్ర తెగుళ్ళ నివారణ కషాయం
కావలసిన పదార్థాలు: కలబంద ఆకులు (అలోవిర) 1 కిలో; బోగన్‌విల్లియా ఆకులు 1 కిలో; బొప్పాయి ఆకులు 1 కిలో; పసుపు పొడి: 200 గ్రాములు.
తయారు చేసే విధానం : పైన తెలిపిన అకులను సూచించిన మోతాదులో తీసుకుని మెత్తగా నూరి 10 లీటర్ల నీరు పోసిన కుండలో వేసి దానికి 200 గ్రాముల పసుపు పొడిని కలిపి పొయ్యిపై పెట్టి సన్నని సెగపై ఉడకబెట్టాలి. నాలుగయిదు పొంగులు వచ్చే వరకు బాగా కర్రతో తిప్పుతూ ఉడకబెట్టాలి. ద్రావణాన్ని బాగా చల్లారనిచ్చి, వడగట్టి ఒక ప్లాస్టిక్ డ్రమ్‌లో పోయాలి. దీనికి 100 లీటర్ల నీరు కలిపి సాయంత్రంవేళల్లో పంటపై పిచికారి చేయాలి. ఈ ద్రావణం ఒక ఎకరం పంటకు సరిపోతుంది.
గమనిక :
కషాయం తయారు చేసేటపుడు ముక్కుకు గుడ్డకట్టుకోవాలి.
పంటదశను, తెగులు ఉధృతిని బట్టి రెండుసార్ల వరకు పిచికారి చేసుకోవచ్చు.
ద్రావణాన్ని నిల్వ ఉంచరాదు.
ఈ కషాయాన్ని పంటలలో వచ్చు ఆకుమచ్చ తెగుళ్ళ నివారణకు ఉపయోగించవచ్చు.
కషాయం తయారు చేసే విధానం : కావలసిన పదార్థాలు : కలబంద ఆకులు – 1 కి.; బోగన్‌విల్లియా ఆకులు – 1కి.; బొప్పాయి ఆకులు – 1 కి.; పసుపుపొడి – 200 గ్రా.
పైన సూచించిన ఆకులను పై మోతాదులో తీసుకుని బాగా మెత్తగా నూరి 10 లీటర్ల నీరు పోసిన కుండలో వేసి దానికి 200 గ్రా. పసుపుపొడిని కలిపి పొయ్యిపై పెట్టి, సన్నని సెగతో ఉడకబెట్టాలి. తర్వాత ఆ కషాయాన్ని బాగా చల్లారనివ్వాలి. ఈ విధంగా తయారైన కషాయాన్ని వడకట్టి ఒక డ్రమ్ములో పోయాలి. దీనికి 100 లీ. నీరు కలిపి నిల్వ ఉంచకుండా వెంటనే ఒక ఎకరం పంటపై సాయంత్రం వేళలో పిచికారి చేయాలి. పంటకాలంలో పంట దశ, తెగులు ఉధృతిని బట్టి రెండు సార్లు పిచికారి చేసుకోవచ్చు.
వ్యవసాయ పెట్టుబడిలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులదే సింహ భాగం. వాతావరణంలో విపరీత మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో పైరు పెట్టడం కంటే దాన్ని కాపాడుకోవడానికే ఎక్కువ కష్టపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో రైతులు, వ్యవసాయ రంగంలోని సృజనశీలురు ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నారు. పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలూ ఈ దిశగా పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు తూటేరు (ఐపోమియా ఫిస్టులోసా) లేదా తూటి ఆకుల కషాయం శక్తివంతమైన కీటకనాశినిగా గుర్తించారు.
తూటేరు, లొట్టపీచు, కాంగ్రెస్ కంప, బేషరమ్ అని కూడా తూటి మొక్కను పిలుస్తారు. కంది, మినుము, పత్తి, క్యాబేజీ, క్యాలి ఫ్లవర్, వంగ తదితర పురుగుల బెడద ఎక్కువగా ఉండే అన్ని పంటల సస్యరక్షణకు ఈ కషాయం వాడుతూ సత్ఫలితాలను పొందుతున్నారు. క్యాబేజీ పంటను తీవ్రంగా నష్టపరిచే డైమండ్ బ్యాక్ మాత్పై తూటేరు కషాయం పిచికారీ చేస్తే పంట నష్టం కేవలం 2 నుండి 3 శాతం మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. అదే, రసాయనిక పురుగు మందులు పిచికారీ చేసినప్పుడు పంట నష్టం దాదాపు 11 నుంచి 12 శాతం వరకు ఉన్నట్లు గుర్తించారు. దీంతో తూటేరు కషాయ వినియోగం విదర్భ ప్రాంతం అంతటా వ్యాపించింది. కూరగాయలు, పప్పుధాన్యాలు, పండ్ల తోటలు సాగుచేసే రైతులు దీన్ని వినియోగిస్తున్నారు. ఆ ప్రాంత రైతుల సామూహిక ప్రయోగాల ఫలితంగా తూటేరు కషాయం పత్తిలో కాయతొలిచే పురుగు, శనగపచ్చ పురుగు, తలనత్త పురుగు, పచ్చపురుగు, రాగిలద్దె పురుగు, డైమండ్ బ్యాక్ మాత్, గొంగళి పురుగు, ముక్కుపురుగులను, కాండం తొలిచే పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగులను నివారించడానికి శక్తివంతంగా పనిచేస్తోందని తేలింది.
తూటాకు కషాయం తయారీ విధానం: ఒక కిలో తూటేరు లేత ఆకులను సేకరించాలి. ఆకులను మెత్తటి ముద్దగా నూరి.. 10 లీటర్ల నీటిలో వేసి 5 లీటర్లకు తగ్గే వరకు మరిగించాలి. కుండలో మిగిలిన కషాయానికి మరో అర కిలో తూటేరు ఆకుల ముద్దను కలిపి.. కషాయం సగానికి తగ్గే వరకు మరిగించాలి. కుండలో మిగిలిన 2.5 లీటర్ల కషాయాన్ని చల్లారనిచ్చి వడకట్టుకోవాలి. 2.5 లీటర్ల కషాయాన్ని 200 లీటర్లలో కలపాలి. లీటరు కషాయానికి 0.5 మిల్లీ లీటర్ల చొప్పున ఎమల్సిఫయర్ను కలిపిన తర్వాత పిచికారీ చేసుకోవాలి.
నిమ్మగడ్డి కషాయం : నిమ్మగడ్డి కషాయం ముఖ్యంగా భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ళ యాజమాన్యంలో బాగా పనిచేస్తుంది. ఇది మాక్రోఫోమినా ఫాసియోలినా అనే శిలీంధ్రం కలుగజేసే కుళ్ళు తెగులు నివారణలో బాగా పనిచేస్తుంది.
ఉత్తరేణి కషాయం: ఉత్తరేణి కషాయం చాలా రకాల శిలీంధ్రాల నివారణకు పనిచేస్తుంది. ఇది ముఖ్యంగా శిలీంధ్ర బీజాలను చంపి, శిలీంధ్రబీజాలు మొలకెత్తుటను కూడా ఆపివేస్తుంది. ఉత్తరేణి కషాయం బోట్రైటిస్ తెగులు నివారణకు బాగా పనిచేస్తుందని చాలామంది శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
విప్ప కషాయం : విప్ప బద్దలు మన అడవులలో విస్తారంగా దొరుకుతాయి. వీటికి తెగుళ్ళ యాజమాన్యంలో చాలా పాత్ర వుంది. విప్పను తెగుళ్ళ యాజమాన్యంలో మన భారతదేశంలో సంప్రదాయంగా వాడేవారని విన్నీపియెరా అనే ఆమె తన పుస్తకం ‘టెండింగ్ ది ఎర్త’లో పేర్కొన్నారు. విప్పలో ఉండే చాలా రకాల ఆల్కలాయిడ్లు తెగుళ్ళ యాజమాన్యంలో శిలీంధ్ర పెరుగుదల నిలిపి వేయుటలో పాత్ర వహిస్తాయి. దీని వలన వ్యాధి వ్యాప్తి ఆగిపోతుంది.