పంచపత్ర కషాయం
వేపాకు – 2 కి., కానుగ – 2 కి., పాలకొడిశ – 2 కి., యూకలిప్టస్ – 2 కి., లాంటానా – 2 కి., పిచ్చితులసి – 2 కి., పుదీనా – అరకిలో, కొత్తిమీర – అరకిలో, విషముష్టి – అరకిలో, నేలవేము – అరకిలో, సీతాఫలం – అరకిలో.
వీటిలో ఏవైనా 5 రకాల ఆకులను 10 లీ. నీటిలో వేసి అరగంట నుండి గంటసేపు బాగా ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన కషాయం 5 లీ. వరకు ఉంటుంది. దీనిని బాగా చల్లార్చి వడపోసి 100 గ్రా. సబ్బుపొడి లేదా 500 గ్రా. కుంకుడు కాయ రసం కలిపి తర్వాత 100 లీ. నీటిలో కలిపి ఎకరా పొలంలో పిచికారి చేయాలి.
పంచపత్ర కషాయం వాడిన 5 రోజుల తర్వాత పశువుల పేడ – మూత్రం ద్రావణం పిచికారి చేయాలి. దీని తయారీకి 5 కి. పేడ, 5 లీ. మూత్రం 5 లీ. నీటికి కలిపి తొట్టెలో నిల్వ చేసి 4 రోజులు మురగబెట్టాలి. ఈ మిశ్రమాన్ని రోజూ కర్రతో కలియ తిప్ప్రాలి. 4 రోజుల తర్వాత కొంచెం నీరు కలిపి వడపోసి 150 గ్రా. సున్నం కలపాలి. ఈ ద్రావణాన్ని 100 లీ. నీటిలో కలిపి ఒక ఎకరం పొలంలో పిచికారి చేయాలి.

