ప్రస్తుత ఖరీఫ్‌లో 34.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇది గతేడాది కంటే ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు అదనం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 5.59 లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.8,206 కోట్లు చెల్లించాం. రైతులు నష్టపోకుండా మద్దతుధర అందించాం. ఎన్టీఆర్ భరోసా కింద రూ.50 వేల కోట్లు పింఛన్ల కింద ప్రజలకు అందజేశాం. ప్రస్తుతం పెద్దఎత్తున రోడ్లు నిర్మిస్తున్నాం. ఇందుకోసం తాజాగా రూ.2,500 కోట్లు కేటాయించాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పల్లె పండగ కార్యక్రమాన్ని చేపట్టి, పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. డేటా లేక్ ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రాన్ని మూడు క్లస్టర్లుగా విభజించి, పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నాం. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది’ అని మనోహర్ వివరించారు.

30 Dec, 2025
34.60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశాము
#AgricultureNews, #APDevelopment, #APFarmers, #CivilSuppliesDept, #CMChandrababu, #DataLakeAP, #DhaanyamPurchase, #FarmerPayments, #GoodGovernance, #IndustrialDevelopment, #KharifSeason, #MSPSupport, #NadendlaManohar, #NTRBharosa, #PallePandaga, #PawanKalyan, #PensionsScheme, #raithunestham news, #RoadsDevelopment, #RythuBharosa, #RythulaSankshema, #అభివృద్ధిపనులు, #ఆంధ్రప్రదేశ్, #ఎన్టీఆర్భరోసా, #ఖరీఫ్, #చంద్రబాబునాయుడు, #డేటాలేక్, #ధాన్యంకొనుగోలు, #నాదెండ్లమనోహర్, #పల్లెపండగ, #పవన్‌కల్యాణ్, #పారిశ్రామికాభివృద్ధి, #పింఛన్లు, #పౌరసరఫరాలశాఖ, #మద్దతుధర, #రాష్ట్రవికాసం, #రైతుభరోసా, #రైతులకు చెల్లింపులు, #రైతులసంక్షేమం, #రోడ్లనిర్మాణం, #శాంతిభద్రతలు, agri news, Agriculture, Andhra Pradesh, natural farming, telangana, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ధాన్యం కొనుగోలు
