ముళ్ళతీగె ఒక పెద్ద ముళ్లున్న పొద. ఇది ఒక ప్రాకే పొద. కాండం సుమారు 15 మీ. పొడవుంటుంది. కొమ్మలు అనేక, వంకర తిరిగిన ముళ్లు ఆకు కాడలపై కలిగి ఉంటుంది. ముళ్లు నల్లగా ఉంటాయి. ఆకులు 10-30 సెం.మీ. పొడవుంటాయి. 2-4 జతల 2.58 సెం.మీ. పొడవున్న ప్రక్కకాడలు ఏర్పడతాయి. వీటి మీద 1-3 జతల చిన్న ఆకులు ఎదురెదురుగా ఏర్పడతాయి. పూలకాడ 20-40 సెం.మీ. పొడవుండి దాని మీద కాంతివంతమైన పసుపు పచ్చ రంగు పూలేర్పడతాయి. కాయలు అండాకారంలో ఉంటాయి. కాయలలో చదునైన, పెద్ద, గట్టిగింజలుంటాయి.
సాధారణ నామం : జావా బ్రూసియా శాస్త్రీయ నామం : సీసాల్పినియా క్రిస్టా కుటుంబం: ఫాబేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
- ఈ ఔషధ మొక్కను మలేరియా చికిత్సలో ఉపయోగిస్తారు. మలేరియా జ్వరం లక్షణాలైన తీవ్ర చలి, అధిక జ్వరం, చెమట పోయడం, తలనొప్పి, వాంతులు, డయేరియా లక్షణాల యాజమాన్యానికి ఉపయోగిస్తారు. ఈ మొక్కలో ఉండే యాంటి పారసైట్ లక్షణాలు శరీరంలోని రౌండ్వర్మ్, టేప్వర్మ్స్, ఫ్యూక్స్ని అతి సమర్ధవంతంగా నివారిస్తాయి. వర్మ్స్ ఆశించడం వలన కలిగే డయేరియా, అనీమియా, ఊపిరితిత్తులు, లివర్ ఇన్ఫెక్షన్ వంటి లక్షణాల యాజమాన్యానికి ఉపయోగిస్తారు.
- ఈ మొక్క రోగం వల్ల దేహమందు కలుగు ఈడుపులను అణచివేసి కండరాల నొప్పులను తగ్గిస్తుంది. ముళ్ళ తీగ మొక్కలోని యాంటి ఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలోని ఆక్సిడేటివ్ వత్తిడిని తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంచి శరీరాన్ని అనేక జబ్బుల నుండి రక్షిస్తుంది.
- ఈ మొక్కలో అధికంగా ఉన్న యాంటిడయాబెటిక్ లక్షణాలు ఆరోగ్యకరమైన రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తాయి. అంతేగాక ఈ మొక్కని ఉపయోగించడం వలన డయాబెటిస్ లక్షణాలైన అధిక మూత్ర విసర్ౙన, అలసట, బరువు తగ్గడం, అధిక దాహం, స్పష్టంగా కనిపించకుండా ఉండటం, గాయాలు నెమ్మదిగా మానడం వంటి లక్షణాలను తగ్గిస్తుంది. ముళ్ళ తీగ మొక్క టిసెల్, బిసెల్, మోనోసైట్స్, మాక్రోఫాజెస్ వంటి రోగ నిరోధక శక్తి వ్యవస్థ భాగాలను ప్రేరేపిస్తుంది.
- దీని సహజ యాంటిపైరెటిక్ లక్షణాల వలన దీనిని జ్వరం చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ మొక్కని శరీరంలో నొప్పుల ఉపశమనానికి ఉపయోగిస్తారు.
- దీనిని జ్ఞాపక శక్తిని పెంచడానికి ఉపయోగిస్తారు. ఆందోళన, వత్తిడి, టెన్షన్, డిప్రెషన్ని తగ్గిస్తుంది. శ్వాసకోశ చిక్కులైన దగ్గు, న్యుమోనియా, క్షయ, శ్వాసపీల్ౘ్లేకపోవడం వంటి సమస్యలను చక్కబరుస్తుంది. మహిళల బహిష్టు సమయంలోని సమస్యలైన రుతుస్రావచక్రాలు క్రమంగా రాకపోవడం, అధిక లేక తక్కువ రక్తస్రావం, పొత్తికడుపు నొప్పి, వాంతులను క్రమబద్ధీకరిస్తుంది. చర్మవ్యాధులైన ఎక్ౙిమా, గజ్ౙి, సోరియాసిస్, కుష్టుల చికిత్సలో ఉపయోగపడుతుంది. దురద, ఎర్రబడటం, మంటలకు కూడా ఉపశమనం కల్గిస్తుంది.
వ్యవసాయరంగంలో…
- ముళ్ళ తీగను గోమూత్ర జంతునాశక్ తయారీలో ఉపయోగిస్తారు.
- ముళ్ళ తీగ గింజల హెక్సేన్ ద్రావణం (0.1%) శనగపచ్చ పురుగు మూడవ దశ లార్వాలపై 80.97% యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది (నాదుల అండ్ దింగ్ర, 2006).
- సోఫోరా వేరు మరియు ముళ్ళ తీగ ద్రావణాలు కలిగిన పురుగు మందు లెపిడోప్టెరా పురుగులను నివారించి పంటల దిగుబడులను పెంచుతుంది.
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

