పపటాకు 1.8 మీటర్ల ఎత్తు పెరిగే వార్షిక మొక్క. ఇది విపీరతంగా పెరిగి కలుపు మొక్కలా తయారవుతుంది. ఆకులు వ్యతిరేక దిశలో ఏర్పడి 3 నుండి 5 అండాకారంలో వున్న చిన్న ఆకులు కలిగి వుంటాయి. మొక్క సంవత్సరంలో ఏ సమయంలోనైనా పూయవచ్చు. పూలు పొడవాటి కాడల మీద చిన్న గుత్తులుగా ఏర్పడతాయి. కాయలు కొద్దిగా వంకరగా, బిర్రుగా, గరుకుగా, నలుపు కడ్డీలులాగా వుంటాయి. కాయలు నక్షత్రం ఆకారంలో గుండ్రని గరుకైన అంచులు కలిగి సుమారు 1-2 సెం.మీ. వ్యాసంలో వుంటాయి. ఉత్తర భారతదేశంలో లేత ఆకులు, కొమ్మలను చేపల కూరలో చేపలతో కలిపి వండుకు తింటారు.
సాధారణ నామం : బ్లాక్ జాక్ / బెగ్గర్‌టిక్ శాస్త్రీయ నామం : బిడెన్స్ పైలోసా కుటుంబం: ఆస్టరేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
పపటాకు ఫార్ములేషన్ యాంటి డయాబెటిక్ డ్రగ్స్‌తో కలిపి వాడితే డయాబెటిక్ వ్యాధిగ్రస్తులలో డయాబెటిస్ నియంత్రణలో వుంటుంది.
చైనాలో, ఈశాన్య ఉత్తర భారతదేశంలో ప్రజలు ఔషధంగా ఉపయోగిస్తారు. మొత్తం మొక్క లేదా వివిధ భాగాలను వాపు, రోగనిరోధక సమస్యలు, జీర్ణకోశ సమస్యలు, కీళ్ళ నొప్పులు, అంటువ్యాధులు, క్యాన్సర్లు, గాయాలు వంటి 40 జబ్బులకు పైగా చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో …
దక్షిణాఫ్రికాలో దీనిని పందులకు మేతగా ఉపయోగిస్తారు.
పపటాకు ఎసిటోన్ ద్రావణాన్ని చిక్కుడు గింజల నిల్వదశలో ఆశించే అకాంతో సెలిడెస్ ఒబ్టెక్టస్, జాట్రోటెస్ సబ్‌సాసియేటస్ పురుగుల నివారణలో మొట్టమొదటిసారిగా ఉపయోగించి 100 శాతం నివారణ సాధించారు. పపటాకు ఒక అద్భుతమైన వృక్ష సంబంధ పురుగుమందు. దీనిని అధిక పరిమాణంలో లెగ్యూమ్ జాతి పంటల ధాన్యాన్ని పురుగులాశించకుండా నిల్వ చేయడానికి ఉపయోగించవచ్చు. (రేణుక, ఆమె అనుచరులు, 2014) రసాయన పురుగుమందులకు ఈ కలుపు మొక్క ఒక అద్భుత ప్రత్యామ్నాయం.
పపటాకు తాజా ఆకులనుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ బంబార వేరుశనగ నిల్వ సమయంలో ఆశించే పురుగు కాల్లసోబ్రోకస్ మాక్యులేటస్‌ను, శిలీంద్రాలు ఆస్పర్ౙిల్లస్, పెనిసిలియం, ఫ్యుజేరియం, మ్యూకార్‌లను సమర్థవంతంగా నివారించింది. పపటాకు ఎసెన్షియల్ ఆయిల్ పురుగు, శిలీంద్ర నాశక లక్షణాలు ఈ పరిశోధన ద్వారా విశదమయ్యాయి (అగస్టిన్‌గేడౌమ్, అతని అనుచరులు, 2016)
పపటాకు తాజా ఆకుల నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యాన్ని పురుగులాశించకుండా కాపాడుతుంది (ఆగస్టిన్ గేడౌమ్, అతని అనుచరులు, 2016)
పేనుబంక, లద్దె పురుగులు, చెదల నివారణకు మొత్తం మొక్క, దాని గింజలనుపయోగించి ఫార్ములేషన్ తయారు చేసుకోవచ్చు. మొదట ముదిరిన గింజలను నీటిలో 10 ని॥ మరిగించాలి. చల్లారిన తర్వాత ఇంకొంచెం నీటితోపాటు చిన్న సబ్బు ముక్క లేదా కొంచెం సబ్బు పొడి కలపాలి. ఈ ద్రావణాన్ని వడకట్టి నారుమడి, కూరగాయల పం\ల్లో పిచికారి చేయవచ్చు. మొత్తం మొక్కను కూడా బాగా దంచి రాత్రంతా నీటిలో నానబెట్టి ఉంచి, మరునాడు వడపోసి పిచికారి చేసే ముందు చిన్న సబ్బు ముక్క కలిపి పిచికారి చేయవచ్చు.
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
దేవ కాంచనం ఒక చిన్న పరిమాణం నుండి మధ్య పరిమాణం కలిగి కాలానుగుణంగా ఆకులు రాల్చుతూ, వేగంగా పెరిగే పొద లేదా చెట్టు. ఈ చెట్టు గుండ్రని, వత్తయిన గుబురులాంటి క్యానపి, 10 మీ. ఎత్తు కలిగి, లేత కొమ్మలు మెత్తగా, నునుపుగా ఉంటాయి. పొడి వాతావరణం గల ప్రాంతాలలో చెట్టు పరిమాణం అతి చిన్నదిగా ఉంటుంది. బెరడు తెల్లబారిన బూడిద గోధుమ వర్ణంలో, నున్నగా, కొద్దిగా బీటలు వారిన పొలుసులు కలిగి ఉంటుంది. రెమ్మపుల్లలు సన్నని, లేత ఆకుపచ్చ రంగులో, కొంచెం నూగుతో, కోణాలు కలిగి గోధుమ బూడిద రంగులో ఉంటాయి. హార్ట్‌వుడ్ గోధుమరంగులో గట్టిగా మన్నిక కలిగి ఉంటుంది. ఆకులు సామాన్యంగా, ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడతాయి. ఆకు ఆధారం గుండ్రంగా ఉండి 12 సెం.మీ. x 12 సెం.మీ. పరిమాణం, చివరి భాగం లోతుగా రెండు భాగాలుగా విడిపోయి ఉంటుంది. ఆకుపైభాగం, అడుగు భాగం నున్నగా, 9-12 ఈనెలు కలిగి ఉంటాయి. ఆకు కాడలు 2.5 – 3.5 సెం.మీ. పొడవుంటాయి. పూరెమ్మ 6-10 ఎరుపు, నీలం కలిసిన రంగు గల పూలను కలిగి ఉంటుంది. పూమొగ్గలు గద ఆకారంలో ఉంటాయి. కాయలు గోధుమ రంగులో 15-30 సెం.మీ. పొడవు, 1.5-2.5 సెం.మీ. వెడల్పు కలిగి ఉంటాయి. కాయలో 10-15 మెరిసే గోధుమ రంగు గింజలు ఏర్పడతాయి..
సాధారణ నామం : పర్పుల్ బాహినియా/ఆర్కిడ్ ట్రీ / బటర్‌ఫ్లెå ట్రీ శాస్త్రీయ నామం : బాహినియా పర్పురియా కుటుంబం: ఫాబేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
దేవకాంచనం అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. దీని కషాయం అల్సర్లను నివారిస్తుంది. గాయాలు, దెబ్బలను నయం చేస్తుంది. బొబ్బలు, వ్రణాలను నయం చేయడానికి ఆకులను నూరి తయారు చేసిన పేస్టుని పూస్తారు.
కీళ్ళనొప్పులు, వాపులు తగ్గడానికి ఉపయోగిస్తారు. ఆస్త్మా, జలుబు, దగ్గులను తగ్గించడానికి ఉపయోగిస్తారు. వ్యాధులు, జలోదరం వంటి జబ్బులను నయం చేయడానికి సహాయ పడుతుంది. యాంటిక్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంది. దేవకాంచనం బెరడుని డయేరియా చికిత్సలో ఉపయోగిస్తారు. పూమొగ్గలను డిసెంట్రి, మొలల చికిత్సలో ఉపయోగిస్తారు.
ఇది మహిళలకు మంచి ఔషధం. బహిష్టు సమయంలో అధిక రక్త స్రావాన్ని ఆపుతుంది. జంతువుల గాట్లకు మంచి మందు. వాయు రోగాన్ని తగ్గించడానికి రోజుకి రెండుసార్లు 10 మి.లీ. వేరు కషాయాన్ని త్రాగాలి. డయేరియా నివారణకు రోజుకి రెండు సార్లు వేరు కషాయం త్రాగాలి.
అల్సర్ల నివారణకు బెరడు కషాయంతో కడగాలి. 5 మి.లీ పూల కషాయం రోజుకి రెండు సార్లు త్రాగితే విరేచనాలవుతాయి.
వ్యవసాయరంగంలో
దేవకాంచనం ఆకు మిథనాల్ ద్రావణం వరి ధాన్యం నిల్వలో ఆశించే సైటోఫిలస్ ఒరైజెని 75% చంపింది దీనిని రసాయన పురుగు మందుకి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు (డెర్బాలా, అతని అనుచరులు, 2012).
దేవకాంచనం మిథనాల్ ద్రావణం గోధుమ ధాన్యం నిల్వలో ఆశించే ట్రోగోడెర్మా గ్రానేరియం పురుగులను చంపడంలో అధిక సామర్థ్యతను ప్రదర్శించింది (డెర్బాలా, 2012).
దేవకాంచనం వేడి నీటి ద్రావణం మామిడి పండ్ల నిల్వ సమయంలో ఆశించే ఆంత్రాక్నోస్ తెగులుని సమర్ధవంతంగా నివారించింది (విచమ్ కోర్ప్రాడిట్‌స్కల్, 1991).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
ఇటుకల కిల్న్ అనేది ఇటుకలు లేదా రాళ్లతో శాశ్వతంగా నిర్మించే బయోచార్ తయారీ నిర్మాణం. ఒకేసారి ఎక్కువ పరిమాణంలో పంట అవశేషాలను బయోచార్‌గా మార్చేందుకు ఈ పద్ధతి అనువైనది. ముఖ్యంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, రైతు సమూహాలు, కస్టమ్ హైరింగ్ కేంద్రాలు మరియు గ్రామస్థాయి బయోచార్ ఉత్పత్తి కేంద్రాలు ఈ విధానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.
ముందుగా కిల్న్ అడుగు భాగంలో పొడి చెక్కలు లేదా చిన్న కొమ్మలను అమర్చి మంట వేయాలి. అనంతరం వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, పత్తి కట్టెలు లేదా ఇతర పొడి పంట అవశేషాలను పొరలుగా నింపాలి. పై పొర మండడం ప్రారంభమైన తర్వాత కిల్న్ లో గాలి ప్రవేశాన్ని క్రమంగా నియంత్రించాలి. దీంతో అవశేషాలు పూర్తిగా కాలిపోకుండా పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా బయోచార్‌గా మారతాయి.
అవశేషాలు ఎక్కువ భాగం నల్లని బయోచార్‌గా మారిన తర్వాత గాలి ప్రవేశాన్ని పూర్తిగా నిలిపివేసి కిల్న్ ను మూసివేయాలి. అనంతరం పూర్తిగా చల్లారిన తర్వాత బయోచార్‌ను బయటకు తీసి బూడిదను వేరుచేయాలి. అవసరమైతే బయోచార్‌ను చిన్న ముక్కలుగా చేసి కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి పొలంలో ఉపయోగించవచ్చు.
ఇటుకల కిల్న్ ద్వారా ఒకేసారి ఎక్కువ పరిమాణంలో నాణ్యమైన బయోచార్‌ను తయారు చేయవచ్చు. ప్రారంభ నిర్మాణ వ్యయం కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలం ఉపయోగించుకునే అవకాశం ఉండటం, ఉత్పత్తి వ్యయం తగ్గడం, పెద్ద ఎత్తున బయోచార్ తయారీకి అనువుగా ఉండటం వల్ల గ్రామీణ స్థాయిలో సామూహిక బయోచార్ ఉత్పత్తికి ఈ పద్ధతి ఉత్తమ ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతోంది.
మొదట కడిగిన బియ్యాన్ని ఉడకబెట్టి ఒక చెక్క పెట్టెలో వుంచి దాన్ని చెట్టు కింద నీడలో గుంత తీసి పూడ్చి పెట్టాలి. నాలుగు రోజుల తరువాత దానిని వెలికితీయాలి. దీనిని చో మెధడ్‌లో ఐయంఓ (ఇండీజినిస్ మైక్రో ఆర్గానిజమ్)గా వ్యవహరిస్తారు. ఇందులో బెల్లాన్ని కలిపితే ఐయంఓ తయారవుతుంది. దీన్ని నిలువ వుంచుకుని మొక్కలకు స్ప్రే చేయాలి. దీనివల్ల మొక్కకు అన్ని రకాలైన పోషకాలు అంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మొక్క జీవితకాలం కూడా పెరుగుతుంది.
గమనికః మొదటగా లీటర్ నీరు నిలువ వుంచడానికి లీటరున్నర పాత్రను తీసుకోవాలి. అపుడే బాక్టీరియా పాత్రలో ప్రవేశించడానికి అవకాశముంటుంది.
ఇది నేలసారాన్ని మెరుగుపరచి, ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను వృద్ధిచేస్తుంది. మొక్కలు బలంగా, ఆరోగ్యంగా పెరగటానికి సహాయపడుతుంది. సేంద్రియ మరియు సహజ వ్యవసాయానికి ఇది చాలా అనువైనది.
మోతాదు: ఎకరాకు 200 లీటర్లు సాగు నీరు ద్వారా గానీ, భూమిపైన గాని చల్లాలి.
కావలసిన పదార్థాలు : ఆవుపేడ: 10 కేజీలు; ఆవు నెయ్యి : 250 గ్రాములు; తేనె / నల్లబెల్లం : 500 గ్రాములు.
తయారు చేయు విధానం: ముందుగా ఆవుపేడ మట్టి కుండలో వేసి పావుకిలో ఆవునెయ్యి వేసి సుమారు 2 గంటలు బాగా కలిపి తర్వాత తేనె లేక బెల్లపు నీరు (అరకేజి బెల్లంకు అర లీటరు నీరు) పోసి 2 గంటలు ఆవుపేడను బాగా పిసుకుతూ కలపాలి. తర్వాత నీటిలో కళ్ళాపిలాజేసి 200 లీటర్ల డ్రమ్ములో పోసి డ్రమ్మునిండా నీరు పోస్తూ కలుపుతుండాలి. డ్రమ్ము నింపిన తర్వాత మిశ్రమాన్ని సుమారు 3 లేక 4 గంటలు కర్రతో త్రిప్పి ఆ తర్వాత ఎకరం పొలంలో కళ్ళాపిలా చిమ్మడం గాని లేక పారుతున్న నీటిలో పోస్తూ గాని భూమికివ్వాలి.
భారతీయ వ్యవసాయ రంగంలో నూతన ఒరవడులు సృష్టిస్తూ, మన రైతులు నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు తీస్తున్నారు.
మానవ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందించడంలో ఆకుకూరలు ప్రథమ స్థానంలో నిలుస్తాయి. విటమిన్లు, ఖనిజ మూలకాలు, పిండి పదార్థాలు, మాంసకృత్తులు మరియు పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆకుకూరలను నిత్యం 125 గ్రాముల చొప్పున తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. కాగా, మార్కెట్లో వీటికి ఉన్న నిరంతర డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, సరైన యాజమాన్య పద్ధతులతో సాగు చేపడితే ఆకుకూరల ద్వారా రైతులకు గరిష్ట లాభాలు లభిస్తాయి.”
ఆకుకూరలు తక్కువ కాలంలో (20-30 రోజులు) మరియు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే పంటలు. తోటకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూర వంటివి నేరుగా విత్తనాలు చల్లి అన్ని కాలాల్లోనూ (వారానికి/పదిహేను రోజులకు ఒకసారి విత్తనాలు వేసుకోవడం ద్వారా) విజయవంతంగా సాగు చేయవచ్చు.
గోంగూర సాగు: ఆకుకూరలన్నింటి కంటే గోంగూర రుచి ఎక్కువ. నీరు నిల్వ ఉండని తేలికపాటి గరప నేలలు, ఎర్ర నేలలు మరియు ఒండ్రు నేలలు గోంగూర సాగుకు చాలా అనుకూలం. ఇది ఏడాది పొడవునా సాగు చేసుకోవచ్చు. ఏఎన్‌జిఆర్ఏయూ1 ఇది ఎర్ర గోంగూర రకం. విత్తనాలు నాటిన 30 నుండి 35 రోజులకే పంట కోతకు వస్తుంది. నీటి వసతి కలిగిన భూముల్లో ఒక ఎకరానికి దాదాపు 4 – 6 టన్నుల దిగుబడిని పొందవచ్చు.
పాలకూర: పాలకూర మంచి పోషక విలువలు కలిగిన ఆకుకూర. లేత ఆకులను కాండంతో సహా కూరగా వాడుతారు. ఇందులో అధికంగా విటమిన్ ‘ఎ’, ‘సి’, కాల్షియం మరియు ఇనుము వున్నవి. తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో మంచి లాభాలను అందించే ఆకుకూర. అన్ని రకాల నేలల్లో సాగుచేయవచ్చు. కాని ఇసుకతో కూడిన ఎర్ర నేలల్లో అధిక దిగుబడినిస్తుంది. ఆల్ గ్రీన్, పూస, అర్క, అనుపమ, రకాలు అనుకూలం. ఎకరానికి 10 – 12 కిలోల విత్తనం అవసరం. మడుల్లో సాలుకు 10 – 20 సెం.మీ దూరం నాటుకోవాలి. 25 – 30 రోజుల్లో కోతకు వస్తుంది. ఆల్‌గ్రీన్ రకం ఆకులు, కాడలు ఆకుపచ్చ రంగులో వుంటాయి. ప్రతి 15-20 రోజులకొక కోత తీసుకోవచ్చు. ఎకరాకు 6-7 కోతలకు 5 టన్నుల దిగుబడి నిస్తుంది.
తోటకూర: తోటకూరను సాగు చేయడానికి ఇసుకతో కూడిన గరప నేలలు అనుకూలంగా ఉంటాయి. వివిధ శీతోష్ణస్థితుల్లో పెంచేందుకు తోటకూర చాలా అనువైంది. నీరు నిలిచే బంకమట్టి, ఇసుక నేలలు దీనికి పనికిరావు. జూన్ నుండి అక్టోబర్ వరకు జనవరి నుండి మే నెల మధ్య విత్తనాలు వేయాలి. అర్క వర్ణ, కో-1, కో-2, కో-3, కో-4, అర్కా సుగుణ వంటి రకాలు ఎంపిక చేయవచ్చు. ఎకరాకు 1 కిలో విత్తనం సరిపోతుంది. విత్తనం వెదజల్లితే ఎకరాకు 2 కిలోల విత్తనం కావాలి. విత్తేటప్పుడు పది రెట్లు ఇసుక కలిపి చల్లాలి. విత్తిన 25 రోజులకు కోత మొదలవుతుంది. మొదటి కోత తర్వాత ప్రతి పది రోజులకు కోత తీయవచ్చు. దిగుబడి 4 నుండి 5 టన్నులు వస్తుంది.
బచ్చలికూర : బచ్చలిని ఇండియన్ స్పినాచ్ లేదా మలబార్ స్పినాచ్ అని పిలుస్తారు. ఈ పంట భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో సాగవుతోంది. బచ్చలి కూర అధిక మోతాదులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఇనుమును సరఫరా చేస్తుంది. అంతేకాకుండా విటమిన్ ‘ఎ’, ‘సి’ లను కలిగి ఉంటుంది. లేత కాడలలో కూడా విటమిన్ ‘ఎ’ ఎక్కువగా ఉంటుంది. బచ్చలి కూరను అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. కాని అధిక దిగుబడి కోసం ఇసుకతో కూడిన గరప నేలలు చాలా అనుకూలమైనవి. ఎకరాకు 5 – 6 కిలోల విత్తనం అవసరం. వర్షాకాలంలో జూన్ నుండి జూలై వరకు నాటుకోవచ్చు. . దిగుబడి 4 నుండి 6 టన్నులు వస్తుంది.
చుక్క కూర: చుక్కకూరలో సమృద్ధిగా ఉండే పీచు పదార్థాలు (ఫైబర్), తిన్న ఆహారం త్వరగా మరియు సులభంగా జీర్ణమవడానికి ఎంతగానో తోడ్పడతాయి. ఏడాది పొడవునా దీన్ని సాగు చేయవచ్చు. నల్లరేగడి భూములు అనుకూలం. ఎకరాకు 6-8 కిలోల విత్తనం అవసరం. విత్తిన నెల తర్వాత కోత కోయవచ్చు. పంటకాలం 3 నుండి 4 నెలలు 20 నుండి 30 – 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.
కొత్తిమీర: కొత్తిమీర ఆకులతో పాటు విత్తనాల (ధనియాలు) ఉత్పత్తి కొరకు సాగయ్యే కొత్తిమీర, వంటల్లో సువాసనను, రుచిని పెంచడానికి అద్భుతంగా తోడ్పడుతుంది. పోషక విలువల పరంగా చూస్తే.. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, సుగంధ తైలాలు, పీచు పదార్థాలు మరియు విటమిన్-కె, ఎ, సి వంటి కీలక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపరిచే విశేష గుణాలు ఉండటం వల్ల, దీనిని జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలకు ఔషధంగానే కాకుండా వివిధ ఆయుర్వేద చికిత్సల్లోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. కొత్తిమీరను దాదాపు అన్ని రకాల నేలల్లోనూ సాగు చేయవచ్చు. అయితే, వర్షాధార పంటగా పండించేటప్పుడు మాత్రం మురుగునీటి పారుదల సౌకర్యం ఉన్న బంక నేలలు అత్యంత శ్రేష్ఠమైనవి. ఎకరాకు 8 నుండి 10 కిలోల విత్తనాలు అవసరం. సురుచి, సుగుణ, సాధన, సింధు ముఖ్యమైన రకాలు అందుబాటులో ఉంటాయి. విత్తిన నెలకే కోతకు వస్తుంది. ఎకరాకు 15 నుండి 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది.
పుదీన: పుదీనాను అటు ఆకుకూరగాను, ఇటు సుగంధ తైలం ఉత్పత్తి కొరకు విరివిగా సాగు చేస్తారు. మనదేశంలో జపనీస్ పుదీనాకు ఎక్కువ గిరాకీ ఉంది. దీని నుండి తీసే తైలాన్ని సుగంధ పాన్‌మసాలాల తయారీలోనే కాకుండా.. దగ్గు, జలుబు, నొప్పుల నివారణ ఔషధాలలోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. ఉష్ణ వాతావరణంలో బాగా పెరుగుతుంది. చలి, మంచు అనుకూలించవు. ఎర్రనేలలు మరియు నల్ల నేలలు అనుకూలం. జపాన్ పుదీన, కోసి, హిమాలయ, శివాలిక్ రకాలు అందుబాటులో ఉంటాయి. నాటిన నాలుగు నెలలకు కోత ఆరంభమవుతుంది. ఎకరానికి 12-16 టన్నులు దిగుబడి వస్తుంది.
మెంతి కూర: దీనిని ఆకుకూరగాను, గింజలను పచ్చళ్ళలోను ఉపయోగిస్తారు. సుగంధ ద్రవ్య పంటల్లో ఇదోకటి. ఈ పంట సాగుకు చల్లని వాతావరణం, తక్కువ ఉష్ణోగ్రత మరియు తగినంత తేమ అనుకూలం. వర్షాధారం కింద నల్లరేగడి నేలల్లో, నీటి వసతి కింద గరపనేలలు, ఎర్రనేలలు మరియు ఇతర లేతపాటి నేలల్లో సాగుకు అనుకూలం. విత్తనాల్లో గుజరాత్ మెంతి-1 రకం అనువైనది. ఎకరాకు 6 నుండి 10 కిలోల విత్తనాలు సరిపోతాయి. విత్తిన తర్వాత 25 నుండి 30 రోజుల్లో మొదటి కోత తీసుకోవచ్చు. పక్షం రోజులకొకసారి చొప్పున మూడు సార్లు కోత కోయవచ్చు. ఎకరానికి 4-5 టన్నులు దిగుబడి వస్తుంది.
బి. చంద్ర శేఖర్, నేల (మృత్తికా) శాస్త్ర అధ్యాపకులు, పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU). Ph: 8374275258
సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం వంటి సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో ఆధునిక క్రిమిసంహారకాలకు దీటైన లేదా పోల్చదగిన ప్రత్యామ్నాయాలు లభించకపోవటం ఒక ప్రధాన సమస్య. అయితే, చేప ద్రావణాలతో ఉద్యాన పంటల్లో చీడపీడల యాజమాన్యంలోనూ అద్భుత ఫలితాలు సాధించవచ్చని డా॥ గున్నంరెడ్డి శ్యామసుందర్‌రెడ్డి పరిశోధనలో తేలింది. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఆవరణలో ‘సస్యశ్యామల కృషివనం’ ప్రకృతి సేద్య పరిశోధనా క్షేత్రంలో ఆయన స్థిరపరచిన ‘మీనామృతం’, ‘మత్స్య సంజీవని’ మునగ పంటపై అద్భుతమైన ఫలితాలనిచ్చింది. చేప కషాయం, చేప అమైనో ఆమ్లాలు, చేప కునప జలం వంటివి కూడా వివిధ ఉద్యాన పంటల్లో చీడపీడల యాజమాన్యంలోను, పోషకాలను, వృద్ధి కారకాలను అందించడంలోను, భూసారాన్ని పెంపొందించడంలోను ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటున్నాయి.
మునగ పంటకు ఆకుచుట్టు పురుగు ఒక ప్రధానమైన సమస్య. సేంద్రియ పద్ధతిలో మునగ పండించే రైతులకు, మరీ ముఖ్యంగా ఎగుమతి కోసం మునగ ఆకు పండించే రైతులకు ఈ పురుగు సింహ స్వప్నంగా మారింది. తల్లి పురుగులు (సీతాకోకచిలుకల వంటివి) పెట్టిన గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు ఆకులపైన, లేత రెమ్మలపైన ఉన్న పత్రహరితాన్ని గోకి తినటం మొదలుపెడతాయి. లార్వాలు పెరుగుతున్న కొలదీ ఇతర భాగాలకు పాకుతూ ఆకులను, లేత చిగుళ్లను, పూమొగ్గలను తింటూ బతుకుతాయి. లేత పిందెలు, పెరుగుతున్న కాయల మీద ఉన్న పత్రహరితాన్ని కూడా గోకి తింటాయి. లార్వాలు మొక్క పైకి, కిందకీ చురుకుగా కదులుతూ కొత్తగా వస్తున్న చిగుళ్లను ఎప్పటికప్పుడు తినేస్తూ ఉండటం వలన మొక్క మోడులా మారిపోతుంది. లేత మునగ మొక్కలకు ఇది ఆశిస్తే ఆ మొక్కలను పూర్తిగా నాశనం చేస్తుంది. మీనామృతాన్ని ఐదు రోజులకొకసారి మూడుసార్లు పిచికారీ చేస్తే మునగ ఆకు చుట్టు పురుగు జాడ లేకుండా పోతుంది.
తయారీ పద్ధతి: మీనామృతం రెండు దశల్లో తయారవుతుంది. ఇందుకు మొత్తం 20 రోజులు పడుతుంది. సిద్ధమైన మీనామృతం 6 నెలలు నిల్వ ఉంటుంది. ఒక కిలో తాజా చేపలను చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. కిలో బెల్లాన్ని పొడి చేయాలి. ఈ రెంటినీ కలిపి అరగంట సేపు ఉంచాలి. చేపను ముక్కలు చేయక ముందే శుభ్రంగా కడగాలి. చేప ముక్కలను కడగకూడదు. చేప తోక, రెక్కలు, మొప్పలు వంటి సులభంగా కుళ్లని భాగాలను తీసివేయాలి. ఒక మట్టికుండలో 5 లీటర్ల దేశీ ఆవు మూత్రాన్ని తీసుకొని చేప ముక్కలు, బెల్లం మిశ్రమాన్ని అందులో వేయాలి. తరువాత కుండపై మూత ఉంచి శుభ్రమైన గుడ్డతో మూతి బిగించి కట్టాలి. ఎట్టి పరిస్థితిల్లోనూ ఈగలు, ఇతర కీటకాలు లోనికి వెళ్లే అవకాశం ఇవ్వకూడదు. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఒక పరిశుభ్రమైన తడి లేని కర్రతో ద్రావణాన్ని నిమిషం పాటు కలియబెడుతూ ఉండాలి. పది రోజుల తర్వాత ఈ ద్రావణాన్ని పింగాణీ జాడీ లేదా ప్లాస్టిక్ క్యానులోకి వడకట్టుకోవాలి.
అందులో ఒక లీటరు తాటికల్లు, 50 గ్రాముల దేశీ ఆవు నెయ్యి, 50 గ్రాముల తేనె వేసి మూతపెట్టి గుడ్డతో బిగుతుగా కట్టాలి. ఈ మిశ్రమాన్ని మరో పదిరోజుల పాటు ఉంచాలి. ఈసారి కలియబెట్టనవసరం లేదు. పది రోజుల తర్వాత ‘మీనామృతం’ పిచికారీకి సిద్ధమవుతుంది. మీనామృతాన్ని 6 నెలల వరకు నిల్వ ఉంచుకొని వాడుకోవచ్చు. కొద్ది లీటర్లయితే పింగాణి జాడీలలో నిల్వ ఉంచుకోవచ్చు. చాలా ఎక్కువ లీటర్లయితే ప్లాస్టిక్ క్యానులు లేదా డ్రమ్ముల్లో నిల్వ ఉంచుకోవచ్చు. గాలి చొరబడని క్యానుల్లో ఉంచినప్పుడు తరచుగా మూతను లేదా బిరడాను తీసి గాలిని బయటకు వదులుతూ ఉండాలి.
‘మీనామృతం’ 3సార్లు పిచికారీ చేయాలి మునగ చెట్టుపై పురుగును గమనించిన వెంటనే మీనామృతాన్ని పిచికారీ చేయడం ఉత్తమం. వంద లీటర్ల నీటికి 2.5 లీటర్ల నుంచి 5 లీటర్ల చొప్పున మీనామృతాన్ని కలిపి, చెట్టంతా తడిసేలా పిచికారీ చేయాలి. 5 రోజుల వ్యవధితో మరో రెండుసార్లు పిచికారీ చేస్తే మునగ ఆకు చుట్టు పురుగు జాడ లేకుండా పోతుంది. మరింత మెరుగైన ఫలితాల కోసం మీనామృతంతో పాటు వేపనూనె (1500 పీపీఎం) లీటరు నీటికి 3 మిల్లీ లీటర్లు చొప్పున లేదా 10 శాతం లొట్టపీచు’ (తూటాకు) కషాయం లీటరు నీటికి 50 మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయవచ్చు.
‘మీనామృతం’ వల్ల ఇతర ప్రయోజనాలివే… మీనామృతం స్థూల, సూక్ష్మ ధాతు లోపాలను సమర్థవంతంగా నివారిస్తుంది. పందిరి కూరగాయలు, పచ్చ, దోస, దానిమ్మ వంటి ఉద్యాన పంటల్లో ఆడపూల నిష్పత్తిని గణనీయంగా పెంచుతుంది. మొక్కల్లో రోగనిరోధక శక్తిని వృద్ధిపరచి, ఆకుమచ్చ, కాయకుళ్లు తెగుళ్లను నిరోధిస్తుంది. రసం పీల్చే పురుగులు, లార్వాల తొలి దశలను నాశనం చేస్తుంది. కూరగాయలు, పండ్ల నాణ్యతను, పోషక విలువలను పెంచుతుంది.
సాధారణ నామం : స్పాటెడ్అలో శాస్త్రీయ నామం : అలో జెబ్రినా కుటుంబం: ఆస్ఫోడిలేసి
అలో జెబ్రినా చిన్న, దట్టమైన, నీటిని నిల్వ ఉంచుకునే భాగాలున్న ఆకులు కలిగిన మొక్క. ఈ మొక్కలు నీటిని కాండాలు, ఆకులు, వేర్లలో నిల్వ ఉంచుకుని వర్షాభావ పరిస్థితులలో నీటి ఎద్దడిని తట్టుకుంటాయి. ఆకులు దట్టంగా గుబురుగా ఏర్పడి సాధారణంగా ఆకుపచ్చ రంగులో పెద్ద అండాకారపు తెల్లటి మచ్చలు కలిగి ఉంటాయి. ఆకుల అంచులు బలమైన గోధుమ రంగు మొనలు గల ముళ్ళు కలిగి ఉంటాయి. ఆకుల చివర్లు ముదురు ఎరుపు నుండి గోధుమ రంగు కలిగి ఉంటాయి. పూలు లేత ఎరుపు రంగులో గొట్టపు ఆకారంలో వుంటాయి.
ఉపయోగాలు : ఔషధరంగంలో …
బోట్స్వానాలో దీనిని బుట్టల తయారీలో ఉపయోగిస్తారు.
అంగోలాలో కునీన్ నది పొడవునా ఉన్న ప్రజలు అలో జెబ్రినా పూలను ఉడికించి కేకులు తయారు చేస్తారు.
మహిళలు ప్రసవం తరువాత కాండం, ఆకు మొదళ్ళ పొడిని లోపలికి తీసుకుంటారు. దీని రసాన్ని గాయాలను మాన్పడానికి, చర్మ సమస్యలకు, నులి పురుగుల నివారణకు ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో
ప్రత్తి పంటలో నష్టాలు కలిగించే పేనుబంక, ఎఫిస్ గాసిపిని అలో జెబ్రినా 20% ద్రావణం వికర్షక, కాంటాక్ట్ చర్యలతో సమర్ధవంతంగా అరికట్టింది (రంగరిరాజ్, అతని అనుచరులు, 2016). ఆకు ద్రావణం తయారు చేయడానికి ఆకులను సేకరించి 80 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఓవెన్‌లో 5 రోజులు ఆరబెట్టాలి. తర్వాత ఆరిన ఆకులను రోటిలో వేసి బండతో దంచాలి. మెత్తగా దంచిన పొడిని 1000 మి.లీ. బీకర్లో వేయాలి. ఈ పొడిని గాలి చొరబడని జార్‌లో నిల్వ చేయాలి. 400 గ్రా. పొడిని 3 లీ. గాజు ఫ్లాస్క్‌లో తీసుకుని 2 లీ. డిస్టిల్డ్ వాటర్ కలపాలి. ఈ ద్రావణాన్ని చేతిలో 1 గంట సేపు కుదుపుతూ, తర్వాత 24 గంటలుంచాలి. 24 గంటల తర్వాత ద్రావణాన్ని గుడ్డతో వడపోసి తర్వాత వాట్‌మన్ నెం. 24 ఫిల్టర్ పేపర్‌తో వడపోయాలి. ఈ ద్రావణాన్ని 2 లీ. కోనికల్ ఫ్లాస్క్‌లో సేకరించాలి. 20% ద్రావణం తయారు చేయడానికి 200 మి.లీ. స్టాకు ద్రావణాన్ని 800 మి.లీ. శుభ్రమైన నీటికి కలపాలి.
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి
కలబంద ఒక గుత్తి వలే పత్రాలు వచ్చే బహువార్షిక మొక్క. దాదాపు 60 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకులు జిగటగా ఉన్న గుజ్ౙు కలిగి, అంచులకు ముండ్ల వంటి దంతాలుంటాయి. ఆకులు 50 సెం.మీ. వరకు పెరిగి చాకుల వలె ఉంటాయి. పూవులు నారింజ పసుపు రంగులో ఒక మీటరు పొడవు గల కాడపై గొట్టాల వలే వ్రేలాడబడి ఉంటాయి. ఈ మొక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యాన వనాలలోను, పొలంగట్ల పైన పెంచబడుతుంది. ఇది వేరు పిలకల ద్వారా వ్యాప్తి చెందుతుంది.
సాధారణ నామం : ఇండియన్ అలో / బార్బడోనఅలో / ఘికుమార్/ఘ్రిత్‌కుమారి శాస్త్రీయ నామం: అలో బార్బడెన్స్ / అలో విర కుటుంబం: లిలియేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
ఆకులు, ఆకులలో వుండే గుజ్జు, పసుపు రంగు ద్రవం (మూసాంబ్రం) కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.
వీటిలో ఆంత్రాక్వినోన్లు (అలాయిన్, అలోఎమోడిన్), రెసిన్లు, టానిన్లు, పాలిశాకరైడ్లు, మొదలైన రసాయన పదార్థాలుంటాయి. కలబంద ఆకు చలవ చేస్తుంది. నేత్ర రోగాల చికిత్సలో దీనిని ఉపయోగిస్తారు.
దీని నుండి తీసిన గుజ్ౙుని మరియు పసుపు రంగు ద్రవాన్ని ఎండబెడితే మూసాంబ్రం అనే పదార్థం తయారవుతుంది. ఇది నొప్పులను, వాపులను, కుష్టువ్యాధి, మూలశంక, మానసిక వ్యాధులు, చర్మవ్యాధులు, కాలేయ వ్యాధులు, ఋతుసంబంధ వ్యాధుల చికిత్సకు, రక్తవిరేచనాలు అరికట్టడానికి ఉపయోగపడుతుంది.
తెగిన గాయాలకు, వడదెబ్బకి ప్రాధమిక చికిత్సగా బాగా పనిచేస్తుంది. కలబంద ఆకులలో ఉండే గుజ్ౙు సౌందర్య సాధనాల తయారీలో ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
చంటి పిల్లల కడుపులో క్రిముల నివారణకు, విరేచనకారిగా కూడా ఉపయోగపడుతుంది.
వ్యవసాయరంగంలో
కలబంద చెదల వికర్షకంగా పని చేస్తుంది. కలబంద నీటి ద్రావణం చెదలను వికర్షిస్తుంది.
కలబందలో సహజ అలాయిన్ అనే రసాయనముంది. అందువలన కలబందను ఎటువంటి పురుగులు, తెగుళ్ళు ఆశించవు (పంత్, 2016). దీనిని జీవ ఎరువుగా కూడా ఉపయోగించవచ్చు.
కలబంద ద్రావణంలోని అలోయిన్ ఎ (0.02%) మొక్కజొన్న గింజల నిల్వ సమయంలో ఆశించే సైటోఫిలస్ ఒరైజెపై బలమైన వికర్షక చర్యను ప్రదర్శించింది (మల్లావధాని, అతని అనుచరులు, 2016).
కలబంద ఒక శక్తివంతమైన మొక్కల పెరుగుదల కారకం. కలబంద బయట పొరలో ఆంత్రాక్వినోన్ గ్లైకోసైడ్ మిశ్రమాలు “అలాయిన్స” వుంటాయి. అలాయిన్ వాల్లబీస్, కంగారూలు, ఎలుకలు, పంటలను తినకుండా వికర్షిస్తుంది.
కలబంద ద్రావణం వగరు రుచి కలిగి ఉండటం వలన పురుగులను వికర్షిస్తుంది కాని చంపదు (మెలెస్, అతని అనుచరులు, 2012).
కలబంద గుజ్ౙు (జెల్) డ్రెష్లరా హవాయిఎన్సిస్, ఆల్టర్టేరియా ఆల్టర్నేట శిలీంద్రపెరుగుదలను పూర్తిగా అరికడుతుంది (సితార, ఆమె అనుచరులు, 2011).
4 కి. కలబంద { 500 మి.లీ. వేపనూనె { 500 మి.లీ. పొగాకు పొడి కషాయం 20 లీ. నీటికి కలిపి 3 నుండి 4 గంటలు మరగబెట్టాలి. కుండలో నీరు 5 లీ. మిగిలినపుడు చల్లార్చి, వడపోయాలి. ఈ కషాయాన్ని ప్రత్తి, బెండ మొదలగు పంటలపై పిచికారి చేసి పొగాకులద్దె పురుగు, శనగపచ్చ పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు. ఈ జీవ పురుగు మందుకి “నీకుంచి (వేప{కలబంద{పొగాకు పొడి డికాక్షన్)” అని పేరు పెట్టారు. 100 నుండి 150 మి.లీ. కషాయాన్ని 15 లీ. నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. 10 రోజుల తర్వాత ఇంకొకసారి పిచికారి చేయాలి. (రజనీకాంత్ భాయ్ పటేల్, గుజరాత్ రైతు, 2001).
అలో ఫెరాక్స్‌ని పంటల చుట్టూ జీవకంచెగా నాటితే పంటలనాశించే పురుగులను వికర్షిస్తుంది.
అలో మార్లోతి ఆకుబూడిద (5%)ని మొక్కజొన్న లేదా అలసంద గింజలపై చల్లి నిల్వ సమయంలో ఆశించే పురుగులను వికర్షింపవచ్చు.
5 కి. కలబందను ముక్కలుగా చేసి 1 కి. పొగాకు పొడి కలిపి 3 లీ. నీటిలో కలిపి మరిగించి చల్లార్చి, వడపోసి 2 లీ. పుల్లటి మజ్ౙిగ కలిపి 100 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఇది జీవ పురుగు వికర్షిణిగా పనిచేస్తుంది.
వేపనూనె నీటిలో కరగడానికి 12 చెంచాల పొటాషియం సిలికేట్ ద్రావణం కలపాలి. ఈ మిశ్రమాన్ని వారానికొకసారి పిచికారి చేసి పురుగులను నివారించవచ్చు. వారం వారం ఎసెన్షియల్ మార్చి వాడాలి.
ఐ.పి.యం. రెసిపి2 :
4.5లీ. నీటిలో 2 చెంచాల కలబంద గుజ్ౙు కలిపి 24 గంటలుంచాలి. తర్వాత వడపోసి పిచికారి చేయాలి.
ఈ రెసిపీలలో నీటికి బదులు ‘బొటానికల్ టీ’ని కూడా ఉపయోగించవచ్చు. ఈ టీని తయారు చేయడానికి లావెండర్, స్పియర్‌మింట్, పెప్పర్‌మింట్, ఒరిగానో, థైమ్, బోరేజ్, కామ్‌ఫ్రీ, యారో తాజా ఆకులను (2 కప్పులు) నూరి లీ. నీటిలో కలిపి 23 రోజులుంచాలి. మధ్యమధ్య ఈ ద్రావణాన్ని కలుపుతుండాలి. తర్వాత వడపోసి పై రెసిపిలను తయారు చేయడానికి నీటికి బదులు దీనిని ఉపయోగించాలి.
పురుగులు, తెగుళ్ళ నివారణకు కలబందనుపయోగించి హెర్బల్ టీ తయారు చేసి ఉపయోగించవచ్చు.
తయారీకి కావలసిన పదార్థాలు : 200 లీ. ప్లాస్టిక్ డ్రమ;్ గ్రైండర్ / చాపర్, రోలు, పత్రం; స్ట్రెనర్ / స్క్రీన్ / గుడ్డ; కొయ్యకర్ర; తాజా శుభ్రమైన నీరు;
మొక్కల పదార్థాలు : 10 కి. అల్లం, 5 కి. వెల్లుల్లి, 5 కి. కలబంద, 10 కి. మిర్చి, 30 కి. వేపఆకులు, 30 కి. కోకోఆకులు, 5 కి. డెర్రిస్, 5 కి. మకాబుహే, కీటకనాశన, శిలీంద్రనాశక వికర్షణ లక్షణాలున్న ఇతర మొక్కలు. పైన పేర్కొన్న ఆకులను విడివిడిగా నూరాలి.
తయారు చేసే విధానం : నూరిన ఆకులను ప్లాస్టిక్ డ్రమ్ములో వేయాలి. డ్రమ్ములో నీరు నింపాలి. డ్రమ్ములోని పదార్థాలన్నింటినీ కర్రతో కలియత్రిప్పాలి.
హెర్బల్‌టీ తయారవడానికి ఒకరోజు నిల్వఉంచాలి. డ్రమ్‌లోని హెర్బల్ టీని వడపోయాలి. హెర్బల్‌టీకి సమానంగా నీరు కలపాలి. స్ప్రేయర్‌లో నింపి పంటపై పిచికారి చేయాలి. మొక్కలపైన పిచికారి చేయాలి. మొక్కల మొదళ్ళలో డ్రెంచింగ్ చేయాలి. అవసరాన్ని బట్టి 3 లేదా 7 రోజుల కొకసారి మొక్కలపై పిచికారి చేయాలి. క్యాబేజిలో డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లాని వేపగింజ పప్పు (నీమ్ సీడ్‌కెర్నల్) + కలబంద+జిల్లేడు+క్లీరోడెండ్రాన్ ఆకు ద్రావణం మరియు వేపకాయలు+ ఎర్రమిరప+సీతాఫలం ఆకు ద్రావణం సమర్థవంతంగా నివారించాయి. (చంద్రశేఖరయ్య అండ్ సన్నవీరప్పనవర్, 2013).
ప్రత్తి, చామంతి పంటలలో పురుగుల నివారణకు కానుగ{కలబంద{వేప ద్రావణం పిచికారి చేయాలి. దీని తయారీకి 1కి. కానుగ చెక్కపొడి, 1 కి. వేప చెక్క పొడి, 250 గ్రా. విషముష్టి గింజలను ఒక మస్లిన్ సంచిలో వేసి ఒక రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మర్నాడు ఉదయం సంచిని పిండి రసాన్ని సేకరించాలి. దీనిని అరలీటరు కలబంద ఆకు రసంతో కలపాలి. దీనికి 15 లీ. నీరు కలపాలి. దీనిని మరలా 23 లీ. ఆవుమూత్రంతో కలపాలి. పిచికారి చేసేముందు 1 లీ. మిశ్రమాన్ని 10 లీ. నీటిలో కలపాలి. ఎకరానికి 60-100 లీ. పిచికారి ద్రావణాన్ని ఉపయోగించాలి (శాయికట్‌మన్నా)
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి