దూడలలో అంతరపరాన్నజీవులు(INTERNAL PARASITES)

సమస్య:
దూడ శుష్కించి పోవటం
మలబద్ధకం లేదా పారటం
పేడ వాసనతో వుండటం
పొట్ట జారటం, బాన పొట్ట
గడ్డం క్రింద నీరు చేరటం
పళ్ళు నూరటం
మట్టి తినటం
వెంట్రుకలు బిరుసెక్కటం
కళ్ళ వెంట నీరు కారటం
నోరు తెరచి, నాలుకను అటూ యిటూ తిప్పటం
బక్కచిక్కిపోవటం
తోకను దేనికైనా వేసి రుద్దటం
ఆకలి ఎక్కువ.
కడుపునొప్పి
పొట్టను కాళ్ళతో తన్నుకోవటం
నీరసం
వెంట్రుకలు మెలికలు తిరగటం

కారణాలు:
ఏటికపాముల (ASCARIASIS) బెడద
బద్దె పురుగుల (TAPE WORMS) భారం
రక్త విరేచనాలు (COCCIDIOSIS)
ఏకకణ పరాన్నజీవి (CRYPTOSPORIDIOSIS)

పశువైద్యుని సంప్రదించాలి.
పేడ పరీక్షించి, వ్యాధి నిర్ధారణ చేయటం మేలు

పరిష్కారాలు:
ఆయుర్వేదం: క్రింది వాటిలో ఏదైనా ఒక విధానం.

గృహవైద్యం:

  1. చింత పండు పులుసు 10 గ్రా॥ + ఉప్పు 10 గ్రా॥ + ఇంగువ 1 గ్రాము కలిపి త్రాగించాలి.
  2. బొప్పాయి గింజలు 10 గ్రా॥ నూరి 10 మి.లీ నీళ్ళలో కలిపి త్రాగించాలి.

పెరటివైద్యం:

  1. గాడిదగడపాకు 10 గ్రా॥ + ఉప్పు 10 గ్రా॥ + చింత పండు 10 గ్రా॥ కలిపి, నూరి తినిపించాలి.
  2. నేలవేము 20 గ్రా॥, శొంరి 10 గ్రా॥, ఉప్పు 5 గ్రా॥, అన్నభేది 1 గ్రా॥ కలిపి గానీ, కలబంద గుజ్జు 50 గ్రా॥, పసుపు 5 గ్రాములు కలిపి నూరి గానీ తినిపించాలి.
  3. కుప్పింటాకు లేదా దుష్టుపాకు లేదా నేలవేము లేదా అరటి వేళ్ళ రసం 20 మి.లీ., ఉప్పు 10 గ్రాములు + పసుపు 5 గ్రాములు కలిపి త్రాగించాలి.
  4. దూడ పుట్టిన 8వ రోజు, 20వ రోజు, 30వ రోజు, ఆపైన నెలకి 1 పర్యాయం బూడిద గుమ్మడికాయ రసం 30 మి.లీ. వరుసగా 3 రోజులు త్రాగించాలి.

ఓషధులు:

  1. వేపాకు బాగా నూరి 15 గ్రా॥ తినిపించవచ్చు.
  2. పాల చెక్క పొడి 5 గ్రా॥, 200 మి.లీ. నీళ్ళలో కలిపి త్రాగించాలి.

మూలికావైద్యం:

  1. వాయు విడంగాలు 5 గ్రా॥, ముసాంబరం 1 గ్రా॥, త్రిఫల చూర్ణం 5 గ్రా॥ కలిపి పొడిచేసి మజ్జిగలో కలిపి త్రాగించాలి.
  2. మోదుగ గింజల పొడి 5 గ్రా॥, అరకేజీ తవుడులో కలిపి 2,3 రోజులు తినిపించాలి.

హోమియో:

  1. దూడ పుట్టిన 8వ రోజు, 20వ రోజు, 30వ రోజు, ఆ పైన నెలకు ఒక పర్యాయం చొప్పున సిన 200 గానీ, సబడిల్ల 200 గానీ, సాంటోనినం 200 గానీ, నేట్రం ఫాస్ 30 గానీ ఏదో ఒక మందు 5 మాత్రలు చొప్పున 2 రోజులు తినిపించాలి.
  2. కొంకి పురుగులు పోవటానికి, చెనొపోడియం 30 మందు లేదా థైమాల్ 30 మందు 10 మాత్రలు చొప్పున రోజుకు 2 పర్యాయాలు చొప్పున 5 రోజులు తినిపించాలి.
    ……………………………………………………………………………………
    రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.
Read More

గోసంరక్షణకు తెలంగాణా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది

తెలంగాణా రాష్ట్రంలో గోసంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు అమలు చేస్తోందని ఇప్పటికే ప్రణాళికలు రూపొందించిందని, సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి, పీపుల్ ఫర్ యానిమల్స్ వ్యవస్థాపకురాలు మేనకాగాంధీ ఆదివారం శాసనమండలి హాలులో రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ కె. రామకృష్ణారావు, జీహెచఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిధిలో వీధికుక్కల స్టెరిలైజేషన్, నిర్వహణ, గోసంరక్షణ చర్యలను మేనకాగాంధీకి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అత్యాధునిక సౌకర్యాలతో ఎన్కపల్లిలో గోశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Read More