రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల
తెలంగాణలో 45,11,947 మంది రైతుల ఖాతాల్లో రూ.2206 కోట్లు రైతు భరోసా రెండో విడత కింద మంగళవారం జమయ్యాయి. గత నెల 23న సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా మొదటి విడతలో ఎకరం వరకు భూమి ఉన్న 68,89,955 మందికి, తాజాగా సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూర్పల్లిలో సీఎం రెండో విడతలో రెండు ఎకరాల వరకు భరోసా నిధులను విడుదల చేశారు. గత రెండు విడతల్లో కలిపి ఇప్పటివరకు రైతు భరోసా కోసం రూ.5,653 కోట్లు విడుదల కాగా మొత్తం 71.06 లక్షల మంది రైతులు లబ్ది పొందారని మంత్రి వివరించారు. రైతు భరోసాలో ఇప్పటివరకు నల్గొండ జిల్లాలో 5,40,693 మంది రైతులకు రూ.448.09 కోట్లు, ఖమ్మం జిల్లాలో 3,45,142 మందికి రూ. 271.52 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 3,66,343 మందికి రూ.271.05 కోట్లు, సిద్దిపేట జిల్లాలో 3,28,818 మందికి రూ.246.30 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 2,98,352 మందికి రూ.236.49 కోట్లు జమయ్యాయి.










