ఔషధ మొక్క… పునర్నవ
సాధారణ నామం : ఎర్రగలిజేరు శాస్త్రీయ నామం : బోయెర్హేలియా డిఫ్యూసా కుటుంబం: నిక్టాజినేసి
ప్రాకే కొమ్మలు ఎరుపు రంగులో ఉంటాయి. ఆకులు అసమానంగా ఉంటాయి. అండాకారంలో ఉండి అంచులు ఎగుడుదిగుడుగా ఉంటాయి. ఆకుకాడ 1 సెం.మీ. పొడవుంటుంది. పూలు 4 సెం.మీ. పొడవుండి, 4-10 పూవులు కలసి ఉంటాయి. కాప్సూల్ 3þ1 మి.మీ. పరిమాణంలో గద ఆకారంలో ఉంటుంది.

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
- పురాతన కాలం నుండి పునర్నవను ఎపిలెప్పి, హిస్టీరియా, గాస్ట్రెåటిస్, జాండిస్, జ్వరం, ఆస్త్మా, డిసెంట్రి, డయేరియా వంటి సమస్యలను నివారించడానికి ఉపయోగిస్తున్నారు. మూత్రనాళం ఆరోగ్యాన్ని నిర్వహిస్తుంది. కాలేయం బాగా పనిచేయడానికి సహాయపడుతుంది.
- శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరం నుండి ద్రవాలను బయటకు పంపడానికి, శరీర సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. శరీర బరువు తగ్గించడానికి, సహజ యాజమాన్య పద్ధతిలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మూత్రవర్ధకం. జీర్ణకోశ సమస్యలను నివారిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారం, ఆకుకూరగా ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …
- అనేక అతిధి మొక్కలలో పునర్నవ ద్రావణం గ్లెåకోప్రోటీన్ని పిచికారి చేసినపుడు యాంటివైరల్ కారకాలు ఉత్పత్తి అయ్యాయి (అవస్థి, అతని అనుచరులు, 2013).
- పరిపక్వత చెందిన మొక్కల ఎండబెట్టిన వేర్ల ద్రావణం లేదా దాని నుండి వేరు చేసిన గ్లెåకోప్రోటీన్ని పిచికారి చేసినపుడు పొగాకులో టొబాకో మొజాయిక్ వైరస్, టమాటలో కుకుంబర్ మొజాయిక్ వైరస్, టాబాకోమొజాయిక్ వైరస్లు, మెలన్లో కుకుంబర్ గ్రీన్మాటిల్ వైరస్, జనుములో సన్హెంప్ రొసెట్టెవైరస్, గాంఫ్రెనాగాబోసాలో గ్రాంఫెనా మొజాయిక్ వైరస్ ఆశించడాన్ని నివారించింది (అవస్థి, అతని అనుచరులు, 1984).
- రెండు ఔషధ మొక్కలు పునర్నవ, సెంటెల్లా ఏసియాటిక కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ లార్వా దశలను, పెద్ద పురుగులను సమర్ధవంతంగా నివారించాయి. ఈ రెండు మొక్కల గ్రాన్యూల్ పార్ములేషన్లు తయారు చేసి పరీక్షించినపుడు పురుగు లార్వాలను, పెద్ద పురుగులను గణనీయంగా చంపాయి. ఈ పురుగులని ఈ రెండు మొక్కలు సమర్ధవంతంగా నివారించగలవని రుజువైంది (బిందు, ఆమె అనుచరులు, 2016).
- మొక్కల ఆకు పొడిని తయారు చేసే విధానం : పునర్నవ, సెంటెల్లా ఏసియాటిక ఆకులను డిస్టిల్డ్ వాటర్లో బాగా కడిగి ఆకులను నీడలో ఆరబెట్టి గ్రైండర్లో వేసి విడివిడిగా పొడిచేయాలి. దీనిని జల్లించి మెత్తని పొడిని గాజు పాత్రలలో నిల్వ చేయాలి.
- గ్రాన్యులార్ ఫార్ములేషన్ తయారీ : మొక్కల ఆకుల పొడి, నూనె చెక్క, పొడి బరువు తూయాలి. డిస్టిల్డ్ వాటర్ కలిపి నూనె చెక్కపొడిని రెండు మొక్కల ఆకుల పొడులతో విడివిడిగా కలిపి గ్యాన్యూల్స్ రూపంలో ఫార్ములేషన్ తయారు చేయాలి. 15%, 20%, 25%, 30%, 35%, గ్రాన్యూల్ ఫార్ములేషన్లను (1.5 గ్రా, 2.0 గ్రా., 2.5 గ్రా., 3.0 గ్రా., 3.5 గ్రా. ఆకు పొడిని 8.5 గ్రా., 8.0 గ్రా., 7.5 గ్రా., 7.0. గ్రా., 6.5 గ్రా., నూనె చెక్కపొడితో కలిపి రెండు మొక్కల ఫార్ములేషన్లు) తయారు చేయాలి.
- పునర్నవ మొక్కను ఇంటిలో వ్రేలాడదీస్తే పేలు వికర్షించపబడతాయి (డెల్ౙీల్, 1861).
- పునర్నవ మొత్తం మొక్క ద్రావణం టమాట బాక్టీరియల్విల్ట్ కారకం రాల్స్టోనియా సొలనేసియారంపై యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది (తువు, అతని అనుచరులు, 2017).
- పునర్నవ కషాయం వైరస్ నివారిణిగా టమాట ఆకు ముడత వైరస్, టమాట మొజాయిక్ వైరస్, పొటాటో వైరస్, వంగ మొజాయిక్, టమాట యెల్లో మొజాయిక్ వైరస్, పెసర యెల్లో మొజాయిక్ వైరస్, బీన్ కామన్ మొజాయిక్ వైరస్లను నివారిస్తుంది.
- 5 శాతం పునర్నవ వేరు కషాయం క్షేత్రస్థాయిలో బెండ ఎల్లోవీన్ మొజాయిక్ వైరస్ని మొక్క దశ నుండి వారం రోజుల వ్యవధిలో పిచికారి చేయడం ద్వారా నివారించింది.
- పంటలను అన్ని రకాల వైరస్, బాక్టీరియా తెగుళ్ళ నుండి పునర్నవ కషాయం కాపాడుతుంది.
5% పునర్నవ కషాయం తయారు చేసే పద్ధతి :
- 5 కి. పునర్నవ వేర్లు, కాడలు, ఆకులను 10 లీ. నీటిలో వేసి అరగంట నుండి గంటసేపు బాగా ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన కషాయం 5 లీ. వరకు ఉంటుంది. దీనిని బాగా చల్లార్చి, వడపోసి 100 గ్రా. సబ్బు పొడి లేదా కుంకుడు కాయల రసం కలిపి తర్వాత 100 లీ. నీటిలో కలిపి ఎకరా పొలంలోని పంటపై పిచికారి చేయాలి.
- ఎర్రగలిజేరు వేరు నీటి ద్రావణం పిచికారి పెసర, మినుము పంటలనాశించే మూంగ్బీన్ ఎల్లోమొజాయిక్ వైరస్, బీన్కామన్ మొజాయిక్ వైరస్ ఆశించచడాన్ని క్షేత్ర పరిస్థితులలో తగ్గించి గింజ దిగుబడులను పెంచింది (సింగ్, 2002, సింగ్ అండ్ అవస్థి, 2002).
- దోస జాతి పంటలలో వారానికొకసారి ఎర్రగలిజేరు వేరు ద్రావణం పిచికారి చేసి, కుకుంబర్ మొజాయిక్ వైరస్, బాటిల్గార్డ్ మొజాయిక్ వైరస్, కుకుంబర్ గ్రీన్ మాటిల్మొజాయిక్ వైరస్, పంప్కిన్ మొజాయిక్ వైరస్లు ఆశించడం, వృద్ధి చెందడం, వ్యాప్తి చెందడాన్ని గణనీయంగా అరికట్టారు (అవస్థి అండ్ కుమార్ 2003 ఎ, 2003 బి, కుమార్ అండ్ అవస్థి, 2003ఎ, 2003బి).
- కుకుంబర్ మొజాయిక్ తెగులు ఆశించడం, వ్యాపించడం ఎర్రగలిజేరు వేరు ద్రావణం పిచికారి ద్వారా అరికట్టబడింది (కుమార్ అండ్ అవస్థి, 2008).
- టమాట పంటలో ఎర్రగలిజేరు వేరు ద్రావణంతో విత్తనశుద్ధి, పంటపై పిచికారి చేయడం ద్వారా వైరస్ తెగుళ్ళను నివారించారు (అవస్థి అండ్ యాదవ్, యాదవ్, అతని అనుచరులు)
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

