ఔషధ మొక్క… భూతావాసము / బెల్లగడ
బెల్లంగడ నిటారుగా పెరిగే ఒక బహువార్షిక లేదా కొద్ది కాలం జీవించే బహువార్షిక మొక్క. ఆకులు ఒక దాని తర్వాత ఒకటి ఏర్పడతాయి. క్రమాకారం లేని పళ్ళు కలిగి ఉంటాయి. పూలు చిన్నవిగా, ఆకుపచ్చ రంగులో పొడవుగా, మందంగా, గుత్తులుగా ఏర్పడతాయి. కాయలు చిన్నవిగా, ఆకుపచ్చ రంగులో, నల్లని గింజలు కలిగి ఉంటాయి.
సాధారణ నామం : వర్మ్సీడ్/మెక్సికన్ టీ శాస్త్రీయ నామం : డిస్ఫానియా కినోపోడియం / ఆంబ్రాసియా యీడెస్ కుటుంబం: అమరాంథేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
- ఈ మొక్కని ఔషధ ప్రయోజనాలకు విస్తృతంగా ఉపయోగిస్తారు. కడుపులోని నులిపురుగులను చంపడానికి ఉపయోగపడుతుంది. వీటిని నివారించడానికి ఈ మొక్క కషాయం తాగుతారు. కడుపులోని గ్యాస్‌ని నివారించడానికి ఉపయోగిస్తారు. దీనిని పానీయం రూపంలో సేవిస్తారు.
- ఆకుల నుండి తీసిన నూనెను మహిళలు బహిష్టు సమయంలో కలిగే నొప్పుల నివారణకు ఉపయోగిస్తారు. సబ్బులు, క్రీములు, లోషన్లు, సెంట్ల తయారీలో ఉపయోగిస్తారు. ఈ మొక్క శిలీంద్రనాశక లక్షణాలను కూడా కలిగి ఉంది. దీని నూనెని మలేరియా, కోరియా, హిస్టీరియా మరియు ఇతర నరాల సంబంధిత జబ్బుల చికిత్సలో ఉపయోగిస్తారు. మొత్తం మొక్క గాయాలను నయం చేయడంలో ఉపయోగిస్తుంది.
- ఈ మొక్కని జలుబు, ఆస్త్మా చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్కని నీటిలో అనేక రోజులు నానబెట్టి వచ్చిన ద్రవాన్ని కీళ్ళనొప్పులు తగ్గడానికి పై పూతగా పూస్తారు.
- ఈ మొక్క ఆకుల కషాయాన్ని జ్వరాన్ని తగ్గించడానికి త్రాగిస్తారు. మొక్కలను పీకి నిప్పులలో వేస్తే ఈగలు, దోమలను వికర్షిస్తాయి. దగ్గు, బ్రోంకైటిస్ నివారణకుపయోగిస్తారు. డిసెంట్రి, డయేరియా తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో
- కినోపోడియం మిథనాల్ ద్రావణం శనగ పంటనాశించే ఎండు తెగులు శిలీంద్రం, ఫ్యుజేరియం ఆక్సిస్పోరం సైసరి పై శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది (మింజ్, అతని అనుచరులు, 2012).
- కినోపోడియం పెట్రోలియం ఈథర్ ద్రావణం మరియు ఎసెన్షియల్ ఆయిల్ మలేరియా వాహకం ఎనోఫెలెస్ గాంబియే లార్వాలు, పెద్ద పురుగులపై విష ప్రభావం చూపాయి. ఈ ఫలితాలు బాడగ్రిలోని గ్రామాలలో ప్రజలు దోమలను పారద్రోలి మలేరియా నరికట్టడానికి సాంప్రదాయంగా కినోసోడియం మొక్కలను తలుపులపై వ్రేలాడదీయడాన్ని సమర్థించాయి (డెన్లోయి, అతని అనుచరులు, 2009).
- కినోపోడియం పొడి, ద్రావణం, ఎసెన్షియల్ ఆయిల్ విష ప్రభావాన్ని గుడ్లు పెట్టడం తగ్గించడాన్ని, గుడ్లను నాశనం చేయడం, లార్వాలను నాశనం చేయడంపై నిల్వ ధాన్యంలో ఆశించే కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్, సైటోఫిలస్ జియామెయిస్, ట్రైబోలియం కాస్టానియం లపై పరీక్షించారు. పొడి ఫార్ములేషన్ సైటోఫిలస్ జియామెయిస్‌పై అత్యధిక విష ప్రభావాన్ని చూపింది. ఇథనాల్ ద్రావణం కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌పై అత్యధిక విష ప్రభావాన్ని చూపింది. ఎసెన్షియల్ ఆయిల్ సైటోఫిలస్ జియామెయిస్ కన్నా కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌పై అధిక ఫ్యూమిగెంట్ చర్యను ప్రదర్శించింది. ఆయిల్ ఆవిరి కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ గుడ్లపై చర్యను చూపింది కాని లార్వాలను అంతగా చంపలేకపోయింది (డెన్లోయి, అతని అనుచరులు, 2015).
- కినోపోడియం ఆకులు, కాయల ద్రావణాలు రైజోపెర్తా డామినిక పెద్ద పురుగులపై కీటక నాశక చర్యను ప్రదర్శించలేదు. (గుజ్జో, అతని అనుచరులు).
- కినోపోడియం ఎసెన్షియల్ ఆయిల్ కంది గింజల నిల్వ సమయంలో ఆశించే పల్స్ బ్రూచిడ్స్, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్, కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్లపై 100% పురుగు వికర్షక చర్యను ప్రదర్శించింది. 100 మైక్రోలీటర్ల గాఢత వద్ద కినోపోడియం ఆయిల్ రెండు పురుగులను 100% చంపింది. కంది కాయధాన్యాన్ని నిల్వ సమయంలో పల్స్ బీటిల్ నుండి కాపాడటానికి కినోపోడియం ఆయిల్‌ని కమ్మర్షియల్ ఫ్యూమిగెంట్‌గా సమర్ధవంతంగా ఉపయోగించవచ్చు. (పాండె, అతని అనుచరులు, 2012).
- కినోపోడియం ఆకు ద్రావణం దోమలు, ఈగలపై ఫ్యూమిగెంట్ చర్యను ప్రదర్శిస్తుంది. నత్తలను చంపుతుంది. కోత అనంతర ధాన్య పరిరక్షణలో శిలీంద్రనాశినిగా కూడా పనిచేస్తుంది. ఎరువులకు కలిపి పురుగుల లార్వాలను నివారించవచ్చు. కినోపోడియం ఆయిల్‌ని కోత అనంతరం నిల్వ ధాన్యాన్ని శిలీంద్రాల నుండి కాపాడటానికి ఉపయోగిస్తారు. ఆకుల పొడి (0.5%)ని నిల్వ ధాన్యానికి కలిపి చిక్కుడు గింజలలో బ్రూచిడ్ని నియంత్రించవచ్చు. 5% ఆకుల పొడినుపయోగించి మొక్కజొన్న నిల్వ సమయంలో ఆశించే పురుగుల (సైటోఫిలస్ జియామెయిస్తో సహా)ను నివారించవచ్చు. (పెస్టిసైడల్ ప్లాంట్ లీఫ్లెట్, ది యూనివర్సిటి ఆఫ్ గ్రీన్విచ్).
- కినోపోడియం ఎసెన్షియల్ ఆయిల్ లో టమాట విత్తనాలను నానబెట్టి శుద్ధి చేసి పిథియం అఫానిడెర్మేటం లేదా పిథియం డిబారియానం ఆశించిన భూమిలో విత్తితే పిథియం అఫానిడెర్మేటం కారక మాగుడు తెగులు 66.7%, పిథియం డిబారియానం కారక మాగుడు తెగులు 100% నివారించబడ్డాయి.
- మొక్కజొన్న నిల్వ సమయంలో తీవ్ర నష్టం కలిగించే సైటోఫిలస్ జియామెయిస్ ని కినోపోడియం ఎసెన్షియల్ ఆయిల్ (200 మైక్రోలీటర్లు/కిలో మొక్కజొన్న గింజలు) 72 గంటలలో 100% చంపింది. సంతతి ఉత్పత్తిని పూర్తిగా అరికట్టింది (లాంగ్సి, అతని అనుచరులు, 2017).
- మొక్కజొన్న నిల్వ సమయంలో ఆశించే సైటోఫిలస్ జియామెయిస్‌పై కినోపోడియం ఎసెన్షియల్ ఆయిల్ ఫ్యూమిగెంట్ చర్యను ప్రదర్శించింది (చు, అతని అనుచరులు, 2011).
- కినోపోడియం ఆకుల నుండి తీసిన ఎసెన్షియల్ ఆయిల్ (100 మైక్రోగ్రాములు /మి.లీ.) అఫ్లాటాక్సిన్ని ఉత్పత్తి చేసే ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్ శిలీంద్రం పెరుగుదలను పూర్తిగా అరికట్టింది. ఈ ఆయిల్ (100 మైక్రోగ్రాములు / మి.లీ.) ఆస్పర్ౙిల్లస్ నైగర్, ఆస్పర్ౙిల్లస్ ఫ్యూమిగేటస్, బోట్రియోడిఫ్లోడియా థియోబ్రొమె, ఫ్యుజేరియం ఆక్సిస్పోరం, స్ల్కీరోషియం రాల్ఫిసి, మాక్రోఫోమినా ఫేసియోలినా, క్లాడోస్పోరియం క్లాడోస్పొరాయిడెస్, హెల్మింతోస్పోరియం ఒరైజె, పిథియం డిబారియానం వంటి అనేక శిలీంద్రాలపై శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది. ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్కి చెందిన అఫ్లాటాక్సిన్ బి1ని ఉత్పత్తి చేసే సామర్థ్యం గల స్ట్రెయిన్‌ని అఫ్లాటాక్సిన్ ఉత్పత్తి చేయకుండా అరికట్టింది. ఈ ఆయిల్ నిల్వ చేసిన మొక్కజొన్న ధాన్యాన్ని ఆశించే వివిధ శిలీంద్రాలు ఆశించకుండా ఒక సంవత్సరం వరకు కాపాడింది. ఎసెన్షియల్ ఆయిల్ యాంటిఆక్సిడెంట్ చర్యను కూడా ప్రదర్శించింది. ఈ ఫలితాలు కినోపోడియం ఎసెన్షియల్ ఆయిల్‌ని ఒక శక్తివంతమైన శిలీంద్రనాశినిగా ఉపయోగించి నిల్వ చేసిన ఆహారధాన్యాలను కాపాడవచ్చని నిరూపించాయి (రాజేష్ కుమార్, అతని అనుచరులు, 2006).
- కినోపోడియం ఎసెన్షియల్ ఆయిల్‌ని డ్రెంచ్గా పెంచే మాధ్యమానికి ఇస్తే ఫంగస్ గ్నాట్ బ్రాడిసియా స్పీ. 2వ దశ, 3వ దశ లార్వాలపై అత్యంత సమర్ధవంతంగా పని చేసింది. అయితే ఎసెన్షియల్ ఆయిల్ నిమ్మ, బత్తాయి నాశించే పిండినల్లి, ప్లానోకోకస్ సిట్రి (3% చావు), వెస్టర్న్ ఫ్లవర్ త్రిప్స్, ఫ్రాంక్నిలియెల్లా ఆక్సిడెంటాలిస్ (18.34% చావు)పై తక్కువ సమర్ధవంతంగా పని చేసింది (క్లాయిడ్ అండ్ చియాసన్, 2007).
- కినోపోడియం ఆకు పొడి (1:40) వేరుశనగ కాయలను నిల్వ సమయంలో ఆశించే కార్సిడాన్ సెర్రేటస్ని 13 రోజులలో 90% చంపింది (డెలోబెల్ అండ్ మాలోంగ, 1987). గుడ్లు పెట్టకుండా నివారించింది. యఫ1 ఉత్పత్తిని నివారించింది.
- కినోపోడియం (0.1, 1, 3 గ్రా.) పొడి అలసంద ధాన్యం నిల్వ సమయంలో ఆశించే కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పెద్ద పురుగుల నుండి పూర్తి రక్షణ నిచ్చి, పెద్ద పురుగుల విడుదలను పూర్తిగా అరికట్టింది (మెకెండ, అతని అనుచరులు, 2015).
- కినోపోడియం కాయల ఇథనాల్ మరియు హెక్సేన్ ద్రావణాలు ట్రైబోలియం కాస్టానియం, సైటోఫిలస్ గ్రానేరియస్ లను అరికట్టాయి (పీటర్సన్, అతని అనుచరులు, 1989).
- కినోపోడియం ఆకుల పెట్రోలియం ఈథర్ ఎసిటోన్ ద్రావణం (1%) ట్రైబోలియం కాస్టేనియంని 4 వారాల తర్వాత 47% వికర్షించింది. 1% ద్రావణం రైజోపెర్తా డామినికపై వేప కషాయంతో సమానంగా యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది. (మాలిక్ అండ్ ముజ్తాబి నక్వి, 1984).
- కినోపోడియం ఎసెన్షియల్ ఆయిల్ (40 మైక్రోగ్రాములు/పురుగు) 100% కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పురుగులను చంపింది. 50 మైక్రోగ్రాములు/పురుగు మోతాదు వద్ద 92% లాసియోడెర్మా సెర్రికొర్నె పురుగులను 3 రోజులలో చంపింది. కాని సైటోఫిలస్ ఒరైజె పురుగులను 52%, ట్రైబోలియం కన్ఫ్యూసం పురుగులను 15% మాత్రమే చంపింది (సు, 1986).
- కినోపోడియం క్రూడ్ నీటి ద్రావణం (10%) అలసంద కాయల నుండి రసంపీల్చే నల్లి, క్లావిగ్రల్లా టోమెంటోసికోల్లిస్, పురుగుల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. దిగుబడులు రసాయన పురుగు మందుతో సమానంగా ఉన్నాయి. ఈ ద్రావణం పిచికారి చేసిన ప్లాటులో కేవలం 6.0% కాయలు మాత్రమే పురుగులచే నష్టపరచబడ్డాయి (అడెసిన, 2014).
- కినోపోడియం ద్రావణం గోధుమ ధాన్యాన్ని నిల్వ సమయంలో ఆశించి నష్టపరిచే ట్రోగోడెర్మా గ్రానేరియం ని అత్యంత సమర్ధవంతంగా చంపింది (ఇబ్రహీం).
- కినోపోడియం ఎసెన్షియల్ ఆయిల్ ఫ్యుజేరియం ఆక్సిస్పోరం పై శిలీంద్రనాశక చర్యను, సైటోఫిలస్ జియామెయిస్ పై ఫ్యూమిగెంట్ చర్యను ప్రదర్శించింది. ఈ ఎసెన్షియల్ ఆయిల్ రసాయన శిలీంద్రనాశనులు, పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది (జరమిల్లో, అతని అనుచరులు, 2012).
- కినోపోడియం ద్రావణం { ట్వీన్ 20 మిశ్రమం డాక్టిలోపియస్ ఒపన్షియె రెండవ దశ పిల్ల పురుగులను 82 నుండి 99% చంపింది (విగ్వెరాస్, అతని అనుచరులు 2007).
- అలసంద నిల్వ సమయంలో ఆశించే బ్రూచిడ్స్ నివారణలో టెఫ్రోసియా వోగెలి, కినోపోడియం యాంబ్రాసిడెమ్, టిలోనియా డైవర్సిఫోలియా, లిప్పియా జవానిక, వెర్మోనియా అమైగ్ౙాలినా తక్కువ ఖర్చుతో కూడిన సమర్ధవంతమైన పర్యావరణహిత పురుగు యాజమాన్య పద్ధతిలో ఉపయోగిస్తాయి (మికెండ, అతని అనుచరులు, 2014).
- కినోపోడియం మొక్క ద్రావణం చీని, నిమ్మ, ద్రాక్ష, కొబ్బరి, జీడిమామిడి, కూరగాయల పంటల్లో ఆశించే పేనుబంక, దీపపు పురుగులు, తెల్లదోమ, నల్లి వంటి పురుగులను నివారిస్తుంది (రజిత్ ముల్లెంరియావ, 2015).
- మొక్కజొన్న నిల్వ ధాన్యంలో ఆశించే సైటోఫిలస్ జియోమెయిస్ పెద్ద పురుగులపై కినోపోడియం ఇథైల్, నీటి ద్రావణాలు, పొడి వికర్షక ప్రభావాన్ని చూపాయి (జ్టొజనెట్టొ, అతని అనుచరులు, 2013).
- కినోపోడియం ఆకు పొడి (2.5%) లెగ్యూమ్స్ నిల్వ ధాన్యంలో ఆశించే కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌పై అత్యుత్తమ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. విగ్నా సబ్టెర్నేనియా వేరుశనగలో 69.64% పెద్ద పురుగులను, కెర్ట్సింగియెల్లా జియోకార్పా వేరుశనగలో 100% పురుగులను చంపింది. (చౌగౌరవ్, అతని అనుచరులు, 2015)
……………………………………………………………………………………………………………………………..
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

