పల్నాడు జిల్లాకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక నేతాజీ సుభాష్ – ఐసీఏఆర్ అంతర్జాతీయ ఫెలోషిప్

పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల మండలం, గుత్తికొండ గ్రామానికి చెందిన ఇంజనీర్ నలబోలు కిషోర్ భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) అందించే ప్రతిష్టాత్మక “నేతాజీ సుభాష్ – ఐసిఎఆర్ అంతర్జాతీయ ఫెలోషిప్ – 2025”కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డా. ఎన్.టి.ఆర్. వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల, బాపట్ల యందు వ్యవసాయ యాంత్రీకరణ భాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తండ్రి నాగేశ్వరరావు, సాధారణ మధ్యతరగతి రైతు మరియు తల్లి గృహిణి.

ఈ ఫెలోషిప్ క్రింద అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా - లింకన్‌లో “పక్వ దశలో ఉన్న పత్తి బోళ్లను గుర్తించే మల్టీమోడల్ సెన్సార్ ఫ్యూజన్, మల్టీ పాస్ పీకింగ్ మరియు ప్రెసిషన్ నావిగేషన్ సాంకేతికతలతో సెలెక్టివ్ రోబోటిక్ కాటన్ హార్వెస్టర్ రూపకల్పన మరియు ఆప్టిమైజేషన” అనే అత్యాధునిక పరిశోధన అంశంపై పీహెచ్.డి పరిశోధనలు నిర్వహించనున్నారు. ఇంజనీర్ నలబోలు కిషోర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల, బాపట్ల యందు 2012వ సంవత్సరంలో వ్యవసాయ ఇంజనీరింగ్ పూర్తిచేశారు ఐఐటీ ఖరగ్‌పూర్ నుండి 2016వ సంవత్సరంలో ఫామ్ మెషినరీ మరియు పవర్ ఇంజినీరింగ్‌లో ఎం.టెక్ పూర్తి చేశారు. 2017 ఆగష్టు నుండి వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని వ్యవసాయ పరిశోధనా  స్థానం, అనంతపురములో తన వృత్తిపరంగా ప్రస్థానం మొదలుపెట్టారు. వ్యవసాయ యంత్రీకరణ, ప్రెసిషన్ వ్యవసాయం, నీటి సంరక్షణ, వ్యవసాయ పరికరాల అభివృద్ధి రంగాల్లో విశేష కృషి చేశారు.

రైతులకు ఉపయోగపడే అనేక వినూత్న వ్యవసాయ యంత్రాలు మరియు సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధిలో  కీలక పాత్ర పోషించారు. దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అంతర్జాతీయ  ఫెలోషిప్ ద్వారా విదేశీ విశ్వవిద్యాలయంలో ఆధునిక వ్యవసాయ సాంకేతికతలపై పరిశోధనలు చేసే అవకాశం లభించింది. దేశవ్యాప్తంగా వున్న 74 ఐసిఎఆర్ పరిధిలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో మొట్టమొదటిసారిగా నలబోలు కిషోర్ మాత్రమే ఈ ఫెలోషిప్ రావడం పట్ల కుటుంబ సభ్యులు, విశ్వవిద్యాలయ ఉపకులపతి డా. పాలడుగు వెంకట సత్యనారాయణ మరియు అదికారులు, సహచర శాస్త్రవేత్తలు, కళాశాల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఫెలోషిప్‌లో భాగంగా కిషోర్‌కి మూడు సంవత్సరాల పీహెడీ పూర్తి చేయడానికి 75,000 అమెరికన్ డాలర్లు ఐసిఏఆర్ అందచేయడం జరుగుతుంది.
Read More

నేల ఆరోగ్య పరిరక్షణకి ఉద్యానవన పంటల సాగు

నేల ఆరోగ్యం ఉద్యాన పంటల ద్వారానే పరిరక్షించబడుతుంది. కాబట్టి తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యానవన పంటలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామని కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ దండా రాజిరెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని ఉద్యాన కళాశాలలో ‘నేల ఆరోగ్య పరిరక్షణ- ప్రకృతి వ్యవసాయం’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మృత్తిక శాస్త్రవేత్త, ఐకార్ ప్రదర్శన శాస్త్రవేత్త బ్రజేంద్ర పర్మార్ ఇతర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Read More

వ్యవసాయ యంత్ర పరికరాల సబ్సిడీకి రూ.112.50 కోట్ల కేటాయింపు

రైతులకు రాయితీపై ట్రాక్టర్లు, గొర్రులు, కోత, నూర్పిడి యంత్రాలు, పవర్ టిల్లర్లు, స్ప్రేయర్లు వంటి వ్యవసాయ యంత్ర పరికరాలను అందించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఖరీఫ్, రబీ సాగు ఆధారంగా 2025-26 సంవత్సరానికి 28 జిల్లాలకు రూ.112.50 కోట్లు కేటాయించింది. ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది.

*నిబంధనలు*

ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు, మహిళలకు యంత్రాల యూనిట్ ధరలో 50% చొప్పున, ఇతర రైతులకు 40% చొప్పున రాయితీ వర్తిస్తుంది. 40 హెచ్‌పీ వరకు సామర్థ్యం గల ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, అనుబంధ పరికరాలు, విత్తే, నాటే, తవ్వే యంత్రాలు, స్ప్రేయర్లు, స్వీయచోదక పరికరాలు, పవర్ టిల్లర్లు, కోత, నూర్పిడి యంత్రాలు, పంట కోత తర్వాత విలువ జోడింపు యంత్రాలు అందిస్తారు. లబ్ధిదారులను జిల్లా సంయుక్త కలెక్టర్ సమక్షంలో లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. జిల్లాల్లో మండలాలు, సామాజికవర్గాల వారీగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. జిల్లా ఇంఛార్జి మంత్రి ఆమోదం తర్వాత లబ్ధిదారుల జాబితా విడుదలవుతుంది. ఎంపికైన వారి మొబైల్ ఫోన్లకు మెనేజ్‌లు పంపిస్తారు. ప్రొసీడింగ్స్ ఇచ్చిన 15 రోజుల్లో రైతులు పరికరానికి సంబంధించి తమ వాటా మొత్తాన్ని డీలర్లకు చెల్లించాలి. ఆర్డర్ అందాక 15 రోజుల్లో రైతులకు యంత్రాన్ని అందిస్తారు.

రాయితీపై యంత్ర పరికరాలకు రైతు సేవా కేంద్రాలతో పాటు ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. నచ్చిన డీలర్ వద్ద పరికరాన్ని కొనుక్కోవచ్చు. మే 5 నుంచి 19 వరకు దరఖాస్తు చేసుకోవాలి. 23 నుంచి 25 వరకు లాటరీ ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన వారికి మంజూరు పత్రం ఇస్తారు. లబ్ధిదారు మే 26 నుంచి జూన్ 9లోగా తన వాటా సొమ్ము డీలర్‌కు చెల్లించాలి. మే 26 నుంచి జూన్ 26 వరకు యంత్రాలు సరఫరా చేస్తారు. జూన్ 30 నుంచి డీలర్ ఖాతాలోకి రాయితీ సొమ్ము విడుదల ప్రక్రియ మొదలవుతుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు వెబ్ సైట్: https://eseed.ap.gov.in/FM/*కౌలు రైతులూ అర్హులే* సొంత భూమి కలిగిన రైతులతో పాటు గత మూడేళ్లలో కనీసం మూడు సీజన్లలో ఈ పంటలో నమోదైన ‘కౌలు రైతు కార్డులు’ పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అటవీ హక్కుల పత్రాలున్న(ఆరఓఎఫఆర్) రైతులూ అర్హులే. 2024-25 సంవత్సరంలో రాయితీ పొందినవారు అర్హులు కాదు. కుటుంబంలో ఒక సభ్యుడే దరఖాస్తు చేసుకోవాలి. భూమి రికార్డులు, అటవీ హక్కుల పత్రాలు, ఈ-పంట తదితర సమా చారం ఆధారంగా అర్హుల్ని ఎంపిక చేస్తారు.

Read More

న్యూట్రిహబ్ సహకారంతో రోజుకు ఒక పూట చిరుధాన్యాల భోజనం

మిల్లెట్ మార్వెల్స్ సంస్థ భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్)కు చెందిన న్యూట్రిహబ్ సహకారంతో ‘రోజుకు ఒక పూట చిరుధాన్యాల భోజనం’ జాతీయ మిషన్‌ను సోమవారం హైదరాబాద్‌లోని ఐఐఎంఆర్ ప్రారంభించింది. ఐఐఎంఆర్ డైరెక్టర్ తారాసత్యవతి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిలు దీనిని ప్రారంభించారు. న్యూట్రిహబ్ డైరెక్టర్, సీఈఓ స్టాన్లీ, మిల్లెట్ మార్వెల్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ భరత్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిషన్‌కు సినీనటుడు నాగార్జున, ఏపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వీడియో ప్రసంగాల ద్వారా మద్దతు తెలిపారు.

Read More

35 వేల మంది డ్వాక్రా మహిళలకు వెదురు సాగుతో జీవనోపాధి

ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా సంఘాల్లోని చిన్న, సన్నకారు మహిళా రైతులకు జీవనోపాది కల్పనలో భాగంగా మైదాన ప్రాంతాల్లో వెదురుసాగును ప్రభుత్వం ప్రోత్సహించనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో గత ఏడాది 3వేల మంది మహిళా రైతులతో ప్రభుత్వం వెదురుసాగు చేపట్టింది. ఈ ఏడాది దాన్ని మరో 35 వేల మందికి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది సాగుచేసిన జిల్లాలతోపాటు మరో 10 జిల్లాల్లో ఈ ఏడాది సాగును విస్తరించనున్నారు. మొత్తంగా 87 మండలాల పరిధిలో సాగును చేపట్టనున్నారు. నాలుగో ఏడాది నుంచి రైతులకు ఆదాయం వస్తుంది. నాలుగో ఏడాది రూ.30-50వేలు, ఆ తర్వాత రూ.70వేల నుంచి రూ. లక్ష వరకు ఇలా 40 ఏళ్ల వరకు ఆదాయం వస్తుంది. రైతుల కోసం మారేడుమిల్లిలో ప్రభుత్వం రూ.50 లక్షలతో ప్రాసెసింగ్ ప్లాంటును ఏర్పాటుచేసింది.
వెదురు సాగు లాభదాయకంగా ఉండేందుకు త్రిపుర నుంచి కొత్త రకం వెదురు మొక్కలు తీసుకొస్తున్నారు. బాంబుసా బాంబుసా, బాంబుసా టుల్డా, బాంబుసా న్యూటన్స్ మొక్కలు ఇక్కడి వాతావరణానికి తట్టుకుని పెరిగేవిగా అధికారులు గుర్తించారు. ఒక్కో మొక్క ధర రూ.5-6 వరకు ఉండనుంది.

Read More

రైతు వారోత్సవాలను ప్రారంభించిన మంత్రి తుమ్మల

ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 9 వరకు తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న రైతువారోత్సవాలను వికారాబాద్ జిల్లా తాండూరులో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభించారు. వారోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు ఒక ప్రత్యేక శాఖకు కేటాయించి కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొదటి రోజు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నేల ఆరోగ్యం, ఎరువుల వినియోగం, సహజ వ్యవసాయం వంటి అంశాలపై అవగాహన, రెండో రోజు ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో పంటల మార్పిడి, సూక్ష్మ సేద్యం, మూడో రోజు సహకార, మార్కెటింగ్ శాఖల ద్వారా మార్కెట్ లింకేజీలు, రుణ సదుపాయాలపై అవగాహన, నాలుగో రోజు యాంత్రీకరణ, డ్రోన్ల వినియోగం, సౌర శక్తి పరిష్కారాలపై ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఐదో రోజు పశుసంవర్ధక, మత్స్య శాఖలు.. పశువుల ఆరోగ్యం, చేపల ఉత్పత్తి పెంపుపై, చివరి రోజు సాగునీటిశాఖ.. వర్షాకాలానికి ముందస్తు చర్యలు, నీటి వనరుల నిర్వహణపై మార్గనిర్దేశనం చేస్తాయని మంత్రి తుమ్మల తెలిపారు.

Read More

సేంద్రియ ఉత్పత్తుల క్రయవిక్రయాలకు యాప్

సేంద్రియ ఉత్పత్తుల క్రయ విక్రయాల కోసం దేశంలో తొలిసారిగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక మొబైల్ యాప్ ‘టీజీ ఆర్గానిక్స్’ రానుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద వ్యవసాయ వారోత్సవాలలో వికారాబాద్ జిల్లా తాండూరులో ఈ నెల 4న యాప్‌ను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరిస్తారు. నకిలీ ఉత్పత్తులకు అడ్డుకట్ట వేసి రైతులు పండించే స్వచ్ఛమైన సేంద్రియ ఉత్పత్తులు వినియోగదారులకు లభ్యమయ్యేలా రాష్ట్ర విత్తన, సేంద్రియ ధృవీకరణ ప్రాధికార సంస్థ దీనిని అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్రంలో నేంద్రియ వ్యవసాయం విస్తరిస్తోంది. రాష్ట్రంలో జనవరి 2026 నాటికి 10 వేల మంది రైతులు, 24 రైతు ఉత్పత్తిదారుల సంఘాల వారు 50 వేల ఎకరాల్లో ఈ సాగు చేస్తున్నారు. ప్రత్యేక మార్కెట్లు లేకపోవడం వల్ల వారు పంట ఉత్పత్తులను దుకాణాల చుట్టూ తిరిగి విక్రయిస్తున్నారు. మరోవైపు ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకొని దళారులు నకిలీ ఉత్పత్తులను నేంద్రియం పేరుతో విక్రయిస్తున్నారు. ఇలా మోసాలు పెరగడం, రైతులకు సరైన మద్దతు లేకపోవడం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మంత్రి తుమ్మల ఇటీవల దీనిపై సమీక్ష నిర్వహించి ప్రత్యేక యాప్‌ను రూపొందించాలని రాష్ట్ర విత్తన, సేంద్రియ ధృవీకరణ ప్రాధికార సంస్థకు సూచించారు.
ధర నిర్ణయించే అధికారం రైతుకే
ప్రారంభంలో ప్రభుత్వ ధ్రువీకరణ పొందిన 100 సేంద్రియ ఉత్పత్తులు, 500 మంది రైతుల సమాచారం యాప్‌లో ఉంటుంది. 50 కిలోమీటర్ల పరిధిలో ఉండే రైతుల వివరాలు వస్తాయి. మున్ముందు మరింత మంది రైతులను, ఉత్పత్తులను ఇందులో చేరుస్తారు. ఆయా ఉత్పత్తులు కావాలనుకున్న వారు నేరుగా టీజీ ఆర్గానిక్స్ యాప్ ద్వారా రైతులను సంప్రదించవచ్చు. రైతు మొబైల్ నంబరు, చిరునామా, లొకేషన్ వివరాలు పొందవచ్చు. ధర నిర్ణయించే అదికారం రైతుకు మాత్రమే ఉంటుంది. రైతును నేరుగా సంప్రదించి ధర విషయాలు చర్చించుకోవచ్చు.

Read More

జలధారతో కరవు తీరింది

కరవుతో ఇబ్బందులు ఎదుర్కొనే అన్నమయ్య జిల్లాలోని గాలివీడు మండలంలోని రైతులు ప్రస్తుతం కూరగాయలు సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. జలధారలో భాగంగా హంద్రీనీవా నీటిని వెలిగల్లు జలాశయానికి మళ్లించడంతో పాటు చెరువులు నింపడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో సుమారు 900 ఎకరాల్లో మల్చింగ్ విధానంలో టమాటా, ఇతర కూరగాయలు పండిస్తు న్నారు. డ్రోన్‌తో ఫొటో తీసిన క్రమంలో మల్చింగ్ పేపర్లతో ఆ ప్రాంతమంతా ఈ విధంగా కనిపించింది.

Read More

ఏపీసీఎన్ఎఫ్‌కు గ్లోబల్ గుర్తింపు

ఆంధ్రప్రదేశ్ సామాజిక ప్రకృతి సాగు (ఏపీసీఎనఎఫ్) కార్యక్రమం ‘ఫుడ్ ప్లానెట్ ప్రైజ’ గ్లోబల్ ఫైనలిస్ట్‌గా ఎంపికైంది. దీనికిగాను రూ.1.4 కోట్ల నగదు బహుమతికి అర్హత సాధించింది. స్వీడన్‌కు చెందిన పారిశ్రామికవేత్త, దాత కర్ట్ బెర్గ్‌ఫోర్స్ ఏర్పాటు చేసిన ఈ అవార్డుకు ప్రపంచంలో అతి పెద్ద పర్యావరణ అవార్డుగా గుర్తింపు ఉంది. పర్యావరణ పరిరక్షణ, ఆహార వ్యవస్థల్లో పరివర్తన సాదించే సంస్థలకు దీన్ని అందజేస్తారు. 2026 ఫుడ్ ప్లానెట్ ప్రైజ్‌కు ప్రపంచవ్యాప్తంగా 1,000 కంటే ఎక్కువ నామినేషన్లు రాగా.. 35 కార్యక్రమాలు ఎంపికయ్యాయి. తుదిగా జాబితాలో ప్రకటించిన 4 కార్యక్రమాల్లో ఏపీసీఎనఎఫ్ ఒకటిగా నిలిచింది. ఫైనలిస్టుగా జూన్‌లో స్వీడన్‌లో తమ ప్రజంటేషన్లు ఇస్తారు. అనంతరం విజేతను ప్రకటిస్తారు. రాష్ట్రంలో 8,168 గ్రామాల్లో 9 లక్షల హెక్టార్లలో 18 లక్షల మంది రైతులతో ప్రకృతి సాగు చేయిస్తుండటంతో ప్రైజ్‌కు ఎంపికైనట్లు రైతు సాదికార సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Read More

రూ.100 కోట్లతో మత్స్య మండలి విస్తరణ

దేశవ్యాప్తంగా మత్స్యరంగం పురోగమిస్తుండగా… కేంద్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా సేవలను విస్తరించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌లోని జాతీయ మత్స్య అభివృద్ధి మండలి (నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు) ప్రధాన కార్యాలయాన్ని రూ.100 కోట్లతో భారీగా విస్తరించాలని కేంద్ర మత్స్యశాఖ నిర్ణయించింది. పది ఎకరాల్లో పెద్ద ఆడిటోరియం, ప్రదర్శనశాల, ప్రయోగశాలలను ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతించింది. 2006లో హైదరాబాద్‌లో ఎనఎఫ్‌డీబీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాజేంద్రనగర్‌లో ఐదు ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించగా… 2012లో చేప ఆకారంలో దానిని నిర్మించారు. ప్రస్తుతం ఉన్న ఐదు ఎకరాల స్థలం సరిపోనందున మరింత భూమి కావాలని కేంద్ర మత్స్యశాఖ రాష్ట్ర ప్రభుత్త్వాన్ని కోరగా దానికి అనుగుణంగా సర్కార్ ఆచార్య జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన పది ఎకరాలను కేటాయించింది. త్వరలోనే టెండర్లు పిలిచి నిర్మాణాలు చేపట్టనున్నారు.*ప్రత్యేక ఎగుమతుల విభాగం…* దేశంలో మత్స్య ఎగుమతుల ప్రోత్సాహానికి వీలుగా ఎగుమతుల విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. భారీ భవనాన్ని నిర్మిస్తారు. ప్రాంగణంలో పెద్ద మత్స్య ప్రదర్శన కేంద్రం నిర్మిస్తారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చేపలు, రొయ్యలు, ఇతర జలచరాలను ప్రదర్శిస్తారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఎక్జిబిషన్ లను నిర్వహిస్తారు.*అనేక సౌకర్యాలు* ఈ రంగంలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు ఉపయోగపడేలా జాతీయ స్థాయి మత్స్యప్రయోగశాలను నిర్మిస్తారు. దాదాపు ఆరు వందల సీట్లలో ఆడిటోరియాన్ని ఏర్పాటు చేస్తారు. మత్స్య నిర్వహణ కేంద్రాలను నెలకొల్పుతారు. రైతుల కోసం వసతిగృహాన్ని నిర్మిస్తారు.

Read More