ఆంధ్రప్రదేశ్ సామాజిక ప్రకృతి సాగు (ఏపీసీఎనఎఫ్) కార్యక్రమం ‘ఫుడ్ ప్లానెట్ ప్రైజ’ గ్లోబల్ ఫైనలిస్ట్‌గా ఎంపికైంది. దీనికిగాను రూ.1.4 కోట్ల నగదు బహుమతికి అర్హత సాధించింది. స్వీడన్‌కు చెందిన పారిశ్రామికవేత్త, దాత కర్ట్ బెర్గ్‌ఫోర్స్ ఏర్పాటు చేసిన ఈ అవార్డుకు ప్రపంచంలో అతి పెద్ద పర్యావరణ అవార్డుగా గుర్తింపు ఉంది. పర్యావరణ పరిరక్షణ, ఆహార వ్యవస్థల్లో పరివర్తన సాదించే సంస్థలకు దీన్ని అందజేస్తారు. 2026 ఫుడ్ ప్లానెట్ ప్రైజ్‌కు ప్రపంచవ్యాప్తంగా 1,000 కంటే ఎక్కువ నామినేషన్లు రాగా.. 35 కార్యక్రమాలు ఎంపికయ్యాయి. తుదిగా జాబితాలో ప్రకటించిన 4 కార్యక్రమాల్లో ఏపీసీఎనఎఫ్ ఒకటిగా నిలిచింది. ఫైనలిస్టుగా జూన్‌లో స్వీడన్లో తమ ప్రజంటేషన్లు ఇస్తారు. అనంతరం విజేతను ప్రకటిస్తారు. రాష్ట్రంలో 8,168 గ్రామాల్లో 9 లక్షల హెక్టార్లలో 18 లక్షల మంది రైతులతో ప్రకృతి సాగు చేయిస్తుండటంతో ప్రైజ్‌కు ఎంపికైనట్లు రైతు సాదికార సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.

30 Apr, 2026
