చౌడును తట్టుకునే వరి విత్తనం

మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా స్థానం తాజాగా ఎంసీఎం-125 అనే వరి రకాన్ని అందుబాటులోకి తెచ్ౘ్ింది. ఇటీవల దీనికి అనుమతులు లభించడంతో శాస్త్రవేత్తలు రైతులకు విత్తనాలను విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఎంటీయూ 1042, ఎంటీయూ 1061 విత్తనాలను సంకరం చేసి ఎంసీఎం-125 విత్తనాన్ని రూపొందించారు. ఇది ఖరీఫ్‌కు అనువైన రకమని, పంట కాలం 145 రోజులు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రకం కొంతవరకు దోమపోటు, అగ్గి తెగులు, మెడవిరుపు తెగులును కూడా తట్టుకుంటుంది. మొక్క 110 నుంచి 115 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. ఎకరానికి.. చౌడు నేలల్లో 30 బస్తాలు, సాధారణ భూముల్లో 40 బస్తాల వరకు దిగుబడి ఇస్తుంది.
ఎంటీయూ-1061, బీపీటీ 5204 రకాలకు ప్రత్యామ్నాయంగా ఎంసీఎం-125 రకాన్ని చౌడు, సాధారణ భూముల్లో సాగు చేసుకోవచ్ౘ్ని పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కె. నాగేంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో కోస్తా ప్రాంతాల్లోని చౌడు భూములకు అనువైన వంగడమని చెప్పారు. రైతులకు విత్తనాలు అందుబాటులో ఉన్నందున వినియోగించుకోవాలని కోరారు.

Read More

వడగాల్పుల ప్రభావంతో నష్టపోయిన పౌల్ట్రీ రైతులను ఆదుకుంటాం

యూరియా లభ్యత, మొక్క జొన్న ధరలు, రొయ్యల మార్కెట్ పరిస్థితులు, కొబ్బరి రైతుల సమస్యలు, అనంతపురం జిల్లాలో నీటి ఎద్దడి తదితర అంశాలపై వ్యవసాయ అనుబంధ శాఖల సంచాలకులతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పౌల్ట్రీ, ఉద్యాన, ఆక్వా రైతులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. వడగాడ్పుల ప్రభావంతో రాష్ట్రంలో సుమారు 5.5 కోట్ల కమర్షియల్ లేయర్ కోళ్లలో 2.5% నుంచి 3.5% వరకు మరణాలు నమోదైనట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారని ఆయన తెలిపారు. నష్టాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పౌల్ట్రీ రైతులను ఆదుకుంటామని పేర్కొన్నారు.

Read More

జిల్లాలవారీగా జొన్నకొనుగోలు కేంద్రాల ఏర్పాటు

తెలంగాణా రాష్ట్రంలోరూ.1,100 కోట్లతో జిల్లాలవారీగా జొన్న కొనుగోళ్లను ప్రారంభిస్తామని మొక్కజొన్న రైతులను ఆదుకునేందుకు మరో రూ.1,800 కోట్లతో అదనంగా కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఆయన తన నివాసంలో మాట్లాడుతూ.. “యాసంగి సీజన్‌లో మొక్కజొన్న సాగు 16.13 లక్షల ఎకరాలకు పెరిగింది. మొత్తం ఉత్పత్తి 42.87 లక్షల టన్నులకు చేరింది. మార్క్‌ఫెడ్ ద్వారా ఇప్పటికే రూ.4,172.94 కోట్లతో 12.85 లక్షల టన్నులు కొనుగోలు చేశాం. మరో 6.53 లక్షల టన్నులు అదనంగా కొనుగోలు చేస్తాం. రాష్ట్రంలో 4.03 లక్షల ఎకరాల్లో 4.03 లక్షల టన్నుల జొన్న ఉత్పత్తి అయింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.1,100 కోట్లతో కొనుగోళ్లు చేపడతాం. ఆదిలాబాద్ జిల్లాలో 26, సంగారెడ్డి జిల్లాలో 10, కామారెడ్డి జిల్లాలో 43, మెదక్, వికారాబాద్, జోగులాంబ గద్వాల, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కోటి చొప్పున కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. దీంతోపాటు 10,175 టన్నుల పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేస్తాం” అని వెల్లడించారు.

Read More

తెలంగాణాలో ఉచిత చేపపిల్లల పంపిణీ

రూ. 125 కోట్లతో తెలంగాణలో 2026-27 సంవత్సరానికిగాను 95 కోట్ల చేప, రొయ్య పిల్లల ఉచిత పంపిణీ పథకం అమలుకు రాష్ట్ర మత్స్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వచ్చే నెలలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి జులై ఆరంభంలో పంపిణీ చేపట్టేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా ఈ పథకం సాగుతోంది. మొదట్లో మే నెలలో టెండర్లు పిలిచి జూన్‌లో చేపపిల్లలను పంపిణీ చేసేవారు. పెండింగ్ బిల్లులు, పథకం కొనసాగింపుపై సందిగ్ధత ఇతర కారణాల వల్ల కొన్నేళ్లుగా టెండర్ల నిర్వహణలో జాప్యం జరుగుతోంది. గతానుభవాల దృష్ట్యా ఈ ఏడాది పథకం అమలులో లోటుపాట్లు లేకుండా అమలు చేసేందుకు మత్స్యశాఖ సన్నద్ధమవుతోంది.

Read More

ప్రకృతి వ్యవసాయక్షేత్రంలో మామిడి పండ్లను రుచి చూసిన లోకేశ్

ముద్దనూరు మండలం పెనికలపాడులో ప్రకృతి వ్యవసాయ రైతు మునగాల ద్వారకానాథ రెడ్డికి చెందిన 17 ఎకరాల ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటి శాఖల మంత్రి లోకేశ్ సందర్శించారు. 17 ఎకరాల్లో సమీకృత పండ్ల తోటలు, నాటుకోళ్లు, పొట్టేళ్లు, చేపల పెంపకం చేపడుతూ స్థిరమైన ఆదాయం ఆర్ౙిస్తున్న రైతు కుటుంబాన్ని ఆయన అభినందించారు. సేంద్రియ పద్ధతిలో పండిన మామిడి పండ్లను మంత్రి రుచి చూశారు.

Read More

వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు

2026-27 విద్యా సంవత్సరానికి ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో వ్యవసాయ, సేంద్రియ వ్యవసాయ, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఎ. మణి ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు వెబ్ సైట్ *www.angrau.ac.in* ని చూడాలన్నారు.

Read More

*చిరుధాన్యాల సాగుతో రైతుల ఆదాయం పెరుగుతుంది*

భారీఎత్తున చిరుధాన్యాల సాగును దేశవ్యాప్తంగా ప్రోత్సహిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. వాటి శుద్ధి.. వినియోగ విస్తరణ ద్వారా రైతుల ఆదాయం పెంపుదలకు కృషి చేస్తామని చెప్పారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ(ఐఐఎంఆర్)ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “గ్రామీణ ఉపాధిని సృష్టించడం లక్ష్యంగా ఈ రంగానికి చేయూతనిస్తాం. చిరుధాన్యాల ఆధారిత అంకురాలు, పరిశ్రమల ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలు, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి” అని సూచించారు. ఐఐఎంఆర్ సంచాలకురాలు తారా సత్యవతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read More

పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని పెంచాలి*కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి

మొక్కజొన్న, జొన్న పంటలను పిఎసఎస్ స్కీంలో చేర్చాలని, 2026-27 ఆర్థిక సంవత్సరానికి పిఎంఆర్‌కేవివై-పిడియంసి మరియు యంఐడిహెచ్ పథకాల కింద ఉద్యానశాఖకు నిధుల కేటాయింపులు పెంచాలని, ఈ రబీ సీజన్‌కు సంబంధించిన పొద్దుతిరుగుడు కొనుగోలు పరిమితిని 3,690 మెట్రిక్ టన్నుల నుండి 15,262 మెట్రిక్ టన్నులకు పెంచాలని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌ను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఐసిఏఆర్ఐ-ఐయంఆర్ రాజేంద్రనగర్‌లో ఆయనను కలిసి పామాయిల్‌పై ఉన్న దిగుమతి సుంకాన్ని పెంచేలా సంబంధిత మంత్రిత్వ శాఖతో మాట్లాడాలని కూడా కేంద్ర మంత్రిని తుమ్మల కోరారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే సమగ్ర సమీక్ష నిర్వహించి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని శివరాజ్‌సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు.

Read More

సహకార రంగాన్ని తెలంగాణాలో బలోపేతం చేస్తాం

తెలంగాణా రాష్ట్రంలో వ్యవసాయం, పాడి పరిశ్రమ, మత్స్య రంగాల్లో సహకార వ్యవస్థ విస్తరణకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, సహకార రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆదాయ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర సహకార అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించగా.. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆశిష్‌కుమార్, అదనపు కార్యదర్శి సిద్ధార్థ్ జైన్, సంచాలకుడు సత్య, రాష్ట్ర సహకార, పశుసంవర్ధక శాఖ కార్యదర్శులు సురేంద్ర మోహన్, ఇలంబర్తి, పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. సీఎస్ మాట్లాడుతూ.. “రాష్ట్రంలో సహకార ఉద్యమం బలంగా ఉంది. సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడంలో, గ్రామీణ స్థాయిలో ఆర్థిక సాధికారత కీలక పాత్ర పోషిస్తోంది. మెరుగైన పాలన, డిజిటల్ సమీకరణ, ఆర్థిక నిర్వహణ, సామర్థ్య వృద్ధి ద్వారా సహకార సంఘాలను పటిష్ఠం చేస్తున్నాం” అని తెలిపారు. ఆశిష్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ మౌలిక వసతుల నిధిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Read More

సర్ ర్థర్ కాటన్‌పై అభిమానంతో శ్రామికులకు రూ.20 లక్షల సాయం

ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన సర్ ఆర్థర్ కాటన్ జయంతి రోజున ఆయన సేవలను స్మరించుకుంటూ తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన కౌలు రైతు సత్తి భాస్కరరెడ్డి (కందరెడ్డి) కొన్నేళ్లుగా తన వద్ద నమ్మకంగా పనిచేస్తున్న శ్రామికులకు రూ.20 లక్షలు అందజేసి ఆదర్శంగా నిలిచారు. కాటన్‌పై అభిమానంతో తన ఇంటి ముందు ఆయన విగ్రహాన్ని నిర్మించారు. ఏటా కాటన్ జయంతికి వేదపండితుల ఆశీర్వచనాలతో విగ్రహానికి పట్టువస్త్రాలు సమర్పించి, ధాన్యంతో అభిషేకాలు చేయిస్తుంటారు. ఈసారి కూడా యథావిధిగా ఆ కార్యక్రమాలన్నీ చేసి, ఏళ్ల తరబడి తన వద్ద పనిచేస్తున్న పది కుటుంబాలకు రూ. రెండేసి లక్షల చొప్పున రూ.20 లక్షలు అందజేశారు. రైతుల ప్రగతిలో శ్రామికుల కష్టాన్ని గుర్తించి వారికి బాసటగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ సాయం చేసినట్లు భాస్కరరెడ్డి తెలిపారు.

Read More