2047 నాటికి స్మార్ట్ ఫార్మ్ నెట్‌వర్క్

తెలంగాణలోని ఆచార్య జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కేంద్రంగా 2047 నాటికి మానవ రహిత వ్యవసాయ విధానాన్ని భారత్-ఆస్ట్రేలియా దేశాల పరస్పర సహకారంతో చేపట్టేందుకు ఉద్దేశించిన స్మార్ట్‌ఫార్మ్ నెట్‌వర్క్ గురువారం ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టు అమలుకు తెలంగాణ అగ్రివర్సిటీ, హైదరాబాద్ పరిశోధన, ఆవిష్కరణల కేంద్రం(ఆరఐసీహెచ్), ఆస్ట్రేలియాలోని చార్లెస్ స్టర్ట్ వర్సిటీ, బెంగళూరు సైన్స్ టెక్నాలజీ క్లస్టర్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా భారత్‌లో ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్, అగ్రివర్సిటీ వీసీ జానయ్య మాట్లాడుతూ.. “మానవ రహిత వ్యవసాయం సంకల్పంతో సాగే ఈ ప్రాజెక్టులో భారత్, ఆస్ట్రేలియాలకు చెందిన ప్రభుత్వ, పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాలు, అంకురాలు, పరిశ్రమలు భాగస్వాములుగా ఉంటాయి. సంయుక్త పరిశోధనలు, పైలట్ ప్రాజెక్టులు, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. వ్యవసాయ సాంకేతికతలు, వాతావరణ అనుకూల వ్యవసాయ విధానాలు, సంయుక్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం” అని వారు తెలిపారు. కార్యక్రమంలో భారత ప్రభుత్వ ప్రధాన సలహాదారు కార్యాలయం ముఖ్యశాస్త్రవేత్త విశాల్ చౌదరి, చార్లెస్ స్టర్ట్ వర్సిటీ వీసీ మైకేల్ ఫ్రెండ్, రిచ్ సీఈవో పింపాలె, బెంగళూరులోని ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ హిల్లరీ మెచీ, బెంగళూరు సైన్స్, టెక్నాలజీ క్లస్టర్ సీఈవో అనంత రామన్, అగ్రివర్సిటీ రిజిస్ట్రార్ విద్యాసాగర్, పరిశోధన సంచాలకుడు బలరాం తదితరులు పాల్గొన్నారు.

y

Read More

రొయ్యల మేత ముడిసరుకుల ధరలపై కేంద్రం జోక్యం

రొయ్యల మేత సహా ఆక్వా రంగానికి సంబంధించిన నిర్ణయాలు రైతులు, భాగస్వామ్య పక్షాలతో సంప్రదించిన తర్వాతే తీసుకునేలా చూడాలని భారత రొయ్య రైతుల సమాఖ్య అధ్యక్షుడు ఐపీఆర్ మోహన్‌రాజు కోరారు. మేత తయారీకి వాడే ముడిసరకుల ధరలపై కేంద్రం జోక్యం కోరుతూ సీఎం చంద్రబాబు లేఖ రాయడంపై కృతజ్ఞతలు తెలిపారు. మేత ధరల పెరుగుదలతో రైతుల మనుగడ, ఆక్వా సాగుపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. ప్రభుత్వ జోక్యంతోనే మేత ధరల పెంపును 15వ తేదీ వరకు తయారీదారుల సంఘం వాయిదా వేసిందని వెల్లడించారు

Read More

వ్యవసాయ వ్యర్థాలకు నిప్పుతో అనేక ప్రమాదాలు

ధూమపానం చేసే వారి నిర్లక్ష్యంతో, విద్యుదాఘాతంతో ఒకప్పుడు అగ్ని ప్రమాదాలు జరిగేవి. ప్రస్తుతం పంట వ్యర్థాల దహనం పేరిట, పెట్టే మంటలకు సమీప రైతుల ఆస్తులు అగ్నికి ఆహుతవుతున్నాయి. పంటలను తగలబెట్టడం మంచిది కాదని హితబోధ చేస్తున్నా, పెడచెవిన పెడుతున్న వ్యక్తులతో నిత్యం ఎక్కడో చోట మంటలు రేగుతూనే ఉన్నాయి. పచ్చని చేలు సైతం బూడిదగా మారుతున్నాయి. ఈ ఏడాది మైలవరం, తిరువూరు నియోజకవర్గాల పరిధిలో దాదాపు 25 వేల ఎకరాల వరకు మొక్కజొన్న సాగు చేశారు. గడిచిన నెలన్నర రోజులుగా కోతలు ముమ్మరంగా సాగగా, ఇప్పటికే 95 శాతానికి పైగా పూర్తయ్యాయి. కోతల అనంతరం ఖరీఫ్‌కు చేలను సిద్ధం చేయాలన్న ఆలోచనలో రైతులు, కంకులు విరవగా, ఉన్న పంట వ్యర్థాలను తగలబెట్టే పనులకు శ్రీకారం చుట్టారు. ఒకరిని చూసి, మరొకరు ఇదే పనికి పూనుకుంటున్నారు. ఏ చేను చూసిన మసిగా మారి కన్పిస్తోంది. పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్న మంటలను ఆర్పేందుకు వెళ్తున్న అగ్నిమాపక శకటాలకు సరైన దారిలేక మధ్యలోనే ఆగిపోవాల్సి వస్తుండటంతో సకాలంలో ఆర్పలేకపోతున్నారు.
20కి పైగా ప్రమాదాలు: మైలవరం ఫైర్ స్టేషన్ పరిధిలోని ఆరు మండలాల్లో గడిచిన రెండు నెలల వ్యవధిలో 20 వరకు అగ్ని ప్రమాదాలు జరిగాయి. అవన్నీ పొలాల్లో నిప్పు పెట్టినవే. విలువైన జామాయిల్ పంటలతో పాటు సాగునీటి సరఫరా సామగ్రి దగ్ధమ య్యాయి. ఎండలు మండుతున్న తరుణంలో, పూర్తిగా ఎండిన చేలల్లో అగ్గిపుల్ల గీసేసి వెళ్తుండటంతోనే పక్క చేలకు వ్యాపించి, ప్రమాద స్థాయి పెరుగుతోంది. కొన్నిసార్లు మంటలార్పేందుకు మేము దగ్గరకు వెళ్లలేని పరిస్థితి తలెత్తుతోంది అని మైలవరం అగ్నిమాపక అధికారి అన్నారు.

Read More

అధిక పోషక విలువలు గల తృణధాన్యాలు

ఆహారంలో మరింత ఎక్కువగా కొర్రలు, రాగులు, సజ్జలు, అరికెలు వంటి తృణధాన్యాలను వినియోగించేందుకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లోని మిల్లెట్ రీసెర్చ్ ల్యాబ్ విస్తృతంగా పరిశోధనలను చేస్తోంది. వాతావరణ మార్పులకు తట్టుకునే, అధిక పోషక విలువలు కలిగిన, రైతులకు గిట్టుబాటు కలిగించే కొత్త వంగడాలను ఇక్కడి శాస్త్రవేత్తలు, పరిశోధక విద్యార్థులు సృష్టిస్తున్నారు. ఆచార్యులు డా. ముతమిళవరసన్ నేతృత్వంలోని విద్యార్థులు కొర్రల్లో పోషక పదార్థాల శోషణ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు జన్యు ఆధారిత అధ్యయనాలు సత్ఫలితాలిస్తున్నాయి. దేశవిదేశాలలో సేకరించిన 156 కొర్ర రకాలపై విశ్లేషణలు చేసి తక్కువ ఫైటిక్ యాసిడ్ కలిగిన వాటిని అభివృద్ధి చేశారు. ల్యాబ్‌కు సమీపంలోని ఎకరం భూమిలో కొత్తగా సృష్టించిన కొర్ర వంగ డాలను పండించి ఫలితాలను సాధించారు. వీరి పరిశోధనలకు కేంద్ర సంస్థలు రూ. 5 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాయి.

జావ.. దోసెలు.. ఉప్మా.. బియ్యం.. మినపగుళ్లతోనే కాదు. కొర్రలతోనూ దోసెలు చేసుకుని తినొచ్చంటూ తృణధాన్యాల పరిశోధన ప్రయోగశాల ప్రతినిధులు చెబుతున్నారు. దోసెలతోపాటు ఉప్మా, జావ కూడా తయారు చేస్తున్నారు. ప్రత్యేకమైన రుచిని పరిచయం చేసేందుకు కొన్ని రెస్టారెంట్లలో సొంతంగా తయారు చేసి ఇస్తున్నారు. మిల్లెట్ ఆధారిత ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తృణధాన్యాల్లో అధిక ఫైబర్, ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు ఉండడంతో సమతుల్య ఆహారంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని వివరిస్తున్నారు. జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొర్రలు, రాగులు, సజ్ౙలు, అరికెల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

రైతులకు ఉచితంగా వంగడాలు
కొర్రలు ఎక్కువగా తింటే జీర్ణం కాదని అపోహలున్నాయి. జన్యుపరమైన అంశాలను పరిశీలిస్తే కొర్రల్లో ఫైటిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఈ యాసిడ్ జీర్ణక్రియను స్వల్పంగా మందగిస్తుంది. అందుకే చాలామంది ఆహారంగా తినేందుకు ఇష్టపడటం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు కొత్త రకం కొర్రల వంగడాలను రైతులతో సాగు చేయించాలని పరిశోధకులు నిర్ణయించారు. రెండు, మూడు సీజన్ల వరకూ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉచితంగా కొత్త వంగడాలను పంపిణీ చేయించనున్నారు.

బియ్యంలో అధికంగా కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. సులభంగా ఎవరైనా తింటారు. పైగా తెలుగు రాష్ట్రాలు సహా మరికొన్ని రాష్ట్రాల్లో పేదలకు ఉచితంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధిదారులకు అందిస్తున్నాయి. వారు కొర్రలు కొని వండుకుని ఆహారంగా తినేందుకు ఇష్టపడటం లేదు. అందుకే ఆయా రాష్ట్రాల్లో అల్పాహారంగా తృణధాన్యాలను ఎంపిక చేసుకోవాలని అభ్యర్థించనున్నారు.
Read More

2026-27 ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంపు

2026-27 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) ఆమోదం తెలిపింది. రైతులు తమ పంటలకు లాభదాయకమైన ధరలను పొందేలా చూడటమే లక్ష్యంగా ప్రభుత్వం ఖరీఫ్ పంటల మద్దతు ధరలను పెంచిందని సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వరి సాధారణ రకం (క్వింటాలుకు) రూ.2,441; వరి గ్రేడ్ ఏ రూ. 2,461; హైబ్రిడ్ జొన్నలకు రూ.4,023; మల్దండి జొన్నలు రూ. 4,073; సజ్ౙలు క్వింటాలు రూ.2,900; మొక్కజొన్న రూ.2,410; కందులు రూ.8,450; పెసర్లు రూ.8,780; మినుములు రూ.8,200; పత్తి (మదÎ్యరకం) రూ.8,267; కాటన్ లాంగ్ రకం రూ.8,667; వేరుశనగ రూ.7,517; పొద్దుతిరుగుడు రూ.8,343; సోయాబీన్ రూ.5,708; నువ్వులు రూ.10,346; ఒడిసలు రూ.10,052/Ðగా నిర్ణయించింది.

Read More

కోనసీమలో కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం

అంధ్రర్రాష్ట్రంలో కొబ్బరి ఆధారిత ఉత్పత్తులు, కొబ్బరి పీచు, నార, ఇతర అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై కాయర్ బోర్డు, సెర్ప్, ఎంఎస్ఎంఈ, ఉద్యానశాఖ అదికారులతో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ‘కోనసీమ జిల్లాలో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్నందున ఆ జిల్లాలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటుకు అవ కాశముంది. కొబ్బరి ఉత్పత్తుల నాణ్యత పెంచి దేశీయంగా.. అంతర్జాతీయంగా ఎగుమతులను ప్రోత్సహించాలి. రైతులకు అదనపు ఆదాయం కల్పించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలి. కొబ్బరి పంట సాగు, ఉత్పత్తి, అనుబంధ పరిశ్రమల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సిద్ధం చేయాలి’ అని అదికారులను ఆదేశించారు. సమావేశంలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో శేఖర్ బాబు, సెర్ప్ డైరెక్టర్ శంకర్ ప్రసాద్ పాల్గొన్నారు.

Read More

పశువైద్య కోర్సుల్లో ప్రవేశాలకు ప్రత్యేక కౌన్సెలింగ్

తెలంగాణలో పశువైద్య కోర్సుల్లో ప్రవేశాలకు 2026-27 విద్యాసంవత్సరం నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలని పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఎప్‌సెట్ ఫలితాలు వచ్చిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేయనుంది. రాష్ట్రంలో మొదట్నుంచీ వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య కళాశాలల్లో నిర్వహించే బీఎస్సీ వ్యవసాయం, బీటెక్ వ్యవసాయ ఇంజినీరింగ్, బీవీ ఎస్సీ కోర్సుల సీట్ల కోసం ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉమ్మడిగా ప్రవేశాలు జరుగుతున్నాయి. అగ్రివర్సిటీనే ఉమ్మడి నోటిఫికేషన్ వెలువరించి కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. ఇందులో మిగిలిన వాటికంటే పశువైద్య కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. మొదటి విడత పశువైద్య కోర్సుల కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత అగ్రి, ఉద్యానవర్సిటీ పరిదిలోని సీట్ల భర్తీ అయిన తర్వాతే మళ్లీ వెటర్నరీ కౌన్సెలింగుకు అవకాశం వస్తోంది. మూడో విడత కౌన్సెలింగులోనూ జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీవీఎస్సీ, ఎంవీఎస్సీ, పీహెచ్‌డీతో పాటు పాలిటెక్నిక్ కోర్సుల ప్రవేశాలను సత్వరమే భర్తీ చేసి తరగతులను ప్రారంభించేందుకు వీలుగా ప్రత్యేక కౌన్సెలింగ్ కోసం పశువైద్య వర్సిటీ కోరగా ప్రభుత్వం అనుమతించింది. దాంతో ఇకపై అగ్రివర్సిటీ, ఉద్యాన వర్సిటీల పరిధిలో మాత్రమే ప్రవేశాలు విడిగా జరగనున్నాయి.

Read More

పోలవరం పూర్తికి సహకరించాలని కేంద్రానికి వినతి

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల్లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు. రాష్ట్రానికి చెందిన వివిధ అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకురావడానికి దిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి సోమవారం మధ్యాహ్నం జలశక్తి శాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రిని కలిశారు. వివిధ అంశాలపై చర్చించి, వినతిపత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, తెదేపా పార్లమెంటరీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు, రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, నీటిపారుదలశాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Read More

సెర్ప్ నుంచి గ్రామీణ మహిళలకు కొత్త పథకం

రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) గ్రామీణ మహిళలకు జీవనోపాధి, ఆర్థిక సాధికారత కల్పించేందుకు జూన్ 2 నుంచి కొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది. దీనికింద మహిళలతో పొట్టేళ్ల యూనిట్లు, గొర్రె, మేక పిల్లల పెంపకం కేంద్రాలు, నాటు కోళ్లు, ఈము పక్షుల కొనుగోళ్ల యూనిట్లు ఏర్పాటు చేయిస్తారు. వారికి బ్యాంకు లింకేజీలు, రివాల్వింగ్ ఫండ్లు, సబ్సిడీల ద్వారా ఆర్థికసాయం అందిస్తారు. పథకానికి ఎంపికైన మహిళా సంఘాల లబ్దిదారులకు పశువైద్య వర్సిటీ శిక్షణ ఇస్తుంది. దీనిపై పీవీ నరసింహారావు తెలం గాణ పశువైద్య విశ్వవిద్యాలయంతో సెర్ప్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం హైదరాబాద్ బీఆర్‌కే భవన్‌లో సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, పశు వైద్య వర్సిటీ రిజిస్ట్రార్ శరత్‌చంద్ర ఒప్పందంపై సంతకాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు తెలంగాణ స్వయంసహాయక సంఘాల అభ్యున్నతి, పశుసంపద వృద్ధి కోసం ఒప్పందం చేసుకున్నట్లు దివ్యా దేవరాజన్ తెలిపారు.

Read More

చెదిరిన రైతు కుటుంబాల పిల్లలకు విద్యాదానం చేస్తున్న సాయి సంస్థాన్

రైతులు అప్పులు, పంటనష్టాల వంటి కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడితే.. వారి పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. చాలామంది చదువును మధ్యలోనే ఆపినేసి, కుటుంబ బాధ్యతలు మోయాల్సి వస్తోంది. ఇలాంటి రైతు కుటుంబాలకు అండగా మహారాష్ట్రలోని శిర్డీ సాయి బాబా సంస్థాన్ ట్రస్టు ఓ ముందడుగు వేసింది. చదువులో ప్రతిభ కనబరిచే బాధిత కుటుంబాల విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, భోజన సౌకర్యాలను అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్నిప్రారంభించింది. 10వ తరగతి పరీక్షలో 80 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాదించిన విద్యార్థులకు స్థానిక విద్యాప్రాంగణంలో 11, 12 తరగతులకు పూర్తి ఉచితవిద్యను అందిస్తున్నారు. ఈ పిల్లలకు ఇంజినీరింగు, వైద్యవిద్యకు అవసరమైన ప్రవేశ పరీక్షల శిక్షణ ఫీజులను సైతం సంస్థే చెల్లిస్తుంది.

Read More