2026-27 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) ఆమోదం తెలిపింది. రైతులు తమ పంటలకు లాభదాయకమైన ధరలను పొందేలా చూడటమే లక్ష్యంగా ప్రభుత్వం ఖరీఫ్ పంటల మద్దతు ధరలను పెంచిందని సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వరి సాధారణ రకం (క్వింటాలుకు) రూ.2,441; వరి గ్రేడ్ ఏ రూ. 2,461; హైబ్రిడ్ జొన్నలకు రూ.4,023; మల్దండి జొన్నలు రూ. 4,073; సజ్ౙలు క్వింటాలు రూ.2,900; మొక్కజొన్న రూ.2,410; కందులు రూ.8,450; పెసర్లు రూ.8,780; మినుములు రూ.8,200; పత్తి (మదÎ్యరకం) రూ.8,267; కాటన్ లాంగ్ రకం రూ.8,667; వేరుశనగ రూ.7,517; పొద్దుతిరుగుడు రూ.8,343; సోయాబీన్ రూ.5,708; నువ్వులు రూ.10,346; ఒడిసలు రూ.10,052/Ðగా నిర్ణయించింది.


