మిల్లెట్ మార్వెల్స్ సంస్థ భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్)కు చెందిన న్యూట్రిహబ్ సహకారంతో ‘రోజుకు ఒక పూట చిరుధాన్యాల భోజనం’ జాతీయ మిషన్‌ను సోమవారం హైదరాబాద్‌లోని ఐఐఎంఆర్ ప్రారంభించింది. ఐఐఎంఆర్ డైరెక్టర్ తారాసత్యవతి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిలు దీనిని ప్రారంభించారు. న్యూట్రిహబ్ డైరెక్టర్, సీఈఓ స్టాన్లీ, మిల్లెట్ మార్వెల్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ భరత్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిషన్‌కు సినీనటుడు నాగార్జున, ఏపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వీడియో ప్రసంగాల ద్వారా మద్దతు తెలిపారు.

5 May, 2026
