మినుములో సకాలంలో సస్యరక్షణతో అధిక దిగుబడులు
ఆంధ్రప్రదేశ్‌లో మినుమును అన్ని కాలాల్లో ఏటా 10.02 లక్షల ఎకరాల్లో సాగు చేస్తూ 4.25 లక్షల టన్నుల దిగుబడి చేస్తున్నారు. ఈ సంవత్సరం లోటు వర్షపాతం కారణంగా రబీ కాలం మినుము పంట సాగు ఆలస్యం అవుతుంది. పంట వేశాక లోటు వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత వలన రసం పీల్చే పురుగుల ఉదృతి పెరిగే అవకాశం ఉన్నది. అదేవిధంగా వైరస్ తెగుళ్ళు అయినటువంటి పల్లాకు తెగులు, మొవ్వు కుళ్ళు తెగులు మరియు బొబ్బర తెగులు పంటను ఆశించడానికి అనుకూల వాతావరణం ఉన్నది. వీటిని దృష్టిలో పెట్టుకొని మినుము పంటలో సమగ్ర సస్యరక్షణ పద్దతులను తెలుసుకొని ముందు నుంచి తగిన చర్యలు చేపట్టి అధిక దిగుబడిని పొందవచ్చు.
మినుము పంటను ఆశించు పురుగులు – వాటి నివారణ చర్యలు
1. చిత్త పురుగులు ( Flee Beetles):
- పైరు రెండు ఆకుల థలో ఉన్నప్పుడు ఈ పురుగులు పంటను ఆశిస్తాయి.
- ఆకుల అడుగు భాగము నుంచి తినడం వలన చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడుతాయి.

2. మారుక మచ్చల పురుగు:

- పంట పూత, పిందే థలో ఉన్నప్పుడు ఈ పురుగు పంటను ఆశిస్తుంది.
- పూత థలో పూలన్నీ గూడు చేసుకొని లోపల ఉంటూ లోపలి పదార్థాలను తింటాది.
- కాయ థలో కాయలన్నీ గూడు చేసి కాయలను రంధ్రం చేసుకొని లోపలి గింజలను తింటాది.
నివారణ చర్యలు: పంట పూమొగ్గ థలో 5 మి.లీ వేపనూనె లీటరు నీటికి కలిపి పిచికారి చేస్తే తల్లి పురుగు గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. వేప సంబంధిత మందులు వికర్షకాలుగా పనిచేయడం వలన తల్లి పురుగులు గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు, అంతేగాక అప్పటికే పంట మొక్కలపై ఉన్న గుడ్లు కూడా పగలి చనిపోతాయి.
3. పొగాకు లద్దె పురుగు:
- పిల్ల పురుగులు ఆకులోని పత్రహరితాన్ని గోకి తినడం వలన ఆకులు తెల్లగా జల్లెడ లాగ మారిపోతాయి.
- గొంగళి పురుగులు ఆకులని రంద్రాలు చేసి పువ్వులను, పిందెలను తినడం ద్వారా పంట నష్టం వాటిల్లుతుంది.

పొగాకు లద్దె పురుగు నివారణ చర్యలు:
- గుడ్ల సమూహము, మొదటి థ పిల్ల పురుగులు ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి.
- పురుగు ఉదృతి గమనించడానికి ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చాలి.
- ఆముదం పంటను ఎర పంటగా ఎకరాకు 50-100 మొక్కల చొప్పున వేసుకోవాలి. లద్దె పురుగులు ఆశించిన ఆముదం మొక్కలను నాశనం చేయాలి.
- లద్దె పురుగులు నివారణకు 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి.
4. తామర పురుగు:
- తామర పురుగులు ఆకుల అడుగు భాగం నుండి రసాన్ని పీలుస్తాయి.
- ఇవి మోవ్వుకుళ్లు మరియు ఆకు ముడత తెగులు కలుగచేసే వైరస్‌కి వాహకంగా ఉంటూ తెగులును వ్యాపింప చేస్తాయి.
5. తెల్లదోమ:

దీ ఆకుల నుంచి రసాన్ని పీల్చే ఈ తెల్ల దోమ పల్లాకు తెగులు కలుగ చేసే వైరస్‌కు వాహకంగా ఉంటూ పల్లాకు తెగులు వ్యాప్తికి దోహద పడుతుంది.
మినుము పంటను ఆశించు తెగుళ్ళు – వాటి నివారణ చర్యలు
1. పల్లాకు తెగులు:
- మొదటగా తెగులు సోకిన ఆకులపైన చిన్నని లేత పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. క్రమేణా ఈ మచ్చలు పెద్దవిగా అయిపోయి ఆకు అంతా పసుపు రంగులోకి మారిపోతుంది.
- తొలి థలోనే తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పైరు మొత్తం పసుపురంగులోకి మారి పూత మరియు పిందే ఏర్పడకుండా ఆకులు వాడిపోయి ఎండి రాలిపోతాయి.
- పంటను పూత మరియు పిందె థలో ఈ తెగులు ఆశిస్తే మొక్క తక్కువ పూతను కలిగిఉండి కాయలు పసుపురంగులోకి మారి వంకరలుగా తిరిగి గింజలు లేకుండా తాలు కాయలుగా మారిపోతాయి.
- బెమీసియ టబాసి అనే తెల్లదోమ వైరస్ వాహకంగా ఉంటూ తెగులు సోకిన కలుపు మొక్కలు మరియు ఇతర పంటల నుంచి మినుము పంటకు వ్యాపింపచేసి తీవ్ర నష్టాన్ని కలుగచేస్తాది.

యాజమాన్యం:
- పల్లాకు తెగులును తట్టుకొనే TBG104, PU31, LBG787, LBG904, VBN8 రకాలు సాగు చేసుకోవాలి.
- పంటను విత్తుకొనే ఒక రోజు ముందు విత్తన శుద్ధి చేస్తే పంట తొలి థలో వైరస్ ను వ్యాపింపచేసే తెల్లదోమ బారి నుండి కాపాడవచ్చు.
- ఎకరాకు 15 పసుపు రంగు జిగురు అట్టలు అమర్చాలి.
- తెగులు సోకిన మొక్కలను మరియు కలుపు మొక్కలను పీకి నాశనం చేయాలి.
- వైరస్‌కు ఎలాంటి మందులు లేవుకావున వైరస్ వాహకం అయినటువంటి తెల్లదోమను నివారించాలి.
2. ఆకుముడత, మొవ్వుకుళ్ళు తెగులు:
- ఈ తెగులు లక్షణాలు ఆకుల ఈనెలు, కాండం మరియు మొవ్వుల మీద గమనించవచ్చు.
- తెగులు సోకిన మొక్కలోని ఆకుల అడుగుభాగంలో ఈనెలు క్షీణించడం ద్వారా ఎరుపు/గోధుమ రంగులో మారిపోయి క్రమేణా ఆకుల తొడిమలకు మరియు కాండంకు వ్యాపిస్తుంది.
- తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు వెనుకకు ముడుచుకుపోయి రాలిపోవడం జరుగుతుంది.
- తొలి థలోనే ఈ తెగులు ఆశిస్తే మొక్కల తలలు మాడిపోయి గిడసబారి ఎండిపోతాయి.
- ఈ తెగులు పంట ముదురు థలో ఆశిస్తే తక్కువ కాయలను కలిగిఉండి కాయలు క్షీణించి దిగుబడి తగ్గుతుంది.
- ఈ వైరస్‌లు ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు తామరపురుగుల ద్వారా వ్యాపిస్తాయి.

యాజమాన్యం
- పొలం గట్ల మీద మరియు పంటపొలంలో కలుపు మొక్కలు ముఖ్యంగా వయ్యారిభామను పీకి తగలపెట్టాలి.
- ఎకరాకు 15 నీలం రంగు జిగురు అట్టలు అమర్చాలి.
3. సీతాఫలం తెగులు / బొబ్బర తెగులు
- తెగులు ఆశించిన మొక్కలలో ఆకులు పెద్దవిగా అయిపోయి ఆకులపై ఉబ్బెత్తుగా అయి మడతలు పడుతాయి ఇవి చూడటానికి సీతాఫలం కాయలాగా అగుపిస్తాయి కావున దీనిని సీతాఫలం తెగులు అంటారు.
- ముదురు ఆకులలో ఈ ముడతలు ఎక్కువగా ఉండి ఆకు మందంగా తయారవుతాది.
- తెగులు సోకిన మొక్కలలో పూత ఆలస్యంగా వచ్చి పూల మొగ్గలు చిన్నవిగా ఉండి కాయలు ఏర్పడవు.

- పెనుబంక, తెల్ల దోమల ద్వారా తెగులు సోకిన మొక్కల నుంచి ఆరోగ్యకరమైన మొక్కలకు వ్యాపింప చేస్తుంది.
యాజమాన్యం: ఈ తెగులు ఎక్కువగా విత్తనం ద్వారా వ్యాపిస్తుంది కావున ఆరోగ్యకరమైన వైరస్ లేని మొక్కల నుంచి సేకరించిన విత్తనాన్ని ఎంచుకొని విత్తుకోవాలి
వైరస్ తెగుళ్ళు సమగ్ర సస్యరక్షణ:
- ఈ ముడురకాల వైరస్ తెగుళ్ళు రసం పీల్చు పురుగులు అనగా తెల్లదోమ, తామరపురుగు మరియు పెనుబంక ద్వారా వ్యాపిస్తాయి కావున వీటిని నివారిస్తే వైరస్ తెగుళ్ళును నివారించగలము.
- రసం పీల్చు పురుగుల నివారణకు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి.
- పొలం లోపల మరియు గట్లమీద కలుపుమొక్కలు పీకి తగలబెట్టాలి.
- వైరస్ తెగులు సోకిన మొక్కలను పెరికేసి తప్పనిసరిగా కాల్చివేయాలి.
- దీ పొలం చుట్టూ మొక్కజొన్న కాని జొన్న కాని లేదా సజ్జలను నాలుగు వరుసలలో రక్షణ పంటగా వేసుకుంటే రసంపీల్చే పురుగులను పంటలోపలికి రాకుండా నివారించవచ్చు.
- ఒక ఎకరా పొలంలో కనీసం 15 చొప్పున పసుపు, నీలం మరియు తెలుపు రంగు జిగురు అట్టలను అమర్చితే రసం పీల్చే పురుగులను కొంతవరకు నివారించవచ్చు మరియు వాటి ఉధృతిని అంచనావేసి రసాయనిక మందులను పిచికారి చేయవచ్చు.
- విత్తిన 20 రోజులకు 5 మీ.లీ. వేపనూనెను లేదా 5% వేపగింజల కషాయాన్ని పిచికారి చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగులు పంటను ఆశించకుండా నివారించవచ్చు మరియు ఆప్పటికే పంటలో ఉన్న గ్రుడ్లును నాశనం చేయవచ్చు.
4. సర్కోస్పోరా ఆకు మచ్చ తెగులు
- తెగులు సోకిన ఆకులపై గోధుమ రంగు చిన్న చిన్న మచ్చలు కనిపిస్తాయి.
- అనుకూల వాతావరణ పరిస్థితులలో అనగా గాలిలో అదిక తేమ శాతం, అధిక వర్షాలు, అధిక మొక్కల సాంద్రత ఉన్నప్పుడు చిన్న మచ్చలు కలిసిపోయి పెద్దవిగా మారి మచ్చల అంచులు ముదురు గోధుమరంగులో, మచ్చ లోపలి భాగం తెలుపు రంగులో మారిపోతాయి.

- తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులన్నీ ఎండి రాలిపోతాయి.
5. కొరినోస్పోరా ఆకు మచ్చ తెగులు
- పూతథలో ఆకులపైన చిన్న చిన్న గుండ్రని గోధుమ రంగు వలయాకార మచ్చలు ఏర్పడుతాయి.
- అవి క్రమేణా పెద్దవిగా మారి మచ్చలోపలి భాగం కుళ్లిపోయి రంధ్రాలుగా మారుతాయి, తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులన్నీ ఎండి రాలిపోతాయి.

6. బూడిద తెగులు:
- గాలిలో అధిక తేమ శాతం, మబ్బులతో కూడిన వాతావరణం గల రబీ సీజన్‌లో బూడిద తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటది.
- విత్తిన 30-35 రోజులలో ముదురు ఆకుల పైభాగాన చిన్నని బూడిద వంటి తెలుపు మచ్చలు ఏర్పడి క్రమేణ పెద్దవిగా మారి ఆకు అడుగుభాగాన, కొమ్మలు మరియు కాయలను వ్యాపిస్తాయి.

- తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకు అంతా తెలుపురంగు బూడిదతో కప్పబడి క్రమేణా పసుపు రంగులోకి మారి ఆకులన్నీ రాలిపోతాయి.
గమనిక: మినుము పంటను ఆశించే వివిధ రకాల చీడపీడలు, తెగుళ్ళ నివారణకు సరైన చర్యలు చేపట్టి నివారించుకోవాలి.
డా. డి. విజయ్ కుమార్ నాయక్ ఐఖఐ (సస్యరక్షణ విభాగం); డా. కే. కిరణ్ కుమార్ రెడ్డి ఐఖఐ (సేద్య విభాగం); డా. ఎస్. లోకేష్ బాబు ఐఖఐ (విస్తరణ విభాగం); డా. ఆర్.సుజాత ఐఖఐ (గృహ విభాగం); హరి సాదు ఐఖఐ (మత్స్య విభాగం); డా. జి.ఎల్. శివజ్యోతి, సమన్వయ కర్త, కృషి విజ్ఞాన కేంద్రం, నెల్లూరు. ఫోన్ : 99485 42942




















































