ఈ-నామ్ 2.0పై పూర్తి స్థాయి శిక్షణ అవసరం

కేంద్ర ప్రభుత్వం 2014లో ఈ-నామ1.0ను ప్రవేశ పెట్టింది. దీన్ని మరింత వృద్ధి పరిచి ఈ ఏడాది ‘ఈ-నామ్ 2.0’ను తీసుకొచ్చింది. అయితే, సిబ్బందికి కనీసం శిక్షణ ఇవ్వకుండా అమలు చేయడంతో పంట నమోదులో తప్పిదాలు (ఎర్రర్) చూపించడం, బిడ్డింగ్ సమస్యలు, ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్ల లాగిన్లలో ఇబ్బందులు, రైతులకు మంచి ధర వచ్చే అవకాశం లేకపోవడం, ఒక్క రోజులో పూర్తయ్యే అమ్మకాలకు మూడు రోజులు పట్టడం వంటి ప్రధాన సమస్యలు తలెత్తుతున్నాయి. ఫిబ్రవరి 27న ఈ-నామ్ 2.0 ప్రవేశపెట్టగా లాట్ల కేటాయింపులు జరగకపోవడంతో అధికారులు నిజామాబాద్ మార్కెట్ యార్డులో బహిరంగ వేలం ద్వారా పసుపు కొనుగోళ్లు చేపట్టగా రైతులు క్వింటాకు రూ. వెయ్యి వరకు నష్టపోయారు. తాజాగా శుక్రవారమూ అదే పరిస్థితి ఎదురైంది. యార్డుకు 30 వేల బస్తాల పసుపు రాగా ఉదయం 8 గంటల నుంచి అధికారులు తీవ్రంగా శ్రమించాక వెయ్యి బస్తాలకు మాత్రమే లాట్లు ఇవ్వగలిగారు. తర్వాత సాఫ్ట్‌వేర్ సమస్య తలెత్తడంతో గత్యంతరం లేక బహిరంగ వేలం ప్రారంభించడంతో వ్యాపారులు పంట కొనుగోలు చేశారు. వేలం విధానంలో సాధారణంగా కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులకు మాత్రమే లాభం ఉంటుంది. వారు నిర్ణయించిన ధరకే రైతులు పంటను విక్రయించాల్సి వస్తుంది. సిబ్బందికి ఈ-నామ్ 2.0 పై పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చి… సాంకేతిక సమస్యలను అధిగమించిన తర్వాతే అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.

Read More

బయో ఫోర్టిఫైడ్ మొక్కజొన్నలో అధిక పోషకాలు

హెచ్‌క్యూ పీఎం-5 పేరుతో అభివృద్ధి చేసిన అధిక ప్రొటీన్ మొక్కజొన్న పంటను గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు (కేవీకే) ఈ విత్తనాలను కేవీకే శాస్త్రవేత్తలు ఈ రబీలో 20 ఎకరాల్లో సాగు చేయిస్తున్నారు. దిల్లీకి చెందిన భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) సహకారంతో ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐ.ఏ.అర్.ఐ.) శాస్త్రవేత్తలు ఈ వంగడాలను అభివృద్ధి చేశారు. వీటిని ఆంధ్రప్రదేశ్‌లోని గండ్రాయి, చెర్వుకొమ్ముపాలెం, బబ్బెళ్లపాడు, తక్కెళ్లపాడు, అనుమంచిపల్లి, కన్నెవీడు గ్రామాల్లో రైతులకు పంపిణీ చేశారు. 20 ఎకరాల్లో పంట సాగులో ఉంది. పంట లేత కంకి దశలో ఉంది. కాకినాడ జిల్లా పెద్దాపురం అఖిల భారత సమన్వయ మొక్కజొన్న పరిశోధన ప్రాజెక్టు సౌజన్యంతో రైతులకు కలుపు మందులు, పురుగు మందులు ఉచితంగా అందించారు. ఈ విత్తనాల ప్రత్యేకతను కేవీకే సేద్యవిభాగం శాస్త్రవేత్త డాక్టర్ పీఎన్ శివప్రసాద్, వ్యవసాయ విస్తరణ విభాగం శాస్త్రవేత్త ఐ. వెంకటరెడ్డి వివరించారు.
ఇది బయోఫోర్టిఫైడ్ హైబ్రిడ్ రకం మొక్క జొన్న. సాధారణ రకంతో పోలిస్తే ఇందులో రెట్టింపు అమైనో ఆమ్లాలు (లైసిన్, ట్రిప్టోఫాన్), అధిక ప్రొవిటమిన్-ఎ కంటెంట్‌తో మెరుగైన పోషకాలు ఉంటాయి. ఈ పంట 90 రోజుల్లో కోతకు వస్తుంది. వ్యాధి నిరోధకత ఎక్కువగా ఉండే ఈ మొక్కజొన్నను మనుషులు తినేందుకు, పశువుల దాణాకు కూడా వినియోగిస్తారు.
హెచ్‌క్యూ పీఎం-5 మొక్కజొన్నలో పోషకాల నాణ్యత దాదాపు 3.37 శాతం లైసిన్, 0.72 శాతం ట్రిప్టోఫాన్, 6.60 పీపీఎం ప్రొవిటమిన్-ఎ కలిగి ఉంటుంది. హెక్టారుకు 43-76 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మన ప్రాంతంతో పాటు రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో సాగుకు అనుకూలం. ఇది 5.8-6.8 పీహెచ్ ఉన్న నేలల్లో బాగా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత మిషన్ కింద దేశ ప్రజల్లో పోషకాహార లోపాలను నివారించడానికి ఈ రకం విత్తనాల సాగును ప్రోత్సహిస్తోంది.

Read More

రైతులకు మార్కెట్ అవకాశాలు విస్తరించాలి

వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఫ్లోరిడా విశ్వవిద్యాలయ ప్రతినిధుల సమావేశంఫ్లోరిడా విశ్వవిద్యాలయం (University of Florida – UF-SNRE) సహజ వనరులు మరియు పర్యావరణ పాఠశాల డైరెక్టర్ డా. కె. రమేష్ రెడ్డి నాయకత్వంలోని ప్రతినిధుల బృందం, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును నేడు కలిసి తెలంగాణలో వ్యవసాయ అభివృద్ధిపై చర్చించారు.ఈ సందర్భంగా, ఫ్లోరిడా విశ్వవిద్యాలయం తరఫున శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంతో కలిసి పరిశోధన, విస్తరణ మరియు విద్యా రంగాల్లో సంయుక్త భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం మరియు ఫ్లోరిడా విశ్వవిద్యాలయం కలిసి తెలంగాణ డిజిటల్ మరియు సుస్థిర వ్యవసాయ వ్యవస్థల కేంద్రం (టిడిఎసఏసి) స్థాపనపై కూడా చర్చించారు.ఈ భాగస్వామ్యం ద్వారా డిజిటల్ మరియు ఖచ్చిత వ్యవసాయం, ఏ.ఐ. ఆధారిత వ్యవస్థలు, రిమోట్ సెన్సింగ్, డ్రోన్ టెక్నాలజీ వంటి ఆధునిక పద్ధతులను వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. అలాగే వాతావరణ మార్పులకు అనుగుణమైన పంటలు అభివృద్ధి, నేల ఆరోగ్య సంరక్షణ, నీటి వినియోగ సమర్థత పెంపు వంటి అంశాలపై ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రత్యేకంగా తెలంగాణలో స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి అధిక విలువ పంటల సాగు, అలాగే వాటికి సంబంధించిన ప్రాసెసింగ్ టెక్నాలజీలు, పరిశ్రమల స్థాపన ద్వారా రైతులకు అధిక ఆదాయం అందించే అవకాశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ మరియు విలువ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేసి, రైతులకు మార్కెట్ అవకాశాలను విస్తరించే దిశగా కలిసి పనిచేయాలని ప్రతినిధులు సూచించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని సాంకేతికంగా బలోపేతం చేయడం, రైతుల ఆదాయం పెంచడం దిశగా ఇలాంటి అంతర్జాతీయ భాగస్వామ్యాలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల అమలుకు సంబంధించి ఒక టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.ఈ సమావేశంలో మాజీ ‘అంగ్రూ’ వైస్ ఛాన్సలర్ డా. ఎస్. రఘువర్ధన్ రెడ్డి, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డా. రాజిరెడ్డి పాల్గొన్నారు

Read More

పసుపు కొనుగోళ్ళపై సమీక్ష

అకాల వర్షాలు, ఈదురు గాలులతో నష్టపోయిన పసుపు రైతులను ఆదుకునేందుకు తేమతో ఉన్న పసుపును కూడా ఎటువంటి కోతలు లేకుండా పూర్తి తూకంతో కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించామని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన సచివాలయంలో పసుపు కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు భారీగా పసుపు వస్తోంది. సోమవారం అర్ధరాత్రి బలమైన గాలులు, వర్షాల ప్రభావంతో సుమారు 3,450 మంది రైతులకు చెందిన 7,080 పసుపు కుప్పలు తేమకు గురయ్యాయి. ఈ పసుపును ఎటువంటి కోతలు లేకుండా కొనుగోలు చేసేందుకు ఆదేశించాం’ అని తెలిపారు.
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం
తెలంగాణలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా మే 4 నుంచి 9 వరకు నిర్వహించబోయే రైతు ఉత్సవాల్లో రైతులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మంగళవారం ఆయన సచివాలయం నుంచి ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్‌లో కార్యదర్శి సురేంద్రమోహన్‌తో కలిసి మాట్లాడారు.

Read More

పశువుల ఆరోగ్యం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు

వేసవిలో తీవ్రమైన వేడి గాలుల కారణంగా వడదెబ్బతో పశువుల ఆరోగ్యం, వాటి ఉత్పత్తుల సామర్థ్యంపై తీవ్ర ప్రభావం పడడంతోపాటు మరణాలకూ దారితీయవచ్చు కాబట్టి క్షేత్రస్థాయి సిబ్బందికి, పశుపోషకులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి. దామోదర్ నాయుడు అత్యవసర మార్గదర్శకాలను జారీ చేశారు.
పశువులు అధిక మొత్తంలో నీటిని తీసుకునేందుకు వీలుగా నీటి తొట్టెలను నిండుగా పెట్టాలి. పశువులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో సామూహిక నీటితొట్టెలు ఏర్పాటు చేయాలి. పశువులు ఉండే షెడ్లలో ఉష్ణోగ్రత పెరగకుండా నీటితో తడిపిన గోనె సంచులను చుట్టూ కట్టాలి, పైకప్పు మీద తరుచూ నీల్లు చల్లుతూ ఉండాలి. పశువులను మేతకు ఉదయం 10 గంటల లోపు, సాయంత్రం 5 గంటల తర్వాతనే వదలాలి. సంకర జాతి పశువుల షెడ్లలో తప్పనిసరిగా స్ప్రింకర్లు, ఫ్యాన్లు అమర్చాలి. పశువులు వేగంగా శ్వాస తీసుకోవడం, నోటి నుంచి చొంగ కారడం, నిస్సత్తువగా ఉండడం, నీరు అదే పనిగా తాగడంలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ పశువులను చల్లని నీటితో తడపాలి, స్థానిక పశువైద్యులను సంప్రదించాలి. అత్యవసర పరిస్థితుల్లో సంచార పశు ఆర్యోగ సేవా వాహనాలను వినియోగించుకోవాలి అని సూచించారు.

Read More

వేప చెట్లకు డైబ్యాక్ శిలీంధ్రం ఆశిస్తుంది

అన్ని ప్రాంతాల్లోనూ వేప చెట్లకు మళ్లీ తెగులు సోకింది, కొమ్మలు ఎండిపోతున్నాయి, చెట్లకు పూత రావడం లేదు. అంతో ఇంతో వచ్చినా కాయలుగా మారడం లేదు. డైబ్యాక్ అనే శిలీంధ్రం వల్ల ఈ సమస్య తలెత్తిందని వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. టీ దోమ అనే కీటకమూ మరో కారణమని తేల్ౘ్ారు. ఈ తెగులు సోకితే చెట్టు పైభాగం నుంచి మొదలై.. కింది వరకు కొమ్మలు క్రమంగా ఎండిపోతాయి. పూత మాడిపోతుంది. 100% గింజ ఉత్పత్తి ఉండదు.

పరిష్కారం: ఎండిపోయిన చోటుకు 15 సెం.మీ. దిగువన (కొమ్మ ఆరోగ్యంగా ఉన్నచోటకు) కత్తిరించాలి. కత్తిరించిన కొమ్మలను దూరంగా తీసుకెళ్లి తగలబెట్టాలి. లేదంటే శిలీంధ్ర బీజాలు గాలి ద్వారా ఇతర ఆరోగ్యకర చెట్లకు వేగంగా వ్యాప్తి చెందుతాయి. చెట్ల కింద రాలిన వేప ఆకులతో సాయంత్రం పొగ వేయడం ద్వారా టీ దోమల్ని నియంత్రించవచ్చు. చెట్టు మొదలులో వేప పిండి, సేంద్రియ ఎరువులు వేయడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచవచ్చని ఉద్యాన శాఖ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Read More

గోసంరక్షణకు తెలంగాణా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది

తెలంగాణా రాష్ట్రంలో గోసంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు అమలు చేస్తోందని ఇప్పటికే ప్రణాళికలు రూపొందించిందని, సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి, పీపుల్ ఫర్ యానిమల్స్ వ్యవస్థాపకురాలు మేనకాగాంధీ ఆదివారం శాసనమండలి హాలులో రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ కె. రామకృష్ణారావు, జీహెచఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిధిలో వీధికుక్కల స్టెరిలైజేషన్, నిర్వహణ, గోసంరక్షణ చర్యలను మేనకాగాంధీకి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అత్యాధునిక సౌకర్యాలతో ఎన్కపల్లిలో గోశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Read More

తుపాన్లను తట్టుకునే వరి రకం

ఆచార్య ఎన్ౙీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని మార్టేరు పరిశోధన కేంద్రం ఎంటీయూ 1318 రకాన్ని విడుదల చేసి 2020లో మినీ కిట్లు ఇచ్చి రైతులతో సాగుచేయించగా మంచి ఫలితాలు వచ్చాయి ఈ రకాన్ని 2022 నుంచి సాగుకు అందుబాటులోకి తీసుకొచ్చారు. తుపాన్లను తట్టుకుని దీటుగా నిలబడి మంచి దిగుబడులు ఇస్తుండటంతో గత ఖరీఫ్ లో శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు సుమారు 6 లక్షల ఎకరాల్లో ఎంటీయూ 1318 రకం సాగైంది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలుమూరు మండలం పెనికేరులో తుపానుకు పడిపోయిన స్వర్ణ రకం వరి. పక్కనే నేలవాలకుండా నిలబడిన ఎంటీయూ 1318 రకం మొంథాను తట్టుకుని…. ఉభయగోదావరి, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో వరిపై మొంథా తుపాను తీవ్ర ప్రభావం చూపింది. 3 లక్షలకు పైగా ఎకరాల్లో పంట దెబ్బతింది. కనీసం ఎకరాకు 15-20 బస్తాల దిగుబడికి నష్టం వాటిల్లింది. ఇలాంటి ప్రకృతి విపత్తులను దృష్టిలో ఉంచుకుని స్వర్ణ స్థానంలో ఇతర రకాలను రైతులు ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఎంటీయూ 1318ని.. కృష్ణా, గోదావరి జిల్లాల్లో 5 లక్షల ఎకరాలకుపైగా సాగు చేశారు. మొంథా తీవ్ర అలజడి సృష్టించినా 90% పంట పడిపోకుండా నిలబడింది. రెండేళ్ల సగటును పరిశీలిస్తే ఎకరాకు 35-40 బస్తాల దిగుబడి వస్తుంది. వర్షాలకు పంట నేలవాలలేదు.
ఎకరాకు 4-5 బస్తాల అధిక దిగుబడి

  • పాలడుగు సత్యనారాయణ, పరిశోధన సంచాలకులు, ఆచార్య ఎన్ౙీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
    మార్టేరు పరిశోధన కేంద్రంలో పనిచేసినప్పుడు ఎంటీయూ 1318ని రూపొందించా. స్వర్ణ రకాన్ని ఎంటీయూ 1064(అమర)తో సంకరపరిచి అభివృద్ధి చేసిన విత్తనమిది. 150-155 రోజుల వ్యవధిలో దిగుబడినిచ్చే ఈ రకం.. కాండం దృఢంగా ఉండటం వల్ల తుపాన్లకు నేల వాలదు. దోమపోటు, ఎండాకు, అగ్గితెగుళ్లను తట్టుకుంటుంది. స్వర్ణతో పోలిస్తే ఎకరాకు 4-5 బస్తాల దిగుబడిని అదనంగా ఇస్తుంది.
Read More

మొక్కజొన్న పంట ఉత్పత్తి మొత్తానికి సాయం అందించాలి

ఆంధ్ర రాష్ట్రంలో మొక్కజొన్న రైతులకు ధరల వ్యత్యాస పథకం కింద అయ్యే వ్యయాన్ని మొత్తం కేంద్రమే భరించడంతోపాటు.. 100% పంట ఉత్పత్తికి అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు. ‘2025-26 రబీలో రాష్ట్రవ్యాప్తంగా 4.83 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. 37.61 లక్షల టన్నుల దిగుబడి లభిస్తుందని అంచనా. అత్యధికంగా నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు, విజయనగరం, ఏలూరు, ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం, ఎన్టీఆర్, కర్నూలు, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సాగైంది. రబీ పంట జూన్ వరకు చేతికొస్తోంది. అధిక ఉత్పత్తి కారణంగా, మార్కెట్ ధరలు కనీస మద్దతు ధర కంటే తక్కు వగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇది మరింత తగ్గుతుందని అంచనా. దీంతో రైతులు పెద్ద ఎత్తున నష్ట పోతారు’ అని లేఖలో చంద్రబాబు వివరించారు. కర్షకుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు. మద్దతు ధర, మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసాన్ని 50:50 నిష్పత్తిలో కాకుండా మొత్తం కేంద్రమే భరించాలని, మొత్తం పంట ఉత్పత్తిలో 25% మాత్రమే కాకుండా 100% ఉత్పత్తికి సాయం అందించాలని పేర్కొన్నారు. జూన్ వరకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

Read More

తెలంగాణాలో సబ్సిడీపై పంట పొలాలకు సౌర విద్యుత్ కంచెలు

తెలంగాణలో అడవి జంతువుల వల్ల ఏటా 5 లక్షల ఎకరాల మేరకు పంట నష్టం వాటిల్లుతోంది. పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నించే రైతుల పైనా అడవి పందులు, కోతులు దాడిచేసి గాయపరుస్తున్నాయి. గత పదేళ్లలో 40 మందికి పైగా మరణించగా.. వందల మంది గాయపడ్డారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా వంటి పథకాల్లోనూ జంతువుల ద్వారా జరిగే పంట నష్టాలకు పరిహారం లేదు. ఈ నేపథ్యంలో సౌరవిద్యుత్ కంచెల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. 50% సబ్సిడీతో పరికరాల కొనుగోలు సాయం అందించేందుకు రూ.10 కోట్లు మంజూరు చేసింది. జిల్లాల వారీగా సన్న, చిన్నకారు రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి, అర్హులైన వారిని ఎంపిక చేస్తుంది. వ్యవసాయ మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు అధికారుల బృందం హిమాచల్‌ప్రదేశ్‌లో అధ్యయనం చేసింది. ఆ రాష్ట్రంలో ఐదువేల గ్రామాల్లో సౌరవిద్యుత్ కంచెలను ఏర్పాటు చేయించగా సత్ఫలితాలువచ్చాయి. దీంతో తెలంగాణ లోనూ సౌరవిద్యుత్ కంచెలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయనుంది. కంచె వేయాల్సిన ప్రాంతం, పరిమాణాన్ని బట్టి ఖర్చు ఉంటుంది.

Read More