క్యారెట్ పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు
- ఒక పెద్ద క్యారెట్ దుంప
- రెండు ఉల్లిగడ్డలు
- ఒక వెల్లుల్లి గడ్డ
- ఆరు పచ్చి మిరపకాయలు
- తగినంత ఉప్పు
- జీలకర్ర, చింతపండు లేదా నిమ్మరసం
- సమయానికి ఉంటే, కొత్తిమీర ఆకులను వేసుకోవచ్చు.
అన్నిటినీ శుభ్రంగా నీళ్లతో కడిగి, తేమ లేకుండా నీడన ఆరబెట్టాలి.
మొదట చింతపండు, జీలకర్రలను రోట్లో వేసి మెత్తగా నూరి, అందులో క్యారెట్ ముక్కలు వేసి దంచి, అందులో పొట్టు తీసిన ఉల్లిపాయ, వెల్లుల్లి పాయలను వేసుకొని కాస్తా బరుకుగా దంచుకోవాలి.
ఉప్పు, కారం ఎవరి అబిరుచి ప్రకారం వారు కలుపుకోవాలి.
క్యారెట్ పచ్చడిలో ఉప్పు తక్కువ పడుతుంది. కనుక ఉప్పును తక్కువ వేసుకోవాలి.
పచ్చడిలో నూనె పోపు అవసరం లేదు.
ఏ రోజుకు ఆ రోజు తయారు చేసుకుని వాడుకోవచ్చు. తాజాగా, సహజ సువాసనలతో రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నం రొట్టెలు దోశెల్లో కలిపి తినడానికి రుచికరంగా ఉంటుంది.
అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు.
చిన్న రోలు, నూరే రాయి ఉంటే సరిపోతుంది.
పొయ్యి మీద వండే పనే లేదు.
- శ్రీమతి జిట్టా జ్యోతి

