వండని వంట… కొబ్బరి అటుకుల లడ్డు
ఉడికించని, వేపని, వేడిచెయ్యని, సహజంగా చేసుకునే ఒక స్వీట్ కొబ్బరి అటుకుల లడ్డు. ఇది చేసుకోవడం చాలా సింపుల్. చాలా రుచికరమైన స్వీట్.
కావాల్సిన పదార్ధాలు: అటుకులు, పచ్చి కొబ్బరి తురుము, ఎలాచి పొడి, బెల్లం తురుము.
తయారీ విధానం: అటుకులను కచ్చాపచ్చాగా దంచుకుని, అందులో ఎలాచి పొడి, కొబ్బరి తురుము వేసుకుని, తీపి రుచి చూసుకుంటూ బెల్లం వేసుకోవాలి.
పచ్చి కొబ్బరి వల్ల, లడ్డు కట్టడానికి వస్తుంది… ఎక్కువ తీపి పట్టదు, కానీ రుచిగా ఉంటుంది.
పచ్చి కొబ్బరి కనుక, అప్పటికప్పుడు చేసుకుని తినవచ్చు. లేదా ఫ్రిజ్‌లో పెట్టుకుని వారం పది రోజుల పాటు వాడుకోవచ్చు.
రచన: సంధ్యా శశికాంత్
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి



