దేశీయంగా రొయ్యలకు బలమైన మార్కెట్ కల్పించేందుకు ఆర్థిక తోడ్పాటు అందించాలని.. కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని రొయ్య రైతుల సమాఖ్య అధ్యకక్షుడు మోహన్‌రాజు కోరారు. ప్రధాని మోదీ, కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డులకు ఆయన ఈ మేరకు లేఖలు రాశారు. ఇటీవల మత్స్యశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో వచ్చిన సూచన మేరకు దేశీయ మార్కెట్ పెంచేందుకు అవసరమైన సవివర ప్రాజెక్టు నివేదికలు రూపొందించి పంపినట్లు ఆయన తెలిపారు. మత్స్య అభివృద్ధి బోర్డు ద్వారా ఒక్కోటి రూ.50 కోట్ల పెట్టుబడితో ఏడాదికి 3 వేల టన్నుల సామర్థ్యంతో 20 రొయ్యల నిర్వహణ, మార్కెటింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

10 Sep, 2025
