ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అంతర్ౙాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8, 9 తేదీల్లో మెగా రైతు మేళా నిర్వహించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి దీనిని ప్రారంభిస్తారు. వ్యవసాయరంగంలో మహిళా రైతుల సాధికారత, భూసార పరి రక్షణ, సేంద్రియ వ్యవసాయం, పంటల మార్పిడి, ఆధునిక సాంకేతికత వినియోగం, వ్యవసాయానుబంధ రంగాల బలోపేతం తదితర అంశాలపై చర్చతోపాటు ప్రదర్శన నిర్వహిస్తామని విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్ జానయ్య తెలిపారు. మేళాలో ఉత్తమ మహిళా రైతులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు.

28 Feb, 2026
