నాడెప్ కంపోస్ట్ పద్ధతిని నారాయణ్ డియోరావ్ పండరి పాండే అనే మహారాష్ట్ర రైతు అభివృద్ధి చేశారు. నాడెప్ కంపోస్టు పద్ధతి ప్రత్యేకంగా పశువులు లేని రైతులకు మంచి ప్రత్యామ్నాయం.
కంపోస్ట్ పిట్ పరిమాణం: పొడవు: 10 అడుగులు, వెడల్పు: 6 అడుగులు, ఎత్తు : 3 అడుగులు. ఒక అడుగు ఎత్తు వరకు ఇటుకల మధ్య ఎటువంటి ఖాళీలు ఉండకూడదు. తర్వాత ఒక్కో ఇటుకకు మధ్య 6 అంగుళాల ఖాళీ ఉండాలి.
కంపోస్టు తయారీకి కావలసిన పదార్థాలు :
పంట అవశేషాలు లేదా ఎండు / పచ్చి ఆకులు – 1350-1400 కి.
పశువుల పేడ లేదా బయోగ్యాస్ / గోబర్ గ్యాస్ స్లర్రీ – 98-100 కి.
జల్లెడ పట్టిన మట్టి – 1675 కి.
నీరు – 1350-1400 లీ. కంపోస్ట్ తయారు చేసే పదార్థాలను పిట్‌లో నింపే ముందు గోడలను పేడతో అలకాలి. నాడెప్ కంపోస్ట్ తయారీలో ముఖ్య అంశం పిట్‌ని కావలసిన పదార్థాలతో 24 గంటలలోపు ఒకేసారి నింపడం.
మొదటి పొరః 6 నుంచి 10 అంగుళాల వరకు పంట అవశేషాలు, ఆకులు మొదలైనవి.
రెండవ పొర : 4 కిలోల పేడను 100 లీ. నీటిలో కలిపి మొదటి పొరపై చల్లాలి.
మూడవ పొర : 60 కిలోల మట్టిని పొరలాగా చల్లాలి.
పై విధంగా 10Ð12 పొరలుగా కంపోస్ట్ పిట్ నింపడం పూర్తి చేయాలి. అలా నింపిన తర్వాత, జీవ పదార్థాన్ని 3 అంగుళాల మందంగల మట్టితో కప్పి పేడ మరియు మట్టి పేస్టుతో అలకాలి.
కంపోస్ట్ పిట్‌ని నింపిన 15-20 రోజుల తర్వాత నాడెప్ కంపోస్ట్ పిట్ 2 అడుగులు కుంగడం జరుగుతుంది. కుంగిన పిట్‌ని పైన పేర్కొన్న విధంగా 2-3 పొరలు నింపి మరలా పేడ మరియు మట్టి పేస్టుతో అలకాలి. తర్వాత 3 నెలల వరకు, 10-15 రోజులకొకసారి నీరు చిలకరించడానికి తప్ప కదిలించరాదు. మొత్తం కంపోస్ట్ పిట్‌ని తాటాకులతో కప్పాలి. ఎటువంటి పరిస్థితులలోను బీటలు ఏర్పడకుండా చూడాలి. ఒకవేళ ఏర్పడితే వెంటనే వాటిని స్లర్రీతో నింపాలి. 90-120 రోజుల తర్వాత సుమారు 2.5 టన్నుల కంపోస్టు తయారవుతుంది. ఈ కంపోస్ట్ ఎరువులో నత్రజని 1.0 శాతం, భాస్వరం 0.5 శాతం, పొటాష్ 1.2 శాతం ఉంటాయి. సాధారణ కంపోస్టు పద్ధతిలో తయారైన కంపోస్టు కంటే 3-4 రెట్లు పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి.
ప్రయోజనాలు : రసాయన ఎరువుల ఖర్చు తగ్గుతుంది. భూసారం పెరుగుతుంది. పంట దిగుబడి పెరుగుతుంది. సేంద్రియ పంటల సాగుకు దోహదపడుతుంది. బయట ఉత్పాదకాలపై ఆధారపడటం తగ్గుతుంది.
ప్రస్తుతం 2026లో ఎల్ నినో (El Niño) అధికారికంగా ప్రారంభమైందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO), అమెరికాకు చెందిన నోవా (NOAA) శాస్త్రవేత్తలు ధృవీకరించారు. ఇది రాబోయే శరదృతువు (Autumn) నాటికి మరింత బలపడి, ప్రమాదకరమైన “సూపర్ ఎల్ నినో” (Super El Niño) స్థాయికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ కేంద్రాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి.
ఎల్ నినో అంటే పసిఫిక్ మహాసముద్రం (Pacific Ocean) యొక్క మధ్య మరియు తూర్పు భాగాలలో సముద్ర ఉపరితల నీటి ఉష్ణోగ్రత సాధారణం కంటే పెరగడం అనే ఒక వాతావరణ దృగ్విషయం. ఇది సాధారణంగా ప్రతి 2 నుండి 7 సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తుంది మరియు 9-12 నెలల నుండి కొన్నిసార్లు 2 సంవత్సరాల వరకు కొనసాగవచ్చు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం, ఉష్ణోగ్రత మరియు గాలుల నమూనాలను మారుస్తుంది. ఇది El Niño–Southern Oscillation (ENSO) అనే పెద్ద వాతావరణ వ్యవస్థలో ఒక దశ. ENSO లో మూడు దశలు ఉన్నాయి:
El Niño (వేడి దశ),
La Niña (చల్లని దశ) మరియు
Neutral (సాధారణ స్థితి).
ఎల్ నినో లక్షణాలు: • సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుదల (+0.5°C లేదా అంతకంటే ఎక్కువ) • గాలుల నమూనాలలో మార్పులు • వర్షపాత నమూనాలలో మార్పులు • దక్షిణ అమెరికా ప్రాంతంలో భారీ వర్షాలు • ఆస్ట్రేలియా మరియు భారతదేశంలో కరవు పరిస్థితులు
ముఖ్య గమనిక: ఎల్ నినో మాత్రమే వర్షపాతాన్ని నిర్ణయించదు. ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD), స్థానిక వాతావరణ వ్యవస్థలు వంటి ఇతర అంశాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అందువల్ల, కొన్నిసార్లు ఎల్ నినో ఉన్నప్పటికీ మంచి వర్షాలు కురవవచ్చు (IOD పాజిటివ్‌గా ఉంటే). భారతదేశంలో వ్యవసాయంపై ఎల్ నినో ప్రభావాలు
భారతదేశ వ్యవసాయం వర్షంపై చాలా ఎక్కువగా ఆధారపడి ఉంటుంది, ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై (south-west monsoon). ఎల్ నినో సంభవించిన సంవత్సరాల్లో రుతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం మరియు కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఉదాహరణకు 2002, 2009 మరియు 2015 లలో ఎల్ నినో కారణంగా వర్షపాత కొరత ఏర్పడింది.
వర్షపాత కొరత (Drought): ఎల్ నినో సమయంలో వర్షపాతం తగ్గడం వల్ల కరవు పరిస్థితులు ఏర్పడతాయి. దీనివల్ల నీటి కొరత ఏర్పడి పంటలు ఎండిపోయే అవకాశం ఉంది.
పంట ఉత్పత్తి తగ్గడం: వరి, జొన్నలు, గోధుమలు, పప్పుధాన్యాలు మొదలైన ముఖ్యమైన పంటల ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల రైతులకు నష్టం వాటిల్లుతుంది.
నీటిపారుదల సమస్య: జలాశయాలు (రిజర్వాయర్లు) మరియు భూగర్భ జలాల మట్టాలు తగ్గిపోతాయి. దీనివల్ల పంటలకు నీటిపారుదల సౌకర్యం కల్పించడం కష్టమవుతుంది.
కీటకాలు మరియు తెగుళ్ల పెరుగుదల: వాతావరణ మార్పుల కారణంగా కొన్ని రకాల కీటకాలు మరియు వ్యాధులు/తెగుళ్లు పెరుగుతాయి. ఇది పంటల నాణ్యతను మరియు ఉత్పత్తిని దెబ్బతీస్తుంది.
నివారణ చర్యలు
కరవు తట్టుకునే పంటలు: రాగులు, జొన్నలు, సజ్జలు మొదలైన తక్కువ నీరు అవసరమయ్యే పంటలను పండించడం ఉత్తమం.
నీటి సంరక్షణ: వర్షపు నీటి నిల్వ (వాటర్ హార్వెస్టింగ్), వ్యవసాయ కుంటల నిర్మాణం చేయడం.
సరైన పంట ప్రణాళిక: వాతావరణ సమాచారం ఆధారంగా పంట ఎంపిక మరియు విత్తే సమయాన్ని నిర్ణయించడం.
సూక్ష్మ నీటిపారుదల సాంకేతికత: బిందు (డ్రిప్) మరియు తుంపర (స్ప్రింక్లర్) నీటిపారుదల పద్ధతులను ఉపయోగించడం నీటి పొదుపునకు సహాయపడుతుంది.
పంట బీమా (Crop Insurance): పంట నష్టం నుండి రక్షణ పొందడానికి బీమాను ఉపయోగించుకోవడం.
రైతులకు వ్యవసాయ సలహాలు మరియు ముందస్తు జాగ్రత్తలు జూన్ నెల ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి కీలకమైన సమయం. భారత వాతావరణ శాఖ (IMD) మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయాల ముందస్తు అంచనాల ప్రకారం, ఈ ఏడాది జూన్ నెల వాతావరణం మరియు రైతులు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తల సంక్షిప్త సమాచారం:
వ్యవసాయ భూమి సిద్ధం చేయడం మరియు విత్తడం • నేలను సిద్ధం చేయడం: తొలకరి జల్లులు మరియు ప్రారంభంలో కురిసే వర్షాలను ఉపయోగించుకుని భూమిని లోతుగా దుక్కి దున్ని సిద్ధం చేసుకోండి. ఇది మట్టిలో తేమను పట్టి ఉంచడానికి సహాయపడుతుంది. • విత్తడానికి తొందరపడవద్దు: కనీసం 50 నుండి 60 మి.మీ. మేర మంచి వర్షం పడి, మట్టిలో తగినంత పదును (తేమ) ఏర్పడే వరకు విత్తే కార్యక్రమాన్ని ప్రారంభించవద్దు. • కరవును తట్టుకునే రకాల ఎంపిక: వర్షపాత కొరత సూచనలు ఉన్నందున, తక్కువ కాలపరిమితిలో చేతికి వచ్చే మరియు తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలు మరియు రకాలను (ఉదాహరణకు: జొన్న, సజ్జ, పెసర, మినుము, కంది మొదలైనవి) ఎంపిక చేసుకోవడం ఉత్తమం. • భూగర్భ జలాల సద్వినియోగం: వర్షాల అస్థిరత ఉన్నందున వ్యవసాయ కుంటలు (ఫార్మ్ పాండ్స్), బోర్‌వెల్ మరియు బిందు సేద్యం (Drip Irrigation) పద్ధతిని ఉపయోగించడానికి ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోండి.
సారాంశం ప్రపంచవ్యాప్త ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా ఎల్ నినో పరిణామాలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇది వాతావరణ మార్పులకు ఒక ముఖ్యమైన సూచిక. “2026 లో పూర్తి కరవు లేదా పూర్తిగా మంచి వర్షాలు కురుస్తాయని ఖచ్చితంగా చెప్పలేం – కానీ ‘అస్థిర వాతావరణం’ అనేది మాత్రం నిజం.” ఎల్ నినో అనేది ఒక సహజ వాతావరణ ప్రక్రియ అయినప్పటికీ, దాని ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా వ్యవసాయం మరియు ఆహార భద్రతపై ఇది పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల, విజ్ఞాన ఆధారిత వ్యవసాయం, వాతావరణ సమాచారం మరియు సరైన ప్రణాళికల ద్వారా మనం దీని ప్రభావాన్ని తగ్గించవచ్చు.
“ఎల్ నినోను నిరోధించడం సాధ్యం కాదు, కానీ దాని ప్రభావాలను తగ్గించడం మన చేతుల్లోనే ఉంది”
డా. బి. చంద్ర శేఖర్, నేల (మృత్తికా) శాస్త్ర అధ్యాపకులు, పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU)
మురిపిండ / కుప్పింట / హరిత మంజరిగా పిలువబడే హరిత మంజరి ఏకవార్షిక హెర్బల్ మొక్క. ఇది ఒక కలుపు మొక్కగా అన్ని చోట్లా కన్పిస్తుంది. దీని పూలగుత్తులు కప్పులాంటి ఆకారంలో కప్పబడి ఉంటాయి. పూలు అతి చిన్నవిగా ఉంటాయి. ఈ మొక్క నిటారుగా 1.2 మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకులు వెడల్పుగా అండాకారంలో ఉంటాయి. ఈ మొక్క 1.2-6.55þ14 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకు మొదలు గుండ్రంగా ఉంటుంది. ఆకుకాడ 1.5 నుండి 5.5 సెం.మీ. పొడవుంటుంది. పూలకాడలు 2.5 నుండి 6 సెం.మీ. పొడవుంటాయి. పూలకాడ క్రింది భాగంలో ఆకుపచ్చ రంగులో ఆడపూలు ఉంటాయి. కాండం పొడవునా దళసరి ఈనెలలో నూగు కలిగి ఉంటుంది. కాయ 1.5þ2 మి.మీ. పరిమాణంలో 3 చీలినట్లున్నభాగాలతో నూగు కలిగి ఉంటుంది. మురిపిండ ఒక మీటరు ఎత్తు పెరిగే ఏకవార్షిక మొక్క. ఆకులు దాదాపు వృత్తాకారంలో ఉండి, కణుపుకు ఒకటి చొప్పున ఏర్పడతాయి. ఆకు అంచులకు దంతాల వంటి నొక్కులుంటాయి. ఆడ, మగ పుష్పాలు వేర్వేరుగా ఒకే మొక్కపై ఏర్పడతాయి. ఫలాలు గుండ్రంగా ఉండి ఒకే విత్తనం కలిగి ఉంటాయి. పుష్పాలు, ఫలాలు సంవత్సరం పొడవునా మొక్కపై ఏర్పడతాయి. మురిపిండ మొక్కలు తొలకరి వర్షాలు పడిన వెంటనే భూమిపై మొలకెత్తి వర్షాకాలంలో ఏపుగా పెరుగుతాయి. ఇవి పంటపొలాలలోను, బీడు భూములలోను, కంచెల వెంబడి కలుపు మొక్కలుగా పెరుగుతాయి. మురిపిండ మొక్కలో అకాలైఫిన్, అరంటియమైడ్, కాన్నాబినాల్, ఫ్లేవకెంఫెరాల్, సక్సినిమైడ్ వంటి అనేక రసాయనాలుంటాయి.
సాధారణ నామం : ఇండియన్ అకలైఫా / ఇండియన్ నెటిల్ / ఇండియన్ కాపర్ లీఫ్ శాస్త్రీయ నామం : అకలైఫా ఇండికా కుటుంబం: యూఫర్బియేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
కుప్పింట అనేక సంప్రదాయ ఔషధ ప్రయోజనాలు కలిగి, వాంతిమందుగా, విరేచనకారిగా, నులిపురుగుల నివారిణిగా, గజ్జి నివారిణిగా ఉపయోగపడుతుంది.
నూరిన ఆకుల రసానికి ఉప్పు కలిపి లేదా కషాయంగా తీసుకుని గజ్జి చర్మవ్యాధులను నివారించుకోవచ్చు. దీని కషాయం ఆస్త్మా చికిత్సకి, కాలేయం, మూత్రపిండాలను శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది.
వేరు కషాయం విరేచనకారిగా పని చేస్తుంది.
ఆకులను కంటి జబ్బుల చికిత్సలో ఉపయోగిస్తారు. ఆకుపొడిని గాయాల చికిత్సకు ఉపయోగిస్తారు.
భారతదేశంలో కుప్పింటని ఉబ్బసం, న్యుమోనియా చికిత్సకుపయోగిస్తారు. ఆఫ్రికా, ఇండియాలలో దీని ఆకులను కూరవండుకుని తింటారు.
వ్యవసాయరంగంలో …
కుప్పింట యాంటిఆక్సిడెంట్, యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్, యాంటిఇన్‌ఫ్లమేటరి, యాంటిఅల్సర్, యాంటిహెల్మింటిక్, యాంటిక్యాన్సర్, యాంటివీనోమ్ చర్యలు కలిగి ఉంది (సుధాకర్, అతని అనుచరులు, 2016).
కుప్పింట మిథనాల్ ద్రావణాలు పంటలలో తెగుళ్ళు కలిగించే గ్జాంతోమోనాస్ కాంపెస్ట్రిస్ బాక్టీరియా పెరుగుదలను గణనీయంగా అరికట్టింది (జాన్ డిబ్రిట్టె, అతని అనుచరులు, 2011).
కుప్పింట కాండం, బెరడు ద్రావణాలు మిడత, ఎపాక్రోమియా స్పీ. పై విషచర్యను ప్రదర్శించింది. (పుట్టరుద్రయ్య అండ్ భాటియా, 1955).
కుప్పింట బెరడు, ఆకుపొడులు, వాటి ఇథనాల్ ద్రావణాలు గొంగళిపురుగు, యూప్రోక్టిస్ ఫ్రెటిర్నా మరియు డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లాలపై కీటక నాశక చర్యను ప్రదర్శించాయి (మెకిండూ, 1983).
కుప్పింట మొక్కలు పంటలలో శత్రు పురుగుల సహజ జీవనియంత్రణ కారకాలైన మిత్ర పురుగులకు ఆశ్రయమిస్తాయి (టిఎనఎయు అగ్రిటెక్‌పోర్టల్) కుప్పింట మొక్క భూమిలోని విషపూరిత లోహాలైన సీసం (లెడ్), నికిల్, క్రోమియం, కాడ్మియంలను గ్రహించి నిల్వ చేసుకుంటుంది. అందువలన ఈ లోహాలతో కలుషితమైన భూముల నుండి వీటిని తొలగించడానికి ఈ మొక్కను సిఫారసు చేయవచ్చు. (సుభాషిణి అండ్ స్వామి, 2015)
ఈ మొక్కలో ఉన్న “కన్నాబినాల” అనే రసాయనం కీటకాలకు అభివృద్ధి నిరోధకంగా, క్రిమిసంహారకంగా పనిచేస్తుంది. వీటి ఆకులను ‘పంచపత్ర కషాయం’ తయారీలో ఉపయోగించవచ్చు.
ఈ కషాయాన్ని రైతులు స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఇది స్పర్శ చర్య, ఉదర చర్య కలిగి ఉంటుంది. అందువలన ఈ కషాయం ఒక శక్తివంతమైన కీటకనాశనిగా పనిచేసి పురుగులను అదుపులో ఉంచుతుంది.
వీటి ఆకుల ద్రావణానికి అపరాల నిల్వలో ఆశించే పుచ్చు పురుగును నివారించే శక్తి ఉన్నట్లు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. దీనికి శిలీంద్ర నాశని లక్షణాలు కూడా ఉన్నాయి (జయకుమార్ సోలమన్, తమిళనాడు).
దోమల లార్వాలను నిర్మూలించే గుణం ఈ కషాయానికుందని కెల్మ్ (1997) పరిశోధనలు తెలియజేశాయి. పత్తి పంటలో ఆకులను తినే పురుగులు, ఎర్రనల్లి నివారణకు ఈ కషాయాన్ని ఉపయోగించవచ్చు.
మురిపిండ ఆకులు చాలా ఘాటైన వాసన కల్గి ఉంటాయి కనుక ఈ కషాయాన్ని పంటలపై పిచికారి చేస్తే, దీనిలోని రసాయనాలు కీటకాలకు ఆహార భక్షక నిరోధకాలుగా పనిచేస్తాయి (రఘునాథ్).
శ్రీగోమాత గాయత్రి ఆర్గానిక్స్ కుప్పింట మొక్కనుపయోగించి బహుళ పంటలలో విస్తృతంగా ఉపయోగించే వ్యవసాయ పురుగుమందుని తయారు చేశారు. దీని తయారీకి కావలసిన మొక్కల పదార్థాలు : పసుపు, వేప, మిరప, అల్లం, ఉల్లి, జిల్లేడు (కలోట్రాపిస్ జైగాంటియా, కలోట్రాపిస్ ప్రోసెరా), బొప్పాయి, కానుగ, తులసి, పొగాకు, లాంటానా, ఉమ్మెత్త, కుప్పింట, ఆముదం, సింబోపోగాన్ సిట్రేటస్, ఆముదం మొక్క, సదాపుష్ప (కాథరాంతస్ రోసియస్), గన్నేరు. వావిలి, ఉల్లి, మిరియాలు, సీతాఫలం, టేకు, వస, నీలగిరి చెట్టు, జట్రోఫా, పుదీన, గరిక, గోమూత్రం, గోమయం.
ఈ పురుగుమందు అనేక పంటలలో పురుగులను సంహరిస్తుంది. మొక్కలలో పురుగులు, తెగుళ్ళు, వైరస్‌ల నిరోధకశక్తిని పెంచుతుంది. తెగులుకారక సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. అనేక పురుగులను వికర్షిస్తుంది. శిలీంద్రాలు, లార్వాలు, క్రిములు, బాక్టీరియా, నులిపురుగులు, గుల్లలు, నత్తలను చంపుతుంది. దీనినుపయోగిస్తే ఇంకే పురుగుమందును వాడవలసిన అవసరం లేదు. మోతాదు : 3% (30 మి.లీ./లీ.) పురుగుమందు పిచికారి చేయాలి., ఎకరానికి 35 లీ. ఒకసారి పిచికారి చేయడానికి ఉపయోగించాలి. నిల్వ కాలం : 3 సంవత్సరాలు
కుప్పింట ఆకుల పొడి నీటి ద్రావణం (0.05 గ్రా./లీ.) టమాట కాయనాశించే బాక్టీరియం, క్ౙాంతోమోనాస్ వెసికటోరియాపై బాక్టీరియానాశక చర్యను ప్రదర్శించింది (అడెడైర్, అతని అనుచరులు, 2017).
జీవామృతం తయారీకి కావాల్సిన పదార్థాలు (ఎకరం పొలానికి)
200 లీటర్ల నీరు (ఎకరానికి సరిపోతుంది)
10 కిలోల పేడ (నాటు ఆవు)
5 నుంచి 10 లీటర్ల నాటు ఆవు మూత్రం
2 కిలోల బెల్లం (నల్లబెల్లం శ్రేష్టమైనది)
2 కిలోల పప్పుధాన్యాల పిండి (ఉదా: ఉలవ, అలసంద, కంది, మినప, పెసర పిండి, ఏదైనా లేక వీటిని కలిపైనా వాడొచ్చు)
పొలం గట్టు మట్టి…పిడికెడు
రసాయనిక వ్యవసాయం వల్ల భూమిలో సూక్ష్మజీవరాశి, సేంద్రియ పదార్థం నశించి పొలాలు నిస్సారమైపోయాయి. ఈ దశలో భూమిని తిరిగి సారవంతం చేయడం అత్యవసరం. అందుకు ‘జీవామృతం’ చక్కగా ఉపయోగపడుతుంది. ప్రకృతి వ్యవసాయ రథానికి నాలుగు చక్రాలు, వాటిలో జీవామృతం ఒకటి. మిగతావి… బీజామృతం, అచ్ఛాదన, నీటి యాజమాన్యం.
జీవామృతం ద్వారా భూమిలో సూక్ష్మజీవులు, వానపాములు ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతాయి. మట్టిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములను చైతన్యవంతం చేయడం ద్వారా జీవామృతం భూసారం పెరగడానికి దోహదపడుతుంది. భూమిలోని పోషకాలను మొక్కలు నేరుగా వినియోగించుకునే రూపంలోకి మార్చి అందించడంలో వానపాములు, సూక్ష్మజీవుల పాత్ర అసాధారణమైనది. మేలు చేసే కోటాను కోట్ల సూక్ష్మజీవులకు నిలయం పశువుల పేడ, మూత్రం. పేడ, మూత్రంతో పాటు బెల్లం, పప్పుల పిండి, నీటిని కలిపినప్పుడు పేడలోని సూక్ష్మజీవరాశి ప్రతి 20 నిమిషాలకు రెట్టింపవుతుంది.
జీవామృతం తయారీ విధానం: ఎండ తగలని చోట పెట్టిన సిమెంటు తొట్టి లేదా ప్లాస్టిక్ పీపాలో 200 లీటర్ల నీటిని నింపాలి. పేడ, మూత్రం, బెల్లం, పిండి తదితరాలను అందులో వేసి బాగా కలపాలి. గడియారం ముల్లు తిరిగే దిశగా అంటే సవ్యదిశలో కర్రతో కలియతిప్పాలి. గోనె సంచి కప్పాలి. ఉదయం ఒక నిమిషం, సాయంత్రం ఒక నిమిషం కలియ తిప్పుతూ ఉండాలి. అందులోని సూక్ష్మజీవరాశి ప్రతి 20 నిమిషాలకోసారి రెట్టింపు అవుతూ ఉంటుంది. 48 గంటల తర్వాత వాడకానికి జీవామృతం సిద్ధమవుతుంది. ఎకరానికి 200 లీటర్ల జీవామృతాన్ని ప్రతి 15 రోజులకోసారి సాగు నీటితో పాటు వాడాలి లేదా భూమిలో పదునుంటే నేరుగా చల్లాలి. జీవామృతాన్ని అన్ని పంట పొలాల్లోనూ వాడవచ్చు. పంటలపైన పిచికారీ చేయొచ్చు.
పంటలపై జీవామృతం పిచికారీ ఇలా… 3 నెలల్లో (60Ð90 రోజుల్లో) పూర్తయ్యే పంటలకు (ఎకరానికి): మొదటిసారి: (విత్తనం నాటిన నెలకు) 100 లీ. నీటికి 5 లీటర్లు జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. రెండోసారి: (21 రోజుల తర్వాత) 150 లీ.నీటికి 10 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. మూడోసారి: (21 రోజుల తర్వాత) 200 లీ. నీటికి 20 లీ. జీవామృతంను కలిపి చల్లాలి. నాలుగోసారి: (గింజ ఏర్పడుతున్న దశలో) 200 లీ. నీటిలో 5 లీ. పుల్లమజ్జిగ కలిపి పిచికారీ చేయాలి (ఈసారి జీవామృతం అక్కర్లేదు). 6 నెలల్లో (150 నుంచి 180 రోజుల్లో) పూర్తయ్యే పంటలకు (ఎకరానికి): మొదటిసారి: (విత్తనం నాటిన నెలకు) 100 లీ. నీటికి 5 లీటర్లు జీవామృతం కలిపి చల్లాలి. రెండోసారి: (30 రోజుల తర్వాత) 150 లీ.నీటికి 10 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. మూడోసారి: (30 రోజుల తర్వాత) 200 లీటర్ల ‘నీమాస్త్రం’ను చల్లుకోవాలి. నాలుగోసారి: (30 రోజుల తర్వాత) 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. ఐదోసారి: (30 రోజుల తర్వాత) 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం కలిపి చల్లాలి. ఆరోసారి: (గింజ ఏర్పడుతున్నప్పుడు) 200 లీ. నీటిలో 6 లీ. పుల్లమజ్జిగ (ఈసారి జీవామృతం అక్కర్లేదు) కలిపి పిచికారీ చేయాలి. జీవామృతం, పంచగవ్య తదితరాల తయారీలో వాడే ఆవు పేడ ఎంత తాజాదైతే అంత మంచిది. వారం రోజుల వరకు పర్వాలేదు. మూత్రం మాత్రం ఎంత పాతదైతే అంత మేలు జరుగుతుంది.
ఇది దాదాపు 10 మీ. ఎత్తు వరకు పెరిగే బహువార్షిక మొక్క. పత్రాలు సంయుక్తమై ఉంటాయి. పత్రకాలు దాదాపు 20 -40 వరకు వుండి దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. పుష్పాలు లేత గులాబి రంగులో గాని, తెల్లగా గాని ఉండి నారింజ పసుపు రంగులోకి మారతాయి. ఫలాలు చిన్న చిక్కుడు కాయల వలే ఉంటాయి. గింజలు అండాకారంలో కోలగా, ఎర్రగా లేదా తెల్లగా ఒక చివర నల్లని మచ్చ కలిగి ఉంటాయి. తెల్లపూలు వచ్చే తీగలకు గింజలు తెల్లగా ఉంటాయి, ఈ గింజలు ఫిబ్రవరి నుండి జూన్ వరకు లభిస్తాయి. గురివింద విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. పొదల మీద ప్రాకుతూ కన్పిస్తుంది.
సాధారణనామం : ఇండియన్ లిఖోరిస్ శాస్త్రీయ నామం: ఆబ్రస్ ప్రికటోరియస్ కుటుంబం: ఫాబేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
గింజలు, వేర్లు, ఆకులు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వేర్లు, ఆకులలో గ్లైకోరైజిన్ అనే రసాయనముంటుంది. గింజలలో యాబ్రిన్, ఇండోల్ అనే ఆల్కలాయిడ్లు, ఆంథోసయనిన్ ఉంటాయి. యాబ్రిన్ విషపూరితం.
గ్లైకోరైజిన్ కఫాన్ని తొలగించడమే గాకుండా వాపులను, అలర్జీలను తగ్గిస్తుంది. గురివింద గింజ విషతుల్యం. క్రిమిసంహారక, గర్భనిరోధక శక్తి కలిగి ఉంది. కేశ వృద్ధికరం.
ఆకులు, వేర్లు వీర్యవృద్ధికరం. మూత్ర విసర్జనకు, వాపులకు, గాయాలకు, ఉబ్బసం, బొల్లి తదితర చర్మవ్యాధులు, తీవ్ర దాహార్తి నివారణకు ఉపయోగపడుతుంది.
వేర్లను ఆవు పాలలో కలిపి మిశ్రమం తయారు చేసి అతిసారం మరియు రక్తవిరేచనాల నివారణకుపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో …
గురివింద ఆకులు, గింజల నీటి, మిథనాల్ ఆధారిత ద్రావణాలు కోపోటెర్మెస్ జెస్ట్రాయ్ మరణశాతాన్ని గణనీయంగా పెంచాయి (ప్రసాద్,అతని అనుచరులు, 2016)
గురివింద గింజలలోని అబ్రిన్ అనే రసాయనం పిండినల్లి, మాకోనెల్లికోకస్ హిర్సూటస్‌లో సుగర్స్ పరిమాణాన్ని తగ్గించింది. ప్రోటీన్ పరిమాణాన్ని కూడా గణనీయంగా తగ్గించింది. సుగర్స్, ప్రోటీన్, లిపిడ్ పరిమాణాన్ని తగ్గించడం ద్వారా అబ్రిన్ పిండి నల్లుల సంఖ్యపై తీవ్ర ప్రభావాన్ని చూపింది (అనిత, ఆమె అనుచరులు, 1998).
గురివింద నీటి ద్రావణాన్ని వర్మ్స్ నివారణలో ఉపయోగిస్తారు. ఉగాండ రైతులు గురివింద ఆకులు, కాండాలను పురుగుల నివారణలో ఉపయోగిస్తారు (నువగచి, 2016)
గురివింద గింజ మిథనాల్ ద్రావణం రాల్‌స్టోనియా సొలనేసియారం, స్ట్రెప్టోమెసిస్ స్కాబీస్‌పై కన్నా పెక్టోబాక్టీరియం కరటోవోరంపై అధిక శక్తివంతమైన ప్రభావాన్ని చూపింది. గురివింద గింజలోని ఫ్లేవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, రెసిన్స్, ఫినాల్స్, గ్లైకోసైడ్స్, స్టిరాల్స్, ట్రైటెర్పిన్స్ యాంటి బాక్టీరియల్ ప్రభావాన్ని చూపించవచ్చు. ఇథైల్ ఎసిటేట్ఇథనాల్ మిశ్రమ (80:20) ద్రావణం స్ట్రెప్టోమైసిన్ స్కాబీస్‌పై అధిక శక్తివంతమైన ప్రభావాలను చూపుతుంది. గింజల ద్రావణంలో ఉన్న డై (2ఇథైల్ హెక్సైల్) ఫ్తాలేట్ స్ట్రెప్టోమైసిస్ స్కాబీస్‌పై అధిక బాక్టీరియా నాశక చర్యను ప్రదర్శించింది (అబ్బాసి, అతని అనుచరులు, 2016).
గురివింద గింజల నీటి ద్రావణం, ఇథైల్ ఆల్కహాల్ ద్రావణం రెండు మచ్చల ఎర్రనల్లి, టెట్రానైకస్ ఉర్టికె పెద్ద ఆడ పురుగులను అత్యంత సమర్ధవంతంగా నివారించాయి. పెట్రోలియం ఈథర్ ద్రావణం గుడ్డు దశపై సమర్థవంతంగా పనిచేస్తుంది (అమర్, అతని అనుచరులు, 1989).
గురువింద ఆకులు, కాండాలు కీటకనాశక లక్షణాలు కలిగి వున్నాయి (ఓక్యుటె, 2012). గురువింద గింజల క్రూడ్ ద్రావణం ఆల్టర్నేరియా సొలాని శిలీంద్ర పెరుగుదలను అరికట్టింది. ఈ ద్రావణం ఫ్యుజేరియం సొలాని పెరుగుదలను కూడా అరికట్టింది (యాస్మిన్, ఆమె అనుచరులు, 2015).
గురివింద పెట్రోలియం ఈథర్ ద్రావణాలు మానవుల తలలోని పేలు, పెడిక్యులస్ హ్యూమనస్ కాపిటిస్‌ని సమర్ధవంతంగా నివారించాయి (ఉపాధ్యాయ్, అతని అనుచరులు, 2011).
గురివింద మిథనాల్ ద్రావణాలు స్పోడోప్టెరా లిటూర గుడ్లపై 100% గుడ్లనాశక చర్యను ప్రదర్శించాయి. మిథనాల్ ద్రావణం (500 పిపియం) గణనీయమైన లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది (ఎలుమలైకుప్పుసామి, అతని అనుచరులు, 2015), బోడయ్య, అతని అనుచరులు, 2016).
ఈడిస్ ఈజిప్టి చికెన్‌గునియా, యెల్లో మరియు డెంగ్యు జ్వరాల ముఖ్య వాహకం. గురివింద గింజల ద్రావణం ఈడెస్ ఈజిప్టి లార్వాలపై అదిక లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది (అడెబాజొ, అతని అనుచరులు, 2014).
బయోనెస్ట్ కో ఇంక్యుబేషన్ కార్యక్రమం కింద వ్యవసాయ అంకురాలను ప్రోత్సహించడానికి హైదరాబాద్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (నార్మ్) లో మూడు సంస్థల మధ్య శుక్రవారం త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. నార్మ్, ఎ-ఐడియా, భారత నూనె గింజల పరిశోధన సంస్థ(ఐఐవోఆర్)ల ప్రతినిధులు దీనిపై సంతకం చేశారు. దీని కింద ఎంపికైన అంకురాలకు ఈ 3 సంస్థలు సాయం అందిస్తాయి. నార్మ్ సంచాలకుడు, ఎ-ఐడియా అధ్యక్షుడు ఆరఎం సుందరం, ఐఐవోఆర్ సంచాలకుడు ఆర్‌కె మాథూర్, అంకుర సంస్థల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
వ్యవసాయాన్ని లాభదాయకం చేసేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలని సాగుకు సాంకేతికతను అనుసంధానించడం ద్వారా రైతుకు మేలు చేయాలని నాబార్డ్ మాజీ చైర్మన్, ఐఐఎఫఎల్ సంస్థ ఫైనాన్స్ చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు అన్నారు. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం(ఆంగ్రూ) 63వ వ్యవస్థాపక దినోత్సవాలు గుంటూరు సమీపంలోని లాంఫాం ఆడిటోరియంలో శుక్రవారం జరిగాయి. వాతావరణ మార్పు అంశాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు. ఎల్‌నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆంగ్రూ అభివృద్ధికి రూ.3 లక్షలు విరాళం అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రచురించిన ‘మారనున్న వాతావరణ, వాణిజ్య పరిస్థితులకు సుస్థిర వరి వ్యవసాయం’, గుంటూరు జిల్లాలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం ప్రచురించిన ‘కంది సాగు సమగ్ర యాజమాన్యం, మినుము పంటకు నేల ద్వారా సంక్రమించే తెగుళ్లు, అపరాల సాగులో సమగ్ర కలుపు యాజమాన్యం’ పుస్తకాలను ఆవిష్కరించారు.
పశు సంవర్ధక శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల సహకారంతో తెలంగాణా రాష్ట్రంలో పాడిపరిశ్రమ, విస్తరణ, అభివృద్ధి, దాని ఉత్పత్తుల తయారీ, పశువుల పెంపకంపై శిక్షణ శిబిరాలు నిర్వహించాలని పీవీ నరసింహారావు రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. పాడి రైతులతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యురాళ్లకు శిక్షణనిచ్చేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా రాజేంద్రనగర్ పశువైద్య కళాళాలలోని పశుగణన క్షేత్ర సముదాయంలో మంగళవారం పాడి రైతులకు శాస్త్రీయ పద్దతిలో పాడి పశువుల పెంపకంపై శిక్షణ శిబిరాన్ని నిర్వహించింది. పశుపోషణ, వ్యాపార సరళిలో డెయిరీ ఉత్పత్తుల తయారీపై శిక్షణనిచ్చారు. త్వరలో స్వయం సహాయక సంఘాల శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు విస్తరణ విభాగం అధిపతి సత్యనారాయణ తెలిపారు.
నైరుతి రుతుపవన కాలంలో ఎల్ నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున నీటి కొరత, పచ్చిమేత లభ్యత తగ్గడం, కరవు పరిస్థితులు రావచ్చన్న ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధకశాఖ తెలిపింది. ఈ పరిస్థితి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల ఆరోగ్యం, ఉత్పత్తి, ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున పశుపోషకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు పశుపోషకులకు సూచనలు చేస్తూ ఆ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, డైరెక్టర్ డాక్టర్ దామోదర్ నాయుడు మంగళవారం సంయుక్త ప్రకటన చేశారు. నీటివసతి ఉన్న ప్రాంతాల్లో స్వల్పకాలిక, అధిక దిగుబడి వచ్చే పశుగ్రాస పంటలను సాగు చేయడం ద్వారా వచ్చే మేత లభ్యతను కొనసాగించాలి. పశువులకు తగినంత తాగునీరు, పచ్చిమేత, ఖనిజ లవణ మిశ్రమాల పోషకాహారం అందించాలి. వ్యాధినిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలి. ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ ద్వారా పశుగ్రాస సాగు చేపట్టాలి. అదనపు పశుగ్రాసాన్ని సైలేజ్ రూపంలో నిల్వచేయాలి.
ఆంధ్రప్రదేశ్‌లో రీసర్వే పూర్తయిన 4,783 గ్రామాల్లో రాజముద్రతో కూడిన కొత్త పాసు పుస్తకాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 22.33 లక్షల పుస్తకాలు ముద్రించి, ఈ ఏడాది జనవరి 2 నుంచి 9 వరకు పంపిణీ చేశారు. తీరా వాటిలో రైతుల పేర్లు, విస్తీర్ణం, మొబైల్ నంబర్లలో తప్పులు దొర్లడం, చనిపోయిన వారి పేర్లతోనూ ముద్రించడంతో భూ యజమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో వాటన్నిటినీ సరిచేసి, తప్పుల్లేని పాసు పుస్తకాల్ని పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు.
ప్రతి నియోజకవర్గంలో రీసర్వే పూర్తయిన రెండు గ్రామాల్ని ఎంచుకుని తప్పులను సరిదిద్దాలని రెవెన్యూ శాఖ ఆదేశాలిచ్ౘ్ింది. దీని ప్రకారం రైతులకు నెల ముందు నుంచే భూముల వివరాలు తెలియజేసి, వారి ఈకేవైసీ తీసుకోవాలి. తర్వాతే పాసు పుస్తకాల ముద్రణకు పంపాలి. వాటిని ప్రతి నెలా 2వ తేదీ నుంచి 9వ తేదీ లోగా ప్రజాప్రతినిధులతో భూ యజమానులకు పంపిణీ చేయించాలి. ఫిబ్రవరిలో 280 గ్రామాల పరిధిలో 1.83 లక్షల పాసు పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకున్నారు. మార్ౘ్ిలోనూ ఇదేవిధంగా అందజేయాలని అధికారులు నిర్ణయించారు.
ఈకేవైసీకి గడువు పెట్టకూడదంటున్న రైతులు ఎంపిక చేసిన గ్రామాల్లోని వీఆర్వోలు అక్కడి భూ యజమానులకు ముందుగా అన్ని వివరాలతో కూడిన ముసాయిదా పట్టాదారు పాసు పుస్తకాల కాపీలు అందించాలి. వాటిలో వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో ధ్రువీకరణ తీసుకోవాలి. మార్ౘ్ిలో పంపిణీ చేసే పట్టాదారు పాసు పుస్తకాలకు.. ఫిబ్రవరి 9వ తేదీ వరకే ఈకేవైసీకి అవకాశం ఇచ్ౘ్ారు. 10వ తేదీ నుంచి రైతులు అందుబాటులో ఉన్నా ఈకేవైసీ తీసుకోవడం లేదు. 9వ తేదీ తర్వాత యాప్ పనిచేయడం లేదని అధికారులు చెబుతున్నారు. మళ్లీ ఎప్పుడు ఈకేవైసీ తీసుకుని పాసు పుస్తకాలిస్తారని అడిగితే తమకేం తెలియదని చెబుతున్నారు.
తర్వాత నెలలో అదే నియోజకవర్గంలో రెండు గ్రామాల్ని ఎంపిక చేసుకుని, పంపిణీకి అవకాశం ఇస్తారు. కిందటి నెలలో పంపిణీ చేసిన గ్రామాల్లో మిగిలిన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకునే అవకాశం ఉండటం లేదు. అంటే వారికి 1బీ వివరాలు తెలియడం లేదు. తప్పులు సరిదిద్ది కొత్త పాసు పుస్తకాలిచ్ౘ్ే అవకాశం లేదు. దీంతో తప్పులు లేని పాసు పుస్తకాలు పంపిణీ చేయాలనే లక్ష్యం పూర్తిగా నెరవేరడం లేదు. నిర్దేశిత గడువు లేకుండా ఎప్పుడైనా ఈకేవైసీ తీసుకుని, పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్ౘ్ే విధానం అమలు చేయాలని భూ యజమానులు కోరుతున్నారు.