అనాస ఒక మీటరు వరకు ఎత్తు పెరిగే బహువార్షిక మొక్క. కాండం దృఢంగా ఉండి, ఆకులు పొడవుగా, ముళ్ళు కలిగి ఉంటాయి. పండ్లు ఎరుపు, పసుపు మిశ్రమ రంగు కలిగి, రసంతో నిండి ఆకర్షణీయంగా ఉంటాయి. దీనిని పిలకమొక్కలు, క్రౌన్స్ మరియు స్లిప్స్ ద్వారా వ్యాప్తి చేస్తారు.
సాధారణ నామం : పైనాపిల్ శాస్త్రీయ నామం : అనానాస్ కామోసస్ కుటుంబం: అనోనేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
అనాస పండ్లు మరియు ఆకులు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. అనాస పండులో “బ్రోమోలిన” అనే ప్రోటీన్‌ని విడగొట్టే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణశక్తిని బాగా పెంపొందిస్తుంది.
అనాస పండ్లలో ఎక్కువగా విటమిన్ ‘ఎ’ మరియు ‘సి’ లభిస్తాయి.
సాధారణ నామం : కొండగన్నేరు / విసాగ్ని శాస్త్రీయ నామం : ఆల్‌స్టోనియా వెనెనేట; కుటుంబం: అపోసైనేసి
తెల్లగన్నేరు సుమారు 6 మీ. ఎత్తు వరకు పెరిగే చిన్న లేదా మధ్య రకం చెట్టు. చెట్టు బెరడు బూడిద రంగుతో కూడిన గోధుమ వర్ణం కలిగి ఉంటుంది. వేరు చిక్కటి పసుపు రంగులో ఉండి గట్టిగా కర్రలాగా ఉంటుంది. ప్రతి కణుపు వద్ద 3-6 ఆకులు చుట్టూ అమరి ఉంటాయి. ఆకులు పలుచగా, బళ్ళెం ఆకారంలో ఉండి, అంచులు అలల్లాగా ఉంటాయి. ఆకు కొనలు సన్నగా మొనదేలి ఉంటాయి. అనేక ఈనెలు దగ్గర దగ్గరగా, సమాంతరంగా ఉండి ఆకుల చివర్ల నుండి పుట్టిన సన్నని దారంలాంటి ఈనెలతో కలపబడి ఉంటాయి. పూలు తెల్లగా ఉండి కొమ్మల చివర్లలో వస్తాయి. కాయలు కాడ కలిగి రెండు చివర్లు కొనదేలి ఉంటాయి. అనేక విత్తనాలు బల్లపరుపుగా, రెండు చివర్లలో వెంట్రుకలు కలిగి ఉంటాయి.
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
తెల్లగన్నేరు వేర్లు, పండ్లు ఔషధాల తయారీలో ఉపయోగించబడుతున్నాయి.
వీటిలో ఇండోల్ ఆల్కలాయిడ్స్ అధికంగాను, ఆల్‌స్టోవినైన్, వినినాటైన్, రిసర్పెåన్ మొదలైన రసాయనాలు ఉంటాయి.
వేర్లను చర్మవ్యాధులు, కుష్టు, చెవిపోటుల చికిత్సలో ఉపయోగిస్తారు.
వీటిని పాము కాటు, ఇతర విషపు పురుగుల కాట్ల చికిత్సలో కూడా ఉపయోగిస్తారు.
మూర్ఛ రోగం, ఆయాసం, జ్వరం మొదలగు వాటి చికిత్సకు, పుండ్లు, సిఫిలిస్, పిచ్చి వంటి జబ్బుల చికిత్సకు ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో …
ఆల్‌స్టోనియా బూనీ ఆకులు మరియు కాండం బెరడు ద్రావణాలు గులాబి రంగు కాండం తొలుచు పురుగు, సెసేమియాకెలామిస్టిస్ లార్వాలపై విషపూరిత చర్యను, పెరుగుదలనరికట్టే చర్యను ప్రదర్శించాయి. వీటిని గులాబి రంగు కాండంతొలుచు పురుగు నివారణకు రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. (ఆయిజయాన్‌గ్బె, అతని అనుచరులు, 2007).
ఆల్‌స్టోనియా స్కాలారిస్ కాండం బెరడు మరియు ఆకుల నీటి ద్రావణాలు, పాక్షికంగా శుద్ధి చేసిన ద్రావణాలు లిమ్నేయ అక్యూమినేట (నత్త)పై మొల్లస్కిసైడల్ మరియు యాంటికోలినెస్టరేజ్ చర్యలను ప్రదర్శించాయి. కాండం బెరడు ద్రావణాలు ఆకు ద్రావణాల కన్నా బలమైన మొల్లస్కసైడల్ చర్యను ప్రదర్శించాయి. (సింగ్ అండ్ ఇసంగ్, 2003).
ఆల్‌స్టోనియా స్కాలారిస్ మొక్క అసిటోన్ లేటెక్స్ ద్రావణాలు లాబియో రోహిత (చేప)పై నీటి ద్రావణాలకన్నా 23 రెట్లు అధిక విషపూరిత చర్యను ప్రదర్శించాయి (సింగ్ అండ్ సింగ్, 2010).
ఆల్‌స్టోనియా స్కాలారిస్ ఆకుద్రావణాలు ఈడెస్ ఆల్బోపిక్టస్ 3వ దశ లార్వాలపై లార్విసైడల్ చర్యను ప్రదర్శించాయి.
ఆల్‌స్టోనియా స్కాలారిస్ 100% ఆకుల ద్రావణాన్ని 15 రోజుల వయసు పార్థినియం మొక్కలపై 5 రోజుల వ్యవధిలో పిచికారి చేస్తే, మొదటి పిచికారి చేసిన 15 రోజుల తర్వాత వేర్లు మరియు కాండం జీవపదార్థం గణనీయంగా తగ్గింది. ఆకుల నీటి ద్రావణంలో ఉన్న కలుపు నాశక పదార్థాలు పార్థినియం నివారణకుపయోగిస్తాయి (జావైద్, అతని అనుచరులు, 2010).
భారతీయ వ్యవసాయ రంగంలో నూతన ఒరవడులు సృష్టిస్తూ, మన రైతులు నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు తీస్తున్నారు.
మానవ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందించడంలో ఆకుకూరలు ప్రథమ స్థానంలో నిలుస్తాయి. విటమిన్లు, ఖనిజ మూలకాలు, పిండి పదార్థాలు, మాంసకృత్తులు మరియు పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆకుకూరలను నిత్యం 125 గ్రాముల చొప్పున తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. కాగా, మార్కెట్లో వీటికి ఉన్న నిరంతర డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, సరైన యాజమాన్య పద్ధతులతో సాగు చేపడితే ఆకుకూరల ద్వారా రైతులకు గరిష్ట లాభాలు లభిస్తాయి.”
ఆకుకూరలు తక్కువ కాలంలో (20-30 రోజులు) మరియు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే పంటలు. తోటకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూర వంటివి నేరుగా విత్తనాలు చల్లి అన్ని కాలాల్లోనూ (వారానికి/పదిహేను రోజులకు ఒకసారి విత్తనాలు వేసుకోవడం ద్వారా) విజయవంతంగా సాగు చేయవచ్చు.
గోంగూర సాగు: ఆకుకూరలన్నింటి కంటే గోంగూర రుచి ఎక్కువ. నీరు నిల్వ ఉండని తేలికపాటి గరప నేలలు, ఎర్ర నేలలు మరియు ఒండ్రు నేలలు గోంగూర సాగుకు చాలా అనుకూలం. ఇది ఏడాది పొడవునా సాగు చేసుకోవచ్చు. ఏఎన్‌జిఆర్ఏయూ1 ఇది ఎర్ర గోంగూర రకం. విత్తనాలు నాటిన 30 నుండి 35 రోజులకే పంట కోతకు వస్తుంది. నీటి వసతి కలిగిన భూముల్లో ఒక ఎకరానికి దాదాపు 4 – 6 టన్నుల దిగుబడిని పొందవచ్చు.
పాలకూర: పాలకూర మంచి పోషక విలువలు కలిగిన ఆకుకూర. లేత ఆకులను కాండంతో సహా కూరగా వాడుతారు. ఇందులో అధికంగా విటమిన్ ‘ఎ’, ‘సి’, కాల్షియం మరియు ఇనుము వున్నవి. తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో మంచి లాభాలను అందించే ఆకుకూర. అన్ని రకాల నేలల్లో సాగుచేయవచ్చు. కాని ఇసుకతో కూడిన ఎర్ర నేలల్లో అధిక దిగుబడినిస్తుంది. ఆల్ గ్రీన్, పూస, అర్క, అనుపమ, రకాలు అనుకూలం. ఎకరానికి 10 – 12 కిలోల విత్తనం అవసరం. మడుల్లో సాలుకు 10 – 20 సెం.మీ దూరం నాటుకోవాలి. 25 – 30 రోజుల్లో కోతకు వస్తుంది. ఆల్‌గ్రీన్ రకం ఆకులు, కాడలు ఆకుపచ్చ రంగులో వుంటాయి. ప్రతి 15-20 రోజులకొక కోత తీసుకోవచ్చు. ఎకరాకు 6-7 కోతలకు 5 టన్నుల దిగుబడి నిస్తుంది.
తోటకూర: తోటకూరను సాగు చేయడానికి ఇసుకతో కూడిన గరప నేలలు అనుకూలంగా ఉంటాయి. వివిధ శీతోష్ణస్థితుల్లో పెంచేందుకు తోటకూర చాలా అనువైంది. నీరు నిలిచే బంకమట్టి, ఇసుక నేలలు దీనికి పనికిరావు. జూన్ నుండి అక్టోబర్ వరకు జనవరి నుండి మే నెల మధ్య విత్తనాలు వేయాలి. అర్క వర్ణ, కో-1, కో-2, కో-3, కో-4, అర్కా సుగుణ వంటి రకాలు ఎంపిక చేయవచ్చు. ఎకరాకు 1 కిలో విత్తనం సరిపోతుంది. విత్తనం వెదజల్లితే ఎకరాకు 2 కిలోల విత్తనం కావాలి. విత్తేటప్పుడు పది రెట్లు ఇసుక కలిపి చల్లాలి. విత్తిన 25 రోజులకు కోత మొదలవుతుంది. మొదటి కోత తర్వాత ప్రతి పది రోజులకు కోత తీయవచ్చు. దిగుబడి 4 నుండి 5 టన్నులు వస్తుంది.
బచ్చలికూర : బచ్చలిని ఇండియన్ స్పినాచ్ లేదా మలబార్ స్పినాచ్ అని పిలుస్తారు. ఈ పంట భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో సాగవుతోంది. బచ్చలి కూర అధిక మోతాదులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఇనుమును సరఫరా చేస్తుంది. అంతేకాకుండా విటమిన్ ‘ఎ’, ‘సి’ లను కలిగి ఉంటుంది. లేత కాడలలో కూడా విటమిన్ ‘ఎ’ ఎక్కువగా ఉంటుంది. బచ్చలి కూరను అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. కాని అధిక దిగుబడి కోసం ఇసుకతో కూడిన గరప నేలలు చాలా అనుకూలమైనవి. ఎకరాకు 5 – 6 కిలోల విత్తనం అవసరం. వర్షాకాలంలో జూన్ నుండి జూలై వరకు నాటుకోవచ్చు. . దిగుబడి 4 నుండి 6 టన్నులు వస్తుంది.
చుక్క కూర: చుక్కకూరలో సమృద్ధిగా ఉండే పీచు పదార్థాలు (ఫైబర్), తిన్న ఆహారం త్వరగా మరియు సులభంగా జీర్ణమవడానికి ఎంతగానో తోడ్పడతాయి. ఏడాది పొడవునా దీన్ని సాగు చేయవచ్చు. నల్లరేగడి భూములు అనుకూలం. ఎకరాకు 6-8 కిలోల విత్తనం అవసరం. విత్తిన నెల తర్వాత కోత కోయవచ్చు. పంటకాలం 3 నుండి 4 నెలలు 20 నుండి 30 – 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.
కొత్తిమీర: కొత్తిమీర ఆకులతో పాటు విత్తనాల (ధనియాలు) ఉత్పత్తి కొరకు సాగయ్యే కొత్తిమీర, వంటల్లో సువాసనను, రుచిని పెంచడానికి అద్భుతంగా తోడ్పడుతుంది. పోషక విలువల పరంగా చూస్తే.. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, సుగంధ తైలాలు, పీచు పదార్థాలు మరియు విటమిన్-కె, ఎ, సి వంటి కీలక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపరిచే విశేష గుణాలు ఉండటం వల్ల, దీనిని జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలకు ఔషధంగానే కాకుండా వివిధ ఆయుర్వేద చికిత్సల్లోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. కొత్తిమీరను దాదాపు అన్ని రకాల నేలల్లోనూ సాగు చేయవచ్చు. అయితే, వర్షాధార పంటగా పండించేటప్పుడు మాత్రం మురుగునీటి పారుదల సౌకర్యం ఉన్న బంక నేలలు అత్యంత శ్రేష్ఠమైనవి. ఎకరాకు 8 నుండి 10 కిలోల విత్తనాలు అవసరం. సురుచి, సుగుణ, సాధన, సింధు ముఖ్యమైన రకాలు అందుబాటులో ఉంటాయి. విత్తిన నెలకే కోతకు వస్తుంది. ఎకరాకు 15 నుండి 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది.
పుదీన: పుదీనాను అటు ఆకుకూరగాను, ఇటు సుగంధ తైలం ఉత్పత్తి కొరకు విరివిగా సాగు చేస్తారు. మనదేశంలో జపనీస్ పుదీనాకు ఎక్కువ గిరాకీ ఉంది. దీని నుండి తీసే తైలాన్ని సుగంధ పాన్‌మసాలాల తయారీలోనే కాకుండా.. దగ్గు, జలుబు, నొప్పుల నివారణ ఔషధాలలోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. ఉష్ణ వాతావరణంలో బాగా పెరుగుతుంది. చలి, మంచు అనుకూలించవు. ఎర్రనేలలు మరియు నల్ల నేలలు అనుకూలం. జపాన్ పుదీన, కోసి, హిమాలయ, శివాలిక్ రకాలు అందుబాటులో ఉంటాయి. నాటిన నాలుగు నెలలకు కోత ఆరంభమవుతుంది. ఎకరానికి 12-16 టన్నులు దిగుబడి వస్తుంది.
మెంతి కూర: దీనిని ఆకుకూరగాను, గింజలను పచ్చళ్ళలోను ఉపయోగిస్తారు. సుగంధ ద్రవ్య పంటల్లో ఇదోకటి. ఈ పంట సాగుకు చల్లని వాతావరణం, తక్కువ ఉష్ణోగ్రత మరియు తగినంత తేమ అనుకూలం. వర్షాధారం కింద నల్లరేగడి నేలల్లో, నీటి వసతి కింద గరపనేలలు, ఎర్రనేలలు మరియు ఇతర లేతపాటి నేలల్లో సాగుకు అనుకూలం. విత్తనాల్లో గుజరాత్ మెంతి-1 రకం అనువైనది. ఎకరాకు 6 నుండి 10 కిలోల విత్తనాలు సరిపోతాయి. విత్తిన తర్వాత 25 నుండి 30 రోజుల్లో మొదటి కోత తీసుకోవచ్చు. పక్షం రోజులకొకసారి చొప్పున మూడు సార్లు కోత కోయవచ్చు. ఎకరానికి 4-5 టన్నులు దిగుబడి వస్తుంది.
బి. చంద్ర శేఖర్, నేల (మృత్తికా) శాస్త్ర అధ్యాపకులు, పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU). Ph: 8374275258
సాధారణ నామం : స్పాటెడ్అలో శాస్త్రీయ నామం : అలో జెబ్రినా కుటుంబం: ఆస్ఫోడిలేసి
అలో జెబ్రినా చిన్న, దట్టమైన, నీటిని నిల్వ ఉంచుకునే భాగాలున్న ఆకులు కలిగిన మొక్క. ఈ మొక్కలు నీటిని కాండాలు, ఆకులు, వేర్లలో నిల్వ ఉంచుకుని వర్షాభావ పరిస్థితులలో నీటి ఎద్దడిని తట్టుకుంటాయి. ఆకులు దట్టంగా గుబురుగా ఏర్పడి సాధారణంగా ఆకుపచ్చ రంగులో పెద్ద అండాకారపు తెల్లటి మచ్చలు కలిగి ఉంటాయి. ఆకుల అంచులు బలమైన గోధుమ రంగు మొనలు గల ముళ్ళు కలిగి ఉంటాయి. ఆకుల చివర్లు ముదురు ఎరుపు నుండి గోధుమ రంగు కలిగి ఉంటాయి. పూలు లేత ఎరుపు రంగులో గొట్టపు ఆకారంలో వుంటాయి.
ఉపయోగాలు : ఔషధరంగంలో …
బోట్స్వానాలో దీనిని బుట్టల తయారీలో ఉపయోగిస్తారు.
అంగోలాలో కునీన్ నది పొడవునా ఉన్న ప్రజలు అలో జెబ్రినా పూలను ఉడికించి కేకులు తయారు చేస్తారు.
మహిళలు ప్రసవం తరువాత కాండం, ఆకు మొదళ్ళ పొడిని లోపలికి తీసుకుంటారు. దీని రసాన్ని గాయాలను మాన్పడానికి, చర్మ సమస్యలకు, నులి పురుగుల నివారణకు ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో
ప్రత్తి పంటలో నష్టాలు కలిగించే పేనుబంక, ఎఫిస్ గాసిపిని అలో జెబ్రినా 20% ద్రావణం వికర్షక, కాంటాక్ట్ చర్యలతో సమర్ధవంతంగా అరికట్టింది (రంగరిరాజ్, అతని అనుచరులు, 2016). ఆకు ద్రావణం తయారు చేయడానికి ఆకులను సేకరించి 80 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఓవెన్‌లో 5 రోజులు ఆరబెట్టాలి. తర్వాత ఆరిన ఆకులను రోటిలో వేసి బండతో దంచాలి. మెత్తగా దంచిన పొడిని 1000 మి.లీ. బీకర్లో వేయాలి. ఈ పొడిని గాలి చొరబడని జార్‌లో నిల్వ చేయాలి. 400 గ్రా. పొడిని 3 లీ. గాజు ఫ్లాస్క్‌లో తీసుకుని 2 లీ. డిస్టిల్డ్ వాటర్ కలపాలి. ఈ ద్రావణాన్ని చేతిలో 1 గంట సేపు కుదుపుతూ, తర్వాత 24 గంటలుంచాలి. 24 గంటల తర్వాత ద్రావణాన్ని గుడ్డతో వడపోసి తర్వాత వాట్‌మన్ నెం. 24 ఫిల్టర్ పేపర్‌తో వడపోయాలి. ఈ ద్రావణాన్ని 2 లీ. కోనికల్ ఫ్లాస్క్‌లో సేకరించాలి. 20% ద్రావణం తయారు చేయడానికి 200 మి.లీ. స్టాకు ద్రావణాన్ని 800 మి.లీ. శుభ్రమైన నీటికి కలపాలి.
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి
కలబంద ఒక గుత్తి వలే పత్రాలు వచ్చే బహువార్షిక మొక్క. దాదాపు 60 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకులు జిగటగా ఉన్న గుజ్ౙు కలిగి, అంచులకు ముండ్ల వంటి దంతాలుంటాయి. ఆకులు 50 సెం.మీ. వరకు పెరిగి చాకుల వలె ఉంటాయి. పూవులు నారింజ పసుపు రంగులో ఒక మీటరు పొడవు గల కాడపై గొట్టాల వలే వ్రేలాడబడి ఉంటాయి. ఈ మొక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యాన వనాలలోను, పొలంగట్ల పైన పెంచబడుతుంది. ఇది వేరు పిలకల ద్వారా వ్యాప్తి చెందుతుంది.
సాధారణ నామం : ఇండియన్ అలో / బార్బడోనఅలో / ఘికుమార్/ఘ్రిత్‌కుమారి శాస్త్రీయ నామం: అలో బార్బడెన్స్ / అలో విర కుటుంబం: లిలియేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
ఆకులు, ఆకులలో వుండే గుజ్జు, పసుపు రంగు ద్రవం (మూసాంబ్రం) కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.
వీటిలో ఆంత్రాక్వినోన్లు (అలాయిన్, అలోఎమోడిన్), రెసిన్లు, టానిన్లు, పాలిశాకరైడ్లు, మొదలైన రసాయన పదార్థాలుంటాయి. కలబంద ఆకు చలవ చేస్తుంది. నేత్ర రోగాల చికిత్సలో దీనిని ఉపయోగిస్తారు.
దీని నుండి తీసిన గుజ్ౙుని మరియు పసుపు రంగు ద్రవాన్ని ఎండబెడితే మూసాంబ్రం అనే పదార్థం తయారవుతుంది. ఇది నొప్పులను, వాపులను, కుష్టువ్యాధి, మూలశంక, మానసిక వ్యాధులు, చర్మవ్యాధులు, కాలేయ వ్యాధులు, ఋతుసంబంధ వ్యాధుల చికిత్సకు, రక్తవిరేచనాలు అరికట్టడానికి ఉపయోగపడుతుంది.
తెగిన గాయాలకు, వడదెబ్బకి ప్రాధమిక చికిత్సగా బాగా పనిచేస్తుంది. కలబంద ఆకులలో ఉండే గుజ్ౙు సౌందర్య సాధనాల తయారీలో ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
చంటి పిల్లల కడుపులో క్రిముల నివారణకు, విరేచనకారిగా కూడా ఉపయోగపడుతుంది.
వ్యవసాయరంగంలో
కలబంద చెదల వికర్షకంగా పని చేస్తుంది. కలబంద నీటి ద్రావణం చెదలను వికర్షిస్తుంది.
కలబందలో సహజ అలాయిన్ అనే రసాయనముంది. అందువలన కలబందను ఎటువంటి పురుగులు, తెగుళ్ళు ఆశించవు (పంత్, 2016). దీనిని జీవ ఎరువుగా కూడా ఉపయోగించవచ్చు.
కలబంద ద్రావణంలోని అలోయిన్ ఎ (0.02%) మొక్కజొన్న గింజల నిల్వ సమయంలో ఆశించే సైటోఫిలస్ ఒరైజెపై బలమైన వికర్షక చర్యను ప్రదర్శించింది (మల్లావధాని, అతని అనుచరులు, 2016).
కలబంద ఒక శక్తివంతమైన మొక్కల పెరుగుదల కారకం. కలబంద బయట పొరలో ఆంత్రాక్వినోన్ గ్లైకోసైడ్ మిశ్రమాలు “అలాయిన్స” వుంటాయి. అలాయిన్ వాల్లబీస్, కంగారూలు, ఎలుకలు, పంటలను తినకుండా వికర్షిస్తుంది.
కలబంద ద్రావణం వగరు రుచి కలిగి ఉండటం వలన పురుగులను వికర్షిస్తుంది కాని చంపదు (మెలెస్, అతని అనుచరులు, 2012).
కలబంద గుజ్ౙు (జెల్) డ్రెష్లరా హవాయిఎన్సిస్, ఆల్టర్టేరియా ఆల్టర్నేట శిలీంద్రపెరుగుదలను పూర్తిగా అరికడుతుంది (సితార, ఆమె అనుచరులు, 2011).
4 కి. కలబంద { 500 మి.లీ. వేపనూనె { 500 మి.లీ. పొగాకు పొడి కషాయం 20 లీ. నీటికి కలిపి 3 నుండి 4 గంటలు మరగబెట్టాలి. కుండలో నీరు 5 లీ. మిగిలినపుడు చల్లార్చి, వడపోయాలి. ఈ కషాయాన్ని ప్రత్తి, బెండ మొదలగు పంటలపై పిచికారి చేసి పొగాకులద్దె పురుగు, శనగపచ్చ పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు. ఈ జీవ పురుగు మందుకి “నీకుంచి (వేప{కలబంద{పొగాకు పొడి డికాక్షన్)” అని పేరు పెట్టారు. 100 నుండి 150 మి.లీ. కషాయాన్ని 15 లీ. నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. 10 రోజుల తర్వాత ఇంకొకసారి పిచికారి చేయాలి. (రజనీకాంత్ భాయ్ పటేల్, గుజరాత్ రైతు, 2001).
అలో ఫెరాక్స్‌ని పంటల చుట్టూ జీవకంచెగా నాటితే పంటలనాశించే పురుగులను వికర్షిస్తుంది.
అలో మార్లోతి ఆకుబూడిద (5%)ని మొక్కజొన్న లేదా అలసంద గింజలపై చల్లి నిల్వ సమయంలో ఆశించే పురుగులను వికర్షింపవచ్చు.
5 కి. కలబందను ముక్కలుగా చేసి 1 కి. పొగాకు పొడి కలిపి 3 లీ. నీటిలో కలిపి మరిగించి చల్లార్చి, వడపోసి 2 లీ. పుల్లటి మజ్ౙిగ కలిపి 100 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఇది జీవ పురుగు వికర్షిణిగా పనిచేస్తుంది.
వేపనూనె నీటిలో కరగడానికి 12 చెంచాల పొటాషియం సిలికేట్ ద్రావణం కలపాలి. ఈ మిశ్రమాన్ని వారానికొకసారి పిచికారి చేసి పురుగులను నివారించవచ్చు. వారం వారం ఎసెన్షియల్ మార్చి వాడాలి.
ఐ.పి.యం. రెసిపి2 :
4.5లీ. నీటిలో 2 చెంచాల కలబంద గుజ్ౙు కలిపి 24 గంటలుంచాలి. తర్వాత వడపోసి పిచికారి చేయాలి.
ఈ రెసిపీలలో నీటికి బదులు ‘బొటానికల్ టీ’ని కూడా ఉపయోగించవచ్చు. ఈ టీని తయారు చేయడానికి లావెండర్, స్పియర్‌మింట్, పెప్పర్‌మింట్, ఒరిగానో, థైమ్, బోరేజ్, కామ్‌ఫ్రీ, యారో తాజా ఆకులను (2 కప్పులు) నూరి లీ. నీటిలో కలిపి 23 రోజులుంచాలి. మధ్యమధ్య ఈ ద్రావణాన్ని కలుపుతుండాలి. తర్వాత వడపోసి పై రెసిపిలను తయారు చేయడానికి నీటికి బదులు దీనిని ఉపయోగించాలి.
పురుగులు, తెగుళ్ళ నివారణకు కలబందనుపయోగించి హెర్బల్ టీ తయారు చేసి ఉపయోగించవచ్చు.
తయారీకి కావలసిన పదార్థాలు : 200 లీ. ప్లాస్టిక్ డ్రమ;్ గ్రైండర్ / చాపర్, రోలు, పత్రం; స్ట్రెనర్ / స్క్రీన్ / గుడ్డ; కొయ్యకర్ర; తాజా శుభ్రమైన నీరు;
మొక్కల పదార్థాలు : 10 కి. అల్లం, 5 కి. వెల్లుల్లి, 5 కి. కలబంద, 10 కి. మిర్చి, 30 కి. వేపఆకులు, 30 కి. కోకోఆకులు, 5 కి. డెర్రిస్, 5 కి. మకాబుహే, కీటకనాశన, శిలీంద్రనాశక వికర్షణ లక్షణాలున్న ఇతర మొక్కలు. పైన పేర్కొన్న ఆకులను విడివిడిగా నూరాలి.
తయారు చేసే విధానం : నూరిన ఆకులను ప్లాస్టిక్ డ్రమ్ములో వేయాలి. డ్రమ్ములో నీరు నింపాలి. డ్రమ్ములోని పదార్థాలన్నింటినీ కర్రతో కలియత్రిప్పాలి.
హెర్బల్‌టీ తయారవడానికి ఒకరోజు నిల్వఉంచాలి. డ్రమ్‌లోని హెర్బల్ టీని వడపోయాలి. హెర్బల్‌టీకి సమానంగా నీరు కలపాలి. స్ప్రేయర్లో నింపి పంటపై పిచికారి చేయాలి. మొక్కలపైన పిచికారి చేయాలి. మొక్కల మొదళ్ళలో డ్రెంచింగ్ చేయాలి. అవసరాన్ని బట్టి 3 లేదా 7 రోజుల కొకసారి మొక్కలపై పిచికారి చేయాలి. క్యాబేజిలో డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లాని వేపగింజ పప్పు (నీమ్ సీడ్‌కెర్నల్) + కలబంద+జిల్లేడు+క్లీరోడెండ్రాన్ ఆకు ద్రావణం మరియు వేపకాయలు+ ఎర్రమిరప+సీతాఫలం ఆకు ద్రావణం సమర్థవంతంగా నివారించాయి. (చంద్రశేఖరయ్య అండ్ సన్నవీరప్పనవర్, 2013).
ప్రత్తి, చామంతి పంటలలో పురుగుల నివారణకు కానుగ{కలబంద{వేప ద్రావణం పిచికారి చేయాలి. దీని తయారీకి 1కి. కానుగ చెక్కపొడి, 1 కి. వేప చెక్క పొడి, 250 గ్రా. విషముష్టి గింజలను ఒక మస్లిన్ సంచిలో వేసి ఒక రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మర్నాడు ఉదయం సంచిని పిండి రసాన్ని సేకరించాలి. దీనిని అరలీటరు కలబంద ఆకు రసంతో కలపాలి. దీనికి 15 లీ. నీరు కలపాలి. దీనిని మరలా 23 లీ. ఆవుమూత్రంతో కలపాలి. పిచికారి చేసేముందు 1 లీ. మిశ్రమాన్ని 10 లీ. నీటిలో కలపాలి. ఎకరానికి 60-100 లీ. పిచికారి ద్రావణాన్ని ఉపయోగించాలి (శాయికట్‌మన్నా)
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి
విపరీతమైన రపాయనాల వాడకం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం విపరీతంగా తగ్గిపోయింది. పత్తిపాటి రామయ్య బెంగుళూరు వైదిక విజ్ఞాన వర్సిటీలో పి.హెచ్.డి. చేసి “రామబాణం” అనే వ్యాసాన్ని ప్రచురించారు. అది 40 రోజుల ప్రోగ్రాం. చిత్తూరు జిల్లా రైతు మునిరత్నం నాయుడు రామబాణాన్ని తయారు చేసి తన భూమిలో వేసిన తర్వాత 0.5 ఉండే సేంద్రియ కర్బనం 0.75 కి పెరిగింది.
తయారు చేసే విధానం
మొదటి రోజు రెండున్నర కిలోల అల్లం, రెండున్నర లీటర్ల నీటితో కలిపి బాగా రుబ్బి ఒక కుండలో పోయాలి. పోసిన తరువాత గుడ్డతో కుండని కట్టాలి. కుండను గుంతలో పెట్టి మట్టి కప్పాలి.
ఆరవ రోజు ఉదయం 4 కి. ఆవుపేడ, 4 లీ. నీటితో కలిపి కుండకి గుడ్డకట్టి గుంతలో పెట్టాలి.
మొదటి రోజు పూడ్చిన అల్లం ద్రావణం కుండను 6వ రోజు సాయంత్రం 4 గంటలకు గుంతనుండి బయటకు తీసి అల్లం ద్రావణాన్ని 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
11వ రోజు సాయంత్రం 6వ రోజు గుంతలో ఉంచిన ఆవుపేడ ద్రావణాన్ని బయటకు తీసి 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
16వ రోజు 8 కి. బెల్లం 8 లీ. నీటిలో కలిపి కుండను గుంతలో పెట్టి మట్టి కప్పాలి. అదే రోజు 3 లీ. ఆవుమూత్రాన్ని 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
21వ రోజు 21/4 కి. ముడి ఇంగువ 21/4 లీ. నీటిలో కలిపి కుండను గుంతలో పెట్టి మట్టి కప్పాలి. 16వ రోజు గుంతలో పెట్టిన బెల్లం ద్రావణాన్ని 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
26 వ రోజు 4 కి. శనగపిండి 4 లీ. నీటిలో కలిపి కుండను గుంతలో పాతిపెట్టి మట్టి కప్పాలి. 21వ రోజు గుంతలో పెట్టిన ఇంగువ ద్రావణాన్ని 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
31వ రోజు ఒకటిన్నర కిలోల ఆవుపెరుగు ఒకటిన్నర లీటర్ల నీటిలో కలిపి కుండను గుంతలో పాతి పెట్టి మట్టి కప్పాలి. 26వ రోజు పాతిపెట్టిన శనగ పిండిద్రావణాన్ని 200 లీ. నీటితో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
36వ రోజున 31వ రోజున కుండలో ఉంచిన ఆవు పెరుగు ద్రావణాన్ని 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
అప్పటికి రామ బాణం ప్రయోగం పూర్తవుతుంది. తరువాత పొలాన్ని నాగలితో దున్నుకుని పైరు పెట్టుకుంటే సేంద్రియ కర్బనం 0.5 నుండి 0.75కి పెరిగి ఉంటుంది.
ఇకో ఎంజైమ్ తయారీ విధానం: 10 లీటర్ల నీరు, పండ్లు, కూరగాయలు, పూలు వీటిలో ఏవైన 3 కిలోలు, బెల్లం 1 కిలో. వీటన్నిటిని ఒక ప్లాస్టిక్ డ్రమ్ లేదా తొట్టిలో 10:3:1 నిష్పత్తిలో తీసుకొని బెల్లం కరిగే వరకు కలియ తిప్పి దానిపై మూత ఉంచి 3 నెలల పాటు ఊరబెట్టాలి. మూడు నెలల తరువాత ఊరిన ద్రావణాన్ని శుభ్రంగా వడబోస్తే కావలసిన ఇ కో ఎంజైమ్ తయారైనట్లే. దీనిని ప్లాస్టిక్ సీసాలలో నిలవబెట్టుకోవచ్చు. తయారైన 1 లీటరు ఇ కో ఎంజైమ్‌ని 50 లీటర్ల నీటితో కలిపి పంటలపై పిచికారి చేసుకుంటే తక్కువ ఖర్చుతో మొక్క ఎదుగుదల, పంట దిగుబడి బాగుంటుంది.
వెల్లుల్లితో మానవుల అనుబంధం 7000 సంవత్సరాలు. ఇది ఒక ఔషధ గడ్డ మొక్క. సులభంగా సాగు చేయవచ్చు. వెల్లుల్లిని పాయల ద్వారా ప్రవర్థనం చేస్తారు. సేంద్రియ పదార్థమెక్కువగా ఉన్న భూముల్లో వెల్లుల్లి బాగా పెరుగుతుంది. ఇది 1.2 మీ. ఎత్తు పెరుగుతుంది. 0.75 నుండి 1.0 అడుగు వరకు విస్తరిస్తుంది. ఏప్రిల్-మేలో పుష్పిస్తుంది. పూత ఎరుపు తెలుపు రంగులో ఉంటుంది. పూలు అందంగా ఉంటాయి. సీతాకోక చిలుకల నాకర్షిస్తాయి. వెల్లుల్లి వార్షిక, హెర్బల్ మొక్క. ఆకులు సువాసన కలిగి ఉంటాయి. ఆకులు ఆకుపచ్ౘ్ రంగులో సన్నగా గడ్డిలాగా ఉంటాయి..
సాధారణ నామం : గార్లిక్ శాస్త్రీయ నామం : అల్లియం సెటైవం కుటుంబం: అమరిల్లిడేసి
ఉపయోగాలు : ఆరోగ్యరంగంలో … ఆయుర్వేద రంగంలో
వెల్లుల్లి చాలా శక్తివంతమైన ఔషధ మొక్క. అనేక వ్యాధుల చికిత్సలో దీనిని 5000 సంవత్సరాలకు పైగా ఉపయోగిస్తున్నారు. అనేక శాస్త్రీయ అధ్యయనాల తర్వాత వెల్లుల్లి తన ప్రాశస్త్యాన్ని తిరిగి సంతరించుకుంది.
ట్యూమర్, క్యాన్సర్ల నుండి రక్షిస్తుంది. ఉదర, కోలన్, ఊపిరితిత్తులు, రెక్టం క్యాన్సర్ల నుండి రక్షిస్తుంది. శక్తివంతమైన సహజ ఆంటిబయాటిక్, యాంటిసెప్టిక్, యాంటివైరల్, యాంటిఇన్‌ఫెక్షన్, జీర్ణాశయ, ఉదర పారసైట్లపై పోరాడుతుంది.
శ్వాసకోశ సంబంధిత అంటువ్యాధులు, బ్రోంకైటిస్ నుండి కాపాడుతుంది. పసుపుతో కలిసి వాతావరణ కాలుష్యం, పొగాకు పొగ నుండి, జలుబు, జ్వరం నుండి రక్షిస్తుంది. కొలెస్టరాల్‌ని అధికంగా తగ్గిస్తుంది. నోటి పుళ్ళు, గొంతునొప్పి, అలసట, ప్లేగ్, కలరా, రాబీస్ నుండి కాపాడుతుంది.
హృదయ సంబంధిత వ్యాధులు, రక్తపోటు నుండి కాపాడుతుంది. రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధీకరించి తగ్గిస్తుంది. రక్త ప్రసరణను పెంచుతుంది.
తగ్గిన శక్తి, ధైర్యాన్ని తిరిగి తెస్తుంది. వీర్యకణాల సంఖ్యను పెంచుతుంది. శరీరావయవాలను చలి నుండి కాపాడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
వ్యవసాయరంగంలో పురుగుల నివారణ :
వెల్లుల్లి ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించి నష్టం కలిగించే ట్రెబోలియం కాస్టేనియంని అతితక్కువ గాఢతలో వికర్షించింది. పెద్ద పురుగులు, లార్వాలపై ఫ్యూమిగెంట్, కాంటాక్టు చర్యలను ప్రదర్శించి, పెద్ద పురుగులలో గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని తగ్గించింది. అభివృద్ధి ప్రక్రియలలో జోక్యం చేసుకుని లార్వాలు ప్యూపాలుగా, ప్యూపాలు పెద్ద పురుగులుగా మారడాన్ని నిరోధించింది. యాంటిఫీడెంట్ చర్యలను ప్రదర్శించింది. (ముఖేష్‌కుమార్ బేబే, 2013)
వెల్లుల్లి నీరు మరియు మిథనాల్ ద్రావణాలు (1000 పిపియం) పొగాకులద్దె పురుగు లార్వాలను 81% మరియు 64% చంపాయి (మెరిగ, అతని అనుచరులు, 2012)
వెల్లుల్లిని అనేక సంవత్సరాలుగా ప్రధాన పంటగా పురుగుల నివారణకు సహవాస పంటగా సాగు చేస్తున్నారు.
క్యాబేజి వరుసల మధ్య వెల్లుల్లి లేదా ఉల్లి అంతర పంటగా నాటితే పురుగులను వికర్షిస్తాయి. కనుక చిన్న కమతాల రైతులు వెల్లుల్లి లేదా ఉల్లిని క్యాబేజి పంటలో అంతర పంటగా వేసి పురుగుల తాకిడిని తగ్గించవచ్చు. (దేబ్రా, మిషెక్, 2014)
వెల్లుల్లి పొడి, వెల్లుల్లి ద్రావణం, వెల్లుల్లి నూనె పిచికారి పురుగులను నివారిస్తుంది. గార్లిక్ నూనె యాంటి బాక్టీరియల్, యాంటిఫంగల్, కీటకనాశన లక్షణాలు కలిగి ఉంది. గార్లిక్ నూనెని మినరల్ ఆయిల్, సబ్బు ద్రావణంతో కలిపితే పురుగులను సమర్ధవంతంగా నివారిస్తుంది (లేరాగోమెజ్, సైంటిస్ట్, సియంపిఆర్, కేరళ)
వెల్లుల్లి గడ్డ ద్రావణం : కావలసిన పదార్థాలు : తరిగిన వెల్లుల్లి 85 గ్రా., మినరల్ ఆయిల్ (కిరోసిన్ లేదా వెజిటబుల్ ఆయిల్) 50 మి.లీ., సబ్బు ద్రావణం 10 మి.లీ., నీరు 950 మి.లీ., ప్లాస్టిక్ బాటిల్ 1
తయారు చేసే పద్ధతి : వెల్లుల్లిని వెజిటబుల్ ఆయిల్‌కి కలపాలి. ఈ మిశ్రమాన్ని 24 గంటలు నిల్వ ఉంచాలి. తర్వాత దీనికి నీరు, సబ్బు ద్రావణం కలిపి కలియత్రిప్పి బాటిల్‌లో నిల్వ ఉంచాలి.
ఉపయోగించే విధానం : ఒక భాగం ఎమల్షన్‌ని 19 భాగాల నీటికి కలపాలి (50 మి.లీ. ఎమల్షన్‌ని 950 మి.లీ. నీరు కలపాలి. పిచికారి చేసే ముందు బాగా కదిపి ఉదయం వేళ పంటపై పిచికారి చేయాలి.
టార్గెట్ పురుగులు, తెగుళ్ళు : ప్రత్తి బోల్‌వర్మ్, ఆర్మీవర్మ్, కాటన్ స్టెయినర్, ఉల్లి, తామర పురుగులు, పొటాటో మాత్, రూట్ నాట్ నెమటోడ్, చెరకు కాండం తొలుచు పురుగు, బాక్టీరియా తెగుళ్ళు, ఆంత్రాక్నోస్, బూజు తెగులు, వరి అగ్గితెగులు, కాయకుళ్ళు తెగుళ్ళు, బూడిద తెగులు, త్రుప్పు తెగుళ్ళు.
వెల్లుల్లి నూనె : కావలసిన పదార్థాలు : వెల్లుల్లి 100 గ్రా., మినరల్ ఆయిల్ 2 చెంచాలు, నీరు 10.5 లీటర్లు, సబ్బు ద్రావణం 10 మి.లీ., మూత ఉన్న పాత్ర 1
తయారు చేసే పద్ధతి : వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కత్తిరించాలి. ఈ ముక్కలను మినరల్ ఆయిల్‌లో ఒక రోజు నానబెట్టాలి. అరలీటరు నీరు, సబ్బుద్రావణం కలిపి బాగా కలియ త్రిప్పాలి. ఉపయోగించే విధానం : వడపోసిన ద్రావణాన్ని 10 లీ. నీటిలో కలపాలి. స్ప్రేయర్లో నింపి నూనె నీటిపై తేలకుండా అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి. మొక్క పూర్తిగా తడిచేలా పిచికారి చేయాలి.
టార్గెట్ పురుగులు : క్యాబేజి వర్మ్, పచ్చదీపపు పురుగులు, స్క్వాష్ బగ్స్, తెల్లదోమలు (ప్రకాష్, రావు ;1997)
గార్లిక్ ఆయిల్ ఎమల్షన్ : కావలసిన పదార్థాలు : గార్లిక్ ఆయిల్ 50 మి.లీ., నీరు 950 మి.లీ., సబ్బు ద్రావణం 1 మి.లీ.
తయారు చేసే విధానం : సబ్బు ద్రావణాన్ని నూనెకి కలిపి బాగా కలపాలి. నీరు కలిపి బాగా కలియ త్రిప్పాలి.
ఉపయోగించే విధానం : నూనె నీటిపై తేలకుండా తయారు చేసిన వెంటనే పిచికారి చేయాలి. ఉదయం వేళల్లో పిచికారి చేయాలి.
టార్గెట్ పురుగులు, తెగుళ్ళు : బోల్‌వర్మ్, పొటాటోట్యూబర్‌మాత్, వరి అగ్గి తెగులు, వరి గోధుమ మచ్చ తెగులు, రూట్‌నాట్ నెమటోడ్ (విజయలక్ష్మి, ఆమె అనుచరులు, 1999)
వెల్లుల్లి, మిరప ఆకు ద్రావణాలు క్యాబేజి పంటనాశించే ప్లుటెల్లా క్ౙెలోస్టెల్లా, బ్రెవికారినెబ్రాసికె, హెలుల్లా అండాలిస్, ట్రైకోప్లూసియాని పురుగులను రసాయన పురుగుమందు “అటాక” కన్నా తక్కువ ఖర్చులో నివారించాయి. గార్లిక్ ద్రావణం అత్యధిక ఖర్చు : లాభం నిష్పత్తి (1:16)ని నమోదు చేసింది. అటాక్ పిచికారి చేసిన ప్లాట్లలో ఖర్చు : లాభం నిష్పత్తి 1:9.2 మాత్రమే. అందువలన వెల్లుల్లి ద్రావణాన్ని రసాయన పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. (బైడు, మోచయ్య, 2016).
గోధుమ గింజల నిల్వ సమయంలో ఆశించే ట్రైబోలియం కాస్టానియం పురుగుని వెల్లుల్లి, పసుపు ద్రావణాలు సమర్ధవంతంగా నివారించాయి (సజ్ౙద్ ఆలీ, అతని అనుచరులు, 2014)
వెల్లుల్లి పొడి, ద్రావణం, నూనె నిల్వ ఉంచిన అలసంద గింజలను కాల్లొసోబ్రూకస్ మాక్యులేటస్ కల్గించే నష్టం నుండి కాపాడాయి (డెన్లోమె, 2010)
ఆదికాలంలోనే భారతీయ వ్యవసాయ శా¢స్తం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ప్రసిద్ధ ప్రాచీన వ్యవసాయ శా¢స్తవేత్తలు ప్రాచీన రుషులు, పరాశరుడు, సురపాలుడు తదితరులు అతద్భుతమైన పరిశోధనలు జరిపి గ్రంథస్థం చేశారు. సురపాల మహర్షి రాసిన వృక్షాయుర్వేదంలో కునపజలం అనే ద్రావణ ఎరువుని ప్రస్తావించారు. సంస్కృతంలో కునప అంటే మృత కళేబరం. జలం అంటే నీరు. అంటే శవం కంపుకొట్టే నీరని అర్థం. ఇది మొక్కలకు పోషక ద్రావణంగానూ ఉపయోగపడుతుంది. దీన్ని చేపల వ్యర్థాలతోనూ, కోడిమాంసం వ్యర్థాలతోనూ, పంది, జింక, ఇతర అడవి జంతువుల మాంసంతోనూ తయారుచేసేవారు. అడవులు అంతరించి జంతువులు కనుమరుగవుతున్న కాలంలోనే ప్రస్తుతం చేపల వ్యర్థాలు, కోడి మాంసం వ్యర్థాలతోనూ తయారు చేసుకోవచ్చు. కోడి మాంసపు వ్యర్థాలతో చేసేదాన్ని కుక్కుట కునప అంటారు.
ఆవు పేడ, పంచితం, పాలు, పెరుగు, నెయ్యి తదితరాలతో తయారుచేసే ‘కునపజలం’ పంటలు ఏపుగా పెరగడానికి.. పురుగులు, తెగుళ్ల ఉధృతిని అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. అయితే, మాంసం, వరిపొట్టు కూడా కలిపి కునపజలం తయారుచేస్తే, మరింత శక్తివంతంగా పనిచేస్తుందంటున్నారు సికింద్రాబాద్‌కు చెందిన విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త (ప్లాంట్ పాథాలజిస్ట్) ఇక్రిశాట్ మాజీ డిప్యూటీ డైరెక్టర్ అయిన డా॥ వై.ఎల్.నెనె. ఒక్క మాటలో చెప్పాలంటే సాధారణ కునపజలం కన్నా ఈ కునపజలం అత్యంత శక్తివంతంగా పనిచేస్తుందని డా॥ నెనె అంటున్నారు.
తయారీకి కావాల్సిన పదార్థాలు: ఆవు పేడ 5 కిలోలు, పంచితం 4 లీటర్లు, పాలు 3 లీటర్లు, పెరుగు 2 లీటర్లు, నెయ్యి కిలో, మాంసం (గొడ్డు మాంసం తప్ప ఏదైనా) 3 కిలోలు, వరిపొట్టు 2 కిలోలు, చెరకు రసం 3 లీటర్లు లేదా నల్లబెల్లం కిలో, లేత కొబ్బరినీరు 2 లీటర్లు, బాగా మగ్గిన అరటిపండ్లు 12, కల్లు 3 లీటర్లు.
తయారుచేసే పద్ధతి: మాంసాన్ని, వరిపొట్టును ఉడకబెట్టిన తర్వాత మాత్రమే కునపజలం తయారీలో వాడాలి. మాంసంలో అధిక పోషకాలుంటాయి. వరిపొట్టులో సిలికా ఉంటుంది. పురుగులు, తెగుళ్లను తట్టుకునే శక్తిని సిలికా పెంపొందిస్తుంది. ఉడకబెట్టిన మాంసం, వరిపొట్టుతో పాటు పేడ, పంచితాలను వెడల్పాటి మూతిగల మట్టి లేదా ప్లాస్టిక్ తొట్టి లేదా డ్రమ్ములో కలిపి, పాత్రపై పలుచని వస్త్రాన్ని కప్పి, నీడగా ఉండే ప్రాంతంలో రెండు వారాలు పులియనివ్వాలి. ప్రతి ఉదయం, సాయంత్రం సవ్యదిశలో కొద్దిసేపు కర్రతో కలపాలి. 2 వారాల తర్వాత మిగతా వాటిని కూడా కలిపి మరో వారం రోజులు పులియబెట్టాలి. ఆ తర్వాత వడకట్టి వాడుకోవచ్చు. ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది.
ఉపయోగించే విధానం: ఎకరానికి 100-150 లీటర్ల నీటిలో 3 లీటర్ల కునపజలాన్ని కలిపి 20 రోజుల వ్యవధిలో 3 నుంచి 4సార్లు పంటలపై పిచికారీ చేయాలి. ఈ మధ్యలో వర్షం కురిస్తే 1 లేదా 2 సార్లు అదనంగా పిచికారీ చేయాలి.
ఉపయోగాలు: ముఖ్యంగా పత్తి, మిరప, వరి, కూరగాయలు, పండ్ల తోటలపై బాగా పనిచేస్తుంది. దీనివల్ల పంట గింజల బరువు పెరుగుతుంది. పురుగులు, తెగుళ్లు పంటలను ఆశించవు. పంట ఏపుగా పెరుగుతుంది. పండ్ల నాణ్యత పెరిగి సహజసిద్ధమైన రంగు, రుచి, వాసన వస్తుంది. కూరగాయ పంటల నాణ్యత పెరిగి మంచి మెరుపు వస్తుంది.
దిగుబడిని పెంచే కునపజలం కావలసిన పదార్థాలు : మాంసం-1 కిలో; మినప పప్పుపొడి -1/4 కి.; నువ్వులు- 1/4 కి.; నల్లబెల్లం- 1/4 కి.; ఆవుపాలు – 1 లీటరు; ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె – 50 గ్రాములు; మంచి నీరు – 5 లీటర్లు
తయారు చేసే విధానం : మాంసాన్ని నీటిలో వేసి సన్నని మంటపై సగం కషాయం అయ్యే వరకు ఉడికించాలి. 2 గంటలు చల్లార్చి పలుచని గుడ్డతో వడపోయాలి. సన్నని మంటపై మళ్ళీ మరగించాలి. పొంగువచ్చిన తర్వాత మినపపిండి, దంచిన నువ్వులు, బెల్లం వేసి కలియబెడుతూ ఉండాలి. పొంగు వచ్చిన వెంటనే పాత్రను దించి, చల్లార్చి, మట్టికుండలో పోయాలి. అందులో ఆవుపాలు పోసి, కుండపైన మూకుడు పెట్టి గట్టి గుడ్డతో వాసిన కట్టి పెంట పోగు కింద లేక మట్టి గుంతలో పాతి పెట్టాలి. 11వ రోజు బయటకు తీసి కషాయాన్ని వడపోయాలి. ఈ కషాయాన్ని వేరొక కుండలో పోసి దానికి నెయ్యి లేక నూనె కలిపి పాత్రపై మూకుడు పెట్టి ఒక ప్లాస్టిక్ కాగితంలో ఉంచి గట్టిగా తాడుతో కట్టి 10 రోజులు చీకటి గదిలో ఉంచాలి. 11వ రోజు నుంచి ఈ కషాయాన్ని ఉపయోగించవచ్చు. 3 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి ఏ పంటపైనన్నా పిచికారి చేయవచ్చు. పంటకాలంలో రెండుసార్లు పిచికారి చేయవచ్చు. ఇది ప్రభావశీల ఔషధం. పంట దిగుబడి 20% పెరుగుతుంది.
అక్కల కర్ర ఒక చిన్న, నిలువుగా పెరిగే పూల మొక్క. ఇది వేగంగా పెరిగి బంగారం రంగు, ఎరుపురంగు పూలగుత్తులను కలిగి ఉంటాయి. దీని ఆకులు, పూల గుత్తులు పళ్ళనొప్పులను తగ్గించే బాధ నివారణ కారకం కలిగి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా దీనిని అలంకరణ మొక్కగా, ఔషధ మొక్కగా పెంచుతారు. కాండాలు నిలువుగా లేదా నేలపై ప్రాకుతూ ఎరుపు రంగులో నూగు లేకుండా ఉంటాయి. ఆకులు వెడల్పుగా అండాకారం నుండి ముక్కోణాకారంలో ఉంటాయి. ఆకులు 5-11 సెం.మీ. పొడవు, 4-8 సెం.మీ. వెడల్పుండి అంచులు మొనతేలిన పళ్ళు కలిగిఉంటాయి. పూల గుత్తులు ఒకటిగా ఎకీన్లు (కాయలు) నల్లగా, 2-2.5 మి.మీ. పొడవుంటాయి.
సాధారణ నామం: టూతేక్‌ప్లాంటే, పారాక్రెస్ శాస్త్రీయ నామం: ఆక్మెల్లా ఒలరేసియ కుటుంబం: ఆస్టరేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
అక్కలకర్రను విస్తృతంగా పంటినొప్పి, గొంతు, చిగుళ్ళ చికిత్సలో ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా తాజా పూలగుత్తులు లేదా ఎండబెట్టి పొడిచేసిన పూలగుత్తులను ఉపయోగిస్తారు. కాని వేర్లు, ఆకులను కూడా సిఫారసు చేస్తున్నారు.
డిసెంట్రి, కీళ్ళనొప్పుల చికిత్సలో కూడా ఉపయోగించవచ్చు. రోగనిరోధక వ్యవస్థను కూడా పెంచుతుంది.
లాలాజలం ఉత్పత్తిని పెంచుతుంది. వేసవిలో వచ్చే జ్వరం నయం చేయడానికి ఉపయోగపడుతుంది.
మలేరియా చికిత్సలో ఉపయోగిస్తారు. ఆకులను బాక్టీరియా, శిలీంద్రాల వల్ల కలిగే చర్మవ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.
గాయాలను త్వరగా నయం చేస్తుంది. జలుబు, ఫ్లూ రోగాల నుండి కాపాడుతుంది.
వ్యవసాయరంగంలో …
అక్కలకర్ర ఆకుల డైక్లోరోమిథేన్ ద్రావణం పరీక్షించిన అన్ని బాక్టీరియాలపై యాంటిబాక్టీరియాల్ చర్యని ప్రదర్శించింది. ఎస్కెరిచియా కోలై > స్టెఫైలోకోకస్ ఆరియస్ > ప్రోటియస్ వుల్గారిస్ > బాసిల్లస్ సబ్‌టైలిస్ > క్లెబ్సియెల్లా న్యుమోనియాపై ఈ క్రమంలో యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది. డైక్లోరోమిథేన్ ద్రావణం అసిటోన్, నీటి ద్రావణాల కన్నా వంగకాయతొలుచు పురుగు, ల్యూసినాయిడెస్ ఆర్బొనాలిస్‌పై అధిక యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది. ఈ ద్రావణం ఆల్కలాయిడ్స్, టెర్పెనాయిడ్స్, ఫైటోస్టిరాల్స్, సపోనిన్స్, స్టీరాయిడ్, టానిన్స్, ఫినాలిక్ కాంపౌండ్స్‌ని కలిగి ఉంది (పవున్‌రాజ్, అతని అనుచరులు, 2014)..
అక్కలకర్రక్రూడ్ హెక్సేన్‌ద్రావణం టూటా ఆబ్సల్యూటపై అధిక కీటకనాశక చర్యను ప్రదర్శించింది. ఈ ద్రావణాన్ని టమాట పంటనాశించే టూటాఅబ్సల్యూట పురుగుల నివారణలో ఉపయోగించవచ్చు. ఈ ద్రావణం నుంచి వేరు చేసిన ఆల్కమైడ్స్ టూటా ఆబ్సల్యూట నివారణ కార్యక్రమాలలో పురుగు మందులుగా ఉపయోగించవచ్చు. వీటిలో స్పైలాంతాల్ ముఖ్యమైనది. ఇది అత్యధిక కీటకనాశక చర్య కలిగి, బదనిక, సోలెనాప్సిస్ సీవిస్సిమకు ఎటువంటి హాని కలిగించదు. (మోరినో, అతని అనుచరులు, 2011)
స్పైజలాంతాల్ యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్, లార్విసైడల్ లక్షణాలను కలిగి ఉంది (శర్మ, అతని అనుచరులు, 2010).
అక్కలకర్ర ద్రావణాలు ఈడెసఈజిప్టి, అనోఫెలెస్ స్టెఫెన్సి, అనోఫెలెస్ క్యూలిసిఫేసీస్, క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్‌పై కీటకనాశక చర్యను ప్రదర్శించాయి (అమర్ అండ్ మెహిహోర్మ్, 2006; పాండె, అతని అనుచరులు, 2007; సరాఫ్ అండ్ దీక్షిత్, 2002).
స్పెలాంతాల్ ఆస్పర్ౙిల్లస్ స్పీసీస్‌పై ఫంగిస్టాట్ మరియు ఫంగిసైడల్ చర్య ప్రదర్శించింది (కౌటిన్‌హా, అతని అనుచరులు, 2006).
స్పైలాంతాల్ అనేక జీవ చర్యలను కలిగి ఉంది (డుబే, అతని అనుచరులు, 2013)
స్పైలాంతాల్ యాంటిఫంగల్ (డూబే, అతని అనుచరులు, 2013), బాక్టీరియోస్టాటిక్ (మోలినాటోర్రెస్, అతని అనుచరులు, 2004), ఇన్‌సెక్టిసైడల్ (కడిర్, అతని అనుచరులు, 1989; శర్మ, అతని అనుచరులు, 2012; మోరెనో, అతని అనుచరులు, 2012); యాంటిమలేరియల్ (శర్మ, అతని అనుచరులు, 2012); ఈడెసఈజిప్టి, హెలికోవర్పా జియానియోనేట్స్‌పై యాంటిలార్విసైడల్ చర్యలు (రామ్‌సేవక్, అతని అనుచరులు, 1999) ప్రదర్శించింది.
హెచ్. లాంగిపెస్‌వేర్ల నుండి వేరు చేసిన స్పైలాంతాల్ మరియు ఇతర ఆల్కమైడ్లు స్ల్కీరోషియం రాల్ఫిసి, స్ల్కీరోటినియాసెపివొరం, ఫైటోఫ్తొరా ఇన్‌ఫెస్టాన్స్, రైజోక్టోనియా సొలాని ఎజి3 మరియు ఎజి5 శిలీంద్రాల పెరుగుదలనరికట్టాయి (మోలినాటోర్రెస్, అతని అనుచరులు, 2004).
స్పైలాంతాల్ బాసిల్లస్ సబ్‌టైలిస్, ఎస్కరిచియా కోలి, శకారోమైసిస్ సెరెవిసియా పెరుగుదలను కూడా అరికట్టింది (మోలినొటోర్రెస్, అతని అనుచరులు, 2004).
స్పైలాంతస్ క్యాల్వ లోని స్పైలాంతాల్ ఫ్యుజేరియం ఆక్సిస్పోరం, ట్రైకోఫైటాన్ మెంటగ్రోఫైటెస్ పై యాంటిఫంగల్ చర్య ప్రదర్శించింది (రాయ్, అతని అనుచరులు, 2004).
స్పైలాంతాల్ కీటకనాశినిగా కూడా ఉపయోగపడుతంది (కడిర్, అతని అనుచరులు, 1989; స్పెల్‌మన్, అతని అనుచరులు, 2011; శర్మ, అతని అనుచరులు, 2012). బ్రోకోలి వంటి క్యాబేజి జాతి కూరగాయల పంటలనాశించే డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లాని చంపింది (శర్మ, అతని అనుచరులు, 2012). సొలనేసి జాతి మొక్కలనాశించే టమాట లీఫ్‌మైనర్, టూట ఆబ్సల్యూటని కూడా చంపింది. (మోరెనో, అతని అనుచరులు, 2012).
స్పైలాంతాల్ నత్త, ఫైసా ఆక్సిడెంటాలిస్‌పై బలమైన మొల్లస్కిసైడల్ చర్యను ప్రదర్శించింది (జాన్స్, అతని అనుచరులు, 1982).
అక్కలకర్ర మొక్కపొడి (3%, 5%), మొక్కజొన్నగింజల నిల్వ సమయంలో ఆశించే సైటోఫిలస్ జియామెయిస్ వీవిల్స్ మరణ శాతాన్ని పెంచి, విడుదలయ్యే పెద్దపురుగుల శాతాన్ని తగ్గించి గింజలను కాపాడుతుంది. గింజల మొలకశాతంపై ఎటువంటి దుష్ప్రభావం చూపదు (ఓగ్బాన్, అతని అనుచరులు, 2015).