పాషాణభేది మెత్తని కాండం కలిగి వాము ఆకును పోలి వుండే ఏక లేదా ద్వివార్షిక మొక్క. దీని ఆకుల నుండి ఎలాంటి వాసన రాదు. సుమారు 0.5-1.0 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. బాగా శాఖలు తొడిగి చిన్నపాటి పొదలా తయారవుతుంది. ప్రతికణుపు దగ్గర రెండు చొప్పున ఆకులు వస్తాయి. ఈ ఆకుల మొదళ్ళ నుండి మళ్ళీ ఆకులు పుడతాయి. అంచులు దంతాలు కలిగి ఉంటాయి. ఆకులు, కొమ్మలు నూగు కలిగి ఉంటాయి. దీనిని లేత కొమ్మల కత్తిరింపుల ద్వారా వ్యాప్తి చేస్తారు. వేర్లు క్యారట్ దుంపలలాగా ఉండి ప్రతి మొక్కకు 4-5 దుంపలు ఉంటాయి.
సాధారణ నామం : కోలియస్ / మెడిసినల్ కోలియస్ శాస్త్రీయ నామం : కోలియస్ ఫోర్‌స్కాహ్లీ కుటుంబం: లామినేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
కోలియస్ దుంపలను అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తున్నారు. దుంపల నుండి ఫోర్స్కోలిన్ అనబడు డైటెర్పనాయిడ్ (కోలియోనాల్) లభిస్తుంది.
పాషాణ భేది హృద్రోగాలు, ఊబకాయం, బ్రాంకైటిస్, ఉబ్బసం, నరాల బలహీనత, రక్తక్షీణత మొదలగు వ్యాధుల చికిత్సకు మరియు బలవర్థకమైన ఔషధంగా ఉపయోగపడుతుంది.
క్యాన్సర్ చికిత్సలో కూడా ఉపయోగించబడుతున్నది.
వ్యవసాయరంగంలో
పాషాణ భేది నుండి వేరు చేసిన ఫోర్స్కోలిన్ ద్రావణం నిమ్మ ఆకులను తినే పాపిలియో డెమోలియస్ 4వ దశ లార్వాలపై గణనీయమైన యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది (శ్రీనివాసరావు, అతని అనుచరులు, 2014).
పాషాణభేది వేర్ల నుండి వేరు చేసిన డైటెర్పిన్, ఫోర్స్కోలిన్ పాపిలియో డెమోలియస్ నివారణకు సురక్షితమైన యాంటిఫెర్టిలిటి కారకం (శ్రీనివాసరావు అండ్ సబిత, 2017).
పాషాణభేది వేర్ల ఇథనాల్ ద్రావణం కాండం, ఆకుల ఇథనాల్ ద్రావణం కన్నా క్లెబ్సియెల్లా న్యుమోనియే పై అత్యధిక యాంటిబ్యాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది (రాజ్‌కుమార్ అండ్ మాలతి, 2015).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
“పశువుకు వ్యాధి ఎలా వచ్చింది?” అనే ప్రశ్నతో పాటు… “అది మన ఫారంలోకి ఎలా వచ్చింది?” అని కూడా ఆలోచించాలి.
పాడి ఫారంలో ఒక పశువుకు వ్యాధి వస్తే, అది ఆ ఒక్క పశువుతోనే ఆగిపోతుందని చెప్పలేం. కొత్తగా తెచ్చిన పశువులు, బయట నుంచి వచ్చే వ్యక్తులు, వాహనాలు, అపరిశుభ్రమైన పాక, మేత, నీరు, పరికరాలు ఇలా అనేక మార్గాల్లో వ్యాధులు ఫారంలోకి రావచ్చు. ఒక పశువు నుంచి మరో పశువుకు కూడా వ్యాపించవచ్చు. అందుకే పశువులకు చికిత్స చేయించడమే కాకుండా, వ్యాధులు ఫారంలోకి రాకుండా, వచ్చినా ఇతర పశువులకు వ్యాపించకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. దీనికి పెద్ద పెద్ద ఏర్పాట్లు అవసరం లేదు. రోజూ మనం చేసే పనుల్లో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు. మరి మీ పాడి ఫారంలో అలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారా? ఈ 10 అంశాలతో మీరే తెలుసుకోండి.
కొత్తగా తెచ్చిన పశువులను వెంటనే మందలో కలుపుతున్నారా? కొత్తగా తెచ్చిన పశువు చూడటానికి ఆరోగ్యంగా కనిపించినా, దానితో పాటు వ్యాధులు కూడా ఫారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వెంటనే మందలో కలపకుండా కనీసం 3 వారాల పాటు వేరుగా ఉంచి ఆరోగ్యాన్ని గమనించడం మంచిది. ఈ సమయంలో పశువులో ఏదైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే పశువైద్యుని సంప్రదించాలి. అంతా సరిగా ఉందని నిర్ధారించుకున్న తర్వాతే మందలో కలపడం మంచిది.
అనారోగ్య పశువులను వేరుగా ఉంచే ఏర్పాటు ఉందా? మందలో ఏదైనా పశువు అనారోగ్యానికి గురైతే, వీలైనంత వరకు మందకు కొంత దూరంగా, ఇతర పశువులతో కలవకుండా ఉంచడం మంచిది. అనారోగ్య పశువుకు మేత, నీరు పెట్టేందుకు వాడే తొట్లు, బకెట్లు కూడా ఇతర పశువులకు వాడకుండా చూడాలి. ముందుగా ఆరోగ్యంగా ఉన్న పశువుల పనులు చూసుకొని, చివరగా అనారోగ్య పశువు దగ్గరకు వెళ్లాలి. ఆ తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ, పశువైద్యుని సలహాతో చికిత్స చేయిస్తే మిగతా పశువులకు వ్యాధి వ్యాపించే అవకాశాన్ని తగ్గించవచ్చు.
మీ పాడి ఫారంలోకి వచ్చే వ్యక్తులు, వాహనాల రాకపోకలను గమనిస్తున్నారా? పాడి ఫారానికి వివిధ పనుల కోసం బయట వ్యక్తులు, ఇతర రైతులు, వాహనాలు వచ్చి వెళ్తుంటాయి. వీటి ద్వారా ఒక ఫారం నుంచి మరో ఫారానికి మట్టి, పేడతో పాటు వ్యాధులు కూడా చేరే అవకాశం ఉంటుంది. అందుకే బయట నుంచి వచ్చే వ్యక్తులు పశువుల దగ్గరకు నేరుగా వెళ్లకుండా చూసుకోవాలి. వాహనాలను కూడా వీలైనంత వరకు పశువుల పాకకు దూరంగా ఉంచాలి. ముఖ్యంగా ఇతర పశువుల ఫారాలకు వెళ్లి వచ్చిన వ్యక్తులు, వాహనాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
పశువుల పాకలోకి వెళ్లే ముందు చేతులు, కాళ్లు శుభ్రం చేసుకుంటున్నారా? మన చేతులు, కాళ్లు, చెప్పులకు అంటుకున్న మట్టి, పేడ ద్వారా కూడా వ్యాధులు ఒక చోటు నుంచి మరో చోటుకు చేరే అవకాశం ఉంటుంది. అందుకే బయట నుంచి వచ్చిన వెంటనే పశువుల దగ్గరకు వెళ్లకుండా చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవడం మంచిది. ముఖ్యంగా పశువుల సంతకు, మరో పాడి ఫారానికి వెళ్లి వచ్చినప్పుడు ఈ జాగ్రత్త మరింత అవసరం. వీలైతే పశువుల పాకలో వేసుకునేందుకు వేరే చెప్పులు ఉంచుకోవాలి. వాటిని బయట ఇతర పనులకు ఉపయోగించకూడదు. అనారోగ్య పశువును చూసిన తర్వాత చేతులు, చెప్పులు శుభ్రం చేసుకొని, ఆ తర్వాతే ఇతర పశువుల దగ్గరకు వెళ్లాలి. ఈ చిన్న అలవాట్లు బయట నుంచి లేదా ఒక పశువు నుంచి మరో పశువుకు వ్యాధులు చేరే అవకాశాన్ని తగ్గిస్తాయి.
పాకను శుభ్రంగా, పొడిగా ఉంచుతున్నారా? పశువుల పాకలో పేడ, వ్యర్థాలు పేరుకుపోయి, నేల ఎక్కువసేపు తడిగా ఉంటే పశువులకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అందుకే పేడ, ఇతర వ్యర్థాలను రోజూ తొలగించాలి. మూత్రం, మురికి నీరు పాకలో నిల్వ ఉండకుండా బయటకు వెళ్లేలా కాలువలు ఉండాలి. తొలగించిన పేడను పాక దగ్గరే పోగు చేయకుండా, నిర్ణీత ప్రదేశంలో సేకరించి సేంద్రియ ఎరువు తయారీకి లేదా వీలైతే బయోగ్యాస్ తయారీకి ఉపయోగించుకోవచ్చు. పశువులు పడుకునే ప్రదేశంలో తేమ లేకుండా చూసుకోవాలి. అలాగే పాకలోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూడాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు పాకలో అపరిశుభ్రతను తగ్గించి, పశువుల ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి.
మేత, తాగునీరు కలుషితం కాకుండా కాపాడుతున్నారా? పశువులకు ఇచ్చే మేత, తాగునీరు శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. మేతలో పేడ, మట్టి లేదా ఇతర మలినాలు కలవకుండా చూసుకోవాలి. మేతను తేమ తగలకుండా, పొడిగా ఉండే ప్రదేశంలో నిల్వ చేయాలి. బూజు పట్టిన లేదా చెడిపోయిన మేతను పశువులకు ఇవ్వకూడదు. మేత తొట్లు, నీటి తొట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. తొట్టెలో మిగిలిపోయి చెడిపోయిన మేతను తొలగించి, తాజా మేత వేయాలి. పశువులకు ఎల్లప్పుడూ శుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలి. ఇలా మేత, నీటి విషయంలో జాగ్రత్తలు పాటిస్తే వాటి ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గించవచ్చు. అలాగే పశువులకు సమతుల్య మేతతో పాటు తగిన ఖనిజ లవణ మిశ్రమాన్ని కూడా అందించాలి.
పాలు పితికే పాత్రలు, ఇతర పరికరాలను శుభ్రంగా ఉంచుతున్నారా? పాలు పితికే సమయంలో పరిశుభ్రత పాటించడం పశువుల ఆరోగ్యంతో పాటు పాల నాణ్యతకు కూడా చాలా ముఖ్యం. పాలు పితికే ముందు చేతులు, పొదుగును శుభ్రంగా కడిగి, పొదుగును పొడి గుడ్డతో తుడవాలి. పాలు పితికే పాత్రలను ప్రతి సారి ఉపయోగించిన తర్వాత బాగా కడిగి ఆరబెట్టాలి. పాలు పితికే యంత్రాలు, ఇతర పరికరాలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. పాలు పితికిన తర్వాత చనుమొనలను పశువైద్యుడు సూచించిన టీట్ డిప్పింగ్ ద్రావణంలో ముంచడం మంచిది. ఇలా సరైన పద్ధతిలో పాలు పితకడం వల్ల మాస్టిటిస్ (పొదుగు వాపు) వచ్చే అవకాశాన్ని తగ్గించడంతో పాటు నాణ్యమైన పాలను పొందవచ్చు.
ఈగలు, దోమలు, ఎలుకల బెడదను తగ్గిస్తున్నారా? పశువుల పాకలో ఈగలు, దోమలు, ఎలుకలు ఎక్కువగా ఉంటే పశువులకు ఇబ్బంది కలిగించడంతో పాటు వివిధ రకాల వ్యాధులు వ్యాపించడానికి కూడా కారణమవుతాయి. అందుకే పాకలో పేడ, మిగిలిపోయిన మేత పేరుకుపోకుండా, చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దాణా నిల్వ చేసే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచి, దాణా చెల్లాచెదురుగా పడకుండా చూసుకోవాలి. అవసరమైతే పశువైద్యుల సూచనలతో ఈగలు, దోమలను దూరంగా ఉంచే రిపెల్లెంట్లను, ఎలుకల నియంత్రణకు తగిన పద్ధతులను ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల లంపీ స్కిన్ డిసీజ్ (ముద్ద చర్మ వ్యాధి), సర్రా వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
టీకాలు, నట్టల మందులు సమయానికి వేయిస్తున్నారా? వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయించడం కంటే, ముందుగానే నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అందుకే పశువులకు అవసరమైన టీకాలను సమయానికి వేయించడంతో పాటు, నట్టల నివారణకు కూడా సకాలంలో మందులు ఇవ్వాలి. పశువుల వయస్సు, ఆరోగ్య పరిస్థితి, ప్రాంతంలో వచ్చే వ్యాధులను బట్టి పశువైద్యుని సూచనతో వీటిని పాటించాలి. టీకాలు, నట్టల మందులు ఇచ్చిన తేదీలను చిన్న పుస్తకంలో లేదా మొబైల్లో నమోదు చేసుకుంటే, తదుపరి ఎప్పుడు ఇవ్వాలో తెలుసుకోవడం సులభమవుతుంది.
పశువు ఆరోగ్యంలో మార్పు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నారా? రోజూ కొద్దిసేపు పశువులను దగ్గరగా గమనించడం అలవాటు చేసుకోవాలి. పశువు సాధారణంగా ఎలా ఉంటుందో తెలిసినప్పుడే దాని ఆరోగ్యంలో వచ్చే మార్పులను త్వరగా గుర్తించవచ్చు. మేత తినకపోవడం, నీరసంగా ఉండటం, జ్వరం, దగ్గు, విరేచనాలు, పాల దిగుబడి అకస్మాత్తుగా తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. అనారోగ్యంగా ఉన్న పశువును వీలైనంత వరకు ఇతర పశువులతో కలవకుండా ఉంచి, వెంటనే పశువైద్యుని సంప్రదించాలి. మందలోని ఇతర పశువుల్లో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయేమో గమనించాలి. ఒకటి కంటే ఎక్కువ పశువుల్లో ఒకే విధమైన లక్షణాలు కనిపిస్తే మరింత అప్రమత్తంగా ఉండి, వెంటనే పశువైద్యునికి తెలియజేయాలి. వ్యాధిని తొలిదశలోనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం వల్ల చికిత్స త్వరగా ప్రారంభించడంతో పాటు, ఇతర పశువులకు వ్యాధి వ్యాపించే ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.
మరి… మీ పాడి ఫారం ఎంతవరకు సురక్షితం? ఈ 10 అంశాల్లో మీరు ఇప్పటికే పాటిస్తున్నవి ఏవి? ఇంకా మెరుగుపరచుకోవాల్సినవి ఏవి? ఒకసారి మీరే పరిశీలించుకోండి.
పశువుల కొనుగోలు నుంచి రోజువారీ సంరక్షణ, మేత, నీరు, పాలు పితకడం, టీకాలు, ఆరోగ్య పరిశీలన వరకు ప్రతి దశలో సరైన పద్ధతులు పాటించడం ముఖ్యం. వీటిని రోజువారీ ఫారం నిర్వహణలో భాగంగా చేసుకుంటే పశువుల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు పాడి ఫారాన్ని మరింత సురక్షితంగా నిర్వహించవచ్చు.
Dr. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్, Dr. బద్దం అఖిల , టీచింగ్ ఫాకల్టీ, పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం, పశువైద్య కళాశాల, కోరుట్ల, PVNRTVU. 7093198419
తయారుచేయు విధానం: ఒక గ్లాసు జ్యూస్‌కు పెద్ద కప్పు ముక్కలు సరిపోతాయి. గుమ్మడికాయను దాని పైనున్న బూడిద పోయేలాగా బాగా కడగాలి. తర్వాత మనకు కావలసినన్ని ముక్కలు కోసుకోవాలి. కాయ పైనున్న చెక్కు, లోపల గింజలు తీయనవసరం లేదు. అన్ని వేసుకోవచ్చు. దీనిలో చిన్న గ్లాసు మజ్జిగ కానీ, నాలుగు స్పూన్ల పెరుగు కానీ వేసుకోవాలి. పెరుగు లేదా మజ్జిగ వద్దనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. గుమ్మడికాయలోనే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అల్లం చిన్నముక్క తీసుకుని కట్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపి మిక్సీలో కానీ జ్యూసర్లో కానీ వేసుకుని జ్యూస్ తయారు చేసుకోవాలి. జ్యూస్ తయారయిన తర్వాత మిక్సీలో వేసుకున్న జ్యూస్‌ను వడకట్టుకోవాలి. జ్యూసర్లో అయితే వడగట్టనవసరం లేదు. దీనిలో నిమ్మరసం రుచికి తగినంత కలపాలి.
ఇప్పుడు కొంతమంది జ్యూస్ షాపుల వారు కూడా బూడిద గుమ్మడికాయ జ్యూస్ తయారు చేస్తున్నారు.
రచన : లతా కృష్ణమూర్తి, కుషాయిగూడ, హైదరాబాద్, తెలంగాణ
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
సాధారణ నామం కర్పూరవల్లి / కప్పరిల్లాకు/ కంట్రీబోరేజ్ శాస్త్రీయ నామం కోలియస్ ఆరోమాటికస్ కుటుంబం: లామినేసి
ఇది దాదాపు 1 మీ. ఎత్తు వరకు పెరిగే బహువార్షిక మొక్క. దీని అన్ని భాగాలు మెత్తగా, మందంగా ఎక్కువ రసంతో వాములాంటి వాసన కలిగి ఉంటాయి. ఆకులు కణుపుకి ఒకటి చొప్పున అండాకృతి లేదా హృదయాకారం కలిగి మెత్తని నూగుతో దంతాల లాంటి అంచులతో దళసరిగా ఉంటాయి. పూలు అతిచిన్నవిగా లేత ఊదారంగులో కొమ్మల చివర పొడవైన గుత్తులుగా వస్తాయి. ఫలాలు పెంకు గల చిరుఫలాలు. దీనిని కొమ్మల ద్వారా వ్యాప్తి చేయవచ్చు.
ఉపయోగాలు : ఔషధరంగంలో …
వాము ఆకులు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. ఈ ఆకుల నుండి ఆవిరయ్యే నూనె, డైటెర్పీన్లు, థైమాల్, కాంఫర్ వంటి ఔషధగుణాలు గల రసాయనాలు లభిస్తాయి.
వాము ఆకు జీర్ణశక్తిని పెంచి అజీర్ణపు కడుపు నొప్పులను పోగొడుతుంది. మూత్రకోశంలోని రాళ్ళను కరిగించి మూత్రాన్ని సులువుగా జారీ చేస్తుంది.
ఆకుల కషాయం దీర్ఘకాలపు మొండిదగ్గులకు, ఉబ్బసానికి, అధిక రక్తపోటుని తగ్గించడానికి, గుండె జబ్బులకి ఉపయోగపడుతుంది.
వ్యవసాయరంగంలో
వాము ఆకు ఎసెన్షియల్ ఆయిల్ (350 పిపియం) ట్రైబోలియం కాస్టానియం పురుగులను 100% చంపింది. దీనిని నిల్వ ధాన్యంలో ఆశించే పురుగుల నివారణకు రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. (జయ, ఆమె అనుచరులు, 2014).
వాము ఆకు ఎసెన్షియల్ ఆయిల్ (1000 పిపియం) గోధుమ గింజలను ట్రైబోలియం కాస్టానియం ఆశించకుండా పూర్తిగా కాపాడింది.
వాము ఆకు ద్రావణంలోని 11ఆక్టాడెసెనాయిక్ ఆసిడ్, మిథైల్ ఎస్టర్ మస్క్యిటోసైడల్ మరియు వికర్షక చర్యలను ఈడెస్ ఈజిప్టి, అనోఫెలెస్ స్పెఫెన్స్, క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్ పై ప్రదర్శించాయి (మథాలైముత్తు, అతని అనుచరులు, 2016).
వాము ఆకు ఎసెన్షియల్ ఆయిల్ మరియు దానిలోని కార్వక్రాల్ క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్, ఈడెస్ ఈజిప్టి, అనోఫెలెస్ స్టెఫెన్సిని రసాయన పురుగు మందులకు ప్రత్నామ్నాయంగా నివారించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. (గోవిందరాజు, అతని అనుచరులు, 2016).
వాము ఆకు మిథనాల్ ద్రావణం బీటిల్, ఎపిలాక్న వరివెస్టిస్ పై యాంటిఫీడెంట్ చర్యను కలిగి ఉంది. ఎసెన్షియల్ ఆయిల్ శిలీంద్రాలు, బాక్టీరియా, నత్తలు, నెమటోడ్లపై యాంటిఫంగల్, యాంటిబాక్టీరియల్, యాంటిమొల్లస్కల్, యాంటినెమటోడ్ చర్యలను ప్రదర్శించింది (వాస్క్వెజ్, అతని అనుచరులు)
కోలియస్ ఆంబోయినకస్ ఆకులలోని ఎసెన్షియల్ ఆయిల్ తెల్ల చెదలపై ఇన్సెక్టిసైడల్ చర్యను ప్రదర్శించింది. ఇది రసాయన పురుగు మందులు థయోడాన్, ప్రైమోబన20 కన్నా అధిక సమర్ధవంతంగా చెదపురుగులను చంపింది (గుర్దీప్సింగ్, అతని అనుచరులు, 2002).
శ్రీగోమత గాయత్రి ఆర్గానిక్స్ అండ్ ఆయుర్వేద సేంద్రియ కోలియస్ పురుగు మందుని కోలియస్ ఆంబోనికస్, ఒరిగానోలతో తయారు చేశారు. ఇది శిలీంద్రనాశక, కీటకనాశక, చెదలనాశక లక్షణాలను కలిగి ఉంది. 20% ద్రావణాన్ని ఉదయం వేళల్లో పిచికారి చేయాలి.
వాము ఆకు మొత్తం మొక్కను పురుగు మందుగా ఉపయోగిస్తారు. కోలియస్ ఆంబియానికస్ నర్సరి దశలోని కొబ్బరి మొక్కలపై ఒరెåక్టెస్ రైనోసిరాస్ గుడ్లు పెట్టకుండా నిరోధిస్తుంది. కొబ్బరి నారు మొక్కల చుట్టూ వాము ఆకు (కోలియస్ ఆరోమాటికస్) మొక్కలను నాటడం ఆనవాయితీగా వస్తుంది. (కిఈఒ, అతని అనుచరులు, 2006).
వాము ఆకు ఎసెన్షియల్ ఆయిల్ కొన్ని నిల్వ ధాన్యంలో ఆశించే శిలీంద్రాలపై యాంటి ఫంగల్ చర్యను ప్రదర్శించింది. ఇది ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్ శిలీంద్రం అఫ్లాటాక్సిన్ని ఉత్పత్తి చేయకుండా నివారించింది. అంతేగాక గోధుమ గింజలను ఈ ఎసెన్షియల్ ఆయిల్‌తో ఫ్యూమిగేట్ చేస్తే శిలీంద్రాలు ఆశించకుండా కాపాడింది. (జయ, ఆమె అనుచరులు, 2011).
వాము ఆకు ఎసెన్షియల్ ఆయిల్ అఫ్లాటాక్సిన్ ఉత్పత్తి చేసే ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్ని అత్యంత సమర్ధవంతంగా అరికట్టింది (భానుప్రకాష్ అండ్ డుబె, 2011).
వీవర్ అండ్ సుబ్రమణ్యం (2000) నిల్వ ధాన్యంలో ఆశించే పురుగులను అరికట్టే లక్షణాలను గల 200 మొక్కలను గుర్తించారు. అందులో వాము ఆకు ఒకటి.
వాము ఆకు మిథనాల్ ఫ్రాక్షన్ 4 ఈడెస్ ఈజప్టి, అనాఫెలెస్ స్టెఫెన్సి, క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్‌పై అధిక విషచర్యను ప్రదర్శించింది. 40 పిపియం మిథనాల్ ఫ్రాక్షన్ 4, 100% గుడ్లచావును నమోదు చేసింది, మిథనాల్ ఫ్రాక్షన్ 4 దోమల పెద్ద పురుగులను వికర్షించింది. (మాతలయ్ముత్తు, అతని అనుచరులు, 2016).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
తయారు చేసే విధానం: ముందుగా చింతపండును శుభ్రంగా కడిగి నీరు పోసి నాన పెట్టుకోవాలి. చింతపండు మంచిగా నానిన తర్వాత మొదలు వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, తగినంత ఉప్పు, కారం వేసుకొని మిక్సీ పట్టాలి. ఆ తర్వాతకి నానబెట్టిన చింతపండును కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చివరగా కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ చేర్చి ఒక రౌండ్ తిప్పుకుంటే ఉల్లిగడ్డ బాగా మెత్తగా కాకుండా ఉంటుంది. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని నువ్వుల నూనె కలుపుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుంది.
రచన : ఇమ్మిడిశెట్టి ప్రభాకరరావు, హన్మకొండ, తెలంగాణ.
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
బూడిద గుమ్మడికాయ ముక్కలు కొద్దిగా, లేదా తురుము కొద్దిగా
పెరుగు – సరిపడునంత
ఉప్పు – తగిన మోతాదులో
ఆవపిండి – అర చెంచా
రెండు పచ్చిమిర్చి (చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి)
తరిగిన కొత్తిమీర – కొద్దిగా
తయారుచేసే విధానం బూడిది గుమ్మడికాయ పైన ఉన్న మందపాటి తొక్కను చాకుతో తీసివేసి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా పెద్ద ముక్కను తురుముగా చేసుకొని అయినా పెరుగు పచ్చడిలో ఉపయోగించుకోవచ్చు. పెరుగును చల్లకవ్వంతోనే చిల్కి ఈ తురుమును లేదా గ్రైండ్ చేసుకున్న ముద్దను పెరుగులో కలుపుకోవాలి. దానికి తగిన మోతాదు లోపల ఉప్పు, రెండు పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా మిరియాల పౌడర్, కొంచెం ఆవపిండిని కలుపుకొని చల్లకవ్వంతోని చక్కగా చిలకాలి. బూడిద గుమ్మడికాయ పెరుగు పచ్చడిని అన్నంలోకి, చపాతీలోకి కూడా తినవచ్చు.
రచన : సముద్రాల రమణ, హన్మకొండ, తెలంగాణ
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. కోట్లాది మంది రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే వాతావరణ మార్పులు, సాగునీటి కొరత, పెరుగుతున్న సాగు ఖర్చులు, చీడపీడలు, మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులు వంటి అనేక సమస్యలు రైతుల ఆదాయంపై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆధునిక వ్యవసాయ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా ఉత్పాదకతను పెంచి, ఖర్చులను తగ్గించి, రైతుల నికర ఆదాయాన్ని పెంచే అవకాశం ఉంది.
డ్రోన్లతో పంటల పర్యవేక్షణ వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం వేగంగా పెరుగుతోంది. డ్రోన్ల ద్వారా పంట పొలాలను తక్కువ సమయంలో పరిశీలించి, పంటలో నీటి కొరత, పోషక లోపాలు, చీడపీడలు, వ్యాధుల ప్రభావాన్ని గుర్తించవచ్చు.అవసరమైన ప్రాంతాల్లోనే పురుగుమందులు లేదా ద్రవ ఎరువులను పిచికారీ చేయడం ద్వారా ఇన్పుట్ ఖర్చులు, సమయం, నీరు మరియు శ్రమను ఆదా చేయవచ్చు. ముఖ్యంగా పెద్ద విస్తీర్ణంలో సాగు చేసే రైతులకు డ్రోన్ సాంకేతికత ఉపయోగకరంగా ఉంటుంది.
సెన్సార్లతో నీటి వినియోగం తగ్గింపు నేలలో తేమను గుర్తించే మాయిశ్చర్ సెన్సార్లు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. నేలలో తేమ అవసరమైన స్థాయిలో ఉన్నప్పుడు నీటిపారుదల చేయకుండా, అవసరమైనప్పుడు మాత్రమే నీరు అందించడం ద్వారా నీటి వృథాను తగ్గించవచ్చు.డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను సెన్సార్ ఆధారిత వ్యవస్థలతో అనుసంధానం చేయడం ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని మరింత పెంచవచ్చు.
కృత్రిమ మేధస్సు (AI) – రైతుకు డిజిటల్ సహాయకుడు కృత్రిమ మేధస్సు వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలను సృష్టిస్తోంది. పంట ఫోటో ఆధారంగా కొన్ని చీడపీడలు, వ్యాధుల లక్షణాలను గుర్తించడం, వాతావరణ సమాచారాన్ని విశ్లేషించడం, పంటల పరిస్థితిని పర్యవేక్షించడం వంటి పనుల్లో AI ఆధారిత సాధనాలు సహాయపడుతున్నాయి.రైతు తన పొలంలో తీసిన పంట ఫోటోను ఆధారంగా చేసుకుని సమస్యను ముందుగానే గుర్తించి, వ్యవసాయ నిపుణుల సలహాతో సరైన నివారణ చర్యలు చేపడితే పంట నష్టాలను తగ్గించవచ్చు.
మొబైల్ ఫోన్ – రైతు చేతిలో వ్యవసాయ విజ్ఞాన కేంద్రం నేడు దాదాపు ప్రతి రైతు చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. వాతావరణ సూచనలు, మార్కెట్ ధరలు, పంటల సాగు పద్ధతులు, చీడపీడల నివారణ, ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ నిపుణుల సలహాలు వంటి సమాచారాన్ని మొబైల్ ద్వారా పొందవచ్చు.సరైన సమయంలో సరైన సమాచారం రైతుకు అందితే నిర్ణయాలు మరింత మెరుగ్గా తీసుకోవచ్చు. దీనివల్ల అనవసరమైన పెట్టుబడులు తగ్గి, పంట నిర్వహణ మెరుగుపడుతుంది.
అధిక దిగుబడి మరియు వాతావరణ అనుకూల రకాలు ఆధునిక వ్యవసాయంలో మంచి నాణ్యత కలిగిన, అధిక దిగుబడి ఇచ్చే మరియు స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన విత్తన రకాలను ఎంపిక చేయడం కీలకం.పంట కాలం, నీటి లభ్యత, నేల స్వభావం, మార్కెట్ డిమాండ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సరైన పంట–సరైన రకం–సరైన కాలం అనే విధానాన్ని పాటించడం ద్వారా ఉత్పాదకతను పెంచవచ్చు.
మట్టి పరీక్ష – ఎరువుల ఖర్చుకు నియంత్రణ రైతులు మట్టి పరీక్ష చేయకుండా అంచనాతో ఎరువులు వేయడం వల్ల ఖర్చులు పెరగడంతో పాటు నేల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.మట్టి పరీక్ష ఆధారంగా సమతుల్య ఎరువుల వినియోగం చేయడం ద్వారా అవసరమైన పోషకాలను సరైన మోతాదులో అందించవచ్చు. దీంతో ఎరువులపై అనవసరమైన ఖర్చు తగ్గి, నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ప్రెసిషన్ ఫార్మింగ్ – ప్రతి ప్రాంతానికి అవసరమైన నిర్వహణ ప్రెసిషన్ ఫార్మింగ్ అంటే మొత్తం పొలాన్ని ఒకే విధంగా కాకుండా, పొలంలోని వివిధ ప్రాంతాల అవసరాలను గుర్తించి విత్తనం, నీరు, ఎరువులు, పురుగుమందులను అవసరానికి అనుగుణంగా వినియోగించడం.దీని ద్వారా “ఎక్కడ ఎంత అవసరమో అక్కడ అంతే” అనే విధానాన్ని పాటించవచ్చు. ఫలితంగా వనరుల వినియోగ సామర్థ్యం పెరిగి, ఉత్పత్తి ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది.
పంటల వైవిధ్యీకరణతో అదనపు ఆదాయం ఒకే పంటపై ఆధారపడటం రైతుకు మార్కెట్ మరియు వాతావరణ ప్రమాదాలను పెంచుతుంది. అందువల్ల వరి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటలతో పాటు పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఉద్యాన పంటలు మరియు పశుగ్రాస పంటలను ప్రాంతానికి అనుగుణంగా చేర్చడం ద్వారా ఆదాయ వనరులను విస్తరించవచ్చు.ఉదాహరణకు, నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పప్పుధాన్యాలు మరియు నూనెగింజలను ప్రోత్సహించడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు అదనపు ఆదాయం పొందే అవకాశాన్ని కల్పించవచ్చు.
పంట అవశేషాల నిర్వహణ – వ్యర్థం కాదు, వనరు పంట అవశేషాలను కాల్చడం వల్ల గాలి కాలుష్యం పెరగడంతో పాటు నేలలోని సేంద్రియ పదార్థం కూడా తగ్గుతుంది. పంట అవశేషాలను కంపోస్ట్, మల్చింగ్, పశుగ్రాసం లేదా ఇతర విలువ ఆధారిత ఉత్పత్తులుగా వినియోగించడం ద్వారా వాటిని వనరుగా మార్చవచ్చు.ఇది పర్యావరణ పరిరక్షణతో పాటు సాగు ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది.
యాంత్రీకరణతో శ్రమ మరియు సమయం ఆదా వ్యవసాయ కూలీల కొరత, పెరుగుతున్న కూలి ఖర్చులు రైతులకు ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి. చిన్న మరియు పెద్ద రైతులకు అనువైన వ్యవసాయ యంత్రాలను ఉపయోగించడం ద్వారా దుక్కి దున్నడం, విత్తడం, కలుపు నివారణ, పంట కోత వంటి పనుల్లో సమయం మరియు శ్రమను ఆదా చేయవచ్చు.చిన్న రైతులు వ్యక్తిగతంగా యంత్రాలు కొనుగోలు చేయలేని సందర్భంలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు, రైతు సమూహాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOs) ద్వారా యంత్రాలను అందుబాటులోకి తీసుకురావచ్చు.
మార్కెట్ సాంకేతికత – మంచి ధర కోసం రైతు ఆదాయంలో ఉత్పత్తి ఎంత ముఖ్యమో, సరైన మార్కెటింగ్ కూడా అంతే ముఖ్యం. మొబైల్ ఆధారిత మార్కెట్ సమాచారం, డిజిటల్ మార్కెటింగ్, రైతు సమూహాలు మరియు FPOల ద్వారా మార్కెట్‌కు నేరుగా అనుసంధానం కావడం వల్ల మధ్యవర్తిత్వ ఖర్చులను తగ్గించే అవకాశం ఉంటుంది.నాణ్యత, గ్రేడింగ్, ప్యాకేజింగ్, నిల్వ మరియు విలువ ఆధారిత ఉత్పత్తులు రైతు ఉత్పత్తికి అదనపు విలువను తీసుకురాగలవు.
సౌరశక్తితో వ్యవసాయం సౌర పంపులు మరియు ఇతర పునరుత్పాదక శక్తి ఆధారిత పరికరాలను వినియోగించడం ద్వారా కొన్ని సందర్భాల్లో విద్యుత్ మరియు ఇంధన వ్యయాలను తగ్గించవచ్చు. ముఖ్యంగా నీటిపారుదల అవసరాల్లో సౌరశక్తి ఒక ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది.
రైతు ఆదాయం పెరగడానికి “ఉత్పత్తి పెంపు” ఒక్కటే మార్గం కాదు రైతుల ఆదాయాన్ని పెంచడానికి కేవలం దిగుబడిని పెంచడం సరిపోదు. దిగుబడి పెరగడం + సాగు ఖర్చు తగ్గడం + నాణ్యత పెరగడం + మంచి మార్కెట్ ధర + పంట నష్టాల తగ్గింపు + విలువ ఆధారిత ఉత్పత్తులు అన్నీ కలిసినప్పుడే రైతు నికర ఆదాయం గణనీయంగా పెరగవచ్చు.
ఒక రైతు కోసం సాంకేతిక వ్యవసాయ సూత్రం మట్టి పరీక్ష → మంచి విత్తనం → సరైన పంట ఎంపిక → శాస్త్రీయ సాగు → సూక్ష్మ నీటిపారుదల → సమతుల్య ఎరువుల వినియోగం → IPM → డ్రోన్/సెన్సార్ ఆధారిత పర్యవేక్షణ → యాంత్రీకరణ → విలువ జోడింపు → మంచి మార్కెటింగ్ఈ మొత్తం ప్రక్రియను సమగ్రంగా అమలు చేస్తే రైతు ఉత్పత్తి ఖర్చును నియంత్రిస్తూ, ఉత్పాదకత మరియు నికర ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది.
ముగింపు వ్యవసాయ రంగ భవిష్యత్తు సంప్రదాయ జ్ఞానం మరియు ఆధునిక సాంకేతికత కలయికలో ఉంది. సాంకేతికత రైతుకు ప్రత్యామ్నాయం కాదు; రైతు నిర్ణయాలను మరింత శాస్త్రీయంగా, సమర్థవంతంగా తీసుకోవడానికి ఒక శక్తివంతమైన సాధనం.ప్రతి రైతు తన ప్రాంతంలోని నేల, నీరు, వాతావరణం, పంట మరియు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికతను ఎంచుకోవాలి. వ్యవసాయ శాఖలు, కృషి విజ్ఞాన కేంద్రాలు (KVKs), వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు మరియు రైతు సమూహాలు కలిసి సాంకేతికతను గ్రామస్థాయికి తీసుకెళ్లినప్పుడు వ్యవసాయం మరింత లాభదాయకంగా మరియు స్థిరమైన జీవనోపాధిగా మారుతుంది.
కృషి విజ్ఞాన కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో రైతు పొలంలో డ్రోన్ ద్వారా విత్తనాలను విత్తే సాంకేతికతపై ప్రదర్శన నిర్వహించబడింది.
డా. టి. భరత్, సీనియర్ శాస్త్రవేత్త & అధిపతి కృషి విజ్ఞాన కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU), తెలంగాణ మొబైల్: 9700549754. ఇ-మెయిల్: kvkkothagudem@pjtau.edu.in
వామింట ఆకుల కషాయం క్యాబేజి, కాలీ ఫ్లవర్‌ను ఆశించే డైమండ్ బ్యాక్ మాత్ పురుగులను నివారిస్తుంది. వంగ పంటనాశించే పొగాకు లద్దె పురుగు, పేనుబంకను నివారించే గుణం వామింట కషాయానికి వుంది. వామింట ఆకులను “పంచపత్ర కషాయం” తయారీలో కూడా ఉపయోగించుకోవచ్చు. పంచపత్ర కషాయాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సేంద్రియ వ్యవసాయ రైతులు అనేక పంటల్లో సస్యరక్షణకు వినియోగిస్తున్నారు.
శిలీంద్ర తెగుళ్ళ నివారణ కషాయం
కావలసిన పదార్థాలు: కలబంద ఆకులు (అలోవిర) 1 కిలో; బోగన్‌విల్లియా ఆకులు 1 కిలో; బొప్పాయి ఆకులు 1 కిలో; పసుపు పొడి: 200 గ్రాములు.
తయారు చేసే విధానం : పైన తెలిపిన అకులను సూచించిన మోతాదులో తీసుకుని మెత్తగా నూరి 10 లీటర్ల నీరు పోసిన కుండలో వేసి దానికి 200 గ్రాముల పసుపు పొడిని కలిపి పొయ్యిపై పెట్టి సన్నని సెగపై ఉడకబెట్టాలి. నాలుగయిదు పొంగులు వచ్చే వరకు బాగా కర్రతో తిప్పుతూ ఉడకబెట్టాలి. ద్రావణాన్ని బాగా చల్లారనిచ్చి, వడగట్టి ఒక ప్లాస్టిక్ డ్రమ్‌లో పోయాలి. దీనికి 100 లీటర్ల నీరు కలిపి సాయంత్రంవేళల్లో పంటపై పిచికారి చేయాలి. ఈ ద్రావణం ఒక ఎకరం పంటకు సరిపోతుంది.
గమనిక :
కషాయం తయారు చేసేటపుడు ముక్కుకు గుడ్డకట్టుకోవాలి.
పంటదశను, తెగులు ఉధృతిని బట్టి రెండుసార్ల వరకు పిచికారి చేసుకోవచ్చు.
ద్రావణాన్ని నిల్వ ఉంచరాదు.
ఈ కషాయాన్ని పంటలలో వచ్చు ఆకుమచ్చ తెగుళ్ళ నివారణకు ఉపయోగించవచ్చు.
నేలవేము మొక్కల్లో వున్న “ఆండ్రోగ్రాఫోలిడ” అనే రసాయనం కీటకాలకు అభివృద్ధి నిరోధకంగా, భక్షక నిరోధకంగా, క్రిమి సంహారకంగా పనిచేస్తుంది. అందువల్ల ఆకులను సస్యరక్షణలో కషాయంగా కానీ, “పంచపత్ర కషాయం”లో గానీ రైతులు ఉపయోగించుకోవచ్చు. నేలవేము కషాయంలో ఉన్న రసాయనాలు ఎంతో శక్తివంతమైనవి.
తయారీ విధానం : ఒక ఎకరం పొలంలోని పంటకవసరమయ్యే కషాయం తయారు చేయడానికి సుమారు 5 కి. నేలవేము ఆకులు అవసరమవుతాయి. ఈ ఆకులను 10 లీ. నీటిలో ఒక గంటసేపు మరిగించాలి. ఈ విధంగా మరిగించిన కషాయం సుమారు 5 లీ. వరకు ఉంటుంది. ఈ కషాయాన్ని బాగా చల్లార్చి, పలుచని గుడ్డతో వడపోయాలి. వడపోసిన కషాయానికి 100 గ్రా. సబ్బు పొడి లేదా 50 గ్రా. కుంకుడు కాయల రసాన్ని కలపాలి. దీనికి 100 లీ. నీటిని కలిపి ఒక ఎకరం పొలంలో సాయంత్రంవేళ పిచికారి చేయాలి. కషాయం బాగా మరుగుతున్నపుడు మధ్య మధ్యలో కర్రతో బాగా కలుపుతూ వుండాలి.
నేలవేము కషాయాన్ని కనీసం 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఉపయోగించి వరిలో కాండం తొలుచు పురుగు (తెల్ల కంకి)ను నివారించవచ్చు.
తీసుకోవలసిన జాగ్రత్తలు:
కషాయం తయారు చేసేటప్పుడు ముక్కుకి గుడ్డ కట్టుకోవాలి.
పంట దశ, పురుగు ఉధృతిని బట్టి ఈ కషాయాన్ని 2-3 సార్లు ఉపయోగించవచ్చు.
సాధారణ నామం : బ్లూ పీ / బటర్‌ఫ్లైపీ శాస్త్రీయ నామం : క్లిటోరియా టెర్నేటియా కుటుంబం: ఫాబేసి
శంఖుపుష్పం ఒక బహువార్షిక హెర్బల్ మొక్క. ఆకులు అండాకారంలో ఉంటాయి. ఇది ఒక తీగ లేదా క్రీపర్‌లా పెరుగుతుంది. ఈ మొక్కలో కొట్ట వచ్చినట్లు కనిపించేవి వాటి ముదురు నీలం రంగు పూలు. అవి 4 సెం.మీ. పొడవు, 3 సెం.మీ. వెడల్పు కలిగి ఉంటాయి. కొన్ని రకాలు తెలుపు రంగు పూలు పూస్తాయి. కాయలు 5-7 సెం.మీ. పొడవుండి, ప్రతి కాయలో 6 నుండి 10 గింజలుంటాయి. లేత కాయలను తింటారు. దీనిని అలంకరణ మొక్కగా పెంచుతారు. దీని వేర్లు రైజోబియంతో కలిసి జీవిస్తూ పరస్పర సహకారమందించుకుంటాయి.
ఉపయోగాలు : ఔషధరంగంలో …
వాపు, నొప్పిని తగ్గిస్తుంది.
రక్తం పడే మొల్లల చికిత్సలో ఉపయోగిస్తారు. మొల్లలను ఆకుల కషాయంతో శుభ్రపరుస్తారు. మొత్తం మొక్క పేస్టుని మొల్లలపై పూస్తారు.
తలనొప్పి నివారణకు ఆకు రసాన్ని ముక్కులో చుక్కలుగా వేస్తారు.
రుమాటాయిడ్ ఆర్థ్రెåటిస్ చికిత్సలో థామాసాతో మరగించిన నూనెతో మర్ధన చేస్తారు.
నోటిలోపల వాపుకు ఆకు కషాయంతో పుక్కిలిస్తారు. గాయాలను శుభ్రపరచడానికి కూడా ఈ కషాయాన్ని ఉపయోగిస్తారు. చీము ఏర్పడకుండా నివారిస్తుంది.
వ్యవసాయరంగంలో
శంఖుపుష్పం ద్రావణం నుండి తయారు చేసిన మేళనం కీటకనాశక చర్య మరియు / లేదా వికర్షక చర్య మరియు / లేదా పురుగు గుడ్లు పెట్టకుండా నిరోధించడం మరియు / లేదా గుడ్లు పెట్టే స్థానంపై ప్రభావం చూపడం మరియు / లేదా పురుగు మొక్కపై తినకుండా అవరోధించడం వంటి చర్యల ద్వారా పురుగులనరికడుతుంది.
ఈ మేళనం కీటకనాశక చర్య ద్వారా వ్యవసాయ పంటలనాశించే పెద్ద పురుగులు, లార్వాలను లేదా రసంపీల్చే పురుగులను నివారిస్తుంది. దీనిని ప్రత్తి పంటనాశించే హెలికోవర్మా ఆర్మిజరాపై ఉపయోగించి ప్రయోగాలు చేశారు. (రాబర్ట్ మెన్సా, 2012).
శంఖు పుష్పం గింజల ద్రావణం రైజోక్టోనియా సొలాని పై బలమైన శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది.
ద్రావణంలోని ప్రోటీన్ ఫినోటిన్ చిక్కుడునాశించే ఆంత్రాక్నోస్ ఆకుమచ్చ తెగులు శిలీంద్రం, కొల్లెటోట్రైకం లిండముథియానం మరియు బాక్టీరియల్ బ్లెåట్‌కారకం క్ౙాంతో మోనాస్ ఆక్సొనోపొడిస్ ఫేసియోలి; వరి నాశించే బైపొలారిస్ ఒరైజే, పైరిక్యులేరియా గ్రిసియా, బ్రాకియేరియా స్పీ, నాశించే రైజోక్టోనియా సొలానిలపై శిలీంద్రనాశక, బాక్టీరియానాశక చర్యను ప్రదర్శించింది. ఈ ప్రోటీన్ జాబ్రోటెస్ సబ్‌ఫాసియేటస్ మరియు అకాంతోసీలిడియస్ ఒబెక్టస్ బ్రూచిడ్ల మొదటి దశ లార్వాలపై అధిక విష ప్రభావాన్ని ప్రదర్శించింది (కెలెము, అతని అనుచరులు, 2004).
శంఖుపుష్పం ఆకు ద్రావణాలు మలేరియా, ఫైలేరియా జ్వరం, ఎన్సెఫెలైటిస్, డెంగ్యూ, చికెన్‌గున్యా వ్యాప్తి చేసే వాహకాలు ఈడెస్ ఈజిప్టి, అనోఫెలెస్ స్టెఫెన్స్, క్యూలెక్స్ క్వింక్విఫాసియేటస్ పెద్ద పురుగుల విడుదలను అరికట్టింది (అరివోలి, అతని అనుచరులు, 2015).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.