సాధారణ నామం: వైట్జ్యూట్ శాస్త్రీయ నామం : కార్కోరస్ కాప్సులారిస్ కుటుంబం: మాల్వేసి
నరువల్లి మొక్కలు పొడవుగా పెరిగే వార్షిక మొక్కలు. ఇవి 2-3 మీ. ఎత్తు పెరుగుతాయి. ఈ మొక్కలు కొమ్మలు లేకుండా లేదా కొన్ని ప్రక్క కొమ్మలు కలిగి ఉంటాయి. ఆకులు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడతాయి. ఇవి సాధారణంగా, బల్లెం ఆకారంలో ఉండి 5-15 సెం.మీ. పొడవుంటాయి. ఆకుల అంచులు సన్నని నొక్కులు కలిగి ఉంటాయి. పూలు చిన్నవిగా 2-3 సెం.మీ. వ్యాసం కలిగి పసుపు రంగులో ఉంటాయి. కాయ అనేక విత్తనాలు కలిగి ఉంటుంది.
ఉపయోగాలు : ఔషధరంగంలో …
ఈ ఆకుపచ్చ ఆకుకూరలో మంచి కంటి చూపుకవసరమైన బీటాకెరోటిన్, ఆరోగ్యవంతమైన ఎర్రరక్తణాలు, దృఢమైన ఎముకలు, పళ్ళకవసరమైన కాల్షియం, నున్నని, పరిశుభ్రమైన చర్మం, బలమైన రోగ నిరోధక శక్తి, త్వరగా గాయం నయమవడానికి అవసరమైన విటమిన్ సి అధికంగా ఉన్నాయి.
జ్యూట్ ఆకులలో విటమిన్ ఎ, సి, ఇ ఉంటాయి. జ్యూట్ ఆకు కూరలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి హృద్రోగాలు, క్యాన్సర్, మధుమేహం, అధిక రక్తపోటు వంటి క్రానిక్ వ్యాధుల నుండి రక్షిస్తాయి.
ఆయుర్వేదంలో జ్యూట్ ఆకులను నొప్పులు, మొలలు, ట్యూమర్స్ చికిత్సకు ఉపయోగిస్తారు. ఆకులను జ్వరం, గనోరియా చికిత్సలో కూడా ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో
జ్యూట్ గింజల ద్రావణం నుండి వేరు చేసిన భాగాలు, మిశ్రమాలు వ్యాధికారక బాక్టీరియా విబ్రియో కలరా, సాల్మొనెల్లా స్పీసీస్, షిగెల్లా స్పీ., ఎస్కెరిచియా కోలి మరియు నిల్వ ధాన్యంలో ఆశించే పురుగు ట్రైబోలియం కాస్టానియంపై యాంటిమైక్రోబియల్ మరియు కీటక నాశక చర్యలను ప్రదర్శించింది. క్రూడ్ మిథనాల్ ద్రావణం బాక్టీరియాపై అధిక యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది. పెట్రోలియం ఈథర్ అత్యధిక కీటకనాశక చర్యను ప్రదర్శించింది (రహ్మాన్, అతని అనుచరులు, 2015).
జ్యూట్ ఆకు ద్రావణాలు బంగాళ దుంప మెత్తని కుళ్ళు కలిగించే బాక్టీరియం, ఎర్వినియా కరటవొర సబ్స్పీ, కరటవొర (ఇసిసి) పి138 పెరుగుదలను ప్రయోగశాలలో మరియు నిల్వగదులలో జరిపిన ప్రయోగాలలో సమర్ధవంతంగా అరికట్టాయి (రహ్మాన్, అతని అనుచరులు, 2012).
జ్యూట్ మొక్క పురుగు మందు లక్షణాలను కలిగిఉంది. కాండం పొడి లేదా కాండం ద్రావణాన్ని భూమికి కలిపినా లేదా పంటపై పిచికారి చేసినా గోధుమలో గోధుమ రంగు తుప్పుతెగులుని నివారిస్తుంది. వరి, గోధుమ, ఇతర పంటలలో పురుగులను వికర్షిస్తుంది (ఘోష్, 2000)
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు మానవులు, పశువులు మరియు పర్యావరణ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటీవల నేపాల్‌లో సంభవించిన తీవ్ర వరదలు మరియు హిమాలయ ప్రాంతంలో చోటుచేసుకున్న ప్రకృతి విపత్తులు ప్రపంచాన్ని మరోసారి వాతావరణ మార్పుల ప్రభావాలపై ఆలోచించేలా చేశాయి. ఈ మార్పుల్లో ఎల్ నినో–సదరన్ ఆసిలేషన్ (El Niño–Southern Oscillation – ENSO) ఒక ముఖ్యమైన వాతావరణ ప్రక్రియ. ఎల్ నినో సమయంలో ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాల ఉష్ణోగ్రత పెరగడం వల్ల ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రత, వర్షపాతం మరియు తేమలో మార్పులు సంభవిస్తాయి.
2027 వరకు ఎల్ నినో (అధిక ఉష్ణోగ్రతల) ప్రభావం తగ్గే అవకాశం లేదని భారత వాతావరణ శాస్త్ర విభాగం (India Meteorological Department – IMD) హెచ్చరిస్తోంది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మారుతున్న వర్షపాతం, కరువులు, వరదలు వంటి వాతావరణ మార్పులు మానవ–పశు ఆరోగ్యం, పశుపోషణ, వ్యవసాయం, ఆహార–నీటి భద్రత మరియు పర్యావరణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అదేవిధంగా, పరాన్నజీవులు, వాటి మధ్యస్థ అతిథులు, వాహకాలు మరియు అతిథి జంతువుల పరస్పర సంబంధాలను ప్రభావితం చేసి, పరాన్నజీవుల అభివృద్ధి, జీవన సామర్థ్యం మరియు వ్యాప్తిని మార్చగలవు. అనేక పరాన్నజీవుల గుడ్లు, లార్వాలు మరియు ఇతర అభివృద్ధి దశలు పర్యావరణ ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటాయి. అనుకూలమైన ఉష్ణోగ్రత ఉన్నప్పుడు గుడ్ల నుంచి లార్వాల అభివృద్ధి వేగవంతమవుతుంది. కొన్ని పరాన్నజీవుల జీవచక్రం త్వరగా పూర్తవుతుంది మరియు కొన్ని వాహకాల సంఖ్య కూడా పెరగవచ్చు. అయితే, అత్యధిక ఉష్ణోగ్రతలు మరియు తీవ్రమైన ఎండలు కొన్ని పరాన్నజీవుల గుడ్లు మరియు స్వేచ్ఛా జీవన దశల జీవన సామర్థ్యాన్ని తగ్గించవచ్చు.
గొర్రెలు మరియు మేకల్లో కనిపించే ముఖ్యమైన జీర్ణాశయ నెమటోడ్ పరాన్నజీవి Haemonchus contortus. దీనిని సాధారణంగా Barber’s pole worm అని పిలుస్తారు. ఇది రక్తాన్ని పీల్చడం ద్వారా తీవ్రమైన రక్తహీనత, బలహీనత మరియు కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా కారణమవుతుంది.
ఈ పరాన్నజీవి గుడ్డు నుంచి సంక్రమణకు కారణమయ్యే మూడవ దశ లార్వా (L3) వరకు అభివృద్ధి చెందడానికి ఉష్ణోగ్రత మరియు తేమ వంటి పర్యావరణ పరిస్థితులు అవసరం. తగిన వర్షపాతం, నేల తేమ మరియు మితమైన ఉష్ణోగ్రత ఉన్నప్పుడు గుడ్లు వేగంగా అభివృద్ధి చెంది L3 లార్వాలుగా మారి పచ్చికపైకి చేరతాయి. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఎల్ నినో సమయంలో తక్కువ వర్షపాతం, పొడి పరిస్థితుల కారణంగా లార్వాల అభివృద్ధి తగ్గవచ్చు. అయితే ఎల్ నినో తర్వాత తేమ మరియు వర్షపాతం పెరిగే పరిస్థితులు ఏర్పడితే సంక్రమణ పరిస్థితులు మళ్లీ మారవచ్చు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, పచ్చికపై కొత్తగా లార్వాల అభివృద్ధి తగ్గినప్పటికీ, ఇప్పటికే జంతువుల్లో ఉన్న పరాన్నజీవి భారం కొనసాగవచ్చు. అంతేకాకుండా కరువు వల్ల మేత కొరత ఏర్పడి జంతువుల పోషక స్థితి మరియు రోగనిరోధక శక్తి తగ్గితే వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంది.
ఎల్ నినో (అధిక ఉష్ణోగ్రతల) ప్రభావం తగ్గగానే వచ్చే అధిక వర్షపాతం మరియు వరదల సమయంలో పశువుల మలం నీటి వనరుల్లోకి చేరడం వల్ల Cryptosporidium, Giardia, Entamoeba వంటి నీటి ద్వారా వ్యాపించే పరాన్నజీవుల సంక్రమణ ప్రమాదం పెరగవచ్చు. కరువు సమయంలో సురక్షితమైన నీటి వనరులు తగ్గిపోవడం వల్ల మానవులు మరియు పశువులు పరిమితమైన లేదా కలుషితమైన నీటి వనరులను ఉపయోగించే పరిస్థితి ఏర్పడవచ్చు.
మరో వైపు ఉష్ణోగ్రత, వర్షపాతం మరియు తేమలో మార్పులు దోమలు, ఈగలు, గోమార్లు మరియు పేలు వంటి వాహకాల సంఖ్య, అభివృద్ధి మరియు కాలానుగుణ కార్యకలాపాలను ప్రభావితం చేయవచ్చు. ఫలితంగా మలేరియా, ట్రీపానాసోమా, థిలేరియా, బెబేసియా, లీష్మానియాసిస్ మరియు ఫైలేరియాసిస్ వంటి పరాన్నజీవి వ్యాధుల వ్యాప్తి విధానాల్లో మార్పులు సంభవించవచ్చు.
పరాన్నజీవి వ్యాధులను ఎలా ఎదుర్కోవాలి?
మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో పరాన్నజీవి నియంత్రణలో ముందస్తు ప్రణాళిక చాలా అవసరం.
1.వాతావరణ ఆధారిత పర్యవేక్షణ: ఉష్ణోగ్రత, వర్షపాతం మరియు తేమ సమాచారాన్ని పరాన్నజీవి వ్యాధుల పర్యవేక్షణతో అనుసంధానం చేయాలి. 2. లక్ష్యిత నులిపురుగు నివారణ: అవసరం లేని blanket deworming కు బదులుగా, మల పరీక్ష, వ్యాధి లక్షణాలు మరియు స్థానిక వ్యాధి పరిస్థితుల ఆధారంగా చికిత్స చేయాలి. 3. FAMACHA విధానం: Haemonchus contortus ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కంటి పొర ఆధారంగా రక్తహీనత ఉన్న జంతువులను గుర్తించి, అవసరమైన వాటికి మాత్రమే చికిత్స చేయడం ప్రయోజనకరం. 4. పోషకాహార నిర్వహణ: కరువు మరియు మేత కొరత సమయంలో తగిన ప్రోటీన్ మరియు శక్తి (ఎనర్జీ) పోషక పదార్థాలు అందించడం ద్వారా జంతువుల ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని మెరుగుపరచాలి. 5. సురక్షితమైన నీరు: మానవులు మరియు పశువులకు శుభ్రమైన, సురక్షితమైన తాగునీటిని అందించాలి. 6. వాహకాల పర్యవేక్షణ: వాటి ఋతువుల ఆధారిత కార్యకలాపాలు క్రమం తప్పకుండా పర్యవేక్షించి అవసరమైన నియంత్రణ చర్యలు చేపట్టాలి. పర్యావరణ పరిశుభ్రత, నిల్వ నీటి తొలగింపు, పురుగుమందుల వినియోగం మరియు వాహక నియంత్రణ చర్యలను సమర్థంగా అమలు చేయాలి. 7. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు: El Niño వాతావరణ హెచ్చరికలను పశువుల వ్యాధుల నిఘా మరియు పర్యవేక్షణతో అనుసంధానం చేయాలి.
ఎల్ నినో (El Niño) అనేది ప్రపంచ వాతావరణాన్ని శాసించే ఒక శక్తివంతమైన క్లైమేట్ డ్రైవర్. ఇది కేవలం పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల మార్పులకే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా పరాన్నజీవి వ్యాధుల (parasitic diseases) వ్యాప్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి కేవలం రోగ నిర్ధారణ, చికిత్స మాత్రమే సరిపోవు. కాబట్టి భవిష్యత్తులో పరాన్నజీవి వ్యాధుల నియంత్రణ రోగ నిర్ధారణ మరియు చికిత్సకే పరిమితం కాకుండా, వాతావరణ అంచనా, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, లక్ష్యిత నులిపురుగు నివారణ, FAMACHA విధానం, పరమాణు స్థాయి పర్యవేక్షణ మరియు వన్ హెల్త్ (మానవ–పశు–పర్యావరణ ఆరోగ్య సమగ్ర విధానం) విధానాలను సమన్వయం చేయాలి.
“వాతావరణాన్ని అర్థం చేసుకుంటే పరాన్నజీవి వ్యాధుల ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేయవచ్చు; ముందస్తు అంచనా ఉంటే సమర్థవంతమైన నియంత్రణ సాధ్యమవుతుంది.”
Dr. వి. జ్ఞానీ చరిత, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు విభాగాధిపతి, Dr. పి వి రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్, పరాన్న జీవశాస్త్ర విభాగం. పశు వైద్య కళాశాల, ప్రొద్దటూరు-516360, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, ఆంధ్ర ప్రదేశ్. Ph: 9100771767
తయారుచేయు విధానం: మరీ కారంగా, మరీ చప్పగా కాకుండా, మోస్తరు కారంగా ఉన్న మిరపకాయలు, సైజు కూడా మధ్యస్థంగా ఉన్నవి ఎంచుకోవాలి.
మిరపకాయలను మధ్యకు సన్నగా చీల్చి, ఒక గిన్నెలో వేసుకోవాలి. వాటి పైన ఉప్పు వేసుకొని కలియ తిప్పి, మిరపకాయలు, మునిగే వరకు మజ్జిగ పోసి కలిపి, పైన ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి.
ఒక రోజు మొత్తం 24 గంటలు నాననిచ్చి, తరువాత ఎండకు ఎండపెట్టాలి. తిరిగి రాత్రికి మళ్ళీ మిగిలి ఉన్న మజ్ౙిగలో నానపెట్టాలి. ఇలా మజ్జిగ అయిపోయే వరకు చెయ్యాలి.
ఒకసారి ఎండ పెట్టి తిరిగి మజ్జిగలో వేసి కలిపేటప్పుడు కొంచెం నిదానంగా మిరపకాయలు విరగకుండా కలపాలి. ఎండకు బాగా ఎండిన తరువాత, గాలి చొరని డబ్బాలో నిలువ చేసుకోవాలి.
ఈ ఎండిన చల్లమిరపకాయలను మధ్య మధ్య ఎండపెడుతూ ఉంటే, చెడిపోకుండా, మెత్త పడకుండా, రెండు సంవత్సరాల వరకు నిలువ ఉంటాయి.
మాములుగా అయితే చల్ల మిరపకాయలు నూనెలో వేయించి, అన్నానికి అంచుకు పెట్టుకొని తింటారు. నూనెలో వేయించకుండా కూడా తినొచ్చు. పుల్ల పుల్లగా, కారం కారంగా బాగుంటాయి.
రచనః అందుకూరి గిరిజ
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
విశిష్టమైన సువాసన, అద్భుతమైన రుచి, అపరిమితమైన పోషక విలువలు కలగలిసిన పండు జామ. తక్కువ ధరకే లభించే ఈ పండును సామాన్యుడి ఆరోగ్యాన్ని కాపాడే “పేదవారి ఆపిల్” గా అభివర్ణిస్తారు. అన్ని వయసుల వారికీ ఎంతో మేలు చేసే సహజ పోషకాహార గని.
జామ పోషకాల సమృద్ధి : జామపండులో విటమిన్లు, ఖనిజాలు, ఆహారపు పీచు, ప్రోటీన్ మరియు శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ‘C’కి ఇది అత్యుత్తమ సహజ వనరు. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
జామపండులోని పీచు జీర్ణక్రియను సులభతరం చేయడంతో పాటు పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులోని పొటాషియం, కాల్షియం, భాస్వరం మరియు ఇతర ఖనిజాలు శరీరంలోని వివిధ జీవక్రియలకు సహకరిస్తాయి.
జామపండులోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన స్వేచ్ఛా రాడికల్స్‌తో పోరాడి కణాల ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి. అందువల్ల, జామపండును క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించవచ్చు.
జామపండును రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు సులభంగా లభిస్తాయి. జామపండు శరీరానికి అవసరమైన అనేక పోషకాల సమాహారం. ఇందులో విటమిన్ ‘C’ అత్యధిక పరిమాణంలో ఉంటుంది; ఇది ఆపిల్ మరియు నారింజ వంటి పండ్ల కంటే కూడా అనేక రెట్లు అధికంగా లభిస్తుంది. అలాగే, ఇందులోని ఆహారపు పీచు (Dietary Fiber) జీర్ణ వ్యవస్థ సరైన రీతిలో పనిచేయడానికి ఒక అత్యుత్తమ ఇంధనంగా తోడ్పడుతుంది. వీటితో పాటు పొటాషియం, కాల్షియం, భాస్వరం మరియు ఇనుము (Iron) వంటి అవసరమైన ఖనిజ లవణాలు జామపండులో సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా, ఇందులోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీర కణాల క్షీణతను అడ్డుకోవడంలో మరియు రక్షణ కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
జామపండుతో లభించే 6 ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు
శక్తివంతమైన సహజ రోగనిరోధక కవచం జామపండులోని విటమిన్ C రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. జామపండు బ్యాక్టీరియా మరియు వైరస్ల దాడి నుంచి శరీరాన్ని సమర్థవంతంగా రక్షిస్తుంది. ఇది జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ ఆరోగ్య సమస్యల తీవ్రతను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. అందువల్ల, పిల్లల సరైన ఎదుగుదలకు మరియు వృద్ధుల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఇది ఒక అద్భుతమైన సహజ రక్షణ కవచంగా తోడ్పడుతుంది.
జీర్ణక్రియ సమర్థవంతం – మలబద్ధకానికి చెక్ అధిక మొత్తంలో ఉండే పీచు పదార్థం పేగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జామపండు పేగుల కదలికలను క్రమబద్ధీకరించి, మలబద్ధకం సమస్యను సమర్థవంతంగా నివారిస్తుంది. ఇది కడుపు ఉబ్బరం, అజీర్తి మరియు గ్యాస్ట్రిక్ వంటి జీర్ణసంబంధిత సమస్యలను తగ్గించడంలో విశేషంగా సహాయపడుతుంది. అంతేకాకుండా, పేగుల్లో ఆరోగ్యానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియా (Probiotics) వృద్ధి చెందడానికి కూడా ఇది ఎంతగానో దోహదపడుతుంది.
మధుమేహ (డయాబెటిస్) నియంత్రణ జామపండు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (Low GI) కలిగిన పండు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నిరోధిస్తుంది. జామపండులోని పీచు పదార్థం వల్ల చక్కెర శరీరంలోకి శోషించబడే వేగం గణనీయంగా తగ్గుతుంది. అందుకే, డయాబెటిస్ (మధుమేహం) ఉన్నవారు తమ పోషకాహార లేదా ఆరోగ్య నిపుణుల సలహాతో దీనిని మితమైన పరిమాణంలో తీసుకోవడం చాలా శ్రేయస్కరం.
గుండె ఆరోగ్యం & కొలెస్ట్రాల్ నియంత్రణ జామపండులో ఉండే పొటాషియం మరియు కరిగే పీచు (Soluble Fiber) గుండెకు కొండంత అండ. జామపండులోని పొటాషియం శరీరంలో సోడియం ప్రభావాన్ని సమతుల్యం చేసి, రక్తపోటును (BP) నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే, ఇందులోని పీచు పదార్థం రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి, రక్తప్రసరణను సులభతరం చేస్తుంది. ఫలితంగా, గుండెపోటు మరియు పక్షవాతం (Stroke) వంటి తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు తగ్గుతాయి.
నిత్య యవ్వన చర్మ సౌందర్యం జామపండులోని యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ C చర్మంలో కొల్లాజెన్ (Collagen) ఉత్పత్తిని పెంచడానికి దోహదపడతాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణాల నష్టాన్ని సమర్థవంతంగా అడ్డుకుని, వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా నిరోధిస్తూ చర్మాన్ని ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడతాయి.
రక్తహీనత (అనీమియా) నివారణకు సహకారం జామపండులోని విటమిన్ C, మనం తీసుకునే ఇతర ఆహారాలలోని ఇనుమును (Iron) శరీరం సరిగ్గా గ్రహించేలా (Absorption) చేస్తుంది. అందువల్ల, ఆకుకూరలు మరియు పప్పు ధాన్యాలతో పాటు జామపండును తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరిగి, అనీమియా (రక్తహీనత) మరియు అలసట వంటి సమస్యలు తగ్గుతాయి.
జామపండును ఉపయోగించాల్సిన సరైన విధానం ప్రకృతి సూచన: స్థానికంగా, చౌకగా లభించే పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడమే సంపూర్ణ ఆరోగ్యానికి తొలిమెట్టు.
రోజుకు ఒక మీడియం సైజ్ జామపండును తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. పిల్లలు, గర్భిణులు, శారీరక శ్రమ చేసేవారు మరియు వృద్ధులు – ఇలా ప్రతి ఒక్కరూ దీనిని నిర్భయంగా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఉదయం లేదా మధ్యాహ్నం స్నాక్ సమయంలో జామపండును తాజాగా కోసి తినడం వల్ల శరీరానికి అందులోని గరిష్ట పోషకాలు లభిస్తాయి.
ముగింపు: జామపండు రుచి, పోషక విలువ మరియు ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఎంతో విలువైన పండు. ఇందులో విటమిన్ C, పీచు, పొటాషియం, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు మరియు ఇతర అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి.
ఇవి రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, మధుమేహ నియంత్రణకు సహకరించడం, గుండె ఆరోగ్యాన్ని కాపాడడం, బరువు నియంత్రణకు సహాయపడడం మరియు రక్త ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
ప్రతిరోజూ సమతుల్య ఆహారంతో పాటు జామపండును మితమైన పరిమాణంలో తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలను పొందవచ్చు.
ప్రత్యేకంగా పిల్లలు, గర్భిణులు, పెద్దలు మరియు వృద్ధులకు ఇది మంచి పోషకాహారంగా ఉపయోగపడుతుంది. స్థానికంగా సులభంగా లభించే ఇలాంటి పోషక పండ్లను తీసుకోవడం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరళమైన మరియు ప్రభావవంతమైన మార్గం.
ఏవో ఖరీదైన పండ్ల వెనుక పడకుండా, మనకు అందుబాటులో ఉండే జామపండును క్రమం తప్పకుండా తింటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుదాం.
బి. చంద్ర శేఖర్, నేల (మృత్తికా) శాస్త్ర అధ్యాపకులు, పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం (SKLTGHU), M. No. 8374278258
పంటపొలాల చుట్టూ ప్రకృతిలో దొరికే వివిధ రకాల ఆకులను ఉడకపెట్టడం ద్వారా కషాయాలు, ద్రావణాలను తయారు చేస్తారు. ఇది మన సంప్రదాయ వ్యవసాయంలో భాగం. ఆకులను ఉడకపెట్టడం వలన అందులో ఉండే మూల పదార్థాలు పూర్తి స్థాయిలో ద్రావణంలో చేరి కషాయం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. పంటల సస్యరక్షణలో ఈ కషాయాలు అనాదిగా రైతులకు తెలిసినవే. ఇందులో ముఖ్యంగా పశువుల పేడ, మూత్రం ద్రావణం ఒకటి.
పశువుల పేడ, మూత్రం ద్రావణం మొక్కలకు తక్షణ శక్తిని ఇస్తుంది. కాబట్టి వర్షాభావ పరిస్థితులలో తెగుళ్లు/పురుగుల సమస్య నుంచి తేరుకుంటున్నప్పుడు దీనిని వాడుకోవచ్చు. పశువుల పేడ, పశువుల మూత్రంలో చాలా రకాల పంటలకు ఉపయోగపడే సూక్ష్మజీవులు ఉన్నాయి. ఇవి పంటకు హానిచేసే తెగుళ్ళను నివారించడంలో ఉపయోగ పడతాయి.
ఈ ద్రావణంలో ఉన్న పోషకాల (నత్రజని, భాస్వరం, పొటాష్ మరియు సూక్ష్మ పోషకాలు) వల్ల పంటలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. ఈ ద్రావణాన్ని పంటకాలంలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు: పశువుల పేడ : 5 కిలోలు; పశువుల మూత్రం : 5 లీటర్లు; సున్నం : 150 గ్రా॥
తయారు చేసే విధానం:
5 కిలోల పశువుల పేడ, 5 లీటర్ల మూత్రం తీసుకుని, 5 లీటర్ల నీటిని కలిపి ఒక తొట్టిలో నిలువ చేయాలి.
తొట్టిపై మూత పెట్టి, 4 రోజులపాటు ఆ మిశ్రమాన్ని మురగబెట్టాలి.
పై మిశ్రమాన్ని ప్రతిరోజు కర్రతో, సవ్య మరియు అపసవ్య దిశలలో బాగా కలియపెట్టాలి.
ఈ మిశ్రమానికి 4 రోజుల తర్వాత కొద్దిగా నీరు చేర్చి, వడపోసి, 150 గ్రాముల సున్నం కలపాలి.
ఈ ద్రావణానికి 100 లీటర్ల నీటిని కలిపి ఒక ఎకరం పొలంలో ఒకసారి పిచికారీ చేయాలి.
జాగ్రత్తలు:
పశువుల పేడ, మూత్రం ద్రావణం చిక్కగా ఉంటుంది. అందువల్ల వడపోయటానికి ముందు ఒక మెష్నిగానీ, పలుచటి గోనెసంచిని గానీ ఉపయోగించాలి.
తర్వాత దానికి నీరు కలిపి పలుచటిగుడ్డతో వడపోసుకోవాలి.
తయారు చేసిన ద్రావణాన్ని వెంటనే ఉపయోగించుకోవాలి.
ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే ద్రావణం చెడిపోయే అవకాశం ఉంది. పంటలలో తెగుళ్ళ సమస్య వుంటే పశువుల పేడ, మూత్రం ద్రావణానికి ఇంగువ కలిపి పిచికారీ చేసుకోవాలి.
ఉపయోగాలు:
ఈ ద్రావణాన్ని పిచికారీ చేస్తే దాని ఘాటైన వాసనకు రెక్కల పురుగులు పంటపై గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు.
ఈ ద్రావణాన్ని పంటలలో పిచికారీ చేయటం వల్ల పంటలు బెట్టను సుమారు వారం రోజులవరకూ తట్టుకుంటాయి.
ఈ ద్రావణం పంటలలో వ్యాధినిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది. ఈ ద్రావణాన్ని బాగా వడపోసి “డ్రిప్” లేదా “స్ప్రింక్లర” పద్దతి ద్వారా పంటలకు అందజేయవచ్చు.
పశువుల పేడ, మూత్రం ద్రావణాన్ని కూరగాయ పంటలలోనూ, ఇండ్ల వద్ద పెంచే ఆకుకూరలపైనా ఉపయోగించి మంచి ఫలితాలు పొందవచ్చు. పశువుల పేడ, మూత్రం, ఇంగువ ద్రావణం వరి పైరులో వచ్చే అగ్గి తెగులును సమర్ధవంతంగా నివారిస్తుంది. 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పంటపై పిచికారీ చేయాలి
పంటల వైవిధ్యీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో ఈ ఖరీఫ్‌లో పప్పుధాన్యాల సాగు గత ఖరీఫ్‌తో పోలిస్తే 36 శాతం పెరిగి, దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణ నిలిచిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జాతీయ రబీ సదస్సులో తెలంగాణ వ్యవసాయ రంగంలో సాధిస్తున్న ప్రగతిని వివరించడంతో పాటు, రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ దృష్టికి తీసుకెళ్లారు.
ఎల్‌నినో ప్రభావం, వర్షపాతంలో మార్పులు, దీర్ఘకాలిక పొడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే పప్పుధాన్యాల సాగు గణనీయంగా పెరిగి, గత ఏడాదితో పోలిస్తే 36 శాతం వృద్ధితో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు.
కూరగాయల సాగు లక్ష్యాన్ని లక్ష ఎకరాలకు పెంచి, అవసరమైన ఆర్థిక సహాయం అందించాలి: తెలంగాణలో కూరగాయల సాగుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న 8,800 ఎకరాల లక్ష్యాన్ని లక్ష ఎకరాలకు పెంచేందుకు కేంద్రం అనుమతితో పాటు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కోరారు. పెరుగుతున్న కూరగాయల డిమాండ్‌ను తీర్చడంతో పాటు పంటల వైవిధ్యీకరణకు ఇది దోహదపడుతుందని తెలిపారు.
ఎల్‌నినో, కరువు పరిస్థితులకు ప్రత్యేక కేంద్ర సహాయం ఇవ్వాలి… ఎల్‌నినో పరిస్థితులు, మారుతున్న వర్షపాత సరళి, దీర్ఘకాలిక పొడి పరిస్థితుల కారణంగా తెలంగాణలోని అనేక మండలాలు లోటు, తీవ్ర లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటున్నాయని మంత్రి తెలిపారు. ఆయా మండలాలకు సూక్ష్మ సాగునీరు, రక్షిత సాగునీరు, నీటి సంరక్షణ నిర్మాణాల కోసం ప్రత్యేక కేంద్ర సహాయం అందించాలని కోరారు.
అదేవిధంగా ఎల్‌నినో, కరువు పరిస్థితులను ఎదుర్కొనే ప్రత్యేక చర్యగా మొక్కజొన్న, జొన్నను ధరల మద్దతు పథకం (ఆఐఐ) పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా నీటి ఒత్తిడిని తట్టుకునే జొన్న కరువు ప్రభావిత ప్రాంతాలకు అనుకూలమైన పంట కావడంతో కనీసం జొన్ననైనా పీఎస్ ఎస్ లో చేర్చాలని కోరారు.
ఆయిల్‌పామ్ రైతులకు స్థిరమైన ధరలు కల్పించాలి… కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ తెలంగాణలో అదనంగా దాదాపు 1.10 లక్షల హెక్టార్లలో ఆయి…పామ్ సాగు విస్తరించిందని, సుమారు 72 వేల మంది కొత్త రైతులు ఆయిల్‌పామ్ సాగులోకి వచ్చారని మంత్రి తెలిపారు. ఆయిల్‌పామ్ దీర్ఘకాలిక పంట కావడంతో రైతులు సులభంగా మరో పంటకు మారే అవకాశం ఉండదని, అందువల్ల రైతులకు స్థిరమైన, గిట్టుబాటు ధరలు కల్పించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఆయిల్‌పామ్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని గతంలో ఉన్న 44 శాతానికి పునరుద్ధరించాలని మంత్రి తుమ్మల కేంద్రాన్ని కోరారు. దేశీయంగా ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్న సమయంలో దిగుమతి విధానాలు కూడా దేశీయ రైతులకు అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీనిపై స్పందించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, ఆయిల్‌పామ్ ధరలపై ప్రత్యేక కమిటీని నియమించి రైతుల సమస్యలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి తుమ్మల తెలిపారు.
రైతులకు రియల్‌టైమ్ నేల ఆరోగ్య సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలి…. సాంప్రదాయ మట్టి పరీక్షల ద్వారా ప్రతి రైతుకు సకాలంలో నేల ఆరోగ్య సమాచారం అందించడం సాధ్యం కావడం లేదని మంత్రి తెలిపారు. రైతులకు రియల్‌టైమ్‌లో నేల ఆరోగ్య వివరాలను అందించేందుకు శాటిలైట్ ఆధారిత సాయిల్ హెల్త్ టెక్నాలజీని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల సబ్సిడీ విధానాన్ని కూడా ఎప్పటికప్పుడు సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణకు అదనంగా 16 కృషి విజ్ఞాన కేంద్రాలు మంజూరు చేయాలి.. తెలంగాణలో 33 జిల్లాలు ఉండగా ప్రస్తుతం 16 కృషి విజ్ఞాన కేంద్రాలు మాత్రమే ఉన్నాయని మంత్రి తెలిపారు. వ్యవసాయ విద్య, పరిశోధన ద్వారా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం వేగంగా రైతులకు చేరేందుకు వ్యవసాయ విస్తరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణకు అదనంగా 16 కృషి విజ్ఞాన కేంద్రాలను ఐసీఏఆర్ ద్వారా మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు.
కొడంగల్ అగ్రి బిజినెస్ పార్క్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు కేంద్ర సహకారం అందించండి… కొడంగల్‌లో అగ్రి బిజినెస్ పార్క్, సెమీ-అరిడ్ హార్టికల్చర్ క్రాప్స్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌లకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని మంత్రి కోరారు. తెలంగాణలోని ప్రత్యేక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సెమీ-అరిడ్ హార్టికల్చర్ కు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
రైతు ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త సీడ్ బిల్ తీసుకురావాలి… తెలంగాణలో విత్తన రంగానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని రైతు ప్రయోజనాలను కాపాడేలా కొత్త సీడ్ బిల్లును త్వరగా తీసుకురావాలని మంత్రి కోరారు. పంట నష్టాల సందర్భంలో రైతులకు పరిహారం అందించే తగిన నిబంధనలతో పాటు, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినమైన చర్యలు తీసుకునేలా బిల్లులో నిబంధనలు ఉండాలని విజ్ఞప్తి చేశారు. పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తిని పెంచే జాతీయ కార్యక్రమాల నేపథ్యంలో రైతు ప్రయోజనాలకు అనుగుణమైన విత్తన చట్టం అవసరమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఈ కీలక ప్రతిపాదనలు రాష్ట్రంలో వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయాన్ని బలోపేతం చేయడంతో పాటు, పంటల వైవిధ్యీకరణ, వ్యవసాయ విస్తరణ సేవలు, రైతుల ఆదాయ భద్రతను మరింత బలోపేతం చేస్తాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర అవసరాలను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి అవసరమైన సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
‘రైతునేస్తం’ సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త స్వర్గీయ ‘పద్మశ్రీ’ డా॥ ఐ.వి. సుబ్బారావు పేరిట వ్యవసాయ, అనుబంధ రంగాలలో విశేష సేవలందిస్తున్న శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, విస్తరణ అధికారులతోపాటు అగ్రి ఇన్నోవేషన్స్‌ను ప్రతి ఏటా ‘రైతునేస్తం పురస్కారం’ పేరుతో సత్కరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం కూడా ఈ వేడుకను త్వరలో ఘనంగా నిర్వహించనున్నాము.
పురస్కారాలకు దరఖాస్తు చేసుకునే వ్యవసాయ, అనుబంధ రంగాల శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు, అగ్రి ఇన్నోవేషన్స్, రైతులు ‘రైతునేస్తం’ వెబ్సైట్https://rythunestham.in/awardsనుండి అప్లికేషన్ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని, దాన్ని పూరించి, దానికి వారి పరిశోధనా వ్యాసాలను, సాగు అనుభవాలను జతపరచి అక్టోబర్ 31వ తేదీలోగా ‘ఎడిటర్, రైతునేస్తం, 6-2-959, దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్, ఖైరతాబాద్, హైదరాబాద్ – 500004. ఫోన్: 9676 79 77 77 (లేదా) ‘రైతునేస్తం’, డో.నెం. 8-198, పుల్లడిగుంట దగ్గర, కొర్నెపాడు పోస్టు, వట్టిచెరుకూరు మం॥, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ – 522 017, ఫోన్: 97053 83666 చిరునామాలకు పంపగలరు లేదా editor@rythunestham.inకు ఇ-మెయిల్ చేయవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే. ఈ వేడుక త్వరలో ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించబడుతుంది.
పాషాణభేది మెత్తని కాండం కలిగి వాము ఆకును పోలి వుండే ఏక లేదా ద్వివార్షిక మొక్క. దీని ఆకుల నుండి ఎలాంటి వాసన రాదు. సుమారు 0.5-1.0 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. బాగా శాఖలు తొడిగి చిన్నపాటి పొదలా తయారవుతుంది. ప్రతికణుపు దగ్గర రెండు చొప్పున ఆకులు వస్తాయి. ఈ ఆకుల మొదళ్ళ నుండి మళ్ళీ ఆకులు పుడతాయి. అంచులు దంతాలు కలిగి ఉంటాయి. ఆకులు, కొమ్మలు నూగు కలిగి ఉంటాయి. దీనిని లేత కొమ్మల కత్తిరింపుల ద్వారా వ్యాప్తి చేస్తారు. వేర్లు క్యారట్ దుంపలలాగా ఉండి ప్రతి మొక్కకు 4-5 దుంపలు ఉంటాయి.
సాధారణ నామం : కోలియస్ / మెడిసినల్ కోలియస్ శాస్త్రీయ నామం : కోలియస్ ఫోర్‌స్కాహ్లీ కుటుంబం: లామినేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
కోలియస్ దుంపలను అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తున్నారు. దుంపల నుండి ఫోర్స్కోలిన్ అనబడు డైటెర్పనాయిడ్ (కోలియోనాల్) లభిస్తుంది.
పాషాణ భేది హృద్రోగాలు, ఊబకాయం, బ్రాంకైటిస్, ఉబ్బసం, నరాల బలహీనత, రక్తక్షీణత మొదలగు వ్యాధుల చికిత్సకు మరియు బలవర్థకమైన ఔషధంగా ఉపయోగపడుతుంది.
క్యాన్సర్ చికిత్సలో కూడా ఉపయోగించబడుతున్నది.
వ్యవసాయరంగంలో
పాషాణ భేది నుండి వేరు చేసిన ఫోర్స్కోలిన్ ద్రావణం నిమ్మ ఆకులను తినే పాపిలియో డెమోలియస్ 4వ దశ లార్వాలపై గణనీయమైన యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది (శ్రీనివాసరావు, అతని అనుచరులు, 2014).
పాషాణభేది వేర్ల నుండి వేరు చేసిన డైటెర్పిన్, ఫోర్స్కోలిన్ పాపిలియో డెమోలియస్ నివారణకు సురక్షితమైన యాంటిఫెర్టిలిటి కారకం (శ్రీనివాసరావు అండ్ సబిత, 2017).
పాషాణభేది వేర్ల ఇథనాల్ ద్రావణం కాండం, ఆకుల ఇథనాల్ ద్రావణం కన్నా క్లెబ్సియెల్లా న్యుమోనియే పై అత్యధిక యాంటిబ్యాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది (రాజ్‌కుమార్ అండ్ మాలతి, 2015).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
“పశువుకు వ్యాధి ఎలా వచ్చింది?” అనే ప్రశ్నతో పాటు… “అది మన ఫారంలోకి ఎలా వచ్చింది?” అని కూడా ఆలోచించాలి.
పాడి ఫారంలో ఒక పశువుకు వ్యాధి వస్తే, అది ఆ ఒక్క పశువుతోనే ఆగిపోతుందని చెప్పలేం. కొత్తగా తెచ్చిన పశువులు, బయట నుంచి వచ్చే వ్యక్తులు, వాహనాలు, అపరిశుభ్రమైన పాక, మేత, నీరు, పరికరాలు ఇలా అనేక మార్గాల్లో వ్యాధులు ఫారంలోకి రావచ్చు. ఒక పశువు నుంచి మరో పశువుకు కూడా వ్యాపించవచ్చు. అందుకే పశువులకు చికిత్స చేయించడమే కాకుండా, వ్యాధులు ఫారంలోకి రాకుండా, వచ్చినా ఇతర పశువులకు వ్యాపించకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. దీనికి పెద్ద పెద్ద ఏర్పాట్లు అవసరం లేదు. రోజూ మనం చేసే పనుల్లో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు. మరి మీ పాడి ఫారంలో అలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారా? ఈ 10 అంశాలతో మీరే తెలుసుకోండి.
కొత్తగా తెచ్చిన పశువులను వెంటనే మందలో కలుపుతున్నారా? కొత్తగా తెచ్చిన పశువు చూడటానికి ఆరోగ్యంగా కనిపించినా, దానితో పాటు వ్యాధులు కూడా ఫారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వెంటనే మందలో కలపకుండా కనీసం 3 వారాల పాటు వేరుగా ఉంచి ఆరోగ్యాన్ని గమనించడం మంచిది. ఈ సమయంలో పశువులో ఏదైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే పశువైద్యుని సంప్రదించాలి. అంతా సరిగా ఉందని నిర్ధారించుకున్న తర్వాతే మందలో కలపడం మంచిది.
అనారోగ్య పశువులను వేరుగా ఉంచే ఏర్పాటు ఉందా? మందలో ఏదైనా పశువు అనారోగ్యానికి గురైతే, వీలైనంత వరకు మందకు కొంత దూరంగా, ఇతర పశువులతో కలవకుండా ఉంచడం మంచిది. అనారోగ్య పశువుకు మేత, నీరు పెట్టేందుకు వాడే తొట్లు, బకెట్లు కూడా ఇతర పశువులకు వాడకుండా చూడాలి. ముందుగా ఆరోగ్యంగా ఉన్న పశువుల పనులు చూసుకొని, చివరగా అనారోగ్య పశువు దగ్గరకు వెళ్లాలి. ఆ తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ, పశువైద్యుని సలహాతో చికిత్స చేయిస్తే మిగతా పశువులకు వ్యాధి వ్యాపించే అవకాశాన్ని తగ్గించవచ్చు.
మీ పాడి ఫారంలోకి వచ్చే వ్యక్తులు, వాహనాల రాకపోకలను గమనిస్తున్నారా? పాడి ఫారానికి వివిధ పనుల కోసం బయట వ్యక్తులు, ఇతర రైతులు, వాహనాలు వచ్చి వెళ్తుంటాయి. వీటి ద్వారా ఒక ఫారం నుంచి మరో ఫారానికి మట్టి, పేడతో పాటు వ్యాధులు కూడా చేరే అవకాశం ఉంటుంది. అందుకే బయట నుంచి వచ్చే వ్యక్తులు పశువుల దగ్గరకు నేరుగా వెళ్లకుండా చూసుకోవాలి. వాహనాలను కూడా వీలైనంత వరకు పశువుల పాకకు దూరంగా ఉంచాలి. ముఖ్యంగా ఇతర పశువుల ఫారాలకు వెళ్లి వచ్చిన వ్యక్తులు, వాహనాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
పశువుల పాకలోకి వెళ్లే ముందు చేతులు, కాళ్లు శుభ్రం చేసుకుంటున్నారా? మన చేతులు, కాళ్లు, చెప్పులకు అంటుకున్న మట్టి, పేడ ద్వారా కూడా వ్యాధులు ఒక చోటు నుంచి మరో చోటుకు చేరే అవకాశం ఉంటుంది. అందుకే బయట నుంచి వచ్చిన వెంటనే పశువుల దగ్గరకు వెళ్లకుండా చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవడం మంచిది. ముఖ్యంగా పశువుల సంతకు, మరో పాడి ఫారానికి వెళ్లి వచ్చినప్పుడు ఈ జాగ్రత్త మరింత అవసరం. వీలైతే పశువుల పాకలో వేసుకునేందుకు వేరే చెప్పులు ఉంచుకోవాలి. వాటిని బయట ఇతర పనులకు ఉపయోగించకూడదు. అనారోగ్య పశువును చూసిన తర్వాత చేతులు, చెప్పులు శుభ్రం చేసుకొని, ఆ తర్వాతే ఇతర పశువుల దగ్గరకు వెళ్లాలి. ఈ చిన్న అలవాట్లు బయట నుంచి లేదా ఒక పశువు నుంచి మరో పశువుకు వ్యాధులు చేరే అవకాశాన్ని తగ్గిస్తాయి.
పాకను శుభ్రంగా, పొడిగా ఉంచుతున్నారా? పశువుల పాకలో పేడ, వ్యర్థాలు పేరుకుపోయి, నేల ఎక్కువసేపు తడిగా ఉంటే పశువులకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అందుకే పేడ, ఇతర వ్యర్థాలను రోజూ తొలగించాలి. మూత్రం, మురికి నీరు పాకలో నిల్వ ఉండకుండా బయటకు వెళ్లేలా కాలువలు ఉండాలి. తొలగించిన పేడను పాక దగ్గరే పోగు చేయకుండా, నిర్ణీత ప్రదేశంలో సేకరించి సేంద్రియ ఎరువు తయారీకి లేదా వీలైతే బయోగ్యాస్ తయారీకి ఉపయోగించుకోవచ్చు. పశువులు పడుకునే ప్రదేశంలో తేమ లేకుండా చూసుకోవాలి. అలాగే పాకలోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూడాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు పాకలో అపరిశుభ్రతను తగ్గించి, పశువుల ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి.
మేత, తాగునీరు కలుషితం కాకుండా కాపాడుతున్నారా? పశువులకు ఇచ్చే మేత, తాగునీరు శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. మేతలో పేడ, మట్టి లేదా ఇతర మలినాలు కలవకుండా చూసుకోవాలి. మేతను తేమ తగలకుండా, పొడిగా ఉండే ప్రదేశంలో నిల్వ చేయాలి. బూజు పట్టిన లేదా చెడిపోయిన మేతను పశువులకు ఇవ్వకూడదు. మేత తొట్లు, నీటి తొట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. తొట్టెలో మిగిలిపోయి చెడిపోయిన మేతను తొలగించి, తాజా మేత వేయాలి. పశువులకు ఎల్లప్పుడూ శుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలి. ఇలా మేత, నీటి విషయంలో జాగ్రత్తలు పాటిస్తే వాటి ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గించవచ్చు. అలాగే పశువులకు సమతుల్య మేతతో పాటు తగిన ఖనిజ లవణ మిశ్రమాన్ని కూడా అందించాలి.
పాలు పితికే పాత్రలు, ఇతర పరికరాలను శుభ్రంగా ఉంచుతున్నారా? పాలు పితికే సమయంలో పరిశుభ్రత పాటించడం పశువుల ఆరోగ్యంతో పాటు పాల నాణ్యతకు కూడా చాలా ముఖ్యం. పాలు పితికే ముందు చేతులు, పొదుగును శుభ్రంగా కడిగి, పొదుగును పొడి గుడ్డతో తుడవాలి. పాలు పితికే పాత్రలను ప్రతి సారి ఉపయోగించిన తర్వాత బాగా కడిగి ఆరబెట్టాలి. పాలు పితికే యంత్రాలు, ఇతర పరికరాలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. పాలు పితికిన తర్వాత చనుమొనలను పశువైద్యుడు సూచించిన టీట్ డిప్పింగ్ ద్రావణంలో ముంచడం మంచిది. ఇలా సరైన పద్ధతిలో పాలు పితకడం వల్ల మాస్టిటిస్ (పొదుగు వాపు) వచ్చే అవకాశాన్ని తగ్గించడంతో పాటు నాణ్యమైన పాలను పొందవచ్చు.
ఈగలు, దోమలు, ఎలుకల బెడదను తగ్గిస్తున్నారా? పశువుల పాకలో ఈగలు, దోమలు, ఎలుకలు ఎక్కువగా ఉంటే పశువులకు ఇబ్బంది కలిగించడంతో పాటు వివిధ రకాల వ్యాధులు వ్యాపించడానికి కూడా కారణమవుతాయి. అందుకే పాకలో పేడ, మిగిలిపోయిన మేత పేరుకుపోకుండా, చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దాణా నిల్వ చేసే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచి, దాణా చెల్లాచెదురుగా పడకుండా చూసుకోవాలి. అవసరమైతే పశువైద్యుల సూచనలతో ఈగలు, దోమలను దూరంగా ఉంచే రిపెల్లెంట్లను, ఎలుకల నియంత్రణకు తగిన పద్ధతులను ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల లంపీ స్కిన్ డిసీజ్ (ముద్ద చర్మ వ్యాధి), సర్రా వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
టీకాలు, నట్టల మందులు సమయానికి వేయిస్తున్నారా? వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయించడం కంటే, ముందుగానే నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అందుకే పశువులకు అవసరమైన టీకాలను సమయానికి వేయించడంతో పాటు, నట్టల నివారణకు కూడా సకాలంలో మందులు ఇవ్వాలి. పశువుల వయస్సు, ఆరోగ్య పరిస్థితి, ప్రాంతంలో వచ్చే వ్యాధులను బట్టి పశువైద్యుని సూచనతో వీటిని పాటించాలి. టీకాలు, నట్టల మందులు ఇచ్చిన తేదీలను చిన్న పుస్తకంలో లేదా మొబైల్లో నమోదు చేసుకుంటే, తదుపరి ఎప్పుడు ఇవ్వాలో తెలుసుకోవడం సులభమవుతుంది.
పశువు ఆరోగ్యంలో మార్పు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నారా? రోజూ కొద్దిసేపు పశువులను దగ్గరగా గమనించడం అలవాటు చేసుకోవాలి. పశువు సాధారణంగా ఎలా ఉంటుందో తెలిసినప్పుడే దాని ఆరోగ్యంలో వచ్చే మార్పులను త్వరగా గుర్తించవచ్చు. మేత తినకపోవడం, నీరసంగా ఉండటం, జ్వరం, దగ్గు, విరేచనాలు, పాల దిగుబడి అకస్మాత్తుగా తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. అనారోగ్యంగా ఉన్న పశువును వీలైనంత వరకు ఇతర పశువులతో కలవకుండా ఉంచి, వెంటనే పశువైద్యుని సంప్రదించాలి. మందలోని ఇతర పశువుల్లో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయేమో గమనించాలి. ఒకటి కంటే ఎక్కువ పశువుల్లో ఒకే విధమైన లక్షణాలు కనిపిస్తే మరింత అప్రమత్తంగా ఉండి, వెంటనే పశువైద్యునికి తెలియజేయాలి. వ్యాధిని తొలిదశలోనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం వల్ల చికిత్స త్వరగా ప్రారంభించడంతో పాటు, ఇతర పశువులకు వ్యాధి వ్యాపించే ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.
మరి… మీ పాడి ఫారం ఎంతవరకు సురక్షితం? ఈ 10 అంశాల్లో మీరు ఇప్పటికే పాటిస్తున్నవి ఏవి? ఇంకా మెరుగుపరచుకోవాల్సినవి ఏవి? ఒకసారి మీరే పరిశీలించుకోండి.
పశువుల కొనుగోలు నుంచి రోజువారీ సంరక్షణ, మేత, నీరు, పాలు పితకడం, టీకాలు, ఆరోగ్య పరిశీలన వరకు ప్రతి దశలో సరైన పద్ధతులు పాటించడం ముఖ్యం. వీటిని రోజువారీ ఫారం నిర్వహణలో భాగంగా చేసుకుంటే పశువుల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు పాడి ఫారాన్ని మరింత సురక్షితంగా నిర్వహించవచ్చు.
Dr. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్, Dr. బద్దం అఖిల , టీచింగ్ ఫాకల్టీ, పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం, పశువైద్య కళాశాల, కోరుట్ల, PVNRTVU. 7093198419
తయారుచేయు విధానం: ఒక గ్లాసు జ్యూస్‌కు పెద్ద కప్పు ముక్కలు సరిపోతాయి. గుమ్మడికాయను దాని పైనున్న బూడిద పోయేలాగా బాగా కడగాలి. తర్వాత మనకు కావలసినన్ని ముక్కలు కోసుకోవాలి. కాయ పైనున్న చెక్కు, లోపల గింజలు తీయనవసరం లేదు. అన్ని వేసుకోవచ్చు. దీనిలో చిన్న గ్లాసు మజ్జిగ కానీ, నాలుగు స్పూన్ల పెరుగు కానీ వేసుకోవాలి. పెరుగు లేదా మజ్జిగ వద్దనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. గుమ్మడికాయలోనే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అల్లం చిన్నముక్క తీసుకుని కట్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపి మిక్సీలో కానీ జ్యూసర్లో కానీ వేసుకుని జ్యూస్ తయారు చేసుకోవాలి. జ్యూస్ తయారయిన తర్వాత మిక్సీలో వేసుకున్న జ్యూస్‌ను వడకట్టుకోవాలి. జ్యూసర్లో అయితే వడగట్టనవసరం లేదు. దీనిలో నిమ్మరసం రుచికి తగినంత కలపాలి.
ఇప్పుడు కొంతమంది జ్యూస్ షాపుల వారు కూడా బూడిద గుమ్మడికాయ జ్యూస్ తయారు చేస్తున్నారు.
రచన : లతా కృష్ణమూర్తి, కుషాయిగూడ, హైదరాబాద్, తెలంగాణ
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.