ఔషధ మొక్క… ఇరుగుడు చెట్టు
ఇరుగుడు చెట్టు ఒక మధ్యమ పరిమాణం నుండి పెద్ద పరిమాణంలో ఉండే ఒక ఆకులు రాల్చే చెట్టు. ఇది 30 మీ. ఎత్తు పెరుగుతుంది. చెట్టు క్యానపి విస్తృతంగా వ్యాపించి, పలుచగా ఉంటుంది. బెరడు పలుచగా, బూడిద రంగులో, నిలువైన సాళ్ళు కలిగి ఉంటాయి. పొడవాటి ప్రధాన వేరు కలిగి ఉంటుంది. ఆకులలో 3-5 చిన్న ఆకులు కలిగి ఉంటాయి. ఇవి ఒక దాని తర్వాత ఒకటిగా ఏర్పడతాయి. 2.5-3.6 సెం.మీ. వ్యాసం కలిగి వెడల్పాటి అండాకారంలో ఉంటాయి. పూలు 5-8 మి.మీ. పొడవు, తెల్లబారిన తెలుపు నుండి పాలిపోయిన పసుపు పచ్చ రంగులో ఉంటాయి. కాయలు 5-7 సెం.మీ. x 8-13 మి.మీ. పరిమాణంలో 14 గింజలు కలిగి ఉంటుంది. గింజలు 6-8 x 4-5 మి.మీ. పరిమాణంలో కిడ్నీ ఆకారంలో లేతగోధుమ రంగులో ఉంటాయి..
సాధారణ నామం : షిషం/ఇండియన్రోజ్వుడ్ శాస్త్రీయ నామం : డాల్బెర్ౙియాసిస్సూ కుటుంబం: ఫాబేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
- ఇరుగుడు చెట్టు అనేక భాగాలను సంప్రదాయకంగా అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు.
- బెరడు, కొయ్య చేదు, వేడి, వగరుగా ఉండి లైంగికంగా ఉత్తేజితం, గర్భస్రావం, కఫహరం, కడుపులో ఏలిక పురుగుల నాశకం, జ్వరం తగ్గించే …క్షణాలు కలిగి ఉంటాయి. రక్తం ద్వారా సంక్రమించే వ్యాధులు, ల్యుకేమియా, డిసెంట్రిల నివారణలో ఉపయోగిస్తారు.
- గనోరియా తీవ్ర దశలో ఉన్నప్పుడు ఆకుల కషాయాన్నిస్తారు. మూత్రంలో చీముని తొలగించడానికి, స్త్రీల బహిష్టు సమయంలో రక్త స్రావాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు. శరీరంపై బొబ్బలు, మొటిమలను నయం చేయడానికి కూడా ఉపయోగిస్తారు.
- కొయ్యపేస్టుని పుండు దురదని, కురుపుల్ని, వాంతులు తగ్గించడానికి ఉపయోగిస్తారు.
- ప్రజావైద్యంలో దీనిని ఉత్తేజితంగా, మందుగా ఉపయోగిస్తారు. గనోరియాకు, చర్మ వ్యాధులకు మంచి మందు.
- ఆయుర్వేదంలో కంటి జబ్బులను నయం చేయడానికి దీనినుపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో
- ఆకులు, లేతకాడలు, పచ్చి కాయలను పశువులకు మంచి మేతగా వేస్తారు.
- ఇరుగుడు చెట్టు అనేక వాతావరణ, అటవీ వ్యవసాయ ప్రయోజనాలను కల్గిస్తుంది.
- దీనిని గాలి నిరోధకంగా, షెల్టర్ బెల్ట్‌గా, మామిడి, టీ, కాఫీ తోటలలో అంతర పంటగా నీడనిచ్చే చెట్టుగా పెంచుతారు. దీని వేరు వ్యవస్థ నుండి పిలకలు వస్తాయి. దీనిని సాధారణంగా భూమి కోతను నివారించడానికి, నదీ ప్రవాహాల కట్టలపై భూమిని నిలకడగా ఉంచడానికి పెంచుతారు.
- దీని వాసన నిచ్చే పూలు, నీడనిచ్చే కారణంగా దీనిని రోడ్ల ప్రక్కన, తోటలలో అలంకరణ మొక్కలుగా నాటుతారు.
- ఇరుగుడు చెట్టు కాయలు ఇథనాల్ ద్రావణాలు మంచి నీటి నత్త భోంఫలారియా ఫీఫరీ గుడ్లపై మొల్లస్కిసైడ్ ప్రభావాన్ని చూపుతుంది.
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

