జామకాయ, మామిడికాయ, పచ్చిమిర్చి రోటి పచ్చడి
తయారుచేసే విధానం: జామకాయలని, మామిడి కాయలని, వెల్లుల్లి, పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చిని రుచికి తగినంత ఉప్పుని మామిడికాయ ముక్కలని కచ్చాపచ్చాగా రోటిలో బండతో దంచి, తదుపరి జామకాయ ముక్కలని వెల్లుల్లిని, చిటికెడు పసుపుని వేసి దంచుకోవాలి. రెండు చెంచాలు నూనె వేసి కలపాలి. ఒక గంట తర్వాత మామిడి కాయలో ఉన్న పులుపు వూరి, జామకాయ ముక్కలకి పట్టి కొంచం గ్రేవీగా వస్తుంది. అంతే! పచ్చడి రెడీ!!
ఈ పచ్చడి వేడివేడి అన్నంలోగానీ, రొట్టెలోగానీ, దోసెలోగానీ వేసుకుతింటే… రుచిగా ఉంటుంది!
కావలసిన పదార్థాలు:
- జామకాయ – 1 (పావుకిలో సైజు)
- మామిడికాయ – 1 (పావుకిలో సైజు))
- పచ్చిమిర్చి – 30 గ్రాములు
- ఉప్పు – రుచికి తగినంత
- జీలకర్ర – 2 టేబుల్ స్పూన్లు
- వెల్లుల్లి రేకలు – 10
- పసుపు – చిటికెడు.
- ఆయిల్ – రెండు చెంచాలు
రచన: ధనలక్ష్మి కొల్లిపర, గచ్చిబౌలి హైదరాబాద్
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.



