మలుగులో ఉద్యాన యూనివర్సిటీ నర్సరీ

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ములుగులో యూనివర్సిటీ ఉద్యాన నర్సరీ నెలకొల్పింది. ఈ నర్సరీలో నాణ్యమైన తెగుళ్లు సోకని పండ్ల మొక్కలు (మామిడి, జామ, సీతాఫలం, నారింజ, నిమ్మ, సపోటా, డ్రాగన్ ఫ్రూట్ మొదలగునవి) పూల మొక్కలు (బంతి, చామంతి, లిల్లీ, గ్లాడియోలాస్, చైనా ఆస్టర్ వంటివి), కూరగాయలు (కిచెన్ గార్డెన్ కూరగాయ విత్తనాలు అదే విధంగా ఔషధ మరియు సుగంధ ద్రవ్య మొక్కలు (ఇన్సులిన్, తులసి, బిళ్లగన్నేరు, స్టీవియ, అశ్వగంధ, లెమన్ గ్రాస్, పామరోసా మొదలగునవి) లభ్యమవుతాయి. ఈ మొక్కలను యూనివర్సిటీలోని ఇతర పరిశోధన స్థానాలనుండి తెప్పించడం జరిగింది. ఇందువల్ల రైతులు ప్రైవేటు నర్సరీ నుండి కాకుండా యూనివర్సిటీ ఉద్యాన నర్సరీ నుండి నాణ్యమైన మొక్కలను తక్కువ ధరలలో కొనుగోలు చేసి అధిక దిగుబడులు పొందవచ్ౘ్ు అని యూనివర్సిటీ ఉపకులపతి డా. డి. రాజీ రెడ్డి గారు తెలియజేశారు.

ములుగు యూనివర్సిటీ ఉద్యాన నర్సరీలో అందుబాటులో ఉన్న వివిధ మొక్కల వివరాలు
పండ్ల మొక్కలు రకాలు ధర (ఒక మొక్కకు రూపాయలు)
మామిడి అంటు మొక్కలు 1.బంగినపల్లి, 2.దశేరి 60/Ð
3.ఆమ్రపాలి, 4. లాంగ్రా
సీతాఫలం బాలానగర్ 40/-
జామ లక్నో -49 40/-
నిమ్మ పెట్లూరు సెలక్షన్-1 30/-

Read More

గ్రామాలకు పెద్దపీట కేంద్ర బడ్జెట్

కేంద్ర బడ్జెట్లో గ్రామీణ వికాసానికి, రైతుల ప్రోత్సాహానికి పెద్దపీట వేసేలా వివిధ ప్రతిపాదనల్ని కేంద్ర బడ్జెట్లో ఆవిష్కరించారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 1,62,671 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. ఇది 2025-26 సంవత్సరానికి సవరించిన అంచనాల మొత్తమైన రూ.1,51,853 కోట్ల కంటే 7.12% ఎక్కువ. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు మించిన ఆదాయం వేర్వేరు రంగాల నుంచి వచ్చేలా చర్యలు చేపట్టామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆమె చెప్పిన ప్రకారం..

*ఈఈజడ్‌లో మత్స్య సంపదకు సుంకం ఉండదు*

సముద్రంలో ‘ప్రత్యేక ఆర్థిక మండలి’ (ఈఈజడ్) పరిధిలోని జలాల్లో భారతదేశ నౌకలు పట్టే మత్స్య సంపదపై ఎలాంటి సుంకం ఉండదు. ఈ మత్స్య సంపదను విదేశీ ఓడరేవులకు చేరిస్తే మాత్రం ఇది అక్కడికి ఎగుమతి అయిన సరకుగా పరిగణిస్తారు. మన ప్రాదేశిక జలాలకు వెలుపల పట్టే మత్స్య సంపదకు ఆర్థిక విలువను భారతీయ మత్స్యకారులు పొందేలా ఈ ఏర్పాటు చేశారు. ఇది దుర్వినియోగం కాకుండా తగిన రక్షణ చర్యలు ప్రతిపాదించారు. సముద్ర ఆహార ఉత్పత్తుల్ని ఎగుమతి చేసేవారికి ‘సుంకాల్లేని దిగుమతుల విలువ’ను ప్రభుత్వం పెంచనుంది. మునుపటి ఆర్థిక సంవత్సరంలో చేసిన ఎగుమతుల్లో ఒక శాతం వరకు ఉన్నదాన్ని ఇప్పుడు 3% చేస్తున్నారు.

మరో 20 వేల మంది పశువైద్యానికి…*

పేద, బలహీనవర్గాలు సహా రైతుల ఆదాయంలో 16% వరకు పశుసంపద ద్వారా వస్తోంది. అందువల్ల మరో 20 వేల మంది పశుసంవర్థక వృత్తి నిపుణులు అందుబాటులోకి వచ్చేలా రుణ ఆధారిత పెట్టుబడి రాయితీ పథకం కొత్తగా అమలు చేస్తారు. ఆ మేరకు వెటర్నరీ కళాశాలలు, పశువైద్య ఆసుపత్రులు, రోగ నిర్ధారణ కేంద్రాలు, సంతానోత్పత్తి సదుపాయాలు ప్రైవేటు రంగంలో వచ్చేoదుకు పథకం తోడ్పాటు అందిస్తుంది. కొబ్బరి, గంధం, జీడి, బాదం, అక్రోటు, కోకో సాగుపై దృష్టి కేంద్రీకరిస్తారు. తద్వారా ఉపాధి అవకాశాలు పెంచుతారు. పాత, దిగుబడినివ్వని కొబ్బరి చెట్ల స్థానే కొత్తరకం కొబ్బరి మొక్కల్ని నాటే పథకాన్ని చేపడతారు. గంధం చెట్ల పెంపకంలో మునుపటి వైభవాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు

. *సొసైటీలకు సహకారం*

పశువుల దాణా, పత్తిగింజల సరఫరాలో ఉన్న సహకార సొసైటీలకు పన్ను రాయితీలు లభించనున్నాయి. ప్రస్తుతం పాలు, నూనెగింజలు, పళ్లు, కూరగాయలు వంటివి సరఫరా చేసే ప్రాథమిక సహకార సొసైటీలకే ఇలాంటి మినహాయింపులు ఉన్నాయి. అంతర్ సహకార సొసైటీ డివిడెండ్ ఆదాయంపై కొత్త ఐటీ చట్టం కిందపన్ను మినహాయింపు లభిస్తుంది. గుర్తింపు పొందిన జాతీయ సహకార సమాఖ్య ఈ ఏడాది జనవరి 31లోగా కంపెనీల్లో పెట్టే పెట్టుబడులపై వచ్చే ఆదాయానికి మూడేళ్లపాటు పన్ను మినహాయింపు ఉంటుంది. సభ్య సొసైటీలకు ఇచ్చే డివిడెండ్లకు ఇది వర్తిస్తుంది. సహకార సొసైటీలకు ఉన్న ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పు లేదు.

*ఉపాధి హామీకి..*

ఎంజీ నరేగా స్థానంలో తీసుకువచ్చిన జీ రామ్ జీకి రూ.95,692 కోట్లు కేటాయించారు. గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయింపులను ప్రస్తుత సంవత్సరం కంటే 3.5% పెంచి రూ.1,94,368.81 కోట్లు చేశారు. గ్రామీణ సడక్ యోజనకు ప్రస్తుత సంవత్సరం మాదిరిగానే రూ.19,000 కోట్లు కేటాయించారు

.l*రాష్ట్రాలతో కలిసి ధన ధాన్య కృషి యోజన*

ఆకాంక్షిత జిల్లాల స్ఫూర్తితో రాష్ట్రాలతో కలిసి ‘ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన’ను చేపట్టనున్నారు. తక్కువ దిగుబడులు వస్తున్న 100 జిల్లాల్లో ఇప్పుడున్న పథకాలను, ప్రత్యేక చర్యల్ని కలిపి దీనిని అమలు చేస్తారు. ఉత్పత్తి, పంటల వైవిధ్యం, కోతల తర్వాత నిల్వ, సాగునీటి సదుపాయాలు, రుణ పరపతి పెంచడం దీని లక్ష్యం.. దాదాపు 1.7 కోట్ల మందికి ఇది ఉపయోగపడనుంది. వ్యవసాయానికి అండదండలిచ్ౘ్ి, వలసల అవసరం తగ్గేలా చూస్తారు. పప్పు ధాన్యాలకు, ముఖ్యంగా కంది పప్పు, మినపపప్పు, ఎర్ర కందిపప్పులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఆరేళ్ల స్వయంసమృద్ధి సాధించడానికి ‘పప్పుల్లో ఆత్మనిర్భరత’ మిషన్‌ను ప్రారంభిస్తారు. ఆదాయం పెరగడంతో కూరగాయలు, పండ్లు, శ్రీ-వరి వినియోగం కూడా పెరుగుతోంది. వీటి ఉత్పత్తిని పెంచే సమగ్ర కార్యక్రమం చేపడతారు. బిహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు, పత్తిరైతుల కోసం ప్రత్యేక మిషన్, 7.7 కోట్ల మంది రైతులు, మత్స్యకారులు, పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఇచ్చే స్వల్పకాలిక రుణాలు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు.

*500 జలాశయాలు అభివృద్ధి*

దేశీయంగా మత్స్య పరిశ్రమకు ఊతమివ్వడానికి 500 జలాశయాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తారు. అమృత్ సరోవర్లను తీర్చిదిద్దుతారు. అంకురాలు, మహిళా గ్రూపులు, చేపలసాగు రైతుల ఉత్పత్తుల సంస్థల ద్వారా విలువ పెంచే గొలుసుకట్టు వ్యవస్థను తీర ప్రాంతాల్లో బలోపేతం చేస్తారు.

*బహుళ భాషల్లో భారత్-విస్తార్*

రైతులకు కావాల్సిన సలహాలను వారి వారి భాషల్లో ఇచ్చే0దుకు వీలుగా ఏఐ ఆధారిత ‘భారత్-విస్తార’ సాధనం అందుబాటులోకి వస్తుంది. ఉత్పాదకత పెంచడానికి, రైతులు మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.*ప్రకృతి వ్యవసాయానికి* ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయానికి రూ. 155.32 కోట్లు కేటాయించారు.

Read More

పుట్టగొడుగుల పెంపకంపై ఫిబ్రవరి 18 నుంచి 28 వరకు శిక్షణ

ఫిబ్రవరి 18 నుంచి 28 వరకు ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో పుట్టగొడుగుల సాగుపై నైపుణ్య శిక్షణను నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య తెలిపారు. రాజేంద్రనగర్‌లో జరిగే ఈ శిక్షణ కోసం వచ్చే నెల 8లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. www.eeihyd.org, www.pjtau.edu.in వెబ్‌సైట్ల ద్వారా సమాచారం పొందాలన్నారు.

Read More

కోకో పంటకు కూడా నిర్దేశిత ధర

కోకో పంటకూ ఆయిల్‌పామ్ మాదిరి నిర్దేశిత ధర నిర్ణయించాలనే యోచనలో ప్రభుత్వం ఉందనిాంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. కోకోకి ధరలు తగ్గితే గతేడాది కిలోకు రూ. 50 చొప్పున ప్రభుత్వమే చెల్లించింది. మామిడి, అరటి ఏ ధరలు తగ్గినా ప్రభుత్వం చొరవ తీసుకుని రైతులకు అండగా నిలిచింది. ఒక్క ఏడాదిలో రూ.1,200 కోట్లు మద్దతు ధరల రూపేణా చెల్లింపులు చేశాం’ అని మంత్రి పేర్కొన్నారు. ఏలూరులో రెండు రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి కోకో సదస్సుకు శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

Read More

లక్ష ఎకరాలకు సాగు నీరు అందించగల ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు

తెలంగాణాలోని నారాయణపేట- కొడంగల్ సాగునీటి ఎత్తిపోతల పథకానికి (ఎన్‌కేఎలఐఎస్) కేంద్ర పర్యావరణం, అటవీ మంత్రిత్వశాఖ పరిధిలోని పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ (ఎసఈఐ ఏఏ) పర్యావరణ అనుమతులు (ఈసీ) మంజూరు చేసింది. నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లోని ప్రాజెక్టు ప్రభావిత రెండు మండలాల్లో కాలుష్య నియంత్రణ మండలి, నీటిపారుదల శాఖలు ప్రజాభిప్రాయ సేకరణ సభలు నిర్వహించాయి. వీటి నివేదికలను ఎసఈఐఏఏకు అందజేయగా ఆ సంస్థ మదింపు చేసి.. పర్యావరణ అనుమతులకు పచ్చజెండా ఊపింది.
ఈ ఎత్తిపోతల పథకం కింద నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లోని నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల్లో 10 మండలాల్లోని లక్ష ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. రూ.4,885 కోట్లతో మూడు దశల్లో జూరాల నుంచి 7 టీఎంసీలను ఎత్తిపోయనున్నారు. పది జలాశయాల్లో 4 టీఎంసీలు నిల్వ చేస్తారు. దారి మధ్యలోని 123 గ్రామాలకు తాగునీరు అందిస్తారు.
ప్రాజెక్టు నిర్మాణాల వెంట రూ.3.92 కోట్లతో గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేస్తారు. 55.85 హెక్టార్లలో 54,500 మొక్కలు పెంచుతారు.

Read More

రూ.2.84 కోట్లు పులిచింతల ప్రాజెక్టు నిర్వహణ పనులకు

ఆంధ్రప్రదేశ్‌లోని పులిచింతల ప్రాజెక్టులో డీజిల్ జనరేటర్ సెట్ల ఏర్పాటు, కుడివైపున ప్యానెల్ కంట్రోల్ గదిలో అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు, ఇతర నిర్వహణ పనులకు రూ.2.84 కోట్లు ఖర్చు చేసేందుకు వీలుగా ప్రభుత్వం పాలనామోదం ఇచ్చింది. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు.

Read More

రైతులకు వెంటనే వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు

మంత్రి గొట్టిపాటి రవికుమార్

వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు రైతులు దరఖాస్తు చేసిన వెంటనే మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రా¢ష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డితో కలిసి మంగళవారం ఆయన విద్యుత్తుశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్డీఎసఎస్ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎం సూర్యఘర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. స్మార్ట్ మీటర్లపై ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందని స్పష్టం చేశారు.

Read More

రికార్డు ధర పలికిన వేరుశనగ

వేరుసెనగ క్వింటాలుకు వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గరిష్ఠ ధర రూ.12,020 రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన పూసల ప్రభాకర్ 30 గుంటల భూమిలో వేరుసెనగ సాగుచేయగా.. 6 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. చేతికొచ్చిన పంటను మంగళవారం మార్కెట్‌కు తీసుకురాగా ఈ ధర పలికింది. గత ఏడాది క్వింటాలు రూ.6 వేలకు మించలేదని రైతు తెలిపారు. ఎనుమాముల మార్కెట్‌కు మంగళవారం మొత్తం 253 బస్తాల వేరుసెనగ రాగా. క్వింటాలుకు కనిష్ఠ ధర రూ.6,500, మోడరేట్ ధర రూ.9,500 పలికింది.

Read More

సహకార బ్యాంకుల్లో నగదు రహిత సేవలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో (డీసీసీబీ) యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయోగాత్మకంగా ఉమ్మడి పశ్చిమగోదావరిలోని సహకార బ్యాంకుల్లో సోమవారం ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి దాకా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేసే విధానం, ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలు సహకార బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన రైతులకు లేకపోయేసరికి ప్రధానంగా పొగాకు, ఆయిల్ పామ్, కోకో రైతులు వాణిజ్య బ్యాంకుల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ రైతుల సరకు విక్రయ లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లోనే ముడిపడి ఉంటున్నాయి. దీంతో ఈ రకమైన యూపీఐ సేవలు సహకార బ్యాంకుల్లో ప్రారంభించే విషయంపై ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఉన్నతాధికారులతో మాట్లాడి తొలుత తన సొంత జిల్లా ఉమ్మడి పశ్చిమ నుంచే దీనికి శ్రీకారం చుట్టారు. ఇకపై ఖాతాదారులు మొబైల్ ఫోన్లను వినియోగించి తక్షణమే ఇతరులకు డబ్బులు పంపొచ్చు. స్వీకరించొచ్చు. నగదు రహిత సేవలను ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా బ్రాంచిని సందర్శించకుండా వినియోగించుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సహకార బ్యాంకుల్లో త్వరలోనే యూపీఐ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

Read More

నారాయణపేటలో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

తెలంగాణాలోని నారాయణపేట జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.కోటి విలువైన పత్తి విత్తనాలను పట్టుకున్నారు. సోమవారం జిల్లా పోలీసుశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ డా. వినీత్ వివరాలు వెల్లడించారు. నారాయణపేట మండలం బండగొండ, కొత్తపల్లి మండలం భూనీడ్ గ్రామాల్లో నకిలీ పత్తి విత్తనాలు అక్రమంగా నిల్వ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. జిల్లా పోలీసులు, టాస్క్‌ఫోర్స్, వ్యవసాయశాఖ అధికారులు సంయుక్తంగా ఆదివారం సాయంత్రం ఆయా గ్రామాల్లో ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. భూనీడ్‌కు చెందిన తండ్రీకొడుకులు బాలకృష్ణనాయుడు, శశివర్దన్‌నాయుడు ఇళ్ల నుంచి రూ.కోటి విలువైన 10 టన్నుల (100 క్వింటాళ్లు) నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి రెండు కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వివరించారు. రైతులను మోసం చేసి నకిలీ విత్తనాలను సరఫరా చేసినా, అమ్మినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కేసును ఛేదించిన డీఎస్పీ లింగయ్య, సీఐలు శివశంకర్, సైదులు, ఎస్సైలు రాముడు, విజయ్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ బృందం, వ్యవసాయశాఖ అధికారులను అభినందించారు.

Read More