మత్స్యరంగాన్ని బలోపేతం చేయాలి

చేపపిల్లల పంపిణీ, పెంపకంలో అక్రమాలను అరికట్టాలని, తెలంగాణా రాష్ట్రంలో మత్స్య రంగాన్ని బలోపేతం చేయాలని, రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి సూచించారు. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు హైదరాబాద్ రాంనగర్‌లోని చేపల మార్కెట్‌ను ఆజామాబాద్‌కు మార్చాలని ఆదేశించారు. సోమవారం ఆయన మత్స్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. “చేపలు, రొయ్యల పెంపకం, అమ్మకాలతో మత్స్యకారులకు ఉపాధి లభిస్తుంది. మత్స్య శాఖ అధికారులు ఈ రంగం అభివృద్ధికి కృషి చేయాలి” అని కోదండరెడ్డి సూచించారు. మత్స్యశాఖ కమిషనర్ నిఖిల మాట్లాడుతూ పంపిణీ పకడ్బందీగా నిర్వహించాం అని తెలిపారు.

Read More

ఇద్దరు ప్రకృతి వ్యవసాయ రైతులు యూరప్ పర్యటన

ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏపీ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ విధానంలో భాగంగా.. ప్రకృతి వ్యవసాయం చేస్తూ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న పార్వతీపురం మన్యం జిల్లా దురుబిలికి చెందిన ఆరిక నరసమ్మ, అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సంతపాలేనికి చెందిన లాలం జ్యోతి అనే ఇద్దరు మహిళా రైతులకు యూరప్‌లో పర్యటించే అరుదైన అవకాశం దక్కింది. వీరు జర్మనీ, స్విట్ౙర్లాండ్, నెదర్లాండ్స్, పోలండ్, బెల్ౙియం సహా ఏడు దేశాల్లో 30 రోజుల పాటు పర్యటించనున్నారు. ఆయా దేశాల్లోని సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలు, పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఆర్గానిక్ ట్రేడ్ ఫెయిర్లను సందర్శిస్తారు. అక్కడ అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పరిశీలించడానికి ఈ ఇద్దరు రైతులను ఎంపిక చేసినట్లు రైతు సాధికార సంస్థ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రైతులతో పాటు అధికారులు యర్రకొండ సుధాకర్, స్వాతి మంగళవారం యూరప్ బయల్దేరనున్నారు. బెర్లిన్‌కు చెందిన ఫౌండేషన్ ఆఫ్ ఫ్యూచర్ ఫార్మింగ్ సంస్థ ఈ పర్యటన నిర్వహిస్తోంది.

Read More

శత వసంతాలకు చేరుకున్న పశుపరిశోధన కేంద్రం

గుంటూరు సమీపంలోని లాంఫామ్ కేంద్రంగా ఏర్పడిన పరిశోధన కేంద్రం శత వసంతాలకు చేరుకుంది. ఒంగోలు జాతి పశువుల సంరక్షణ, విస్తరణ, వ్యాధుల నియంత్రణ, ఆరోగ్య పరిరక్షణకు విశేష కృషిచేస్తున్న ఈ సంస్థ 1926లో ఏర్పాటైంది. ఈ కేంద్రం కృషితో.. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఒంగోలు జాతి పశువులు సంఖ్య పెరిగింది. పాలు, వెన్న, కోడెదూడల అమ్మకంతో రైతులు ఆదాయం గడించేవారు. ఈ ప్రభావంతో తమిళనాడులోని కోయంబత్తూరు, కర్ణాటకలోని హోసూరు ప్రాంతాల్లోనూ ఒంగోలు గిత్తల సంఖ్య పెరిగింది.

*ప్రభుత్వాల చేయూత..*

లామ్ ఫామ్‌లోని పశు పరిశోధన కేంద్రం అనేక పరిశోధనలతో అన్నదాతలకు చేరువ అవుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రత్యేక పథకాలు, నిధులను కేటాయించాయి. పరిశోధనల్లో భాగంగా విదేశీ ఆంబోతుల జన్యువులను చొప్పించి అధిక దిగుబడి ఇచ్ౘ్ే కొత్త సంకర జాతిని తయారు చేశారు. విదేశీ జాతులైన హెచ్.ఎఫ్, బ్రౌన్ స్విస్, జెర్సీ ఆంబోతుల సంకరంతో ఏళ్లుగా జరిపిన ప్రయోగాల వల్ల 50-50 శాతం లక్షణాలు కలిగిన ఒంగోలు- హెచ్.ఎఫ్. సంకరజాతి రూపొందింది. మన దేశ ఉష్ణ మండల శీతోష్ణ స్థితిని తట్టుకుని అధిక ఉత్పాదక శక్తిని ఈ జాతి నమోదు చేసింది. స్వదేశీ జాతులైన ఒంగోలు, గిర్, హరియాణా, థార్‌పార్కర్ గోవులను పరిరక్షించి.. జన్యుపరంగా అభివృద్ధిపై ఈ కేంద్రం దృష్టి సారించింది. పశువుల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్న తరుణంలో మేలైన ఆవులు, ఆంబోతులను అనేక ప్రాంతాల నుంచి సేకరించి అభివృద్ధి పరిచారు. దిగజారుతున్న పాల ఉత్పాదక శక్తిని తిరిగి పెంపొందించే పరిశోధనలు చేశారు. ఒంగోలు జాతి పరిరక్షణలో భాగంగా పిండోత్పత్తి, పిండ మార్పిడి జీవ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఉత్తమ జన్యు సంతతిని పెంచేలా కృషి చేస్తున్నారు. పిండ మార్పిడి దూడ సైతం ఇక్కడ జన్మించడం విశేషం. ప్రస్తుతం లామ్ ఫామ్‌లో ఉన్న పిండ మార్పిడి ప్రయోగశాలను జాతీయ స్థాయి ప్రయోగశాలగా గుర్తించారు. ఈ సందర్భంగా లాంఫామ్ కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ఆచార్య యం. ముత్తారావు మాట్లాడుతూ.. ఒంగోలు జాతికి పునర్వైభవ దీప్తి, ఆధునిక జీవ సాంకేతిక పశు పరిశోధనలతో రైతు సేవలో శత వసంతాలు పూర్తి చేసుకోవడం గర్వకారణమని వ్యాఖ్యానించారు.

Read More

చేపల పెంపకంతో మంచి ఆదాయం

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌కి చెందిన భవాని 2007లో ఐటీ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తిచేసి హైదరాబాద్‌లో రెండేళ్లు ఉద్యోగం చేశారు. ! పెళ్లయ్యాక జబల్‌పుర్‌కు తిరిగివెళ్లి కోచింగ్ సెంటర్ ప్రారంభించారు. కొవిడ్ విజృంభణతో కోచింగ్ సెంటర్ మూతపడటంతో.. చేపల పెంపకాన్ని ఎంచుకున్నారు. ఏమాత్రం అనుభవం లేకున్నా.. సవాలుగా స్వీకరించి పని మొదలు పెట్టారు. జబల్‌పుర్‌కి 15 కిలోమీటర్ల దూరంలోని హినోటియా గ్రామంలో 4.5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. పాలిథీన్ షీట్‌తో లైనింగ్ వేసే విధానాన్ని అనుసరిస్తూ.. పంగాసియస్ చేపల పెంపకం ప్రారంభించారు. ప్రస్తుతం ఏటా 20-30 టన్నుల చేపలను విక్రయిస్తూ రూ. లక్షల్లో సంపాదిస్తున్నారు.

Read More

నిజామాబాద్ జిల్లాలో రేపు కొత్త వ్యవసాయ కళాశాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ విద్యను మరింత విస్తరించి, రైతు సంక్షేమం-వ్యవసాయ అభివృద్ధికి బలమైన పునాది వేయాలనే లక్ష్యంతో నిజామాబాద్ జిల్లాలో కొత్త వ్యవసాయ కళాశాల నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

నిజామాబాద్ జిల్లాలోని సుద్దపల్లి మరియు నడపల్లి గ్రామాల పరిధిలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌లోని సర్వే నంబర్లు 265/1, 277 మరియు 334లో మొత్తం 120 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆధునిక వ్యవసాయ కళాశాల నిర్మించబడనుంది. వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికతలు, పరిశోధన, శిక్షణ మరియు రైతు సేవలను ఒకేచోట అందించేందుకు ఈ కళాశాల రూపుదిద్దుకోనుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పడనున్న ఈ కళాశాల రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఒక ముఖ్య మైలురాయిగా నిలవనుంది. విద్యార్థులకు ఆధునిక వ్యవసాయ విద్యను అందించడంతో పాటు రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే విధంగా ప్రణాళికలు రూపొందించబడ్డాయని మంత్రి తుమ్మల తెలిపారు.

ఈ వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేయనున్న ముఖ్య సౌకర్యాలు:

  • 5 ఎకరాలలో ఆధునిక అకడమిక్ బ్లాక్ మరియు పరిపాలన భవనాలు
  • 2 ఎకరాలలో అత్యాధునిక 10 ప్రయోగశాలలు
  • 2 ఎకరాలలో 1000 మంది విద్యార్థులకు వసతి కలిగిన హాస్టళ్లు
  • 1 ఎకరంలో లైబ్రరీ
  • 50 ఎకరాలలో విస్తృత పరిశోధన ఫార్మ్‌లు మరియు సీడ్ ఫార్మ్‌లు
  • 20 ఎకరాలలో విద్యార్థుల ప్రాక్టికల్ శిక్షణ కోసం ప్రత్యేక ఫార్మ్‌లు
  • 10 ఎకరాలలో మోడల్ ఫార్మ్ మరియు రైతు శిక్షణ బ్లాక్
  • 10 ఎకరాలలో సైన్స్ మ్యూజియం, బొటానికల్ గార్డెన్
  • 8 ఎకరాలలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు ఇండోర్ స్టేడియం
  • 3 ఎకరాలలో ఆడిటోరియం, గ్యాలరీ మరియు సెమినార్ హాళ్లు
  • 3 ఎకరాలలో అధ్యాపకులు మరియు సిబ్బందికి నివాస వసతులు
  • 1 ఎకరంలో ఆరోగ్య కేంద్రం మరియు ఇతర మౌలిక సదుపాయాలు ఈ సదుపాయాలన్నీ పూర్తిస్థాయిలో ఏర్పాటవడంతో విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ, ఆధునిక పరిశోధన, రైతులకు ప్రత్యక్ష శిక్షణ మరియు నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుందని మంత్రిగారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కళాశాల ద్వారా ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని విద్యార్థులకు ఉన్నత స్థాయి వ్యవసాయ విద్య అందుబాటులోకి రానుండగా, రైతులకు నూతన పంట విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం, విత్తనాల అభివృద్ధి మరియు సాగు విధానాలపై శిక్షణలు అందించి వ్యవసాయ ఉత్పాదకత పెంపునకు దోహదం చేస్తుందని మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఆధునీకరించడం, యువతను వ్యవసాయ రంగంలో ఆకర్షించడం మరియు రైతుల ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త వ్యవసాయ కళాశాల నిర్మాణాన్ని చేపట్టిందని, ప్రతి ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ కళాశాల ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఈ ప్రతిష్ఠాత్మక వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన చేసి, రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధికి మరో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారని మంత్రి తుమ్మల వెల్లడించారు. వ్యవసాయ రంగంలో విశేష అనుభవంతో ఆధునిక సాగు పద్ధతులతో మార్గదర్శి గా నిలిచిన మంత్రి తుమ్మల వ్యవసాయ విద్యకు మూడు దశాబ్దాల క్రితమే బాటలు వేశారు. అశ్వరావుపేటలో వ్యవసాయ కళాశాల స్థాపనకు రూపకల్పన చేసిన తుమ్మల నాటి అనుభవాలతో సీఎం రేవంత్ రెడ్డికి వ్యవసాయ విద్య విస్తరణ ప్రాధాన్యంపై ప్రతిపాదనలు చేయగా, వ్యవసాయ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చే రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ కళాశాల స్థాపనకు సంతోషంగా ఆమోదం తెలిపారు. వ్యవసాయ కళాశాల స్థాపనలో మంత్రి తుమ్మల తనదైన ముద్ర వేస్తున్నారని వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రొఫెసర్లు, రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేపు జరగనున్న వ్యవసాయ కళాశాల శంకుస్థాపన కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ విద్యార్ధులు పెద్ద ఎత్తున పాల్గొనాలని మంత్రి తుమ్మల కోరారు.
Read More

త్వరలో పశు ఔషధి కేంద్రాలు

జాతీయ పశు వ్యాధుల నియంత్రణ పథకం కింద పశు ఔషధి కేంద్రాలను కేంద్ర పశుసంవర్ధక-పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ రాష్ట్ర సంచాలకుడు డాక్టర్ టి. దామోదర్ నాయుడు బుధవారం ప్రకటించారు. వీటితో నాణ్యమైన జనరిక్ పశు ఔషధాలు చౌక ధరలకే అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కేంద్రాలను ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు(పీఎం-కేఎస్‌కేలు), సహకార సంఘాల ద్వారా ఏర్పాటు చేస్తారని, జిల్లా, మండల కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ఆసక్తి ఉన్నవారు https://pashuaushadhi.dahd.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు పొందవచ్చు లేదా, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారిని సంప్రదించాలని సూచించారు. ఈ కేంద్రాలకు ఆపరేటింగ్ మార్ౙిన్‌గా 20శాతం ఇస్తారని తెలిపారు.

Read More

దిగుమతి సుంకం సున్నా శాతంతో అమెరికా నుండి పండ్లు, కూరగాయలు

భారత్ సున్నా శాతం సుంకాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 98% నుంచి 99% ఉత్పత్తులపై అమలు చేయనుందని అమెరికా పేర్కొంది. పండ్లు, కూరగాయలుసహా వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులపై సుంకాలు ఉండబోవని స్పష్టం చేసింది. కొన్ని కీలక ఉత్పత్తులపై మాత్రం భారత్ నియంత్రణ ఉంటుందని వెల్లడించింది. మరోవైపు రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపేస్తామని భారత్ హామీ ఇచ్చిందని వివరించింది. మంగళవారం సీఎన్‌బీసీ కార్యక్రమంలో భారత్ తో వాణిజ్య ఒప్పందం పై అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ స్పందించారు. భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంపై శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలినా లీవిట్ మీడియాతోనూ, ఫాక్స్ న్యూస్ నూ మాట్లాడారు.
‘భారత్‌పై అమెరికా 18శాతం సుంకాలను కొనసాగిస్తుంది. ఆ దేశంతో మాకు వాణిజ్య లోటు ఉంది. వారు పలురకాల వ్యవసాయ ఉత్పత్తులు, తయారీ వస్తువులు, రసాయనాలు, వైద్య పరికరాలపై సుంకాలను తగ్గిస్తామని అంగీకరించారు. ప్రస్తుతం భారత్‌లో అమెరికా పారిశ్రామిక ఉత్పత్తులపై సగటున 13.5 శాతం సుంకాలున్నాయి. అవి సున్నాకు చేరతాయి. కానీ బాదం, పిస్తా వంటి ఉత్పత్తులు, వైన్, ఆల్కహాల్ పానీయాలు, పండ్లు, కూరగాయలపై సున్నా శాతం సుంకాలే అమలవుతాయి. ఇది పెద్ద విజయం’ అని గ్రీర్ పేర్కొన్నారు.

Read More

తెలంగాణా రాష్ట్రానికి వ్యవసాయ పథకాల్లో రూ.51 కోట్ల కోత

తెలంగాణ వ్యవసాయ శాఖకు కేంద్ర నిధుల కేటాయింపులో పోలిస్తే రూ.51 కోట్ల మేర కోత పడింది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, సూక్ష్మసాగునీరు, భూసార ఆరోగ్య నిర్వహణ, వర్షాధార ప్రాంత అభివృద్ధి, డిజిటల్ వ్యవసాయం, వెదురు అభివృద్ధి పథకం, సహజ వ్యవసాయం తదితర కేంద్ర పథకాల కింద రాష్ట్రంలో ఏటా రూ.1,439.49 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇందులో 60 శాతం వాటా కింద కేంద్రం రూ.871.15 కోట్లు విడుదల చేస్తోంది. ఆదివారం ప్రవేశ పెట్టిన 2026-27 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.820 కోట్లు మాత్రమే పేర్కొన్నారు. రూ.51 కోట్ల మేర తగ్గించారు. దీనిపై రాష్ట్ర వ్యవసాయాధికారులు సంప్రదించగా… ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజనలో కొన్ని కేంద్ర పథకాలను విలీనం చేయడంతో రాష్ట్రానికి నిధులు తగ్గాయని కేంద్ర అధికారులు సమాచారం ఇచ్చారు.
సీఎం ధన్-ధాన్య కృషి యోజన అమలుకు తెలంగాణ రాష్ట్రంలో జనగామ, గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాలు ఎంపికయ్యాయి. దీనికింద ఏటా రూ.160 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ. 960 కోట్లు వెచ్చిoచాలని కేంద్రం నిర్దేశించింది. దీనిలో 31 పథకాలను విలీనం చేయగా.. అందులో తెలంగాణలో అమలయ్యే ఆరు పథకాలున్నాయి. వాటన్నింటినీ ఒకే పద్దుగా నిధులు కేటాయించడంతో రాష్ట్రానికి రూ.50 కోట్ల మేర తగ్గినట్లు అధికారులు గుర్తించారు. వాస్తవానికి ధన్-ధాన్య పథకానికి అదనంగా నిధులు వస్తాయని భావిస్తుండగా… ఉన్నవాటిలో కోత విధించడంపై వ్యవసాయాధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి లేఖ రాయనున్నారని తెలిపారు.

Read More

ఇద్దరు పశువైద్యులకు జాతీయస్థాయి అవార్డు

ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇద్దరు పశువైద్యుల½ జాతీయస్థాయిలో ఇచ్ౘ్ే ‘డాక్టర్ సీఎం సింగ్ సుశృత గౌరవ్ రత్న సమ్మాన’ అవార్డుకు ఎంపికయ్యారు. ఒంగోలు వెటర్నరీ పాలీ క్లినిక్ ఉప సంచాలకుడు డాక్టర్ నల్లపాటి జగత్ శ్రీనివాస్, విశాఖలో సహాయ సంచాలకుడిగా పనిచేస్తున్న డాక్టర్ మాదిన ప్రసాదరావు ఈ అవార్డును దక్కించుకున్నారు. సోమవారం వారిరువురినీ విజయవాడలోని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో సత్కరించారు.

Read More

గోమూత్రంతో పర్యావరణ హిత సిరా

దిల్లీ విశ్వవిద్యాలయంకి చెందిన రాంజాస్ కళాశాలలోని కెమిస్ట్రీ విభాగం పరిశోధకులు శుచి వర్మ నేతృత్వంలో గోవుల మూత్రం నుంచి పర్యావరణ హిత సిరా (ఇంకు)ను తయారు చేశారు. ఈ ఆవిష్కరణకు వారు ‘గౌరంగ’ అనే పేరు పెట్టారు. గోవుల మూత్రం నుంచి వారు నీలి వర్ణ పదార్థాన్ని సేకరించారు. ఇది ద్రవ, ఘన రూపంలో వచ్ౘ్ింది. దీనికి స్వల్పంగా ఉప్పును కలిపి ఇంకును తయారు చేశారు.

Read More