ఆందోళనలో గోకులాల రైతులు

ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది 25 వేల గోకులాల నిర్మాణాలకు అనుమతులిచ్చారు. సొంత స్థలం ఉన్నా గోకులాలు నిర్మించుకునే స్థోమత లేని వారికి రూ.1.18 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 14 వేల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. దశలవారీగా వీటికి బిల్లులు కూడా చెల్లిస్తున్నారు. మిగిలిన నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు పోర్టల్లో అప్లోడ్ చేసేందుకు ఇప్పటి వరకు ఉన్న ఆప్షనన్ను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తొలగించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పేద రైతులను దృష్టిలో పెట్టుకుని బిల్లులు ఉపాధి హామీ పోర్టల్ అప్లోడ్ చేసే వెసులుబాటు కల్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రెండు రోజుల క్రితం లేఖ రాసింది.

Read More

మన దేశం సుగంధ ద్రవ్యాల సాగులో అగ్రగామిగా నిలవనుంది

స్పైసెస్ బోర్డుకు రూ.156.89 కోట్లు ఈసారి కేంద్ర బడ్ౙెట్‌లో కేటాయించారని, నిజామాబాద్‌లోని పసుపు బోర్డు కూడా దీని కిందకే వస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం ‘ఎక్స్ ’ ఖాతాలో పేర్కొన్నారు. సుగంధ ద్రవ్యాల (స్పైసెస్) సాగుకు దండిగా నిధులు కేటాయించడంతో దేశం వాటి ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవనుందన్నారు. దీంతో వ్యవసాయ ఆర్థికవ్యవస్థ పరుగులు పెట్టనుందని పేర్కొన్నారు.

Read More

అమెరికాతో వాణిజ్య ఒప్పందాల గురించి రైతు సంఘాల నాయకులతో రాహుల్ భేటీ

రైతు సంఘాల నాయకలతో లోక్‌సభలో విపక్షనేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్‌లో ఈ భేటీ జరిగింది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా, రైతులు, వ్యవసాయ కార్మికుల జీవనోపాధిని కాపాడటం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాల్సిన ఆవశ్యకతపై చర్చ జరిగినట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని రైతు సంఘాల నాయకులు వ్యతిరేకించారని, మొక్కజొన్న, సోయా, పత్తి సహా పండ్ల రైతుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని వారు ఆందోళన వ్యక్తంచేశారని తెలిపింది. ఈ సమావేశానికి అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుఖ్‌పాల్ సింగ్ ఖైరా, భారతీయ కిసాన్ మజ్దూర్ నేత అశోక్ బల్దారా, బీకేయూ క్రాంతికారి నాయకుడు బల్దేవ్ ఎస్.జీరా, కిసాన్ మజ్దూర్ మోర్చా నేత గుర్మీత్ సహా దేశంలోని పలువురు రైతు సంఘాల నేతలు హాజరయ్యారు.

Read More

కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతులకు మరింత రుణ సదుపాయం

కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ)ల ద్వారా ప్రస్తుతం రైతులకు వ్యవసాయం, పశుపోషణ, పాడి పరిశ్రమ, మత్స్య సంపద, పట్టు పరిశ్రమ, తేనెటీగల పెంపకం కోసం రుణాలు ఇస్తుండగా… ఇకపై భూసార పరీక్షలు, వాతావరణ అంచనా సమాచార లభ్యత, సేంద్రియ ధ్రువీకరణ పొందేందుకు సైతం రుణాలు అందించేందుకు ఆర్బీఐ సంకల్పించి సంబంధిత ముసాయిదా మార్గదర్శకాలను గురువారం బ్యాంకులకు జారీచేసింది. వీటితోపాటు మరిన్ని మార్పుల కోసం రైతులు, ఇతర వినియోగదారులు మార్చి 6వ తేదీలోగా ఆన్‌లైన్‌లో ఆర్బీఐ వెబ్‌సైట్ ద్వారా తమ అభిప్రాయాలు చెప్పాలని కోరింది. దేశవ్యాప్తంగా 7.75 కోట్ల మంది రైతులకు ప్రస్తుతం కేసీసీలున్నాయి. మొత్తం 11 కోట్ల మంది రైతులకు ఈ కార్డులు ఇవ్వాలన్న కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా ఆర్బీఐ తాజాగా నిబంధనల్లో మార్పులు చేసింది.

Read More

అమెరికా వాణిజ్య ఒప్పందంతో రైతులు నష్టపోతారు

అమెరికా వాణిజ్య ఒప్పందంతో మన రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇలాంటి ఒప్పందాలు కుదుర్ౘ్ుకునే ముందు రైతుల ప్రయోజనాలు, దేశీయ ఉత్పత్తి స్థిరత్వం, ధరల రక్షణ, గ్రామీణ ఉపాధి వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించాలన్నారు. ‘మన దేశంలో చిన్న, సన్నకారు రైతులే అధికం. అమెరికాలో తక్కువ మంది రైతులు పెద్ద భూభాగాల్లో సాగు చేస్తున్నారు. వారితో మన రైతులు పోటీపడటం అసాధ్యం. ఇప్పటికే భారత్ పత్తి దిగుమతులపై 11% సుంకం తొలగించడంతో దేశీయ మార్కెట్‌లో పత్తి ధరలు గణనీయంగా పడిపోయాయి. భారత్-అమెరికా తాజా ఒప్పందం ఖరారు కాగానే సోయాచిక్కుడు ధరలు 10%, మొక్కజొన్న ధరలు 4% పడిపోయాయి. ఒప్పందం పూర్తయి సుంకాలు మరింత తగ్గితే పరిస్థితులు దుర్లభంగా మారతాయి” అని తుమ్మల అన్నారు.

Read More

తెలంగాణలో 141 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు

కనీస మద్దతు ధర కింద రూ.11,800 కోట్ల విలువైన 141 లక్షల క్వింటాళ్ల పత్తి తెలంగాణ నుంచి 2025-26 సీజన్‌లో కొనుగోలు చేసినట్లు కేంద్ర జౌళిశాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. మంగళవారం లోక్‌సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్ౘ్ారు. సీసీఐ రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాల్లో 122 కేంద్రాల ద్వారా 8.60 లక్షల మంది రైతుల నుంచి నేరుగా కొనుగోళ్లు చేసినట్లు చెప్పారు. 2024-25లో పత్తి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో రెండోస్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు

Read More

రైతులకు కిసాన్ డ్రోన్ సేవలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కిసాన్ డ్రోన్ సేవలను అద్దె ప్రాతిపదికన సమకూరుస్తోందని వ్యవసాయశాఖ సంచాలకులు మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. యాప్‌లో క్యాబ్, వాహనాల సేవలు అందుకున్నట్లే కిసాన్ డ్రోన్ ఊబరైజేషన్ మొబైల్ యాప్ ద్వారా డ్రోన్ పిచికారీ సేవలు పొందవచ్ౘ్ునని వెల్లడించారు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంటుందని, క్యూఆర్ కోడ్ సాయంతోనూ డౌన్‌లోడ్ చేసుకోవచ్ౘ్ని పేర్కొన్నారు. ఈ యాప్ పురోగతిపై ఆయన మంగళవారం జిల్లాల వ్యవసాయాధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ‘ప్రారంభమైన రెండు వారాల్లో 10,342 మంది రైతులు ఈ యాప్‌లో నమోదు చేసుకున్నారు. 2,654 మంది డ్రోన్ పిచికారీ సేవల కోసం అభ్యర్థనలు పంపారు. ఇప్పటి వరకు 356 ఎకరాల్లో 155 మంది రైతులు డ్రోన్ సేవలను వినియోగించుకున్నారు’ అని సంచాలకులు వివరించారు.

Read More

షుగర్ ఫ్రీ బంగాళాదుంపలు

మధుమేహం (డయాబెటిస్) ఉన్న వారి కోసం మార్కెట్లోకి ‘లేడీ రోసెట్టా’ రకం బంగాళాదుంపలు రాబోతున్నాయి. వీటి సాగు ప్రపంచంలోనే తొలిసారిగా నెదర్లాండ్స్‌లో జరిగింది. ఆ తర్వాత ఇతర దేశాలకు విస్తరించింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఉన్న రాజమాత విజయరాజె సింధియా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఏరోపోనిక్స్ ల్యాబ్‌లో ఈ లేడీ రోసెట్టా రకం ఆలుగడ్డలు సాగు చేస్తున్నారు. ఇందులో మట్టి లేకుండా మొక్కలను తీగలపై వేలాడదీసి పెంచుతారు. మరో రెండేళ్లలో ఈ విత్తనాలు రైతులకు అందుబాటులోకి వస్తాయని ఏరోపోనిక్స్ ప్రాజెక్ట్ హెడ్, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సుష్మా తివారీ తెలిపారు. ఈ రకం ఆలుగడ్డల్లో పిండిపదార్థం (స్టార్ౘ్్) చాలా తక్కువ, యాంటీఆక్సిడెంట్స్ మోతాదు ఎక్కువ. చక్కెర మోతాదు అతితక్కువ. గుండ్రంగా, లేత గులాబీ రంగులో ఉండే ఈ బంగాళాదుంపలు త్వరగా ఉడకవు. గట్టిగా ఉంటాయి.

Read More

తెలంగాణా సీఎంవో సెక్రెటరీ శేషాద్రితో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి భేటీ

తెలంగాణా రాష్ట్ర సచివాలయంలోని సీఎంవో సెక్రెటరీ శేషాద్రితో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సమావేశమయ్యారు. రైతు కమిషన్ ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల్లో చేసిన పర్యటనలు, అక్కడ అమలవుతున్న వ్యవసాయ, మార్కెటింగ్ విధానాలపై కమిషన్ తయారు చేసిన నివేదికలను ఆయనకు అందించారు. ప్రధానంగా ఎఫ్‌పీవోల విషయంలో తెలంగాణ రాష్ట్రం వెనుకంజలో ఉందని, ఇతర రాష్ట్రాల్లో ఎఫ్పీవోలు బలంగా పనిచేస్తున్నాయని గుర్తుచేశారు. కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులు ఆర్ధికంగా బలోపేతం కావడంలో ఎఫ్‌పీవోలు కీలకంగా పనిచేస్తున్నాయని చెప్పుకొచ్ౘ్ారు. రైతు కమిషన్ కేరళ, మహారాష్ట్రలోని నాసిక్‌లో పర్యటించిన సమయంలో ఎఫ్‌పీవోల ప్రభావం స్పష్టంగా కనిపించిందన్నారు. కేంద్రం కూడా ఎఫ్‌పీవోల ఏర్పాటుకు సానుకూలంగా వున్న విషయాన్ని కూడా సీఎంవో సెక్రెటరీ శేషాద్రికి కోదండరెడ్డి గుర్తుచేశారు. నాసిక్ లోని సహ్యాద్రి ఎఫ్ పీవో దేశంలోనే ఆదర్శంగా పనిచేస్తుందని వివరించారు. తెలంగాణలో కూడా ఎఫ్‌పీవోల ఏర్పాటులో ప్రభుత్వం చొరవ తీసుకుంటే బాగుంటాదన్నారు. అదేవిధంగా మార్కెటింగ్ వ్యవస్థ, కౌలు రైతు విధానాలపై కేరళ రాష్ట్రంలో అమలవుతున్న పాలసీలపై కమిషన్ రూపొందించిన నివేదికలను సైతం సీఎంవో సెక్రెటరీకి అందించారు.

Read More

మేలైన విత్తనాలను ఉత్పత్తి చేసి రైతులకు ఇవ్వాలి : రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విత్తనోత్పత్తి క్షేత్రాలపై రైతు కమిషన్ సమీక్ష సమావేశాన్ని ఈరోజు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాలో 8 చోట్ల సీడ్ ఫార్మ్ వున్నాయని, 1629 ఎకరాల్లో వున్న సీడ్ ఫార్మ్ లో వివిధ రకాల విత్తనాలను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విత్తనోత్పత్తి చేస్తున్నట్లు అధికారులు కమిషన్కు వివరించారు. ప్రధానంగా వరి, పెసర, జనుము, కందులు విత్తనోత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఐతే నకిలీ విత్తనాలను అరికట్టాలంటే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మరిన్ని మేలైన విత్తనాలను ఉత్పత్తి చేసి రైతులకు ఇవ్వాలని కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సూచించారు. అంతేకాదు విత్తనోత్పత్తి ని పెంచాలని దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇక విత్తనోత్పత్తి క్షేత్రాల భూములు అన్యాక్రాంతం కాకుండా హద్దులను ఏర్పాటు చేసుకొని చుట్టూ ఫెన్సింగ్ చేయాలనీ కోరారు. ఎక్కడైనా భూ సమస్యలు వున్న చోట.. ఆ విషయాలను అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తేవాలని సూచించారు. వ్యవసాయ శాఖకు చెందిన భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ సమావేశంలో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి , సభ్యులు కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, కమిషన్ మెంబర్ సెక్రెటరీ గోపాల్ తోపాటు వ్యవసాయశాఖ అడిషనల్ డైరెక్టర్ నర్సింగరావు, జాయింట్ డైరెక్టర్ సుచరిత, డీడీఏ నాగమల్లీశ్వరీ, ఏడీఏ ఉషారాణి, సీడ్ ఫార్మ్ కు చెందిన అగ్రికల్చర్ అధికారులు వైద్యనాధ్, సక్రియ నాయక్, ఇంద్రసేన్, అనిల్ కుమార్, వాసు తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read More