అమెరికా వాణిజ్య ఒప్పందంతో మన రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇలాంటి ఒప్పందాలు కుదుర్ౘ్ుకునే ముందు రైతుల ప్రయోజనాలు, దేశీయ ఉత్పత్తి స్థిరత్వం, ధరల రక్షణ, గ్రామీణ ఉపాధి వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించాలన్నారు. ‘మన దేశంలో చిన్న, సన్నకారు రైతులే అధికం. అమెరికాలో తక్కువ మంది రైతులు పెద్ద భూభాగాల్లో సాగు చేస్తున్నారు. వారితో మన రైతులు పోటీపడటం అసాధ్యం. ఇప్పటికే భారత్ పత్తి దిగుమతులపై 11% సుంకం తొలగించడంతో దేశీయ మార్కెట్లో పత్తి ధరలు గణనీయంగా పడిపోయాయి. భారత్-అమెరికా తాజా ఒప్పందం ఖరారు కాగానే సోయాచిక్కుడు ధరలు 10%, మొక్కజొన్న ధరలు 4% పడిపోయాయి. ఒప్పందం పూర్తయి సుంకాలు మరింత తగ్గితే పరిస్థితులు దుర్లభంగా మారతాయి” అని తుమ్మల అన్నారు.

13 Feb, 2026
అమెరికా వాణిజ్య ఒప్పందంతో రైతులు నష్టపోతారు
#AgriCrisisIndia, #AmericaVaanijyaOppandam, #CottonMarketCrash, #DesiAgriculture, #ImportDutyCut, #IndiaUSADeal, #MaizeRatesDrop, #ProtectRythulu, #RuralEmployment, #RythuLoss, #SaveIndianFarmers, #SmallFarmersMatter, #SoyabeanPricesDown, #TelanganaRythulu, #అమెరికావాణిజ్యఒప్పందం, #గ్రామీనఉపాధి, #చిన్నరైతులరక్షణ, #తుమ్మలనాగేశ్వరరావు, #తెలంగాణవ్యవసాయం, #దేశీయమార్కెట్, #పత్తిధరలు, #భారతఅమెరికాసంబంధాలు, #భారతవ్యవసాయం, #మొక్కజొన్నధరలు, #రైతులనష్టం, #రైతులహక్కులు, #వ్యవసాయసంక్షోభం, #సుంకాలతగ్గింపు, #సోయాబీన్ధరలు, agri news, Agriculture, Andhra Pradesh, natural farming, telangana, ఆంధ్రప్రదేశ్, తుమ్మల నాగేశ్వరరావు గారి వ్యాఖ్యలపై English + Telugu mixed hashtags: #USATradeDeal, తెలంగాణ
