యుద్ధం వలన తగ్గిన పసుపు ధర

పశ్చిమాసియాలో యుద్ధం వలన పసుపు ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు తగ్గుతూ క్వింటాకు రూ.4 వేలకు పైగా రైతు నష్టపోతున్నాడు. పసుపు విక్రయాలు అత్యధికంగా జరిగే ఆసియాలోని మార్కెట్లలో నిజామాబాద్ ఒకటి. ఇక్కడి యార్డులో కొనుగోలు చేసే పంటను విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఏటా ఫిబ్రవరి నుంచి పంట మార్కెట్‌కు వస్తుంది. 2024లో రూ.171 కోట్ల విలువైన 1.45 లక్షల టన్నుల పసుపును భారత్ ఎగుమతి చేసింది. ఇందులో నిజామాబాద్‌లో కొనుగోలు చేసే నాణ్యమైన సరకు కూడా ఉంది. ఈ ఏడాది యుద్ధ ప్రభావంతో గల్ఫ్, ఇతర దేశాలకు ఎగుమతులు నిలిచాయి. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల ట్రేడర్లు పంటను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు.

Read More

అమెరికా వాణిజ్య ఒప్పందంతో రైతులు నష్టపోతారు

అమెరికా వాణిజ్య ఒప్పందంతో మన రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇలాంటి ఒప్పందాలు కుదుర్ౘ్ుకునే ముందు రైతుల ప్రయోజనాలు, దేశీయ ఉత్పత్తి స్థిరత్వం, ధరల రక్షణ, గ్రామీణ ఉపాధి వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించాలన్నారు. ‘మన దేశంలో చిన్న, సన్నకారు రైతులే అధికం. అమెరికాలో తక్కువ మంది రైతులు పెద్ద భూభాగాల్లో సాగు చేస్తున్నారు. వారితో మన రైతులు పోటీపడటం అసాధ్యం. ఇప్పటికే భారత్ పత్తి దిగుమతులపై 11% సుంకం తొలగించడంతో దేశీయ మార్కెట్‌లో పత్తి ధరలు గణనీయంగా పడిపోయాయి. భారత్-అమెరికా తాజా ఒప్పందం ఖరారు కాగానే సోయాచిక్కుడు ధరలు 10%, మొక్కజొన్న ధరలు 4% పడిపోయాయి. ఒప్పందం పూర్తయి సుంకాలు మరింత తగ్గితే పరిస్థితులు దుర్లభంగా మారతాయి” అని తుమ్మల అన్నారు.

Read More