మంత్రి గొట్టిపాటి రవికుమార్
వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు రైతులు దరఖాస్తు చేసిన వెంటనే మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రా¢ష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డితో కలిసి మంగళవారం ఆయన విద్యుత్తుశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్డీఎసఎస్ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎం సూర్యఘర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. స్మార్ట్ మీటర్లపై ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందని స్పష్టం చేశారు.

