టమాటా ధర లేక ఉచిత పంపిణీ

టమాటాను అమ్ముకోలేక రైతులు ఉచితంగా పంపిణీ చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. తెలంగాణా రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో గూడూరు మండలం భూపతి పేటకు చెందిన పోగుల కొండ సారయ్య, మోహన్, సురేందర్ శుక్రవారం కొత్తగూడ సంతలో టమాటాని విక్రయానికి తీసుకొచ్ౘ్ారు. చిరువ్యాపారులకు ఇరవై కిలోల పెట్టెను రూ.100కు విక్రయించేందుకు ప్రయత్నించగా ఎవరూ కొనుగోలు చేయలేదు. కనీసం రూ.50కి కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో మహిళలందరికీ ఉచితంగా పంపిణీ చేశారు.

Read More

తెలంగాణాలో 12.68 లక్షల టన్నుల కూరగాయల కొరత

తెలంగాణ రాష్ట్ర అవసరాలకు ఏటా 27.22 లక్షల టన్నుల కూరగాయలు అవసరం. రాష్ట్రంలో సరాసరిన 1.35 లక్షల ఎకరాల్లో సాగయ్యే పంటల ద్వారా ఏడాదికి 14.54 లక్షల టన్నులే ఉత్పత్తి అవుతున్నాయి. అంటే 12.68 లక్షల టన్నుల లోటుంది. ఫలితంగా ఏటా 56% వరకు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీంతో ధరలు పెరిగి వినియోగదారులపై భారం పడుతోంది. కూరగాయల కొరతను అధిగ మించాలంటే… ఏడాదంతా కూరగాయల పంటలు సాగయ్యేలా ప్రత్యేక ప్రణాళిక అమలుచేయాలని కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అధిక వినియోగం ఉన్న రకాల సాగును ప్రోత్సహించాలని సూచించింది. రాష్ట్రంలో కూరగాయల కొరత, సాగు సాధ్యాసాధ్యాలపై ఉద్యాన వర్సిటీ ఇటీవల అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా నివేదిక సమర్పించింది. సాగు పెంపుదలకు అవసరమైన సిఫారసులు చేసింది.*సాగు పెంపుదలకు సిఫారసులు:* డిమాండ్ అంచనాలను అందుకోవాలంటే కూరగాయల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాలి. ఏడాదంతా సాగుచేసే ప్రణాళికలు అమలు చేయాలి. ప్రధానంగా టమాటా, వంగ, బెండ, క్యారెట్, క్యాబేజీ, దోస, కాలీఫ్లవర్, ముల్లంగి, ఉల్లి, ఆలుగడ్డ, ఆకుకూరలు, బీర, సొర, మిరప, కాకర, చిక్కుడు పంటల విస్తీర్ణం రెట్టింపు కావాలి. అధిక దిగుబడి ఇచ్చే సంకరజాతి రకాలను.., ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోగలిగిన, అధిక ఉత్పాదకత రకాలను అందుబాటులోకి తేవాలి. శీతల గిడ్డంగులు, నిల్వ వసతులతో మార్కెట్ యార్డులను సిద్ధం చేయాలి. ఎగుమతులను ప్రోత్సహించేందుకు వీలుగా శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో సమీకృత ప్యాక్ హౌస్ సిద్ధం చేయాలని సిఫారసులు చేయడం జరిగింది.

Read More

సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకానికి “ఫుడ్ బాస్కెట్” యాప్

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు పని చేస్తున్నారని, ఈ నెల 21న కృష్ణారావు పాలెం నాగసింధు స్పిన్నింగ్ మిల్లు ఆవరణలో నిర్వహించనున్న ఎన్‌టిఆర్ జిల్లా స్థాయి సేంద్రియ మేళాను విజయ వంతం చేయాలని రాష్ట్ర ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఆథారిటీ ఛైర్మన్ శావల దేవదత్ కోరారు. ఈ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను ఆయన గురువారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా ఉండడంతో వారికి సేంద్రియ వ్యవసాయం, ఎరువులు వినియోగంపై అవగాహన కల్పించడానికి ఈ మేళాను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు, అధికారులు వస్తున్నారని తెలిపారు. పాడి పరిశ్రమ, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తిదారులను ప్రోత్సహించడానికి కృష్ణా మిల్క్ యూనియన్ ముందుకొచ్చిందని, వీరు ఎన్‌టిఆర్ జిల్లాలో పండిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను సేకరించి ‘ఫుడ్ బాస్కెట్’ అనే యాప్ ద్వారా విక్రయిస్తారని వెల్లడించారు.

Read More

ఈకేవైసీకి గడువు పెట్టకూడదు

ఆంధ్రప్రదేశ్‌లో రీసర్వే పూర్తయిన 4,783 గ్రామాల్లో రాజముద్రతో కూడిన కొత్త పాసు పుస్తకాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 22.33 లక్షల పుస్తకాలు ముద్రించి, ఈ ఏడాది జనవరి 2 నుంచి 9 వరకు పంపిణీ చేశారు. తీరా వాటిలో రైతుల పేర్లు, విస్తీర్ణం, మొబైల్ నంబర్లలో తప్పులు దొర్లడం, చనిపోయిన వారి పేర్లతోనూ ముద్రించడంతో భూ యజమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో వాటన్నిటినీ సరిచేసి, తప్పుల్లేని పాసు పుస్తకాల్ని పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు.

ప్రతి నియోజకవర్గంలో రీసర్వే పూర్తయిన రెండు గ్రామాల్ని ఎంచుకుని తప్పులను సరిదిద్దాలని రెవెన్యూ శాఖ ఆదేశాలిచ్ౘ్ింది. దీని ప్రకారం రైతులకు నెల ముందు నుంచే భూముల వివరాలు తెలియజేసి, వారి ఈకేవైసీ తీసుకోవాలి. తర్వాతే పాసు పుస్తకాల ముద్రణకు పంపాలి. వాటిని ప్రతి నెలా 2వ తేదీ నుంచి 9వ తేదీ లోగా ప్రజాప్రతినిధులతో భూ యజమానులకు పంపిణీ చేయించాలి. ఫిబ్రవరిలో 280 గ్రామాల పరిధిలో 1.83 లక్షల పాసు పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకున్నారు. మార్ౘ్ిలోనూ ఇదేవిధంగా అందజేయాలని అధికారులు నిర్ణయించారు.

ఈకేవైసీకి గడువు పెట్టకూడదంటున్న రైతులు
ఎంపిక చేసిన గ్రామాల్లోని వీఆర్వోలు అక్కడి భూ యజమానులకు ముందుగా అన్ని వివరాలతో కూడిన ముసాయిదా పట్టాదారు పాసు పుస్తకాల కాపీలు అందించాలి. వాటిలో వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో ధ్రువీకరణ తీసుకోవాలి. మార్ౘ్ిలో పంపిణీ చేసే పట్టాదారు పాసు పుస్తకాలకు.. ఫిబ్రవరి 9వ తేదీ వరకే ఈకేవైసీకి అవకాశం ఇచ్ౘ్ారు. 10వ తేదీ నుంచి రైతులు అందుబాటులో ఉన్నా ఈకేవైసీ తీసుకోవడం లేదు. 9వ తేదీ తర్వాత యాప్ పనిచేయడం లేదని అధికారులు చెబుతున్నారు. మళ్లీ ఎప్పుడు ఈకేవైసీ తీసుకుని పాసు పుస్తకాలిస్తారని అడిగితే తమకేం తెలియదని చెబుతున్నారు.

తర్వాత నెలలో అదే నియోజకవర్గంలో రెండు గ్రామాల్ని ఎంపిక చేసుకుని, పంపిణీకి అవకాశం ఇస్తారు. కిందటి నెలలో పంపిణీ చేసిన గ్రామాల్లో మిగిలిన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకునే అవకాశం ఉండటం లేదు. అంటే వారికి 1బీ వివరాలు తెలియడం లేదు. తప్పులు సరిదిద్ది కొత్త పాసు పుస్తకాలిచ్ౘ్ే అవకాశం లేదు. దీంతో తప్పులు లేని పాసు పుస్తకాలు పంపిణీ చేయాలనే లక్ష్యం పూర్తిగా నెరవేరడం లేదు. నిర్దేశిత గడువు లేకుండా ఎప్పుడైనా ఈకేవైసీ తీసుకుని, పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్ౘ్ే విధానం అమలు చేయాలని భూ యజమానులు కోరుతున్నారు.
Read More

71.86 లక్షల టన్నుల ధాన్యం సేకరణ

తెలంగాణాలో ఖరీఫ్ 2025-26 సీజన్‌లో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మొత్తం 71.86 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందులో సన్నధాన్యం 39.08 లక్షల టన్నులు కాగా, దొడ్డు ధాన్యం 32.78 లక్షల టన్నులు. సన్న ధాన్యం రైతులకు క్వింటాకు రూ.500 అదనంగా చెల్లించారు. కొనుగోళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 8,448 కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. సాగు పెరగడంతో పాటు ఇటు పీపీసీలకు సన్నాలు భారీగా వచ్ౘ్ాయి. సేకరించిన ధాన్యంలో 71.83 లక్షల టన్నుల్ని పౌరసరఫరాల సంస్థ రైస్ మిల్లులకు తరలించింది. 0.03 లక్షల టన్నుల ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 7.49 లక్షల మంది రైతులు సన్న ధాన్యాన్ని విక్రయించగా.. ఇందులో 99.25% మంది అన్న దాతలకు ప్రభుత్వం సోమవారం నాటికి రూ.1,939.58 కోట్లను బోనస్‌గా అందించింది. మరో రూ.14.62 కోట్లు చెల్లించాల్సి ఉంది.

Read More

ఔషధ మొక్కల సాగుతో ఆర్థిక భరోసా

రాయలసీమ జిల్లా పర్యటనలో సిఈఓ చంద్రశేఖర్ఔషధ మొక్కల సాగుతో రైతులకు ఆర్థిక భరోసా ఖాయమని ఏలీ ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఈఓ) ఆవుల చంద్రశేఖర్ అన్నారు. వరుసగా మూడు రోజులపాటు రాయలసీమ జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటనలను విస్తృతంగా సాగించారు. తిరుపతి, అన్నమయ్య, శ్రీసత్యసాయి, అనంతపురము, కర్నూలు జిల్లాల రైతులతో ఆయన నేరుగా కలిసి మాట్లాడారు. కర్నూలు జిల్లాలో ఔషధ మొక్కలు సాగుచేస్తున్న పొలాలకు బుధవారం స్వయంగా వెళ్లి పరిశీలించారు. అధిక దిగుబడి సాధించిన రైతులను ప్రత్యేకంగా అభినందించారు. మార్కెటింగ్ అవకాశాలను, మెళకువలను వారికి వివరించారు. పలుచోట్ల ఔషధ తయారీ పరిశ్రమలను, కృషి విజ్ఞాన కేంద్రం, పరిశోధనాశాలలను సిఈఓ సందర్శించారు. బుధవారం ఉదయం అనంతపురము జిల్లా కసాపురంలో నెట్టికంటి ఆంజనేయస్వామి క్షేత్రాన్ని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కర్నూలు జిల్లా ఆలూరు, అత్తి బెళగల్, జోహారాపురం, మంత్రాలయం, బనవాసి లోని కృషి విజ్ఞాన కేంద్రంలో పర్యటించారు. ఆచార్య ఎన్.జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి విత్తన జన్యు పదార్థ కేంద్రము, అశ్వగంధ విత్తన ఉత్పత్తి నర్సరీలను పరిశీలించారు. ఆధునిక పద్ధతుల్లో వర్మీ కంపోస్ట్ తయారీని, తేనె ఉత్పత్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిఈఓ వెంట ఉప సిఈఓ ప్రదీప్, కార్తీక్, సమన్వయకర్త రాఘవేంద్ర చౌదరి, పలువురు అధికారులు, రైతులు వున్నారు. తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో ఇసుక, మట్టి, వేర్లను ఏపీఎంఏపీ బోర్డు సిఈఓ ఆవుల చంద్రశేఖర్ పరిశీలించారు. గుజరాత్ నుంచి తీసుకొచ్చిన వల్లభ రకం, అశ్వగంధ పంట అధిక దిగుబడి సాధించడం పట్ల రైతులను అభినందించారు. కర్నూలు జిల్లాలో సాగవుతున్న ఔషధపంట కోతకు వచ్చిన సమయంలో, పుష్టి ఎలా వుందని అడిగి తెలుసుకున్నారు. పంట దిగుబడిని గోదాముల్లో గల నిల్వచేయాలో వివరించారు.నూతన పరిశోధనలను కొనసాగించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధక విద్యార్థులను ప్రోత్సహించారు. జిల్లాలో కుసుమ పంట బాగా రావడంతో దాని ప్రయోజనాలను సిఈఓ చంద్రశేఖర్ ప్రత్యేకంగా వివరించారు. కుసుమ నూనె, పూలు, విత్తనాలు వైద్యానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. రక్త ప్రసరణ మెరుగుదల, రుతుస్రావం క్రమబద్ధీకరణ, చెడు కొవ్వు నియంత్రణ, గుండె జబ్బుల నివారణకు వాడతారని చెప్పారు. రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి చర్మవ్యాధుల చికిత్సకు, ఎముకల పటుత్వానికి, కీళ్లనొప్పుల నియంత్రణకు, రక్తశుద్ధికి, జ్వరం తగ్గడానికి ఇది పనికొస్తాయన్నారు.

Read More

మద్దతు ధరకు శనగల కొనుగోళ్లు

ఆంధ్రప్రదేశ్లో రబీలో 3.25 లక్షల హెక్టార్లలో శనగ సాగైందని.. సుమారు 3.77 లక్షల టన్నుల ఉత్పత్తి రావచ్చని, ఈరోజు నుంచి మద్దతు ధరకు శనగలు కొనుగోలు చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ‘2025-26 రబీ పంటకు సంబంధించి ధరల మద్దతు పథకం కింద 94,500 టన్నుల శనగ కొనుగోలుకు కేంద్రం నుంచి మంగళవారం ఆదేశాలు అందాయి. రైతులు తమ పరిధిలోని రైతు సేవా కేంద్రాల్లో సీఎం యాప్ పేర్లు నమోదు చేసుకుని పంట విక్రయించుకోవచ్చు కొనుగోలు చేసిన శనగలకు 15 రోజుల్లో నగదు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటాం’ అని మంత్రి వివరించారు.పూర్తి సమాచారం కోసం

Read More

ఆందోళనలో గోకులాల రైతులు

ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది 25 వేల గోకులాల నిర్మాణాలకు అనుమతులిచ్చారు. సొంత స్థలం ఉన్నా గోకులాలు నిర్మించుకునే స్థోమత లేని వారికి రూ.1.18 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 14 వేల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. దశలవారీగా వీటికి బిల్లులు కూడా చెల్లిస్తున్నారు. మిగిలిన నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు పోర్టల్లో అప్లోడ్ చేసేందుకు ఇప్పటి వరకు ఉన్న ఆప్షనన్ను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తొలగించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పేద రైతులను దృష్టిలో పెట్టుకుని బిల్లులు ఉపాధి హామీ పోర్టల్ అప్లోడ్ చేసే వెసులుబాటు కల్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రెండు రోజుల క్రితం లేఖ రాసింది.

Read More

మన దేశం సుగంధ ద్రవ్యాల సాగులో అగ్రగామిగా నిలవనుంది

స్పైసెస్ బోర్డుకు రూ.156.89 కోట్లు ఈసారి కేంద్ర బడ్ౙెట్‌లో కేటాయించారని, నిజామాబాద్‌లోని పసుపు బోర్డు కూడా దీని కిందకే వస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం ‘ఎక్స్ ’ ఖాతాలో పేర్కొన్నారు. సుగంధ ద్రవ్యాల (స్పైసెస్) సాగుకు దండిగా నిధులు కేటాయించడంతో దేశం వాటి ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవనుందన్నారు. దీంతో వ్యవసాయ ఆర్థికవ్యవస్థ పరుగులు పెట్టనుందని పేర్కొన్నారు.

Read More

అమెరికాతో వాణిజ్య ఒప్పందాల గురించి రైతు సంఘాల నాయకులతో రాహుల్ భేటీ

రైతు సంఘాల నాయకలతో లోక్‌సభలో విపక్షనేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్‌లో ఈ భేటీ జరిగింది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా, రైతులు, వ్యవసాయ కార్మికుల జీవనోపాధిని కాపాడటం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాల్సిన ఆవశ్యకతపై చర్చ జరిగినట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని రైతు సంఘాల నాయకులు వ్యతిరేకించారని, మొక్కజొన్న, సోయా, పత్తి సహా పండ్ల రైతుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని వారు ఆందోళన వ్యక్తంచేశారని తెలిపింది. ఈ సమావేశానికి అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుఖ్‌పాల్ సింగ్ ఖైరా, భారతీయ కిసాన్ మజ్దూర్ నేత అశోక్ బల్దారా, బీకేయూ క్రాంతికారి నాయకుడు బల్దేవ్ ఎస్.జీరా, కిసాన్ మజ్దూర్ మోర్చా నేత గుర్మీత్ సహా దేశంలోని పలువురు రైతు సంఘాల నేతలు హాజరయ్యారు.

Read More