మొక్కలలో పరాగ రేణువులు వ్యాప్తి చెందడానికి కీటకాలు ఎంతగానో తోడ్పడి దిగుబడి పెరుగుతుంది. అందుకోసమే ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయిలోని మొక్కజొన్న పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు ప్రత్యేక ఏర్పాట్లు చేసి కీటకాలను పెంచుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ గొట్టాల్లాంటి వెదురు పుల్లల్లో తుమ్మెద జాతి కీటకాలను ఉంచి, అవి గూళ్లు కట్టి, గుడ్లు పెట్టేలా చూస్తున్నారు. పంటలు పూత థకు వచ్చేసరికి అవి ఎగిరే థకు వస్తున్నాయి. తర్వాత ఆ మొక్క నుంచి ఈ మొక్క మీదకు వాలుతూ పరాగ సంపర్కానికి దోహదపడుతున్నాయి. రైతులు కూడా వ్యవసాయ క్షేత్రాల్లో వెదురుపుల్లలను అమర్చితే పంటలకు మేలుచేసే కీటకాలు వ్యాప్తి చెందుతాయని శాస్త్రవేత్త డాక్టర్ కె. మోహనరావు తెలిపారు.

22 Sep, 2025
మొక్కజొన్న పరిశోధనా కేంద్రంలో కీటకాల పెంపకం
#AgriInnovation, #AgriResearch, #AndhraPradeshFarming, #BeeFarming, #CornResearch, #DrMohanRao, #EluruAgriculture, #FarmerAwareness, #GoodInsects, #MokkajonnaVignanam, #NaturalFarming, #OrganicFarming, #Pedavegi, #PollinationSupport, #PollinatorInsects, #SustainableFarming, #TelanganaFarming, #Vijayarai, #కీటకాలపెంపకం, #తుమ్మెదలు, #పరాగసంపర్కం, #పరిశోధనామధ్య స్థానం, #మొక్కజొన్న, #రైతులపరిజ్ఞానం, #వెదురు, agri news, Agriculture, Andhra Pradesh, natural farming, telangana, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
