మూడు రోజుల క్రితం వరకు వెయ్యి కాయల ధర రూ.22 వేలు ఉండగా ఇప్పుడు రూ.23 వేల నుంచి రూ.24 వేలకు చేరింది. కోనసీమ మార్కెట్ చరిత్రలో ఇది అరుదైన రికార్డుగా చెబుతున్నారు. ప్రాంతాలను బట్టి కొందరు వ్యాపారులు ఈ ధరకు కొనుగోలు చేస్తున్నారు. కాయల పరిమాణం, నాణ్యత, బరువును బట్టి కొన్ని ప్రాంతాల్లో వెయ్యి పచ్చి కాయలు రూ.25 వేలకు చేరువలో ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ నెలలో కాయల పరిమాణం ఆశాజనకంగా ఉంటుంది. దీంతో వర్తకులు రైతుల వద్ద నుంచి ఇప్పుడే పెద్దఎత్తున కొని నిల్వ చేసుకుంటున్నారు. రానున్న దసరాకు మంచి ధర వస్తుందని ఆశిస్తున్నారు. దిగుబడులు సన్నగిల్లాయి. గతంలో ఎక రాకు వెయ్యి కాయలు వస్తే ఇప్పుడు సగానికి తగ్గిపోయి కొరత ఏర్పడింది. దీంతో రోజుల వ్యవధిలోనే ధరలో పెరుగుదల కనిపిస్తోంది. పొరుగు రాష్ట్రాలతో పాటు ఏపీలోని పలు జిల్లాలకు ఎగుమతులు జోరందుకున్నాయి.

3 Sep, 2025
వెయ్యి కాయలకు రూ.24 వేలు పలికిన పచ్చి కొబ్బరి కాయలు
#RawCoconut #CoconutPriceHike #Konaseema #AndhraFarmers #CoconutMarket #AgricultureNews #CropShortage #DasaraDemand #FarmersIncome #CoconutBusiness #AgriUpdates #MarketTrends #PriceIncrease, #అగ్రమార్కెట్, #ఆంధ్రప్రదేశ్, #కాయలధర, #కృషివార్తలు, #కృషివార్తలు #పచ్చికొబ్బరి, #కొబ్బరికాయలధర, #కోనసీమ, #దసరాసందడి, #ధరలవృద్ధి, #నిష్పత్తులతగ్గుదల, #పంటలకరువు, #పంటలధరలు, #పల్లెపంటలు, #రైతులు, #వాణిజ్యం, #విత్తనపంటలు, #వ్యాపారం, #వ్యాపారవృద్ధి, agri news, Agriculture, Andhra Pradesh, natural farming, telangana, ఆంధ్రప్రదేశ్
