ఆర్‌హెచ్‌బీ 273 పేరిట ప్రపంచంలోనే మొట్టమొదటి త్రివిధ సజ్జ సంకర (త్రీ వేపెర్ల్ మిల్లెట్ హైబ్రిడ్) రకాన్ని ఇక్రిశాట్, భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్), రాజస్థాన్ వ్యవసాయ పరిశోధన సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తాజాగా దానిని విడుదల చేశారు. సాధారణ హైబ్రిడ్ రకాలు రెండు మాతృకల నుంచి తయారైతే, ఈ త్రివిధ హైబ్రిడ్ మూడు మాతృకల కలయికతో రూపొందింది. అధిక దిగుబడి, నాణ్యమైన పశుగ్రాస లక్షణాలు చేకూరుతాయని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ హిమాన్ష్ పాఠక్, ప్రధాన శాస్త్రవేత్త ఎస్.కే. గుప్తా మంగళవారం వెల్లడించారు. త్రివిధ సజ్జ రకం.. ఏటా 400 మి.మీ. కంటే తక్కువ వర్షపాతం ఉండే రాజస్థాన్, గుజరాత్, హరియాణాల్లో మెట్ట ప్రాంతాలకు అనుకూలమైందన్నారు. దానిని మరింత అభివృద్ధి చేసి ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తామన్నారు. ఈ సజ్జ సగటున హెక్టారుకు 2,230 కిలోల దిగుబడి వచ్చిందన్నారు.

21 Jan, 2026
త్రివిధ సజ్జతో అనేక ప్రయోజనాలు
#raithunestham news, #అధికదిగుబడి, #ఆహారభద్రత, #ఇక్రిశాట్, #ఐకార్, #తక్కువవర్షపాతం, #త్రివిధసజ్జ, #పశుగ్రాసపంట, #పెర్ల్‌మిల్లెట్, #పోషకాహారం, #భారతవ్యవసాయం, #మిల్లెట్స్, #మిల్లెట్స్ఇండియా, #మెట్టప్రాంతవ్యవసాయం, #రైతులకుమేలు, #వర్షాధారపంటలు, #వ్యవసాయనవీనత, #వ్యవసాయపరిశోధన, #సజ్జపంట, #సుస్థిరవ్యవసాయం, #హైబ్రిడ్సజ్జ, agri news, Agriculture, Andhra Pradesh, natural farming, telangana, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
