బయోచార్ నాణ్యత ప్రమాణాలు

ప్రమాణం:
మంచి నాణ్యత గల బయోచార్ లక్షణం

రంగు:
నల్లని లేదా ముదురు నలుపు

ఉదజని సూచిక: 6.5–9.5

సేంద్రియ కార్బన్: 60% కంటే ఎక్కువ

స్థిర కార్బన్: 50-80%

తేమ: 10% కంటే తక్కువ

బూడిద శాతం: 20% కంటే తక్కువ (ముడి పదార్థాన్ని బట్టి మారవచ్చు)

C:N నిష్పత్తి: 25:1 కంటే ఎక్కువ (సాధారణంగా 30:1–100:1)

నిర్మాణం: తేలికగా, ఎక్కువ సూక్ష్మ రంధ్రాలు కలిగి ఉండాలి

కణ పరిమాణం: పొలంలో ఉపయోగానికి చిన్న ముక్కలు లేదా పొడి రూపంలో ఉండాలి

హానికర పదార్థాలు: ప్లాస్టిక్, రబ్బరు, పాలిథిన్, భారీ లోహాలు, రసాయన అవశేషాలు లేకుండా ఉండాలి

ప్రయోగశాల పరీక్షల ద్వారా ఉదజని సూచిక, సేంద్రియ కార్బన్, స్థిర కార్బన్ వంటి ప్రమాణాలను నిర్ధారించవచ్చు. రైతు స్థాయిలో మాత్రం నల్లని రంగు, తక్కువ బూడిద, తేలికైన రంధ్రాల నిర్మాణం మరియు హానికర పదార్థాలు లేకపోవడం మంచి నాణ్యత గల బయోచార్‌కు ముఖ్యమైన సూచికలుగా పరిగణించవచ్చు.

డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921

Read More

వివిధ బయోచార్ తయారీ పద్ధతుల పోలికలు

బయోచార్ అనేది పంట అవశేషాలు, చెట్ల కొమ్మలు, ఎండిన ఆకులు, కొబ్బరి చిప్పలు, ఇతర సేంద్రియ వ్యర్థాలను పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో 250-700°C ఉష్ణోగ్రత వద్ద వేడి చేసే పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా తయారయ్యే కార్బన్ అధికంగా ఉండే నల్లని ఘన పదార్థం. సాధారణంగా పంట అవశేషాలను బహిరంగంగా కాల్చితే వాటిలోని కార్బన్, గాలిలో కార్బన్ డయాక్సైడ్ రూపంలో విడుదలవుతుంది. కానీ బయోచార్ తయారీ సమయంలో కార్బన్‌లో ఎక్కువ భాగం స్థిర రూపంలో నిల్వ ఉండి, తరువాత నేలలో కలిపినప్పుడు వందల నుంచి వేల సంవత్సరాల వరకు స్థిరంగా నిలిచి సేంద్రియ కార్బన్ నిల్వను పెంచుతుంది. అలాగే నేల నిర్మాణాన్ని మెరుగుపరచి, నీటిని మరియు పోషకాలను నిల్వ ఉంచే సామర్థ్యాన్ని పెంచుతుంది. బయోచార్‌లోని సూక్ష్మ రంధ్రాలు ఉపయోగకరమైన సూక్ష్మజీవులకు అనుకూల నివాసంగా పనిచేసి నేల జీవక్రియలను చురుకుగా ఉంచుతాయి.

పద్ధతి: గొయ్యి పద్ధతి
పెట్టుబడి: చాలా తక్కువ
సామర్థ్యం: తక్కువ
ప్రధాన లక్షణాలు: పొగ ఎక్కువ, నాణ్యత మధ్యస్థం, చిన్న రైతులకు అనుకూలం
ప్రయోజనాలు: పరికరం అవసరం లేదు
పరిమితులు: ఆక్సిజన్ నియంత్రణ కష్టం

పద్ధతి: డ్రమ్ (200 లీ)
పెట్టుబడి: తక్కువ
సామర్థ్యం: 20-60 కిలోలు/బ్యాచ్
ప్రధాన లక్షణాలు: పొగ తక్కువ, నాణ్యత అధికo, చిన్న రైతులకు అనుకూలం
ప్రయోజనాలు: తక్కువ ఖర్చు, సులభ నిర్వహణ
పరిమితులు: సామర్థ్యం తక్కువ

పద్ధతి: TLUD కిల్న్
పెట్టుబడి: మధ్యస్థం
సామర్థ్యం: మధ్యస్థం
ప్రధాన లక్షణాలు: పొగ చాలా తక్కువ, నాణ్యత అధికo, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అనుకూలం
ప్రయోజనాలు: అధిక కార్బన్ నిల్వ
పరిమితులు: ప్రత్యేక కిల్న్ అవసరం

పద్ధతి: కాన్-టికీ కిల్న్
పెట్టుబడి: మధ్యస్థం – ఎక్కువ
సామర్థ్యం: 0.1-1.0 టన్ను/బ్యాచ్
ప్రధాన లక్షణాలు: పొగ చాలా తక్కువ, నాణ్యత అత్యుత్తమం
ప్రయోజనాలు: అధిక ఉత్పత్తి, తక్కువ కాలుష్యం
పరిమితులు: పెట్టుబడి, శిక్షణ అవసరం

పద్ధతి: ఇటుకల కిల్న్
పెట్టుబడి: ఎక్కువ
సామర్థ్యం: అధికం
ప్రధాన లక్షణాలు: పొగ తక్కువ, నాణ్యత అధిక, గ్రామ కేంద్రాలకు అనుకూలం
ప్రయోజనాలు: పెద్ద మొత్తంలో ఉత్పత్తి
పరిమితులు: స్థిర నిర్మాణం అవసరం

పద్ధతి: ఇక్రిశాట్/ భోపాల్ పోర్టబుల్ యూనిట్
పెట్టుబడి: మధ్యస్థం
సామర్థ్యం: మధ్యస్థం
ప్రధాన లక్షణాలు: పొగ చాలా తక్కువ, నాణ్యత అధిక, చిన్న రైతులు/ రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అనుకూలం
ప్రయోజనాలు: తరలించవచ్చు
పరిమితులు: పరిమిత లభ్యత

డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921

Read More

పురుగులు, తెగుళ్ళ నియంత్రణలో ఉపయోగపడే వావిలాకు కషాయం

పంటపొలాల చుట్టూ ప్రకృతిలో దొరికే వివిధ రకాల ఆకులను ఉడకపెట్టడం ద్వారా కషాయాలను తయారు చేస్తారు. ఇది మన సంప్రదాయ వ్యవసాయంలో భాగం. ఆకులను ఉడకపెట్టడం వలన అందులో ఉండే మూల పదార్థాలు పూర్తి స్థాయిలో ద్రావణంలో చేరి కషాయం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. పంటల సస్యరక్షణలో ఈ కషాయాలు అనాదిగా రైతులకు తెలిసినవే. ఇందులో ముఖ్యంగా వావిలాకు కషాయం రైతులకు వివిధ పంటలలో పురుగుల నియంత్రణ కొరకు ఉపయోగపడుతుంది.

వావిలాకులో సహజంగా ఉండే ఎన్నో రకాల ‘ఆల్కలాయిడ’ల వలన ఇది పురుగుల నియంత్రణలో మరియు తెగుళ్ళ నియంత్రణలో ఉపయోగపడుతుంది.

వావిలాకు కషాయాన్ని పంటలలో వచ్చే రసం పీల్చే పురుగులపైన, చిన్న దశలలో ఉన్న లద్దె పురుగు, శనగపచ్చ పురుగు, ఆకులను తినే పురుగులపై వాడవచ్చు.

వావిలాకులో “నిర్ణుడిన” మూల పదార్థంగా ఉండడం వలన ఇది పురుగులను స్పర్శ చర్య ద్వారా మరియు పొగ చర్య ద్వారా నియంత్రించడంలో ఉపయోగ పడుతుంది.

వావిలాకును వైద్యంలో ఉపయోగిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అలాగే వావిలాకు ఆకులు వ్యవసాయంలో సస్యరక్షణలో కూడా ఉపయోగపడుతున్నవి. ఇది పురుగులకు అభివృద్ధి నిరోధకంగా మరియు క్రిమిసంహారకంగా పనిచేస్తుంది.

కావలసిన పదార్థాలు:
వావిలాకు : 5 కిలోలు
సబ్బు పొడి : 100 గ్రాములు (లేదా)
కుంకుడుకాయలు : 500 గ్రాములు

తయారు చేసే విధానం:

  • ఈ ఆకులను 10 లీటర్ల నీటిలో అరగంట నుండి గంట సేపు బాగా ఉడకబెట్టాలి. ఈ విధంగా ఉడకబెట్టిన కషాయం సుమారు 5 లీ. వరకు ఉంటుంది.
  • ఒక కర్రతో ఉడుకుతున్న కషాయాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
  • కషాయాన్ని బాగా చలార్చి, పలుచని గుడ్డతో వడపోయాలి.
  • కషాయానికి 100 గ్రా. సబ్బుపొడిని లేదా 500 గ్రా. కుంకుడుకాయ రసాన్ని కలపాలి.
  • ఈ కషాయానికి 100 లీటర్ల నీటిని చేర్చి ఒక ఎకరాకు సాయంత్రం వేళ పంటపై పిచికారీ చేయాలి.

జాగ్రత్తలు:

  • వావిలాకు కషాయం తయారు చేసేటపుడు ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి.
  • పంట కాలంలో పంట దశను మరియు పురుగు ఉధృతిని బట్టి 2-3 సార్లు పిచికారీ చేసుకోవచ్చు.
  • తయారు చేసిన కషాయాన్ని నిల్వ ఉంచరాదు.

ఉపయోగాలు:

  • వావిలాకు కషాయాన్ని అన్ని పంటలలో వచ్చే పురుగుల నియంత్రణలో వాడవచ్చు.
  • పంట తొలిదశలో (30 – 45 రోజులు) సుమారు 100 లీ. ద్రావణం ఒక ఎకరాకు సరిపోతుంది. పంట (60 నుండి 90 రోజులు) మధ్య దశలో సుమారు 150 లీ. ద్రావణం మరియు పంట చివరి దశలో (90-120 రోజులు) సుమారు 200 లీ. ద్రావణం ఒక ఎకరాకు అవసరం పడుతుంది.
  • వావిలాకు కషాయం వేరుశనగలో వచ్చే తామర పురుగు, మిరపలో వచ్చే ఆకుముడత, కూరగాయ పంటలను ఆశించే రసం పీల్చే పురుగుల నియంత్రణలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.
  • వావిలాకు కషాయం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పంటలపై పిచికారీ చేయాల్సి ఉంటుంది.
  • పురుగుల తొలిదశలో వావిలాకు కషాయం బాగా పనిచేస్తుంది.
Read More

గేదె పదేపదే ఎదకు వస్తోందా? గర్భం నిలవకపోవడానికి కారణాలు – రైతులు ఏం చేయాలి?

గేదె ఎదకు వచ్చింది… కృత్రిమ గర్భధారణ (AI) చేయించారు… కానీ గర్భం నిలవకుండా మళ్లీ ఎదకు వచ్చింది. మరోసారి కృత్రిమ గర్భధారణ చేయించినా అదే పరిస్థితి. ఇలా పదేపదే జరిగితే రైతుకు ఖర్చు పెరగడమే కాకుండా, రెండు ఈతల మధ్య కాలం పెరిగి పాల ఉత్పత్తి మరియు ఆదాయంపై కూడా ప్రభావం పడుతుంది.

గేదె సాధారణంగా ఎదకు వస్తున్నప్పటికీ, సరైన సమయంలో మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు కృత్రిమ గర్భధారణ చేయించినా గర్భం దాల్చకపోతే దీనిని రిపీట్ బ్రీడింగ్ (Repeat Breeding) అంటారు.

దీనికి ఒకే కారణం ఉండదు. ఎదను సరిగ్గా గుర్తించకపోవడం, కృత్రిమ గర్భధారణ సమయం తప్పడం, ప్రసవం తర్వాత గర్భాశయ సమస్యలు, సమతుల్య ఆహారం అందకపోవడం, ఖనిజలవణాల లోపం వంటి అనేక కారణాలు ఉండవచ్చు. అందువల్ల గర్భం నిలవడం లేదని పదేపదే కృత్రిమ గర్భధారణ చేయించడం కాకుండా, అసలు కారణాన్ని గుర్తించి దానికి తగిన చర్యలు తీసుకోవడం ముఖ్యం.

ఎదను సరిగ్గా గుర్తించండి
గేదెల్లో ఎద లక్షణాలు ఆవులతో పోలిస్తే కొన్నిసార్లు స్పష్టంగా కనిపించవు. ముఖ్యంగా రాత్రి లేదా తెల్లవారుజామున ఎదకు వస్తే రైతు గమనించకుండా పోయే అవకాశం ఉంటుంది. ఎదను సరిగ్గా గుర్తించకపోతే కృత్రిమ గర్భధారణ చేయించే సమయం కూడా తప్పిపోవచ్చు.

అందుకే ఉదయం, సాయంత్రం గేదెలను కొద్దిసేపు ప్రత్యేకంగా గమనించండి. ఇతర గేదె ఎక్కినప్పుడు కదలకుండా నిలబడటం ఎదకు ముఖ్యమైన లక్షణం. ఇతర పశువులపై ఎక్కడానికి ప్రయత్నించడం, యోని నుంచి పారదర్శకమైన జిగట స్రావం రావడం, తరచుగా మూత్రం పోయడం, సాధారణం కంటే ఎక్కువగా తిరుగుతూ ఉండటం, తోకను ఎత్తడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.

అయితే ఒక్క లక్షణాన్ని చూసి ఎదకు వచ్చిందని నిర్ణయించకుండా, రెండు మూడు లక్షణాలను కలిపి గమనించడం మంచిది.

రైతులకు సూచన: ఎద లక్షణాలు మొదట కనిపించిన తేదీతో పాటు సమయాన్ని కూడా రాసిపెట్టండి. సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించడానికి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది.
సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించండి

ఎదను గుర్తించడం ఎంత ముఖ్యమో, సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించడం కూడా అంతే ముఖ్యం. చాలా ముందుగా లేదా ఆలస్యంగా కృత్రిమ గర్భధారణ చేయిస్తే గర్భం దాల్చే అవకాశం తగ్గవచ్చు.
రైతులు సులభంగా గుర్తుంచుకోవడానికి సాధారణంగా ఉదయం ఎద స్పష్టంగా కనిపిస్తే అదే రోజు సాయంత్రం, సాయంత్రం ఎద కనిపిస్తే మరుసటి రోజు ఉదయం కృత్రిమ గర్భధారణ చేయించడం అనుసరించే పద్ధతి.
ఎద ఎప్పుడు మొదలైందో స్పష్టంగా తెలియకపోతే ఊహించి సమయం నిర్ణయించకుండా, శిక్షణ పొందిన కృత్రిమ గర్భధారణ సిబ్బంది లేదా పశువైద్యుని సలహా తీసుకోవడం మంచిది.

ముఖ్య సూచన: గర్భం నిలవలేదని వెంటనే మరోసారి కృత్రిమ గర్భధారణ చేయించడమే పరిష్కారం కాదు. ముందుగా ఎదను సరిగ్గా గుర్తించామా, కృత్రిమ గర్భధారణ సరైన సమయంలో జరిగిందా అనే విషయాలను పరిశీలించాలి.

ప్రసవం తర్వాత ఆరోగ్యాన్ని గమనించండి
కొన్ని గేదెల్లో రిపీట్ బ్రీడింగ్ సమస్యకు కారణం గత ప్రసవం తర్వాతే మొదలవుతుంది. ప్రసవం తర్వాత గర్భాశయం మళ్లీ ఆరోగ్యకరమైన స్థితికి రావాలి. మాయ పడటం ఆలస్యం కావడం, గర్భాశయంలో ఇన్ఫెక్షన్ రావడం వంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తే తరువాత గర్భం దాల్చడంపై ప్రభావం పడవచ్చు.

ప్రసవం తర్వాత గేదెను జాగ్రత్తగా గమనించండి. మాయ పడటం ఆలస్యమైనా, దుర్వాసనతో కూడిన లేదా అసాధారణమైన స్రావం వచ్చినా నిర్లక్ష్యం చేయకండి. జ్వరం, ఆకలి తగ్గడం లేదా బాగా నీరసంగా కనిపించడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పశువైద్యుని సంప్రదించాలి.

ఇలాంటి సమస్యలను తొలిదశలోనే గుర్తించి చికిత్స చేయిస్తే తరువాత వచ్చే పునరుత్పత్తి సమస్యలను తగ్గించుకోవచ్చు.

సమతుల్య ఆహారం అందించండి
గేదెకు కడుపు నిండా మేత ఇవ్వడం మాత్రమే సరిపోదు. పాల ఉత్పత్తితో పాటు గర్భం దాల్చడానికి కూడా అవసరమైన పోషకాలు తగినంతగా అందాలి. పచ్చిమేత, ఎండుమేత, దాణా సరైన పరిమాణంలో అందకపోవడం లేదా పాలిచ్చే గేదెకు అవసరమైన పోషకాలు తగినంతగా అందకపోవడం వల్ల పశువు క్రమంగా బలహీనపడవచ్చు. ఇది ఎదకు రావడం మరియు గర్భం దాల్చడంపై కూడా ప్రభావం చూపవచ్చు.

అందువల్ల మంచి నాణ్యత గల పచ్చిమేత, ఎండుమేతతో పాటు పాల ఉత్పత్తికి అనుగుణంగా దాణా ఇవ్వాలి. ఎల్లప్పుడూ శుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి. గేదె క్రమంగా బలహీనపడుతున్నట్లు లేదా బక్కగా అవుతున్నట్లు కనిపిస్తే కేవలం దాణా పరిమాణం పెంచడం కాకుండా, రోజువారీ ఆహారంలో అవసరమైన పోషకాలు సమతుల్యంగా అందుతున్నాయా అనే విషయాన్ని కూడా పరిశీలించాలి.

ముఖ్య సూచన: పాలిచ్చే గేదెకు తగినంత మేతతో పాటు, అవసరమైన పోషకాలు సమతుల్యంగా అందేలా చూడటం ముఖ్యం.

ఖనిజలవణాలపై శ్రద్ధ పెట్టండి
మేత బాగానే ఇస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో పశువుకు అవసరమైన ఖనిజలవణాలు తగినంత అందకపోవచ్చు. ఖనిజలవణాల లోపం పశువుల సాధారణ ఆరోగ్యంతో పాటు పునరుత్పత్తి పనితీరును కూడా ప్రభావితం చేయవచ్చు.

అందువల్ల రోజువారీ ఆహారం సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే పశువైద్యుడు లేదా పశుపోషణ నిపుణుడి సలహా మేరకు మంచి నాణ్యత గల ఖనిజలవణ మిశ్రమం (Mineral Mixture) ఇవ్వాలి. పదేపదే గర్భం దాల్చని గేదెల్లో పోషకాహారం లేదా ఖనిజలవణాల లోపం ఉందేమో కూడా పరిశీలించడం మంచిది.

గర్భాశయ సమస్యలను నిర్లక్ష్యం చేయకండి
బయటకు గేదె ఆరోగ్యంగానే కనిపించినా కొన్ని సందర్భాల్లో గర్భాశయంలో సమస్య ఉండవచ్చు. ముఖ్యంగా ప్రసవం తర్వాత వచ్చిన ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గకపోతే తరువాత గర్భం దాల్చడంపై ప్రభావం చూపవచ్చు.
దుర్వాసనతో కూడిన లేదా అసాధారణమైన స్రావం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే సొంతంగా మందులు వాడకుండా పశువైద్యుని సంప్రదించాలి. పలుమార్లు కృత్రిమ గర్భధారణ చేయించినా గర్భం దాల్చకపోతే గర్భాశయం మరియు ఇతర పునరుత్పత్తి అవయవాల్లో ఏదైనా సమస్య ఉందా, ఎద సక్రమంగా వస్తోందా, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అనే విషయాలను పశువైద్యునితో పరీక్ష చేయించాలి.

జాగ్రత్త: గర్భం దాల్చడం లేదని సొంతంగా హార్మోన్ ఇంజెక్షన్లు, యాంటీబయాటిక్స్ లేదా ఇతర మందులు వాడకండి. కారణాన్ని గుర్తించిన తర్వాత పశువైద్యుని సూచన మేరకే చికిత్స చేయించాలి.
పదేపదే కృత్రిమ గర్భధారణ చేయించకుండా కారణాన్ని తెలుసుకోండి

ఒకసారి కృత్రిమ గర్భధారణ చేసిన తర్వాత గర్భం దాల్చకపోవచ్చు. కానీ సరైన సమయంలో మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు కృత్రిమ గర్భధారణ చేయించినా గర్భం దాల్చకపోతే మరోసారి కృత్రిమ గర్భధారణ చేయించడమే పరిష్కారం కాదు.

అలాంటి గేదెను పశువైద్యునికి చూపించి గర్భం నిలవకపోవడానికి అసలు కారణం ఏమిటో తెలుసుకోవాలి. గర్భాశయ సమస్యలు, ఇన్ఫెక్షన్లు, ఎదకు సంబంధించిన సమస్యలు, పోషకాహార లోపాలు లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో పరీక్ష చేయించాలి.

కారణాన్ని బట్టి చికిత్స చేయించడం లేదా ఆహారం, నిర్వహణలో అవసరమైన మార్పులు చేసుకోవడం మంచిది. ఇలా అసలు కారణాన్ని గుర్తిస్తే అనవసరంగా పదేపదే కృత్రిమ గర్భధారణ చేయించే ఖర్చు మరియు సమయాన్ని తగ్గించుకోవచ్చు.

పునరుత్పత్తి వివరాలను రాసిపెట్టండి
ఒక చిన్న నోట్‌బుక్ కూడా రైతుకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి గేదెకు సంబంధించిన ప్రసవ తేదీ, ఎద వచ్చిన తేదీ మరియు సమయం, కృత్రిమ గర్భధారణ చేసిన తేదీ మరియు సమయం, ఎన్నవసారి కృత్రిమ గర్భధారణ చేశారు, గర్భ నిర్ధారణ వివరాలు రాసిపెట్టాలి.

ఇలా రికార్డు ఉంచితే గేదె ఎప్పుడు ఎదకు వచ్చింది, ఎప్పుడు కృత్రిమ గర్భధారణ చేశారు, ఎన్నిసార్లు కృత్రిమ గర్భధారణ చేశారు అనే విషయం ఇంట్లో ఎవరికైనా సులభంగా తెలుస్తుంది. రైతు ఇంట్లో లేకపోయినా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఈ వివరాలు చూసి అవసరమైనప్పుడు గేదెను పశువైద్యశాలకు తీసుకెళ్లవచ్చు. పశువైద్యునికి ఈ రికార్డు చూపిస్తే గత వివరాలు వెంటనే తెలుసుకొని, సమస్యను గుర్తించి సరైన సలహా ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది.

గేదె పదేపదే ఎదకు వస్తున్నా గర్భం దాల్చకపోతే అనవసరంగా మళ్లీ మళ్లీ కృత్రిమ గర్భధారణ చేయించకండి. ఎదను సరిగ్గా గమనించడం, సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ చేయించడం, సమతుల్య ఆహారం అందించడం, ప్రసవం తర్వాత వచ్చే సమస్యలకు సమయానికి చికిత్స చేయించడం ద్వారా గర్భధారణ అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు. అయినప్పటికీ సమస్య కొనసాగితే ఆలస్యం చేయకుండా పశువైద్యునికి చూపించి కారణాన్ని తెలుసుకోవడం మంచిది.

Dr.గడ్డం రాధిక, పశువైద్య అధికారి
P.V.C. ఉప్పరపల్లి, వరంగల్
Dr. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం
పశువైద్య కళాశాల, కోరుట్ల. Ph: 7093198419

Read More

భోపాల్ పోర్టబుల్ బయోచార్ యూనిట్ తో బయోచార్ తయారీ

భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) ఆధ్వర్యంలోని కేంద్ర వ్యవసాయ ఇంజనీరింగ్ సంస్థ (ICAR-CIAE), భోపాల్ శాస్త్రవేత్తలు పంట అవశేషాలను బయోచార్‌గా మార్చేందుకు చిన్న స్థాయి మరియు పైలట్ స్థాయి బయోచార్ యూనిట్లను అభివృద్ధి చేశారు. పైలట్ ప్లాంట్‌లో ఒక్క సారి సుమారు 300 కిలోల పంట అవశేషాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉంది. ఇందులో బయోమాస్‌ను ఇంధనంగా ఉపయోగించి రియాక్టర్‌ను పరోక్షంగా వేడి చేస్తారు. బ్లోయర్ సహాయంతో దహన ప్రక్రియను కొనసాగిస్తారు. ఫర్నేస్‌ను అగ్నినిరోధక ఇటుకలతో నిర్మించగా, ఉష్ణోగ్రత సుమారు 350°C వరకు చేరుతుంది. ఈ విధానంలో సుమారు 33% బయోచార్ లభిస్తుంది. ఈ యూనిట్ ధర సుమారు రూ. 2.0-2.5 లక్షలు.

ఈ సాంకేతికత ద్వారా పంట అవశేషాలను బహిరంగంగా కాల్చకుండా నాణ్యమైన బయోచార్‌గా మార్చి, నేల సేంద్రియ కార్బన్‌ను పెంచడంతో పాటు గాలి కాలుష్యాన్ని తగ్గించవచ్చు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOలు), కస్టమ్ హైరింగ్ కేంద్రాలు మరియు గ్రామీణ వ్యవసాయ సేవా కేంద్రాల ద్వారా ఈ యూనిట్ల వినియోగాన్ని విస్తరించడం ద్వారా స్థిరమైన, వాతావరణ అనుకూల వ్యవసాయాన్ని ప్రోత్సహించవచ్చు.

డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921

Read More

పేనుబంక, పచ్చ దోమ నివారణకు పొగాకు కషాయం

పంటపొలాల చుట్టూ ప్రకృతిలో దొరికే వివిధ రకాల ఆకులను ఉడకపెట్టడం ద్వారా కషాయాలను తయారు చేస్తారు. ఇది మన సంప్రదాయ వ్యవసాయంలో భాగం. ఆకులను ఉడకపెట్టడం వలన అందులో ఉండే మూల పదార్థాలు పూర్తి స్థాయిలో ద్రావణంలో చేరి కషాయం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. పంటల సస్యరక్షణలో ఈ కషాయాలు అనాదిగా రైతులకు తెలిసినవే. ఇందులో ముఖ్యంగా పొగాకు కషాయం రైతులకు వివిధ పంటలలో పురుగుల నియంత్రణ కొరకు ఉపయోగపడుతుంది.

  • పొగాకులో “నికోటిన్” మూలపదార్థంగా ఉండడం వలన ఇది పురుగులను స్పర్శ చర్య ద్వారా నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.
  • పొగాకు కషాయం పంటలలో వచ్చే పేనుబంక, పచ్చ దోమ, తెల్లదోమ నివారణకు ఉపయోగపడుతుంది.

కావలసిన పదార్ధాలు
పొగాకు రద్దు : 1 కిలో (చిన్నచిన్న ఆకులు, కాడలు మొ॥)
సబ్బు పొడి : 100 గ్రాములు (లేదా)
కుంకుడు కాయలు : 500 గ్రాములు

తయారు చేసే విధానం

  • పొగాకు రద్దును 10 లీటర్ల నీటిలో అరగంట నుండి గంట సేపు బాగా ఉడక బెట్టాలి. ఈ విధంగా ఉడకబెట్టిన ద్రావణం సుమారు 5 లీ. వరకు ఉంటుంది.
  • కషాయాన్ని ఒక కర్రతో కలియబెడుతూ ఉండాలి.
  • కషాయాన్ని బాగా చల్లార్చి, పలుచని గుడ్డతో వడపోయాలి.
  • కషాయానికి 100 గ్రాముల సబ్బుపొడినిగానీ లేదా అరకిలో కుంకుడుకాయల రసాన్ని కానీ కలపాలి.
  • పై కషాయానికి 100 లీటర్ల నీటిని చేర్చి, ఒక ఎకరా పొలంలో సాయంత్రం వేళ పిచికారీ చేయాలి.

జాగ్రత్తలు:

  • పొగాకు కషాయం తయారు చేసేటపుడు ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి.
  • పొగాకు కషాయం పిచికారి చేసేటపుడు వంటిపై పూర్తిగా బట్టలు ధరించాలి.
  • పంట కాలంలో ఒకటి, రెండు సార్లు మాత్రమే అవసరాన్ని బట్టి పంటపై పిచికారీ చేయాలి.
  • ఎక్కువ సార్లు పిచికారీ చేసిన ఎడ… పంటలను ఆశించి వుండే రైతుమిత్ర పురుగులు చనిపోయే ప్రమాదం ఉంది.
  • తయారు చేసిన ద్రావణాన్ని వెంటనే ఉపయోగించాలి. కషాయాన్ని నిల్వ ఉంచరాదు.
Read More

పశువైద్యులకు దైవసేవ చేసే అపూర్వ అవకాశంగోసేవతో పాటు కుటుంబానికి శ్రీవారి దర్శన భాగ్యం – నా అనుభవం

పశువైద్యులుగా మనకు లభించిన విద్య, అనుభవం, నైపుణ్యాలను మూగజీవుల ఆరోగ్యం కోసం ఉపయోగించడం ఒక గొప్ప బాధ్యత. అదే సేవను కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో గోసేవగా అందించే అవకాశం లభిస్తే, అది ఒక వృత్తిపరమైన అనుభవం మాత్రమే కాదు—జీవితాంతం గుర్తుండిపోయే ఆధ్యాత్మిక అనుభూతి.

తిరుమల తిరుపతి దేవస్థానములు (TTD) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “శ్రీవారి వైద్య సేవ (Sri Vari Vaidya Seva)” పశువైద్యులకు అలాంటి అపూర్వమైన అవకాశాన్ని కల్పిస్తోంది.

శ్రీవారి సన్నిధిలో పశుసేవ – ఒక గొప్ప భాగ్యం

  • శ్రీవారి వైద్య సేవ ద్వారా పశువైద్యులు TTD ఆధ్వర్యంలోని గోశాలల్లో పశువులకు వైద్య సేవలు అందించే అవకాశం పొందుతున్నారు.
  • పశువైద్య వృత్తిలో మనం ప్రతిరోజూ పశువులకు చికిత్స చేస్తూనే ఉంటాం. అయితే, తిరుమల శ్రీవారి సన్నిధిలో, గోమాతలకు సేవ చేయడం మన వృత్తికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక పరిమళాన్ని అందిస్తుంది.
  • “గోసేవ – గోవింద సేవ” అనే భావనతో పనిచేస్తూ, గోమాత ఆరోగ్య పరిరక్షణలో మన వంతు పాత్ర పోషించడం ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది. శ్రీవారి వైద్య సేవకు ప్రొఫైల్ నమోదు
    ఈ సేవలో పాల్గొనాలనుకునే అర్హత కలిగిన పశువైద్యులు ముందుగా TTD వెబ్‌సైట్/యాప్ ద్వారా తమ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
    సాధారణంగా అవసరమైన వివరాలు/పత్రాలలో:
    ✅ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
    ✅ UG Degree Certificate
    ✅ PG Degree / PG Diploma Certificate
    ✅ VCI Registration Card
    ✅ Biodata / CV ఉంటే అదనంగా
    వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన విషయం
ఈ సేవకు అవసరమైన అర్హతలను ముందుగానే పరిశీలించుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా PG Degree లేదా PG Diploma అర్హత, సంబంధిత రిజిస్ట్రేషన్ తదితర TTD నిబంధనలకు అనుగుణంగా ఉండాలి.
ప్రొఫైల్ నమోదు అనంతరం గోశాల డైరెక్టర్ అనుమతి పొందిన తరువాతే సేవా స్లాట్‌ను బుక్ చేసుకునే ప్రక్రియ కొనసాగుతుంది.

నా శ్రీవారి వైద్య సేవ అనుభవం

  • ఇటీవల నాకు కూడా శ్రీవారి వైద్య సేవలో పాల్గొనే అవకాశం లభించింది.
  • ముందుగా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, ఆగస్టు 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు శ్రీవారి వైద్య సేవలో పాల్గొనడం జరిగింది.
  • ఈ సేవా కాలంలో నాతో పాటు డా. జి. శ్రీనివాసులు రెడ్డి గారు, సహాయ సంచాలకులు, పశుసంవర్ధక శాఖ, వైఎస్ఆర్ కడప జిల్లా కూడా పాల్గొని, కలిసి సేవలందించడం మరింత ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చింది.
  • ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు పశువైద్య అధికారులు కలిసి, తమ వృత్తిపరమైన అనుభవాన్ని ఉపయోగించి శ్రీవారి గోసంరక్షణ కార్యక్రమంలో సేవ చేయడం మాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగించింది.

శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో సేవ

  • శ్రీవారి వైద్య సేవలో భాగంగా శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో పశువుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి, అవసరమైన వైద్య సేవలు అందించే అవకాశం లభించింది.
  • గోశాలలో పశువుల నిర్వహణ, పరిశుభ్రత, మేత, పశువైద్య సేవలు, జాతుల సంరక్షణ తదితర అంశాలను దగ్గరగా పరిశీలించాను.
    అక్కడ:
    🐄 గిర్
    🐄 సాహివాల్
    🐄 కంక్రేజ్
    🐄 రెడ్ సింధీ
    🐄 ఒంగోలు
    🐄 పుంగనూరు
    వంటి అనేక విలువైన దేశీయ గో జాతులను చూడగలిగాము.
    జాతుల వారీగా ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేసి నిర్వహించడం, పాలిచ్చే పశువులు, గర్భిణీ పశువులు, పొడి పశువులు, దూడలకు ప్రత్యేక నిర్వహణ చేయడం ఎంతో అభినందనీయం.

వసతి మరియు భోజన సదుపాయాలు

  • శ్రీవారి వైద్య సేవలో పాల్గొనే పశువైద్యులకు TTD కల్పిస్తున్న సదుపాయాలు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయి.
  • మాకు వేదిక్ విశ్వవిద్యాలయంలోని వశిష్ఠ అతిథి గృహంలో వసతి ఏర్పాటు చేశారు.
  • అదేవిధంగా పద్మావతి వసతి గృహంలో టిఫిన్, భోజనం, డిన్నర్ వంటి ఆహార సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు.
  • సేవ చేయడానికి వచ్చిన వైద్యులకు వసతి, భోజనం వంటి ప్రాథమిక అవసరాల గురించి ఆందోళన లేకుండా, సేవపై పూర్తి దృష్టి పెట్టేలా ఈ ఏర్పాట్లు ఎంతో ఉపయోగపడ్డాయి.
  • అంతేకాకుండా గోశాల మరియు వసతి గృహాల మధ్య రాకపోకల కోసం ఒక కారును కూడా TTD ఏర్పాటు చేసింది.
  • ఈ రవాణా సదుపాయం వల్ల ప్రతిరోజూ నిర్ణీత సమయానికి గోశాలకు చేరుకోవడం, సేవ పూర్తయిన తరువాత వసతి గృహానికి తిరిగి రావడం ఎంతో సౌకర్యవంతంగా జరిగింది.
  • TTD అందించిన ఈ సదుపాయాలు సేవలో పాల్గొన్న వైద్యులకు ఎంతో సహాయకరంగా నిలిచాయి.

వైద్య సేవలో పొందిన అనుభవం
శ్రీవారి వైద్య సేవలో భాగంగా వివిధ రకాల పశువైద్య కేసులను పరిశీలించి చికిత్స అందించే అవకాశం లభించింది.
ముఖ్యంగా:
🔹 గర్భ నిర్ధారణ (Pregnancy Diagnosis – PD)
🔹 మావి నిలిచిపోవడం (Retained Placenta)
🔹 గర్భాశయ వాపు / గర్భాశయ ఇన్ఫెక్షన్ (Endometritis)
🔹 పునరుత్పత్తి సంబంధిత సమస్యలు
🔹 మళ్లీ మళ్లీ గర్భం దాల్చకపోవడం (Repeat Breeding)
🔹 కాళ్లు మరియు కీళ్లకు సంబంధించిన సమస్యలు
🔹 గాయాలకు చికిత్స మరియు నిర్వహణ
🔹 వ్యాధి నివారణ మరియు ఆరోగ్య పరిరక్షణ చర్యలు
🔹 గాలికుంటు వ్యాధి (FMD) టీకాలు
🔹 నులిపురుగుల నివారణ / నులిపురుగుల మందులివ్వడం (Deworming)
🔹 పోషకాహార లోపాలు మరియు సంబంధిత సమస్యలు
వంటి అంశాలలో సేవలందించగలిగాము.

కొన్ని రిటెయిన్‌డ్ ప్లాసెంటా మరియు ఎండోమెట్రైటిస్ కేసుల్లో అవసరమైన చికిత్స, గర్భాశయానికి తగిన విధంగా చికిత్సా చర్యలు మరియు సహాయక చికిత్స అందించడం జరిగింది.

అదేవిధంగా డ్రై మరియు మిల్క్ జంతువులలో Pregnancy Diagnosis (PD) నిర్వహించి, పునరుత్పత్తి స్థితిని అంచనా వేయడం జరిగింది.

గాలికుంటు వ్యాధి టీకాలు కూడా పశువులకు అందించే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఇలాంటి కేసుల ద్వారా పశువైద్య సేవను అందించడంతో పాటు, ఒక పెద్ద స్థాయి గోశాలలో జరుగుతున్న శాస్త్రీయ పశు నిర్వహణను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభించింది.

శాస్త్రీయ మేత నిర్వహణ – ఒక మంచి అనుభవం

  • గోశాలలో మేత నిర్వహణ కూడా క్రమబద్ధంగా ఉంది.
  • పాలిచ్చే పశువులకు ఉత్పత్తి అవసరాలకు అనుగుణంగా కాన్సంట్రేట్ ఫీడ్ అందించడం, పొడి మేతను అందించడం, మధ్యాహ్నం సూపర్ నేపియర్ పచ్చిమేత ఇవ్వడం గమనించాము.
  • చాఫ్ కట్టర్ ఉపయోగించి పచ్చిమేతను తరిగి అందించడం వల్ల మేత వృథా తగ్గడం, పశువులు సులభంగా మేత తీసుకోవడం వంటి ప్రయోజనాలు కనిపించాయి.
  • అదేవిధంగా దేశీయ గో జాతుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో ఆకట్టుకుంది.

గోశాలతో పాటు ఆలయ ఏనుగుల సంరక్షణ

  • ఈ సేవలో భాగంగా తిరుచానూరు గోశాల మరియు అమ్మవారి ఆలయానికి చెందిన ఏనుగులను కూడా పరిశీలించే అవకాశం లభించింది.
  • ఏనుగుల నిర్వహణ, షెడ్ల పరిశుభ్రత, పాదాల ఆరోగ్యం వంటి అంశాలను పరిశీలించడం జరిగింది.
  • ఏనుగుల పాదాల వద్ద గాయం/సమస్య కనిపించిన సందర్భంలో అవసరమైన చికిత్సా సలహాలు మరియు నిర్వహణ సూచనలు ఇవ్వడం జరిగింది.
  • గోమాతలతో పాటు ఆలయ ఏనుగులకు కూడా ఆరోగ్య పరిరక్షణ అందించడం ద్వారా ఈ సేవ మరింత విస్తృతమైన పశుసేవగా అనిపించింది.
  • ఈ సేవలో నాకు మరో ప్రత్యేకమైన అనుభూతి డా. జి. శ్రీనివాసులు రెడ్డి గారు, సహాయ సంచాలకులు, పశుసంవర్ధక శాఖ, వైఎస్ఆర్ కడప జిల్లాతో కలిసి సేవ చేయడం.
  • ఇద్దరం కలిసి గోశాలలోని పశువుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి, అవసరమైన వైద్య సేవలను అందించాము.
  • వృత్తిపరమైన అనుభవాలను పంచుకుంటూ, వివిధ కేసులపై చర్చించుకుంటూ, గోశాల నిర్వహణను పరిశీలిస్తూ గడిపిన ఈ రోజులు మాకు ఎంతో విలువైన అనుభవాన్ని అందించాయి.
  • శ్రీవారి సన్నిధిలో ఇద్దరు పశువైద్యులు కలిసి గోసేవ చేయడం మా వృత్తి జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

పశుసేవతో పాటు కుటుంబానికి శ్రీవారి దర్శన భాగ్యం

  • శ్రీవారి వైద్య సేవలో నాకు అత్యంత ఆనందాన్ని కలిగించిన అంశాలలో ఒకటి కుటుంబ సభ్యులకు కూడా తిరుమల శ్రీవారి దర్శనం పొందే అవకాశం.
  • పశువైద్యునిగా మనం ఎప్పుడూ విధుల్లో నిమగ్నమై ఉంటాం. కుటుంబంతో కలిసి తిరుమల వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ, వృత్తిపరమైన బాధ్యతలు, సమయాభావం వంటి కారణాల వల్ల అనేక సందర్భాల్లో అది సాధ్యం కాదు.
  • అలాంటి సమయంలో శ్రీవారి వైద్య సేవ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది.

నేను శ్రీవారి సన్నిధిలో గోసేవ చేస్తుంటే…
నా కుటుంబ సభ్యులు శ్రీవారి దర్శనం చేసుకుని ఆనందాన్ని పొందడం…
ఈ అనుభూతి మాటల్లో చెప్పలేనిది.
ఒక పశువైద్యునికి సేవా సంతృప్తి, కుటుంబ సభ్యులకు శ్రీవారి దర్శన ఆనందం—రెండూ ఒకేసారి లభించడం ఈ కార్యక్రమం ప్రత్యేకత.

Break Darshan – ఒక ప్రత్యేకమైన అవకాశం
సేవా కాలాన్ని పూర్తిచేసిన పశువైద్యులకు TTD నిబంధనలకు అనుగుణంగా Break Darshan అవకాశం కల్పించడం ఈ సేవలో మరో ప్రత్యేకత.
సేవలో పాల్గొనే ముందు తాజా TTD నిబంధనలు, అర్హతలు, దర్శన విధానం, ఛార్జీలు మరియు కుటుంబ సభ్యులకు వర్తించే నియమాలను తప్పనిసరిగా అధికారికంగా నిర్ధారించుకోవాలి.
కానీ ఆ అవకాశం లభించినప్పుడు, పశుసేవ అనంతరం కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకోవడం నిజంగా ఒక మరపురాని అనుభూతి.

TTDకి హృదయపూర్వక కృతజ్ఞతలు
పశువైద్యులకు సేవ చేసే అవకాశం కల్పించడమే కాకుండా, వసతి, భోజనం, రవాణా వంటి సదుపాయాలను ఏర్పాటు చేసి, వైద్యులు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవ చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించిన తిరుమల తిరుపతి దేవస్థానముల యాజమాన్యానికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

ముఖ్యంగా గోశాల డైరెక్టర్, పశువైద్య అధికారులు, వెటర్నరీ అసిస్టెంట్లు, అటెండర్లు మరియు సిబ్బంది అందరూ ఎంతో సహకారంతో పనిచేయడం అభినందనీయం.
వారి సమన్వయం, పశువుల పట్ల శ్రద్ధ, గోశాల పరిశుభ్రత మరియు నిర్వహణ తీరు ఎంతో ఆకట్టుకున్నాయి.

ప్రతి పశువైద్యుడు ఒక్కసారైనా ఈ సేవలో పాల్గొనాలి
నా అనుభవం ఆధారంగా, అర్హత కలిగిన ప్రతి పశువైద్య మిత్రుడు తన జీవితంలో కనీసం ఒక్కసారైనా శ్రీవారి వైద్య సేవలో పాల్గొనాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.
ఇది కేవలం ఒక సేవా కార్యక్రమం కాదు.
ఇది—
🐄 గోసేవ
🩺 వైద్య సేవ
🙏 దైవ సేవ
👨‍👩‍👧‍👦 కుటుంబ ఆనందం
🌺 శ్రీవారి దర్శన భాగ్యం
📚 వృత్తిపరమైన అనుభవం
అన్నీ కలిసిన ఒక అపూర్వమైన అనుభవం.
పశువైద్యునిగా మనం సంపాదించిన జ్ఞానాన్ని ఒక మూగజీవి ఆరోగ్యానికి ఉపయోగించడం గొప్ప విషయం. అదే జ్ఞానాన్ని శ్రీవారి సన్నిధిలో గోమాతల సేవకు వినియోగించే అవకాశం రావడం మరింత గొప్ప అదృష్టం.

ముగింపుగా…
శ్రీవారి వైద్య సేవ అనేది కేవలం పశువైద్య సేవ కాదు…
ఇది పశుసేవతో ప్రారంభమై, దైవసేవగా మారే పవిత్రమైన ప్రయాణం.
మన చేతులతో గోమాతకు వైద్యం అందిస్తూ…
మన హృదయంతో శ్రీవారిని స్మరిస్తూ…
మన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల క్షేత్రంలో ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదిస్తూ…
“గోవిందా… గోవిందా…” అని పలకడం—
ఒక పశువైద్యుని జీవితంలో నిజంగా మరచిపోలేని అనుభూతి.
పశువులకు మన వైద్యం – శ్రీవారికి మన సేవ – కుటుంబానికి శ్రీవారి దర్శనం.
ఈ మూడు కలిసిన చోటే శ్రీవారి వైద్య సేవ యొక్క అసలైన గొప్పతనం.
🌺 గోసేవ – గోవింద సేవ 🌺
🩺 పశుసేవ – పరమ సేవ 🩺
🙏 శ్రీవారి సన్నిధిలో సేవ – అపూర్వమైన భాగ్యం 🙏
🌺 గోవింద… గోవింద… 🌺
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏

– డా. జి. రాంబాబు

Read More

ఔషధ మొక్క… చామంతిపూలు

కలెండ్యులా ఒక తక్కువ కాలం జీవించే, సువాసన గల బహువార్షిక హెర్బల్ మొక్క. 80 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. నిటారుగా పెరిగే కొమ్మలు కలిగి ఉంటుంది. ఆకులు కోడిగుడ్డు ఆకారంబల్లెం ఆకారంలో, 5-17 సెం.మీ. పొడవుండి, రెండువైపులా నూగు కలిగి ఉంటాయి. పూలు సంవత్సరం పొడవునా ఏర్పడతాయి. ఇన్‌ఫ్లోరెసెన్స్ పసుపు రంగులో ఉంటుంది. పూగుత్తి 4-7 సెంమీ. వ్యాసం కలిగి ఉంటుంది. కాయలు ముళ్ళు కలిగి ఉండి వంగిన ఏకిన్.

సాధారణ నామం : కలెండ్యులా శాస్త్రీయ నామం : కలెండ్యులా అఫిసినాలిస్ కుటుంబం: కాంపోజిటె

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • కలెండ్యులాని గొంతునొప్పి, నోటివాపు చికిత్సలో ఉపయోగిస్తారు. క్యాన్సర్, కడుపులోని డుయోడినల్ అల్సర్స్ చికిత్సలో ఉపయోగిస్తారు.
  • నొప్పులు తగ్గడానికి కలెండ్యులా పేస్టుని చర్మంపై పూస్తారు. గాయాలు, కాలిపుండ్లు మానడానికి ఉపయోగిస్తారు.
  • కలెండ్యులా టింక్చర్లు, ఆయింట్‌మెంట్లను కాలిన ప్రదేశాలు, గాయాలు, తెగినచోట త్వరగా మానడానికి ఉపయోగిస్తారు. ఇవి గాయమున్న చోటికి రక్తాన్ని ప్రసరింపజేసి చర్మం కొత్త కణాలేర్పరుచుకోవడానికి దోహదపడతాయి. పిల్లల్లో చెవి ఇన్‌ఫెక్షన్స్ మానడానికి కలెండ్యులా చుక్కలను చెవిలో వేస్తారు. డెర్మటైటిస్ నివారణలో ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • కల్యెండ్యులా ఇథనాల్ ద్రావణం (30 మైక్రోమీటర్లు/మి.లీ.) లోని రసాయనాలు తామర పురుగులు, త్రిప్స్‌టబాసిపై అత్యధిక విషచర్యను ప్రదర్శించాయి. (నజ్‌మిజాడే, అతని అనుచరులు, 2013).
  • క్యలెండ్యులా ద్రావణం పిచికారి చేసిన ట్రీట్‌మెంట్‌లో వెస్టర్న్‌ఫ్లవర్ త్రిప్స్ పిల్ల పురుగులు అరికట్టబడ్డాయి (రజావి అండ్ అహ్మరి, 2016) కిచెన్ గార్డెన్‌లో ఆకులు తినే పురుగులను, ఆస్పరాగస్ బీటిల్స్, టమాట కొమ్ము పురుగులను నివారించడానికి పురుగు మందు తయారు చేసుకుని వాడవచ్చు.

పురుగు మందు తయారు చేసే విధానం :

  • ఒక కప్పు (225 గ్రా.) కలెండ్యులా ఆకులను నూరి 500 మి.లీ. నీటితో కలపాలి. 24 గంటలు నానబెట్టాలి. పలుచని గుడ్డ ద్వారా వడపోయాలి. దీనికి 1.5 లీ. నీటిని కలిపి తర్వాత 5 మి.లీ. (1/4 చెంచా) లిక్విడ్‌సోప్ కలిపి మొక్కలపై పిచికారి చేయాలి.
  • కలెండ్యులా ఆకులు, పూల ద్రావణాలు స్పోడోప్టెరా లిటూర పోషక ఫిజియాలజీని మార్పు చేసి చంపుతాయి. అందువలన కలెండ్యులా ద్రావణాన్ని వృక్ష సంబంధ పురుగు మందుగా ఉపయోగించవచ్చు. (మెథిని, ఆమె అనుచరులు, 2012).
  • కలెండ్యులా ఇథనాల్ ద్రావణం ఆల్బినో ఎలుక, రాటస్ నార్‌జికస్‌పై అధిక విషప్రభావాన్ని చూపింది (అబూహషెమ్, 2012).
  • కలెండ్యులా మొక్క పైభాగాల ద్రావణం క్యాబేజి బటర్‌ఫ్లెå, పొటాటో బీటిల్ పై యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది (వార్ౙినియాక్, 2002).
  • కలెండ్యులా మొక్కలో సెస్కిటెర్పిన్లు, ఫ్లావనాయిడ్స్, ట్రైటెర్పినాయిడ్ సపోనిన్±్స, ట్రైటెర్పిన్ ఆల్కహాల్స్ ఉంటాయి (అహ్మద్, అతని అనుచరులు, 1993).
  • కలెండ్యులా ద్రావణాలు స్పోడోప్టెరా లిటూర పెరుగుదల, ఫిజియాలజీపై అనేక ప్రభావాలను చూపుతాయి. అధిక గాఢత వద్ద లార్వాల పెరుగుదల, ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. బహుశ టెర్పిన్లు లార్వాలు తిన్న ఆహారం జీర్ణమయి, గ్రహించకుండా జోక్యం కలిగించుకుని ఉంటాయి (మెథిని, ఆమె అనుచరులు, 2009).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఇక్రిశాట్ పోర్టబుల్ బయోచార్ యూనిట్ తో బయోచార్ తయారీ

వ్యవసాయ వ్యర్థాల నిర్వహణకు తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారంగా అంతర్జాతీయ మెట్ట పరిశోదన కేంద్రం శాస్త్రవేత్తలు, చిన్న రైతుల కోసం సులభంగా తరలించగల పోర్టబుల్ బయోచార్ యూనిట్ ను అభివృద్ధి చేశారు. ఈ యూనిట్‌ను నేరుగా పొలంలోనే ఉపయోగించవచ్చు. పంట అవశేషాలను ఒకచోట చేర్చి బహిరంగంగా కాల్చే బదులు, నియంత్రిత ఆక్సిజన్ పరిస్థితుల్లో పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా నాణ్యమైన బయోచార్‌గా మార్చవచ్చు. ఈ సాంకేతికత తక్కువ ఖర్చుతో పనిచేయడమే కాకుండా, చిన్న రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, స్వయం సహాయక సంఘాలు సులభంగా వినియోగించేలా రూపొందించబడింది.

ఈ యూనిట్‌లో తయారైన బయోచార్ నాణ్యత ప్రయోగశాలలో తయారైన బయోచార్‌కు సమానంగా ఉన్నట్లు పరిశోధనల్లో నిర్ధారించబడింది. బయోచార్‌లో స్థిర కార్బన్ శాతం అధికంగా ఉండటం వల్ల నేలలో సేంద్రియ కార్బన్ పెరుగుతుంది, నీటి నిల్వ సామర్థ్యం మెరుగుపడుతుంది, నేల ఆరోగ్యం బలపడుతుంది. అదే సమయంలో పంట అవశేషాల దహనం తగ్గి, గాలి కాలుష్యం మరియు హరితగృహ వాయువుల ఉద్గారాలు తగ్గుతాయి. ఈ వికేంద్రీకృత సాంకేతికత ద్వారా పంట అవశేషాలను “వ్యర్థం నుంచి విలువైన వనరుగా ” మార్చి, స్థిరమైన వ్యవసాయం మరియు వాతావరణ అనుకూల వ్యవసాయానికి తోడ్పడవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921

Read More

ఇ.ఎం. ఉత్పత్తులు

  1. హరియాలి : దీనిని కంపోస్టు తయారీలో ఉపయోగిస్తారు. క్షేత్ర వ్యర్థాలు, ఆవుపేడ, పందిపెంట, కోళ్ళ చెత్త, వ్యర్థాలు, కొబ్బరిపీచు, ఘనసేంద్రియ వ్యర్థాలనుపయోగించి 45-50 రోజుల్లో కంపోస్టు తయారు చేయవచ్చు. అన్ని రకాల ఆహార పంటలు, కూరగాయల సాగులో ఉపయోగించవచ్చు.
  2. బొకాషి: బొకాషి అంటే పులిసిన ఎరువు. దీనిని భూమిలో వేస్తే పంట అవశేషాలు, దుబ్బులు చివికిపోవడానికి సహాయపడుతుంది.

మోతాదు : ఎకరానికి 15-20 కిలోలు అన్ని రకాల ఆహార పంటలు, కూరగాయల సాగులో ఉపయోగించవచ్చు.

  1. టెర్మిన్ : దీనిని సేంద్రియ పురుగు వికర్షిణిగా ఉపయోగించవచ్చు. 3-4 మి.లీ. టెర్మిన్ లీటరు నీటికి కలిపి పంటలపై 10-12 రోజుల వ్యవధిలో పిచికారి చేసి రసం పీల్చే పురుగులు, శిలీంద్ర తెగుళ్ళు, బాక్టీరియా తెగుళ్ళను నివారించవచ్చు.
  2. ప్రైమో :
  • దీనిని మొక్కల పెరుగుదల వృద్ధి చేయడానికుపయోగిస్తారు.
  • కూరగాయల పంటలలో 3-5 మి.లీ. ఒక లీటరు నీటికి చొప్పున కలిపి 7-10 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.
  • ఉత్పత్తుల దిగుబడి, నాణ్యత పెరుగుతాయి.
  • పూత, పిందె రాలుట తగ్గుతుంది.
  1. ఇ.యం. రిచ్ : సేంద్రియ ఎరువు, భూసారవృద్ధికి తోడ్పడుతుంది.
  2. ఇ.యం. పవర్ : సేంద్రియ ఎరువు.
Read More