మొక్కజొన్న కొనుగోళ్లలో కలెక్టర్లకు పూర్తి అధికారాలు

సచివాలయంలో మొక్కజొన్నల కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించి, రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లలో వేగం పెంచాలని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. దీనిపై జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇస్తున్నామని, వారు హమాలీ, రవాణా, గన్నీ బ్యాగులు, గోదాములు వంటి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సూచించారు. అన్ని ఉమ్మడి జిల్లాల్లో కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగేలా ప్రత్యేకాధికారులను నియమించినట్లు తెలిపారు. ‘ఇప్పటికే రూ.1650 కోట్లతో 1.22 లక్షల మంది రైతుల నుంచి 6.74 లక్షల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేశాం. అకాల వర్షాల దృష్ట్యా కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకొని, మార్క్‌ఫెడ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. కొనుగోళ్లు, రవాణాను సత్వరమే పూర్తి చేయాలి. రవాణాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నోడల్ అధికారితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలి. రైతులు గన్నీ బ్యాగులను సొంతంగా తెచ్చుకుంటే దానికి సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేస్తుంది’ అని తుమ్మల సూచించారు.
మంత్రి ఆదేశాల మేరకు మొక్కజొన్న కొనుగోళ్ల పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్‌లను ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్, కరీంనగర్-బి. గోపి, మెదక్, ఖమ్మం- రాహుల్రాజ్, మహబూబ్ నగర్, రంగారెడ్డి-యాస్మీన్ బాషా, నల్గొండ, ఆదిలాబాద్ -కె. చంద్రశేఖర్ రెడ్డి, నిజామాబాద్‌కు కొర్రా లక్ష్మిలను నియమించింది. రవాణా శాఖ తరఫున మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్‌కు నోడల్ అధికారి బాధ్యతలు అప్పగించింది.

Read More

పత్తి రైతులకు వరం ‘కాటన్ ప్రొడక్టివిటీ మిషన్‌

కేంద్ర కేబినెట్ కాటన్ ప్రొడక్టివిటీ మిషన్‌కు రూ.5,659.22 కోట్ల వ్యయంతో ఆమోదం తెలపడం దేశంలోని పత్తి రైతులకు వరం లాంటిదని భాజపా తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. “ఈ మిషన్ పత్తి ఉత్పాదకతను పెంచడంతో పాటు, ప్రపంచ టెక్స్‌టైల్ మార్కెట్‌లో భారతదేశ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. పంట క్షేత్రం నుంచి విదేశాల వరకు (ఫాం టు ఫారిన్) అనే లక్ష్యానికి అనుగుణంగా రైతులు, పరిశ్రమ, సాంకేతికత ఎగుమతులను అనుసంధానిస్తుంది. సుమారు 32 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చే దిశగా ఈ మిషన్ కొనసాగుతుంది అని రామచందర్రావు అన్నారు.

Read More

అధిక దిగుబడిని ఇచ్చే కూరగాయల విత్తనోత్పత్తి

అధిక దిగుబడులు ఇచ్చే కూరగాయల విత్తనాల ఉత్పత్తిని తతెలంగాణా రాష్ట్రంలో త్వరలోనే చేపట్టనున్నట్లు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ దండా రాజిరెడ్డి తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రాలు, రైతు ఉత్పత్తి సంస్థల ద్వారా కూరగాయ పంటల్లో ఈ విత్తనోత్పత్తి ప్రారంభించేందుకు ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు. శుక్రవారం ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర పరిశోధన, విస్తరణ మండలి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ‘రాష్ట్రాన్ని ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దెందుకు ప్రభుత్వం కార్యాచరణకు పూనుకుంది. సాంకేతికత, ఆధునికత, యాంత్రీకరణ ద్వారా కూరగాయల సాగుకు ఊతమిస్తున్నాం. జీవ ఎరువులు, పురుగు మందుల లభ్యత పెంచుతాం. పంట నష్టాలను నివారించేందుకు వాతావరణ ఆధారిత ఉద్యాన సలహాలు ఎప్పటికప్పుడు అందిస్తాం” అని రాజిరెడ్డి తెలిపారు.

Read More

రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల

తెలంగాణలో 45,11,947 మంది రైతుల ఖాతాల్లో రూ.2206 కోట్లు రైతు భరోసా రెండో విడత కింద మంగళవారం జమయ్యాయి. గత నెల 23న సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా మొదటి విడతలో ఎకరం వరకు భూమి ఉన్న 68,89,955 మందికి, తాజాగా సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూర్పల్లిలో సీఎం రెండో విడతలో రెండు ఎకరాల వరకు భరోసా నిధులను విడుదల చేశారు. గత రెండు విడతల్లో కలిపి ఇప్పటివరకు రైతు భరోసా కోసం రూ.5,653 కోట్లు విడుదల కాగా మొత్తం 71.06 లక్షల మంది రైతులు లబ్ది పొందారని మంత్రి వివరించారు. రైతు భరోసాలో ఇప్పటివరకు నల్గొండ జిల్లాలో 5,40,693 మంది రైతులకు రూ.448.09 కోట్లు, ఖమ్మం జిల్లాలో 3,45,142 మందికి రూ. 271.52 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 3,66,343 మందికి రూ.271.05 కోట్లు, సిద్దిపేట జిల్లాలో 3,28,818 మందికి రూ.246.30 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 2,98,352 మందికి రూ.236.49 కోట్లు జమయ్యాయి.

Read More

విడుదలైన వెంటనే రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు

రైతుభరోసా రెండో విడత నిధులు రైతుల ఖాతాల్లో విడుదలైన వెంటనే జమ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రైతుభరోసాపై ఆదివారం తన నివాసంలో వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లిలో సోమవారం సీఎం చేతుల మీదుగా 45,11,947 మంది రైతులకు మొత్తం 36,76,766 ఎకరాల కోసం రూ.2,206.06 కోట్ల విడుదలకు సంబంధించిన సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ సహా రాష్ట్రంలోని అన్ని బ్యాంకులకు తెలియజేయాలని సూచించారు. సీఎం నిధులను విడుదల చేయగానే ఆ నిధులు అర్హులైన రైతుల ఖాతాల్లో వెంటనే జమ కావాలన్నారు. మొదటి విడతలో కొన్ని బ్యాంకులు రైతుల ఖాతాలను నిలిపివేయడం వల్ల వారికి నిధులు అందలేదని, ఈసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలన్నారు.

శనగ, పొద్దుతిరుగుడు కొనుగోళ్లపై పరిమితి ఎత్తివేయాలి*మొక్కజొన్న పంటను నాఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు కేంద్రం ముందుకు రావాలని, శనగ, పొద్దుతిరుగుడు పంటలపై ఉన్న 25 శాతం పరిమితిని ఎత్తివేసి పూర్తిగా కొనుగోలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఆదివారం లేఖ రాశారు. ‘పంటలకు మద్దతు ధరల ప్రకటనకే కేంద్రం పరిమితమవుతోంది. మద్దతు ధరకు మార్కెట్ ధరకు భారీ వ్యత్యాసం వల్ల రైతులకు నష్టం వాటిల్లుతోంది. కొనుగోలులో కొత్త విధానంతో పత్తి రైతులను నష్టపరిచేందుకు పథకం వేస్తోంది. శివరాజ్‌సింగ్ ఈ వ్యవహారాలను సమీక్షించి రైతులకు మేలు కలిగే నిర్ణయాలు తీసుకోవాలి’ అని తుమ్మల లేఖలో కోరారు.

Read More

ఏప్రిల్ 16 వరకు పాడి పశువుల పథకం దరఖాస్తు చేసుకోవాలి

ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాక, ఎస్సీ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ‘రెండు పాడి పశువుల పథకం దరఖాస్తు గడువు ఏప్రిల్ 16 వరకు పొడిగించినట్లు తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార సంస్థ ఎండీ హన్మంతునాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతోపాటు ఫొటో, ఆధార్, రేషన్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు, భూమి పట్టా పాస్‌బుక్‌లు కాపీ (జిరాక్స్)లతో ఒక సెట్ మండల పరిషత్ లేదా మున్సిపాలిటీ కార్యాలయాల్లో సమర్పించాలని కోరారు.

Read More

తెలంగాణాలో కూరగాయల రైతులకు సమీపంలోనే విక్రయ కేంద్రాలు

కూరగాయ పంటలు పండించే చోటే స్థానిక మార్కెట్లను ఏర్పాటు చేసేందుకు తెలంగాణా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 60 ప్రాంతాలను దీని కోసం గుర్తించింది. కూరగాయల సాగు విస్తీర్ణం పెంపుదల ప్రణాళికలో భాగంగా రైతు సమస్యలపై ఉద్యానశాఖ, ఉద్యానవర్సిటీలు అధ్యయనం చేశాయి. పంటలు పండించిన తర్వాత విక్రయాలు, మార్కెటింగ్ సమస్యగా మారిందని, దీంతో రైతులు సాగుకు వెనకాడుతున్నారని అధ్యయనంలో తేల్చింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 36 రైతుబజార్లు మాత్రమే ఉన్నాయి. అవీ నగరాలు, పట్టణాల్లోనే ఏర్పాటయ్యాయి. తెల్లవారుజామునే పంటను అక్కడికి తరలించడం రైతులకు సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో అన్నదాతలకు తమ గ్రామాల సమీ పంలోనే మార్కెట్లను ఏర్పాటు చేసి క్రయవిక్రయాలకు అవకాశం కల్పించాలని ఉద్యానశాఖ, వర్సిటీలు సూచించాయి. దీనికి అనుగుణంగా స్థలాలను గుర్తించాలని సర్కారు అన్ని జిల్లాల కలెక్టర్లను ఇటీవలే ఆదేశించింది. జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల రహదారులకు సమీపంలో రవాణా సౌకర్యం ఉన్నవాటికి ప్రాముఖ్యం ఇవ్వాలని సూచించింది. కలెక్టర్లు మొదటి విడతలో 60 ప్రాంతాలను గుర్తించారు. అక్కడ కూరగాయల నిల్వ, విక్రయాల కోసం మార్కెటింగ్ శాఖ షెడ్లను నిర్మించనుంది. కూరగాయల లభ్యతపై సమీప గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. రవాణా కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించనుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకులా లకు అక్కడి నుంచే కూరగాయలు పంపిణీ చేయనున్నారు.

Read More

నేల ఆరోగ్యమే పంట ఆరోగ్యం

భూమి ఆరోగ్యంగా ఉంటేనే ఎక్కువ దిగుబడిని పొందడంతో పాటు ఆరోగ్యకరమైన పంటలు పండుతాయి. కాబట్టి తెలంగాణలోని రైతులందరికీ నేల ఆరోగ్య కార్డుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ తెలిపారు. బుధవారం ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నేల ఆరోగ్య వాలంటీర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది వాలంటీర్లను నియమించాం, ఒక్కో వాలంటీరు 10 మంది రైతులకు నేల ఆరోగ్యంపై అవగాహన కల్పించి భూసార పరీక్షలు చేస్తారు’ అని తెలిపారు. సమావేశానికి అగ్రివర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య అధ్యక్షత వహించగా కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ దండా రాజిరెడ్డి పాల్గొన్నారు.

Read More

ఖరీఫ్‌లో 48.70 లక్షల టన్నుల ధాన్యం సేకరణ

రాష్ట్ర విభజన తర్వాత అత్యధికంగా ఈ ఖరీఫ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 48.70 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. 7.83 లక్షల మంది రైతులు ప్రభుత్వానికి ధాన్యం విక్రయించగా ప్రభుత్వం రూ.11,557 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసింది. అధికశాతం రైతులకు 48 గంటల్లోపే ఈ చెల్లింపులు పూర్తిచేశారు. 2025 ఖరీఫ్‌లో 43.37 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా సుమారు 94 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశారు. మార్చి 31 కి 48.70 లక్షల టన్నులు సేకరించారు.

Read More

ఈ-నామ్ 2.0పై పూర్తి స్థాయి శిక్షణ అవసరం

కేంద్ర ప్రభుత్వం 2014లో ఈ-నామ1.0ను ప్రవేశ పెట్టింది. దీన్ని మరింత వృద్ధి పరిచి ఈ ఏడాది ‘ఈ-నామ్ 2.0’ను తీసుకొచ్చింది. అయితే, సిబ్బందికి కనీసం శిక్షణ ఇవ్వకుండా అమలు చేయడంతో పంట నమోదులో తప్పిదాలు (ఎర్రర్) చూపించడం, బిడ్డింగ్ సమస్యలు, ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్ల లాగిన్లలో ఇబ్బందులు, రైతులకు మంచి ధర వచ్చే అవకాశం లేకపోవడం, ఒక్క రోజులో పూర్తయ్యే అమ్మకాలకు మూడు రోజులు పట్టడం వంటి ప్రధాన సమస్యలు తలెత్తుతున్నాయి. ఫిబ్రవరి 27న ఈ-నామ్ 2.0 ప్రవేశపెట్టగా లాట్ల కేటాయింపులు జరగకపోవడంతో అధికారులు నిజామాబాద్ మార్కెట్ యార్డులో బహిరంగ వేలం ద్వారా పసుపు కొనుగోళ్లు చేపట్టగా రైతులు క్వింటాకు రూ. వెయ్యి వరకు నష్టపోయారు. తాజాగా శుక్రవారమూ అదే పరిస్థితి ఎదురైంది. యార్డుకు 30 వేల బస్తాల పసుపు రాగా ఉదయం 8 గంటల నుంచి అధికారులు తీవ్రంగా శ్రమించాక వెయ్యి బస్తాలకు మాత్రమే లాట్లు ఇవ్వగలిగారు. తర్వాత సాఫ్ట్‌వేర్ సమస్య తలెత్తడంతో గత్యంతరం లేక బహిరంగ వేలం ప్రారంభించడంతో వ్యాపారులు పంట కొనుగోలు చేశారు. వేలం విధానంలో సాధారణంగా కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులకు మాత్రమే లాభం ఉంటుంది. వారు నిర్ణయించిన ధరకే రైతులు పంటను విక్రయించాల్సి వస్తుంది. సిబ్బందికి ఈ-నామ్ 2.0 పై పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చి… సాంకేతిక సమస్యలను అధిగమించిన తర్వాతే అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.

Read More