ఔషధ మొక్క… నరువల్లి / పిరట్టికిరమ్

సాధారణ నామం: వైట్‌జ్యూట్
శాస్త్రీయ నామం : కార్కోరస్ కాప్సులారిస్
కుటుంబం: మాల్వేసి

నరువల్లి మొక్కలు పొడవుగా పెరిగే వార్షిక మొక్కలు. ఇవి 2-3 మీ. ఎత్తు పెరుగుతాయి. ఈ మొక్కలు కొమ్మలు లేకుండా లేదా కొన్ని ప్రక్క కొమ్మలు కలిగి ఉంటాయి. ఆకులు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడతాయి. ఇవి సాధారణంగా, బల్లెం ఆకారంలో ఉండి 5-15 సెం.మీ. పొడవుంటాయి. ఆకుల అంచులు సన్నని నొక్కులు కలిగి ఉంటాయి. పూలు చిన్నవిగా 2-3 సెం.మీ. వ్యాసం కలిగి పసుపు రంగులో ఉంటాయి. కాయ అనేక విత్తనాలు కలిగి ఉంటుంది.

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • ఈ ఆకుపచ్చ ఆకుకూరలో మంచి కంటి చూపుకవసరమైన బీటాకెరోటిన్, ఆరోగ్యవంతమైన ఎర్రరక్తణాలు, దృఢమైన ఎముకలు, పళ్ళకవసరమైన కాల్షియం, నున్నని, పరిశుభ్రమైన చర్మం, బలమైన రోగ నిరోధక శక్తి, త్వరగా గాయం నయమవడానికి అవసరమైన విటమిన్ సి అధికంగా ఉన్నాయి.
  • జ్యూట్ ఆకులలో విటమిన్ ఎ, సి, ఇ ఉంటాయి. జ్యూట్ ఆకు కూరలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి హృద్రోగాలు, క్యాన్సర్, మధుమేహం, అధిక రక్తపోటు వంటి క్రానిక్ వ్యాధుల నుండి రక్షిస్తాయి.
  • ఆయుర్వేదంలో జ్యూట్ ఆకులను నొప్పులు, మొలలు, ట్యూమర్స్ చికిత్సకు ఉపయోగిస్తారు. ఆకులను జ్వరం, గనోరియా చికిత్సలో కూడా ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • జ్యూట్ గింజల ద్రావణం నుండి వేరు చేసిన భాగాలు, మిశ్రమాలు వ్యాధికారక బాక్టీరియా విబ్రియో కలరా, సాల్మొనెల్లా స్పీసీస్, షిగెల్లా స్పీ., ఎస్కెరిచియా కోలి మరియు నిల్వ ధాన్యంలో ఆశించే పురుగు ట్రైబోలియం కాస్టానియంపై యాంటిమైక్రోబియల్ మరియు కీటక నాశక చర్యలను ప్రదర్శించింది. క్రూడ్ మిథనాల్ ద్రావణం బాక్టీరియాపై అధిక యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది. పెట్రోలియం ఈథర్ అత్యధిక కీటకనాశక చర్యను ప్రదర్శించింది (రహ్మాన్, అతని అనుచరులు, 2015).
  • జ్యూట్ ఆకు ద్రావణాలు బంగాళ దుంప మెత్తని కుళ్ళు కలిగించే బాక్టీరియం, ఎర్వినియా కరటవొర సబ్‌స్పీ, కరటవొర (ఇసిసి) పి138 పెరుగుదలను ప్రయోగశాలలో మరియు నిల్వగదులలో జరిపిన ప్రయోగాలలో సమర్ధవంతంగా అరికట్టాయి (రహ్మాన్, అతని అనుచరులు, 2012).
  • జ్యూట్ మొక్క పురుగు మందు లక్షణాలను కలిగిఉంది. కాండం పొడి లేదా కాండం ద్రావణాన్ని భూమికి కలిపినా లేదా పంటపై పిచికారి చేసినా గోధుమలో గోధుమ రంగు తుప్పుతెగులుని నివారిస్తుంది. వరి, గోధుమ, ఇతర పంటలలో పురుగులను వికర్షిస్తుంది (ఘోష్, 2000)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

‘రైతునేస్తం’2026 రైతునేస్తం పురస్కారాల దరఖాస్తులకు ఆహ్వానం

అక్టోబర్ 31లోగా దరఖాస్తులు పంపండి

‘రైతునేస్తం’ సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త స్వర్గీయ ‘పద్మశ్రీ’ డా॥ ఐ.వి. సుబ్బారావు పేరిట వ్యవసాయ, అనుబంధ రంగాలలో విశేష సేవలందిస్తున్న శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, విస్తరణ అధికారులతోపాటు అగ్రి ఇన్నోవేషన్స్‌ను ప్రతి ఏటా ‘రైతునేస్తం పురస్కారం’ పేరుతో సత్కరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం కూడా ఈ వేడుకను త్వరలో ఘనంగా నిర్వహించనున్నాము.

పురస్కారాలకు దరఖాస్తు చేసుకునే వ్యవసాయ, అనుబంధ రంగాల శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు, అగ్రి ఇన్నోవేషన్స్, రైతులు ‘రైతునేస్తం’ వెబ్‌సైట్ https://rythunestham.in/awards నుండి అప్లికేషన్ ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, దాన్ని పూరించి, దానికి వారి పరిశోధనా వ్యాసాలను, సాగు అనుభవాలను జతపరచి అక్టోబర్ 31వ తేదీలోగా ‘ఎడిటర్, రైతునేస్తం, 6-2-959, దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్, ఖైరతాబాద్, హైదరాబాద్ – 500004. ఫోన్: 9676 79 77 77 (లేదా) ‘రైతునేస్తం’, డో.నెం. 8-198, పుల్లడిగుంట దగ్గర, కొర్నెపాడు పోస్టు, వట్టిచెరుకూరు మం॥, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ – 522 017, ఫోన్: 97053 83666 చిరునామాలకు పంపగలరు లేదా editor@rythunestham.in కు ఇ-మెయిల్ చేయవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే. ఈ వేడుక త్వరలో ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించబడుతుంది.

యడ్లపల్లి వేంకటేశ్వరరావు
‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత
చైర్మన్ – రైతునేస్తం ఫౌండేషన్
ఫోన్: 9490559999, 98490 05182

Read More

ఔషధ మొక్క…. పాషాణభేది

పాషాణభేది మెత్తని కాండం కలిగి వాము ఆకును పోలి వుండే ఏక లేదా ద్వివార్షిక మొక్క. దీని ఆకుల నుండి ఎలాంటి వాసన రాదు. సుమారు 0.5-1.0 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. బాగా శాఖలు తొడిగి చిన్నపాటి పొదలా తయారవుతుంది. ప్రతికణుపు దగ్గర రెండు చొప్పున ఆకులు వస్తాయి. ఈ ఆకుల మొదళ్ళ నుండి మళ్ళీ ఆకులు పుడతాయి. అంచులు దంతాలు కలిగి ఉంటాయి. ఆకులు, కొమ్మలు నూగు కలిగి ఉంటాయి. దీనిని లేత కొమ్మల కత్తిరింపుల ద్వారా వ్యాప్తి చేస్తారు. వేర్లు క్యారట్ దుంపలలాగా ఉండి ప్రతి మొక్కకు 4-5 దుంపలు ఉంటాయి.

సాధారణ నామం : కోలియస్ / మెడిసినల్ కోలియస్ శాస్త్రీయ నామం : కోలియస్ ఫోర్‌స్కాహ్లీ కుటుంబం: లామినేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • కోలియస్ దుంపలను అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తున్నారు. దుంపల నుండి ఫోర్‌స్కోలిన్ అనబడు డైటెర్పనాయిడ్ (కోలియోనాల్) లభిస్తుంది.
  • పాషాణ భేది హృద్రోగాలు, ఊబకాయం, బ్రాంకైటిస్, ఉబ్బసం, నరాల బలహీనత, రక్తక్షీణత మొదలగు వ్యాధుల చికిత్సకు మరియు బలవర్థకమైన ఔషధంగా ఉపయోగపడుతుంది.
  • క్యాన్సర్ చికిత్సలో కూడా ఉపయోగించబడుతున్నది.

వ్యవసాయరంగంలో

  • పాషాణ భేది నుండి వేరు చేసిన ఫోర్‌స్కోలిన్ ద్రావణం నిమ్మ ఆకులను తినే పాపిలియో డెమోలియస్ 4వ దశ లార్వాలపై గణనీయమైన యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది (శ్రీనివాసరావు, అతని అనుచరులు, 2014).
  • పాషాణభేది వేర్ల నుండి వేరు చేసిన డైటెర్పిన్, ఫోర్‌స్కోలిన్ పాపిలియో డెమోలియస్ నివారణకు సురక్షితమైన యాంటిఫెర్టిలిటి కారకం (శ్రీనివాసరావు అండ్ సబిత, 2017).
  • పాషాణ భేది ఆకుల ఇథనాల్ ద్రావణం (0.1%) ఈడెస్ ఈజిప్టి గుడ్లు పెట్టదాన్ని 77.3%, కూలెక్స్ క్వింక్విఫేసియెన్స్ గుడ్లు పెట్టడాన్ని 39.22% తగ్గించాయి (స్వాతి, ఆమె అనుచరులు, 2010).
  • పాషాణభేది వేర్ల ఇథనాల్ ద్రావణం కాండం, ఆకుల ఇథనాల్ ద్రావణం కన్నా క్లెబ్సియెల్లా న్యుమోనియే పై అత్యధిక యాంటిబ్యాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది (రాజ్‌కుమార్ అండ్ మాలతి, 2015).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… చామ

చామ పంటను కూర వండుకు తినే దుంపల కోసం సాగు చేస్తారు. చామ మొక్క వివిధ ఆకారాలు, పరిమాణాలు గల దుంపలను ఉత్పత్తి చేస్తుంది. దీని ఆకులు 40þ24.8 సెం.మీ. పరిమాణంలో ఉంటాయి. దుంపల నుండి వచ్చే ఆకులు పైవైపు ముదురు ఆకుపచ్చ రంగులో, క్రింది వైపు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. త్రికోణాకారంలో కోడిగుడ్డు పరిమాణంలో ఉంటాయి. ఆకు కాడ 0.8-1.2 మీ. ఎత్తులో ఉంటుంది.

సాధారణ నామం : టారో శాస్త్రీయ నామం : కోలకేసియా ఎస్కులెంట కుటుంబం: ఆరేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • చామ దుంపలో అనేక పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
  • 104 గ్రా. చామ దుంప తింటే 0.294 మి.గ్రా. విటమిన్ బి6, 27.52 గ్రా. కార్బోహైడ్రేట్లు, 0.179 మి.గ్రా. కాపర్, 0.398 మి.గ్రా. మాంగనీస్, 2.48 మి.గ్రా. విటమిన్ ఇ, 615 మి.గ్రా. పొటాషియం లభిస్తాయి. అంతేగాక 0.024 గ్రా. ట్రిప్టొఫాన్, 0.072 గ్రా. థ్రియొనైన్, 0.056 గ్రా. ఐసోల్యూసిన్, 0.115 గ్రా. ల్యూసిన్, 0.07 గ్రా. లైసిన్ వంటి అమినోయాసిడ్లు కూడా లభిస్తాయి.
  • చామ దుంపలో కాల్షియం, విటమిన్ సి, విటమిన్ ఇ, బి విటమిన్లు ఉన్నాయి. చామ ఆకులలో విటమిన్లు ఎ మరియు సి, పీచు పదార్థం, అదిక పరిమాణంలో ప్రోటీన్లు ఉంటాయి. చామ దుంప క్యాన్సర్‌ని నివారిస్తుంది.
  • రుమాటాయిడ్ ఆర్థ్రెåటిస్ లక్షణాలను తగ్గిస్తుంది. రక్తపోటుని నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
    జీర్ణశక్తిని పెంచుతుంది. కండరాల నొప్పులను తగ్గిస్తుంది. కంటిచూపుని మెరుగు పరుస్తుంది.
  • దంత ఆరోగ్య నిర్వహణకు సహాయపడుతుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. తలలో వెంట్రుకలు దట్టంగా పెరగడానికి దోహదపడుతుంది.
  • రక్త ప్రసరణను పెంచుతుంది. ఎముకల నష్టాన్ని తగ్గిస్తుంది.శరీర చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

వ్యవసాయరంగంలో

  • చామ దుంప అగ్లూటినిన్ (సిఇఎ) శక్తివంతమైన కీటకనాశనిగా గుర్తించబడింది (రాయ్, అతని అనుచరులు, 2002, మజుందార్, అతని అనుచరులు, 2004).
  • కోలకేసియా ఎస్క్యులెంటా ఎగ్లూటినిన్ (సిఇఎ) ప్రత్తి పంటనాశించే పేనుబంక, ఎఫిస్ గాసిపిని అత్యంత సమర్ధవంతంగా చంపింది. అలసంద పేనుబంక, ఎఫిస్ క్రాక్సివోరాని సిఇఎ సమర్థవంతంగా ఆరమ్ మాక్యులేటం దుంప లెక్టిన్ (ఎటితుల్)తో సమానంగా నివారించింది. సిఇఎ రెడ్ కాటన్ బగ్‌ని అల్లియం సెటైవం (వెల్లుల్లి) లీప్ అగ్లూటిన్ (ఎయసఎయల్) కన్నా అదిక సమర్థవంతంగా నివారించింది (దాస్, అతని అనుచరులు, 2013).
  • పండుఈగ, బాక్ట్రోసెరా కుకుర్బిటె దోసజాతి పంటలపై విపరీత నష్టం కలిగించే పురుగు. ఈ పురుగు నివారణ అతి కష్టం. చామ దుంప లెక్టిన్ (సిఇఎ) పండుఈగ లార్వాల పెరుగుదల, వృద్ధి నరికట్టింది. కనుక ఈ లెక్టిన్‌ని సమగ్ర పురుగు యాజమాన్య పథకంలో ఒక భాగంగా ఉపయోగించవచ్చు. (ఈ ఠాకూర్, అతని అనుచరులు, 2012).
  • చామ దుంప లెక్టిన్ (సిఇఎ) తెల్లదోమ, బెమిసియా టబాసి పెరుగుదలను, పునరుత్పత్తి సామర్థ్యాన్ని అరికట్టింది (అమిత్‌రాయ్, అతని అనుచరులు, 2014).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… హార్స్ ఉడ్

ఒక పొద లేదా చిన్న చెట్టు. ఇది 10 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. దీనికి బెరడు నునుపు దనంతో, పలుచని, గచ్ౘ్కాయ – ఆకుపచ్చ రంగులో ఉండి వయసుతోపాటు గోధుమ రంగుకి మారుతుంది. ఆకులు చిన్న ఆకులతో 30 సెం.మీ. పొడవుంటాయి. పెద్ద ఆకులో 11-37 చిన్న ఆకులుంటాయి. చిన్న ఆకులు కొడి గుడ్డు ఆకారంలో ఉంటాయి. ఆకు ఉపరితలంలో అనేక గ్రంథులుండి సువాసన కలగి ఉంటాయి. పూలు సువాసన కలిగిన పూలు. కాయ అండాకారంలో 3.3 -7.0 మి.మీ. వ్యాసం కలిగి ఉంటుంది.

సాధారణ నామం : హార్సఉడ్ శాస్త్రీయ నామం : క్లాసెనా అనిసాట కుటుంబం: రూటేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • వివిధ ఆఫ్రికా దేశాలలో ఈ మొక్కని అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. నైజీరియాలో క్లాసెనా అనిసేట, అప్రీగిల్‌పానిక్యులేట, వేప మిశ్రమంతో తయారు చేసిన ‘ఆబ్గో’ అనే కషాయాన్ని మలేరియా చికిత్సలో ఉపయోగిస్తారు. టాంజెనియాలో సంప్రదాయ వైద్యులు దీనిని నోటి కాండిడియాసిస్, చర్మవ్యాధుల చికిత్సకుపయోగిస్తారు. టాంజెనియాలో దీనిని మూర్ఛ రోగ చికిత్సలో ఉపయోగిస్తారు. దక్షిణాఫ్రికాలో ఈ మొక్క ఆకులను అధిక రక్తపోటు నివారణకు ఉపయోగిస్తారు. ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాలలో, ఫిలిప్పెåన్స్‌లో దోమలను వికర్షించడానికి తాజా ఆకులను కాలుస్తారు.
  • ఆహారం ద్వారా కలిగే జబ్బులను వ్యాప్తి చేసే కొరినిబాక్టీరియం డిఫ్తీరియా, ఎస్కరిచియా కోలి, సూడోమోనాస్ యీరూజనోసా బాక్టీరియాల నివారణకు ఉపయోగిస్తుంది.

వ్యవసాయరంగంలో

  • క్లాసెనా అనిసాట ద్రావణం దోమలు, ఈగలు, వీవిల్స్‌ని నివారించింది (ముకండివ, అతని అనుచరులు, 2016).
  • చిక్కుడు గింజలపై బంకమట్టి, ఎసెన్షియల్ ఆయిల్ మిశ్రమం పొడి ఫార్ములేషన్ పూత నిల్వ సమయాలలో గింజలను ఆశించే పురుగు అకాంతోసెలిడస్ ఓబ్టెక్టస్ సంతతి ఉత్పత్తిని నివారించింది. (ఎన్‌డోమ్, అతని అనుచరులు, 2008). సువాసన గల బంకమట్టి పొడి ఎసెన్షియల్ ఆయిల్ కన్నా ఎక్కువ విషపూరిత చర్య కలిగిఉంది. ఎసెన్షియల్ ఆయిల్ మధ్యమ వికర్షణ చర్య, అధిక ఫ్యూమిగెంట్ విషపూరిత చర్య ప్రదర్శించింది.
  • క్లాసెనా అనిసాట ద్రావణం మిడత (జోనోసెరస్ వెరైగేట్స్) నివారణలో ఉపయోగిస్తుంది (ఒకునడె అండ్ ఒలైఫా, 1987).
  • క్లాసెనా అనిసాట ఎసెన్షియల్ ఆయిల్ మొక్కజొన్న నిల్వ సమయంలో ఆశించే ట్రైబోలియం కాస్టానియం, సైటోఫిలస్ జియా మెయిస్ పెద్ద పురుగులను స్పర్శ, ఇన్‌హలేషన్ ప్రక్రియల ద్వారా నివారించింది (గౌడౌమ్, అతని అనుచరులు, 2013).
  • క్లాసినా అనిసాట ఆకుల పొడి మొక్కజొన్న నిల్వ సమయంలో ఆశించే ప్రోస్టెఫోనస్ ట్రంకీటస్, సైటోఫిలస్ జియామెయిస్ పురుగులను గణనీయంగా అరికట్టాయి (నూకెనైన్, అతని అనుచరులు, 2010).
  • క్లాసినా ఆకుల నుండి తీసిన ఎసెన్షియల్ ఆయిల్ మలేరియా వ్యాప్తి చేసే దోమలు క్యూలెక్స్ క్వింక్విఫేసియన్స్, ఈడెస్ ఈజిప్టి, అనోఫెలెస్ స్టిఫెన్సిలను గణనీయంగా చంపాయి (గోవింద రాజన్, 2010).
  • సాంప్రదాయకంగా ఆఫ్రికాలోని అనేక కమ్యూనిటీలలో ఈ మొక్కని దోమలు, ఈగలు, వీవిల్స్ వంటి పురుగుల నివారణలో ఉపయోగిస్తున్నారు. క్రూడ్ ద్రావణాలు, ఇథనాల్ ద్రావణాలను అనేక పురుగులపై పరీక్షించి వాటి సమర్ధతను నిరూపించారు. కౌమారిన్లు, కార్బజోల్ ఆల్కలాయిడ్లు, లియొనాయిడ్లు, ఎసెన్షియల్ ఆయిల్స్ వంటి సుమారు 50 మిశ్రమాలను వేరు చేసి గుర్తించారు. వీటిలో కొన్ని పురుగు మందుల లక్షణాలు కలిగి ఉన్నాయని నిరూపించబడ్డాయి (ముకుండివ, అతని అనుచరులు, 2016). ఈ మొక్క ద్రావణం పాలిచ్చే జంతువుల చర్మాన్ని ఆశించే ఈగల లార్వాలను, పెద్ద పురుగులను సమర్ధవంతంగా నివారించింది (ముకుండివ, అతని అనుచరులు, 2012).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క…. రెడ్‌బడ్

ఇది ఒక చిన్న అలంకరణ చెట్టు. 12 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. 10 మీ. వెడల్పు ఉంటుంది. ఒక సంవత్సరం లేదా ఎక్కువ వయసున్న చెట్టు, కాండంతో సహా ముదరు పింకు రంగు పూలను ఉత్పత్తి చేస్తుంది. పూలు ఏర్పడిన కొద్ది సమయం తర్వాత ఆకులు ఏర్పడతాయి. ఈ చెట్టు పొడవైన బల్లపరుపు కాయలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి చెట్టు నుండి వ్రేలాడుతుంటాయి. పూలను తినవచ్ౘ్ు. ఇవి తీయని ఆమ్ల రుచి కలిగి ఉంటాయి.

సాధారణ నామం : జుడాస్ ట్రీ
శాస్త్రీయ నామం : సెర్సిస్ సిలిక్వాస్ట్రం
కుటుంబం: ఫాబేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • రెడ్‌బడ్‌ని అనీమియా, నిస్సత్తువ చికిత్సలో ఉపయోగిస్తారు. శతాబ్దాల నుండి దీనిని మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడటం, శ్వాసకోశ సమస్యలు, గర్భవతుల్లో కాళ్ళ వాపుల చికిత్సలో ఉపయోగిస్త్తున్నారు. మూత్ర వర్ధకంగా పనిచేస్తుంది.
  • పూలలో కెరోటిన్, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. వీటిని పార్ల్సేతో కలిపి రక్తం, లివర్‌లోని కొవ్వు డిపాజిట్లను కరిగించడానికి ఉపయోగిస్తారు. మెత్తని క్రీం చర్మ వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తుంది. 1 కప్పు పూలను 1 కప్పు నీరు కలిపిన క్రీంలో కలిపి 20 ని. ఉడికించాలి. వడపోసి పూలను తొలగించి 3 చెంచాల విటమిన్ ఇ నూనెని క్రీమ్‌కి కలిపి, బాగా కలియత్రిప్పి స్టెరిలైజ్ చేసిన జాడీలో పోయాలి. ఈ క్రీంని గోళ్ళు లేదా చర్మంపై సమస్య వున్న చోట పూసి మసాజ్ చేయాలి.
  • హెల్త్ టీ తయారు చేయడానికి పావుకప్పు తాజాపూలను ఒక పాత్రలో తీసుకుని వాటిపై ఒక కప్పు వేడి నీటిని పోసి 5 ని. నిల్వ ఉంచి వడపోయాలి. దీనికి కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. అమెరికన్ ఇండియన్స్, రెడ్‌బడ్‌ని పంటి నొప్పి నుండి బ్లాడర్ ఇన్‌ఫెక్షన్ వరకు, చర్మ మచ్ౘ్ల నుండి చీలిన కాలి గోర్ల వరకు అనేక సమస్యలకు పూలను నలగ్గొట్టి కట్టు కట్టడానికి లేదా లోషన్‌గా పూయడానికి, పూలను హెల్త్‌టీ తయారు చేయడానికి ఉపయోగిస్తారు.
  • యూరోపియా ఖండంలో ప్రస్తుతం రెడ్‌బడ్ కషాయాన్ని విరేచనకారిగా ఉపయోగిస్తున్నారు. (రాబర్ట్స్, 2000)

వ్యవసాయరంగంలో

  • రెడ్‌బడ్ ఇథనాల్ ద్రావణం (30 మైక్రో లీటర్లు / మి.లీ.) లోని రసాయనాలు 12 రోజుల తామర పురుగులు, త్రిప్స్ టబాసి పై అత్యధిక విష ప్రభావాన్ని చూపాయి (నజ్‌మిజాడె, అతని అనుచరులు, 2013).
  • రెడ్‌బడ్ ద్రావణం { బదనికనల్లి, ఓరియస్ హోర్వాతి విడుదల వెస్టర్న్ ఫ్లవర్ త్రిప్స్, ప్రాంక్లినియెల్లా ఆక్సిడెంటాలిస్ పిల్ల పురుగులపై మంచి ప్రభావాన్ని చూపాయి. రెడ్‌బడ్ ద్రావణం పిల్ల తామర పురుగులను చంపింది (రజావి అండ్ అహ్మరి, 2016). తామర పురుగులు సమర్ధవంతంగా నివారించబడ్డాయి.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

తెగుళ్ళ నివారణకు లాంటానా కెమెరా కషాయం

పంటపొలాల చుట్టూ ప్రకృతిలో దొరికే వివిధ రకాల ఆకులను ఉడకపెట్టడం ద్వారా కషాయాలను తయారు చేస్తారు. ఇది మన సంప్రదాయ వ్యవసాయంలో భాగం. ఆకులను ఉడకపెట్టడం వలన అందులో ఉండే మూల పదార్థాలు పూర్తి స్థాయిలో ద్రావణంలో చేరి కషాయం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. పంటల సస్యరక్షణలో ఈ కషాయాలు అనాదిగా రైతులకు తెలిసినవే. ఇందులో ముఖ్యంగా లాంటానా కెమెరా కషాయం రైతులకు వివిధ పంటలలో తెగుళ్ళ నియంత్రణ కొరకు ఉపయోగపడుతుంది.

లాంటానా చెట్టు మన ఇళ్ళ చుట్టూ ఎక్కడపడితే అక్కడ ఉంటుంది. దీనికి తెలుపు మరియు ఎరుపు పూలు పూస్తూంటాయి. ఇవి ముళ్ళు కూడా కలిగి ఉంటాయి. దీనిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. వీటి ఆకుల కషాయం ఆల్టర్నేరియా ఆకుమచ్చ మరియు బోట్రైటిస్ తెగులు నియంత్రించుటలో బాగా పనిచేస్తుంది.

కావలసిన పదార్థాలు : లాంటానా ఆకులు : 5 కిలోలు; పసుపు: 500 గ్రాములు; నీరు : 20 లీటర్లు; పెద్ద కుండః 1

తయారు చేసే విధానం : లాంటానా కషాయాన్ని తయారు చేసేటపుడు ముక్కుకు గుడ్డకట్టుకోవాలి. 5 కిలోల లాంటానా ఆకులను మెత్తగా నూరి ఒక కుండలో వేయాలి. దీనికి 10 లీటర్ల నీరు, 500 గ్రా. పసుపు పొడిని కలపాలి. కుండను మంటపై పెట్టి ఒక గంటసేపు (కనీసం 4-5 పొంగులు వచ్చేవరకు) బాగా ఉడకబెట్టాలి. ఒక కర్రతో ఉడుకుతున్న కషాయాన్ని మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. కషాయాన్ని బాగా చల్లార్చి ఒక పలుచని గుడ్డతో వడపోయాలి. ఈ కషాయానికి 500 గ్రాముల సూడోమోనాస్ పొడిని కలపాలి. దీనికి 150 లీటర్ల నీటిని కలిపి తయారు చేసిన వెంటనే ఎకరం పొలంలో సాయంత్రం వేళ పిచికారి చేయాలి. నిల్వ ఉంచరాదు. పంటకాలంలో పంట దశను, తెగులు ఉధృతిని బట్టి వారం రోజుల వ్యవధిలో ఒకటి, రెండుసార్లు పిచికారి చేయాలి. పంటలలో వచ్చే తెగుళ్ళను తొలిదశలోనే గుర్తించి పిచికారీ చేసుకోవడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు.

తెగుళ్ళ నివారణ :

  • లాంటానా కషాయాన్ని రైతులు మిరప, పెసర పంటలనాశించే బూడిద తెగులు, వేరుశనగలో తిక్కా ఆకుమచ్చ తెగులు నివారణలో వాడి మంచి ఫలితాలు పొందారు.
  • లాంటానా ఆకుల నుండి తీసిన నూనెని గింజల నిల్వలో ఆశించే అఫ్లాటాక్సిన్‌లను ఉత్పత్తి చేసే శిలీంద్రాల నివారణలో ఉపయోగించవచ్చు.
  • లాంటానా కషాయాన్ని వంగ, టమాట, మిరప, మినుము, పెసర పంటల నాశించే ఆకుమచ్చ తెగులు నివారణకు ఉపయోగించవచ్చు.

పంటలలో ఆశించే బూడిద తెగులు, త్రుప్పుతెగులు, ఆకుమచ్చ తెగులు, బాక్టీరియా తెగులు, బోట్రైటిస్ తెగులును లాంటానా కషాయంతో నివారించవచ్చు.

పసుపులో ఆకుమచ్చ తెగులు నివారణకు లాంటానా మరియు ఇతర ఆకుల మిశ్రమ కషాయం ఉపయోగించవచ్చు

Read More

వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం పెద్దపీట: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రైతులు తమకు అవసరమైన వ్యవసాయ పనిముట్లను, తమకు నచ్చిన కంపెనీ నుంచి కొనుగోలు చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యాంత్రీకరణ పథకాన్ని అమలు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. రైతులకు నాణ్యమైన వ్యవసాయ యంత్ర పరికరాలు అందించడంతో పాటు, వారి అవసరాలు, డిమాండ్‌కు అనుగుణంగా యంత్రాలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

శాసనమండలిలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

నాణ్యతకు ప్రాధాన్యత.. పరీక్షించిన యంత్రాలే రైతులకు సరఫరా…

యాంత్రీకరణ పథకం కింద రైతులకు నాణ్యమైన, ప్రమాణాలు కలిగిన వ్యవసాయ యంత్ర పరికరాలను మాత్రమే అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. తయారీదారులు, సరఫరాదారులు అందించే ఉత్పత్తులను ఫార్మ్ మెషినరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ లేదా కేంద్ర వ్యవసాయ శాఖ (DA&FW) ద్వారా గుర్తింపు పొందిన సంస్థల వద్ద పరీక్షించిన తర్వాతనే రైతులకు సరఫరా చేస్తున్నామని తెలిపారు.

రైతుల భద్రత, యంత్రాల నాణ్యత, పనితీరు వంటి అంశాల్లో ఎలాంటి రాజీ లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

గతంలో ఉన్న సమస్యలకు ఇక తావులేదు…

యాంత్రీకరణ పథకం కింద రైతులకు అందించే పరికరాలు వారు కోరుకున్న విధంగా లభించడం లేదని, సబ్సిడీపై అందించే యంత్రాలకు, మార్కెట్లో లభించే యంత్రాలకు తేడా ఉంటుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రస్తావించారు. సబ్సిడీ పరికరాలకు ఇచ్చే కొటేషన్ ధరలు, మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసం ఉంటోందని పేర్కొన్నారు. డిమాండ్ ఉన్న యంత్రాలను ఎక్కువగా అందించాలని, డ్రోన్లను కూడా అధిక సంఖ్యలో అందించాలని కోరారు.

దీనిపై మంత్రి తుమ్మల స్పందిస్తూ, ఎమ్మెల్సీ ప్రస్తావించిన అంశాలు గతంలో ఉన్న పరిస్థితులకు సంబంధించినవని, ప్రస్తుతం ఆ విధానం లేదని స్పష్టం చేశారు. రైతులు తమకు నచ్చిన పనిముట్టును, తమకు నచ్చిన కంపెనీ నుంచి కొనుగోలు చేసుకునే విధంగా ప్రస్తుత యాంత్రీకరణ విధానాన్ని రూపొందించామని తెలిపారు.

గత ప్రభుత్వం పథకాన్ని నిలిపివేసింది…
గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను వినియోగించుకోకుండా యాంత్రీకరణ పథకాన్ని నిలిపివేసిందని మంత్రి తుమ్మల తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించి తిరిగి అమలులోకి తీసుకొచ్చిందన్నారు.

వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడం ద్వారా రైతులపై శారీరక శ్రమ తగ్గడంతో పాటు, సాగు ఖర్చులు తగ్గి, సమయానికి వ్యవసాయ పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

రూ.63.11 కోట్లతో 15,565 యంత్ర పరికరాల సరఫరా…

2025-26 ఆర్థిక సంవత్సరంలో యాంత్రీకరణ పథకం కోసం ప్రభుత్వం రూ.71 కోట్లు కేటాయించగా, రూ.63.11 కోట్లు ఖర్చు చేసి 15,565 వ్యవసాయ యంత్ర పరికరాలను రైతులకు సరఫరా చేసినట్లు మంత్రి వివరించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యాంత్రీకరణ పథకానికి రూ.147.91 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రైతుల డిమాండ్‌ను అనుగుణంగా, అవసరమైన వ్యవసాయ యంత్ర పరికరాలను యాంత్రీకరణ పథకం కింద సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

చిన్న, సన్నకారు రైతులకు 50 శాతం సబ్సిడీ…

యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు అందించే పరికరాలపై ప్రభుత్వం గణనీయమైన సబ్సిడీని అందిస్తోందని మంత్రి తెలిపారు. చిన్న, సన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీ రైతులు, మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీ, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో వ్యవసాయ యంత్ర పరికరాల కొనుగోలుకు రైతులపై పడే ఆర్థిక భారం తగ్గుతుందని మంత్రి పేర్కొన్నారు.

ఎంప్యానెల్‌మెంట్‌లో రైతులకు భాగస్వామ్యం…

రైతులు కోరుకునే విధంగా వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉండేలా ఎంప్యానెల్‌మెంట్ కమిటీలో రైతులకు కూడా భాగస్వామ్యం కల్పించినట్లు మంత్రి తెలిపారు. కమిటీలో శాస్త్రవేత్తలు, టెక్నికల్ ఇంజనీర్లు, అధికారులతో పాటు ఆదర్శ రైతులు, ఎఫ్‌పీవోలు (FPOs) ప్రతినిధులను కూడా భాగస్వాములను చేశామని వివరించారు. రైతుల వాస్తవ అవసరాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు, వివిధ ప్రాంతాల్లో సాగు విధానాలను పరిగణనలోకి తీసుకుని యంత్ర పరికరాల ఎంపిక జరిగేలా ఈ విధానం రూపొందించామని తెలిపారు.

యాంత్రీకరణ పథకం కింద పరికరాలను సరఫరా చేసేందుకు 444 కంపెనీలు ఎంప్యానెల్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నాయని మంత్రి వెల్లడించారు. అయితే ప్రతి కంపెనీని ఎంపిక చేయడం జరగదని, నిర్దేశిత ప్రమాణాలను పాటించే కంపెనీలను, కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంబంధిత సంస్థలు గుర్తించి ఎంపిక చేసే ప్రమాణాలను అనుసరించే కంపెనీలను మాత్రమే జాబితాలో చేర్చుతామని స్పష్టం చేశారు.

దీంతో రైతులకు నాణ్యత లేని లేదా ప్రమాణాలు లేని యంత్ర పరికరాలు అందకుండా చూడటంతో పాటు, నాణ్యమైన ఉత్పత్తులకు ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు.

రైతుకే పూర్తి స్వేచ్ఛ.. నచ్చిన కంపెనీ నుంచే కొనుగోలు…

యాంత్రీకరణ పథకంలో రైతుకు కొనుగోలు విషయంలో పూర్తి స్వేచ్ఛ కల్పిస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. రైతు తనకు నచ్చిన పనిముట్టును, తనకు నచ్చిన కంపెనీ దగ్గరే కొనుగోలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

ప్రభుత్వం రైతుల తరఫున ఒక నిర్దిష్ట కంపెనీ నుంచి మాత్రమే యంత్రాన్ని కొనుగోలు చేయాలని నిర్దేశించడం లేదన్నారు. అదేవిధంగా, రైతులు మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రమాణాలకు అనుగుణమైన తమకు నచ్చిన పరికరాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉందన్నారు.
 
సబ్సిడీ నేరుగా రైతు ఖాతాలోకి…

యాంత్రీకరణ పథకంలో పారదర్శకతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. రైతులకు అందాల్సిన సబ్సిడీ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నామని చెప్పారు.

దళారులకు, మధ్యవర్తులకు అవకాశం లేకుండా రైతుకు నేరుగా ప్రయోజనం అందేలా వ్యవస్థను రూపొందించామని తెలిపారు. రైతు తన అవసరానికి అనుగుణంగా పరికరాన్ని ఎంపిక చేసుకుని కొనుగోలు చేసుకునే అవకాశం ఉండటంతో పాటు, సబ్సిడీ కూడా నేరుగా రైతు ఖాతాలో జమ కావడం ద్వారా పథకం అమలులో పారదర్శకత పెరుగుతుందన్నారు.

రైతుల డిమాండ్‌కు అనుగుణంగా యంత్రాల సరఫరా…

రాష్ట్రంలో పంటల సాగు విధానాలు, రైతుల అవసరాలలో ఉండే అసమానతల వలన, యాంత్రీకరణకు ఉన్న డిమాండ్ ప్రాంతాల వారిగా భిన్నంగా ఉంటుందని మంత్రి తెలిపారు. అందువల్ల రైతులకు అవసరం లేని పరికరాలను పెద్ద ఎత్తున సరఫరా చేయడం కాకుండా, రైతుల నుంచి వచ్చే డిమాండ్‌కు అనుగుణంగా అవసరమైన యంత్రాలను అందుబాటులోకి ఉంచుతున్నామని స్పష్టం చేశారు.

డ్రోన్లు సహా ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరికరాలకు పెరుగుతున్న డిమాండ్‌ను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోందన్నారు.

ఆయిల్‌పామ్ సాగుకు ప్రత్యేక ప్రోత్సాహం…

రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.50 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు జరుగుతోందని, వచ్చే మూడు సంవత్సరాల్లో మరో 6 లక్షల ఎకరాలను ఆయిల్‌పామ్ సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు అనుగుణంగా రైతులకు అవసరమైన యంత్ర పరికరాలను కూడా యాంత్రీకరణ పథకం కింద అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగులో ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న అత్యుత్తమ యంత్ర పరికరాలను గుర్తించి, అవసరమైన వాటిని దిగుమతి చేసుకుని రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు.

ఈ యంత్ర పరికరాలను ఫ్యాక్టరీ వద్దే రైతులకు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. తద్వారా ఆయిల్‌పామ్ సాగులో యాంత్రీకరణ పెంచి, రైతుల శ్రమను తగ్గించడంతో పాటు ఉత్పాదకతను పెంచేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

రైతు ప్రయోజనమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం..

వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించడం, రైతుల శ్రమను తగ్గించడం, సాగు ఖర్చులను తగ్గించడం, వ్యవసాయ పనులను సకాలంలో పూర్తి చేయడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు యాంత్రీకరణ కీలకమని మంత్రి తుమ్మల అన్నారు.

రైతులకు అవసరమైన పరికరాలను వారి డిమాండ్‌కు అనుగుణంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, నాణ్యత విషయంలో రాజీ పడకుండా, సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తూ పారదర్శకమైన, రైతు కేంద్రిత యాంత్రీకరణ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.

రైతు ఏ పనిముట్టు కోరుకుంటున్నాడో, ఏ కంపెనీ పరికరం తనకు అనుకూలంగా ఉంటుందో నిర్ణయించుకునే స్వేచ్ఛ రైతుకే ఉండేలా ప్రభుత్వం విధానాలను రూపొందించిందని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఆధునిక యాంత్రీకరణను మరింత విస్తరించి, రాష్ట్ర రైతాంగానికి మరింత ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు.

Read More

ఔషధ మొక్క…. దేవదారు

దేవదారు పశ్చిమ హిమాలయ వాలుల్లో పెరిగే అతి సుందరమైన అలంకరణ చెట్టు. ఇది ఒక పెద్ద నిత్యహరిత కోనిఫెర్ జాతికి చెందిన చెట్టు. 40-50 మీ. ఎత్తు పెరుగుతుంది. దీని కాండం 3 మీ. వ్యాసం కలిగి ఉంటుంది. కొమ్మలు సమాంతరంగా పెరుగుతాయి. ఆకులు నీడిల్ లాగా ఉండి 2-5.5 సెం.మీ. పొడవుంటాయి. 20-30 నీడిల్స్ ఒక గుత్తిలో ఏర్పడతాయి. ఇవి కాంతివంతమైన ఆకుపచ్ౘ్రంగు నుండి నీలిఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆడకోన్స్ బ్యారల్ ఆకారంలో 7-13 సెం.మీ. పొడవు, 5-8 సెం.మీ. వెడల్పు కలిగి ఉంటాయి. గింజలు రెక్కలు కలిగి ఉంటాయి. మగకోన్స్ 4-6 సెం.మీ. పొడవుంటాయి.

సాధారణ నామం : దేవ్‌దార్ శాస్త్రీయ నామం : సెడ్రస్ డియోడెరా కుటుంబం: పైనేసీ

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • గాయాలను శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది. కడుపులో నులి పురుగుల నివారణకు ఉపయోగపడుతుంది. చర్మవ్యాధుల చికిత్సకి ఉపయోగిస్తుంది.
  • నరాల బలహీనత నదుపు చేస్తుంది. దగ్గు, జలుబులను నివారిస్తుంది. అజీర్తిని తగ్గిస్తుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది.
  • మూత్రకోశ వ్యాధులు, డయాబెటిస్ చికిత్సలో ఉపయోగకరం. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. కడుపుబ్బరాన్ని, వాయువులను తగ్గిస్తుంది. అధిక దురదలను తగ్గిస్తుంది. వాపు, ఎడిమ, నొప్పులను తగ్గిస్తుంది. రక్త సమస్యలను నివారిస్తుంది.
  • ముక్కు కారడం, సైనొసైటిస్ చికిత్సలో ఉపయోగిస్తుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు మంచి మందు. ఊబకాయం చికిత్సలో ఉపయోగిస్తుంది.

వ్యవసాయరంగంలో

  • దేవదారు ఎసెన్షియల్ ఆయిల్, దానిలోని వివిధ రసాయనాలు క్యాబేజి డైమండ్ బ్యాక్‌మాత్ లార్వాలపై వాటిని చంపే ప్రభావం చూపింది. దీనిని పురుగుల యాజమాన్యంలో వృక్ష సంబంధ లార్విసైడ్‌గా ఉపయోగించవచ్చు. (చౌధరి, అతని అనుచరులు, 2011).
  • వస, దేవదారు, మారేడు, బంతి, కరివేపాకు ఎసెన్షియల్ ఆయిల్స్ ప్రభావాన్ని డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లాపై పరీక్షించారు. వస ఎసెన్షియల్ ఆయిల్ డైమండ్ బ్యాక్ మాత్ లార్వాలపై అత్యధిక వికర్షక చర్యను ప్రదర్శించింది. దీని తర్వాత దేవదారు ద్రావణం అధిక వికర్షక చర్యను ప్రదర్శించింది (ఈశ్వరరెడ్డి, అతని అనుచరులు, 2015).
  • దేవదారు అనేక పురుగులను సమర్ధవంతంగా నివారించింది (రఘురామన్ అండ్ సింగ్, 1997; రహమాన్, అతని అనుచరులు, 2009, రావ్ అండ్ సింగ్, 2009, డెల్బెకె, అతని అనుచరులు, 1997).
  • దేవదారు ఎసెన్షియల్ ఆయిల్ ఈడెస్ ఈజిప్టి, క్యూలెక్స్ క్వింక్విఫేసియాటిస్ దోమలను 2.5% ఎల్‌సి 50 వద్ద ఒక గంట తర్వాత సమర్ధవంతంగా చంపింది (మకాయిక్, అతని అనుచరులు, 2005).
  • దేవదారు క్రూడ్ ఆయిల్‌ని మీల్‌వర్మ్స్ (టెనెబ్రయొమా లిటర్) ఆఖరి దశ లార్వాలపై ఉపయోగించి ఎల్‌సి50 ని 3.4% గా గుర్తించారు. 12% క్రూడ్ ఆయిల్ 87% లార్వాలను చంపింది. దేవదారు క్రూడ్ ఆయిల్‌తోపాటు రసాయన పురుగు మందులు కార్బోసల్ఫాన్, ఇమిడాక్లోప్రిడ్‌లను కూడా ఉపయోగించారు. కార్బోసల్ఫాన్ యల్‌సి500.086%. కార్బోసల్ఫాన్ (0.5%) 92% లార్వాలను చంపింది. ఇమిడాక్లోప్రిడ్ ఎల్‌సి 500.23% ఇమిడాక్లోప్రిడ్ అత్యంత సమర్ధవంతంగా మీల్‌వర్మ్స్‌ని చంపింది. దేవదారు ఆయిల్‌ని ఉపయోగించిన లార్వాలలో ప్రోటీన్ పరిమాణం అత్యధికం (4.14 మి.గ్రా. / మి.లీ.) గా నమోదయింది. ఇమిడాక్లోప్రిడ్, కార్బోసల్ఫాన్ ఉపయోగించిన లార్వాలలో ప్రోటీన్ పరిమాణాలు 2.80, 2.68 మి.గ్రా / మి.లీ. గా నమోదయ్యాయి. దేవదారు ఆయిల్ లార్వాలపై అత్యధిక వికర్షక చర్యను ప్రదర్శించింది (బునేరి, అతని అనుచరులు, 2017).
  • సిడార్ ఉడ్ ఆయిల్ పల్స్‌బీటిల్, కాల్లసోబ్రూకస్ అనాలిస్, ఈగలపై శక్తివంతమైన కీటకనాశక చర్యను ప్రదర్శించింది (సింగ్ అండ్ అగర్వాల్, 1988). అనోఫెలిస్‌స్టెఫెన్సి (దోమ) పై కూడా కీటకనాశక శక్తిని చూపింది. (సింగ్, అతని అనుచరులు, 1984).
  • జమ్ముప్రావ్సిలో డోడా జిల్లాలో రైతులు దేవదారు కొయ్యతో చేసిన స్టోరేజ్‌బిన్స్‌లో ధాన్యాన్ని నిల్వ చేస్తారు. ఇందులో నిల్వ చేసిన ధాన్యాన్ని పురుగులు, శిలీంద్రాలు నష్టపరచవు.
  • దేవదారు కొమ్మలు, ఆకులను వరి పంటలో కలుపు మందుగా ఉపయోగిస్తారు. కొమ్మలు, రెమ్మలు, ఆకులను వరి పొలంలో సమంగా వెదజల్లుతారు. సిడార్ ఉడ్ ఆయిల్ కలుపు మందు లక్షణాల వల్ల కలుపు మొక్కలు వీటిని తాకితే చనిపోతాయి.
  • మొక్కజొన్న విత్తనాలను విత్తేముందు సిడార్ ఉడ్ ఆయిల్‌తో శుద్ధి చేస్తే పురుగుల బారి నుండి కాపాడుతుంది. ఈ పద్ధతి చాలా సమర్ధవంతంగా పని చేస్తుంది.
  • సిడార్ ఉడ్ ఆయిల్ కీటకనాశక చర్యవల్ల లద్దె పురుగు నివారింపబడుతుంది.
  • వరి పండించే ప్రాంతాల్లో పురుగుల నివారణకు వరి నారు మడికి నీరు అధికంగా ఇస్తారు. దీని వలన నీటి స్థాయి పెరిగి లద్దె పురుగు మొక్కలపై ఆకుల మీదకు ప్రాకుతుంది. ఒక కర్ర చివరలో గుడ్డ కట్టి ఆయిల్‌లో ముంచి ఆకులపై చల్లాలి. ఆకులపై కొచ్చిన లార్వాలు ఆయిల్ కీటకనాశక చర్యల వల్ల చనిపోతాయి.
  • టిక్స్ ఆశించిన పెంపుడు జంతువులపై సిడార్ ఉడ్ ఆయిల్ కలిపిన నీటిని చల్లితే పురుగులు చనిపోతాయి. (స్లాతియా, అతని అనుచరులు, 2007).
    దేవదారు కొయ్య/గుజ్జుకి చెదలను తట్టుకునే శక్తి ఉంది.
  • సిడార్ ఉడ్‌తో తయారు చేసిన కతార్, కొత్తి, బార, డొబ్లి వంటివి సంప్రదాయకంగా ధాన్యాన్ని నిల్వ చేసే నిర్మాణాలు (ఠాకూర్ అండ్ ప్రితి, 2011).
  • సిడార్ ఉడ్ ఎసెన్షియల్ ఆయిల్ (1000 పిపియం) మినుము నిల్వ గింజలలో ఆశించే ఆస్పర్ౙిల్లస్ నైగర్, కర్వులేరియా ఒవాయిడియా శిలీంద్రాల పెరుగుదల నరికట్టాయి (సింగ్ అండ్ త్రిపాఠీ, 1999).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

అసాధారణ వాతావరణ పరిస్థితులకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక

వాతావరణ మార్పుల ప్రభావం వల్ల వ్యవసాయ రంగం ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. భారతదేశ వ్యవసాయం ప్రధానంగా వర్షాధారం పై ఆధారపడి ఉంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1వ తేదీన కేరళ తీరాన్ని చేరుకొని, క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో సాధారణంగా జూన్ మొదటి లేదా రెండవ వారంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. రైతులు ఈ వర్షాలను ఆధారంగా చేసుకొని ఖరీఫ్ పంటల సాగును ప్రారంభిస్తారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా నైరుతి రుతుపవనాల రాక ఒకటి నుండి మూడు వారాల వరకు ఆలస్యమవుతోంది. దీని కారణంగా విత్తనాల మొలక ఆలస్యం కావడం, సాగు విస్తీర్ణం తగ్గడం, నేలలో తేమ కొరత ఏర్పడడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అదేవిధంగా, వర్షపాతం ఆలస్యంగా ప్రారంభమవడం, ఒకేసారి అధిక వర్షపాతం నమోదవడం, పంట పెరుగుదల మధ్యలో పొడి విరామాలు (డ్రై స్పెల్స్) ఏర్పడడం, తుఫానులు, వడగాల్పులు మరియు ఉష్ణోగ్రతలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు వంటి అసాధారణ వాతావరణ పరిస్థితులు పంటల పెరుగుదల మరియు దిగుబడిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ముందస్తు ప్రణాళికతో స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన ప్రత్యామ్నాయ పంటలను మరియు తక్కువ వ్యవధిలో పరిపక్వత చెందే పంట రకాలను ఎంపిక చేసుకొని సాగు చేయడం ద్వారా నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, విత్తే సమయాల్లో అవసరమైన మార్పులు, స్వల్పకాలిక పంట రకాల వినియోగం, నేలలో తేమ మరియు నీటి సంరక్షణ చర్యల అమలు, అలాగే అందుబాటులో ఉన్న సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించడం వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయి.
  1. వర్షాకాలం ఆలస్యమైనప్పుడు
    వర్షాలు జూన్ నెలలో ప్రారంభం కాక జూలై లేదా ఆగస్టు వరకు ఆలస్యం అయితే సాధారణంగా సాగు చేసే దీర్ఘకాలిక పంటలకు బదులుగా స్వల్పకాలిక పంటలను ఎంచుకోవాలి. పెసర, మినుము, ఉలవలు, నువ్వులు, జొన్న, సజ్జ, కొర్రలు వంటి పంటలు తక్కువ వ్యవధిలో పూర్తవుతాయి మరియు తక్కువ నీటితో కూడా మంచి దిగుబడిని ఇస్తాయి.
  2. మధ్యలో పొడి విరామం ఏర్పడినప్పుడు
    వర్షాలు ప్రారంభమైన తరువాత కొన్ని వారాలు వర్షాభావం ఏర్పడితే నేలలో తేమను కాపాడటం అత్యంత ముఖ్యం. కలుపు నివారణ చేయడం, నేలపై మల్చింగ్ చేయడం, అంతరకృషి నిర్వహించడం, అవసరమైతే జీవరక్షక నీటిపారుదల ఇవ్వడం ద్వారా పంటను రక్షించవచ్చు. ఆకుల ద్వారా పోషకాలు అందించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
  3. అధిక వర్షాలు కురిసినప్పుడు
    భారీ వర్షాల వల్ల పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా వెంటనే బయటకు వెళ్లేలా డ్రైనేజీ సౌకర్యం కల్పించాలి. నీరు నిల్వ ఉండటం వల్ల వేరుకుళ్లు, శిలీంధ్ర వ్యాధులు మరియు పోషక లోపాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల అవసరమైన మొక్కల సంరక్షణ చర్యలు వెంటనే చేపట్టాలి.
  4. వర్షాలు ముందుగానే ముగిసినప్పుడు
    వర్షాకాలం త్వరగా ముగిసి నేలలో తేమ తగ్గినప్పుడు తక్కువ కాలంలో పూర్తయ్యే పంటలు లేదా రబీ సీజన్‌లో తక్కువ నీటితో సాగు చేయగల పంటలను ఎంచుకోవాలి. నేలలో తేమను సంరక్షించేందుకు మల్చింగ్, కన్జర్వేషన్ టిల్లేజ్ వంటి పద్ధతులు ఉపయోగించాలి.
  5. దీర్ఘకాలిక కరవు పరిస్థితులు: పంట ఎదుగుదల దశలో వర్షాలు ఆగిపోతే, మొక్కల సంఖ్యను తగ్గించి, కలుపును తీసివేసి వాటిని నేలపై కప్పి ఉంచడం ద్వారా తేమను కాపాడుకోవాలి. నీటి ఎద్దడిని తట్టుకునే పంటలను (అలసందలు) వంటివి సాగు చేయడం మేలు.

ప్రత్యామ్నాయంగా సాగు చేయదగిన పంటలు
• వేరుశెనగకు బదులుగా – పెసర, నువ్వులు, ఉలవలు
• వరికి బదులుగా – జొన్న, సజ్జ, రాగులు
• పత్తికి బదులుగా – పెసర, మినుము, నువ్వులు
• మొక్కజొన్నకు బదులుగా – జొన్న, కొర్రలు, సజ్జ

రైతులు పాటించాల్సిన ముఖ్య సూచనలు
• వాతావరణ శాఖ సూచనలను ప్రతిరోజూ గమనించాలి.
• స్థానిక వ్యవసాయ అధికారుల సలహాలను పాటించాలి.
• ధృవీకరించిన విత్తనాలను మాత్రమే వినియోగించాలి.
• వర్షపు నీటిని సంరక్షించే చర్యలు చేపట్టాలి.
• పంటల బీమా పథకాలలో నమోదు చేసుకోవాలి.
• సమగ్ర పంటల నిర్వహణ పద్ధతులను అనుసరించాలి.

నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండటం వల్ల మొక్కల ఎదుగుదల మెరుగుపడి, వర్షాభావ పరిస్థితుల్లో కూడా పంటలు నిలదొక్కుకుని మంచి దిగుబడిని ఇస్తాయి.
• వేసవి దుక్కి: వేసవిలో లోతుగా దున్నడం వల్ల వర్షపు నీరు నేలలోకి బాగా ఇంకి తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అలాగే కలుపు మొక్కలు మరియు కొన్ని కీటకాల సమస్య కూడా తగ్గుతుంది.
• వాలు ప్రాంతాల్లో భూమి సమోన్నత రేఖలకు అనుగుణంగా దున్నడం వల్ల వర్షపు నీటి ప్రవాహం తగ్గి నేల కోత నివారించబడుతుంది.
• పొలాన్ని చిన్న చిన్న గట్లుగా విభజించడం ద్వారా వర్షపు నీరు పొలంలోనే నిలిచి నేలలోకి ఇంకుతుంది.
• మల్చింగ్: పంట అవశేషాలు, గడ్డి లేదా ప్లాస్టిక్ మల్చ్ను నేలపై పరచడం ద్వారా నేల నుంచి నీటి ఆవిరీభవనం తగ్గి తేమ ఎక్కువ కాలం ఉంటుంది. అలాగే కలుపు మొక్కల పెరుగుదల కూడా తగ్గుతుంది.
• అంతరకృషి: పంటల మధ్య తేలికగా దున్నడం వల్ల నేలపై ఏర్పడే గట్టి పొర తొలగి నీటి చొరబాటు మెరుగుపడుతుంది మరియు తేమ నష్టం తగ్గుతుంది.
• సమయానికి కలుపు నివారణ: కలుపు మొక్కలు నేలలోని తేమను ఎక్కువగా వినియోగిస్తాయి. కాబట్టి వాటిని తొలగించడం ద్వారా ప్రధాన పంటకు తేమ ఎక్కువగా అందుతుంది.
• వెడల్పు వరుసల సాగు: నీరు సులభంగా చొరబడేలా వెడల్పు బెడ్లు మరియు కాలువలు ఏర్పాటు చేయడం ద్వారా నీటి నిల్వ, పారుదల రెండూ మెరుగుపడతాయి.
• సేంద్రీయ పదార్థాల వినియోగం పశువుల ఎరువు, కంపోస్ట్, పంట అవశేషాలను నేలలో కలపడం వల్ల నేల నిర్మాణం మెరుగుపడి నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం పెరుగుతుంది.

ప్రస్తుతం వాతావరణ మార్పులు వ్యవసాయానికి ప్రధాన సవాలుగా మారాయి. అయితే అసాధారణ వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, తగిన ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను అమలు చేయడం ద్వారా రైతులు పంట నష్టాలను తగ్గించుకొని స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం, వాతావరణ ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం మరియు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేయడం ద్వారా వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవచ్చు.

ఇ. ప్రియాంకబాయి, రిసెర్చ్ అసోసియేట్, యాజమాన్య విభాగము,
వ్యవసాయ పరిశోధన స్థానం, కదిరి, ఫోన్ : 7674886210

Read More