రైతు క్షేత్ర మరియు గృహ సంబంధిత అవసరాలు తీర్చే గృహలక్ష్మి బయోగ్యాస్ (గోబర్ గ్యాస్)

భారత దేశం బలమైన గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ కలిగిన దేశంగా ప్రపంచ ఖ్యాతి పొందినది. కారణం భారత ఆర్ధిక వ్యవస్థ ఎక్కువ మోతాదులో ప్రత్యక్షంగా వ్యవసాయం ద్వారా మరియు పరోక్షం గాను వ్యవసాయ ఆధారిత ఉత్పతుల ఎగుమతులు, వాణిజ్య పంటల ద్వారా ఎక్కువ మూలధనం అందేది. గ్రామీణ ఆర్ధిక వ్యవస్ద ఎప్పుడూ స్ధిరంగా ఉండేది. ఇటు రైతులు మరియు వ్యవసాయ అనుబంధ కార్మికుల ఆర్థికపరమైన ప్రగతి పెరగడంతో పాటు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల కర్మాగారాలు ప్రారంభించి పెట్టుబడి పెట్టి ఇటు ఉపాది కల్పనతో పాటు మంచి ఆర్ధిక ప్రగతిని సాధించేవారు. అంతే కాకుండా వ్యవసాయానికి పశు సంపదకు సంబందం వీడదీయలేనిది. కావున పాల ఉత్పత్తుల సంస్దలను ఏర్పాటు చేసి పాడి రైతులకు చేయూత అందించి ఇటు పశు పోషణలో గణనీయమైన అభివృద్ది సాధించారు. ప్రపంచమంతా ఆర్ధిక మాంధ్యంలో చిక్కుకొని పోయి అమెరికా, రష్యా వంటి అగ్ర రాజ్యాలు ఆర్ధిక పురోగతి దెబ్బ తిని ఆ దేశాల ప్రజలు విల విల లాడారు. అటు వంటి సమయంలో భారత ఆర్ధిక వ్యవస్ద దెబ్బ తినకుండా నిల్చొని ప్రపంచదేశాలకు ధీటుగా జవాబు ఇచ్చింది. దానికి ప్రధాన కారణాలు పైన పేర్కొన్న అంశాలే కానీ ప్రస్తుతం అంతా విరుద్ధంగా మారింది, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. వ్యవసాయాన్ని పూర్తిగా తగ్గించి ఎక్కువమంది పట్టణాల వైపు తరలిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం వ్యవసాయ వ్యయo పెరగడంతో పాటు నష్టాలు పెరగడంతో అధిక శారరిక శ్రమ, కూలీల ఖర్చులు అదనపు భారంగా మారడం వల్ల పూర్తిగా విఫలమయింది. దీనికి తోడు రైతుకు చేదోడు వాదోడు వుండే పశుపోషణ వ్యవస్దను పూర్తిగా నిర్లక్ష్య పరచడం కూడా ఒక ప్రధాన కారణం. నేల ఫల శక్తికి మూల కారణం అయిన సేంద్రియ ఎరువుల ఉత్పత్తి, కేవలం పశుపోషణ ద్వారా సాధ్యం అయ్యేది, ఈ పశుపోషణ ద్వారా వచ్చే సేంద్రియ పదార్దం నేలను సుదీర్గకాలం పదిలంగా ఉండేలా చేస్తుంది. కానీ ప్రస్తుత రైతులు సేంద్రియ ఎరువులు పూర్తిగా వదిలేసి కేవలం వాణిజ్య రసాయనిక ఎరువుల పైనే చొరవ చూపడం వల్ల నేలలో సేంద్రియ పదార్దం స్థితిగతులు పూర్తిగా తగ్గిపోయి నేల జీవ శక్తి క్షీణించి రసాయనిక ఎరువుల వల్ల నేల కలుషిత మై బీడు భూములుగా మారి పోయాయి. ఇది ఇలా ఉండగా ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలో వంట చెరకు నిమిత్తం వృక్ష సంపద పైన మాత్రమే ఆధారపడే వారు. కానీ ఇప్పుడు పట్టణ ప్రాంతవాసుల వలే వంట గ్యాస్ కు పూర్తిగా అలవాటు పడినారు. ఒక వైపు శిలాజ ఇంధనాల ద్వారా వచ్చే గ్యాస్ వాడుక వల్ల వాటి ధరలు పెరగడంతో పాటు ప్రక్క దేశాల నుంచి దిగుమతి చేసుకొనే స్థితికి చేరగా శిలాజ ఇంధనాల తరుగుదల వలన, వివిధ దేశాల మధ్య యుద్ద వాతవరణాల వలన వంట గ్యాస్ ధరలు ఆకాశానికి అందేలా మారి ఇటు గ్రామీణ మరియు పట్టణ ప్రాంత వాసులకు అదనపు భారంగా మారింది. ముఖ్యంగా గ్రామీణ ఆర్ధిక వ్యవస్ద అభివృద్దికి సహకరించే సేంద్రియ ఎరువుల అవసరాన్ని తీర్చి నేల సారాన్ని పెంచే అధిక ఖర్చులతో కూడిన గ్యాస్ వంట బదులుగా పంట సంబంధిత వ్యర్దాలను, మరియు పశు వ్యర్ధాలతో అవాయు పరిస్దితులలో కుళ్ళింప చేసి అటు వంటకు గ్యాస్ మరియు ఇటు పోలానికి సేంద్రియ ఎరువును అందించవచ్చు. ఏమిటి ఆ పక్రియ అంటే బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ తయారీ విదానం. బయోగ్యాస్ ఉత్పత్తికి అవసరమగు అవాయు పరిస్దితుల్లో పని చేసే డైజెస్టర్ 1859లో ముoబై నగరంలో ఏర్పాటు చేసినప్పటికీ ఈ విదానం మొట్టమొదట జర్మన్ శాస్త్రవేత్తలు రెండవ ప్రపంచ యుద్ద సమయంలో బయోగ్యాస్ విధానాన్ని ఆధునికరణం చేసి సులభంగా వాడేలా చేశారు. ఒకప్పుడు బయోగ్యాస్ ఉత్పత్తిలో అగ్ర స్ధానంలో జెర్మనీ ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం చైనా దానిని అధికమించి అగ్రగామిగా ముందుకు వెళుతుంది. దానికి కారణం ఆ విధానంలో వున్న అధిక ఉపయోగాలే. మన దేశంలో కూడా భారతీయ వ్యవసాయ పరిశోధన స్ధానం బయోగ్యాస్ అభివృద్దికి అనేక పరిశోధనలు చేసి ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ సంస్ద ద్వారా ప్రజలకు సలహలు, సూచనలు, అవగహన కల్పిస్తున్నారు మరియు ప్రోత్సహిస్తున్నారు.

  1. బయోగ్యాస్ ప్లాంట్ మొత్తం అన్నీ విభాగాలను చూపించే నమూనా పటం

బయోగ్యాస్ తయారీ విధానం మరియు ముఖ్య విభాగాలు : బయోగ్యాస్ తయారీలో ముఖ్యంగా రెండు ప్రధాన విభాగాలు కలవు అవి ఒకటి వ్యర్ద పదార్థాలను సంగ్రహించే విభాగం, రెండవది వ్యర్ద పదార్థాలను అవాయు పరిస్దితుల్లో కుళ్ళింపజేసి బయోగ్యాస్ ఉత్పత్తి జరిపే డైజెస్టర్

కలిపే విభాగం (సంగ్రహణ విభాగం) :  ఈ విభాగం డైజెస్టర్ కు ప్రక్కన ఉండే భాగం. ఈ విభాగం ద్వారా బయోగ్యాస్ తయారీ కి అవసరం అగు వివిధ వృక్ష మరియు జంతు సంబందిత వ్యర్ద పధార్థాలు, గృహ సంబంధిత వ్యర్ధ పదార్దలను లోపలకి వేసి అవాయు పరిస్దితుల్లో కుళ్ళింపజేయడానికి పశువుల పేడ నాలుగు భాగాలు మరియు  ఐదు భాగాలు నీరు (4 : 5) కలిపి లోపలికి పోయాలి . ఈ విధంగా పోసిన (4 : 5)  నిష్పత్తి కలిపిన పశువుల పేడ మరియు నీరు డైజెస్టర్ల లో స్టార్టర్ పదార్దంగా పనిచేసి లోపలి వ్యర్ద పదార్థాలు మిధనోకోకస్, మిధనో బాసిల్లాస్ వంటి బ్యాక్టిరియా సూక్ష్మజీవుల వలన  అవాయు పరిస్ది తుల్లో కిణ్వవణ పక్రియ ద్వారా కుళ్ళింపజేసి మీథేన్ (బయోగ్యాస్)  విడుదల అగును. 
  1. ఒకటవ రకమైన కదిలే ఢ్యుమ్ కలిగిన బయోగ్యాస్ ప్లాంట్ చిత్రం
  2. రెండవ రకమైన డైజెస్టర్ కదలని డ్యుమ్ కలిగిన బయోగ్యాస్ ప్లాంట్ చిత్రం
  3. మూడవ రకమైన దీన బంధు బయోగ్యాస్ ప్లాంట్ చిత్రం

డైజెస్టర్ : బయోగ్యాస్ (గోబర్ గ్యాస్) తయారీలో ముఖ్యమైన ప్రధాన విభాగం డైజెస్టర్ లేదా పేర్మెంటర్. బయోగ్యాస్ విభాగంలో ఇది మధ్యన ఉండి బయోగ్యాస్ తయారీకి సహకరించే అత్యంత కీలక విభాగం. సాధరణంగా బయోగ్యాస్ తయారీలో వాడే డైజెస్టర్ లేదా పేర్మెంటర్ ను మూడు రకాలుగా వర్గీకరించారు, అవి ఒకటి కదిలే ఢ్యుమ్ కలిగిన ఖాది గ్రామీణ పరిశ్రమలు కమిషన్ అభివృద్ది పరిచినది. ఈ రకపు డైజెస్టర్ ముడి ఇనుము లేదా స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారు చేయబడి పరిమాణం పరంగా మధ్యస్థంగా ఉండును. సాధారణంగా భారత దేశంలో ఈ రకపు డైజెస్టర్లు ఎక్కువగా వాడుకలో కలవు. ఈ డైజెస్టర్ కు ఉన్న గొప్ప లక్షణం ఎటువంటి నష్టం లేకుండా మరొక ప్రాంతానికి బదిలీ చేసుకోవచ్చు మరియు మార్చుకోవచ్చు.
సాధారణంగా ఈ డైజెస్టర్ నేలలో 3.5 నుంచి 6.5 మీటర్ల లోతు మరియు 1.2 నుంచి 1.6 మీటర్ల వ్యాసార్దం గుంతను తవ్వి అందులో అమర్చాలి. పైన పేర్కొన్న కొలతలు సామాన్యంగా వాడేవి. ఈ కొలతలను బయోగ్యాస్ పరిమాణాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఈ బయోగ్యాస్ డైజెస్టర్ లో రెండు గదులు కలవు. అవి మిశ్రమ విభాగం ద్వారా వేసే వ్యర్ద పదార్థాలు, వృక్ష మరియు జంతు సంబందిత వ్యర్ద పధార్థాలు, గృహ సంబంధిత వ్యర్ధ పదార్థాలను కుళ్ళింప జేసె డైజెస్టర్ . రెండవ గది డైజెస్టర్ ను రంద్రాలు కలిగిన గోడ ద్వారా వేరు చేయబడి కిణ్వన పక్రియ పూర్తి అయి బయోగ్యాస్ విడుదల జరిగిన తరువాత మిగిలిన పదార్దం ఆ రంద్రాల ద్వారా బయటకు వచ్చి చేరుకొనును. దీనిని మనం సేంద్రియ ఎరువుగా పాడి పంటలకు వాడుకోవచ్చు. డైజెస్టర్ పై భాగం కొద్దిగా వంపుగా వుండి ప్రెజర్ వాల్వుని కలిగి ఉండి వాలు కలిగిన పైపు ద్వారా వంట గదికి అమర్చుకొని వంట గ్యాస్ గా వాడుకోవచ్చు. ఈ పక్రియలో మొదట మిశ్రమ విభాగం ద్వారా వేసిన వ్యర్ద పదార్థాలు 4: 5 నిష్పత్తిలో వేసిన పేడ మరియు నీరు మిశ్రమం వల్ల కిణ్వన ప్రక్రియ జరిగి అవాయు పరిస్దితుల్లో మీథేన్ వాయువు అణువులు విడుదల అయి వంపు కలిగిన డైజెస్టర్ పై భాగాన్ని డీ కొని తడనం చెందడం ద్వారా పీడనం పెరిగి అన్నీ అణువులు ఒకదానికొకటి కలిసి బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ ను విడుదల చేయును. రెండవ రకమైన డైజెస్టర్ కదలని డ్యుమ్ కలిగిన జనతా రకం దీనిని చైనా దేశం వాళ్ళు అబివృద్ది పరిచినారు. దీనిని సాధరణంగా ఇటుక మరియు కాంక్రీట్ మిశ్రమంతో నేల లోపల నిర్మిస్తారు. ఇది పరిమాణం పరంగా పెద్దది ఎక్కువ బయోగ్యాస్ ఉత్పత్తికి ఉపయోగపడును. దీని జీవన కాల పరిమితి ఒకటి కదిలే ఢ్యుమ్ కలిగిన ఖాది గ్రామీణ పరిశ్రమలు కమిషన్ రకం తో పోల్చుకుంటే చాలా ఎక్కువ. మూడవ డైజెస్టర్ రకం దీనబంధు బయోగ్యాస్ దీనిని 1984లో ఎ. ఎఫ్. పి. ఆర్. ఓ అను నూడిల్లీకి చెందిన ఒక స్వచ్చంధ సంస్ద అభివృద్ది పరిచింది. ఇది కదిలే ఢ్యుమ్ కలిగిన ఖాది గ్రామీణ పరిశ్రమలు కమిషన్ రకం తో పోల్చితే సగం ధరలో తయారీ అగును. నిరుపేద ప్రజలకు భాగా అనుకూలం అగు డైజెస్టర్

బయోగ్యాస్ వలన కలిగే ఉపయోగాలు:

  • పశువుల పేడ మిశ్రమ ద్రావణం మరియు విచ్ఛిన్నం అగు వివిధ పదార్ధాల ద్వారా ఉత్పత్తి అయిన బయోగ్యాస్ ను ఇంటి వంటకు వాడుకోవచ్చు
  • కాంతి కోసం వాడే లాంతర్లలో నింపుకొని వాడుకోవచ్చు
  • రైతులకు సేంద్రియ ఎరువు లోటుని తీర్చి కావలసినంత సేంద్రియ ఎరువును సమకూర్చి ఆర్ధిక భారాన్ని తగ్గించి నేల ఆరోగ్యానికి కాపాడుటలో సహయపడును
  • పశుపోషణ అభివృద్దికి ప్రత్యక్షంగా ఉపయోగపడును. ఎలా అనగా బయోగ్యాస్ తయారీకి వాడే వ్యర్ధ పదార్ధాలలో అధిక భాగం పశువుల వ్యర్ధాలను వాడుతున్నారు. అంతే కాకుండా స్టార్టర్ పదార్ధంగా కూడా పశువుల పేడను వాడుట గమనించదగ్గ విషయం
  • విచ్చిన్నం అగు వ్యర్ధ పదార్ధాలను కుళ్ళింపజేయుట ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించుటలో ఉపయోగపడును
  • సాధారణ పశువుల ఎరువుతో పోల్చుకుంటే బయోగ్యాస్ సేంద్రియ ఎరువులో ఎక్కువగా పోషకాలు ఉండును. అందులో నత్రజని (2-2.5 %), భాస్వరం ( 1.5%), పోటాషియం (1 %) .
  • బయోగ్యాస్ సేంద్రియ ఎరువులో అధికంగా సేంద్రియ కర్బనం మరియు హ్యూమస్ ఉండి నేలలో వివిధ జీవరాశుల అభివృద్దికి దోహదపడును.
  • ఎటువంటి నష్టం లేకుండా ఉష్ణశక్తి మరియు విద్యుత్ శక్తి పునరుద్దరణకు సహకరించును.
  • శిలాజ ఇంధనాల వాడుకను తగ్గించి వాటి స్ధానంలో బయోగ్యాస్ వాడుట ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ సమతుల్యతను కాపాడును.
  • వాయు కాలుష్యాన్ని తగ్గించి హరితగృహ వాయువుల ఉద్గారాల ద్వారా జరిగే నష్టాన్ని తగ్గించును.
  • మిగతా సేంద్రియ ఎరువులలాగా కాకుండా చెడు వాసన లేకుండా వుండును,
  • బయోగ్యాస్ ఈగలు మరియు దోమల పునరుత్పత్తిని తగ్గించును

బయోగ్యాస్ తయారీలోన అధిగ మించవలసిన సవాళ్లు :

  • బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి అనగా డైజెస్టర్ మరియు సంగ్రహణ విభాగం తయారీ అధిక ఖర్చులతో కుడికున్నది.
  • ప్రతి రోజు పశువుల పేడ మరియు ఇతర విచ్ఛిన్నం అయ్యే వ్యర్ధాలు సేకరణ శ్రమతో పాటు స్వల్ప ఆర్ధికపరమైన ఇబ్బందితో కూడుకున్నది.
  • సాధారణ వంట గ్యాస్ తో పోల్చుకుంటే బయోగ్యాస్ తక్కువ శక్తి కలిగిన ఇంధనంగా ఉపయోగపడును
  • ఉష్ణోగ్రత తక్కువ ఉన్నట్లయితే బయోగ్యాస్ తయారీకి చాలా ఎక్కువ సమయం తీసుకొనును.
  • బయోగ్యాస్ ను తయారీ దగ్గర మాత్రమే వాడుకోవాలి. దీని నిల్వ మరియు రవాణా అధిక వ్యయంతో కూడుకున్న అంశాలు
  • బయోగ్యాస్ తో పాటుగా కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ సల్పేట్ వంటి వాయువులను వాడుకకు ముందు తొలగించాల్సిన అవసరం తప్పనిసరి
  • బయోగ్యాస్ ప్లాంట్ కు తగిన యాజమాన్య పద్దతులు పాటించకపోవడం వల్ల మీధేన్ వాయువు బయటకు విడుదల వలన హరిత వాయువుల మోతాదును పెంచడంతో పాటు మండే లక్షణం ఉండుట వలన అగ్ని ప్రమాదాలకు కారణం అగును
  • నైపుణ్యం కలిగిన వ్యక్తుల పర్యవేక్షణ మరియు శిక్షణ కలిగిన వ్యక్తులు ఉండి తగిన యాజమాన్య పద్దతులు పాటించుట వలన బయోగ్యాస్ తయారీలోని అవరోధాలను అధిగమించవచ్చు.

బయోగ్యాస్ తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

  1. 60 ఘనపు అడుగులు లేదా 2 మీటర్3 పరిమాణం కలిగిన బయోగ్యాస్ తయారీకి రోజుకి కనీసం 45-55 కేజీల పేడ అవసరం అంటే దీని కోసం 5 ఆవులు లేదా 5 గేదెలు అవసరం
  2. మానవ విసర్జన పదార్ధాలను (నైట్ సాయిల్) రోజుకి 60 కేజీలు హోటల్స్ మరియు హాస్టల్స్ , ప్రజల మరుగుదొడ్డి నుంచి సంగ్రహించి కూడా బయోగ్యాస్ తయారు చేయవచ్చు.
  3. ఒక పశువుల పేడే కాకుండా పందుల, కోళ్ళ విసర్జక పదార్దలను కూడా బయోగ్యాస్ తయారీలో వాడవచ్చు.
  4. బయోగ్యాస్ తయారికీ వాడే డైజెస్టర్ కి సూర్యరశ్మి సరిపడ తగిలేలా చూసుకోవాలి దీనివలన డైజెస్టర్ అంతర భాగంలో కిణ్వన ప్రక్రియ త్వరగా జరిగి ఇటు మీధేన్ వాయువు తయారీలో మరియు సేంద్రియ ఎరువు తయారీలో ఎంత గానో ఉపయోగపడును,
  5. బయోగ్యాస్ ప్లాంట్ కు మరియు వంట గదికి మధ్య దూరం 20 మీటర్ల కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి.
  6. బయోగ్యాస్ ప్లాంట్ ను మరియు వంట గదిని కలిపే పైపును కొద్దిగా వాలుగా వుండేటట్లు చూసుకోవాలి.
  7. బయోగ్యాస్ ప్లాంట్ ఉంచుటకు గట్టిగా ఉండే నేలను ఎంపిక చేసుకోవడం ఉత్తమం
  8. బయోగ్యాస్ ప్లాంట్ ఉంచుటకు వాడే నేలలో నీటి ముంపు లేకుండా చూసుకోవాలి.
  9. బయోగ్యాస్ డైజస్టర్ ఇనుముతో తయారీ చేసినది అయితే అది త్రుప్పు పట్టకుండా రంగును వేసుకోవాలి.
  10. శీతకాలంలో డైజస్టర్ లో ఉష్ణ నష్టం జరగకుండా నివారించుటకు పైన వరి గడ్డి వేసుకోవాలి.
  11. పేడ ద్రావణం మరియు ఇతర పదార్థాల ద్వారా డైజెస్టర్లోనికి ఇసుక చేరకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి
  12. భాగా కుళ్లిన ఎక్కువ మొలాసిస్ ను శీతకాలంలో వేయరాదు, ఎందుకు అనగా దీని వలన సరిగా మండని బయోగ్యాస్ విడుదల అగును.
  13. అరటి మరియు గుర్రపు డెక్కలను 5 – 10 సెం,మీ కత్తిరించుకొని సంగ్రహణ విభాగం ద్వారా డైజస్టర్ లోకి పంపుకోవాలి.
  14. నీలగిరి లేదా యూకలిప్టస్ ఆకులను 5 రోజులు నీటిలో నానబెట్టిన మిశ్రమాన్ని పేడ ద్రావణం వేయడానికి ముందుగా వేసుకోవాలి.
  15. విచ్ఛిన్నం అగు గృహ మరియు ఇతర వ్యర్ధ పదార్థాలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించికుని, వరి మరియు అరటి కాండం ముక్కలను పశువుల పేడ ద్రావణంతో కలిపి సంగ్రహణ విభాగం ద్వారా డైజస్టర్ లోకి పంపుకోవాలి.
  16. పశువుల పేడ ద్రావణం మిట్ట మధ్యాహ్నం డైజస్టర్ లోకి సంగ్రహణ విభాగం ద్వారా పంపుకోవాలి.
  17. ఉదయం మరియు సాయంత్రం బయోగ్యాస్ విడుదల అగు గొట్టం ద్వారా దేని సహయంతో నైనా డైజస్టర్ లోపలి భాగంలోని చెత్తను 50 సార్లు బాగా కలుపుకోవాలి. దీనివలన డైజెస్టర్ లో పేరుకు పోయిన తెట్టును సులభంగా తొలగించి బయోగ్యాస్ విడుదలకు సహకరించును. పై విధంగా గ్రామీణ ప్రాంతాలలో రైతులు బయోగ్యాస్ తయారీ విధానాన్ని అనుసరించుట వలన ఇంటికి కావలసిన వంట గ్యాస్ అందించుట తో పాటు రైతుకు కావల్సిన సేంద్రియ ఎరువు అందించుట వలన నేల ఆరోగ్యాన్ని కాపాడుటతో పాటు బయోగ్యాస్ తయారీకి పశువుల ఎరువు పశువుల నుంచి సంగ్రహించుట ద్వారా పశుపోషణ ప్రోత్సహించి రైతులు ఆర్ధికంగా ప్రగతికి ఉపయోగపడుతూ పరిసరాలలో వ్యర్ద పదార్దాల కాలుష్యం నుంచి కాపాడుతుంది. ఈ విధంగా రైతుకు అన్నీ రకాలుగా చేయూతను ఇవ్వడం వలన బయోగ్యాస్ ను రైతు క్షేత్ర మరియు గృహ సంబందిత అవసరాలు తీర్చే గృహలక్ష్మి అని పిలవడంలో అతిశయోక్తి లేదు.

టి. రాజశేఖర్, సిహెచ్. సీత రామ లక్ష్మి, ఎ. శీరిష, ఎమ్. చారుమతి, ఎన్ . భారతి, టి. శ్రీలత, ఎమ్. ముకుందరావు
వ్యవసాయ పాలిటెక్నిక్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్ధానం, అనకాపల్లి
ఫోన్: 6304852859

Read More

ఔషధ మొక్క… కసివింద

కసివింద ఎక్కువగా ఎర్రనేలలు, గరువు భూములు, రోడ్ల ప్రక్కన, కొండల దిగువ భాగంలో గట్ల మీద ఉంటుంది. సుమారు 60-90 సెం.మీ. ఎత్తు పెరిగి బలమైన వేర్లతో పొదవలే వ్యాపించి ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో ఈ మొక్కలు విపరీతంగా వ్యాప్తి చెంది ఇతర మొక్కలను రాకుండా చేస్తాయి. ఆకులు బలిష్టంగా చింతాకుల వలె ఉంటాయి. పూవులు పసుపు పచ్ౘ్రంగులో కొమ్మల సందులలో గుచ్ఛాలు వలె ఉంటాయి. వీటి విత్తనాలకు మొలకెత్తే శక్తి చాలా కాలం వరకు ఉంటుంది. ఇది విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది.

సాధారణ నామం : కాఫీసెన్న శాస్త్రీయ నామం : క్యాసియా ఆక్సిడెంటాలిస్ కుటుంబం: ఫాబేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • ఆకులు, వేర్లు, గింజలు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. వీటిలో సెన్నోసైడ్లు, నాఫ్తలిన్ గ్లెåకోసైడ్లు, ఫ్లేవనాయిడ్లు, ఆవిరయ్యే నూనె, క్రైసోఫినాల్, ఎమోడిన్, క్రూడ్‌ఫైబర్, కాల్షియం, ఇనుము, నియోసిన్ మొదలగునవి ఉంటాయి.
  • ఈ మొక్క వేరును మిరియాలతో కలిపి పాముకాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు. దీని వేర్ల కషాయం కుష్టువ్యాధి చికిత్సకు కూడా ఉపయోగపడుతుంది.
  • మొక్క సమూలంగా కోరింత దగ్గు, వ్రణాలు, బొల్లి, మూత్రకోశ వ్యాధులు, మూర్ఛవ్యాధి, హిస్టీరియా వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది.

వ్యవసాయరంగంలో

  • కసివింద పెట్రోలియం ఈదర్ మరియు ఎన్‌బ్యుటనాల్ ద్రావణాలు (200 మరియు 300 పిపియం) క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్ లార్వాలను 100% చంపాయి. దీనిని రసాయన పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. (దీపక్ కుమార్, అతని అనుచరులు, 2014).
  • కసివింద ఆకుల క్రూడ్ ఇథనాలిక్ ద్రావణం 80 మైక్రోగ్రాములు / మి.లీ. మోతాదుకు పైన రైపిసిఫాలస్ మాన్యులేటస్ గుడ్లు పొదగడాన్ని అకారిసైడల్ చర్య ద్వారా పూర్తిగా నివారించింది. (సునీల్, అతని అనుచరులు, 2012).
  • కసివింద జీవపురుగుమందు మొక్కజొన్న పంటలో అత్యధిక పెరుగుదలనిచ్చింది. (పంగ్నాకోర్న్, అతని అనుచరులు, 1999). అదనంగా కసివింద మొక్కజొన్న పంటనాశించే పేనుబంక, రొఫాలోసైఫం మెయిడిస్, మొక్కజొన్న తొలుచు పురుగు, ఆస్ట్రినియా ఫ్యూమకాలిస్, ఆర్మివర్మ్, మితిమ్న సపరేటస్‌లను అత్యంత సమర్ధవంతంగా నివారించింది.
  • కసివింద ఎసెన్షియల్ ఆయిల్ రైజోపెర్తా డామినిక, ట్రైబోలియం కాస్టానియం, క్రిప్టోలెస్టెస్ ఫెర్రుజినియస్, లైపోసెలిస్ పీటాపై కీటకనాశక చర్యను ప్రదర్శించింది (వాకిల్, అతని అనుచరులు, 2012).
  • కసివింద ఆకుల నీటి ద్రావణం పునరుత్పత్తి చర్యను, చన్న పంక్టేటస్ చేపలలో యాంటిఇన్‌ఫ్లమేటరి చర్యను ప్రదర్శిస్తుంది. (మనె, అతని అనుచరులు, 2012).
  • కసివింద ద్రావణం గోధుమ గింజలనాశించే ట్రోగోడెర్మా గ్రానేరియం పురుగు చావు మరియు పెద్ద పురుగుల సంతతిపై అధిక సామర్థ్యాన్ని ప్రదర్శించింది (దెర్బాలా, 2012).
  • మొక్క రక్షణ వ్యవస్థలో ప్లాంట్ ప్రోటియేజ్ ఇన్హిబిటర్ (పిపిఐ) ఒక ముఖ్యభాగం. పిపిఐ మొక్కలనాశించే పురుగులు, సూక్ష్మజీవులపై చురుకుగా పనిచేస్తుంది. క్యాసియా స్పీసీస్ యాంటి ఇన్‌సెక్టిసైడల్ మరియు యాంటిమైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. కసివింద ఆకుల నుండి ఫిస్టులన్ అనే పిపిఐని వేరు చేశారు. ఈ పిపిఐ స్టెఫైలోకోకస్ ఆరియస్, ఎస్కెరిచియాకోలి, బాసిల్లస్ సబ్‌టైలిస్, క్లెబ్సియెల్లా న్యుమోనియాలను స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్‌కి సమానంగా అరికట్టింది (అరుల్ పాండి అండ్ సంగీత, 2012).
  • కసివింద పూల ఇథైల్ అసిటేట్ ద్రావణం నుండి వేరు చేసిన రీన్ (1,8డైహైడ్రాక్సిఆంత్రాక్వినోన3కార్బాక్సిలిక్ యాసిడ్) 1000 పిపియం హెలికోవర్పా ఆర్మిజెరాపై 76.13% యాంటి ఫీడెంట్ చర్యను ప్రదర్శించింది. రీన్ హెలికోవర్పా ఆర్మిజెరా (67.5%), స్పోడోప్టెరా లిటోర (36.25)లపై లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది. బ్రతికిన లార్వాలు రూపం మారిన పెద్ద పురుగులనుత్పత్తి చేశాయి (దురైపాండియన్, అతని అనుచరులు, 2010).
  • క్యాసియాపెన్నా ద్రావణం అత్యంత సమర్ధవంతంగా గోధుమ గింజల నాశించే ట్రోగోడెర్మా గ్రానేరియంని అరికట్టింది. ఈ ద్రావణంలో కీటకనాశక చర్యగల వివిధ జీవ చర్యలు గల కాంపౌండ్స్ ఉన్నాయి. ఈ ద్రావణాన్ని గోధుమగింజలను ఈ పురుగు నుండి కాపాడటానికి రసాయన పురుగుమందులకు ఒక సురక్షిత ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. (దెర్బలా, 2017).
  • చక్రపాణి మిశ్రా విశ్వవల్లభ (అధ్యాయం 8, శ్లోకం 39)లో పురుగుల నివారణకు కసివింద, శాపిండస్ ఎమార్ౙినేటస్, కానుగ, ఆల్‌స్టోనియా స్కాలరిస్, ఎంబెలియా రైబ్స్ బెరడు పొడిని ఆవుమూత్రంలో రాత్రంతా నానబెట్టి చెట్లలో ఆశించిన భాగాలపై పేస్టుగా పూయాలని సిఫారసు చేశారు (సాథేల్, 2004)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… రేల చెట్టు

రేలచెట్టు ఒక మధ్యమ పరిమాణం గల చెట్టు. ఇది వేగంగా పెరిగే 10-20 మీ. ఎత్తు పెరగే చెట్టు. ఆకులు 15-60 సెం.మీ. పొడవుంటాయి. ప్రతి పెద్ద ఆకులో 3-8 జతల చిన్న ఆకులుంటాయి. ప్రతి చిన్న ఆకు 7-21 సెం.మీ. పొడవు, 4-9 సెం.మీ. వెడల్పు వుంటుంది. పూలు 20-40 సెం.మీ. రెసిమ్‌లో ఏర్పడతాయి. ప్రతి పూవు 4-7 సెం.మీ. వ్యాసము ఉండి 5 పసుపు రంగు ఆకర్షక పత్రాలుంటాయి. కాయ 30-60 సెం.మీ. పొడవు, 1.5-3.5 సెం.మీ. వెడల్పు వుంటుంది. కాయలో గింజలుంటాయి. చెట్టు కొయ్య బలంగా వుండి, దీర్ఘకాలం మన్నిక కలిగి ఉంటుంది.

సాధారణ నామం : గోల్డెన్ షవర్ శాస్త్రీయ నామం : క్యాసియా ఫిస్ట్యులా కుటుంబం: సీసాల్పినియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • చెట్టు యొక్క అన్ని భాగాలు ఔషద గుణాలు కలిగి ఉంటాయి. ఇందులో సెన్నోసైడ్స్, రీన్ గ్లూకోసైడ్స్, బార్సలాయిన్, ఎలోయిన్, ఫార్మిక్ ఆమ్లం, టానిన్లు, ఆక్సిఆంధ్రాక్వినోన్లు ఉంటాయి.
  • మొక్క భాగాలన్నీ ముఖ్యంగా పండులోని గుజ్ౙు మలబద్ధకాన్ని పోగొట్టి మూలవ్యాధి చికిత్సకు ఉపయోగపడతాయి.
    వేర్లు చర్మవ్యాధులు, సిఫిలిస్ చికిత్సకు ఉపయోగపడతాయి.

వ్యవసాయరంగంలో

  • రేల చెట్టు నీటి ద్రావణం (0.25%) రైజోపెర్తా డామినికపై బలమైన యాంటిఫీడెంట్ ప్రభావాన్ని చూపింది (రాజారామ్ శైలజ్, ఆమె అనుచరులు, 2013).
  • రేల చెట్టు ఆకు ద్రావణం సైటోఫిలస్ ఒరైజెపై యాంటి ఫీడెంట్ చర్యను ప్రదర్శించింది.
  • క్యాసియాటోరా ఇథైల్ ఎసిటేట్ ద్రావణం హెలికోవర్పా ఆర్మిజరాపై 65% కన్నా ఎక్కువ యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది (రాజి, ఆమె అనుచరులు, 2016).
  • రేల చెట్టు ఇథనాల్ ద్రావణాలు స్పోడోప్టెరా లిటూర 3వ దశ లార్వాలపై అధిక లార్విసైడల్ చర్యను ప్రదర్శించాయి (చౌహాన్, అతని అనుచరులు, 2011).
  • రేల చెట్టు ద్రావణం పీచ్ పండుఈగ, బాక్ట్రోసిరా జోనేట గణనీయమైన గుడ్లు పెట్టడాన్ని నిరోధించే చర్యను ప్రదర్శించింది. దీనిని పీచ్ పండుఈగ యాజమాన్యంలో ఉపయోగించవచ్చు. (ఇలియాస్, అతని అనుచరులు, 2017).
  • రేల చెట్టు ద్రావణం రైస్ వీవిల్, సైటోఫిలస్ ఒరైజె చావు, పెద్ద పురుగుల విడుదలను తగ్గించడంపై అధిక ప్రభావాన్ని చూపింది (డెర్బలా, అతని అనుచరులు, 2012).
  • వీవర్ అండ్ సుబ్రమణ్యం (2000) నిల్వధాన్యంలో ఆశించే పురుగులను నివారించే లక్షణాలు గల 200 మొక్కలను గుర్తించారు. అందులో రేల చెట్టు కూడా ఒకటి.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

తీగజాతి కూరగాయల్లో పందిరి సాగు – అధిక దిగుబడికి మార్గం

తీగజాతి కూరగాయలు మన రైతులు విస్తృతంగా సాగు చేస్తున్న ముఖ్యమైన కూరగాయ పంటలు. దోసకాయ, బీరకాయ, కాకరకాయ, సొరకాయ, పొట్లకాయ, చిక్కుడు వంటి పంటలను సాధారణంగా నేలపై పాకే విధానంలో సాగు చేస్తారు. అయితే పందిరి సాగు విధానం ద్వారా తీగలను పైకి పెంచడం వల్ల పంటలో గాలి, వెలుతురు ప్రసరణ మెరుగుపడి, కాయల నాణ్యత పెరగడంతో పాటు కోత, పంట సంరక్షణ పనులు సులభతరం అవుతాయి. సరైన యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు పందిరి సాగు రైతులకు అధిక దిగుబడి మరియు మెరుగైన ఆదాయాన్ని అందించే అవకాశం ఉంది.

పందిరి సాగు అంటే ఏమిటి?
తీగజాతి కూరగాయల తీగలను నేలపై పాకనివ్వకుండా, వెదురు, ఇనుప స్తంభాలు, జీఐ వైర్లు, ప్లాస్టిక్ లేదా నైలాన్ తాళ్ల సహాయంతో ఒక ఎత్తైన నిర్మాణాన్ని ఏర్పాటు చేసి దానిపై తీగలను పెంచే విధానాన్ని పందిరి సాగు అంటారు. పంటను బట్టి పందిరి ఎత్తు, స్తంభాల మధ్య దూరం మరియు ఉపయోగించే వస్తువులు నిర్ణయించాలి.

పందిరి సాగుకు అనుకూలమైన పంటలు
బీరకాయ, కాకరకాయ, సొరకాయ, పొట్లకాయ, దోసకాయ, చిక్కుడు వంటి తీగజాతి కూరగాయలను పందిరి విధానంలో విజయవంతంగా సాగు చేయవచ్చు. పంట స్వభావం, తీగల పెరుగుదల మరియు కాయల బరువును బట్టి పందిరి నిర్మాణాన్ని బలంగా ఏర్పాటు చేయాలి.

పందిరి సాగు వల్ల ప్రయోజనాలు

  1. మొక్కలకు మంచి గాలి, వెలుతురు
    తీగలు నేలపై పాకకుండా పైకి పెరగడం వల్ల మొక్కల మధ్య గాలి ప్రసరణ మెరుగుపడుతుంది. తగినంత సూర్యకాంతి అందడంతో మొక్కల పెరుగుదల చురుకుగా ఉంటుంది.
  2. తెగుళ్ల ఉధృతి తగ్గే అవకాశం
    మొక్కల భాగాలు నేలతో నేరుగా సంబంధం లేకపోవడం వల్ల అధిక తేమ కారణంగా వచ్చే కొన్ని శిలీంధ్ర తెగుళ్ల సమస్యను తగ్గించవచ్చు. అయితే సమగ్ర పంట సంరక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలి.
  3. కాయల నాణ్యత మెరుగుదల
    పందిరిపై వేలాడుతూ పెరిగే కాయలు నేలను తాకకుండా ఉండటం వల్ల కాయలపై మచ్చలు, వంకరలు మరియు నేలతో సంబంధం వల్ల వచ్చే నాణ్యత లోపాలు తగ్గుతాయి. తద్వారా మార్కెట్లో మంచి ధర పొందే అవకాశం ఉంటుంది.
  4. కోత సులభతరం
    పందిరిపై కాయలు స్పష్టంగా కనిపించడం వల్ల కోత సమయంలో కాయలను గుర్తించడం సులభంగా ఉంటుంది. దీనివల్ల కోతకు పట్టే సమయం మరియు శ్రమ తగ్గుతుంది.
  5. భూమి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది
    తీగలు పైభాగంలో విస్తరించడం వల్ల నేలపై అందుబాటులో ఉన్న స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. సరైన పంట మరియు అంతర పంట ప్రణాళికతో భూమి వినియోగ సామర్థ్యాన్ని పెంచవచ్చు.

పందిరి నిర్మాణంలో జాగ్రత్తలు
పందిరి సాగులో విజయానికి బలమైన పందిరి నిర్మాణం చాలా ముఖ్యమైనది. పందిరి నిర్మించేటప్పుడు మంచి నాణ్యత కలిగిన వెదురు కర్రలు లేదా తగిన స్తంభాలను ఉపయోగించాలి. తీగలు, కాయల బరువును తట్టుకునే విధంగా ప్రధాన స్తంభాలను బలంగా పాతాలి.

పందిరిపై తీగలను పట్టుకునేందుకు బలమైన వైరు లేదా నైలాన్ తాళ్లను ఉపయోగించాలి. పందిరి నిర్మాణం గాలి వేగానికి తట్టుకునే విధంగా ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలంలో అధిక గాలులు, భారీ వర్షాల వల్ల పందిరి కూలిపోకుండా ముందుగానే తగిన బలపరిచే చర్యలు చేపట్టాలి.

నేల మరియు నాటే విధానం
నీరు నిల్వ ఉండని, మంచి నీటి పారుదల కలిగిన నేలలు తీగజాతి కూరగాయల సాగుకు అనుకూలంగా ఉంటాయి. పొలాన్ని బాగా దున్ని, సేంద్రియ ఎరువును తగిన మోతాదులో కలపాలి. విత్తనాల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

పంటను బట్టి గోతులు లేదా ఎత్తైన మడులు ఏర్పాటు చేసి విత్తనాలను నాటాలి. మొక్కల మధ్య దూరాన్ని పంట రకం, తీగల పెరుగుదల మరియు పందిరి నిర్మాణాన్ని బట్టి నిర్ణయించాలి.

ఎరువుల యాజమాన్యం
పందిరి సాగులో మొక్కలు వేగంగా పెరిగి అధికంగా తీగలను, ఆకులను మరియు కాయలను ఉత్పత్తి చేస్తాయి. అందువల్ల సమతుల్య పోషక యాజమాన్యం అవసరం. నేల పరీక్ష ఆధారంగా ఎరువుల మోతాదును నిర్ణయించడం ఉత్తమం.

నీటి యాజమాన్యం
తీగజాతి కూరగాయల్లో నీటి యాజమాన్యం చాలా కీలకం. నీటి కొరత వల్ల మొక్కల పెరుగుదల, పూత మరియు కాయల అభివృద్ధి దెబ్బతినవచ్చు. అదే సమయంలో అధిక నీరు ఇవ్వడం వల్ల వేర్ల వద్ద తేమ ఎక్కువై తెగుళ్లు వచ్చే అవకాశం ఉంటుంది.

బిందు సేద్యం ద్వారా మొక్కలకు అవసరమైనంత నీటిని అందించడం ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచవచ్చు. ముఖ్యంగా పూత మరియు కాయల అభివృద్ధి దశల్లో నీటి లభ్యతలో హెచ్చుతగ్గులు లేకుండా చూడాలి.

తీగల శిక్షణ మరియు నిర్వహణ
పందిరి సాగులో తీగలను సక్రమంగా పందిరిపైకి ఎక్కించడం చాలా ముఖ్యం. మొక్కలు పెరుగుతున్న కొద్దీ తీగలను మృదువైన తాళ్ల సహాయంతో పందిరిపైకి చేర్చాలి.

అవసరం లేని, బలహీనమైన లేదా వ్యాధి సోకిన భాగాలను తొలగించడం ద్వారా మొక్కలో గాలి ప్రసరణను మెరుగుపరచవచ్చు. అయితే కత్తిరింపు పద్ధతులు పంట రకాన్ని బట్టి మారుతాయి. కాబట్టి సంబంధిత పంటకు సిఫారసు చేసిన విధానాన్ని మాత్రమే అనుసరించాలి.

చీడపీడలు మరియు తెగుళ్ల యాజమాన్యం
పందిరి సాగులో మొక్కలకు మంచి గాలి, వెలుతురు లభించడం వల్ల కొన్ని సమస్యలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ చీడపీడలు పూర్తిగా నివారించబడవు. కాయతొలుచు పురుగులు, పేనుబంక, తెల్లదోమ, ఎర్రనల్లి వంటి పురుగులను ఎప్పటికప్పుడు గమనించాలి.

అదేవిధంగా బూజు తెగుళ్లు, వడల తెగుళ్లు మరియు ఇతర వ్యాధుల లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించాలి. పొలాన్ని తరచుగా పరిశీలిస్తూ సమగ్ర చీడపీడల యాజమాన్య పద్ధతులు (IPM) పాటించాలి.

పుష్పించే దశలో ప్రత్యేక శ్రద్ధ
తీగజాతి కూరగాయల్లో మంచి కాయ దిగుబడికి పుష్పించే దశ చాలా కీలకం. పుష్పాలు వచ్చే సమయంలో మొక్కలకు తగినంత నీరు, పోషకాలు అందేలా చూడాలి. అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత లేదా అధిక తేమ వంటి వాతావరణ పరిస్థితులు పూత మరియు కాయల ఏర్పాటుపై ప్రభావం చూపవచ్చు.

తేనెటీగలు వంటి పరాగసంపర్క కీటకాల పాత్ర ముఖ్యమైన పంటల్లో, పుష్పించే సమయంలో వాటి సంచారాన్ని దెబ్బతీసే చర్యలను తగ్గించడం మంచిది.

కోత మరియు మార్కెటింగ్
కూరగాయలను పంటకు అనుగుణమైన సరైన పరిపక్వ దశలో కోయాలి. ఆలస్యంగా కోయడం వల్ల కాయల నాణ్యత తగ్గడంతో పాటు తదుపరి కాయల ఉత్పత్తిపై కూడా ప్రభావం పడవచ్చు.

పందిరి సాగులో కాయలు స్పష్టంగా కనిపించడం వల్ల సరైన పరిమాణంలో ఉన్న కాయలను ఎంపిక చేసి కోయడం సులభం. కోత అనంతరం కాయలను నాణ్యత ఆధారంగా వేరు చేసి, శుభ్రమైన ప్యాకింగ్లో మార్కెట్కు తరలిస్తే మెరుగైన ధర పొందే అవకాశం ఉంటుంది.

రైతులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యాంశాలు
పందిరి సాగులో అధిక దిగుబడి పొందడానికి కేవలం పందిరి ఏర్పాటు చేయడం మాత్రమే సరిపోదు. నాణ్యమైన విత్తనం, సరైన మొక్కల సాంద్రత, బలమైన పందిరి, సమతుల్య ఎరువుల యాజమాన్యం, క్రమబద్ధమైన నీటి సరఫరా, తీగల శిక్షణ, సమగ్ర చీడపీడల యాజమాన్యం మరియు సరైన సమయంలో కోత వంటి అన్ని అంశాలను సమన్వయంతో పాటించాలి.

తీగజాతి కూరగాయల్లో పందిరి సాగు పద్ధతి రైతులకు నాణ్యమైన దిగుబడి, మెరుగైన కాయల నాణ్యత, కోతలో సౌలభ్యం మరియు భూమి వినియోగ సామర్థ్యం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ప్రారంభ దశలో పందిరి నిర్మాణానికి కొంత అదనపు పెట్టుబడి అవసరమైనప్పటికీ, సరైన పంట యాజమాన్యంతో దీర్ఘకాలంలో మెరుగైన దిగుబడి మరియు ఆదాయం పొందే అవకాశం ఉంది.

అందువల్ల మార్కెట్ డిమాండ్, స్థానిక వాతావరణ పరిస్థితులు మరియు సాగు వనరులను పరిగణనలోకి తీసుకుని తీగజాతి కూరగాయల్లో పందిరి సాగును శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టడం రైతులకు లాభదాయకమైన సాగు విధానంగా నిలుస్తుంది.

డా. టి. థామ్సన్, డా. టి. తేజస్విని, డా. వి. సుధావాణి
డా. వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం. ఫోన్ 9494963291

Read More

కుళ్ళు తెగులు నివారణకు నిమ్మగడ్డి కషాయం

నిమ్మగడ్డి కషాయం : నిమ్మగడ్డి కషాయం ముఖ్యంగా భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ళ యాజమాన్యంలో బాగా పనిచేస్తుంది. ఇది మాక్రోఫోమినా ఫాసియోలినా అనే శిలీంధ్రం కలుగజేసే కుళ్ళు తెగులు నివారణలో బాగా పనిచేస్తుంది.

ఉత్తరేణి కషాయం: ఉత్తరేణి కషాయం చాలా రకాల శిలీంధ్రాల నివారణకు పనిచేస్తుంది. ఇది ముఖ్యంగా శిలీంధ్ర బీజాలను చంపి, శిలీంధ్రబీజాలు మొలకెత్తుటను కూడా ఆపివేస్తుంది. ఉత్తరేణి కషాయం బోట్రైటిస్ తెగులు నివారణకు బాగా పనిచేస్తుందని చాలామంది శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

విప్ప కషాయం : విప్ప బద్దలు మన అడవులలో విస్తారంగా దొరుకుతాయి. వీటికి తెగుళ్ళ యాజమాన్యంలో చాలా పాత్ర వుంది. విప్పను తెగుళ్ళ యాజమాన్యంలో మన భారతదేశంలో సంప్రదాయంగా వాడేవారని విన్నీపియెరా అనే ఆమె తన పుస్తకం ‘టెండింగ్ ది ఎర్త’లో పేర్కొన్నారు. విప్పలో ఉండే చాలా రకాల ఆల్కలాయిడ్లు తెగుళ్ళ యాజమాన్యంలో శిలీంధ్ర పెరుగుదల నిలిపి వేయుటలో పాత్ర వహిస్తాయి. దీని వలన వ్యాధి వ్యాప్తి ఆగిపోతుంది.

Read More

ఔషధ మొక్క…. సీమ మెట్ట తామర

ఇది సుమారు 1.5 మీ. ఎత్తు పెరిగే ఒక చిన్న పొద. దీని శాఖలు సమాంతరంగా విస్తరిస్తాయి. పత్రములు పక్షవత్ సంయుక్తం. కణుపుకి ఒకటి చొప్పున ఏర్పడతాయి. పత్రకములు 8-12 జతలు, వెడల్పుగా, గుండ్రంగా ఉంటాయి. మొదలు వంకరగా ఉంటుంది. కాడలు మరియు పత్రవృంతములు సాధారణంగా ఎరుపు గోధుమ రంగులో ఉంటాయి. పుష్పవిన్యాసం ఆకుల మొదలు నుండి లేదా కొమ్మల చివర్ల నుండి వస్తుంది. నిటారైన పుష్పగుచ్చాలు కల్గి ఉంటుంది. పూలు పసుపు రంగులో ఉంటాయి. కాయలు పొడవుగా కొద్దిగా నొక్కినట్లు ఉండి అంచులు రెక్కలలాగా ఉంటాయి. గింజలు అనేకం ఉండి నలుపు రంగులో ఉంటాయి. తేమ గల ప్రాంతాలలో మరియు సాగు నేలలలోను కలుపుగా బాగా పెరుగుతుంది. అందమైన పూల కొరకు కూడా దీనిని పెంచుతారు. ఇది విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది.

సాధారణ నామం : రింగ్ వార్మ్ క్యాసియా / వింగ్‌డ్ సెన్నా / కాండిల్ బుష్ శాస్త్రీయ నామం : క్యాసియా అలాట కుటుంబం: సీసాల్పినియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • ఆకులు మరియు కాండం ఔషధగుణాలు కలిగి ఉంటాయి. వీటిలో ఆంత్రాగ్లూకోసైడ్లు, క్రైసోఫిన్ మరియు రీన్ అనే రసాయనాలు ఉన్నాయి. ఆకులు మరియు కాండమునకు శరీర భాగాలు కుళ్ళిపోకుండా చేసే గుణం ఉంది. విరేచనకారిగా పనిచేసి మలబద్ధకాన్ని నివారిస్తాయి.
  • దీనిని ఎడిమా, హెపాటైటిస్ మొదలగు జబ్బుల చికిత్సకూ, తామర, గజ్ౙి వంటి చర్మవ్యాదుల నివారణకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • సీమ మెట్ట తామర ఆకులలోని ఎసెన్షియల్ ఆయిల్ స్టెఫైలోకోకస్ ఆరియస్, స్ట్రెప్టోకోకస్ పీకాలిస్, ఎస్కెరిచియాకోలి, ప్రోటియస్ మిలాబిలిస్‌పై యాంటిమైక్రోబియల్ చర్యను ప్రదర్శించింది (ఇగ్వె అండ్ ఓన్వు, 2015)
  • బెరడు మరియు ఆకుద్రావణాలు సాధారణ నల్ల చీమలు, ఎర్రచీమల పై విష చర్యను ప్రదర్శించాయి (ప్లూక్, 1999).
  • క్యాసియా నైగ్రికాన్స్ ఆకులలోని ఎమోడిన్ తెల్లదోమ, బెమిసియా టబాసి పెద్ద పురుగులపై కీటక నాశక చర్యను, అనోఫెలెస్ గాంబియే దోమల లార్వాలపై లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది (అజిర్ౙెస్, అతని అనుచరులు, 2008).
  • దీని ఆకులలోని ఎమోడిన్ యాంటిమైక్రోబియల్ చర్యను ప్రదర్శించింది (అయో, అతని అనుచరులు, 2007).
  • సీమ మెట్టతామర ఆకుల ఎసిటోన్, ఇథనాల్ ద్రావణాలు స్టెఫైలోకోకస్ ఆరియస్, బాసిల్లస్ సబ్‌టైలిస్, బాసిల్లస్ సీరియస్, ఎస్కెరిచియా కోలి, విబ్రియో కలరా, క్లెబ్సియెల్లా న్యుమోనియేపై యాంటి మైక్రోబియల్ చర్యను ప్రదర్శించాయి (సకార్కర్, అతని అనుచరులు, 1998).
  • దీని ఆకులలో ఉన్న క్యాసియాక్ౙాంతోన్, కీంప్‌ఫెరాల్, గ్లెåకోసైడ్స్, క్రైసోఫినాల్స్, ఐసోక్రైసోఫినాల్ చీమలను సమర్ధవంతంగా వికర్షించాయి (వాట్ అండ్ బ్రేయర్, 1962, ప్రసాద్, 2007)
  • సీమ మెట్ట తామర మానవులలో వ్యాధులు కలిగించే క్యాండిడా ఆల్బికాన్స్, మైక్రోస్పోరం కానిస్, ట్రైకోఫైటాన్ మెంటగ్రోఫైట్స్ శిలీంద్రపెరుగుదలను అరికట్టింది (టమోతి, అతని అనుచరులు, 2012).
  • ఈ మొక్క భాగాలను స్టెఫైలోకోకస్ ఆరియస్, బాసిల్లస్ సబ్‌టైలిస్ కలిగించే వ్యాధుల నివారణలో ఉపయోగించవచ్చు. (అలలార్, అతని అనుచరులు, 2012).
  • ఈ మొక్క ఆకుల ఇథనాల్ ద్రావణంతో తయారు చేసిన ఆయింట్‌మెంట్లు పశువులలో డెర్మటోఫైలోసిస్ వ్యాధిని సమర్ధవంతంగా నివారించాయి. (ఆలిఎమ్మాన్యుయెల్, అతని అనుచరులు, 2003).
  • దీని ఆకులు, కాండం, బీన్స్ ద్రావణాలు బలమైన యాంటిబాక్టీరియల్ చర్యను, బలహీనమైన యాంటిఆక్సిడెంట్ చర్యను ప్రదర్శించాయి (వహాల్, అతని అనుచరులు, 2014).
  • సీమ మెట్టతామర మొక్కను అరటి కాండంతొలుచు పురుగు, ఒడోయిపోరస్ లాంగికోల్లిస్ నివారణలో ఉపయోగించవచ్చు.(బాలన్, దయానందన్, 2016).
  • ఈ మొక్క బెరడు పొడి టిక్స్‌ని నాశనం చేస్తుంది (సోరోన్)
  • సీమ మెట్టతామర సాల్వెంట్ ద్రావణాలు కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్‌పై శక్తివంతమైన విష చర్యను ప్రదర్శించాయి (ఉపాధ్యాయ్, అతని అనుచరులు, 2011)
  • దీని కాండం బెరడు ద్రావణంలో ఆల్కలాయిడ్స్, సపానిన్స్, ఫ్లేవనాయిడ్స్, టానిన్స్, గ్లెåకోసైడ్స్ ఉంటాయి (అవంతి అండ్ సుబ్బలక్ష్మి, 2016).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

తెగుళ్ళ నియంత్రణకు తులసి, మారేడు కషాయం

పంటపొలాల చుట్టూ ప్రకృతిలో దొరికే వివిధ రకాల ఆకులను ఉడకపెట్టడం ద్వారా కషాయాలను తయారు చేస్తారు. ఇది మన సంప్రదాయ వ్యవసాయంలో భాగం. ఆకులను ఉడకపెట్టడం వలన అందులో ఉండే మూల పదార్థాలు పూర్తి స్థాయిలో ద్రావణంలో చేరి కషాయం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. పంటల సస్యరక్షణలో ఈ కషాయాలు అనాదిగా రైతులకు తెలిసినవే. ఇందులో ముఖ్యంగా తులసి, మారేడు కషాయం తెగుళ్ళ నియంత్రణకు ఉపయోగపడుతుంది.

మారేడులో ఉండే ఎన్నో రకాల ‘ఆల్కలాయిడ’ల వలన ఇది తెగుళ్ళ నియంత్రణలో ఉపయోగపడుతుంది. ఈ కషాయం వరిలో వచ్చే అగ్గితెగులు, మెడవిరుపు తెగుళ్ళను నివారిస్తుంది.

పదార్థాలు :
మారేడు పత్రాలు : 5 కిలోలు
తులసి : 5 కిలోలు
సబ్బుపొడి : 100 గ్రా. లేదా
కుంకుడు కాయలు : 500 గ్రా.

తయారు చేయు పద్ధతి :

  • 5 కిలోల మారేడు పత్రాలు, 5 కిలోల తులసి ఆకులు తీసుకొని వాటిని 20 లీటర్ల నీటిలో అరగంట సేపు బాగా ఉడకబెట్టాలి.
  • ఉడుకుతున్న ద్రావణాన్ని మధ్యమధ్యలో కర్రతో కలుపుతూ ఉండాలి.
  • కషాయాన్ని బాగా చల్లార్చి, పలుచని గుడ్డతో వడపోయాలి.
  • ఈ ద్రావణానికి 100 గ్రాముల సబ్బుపొడిని కలపాలి.
  • ఈ ద్రావణాన్ని 100 లీటర్ల నీళ్ళలో కలిపి ఒక ఎకరా పంటపై సాయంత్రం పూట పిచికారి చేయాలి.

ఉపయోగాలు :

  • పంటకాలంలో 1-2 సార్లు పంటపై పిచికారి చేసుకోవచ్చు.
  • 100 గ్రాముల సబ్బుపొడికి బదులుగా 500 గ్రా. కుంకుడుకాయ/ శీకాయ రసంగాని కలుపుకోవచ్చు.
  • కషాయం తయారు చేసిన వెంటనే పంటపై పిచికారి చేసుకోవాలి.
  • కషాయం నిల్వ ఉంచరాదు.
  • వరిలో వచ్చే అగ్గి తెగులు నివారణకు ఈ కషాయాన్ని వారం రోజుల వ్యవధిలో కనీసం 2 సార్లు ఉపయోగించి మంచి ఫలితాలు సాధించవచ్చు.

జాగ్రత్తలు :

  • కషాయం తయారు చేసేటపుడు ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి.
  • కషాయం పిచికారి చేసేటపుడు వంటిపై పూర్తిగా బట్టలు ధరించాలి.
Read More

పురుగుల నివారణకు బ్రహ్మాస్త్రం

ఒక పాత్రలో 10 లీటర్ల గోమూత్రం తీసుకుని అందులో 2 కిలోల వేపాకు ముద్ద, 2 కిలోల సీతాఫలం ఆకు ముద్ద, 2 కిలోల పల్లేరు ఆకు ముద్ద, 2 కిలోల ఉమ్మెత్త ఆకు ముద్ద వేసి ఒక కర్రతో ఈ మిశ్రమాన్ని కలపండి. ఆ తర్వాత పాత్రపైన మూత పెట్టి బాగా (అరగంట) ఉడికించాలి. ఆ తర్వాత పాత్రను క్రిందికి దించి 48 గంటల వరకు చల్లారనిచ్చి తర్వాత గుడ్డతో వడబోయాలి. ఇప్పుడు బ్రహ్మాస్త్రం సిద్దం. ఎకరానికి 100 లీటర్ల నీటికి 2-3 లీటర్ల బ్రహ్మాస్త్రం కలిపి పిచికారి చేయాలి. దీనిని ఆరునెలల వరకు నిల్వ ఉంచవచ్చు.ఈ విధంగానే సీతాఫలం, ఉమ్మెత్త, వివిధ ఆకులతో కషాయం తయారు చేయవచ్చు. ఈ కషాయం కాండంతొలుచు పురుగు, కాయతొలుచు మరియు అన్నిరకాల తొలుచు పురుగుల నివారణకు పనిచేస్తుంది.

Read More

ఔషధ మొక్క… మిరప

మిరప వార్షిక లేదా తక్కువ కాలం బ్రతికే బహుళ వార్షిక మొక్క. పూలు తెలుపు రంగులో ఉంటాయి. కీటకాల ద్వారా లేదా స్వపరాగ సంపర్కం ద్వారా పరాగసంపర్కం జరుగుతుంది. కాయలు నిటారుగా, అండాకారంశంఖాకారం నుండి బల్లెం ఆకారంలో ఉంటాయి. అవి సాధారణంగా అతి చిన్నగా, అతి కారంగా ఉంటాయి. 10-20 మి.మీ. పొడవు పెరుగుతాయి. 3-7 మి.మీ. వ్యాసం కలిగి ఉంటాయి. కాయలు లేత పసుపు రంగుకి మారి పక్వదశలో కాంతివంతమైన ఎరుపు రంగుకి మారతాయి.

సాధారణ నామం : కూరమిరప శాస్త్రీయ నామం : క్యాప్సికం ఫ్రూటెసెన్స్ కుటుంబం: సొలనేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • మిరప అనేక జీర్ణ సంబంధ సమస్యలయిన కడుపునొప్పి, జీర్ణకోశంలో గ్యాస్, డయేరియాలకు ఉపశమనం కలిగిస్తుంది. ఇది హృదయ, రక్త సంబంధ సమస్యలకు, రక్త ప్రసరణ సరిగా లేకపోవడం, అధిక కొలెస్ట్రాల్, గుండెజబ్బులు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.
  • రక్తాన్ని పలుచన చేసి గుండెజబ్బుల రిస్క్‌ని తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.
  • మిరపలో విటమిన్ సి అధికంగా ఉండటం వలన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • మిరపలో ఉన్న క్యాపెå్ససినాయిడ్స్ క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడతాయి. మిరప అనేక సమస్యలకు ఉపయోగపడే గొప్ప ఔషధ మొక్క.
  • మనుషులలో మలేరియా, బోదకాలు, డెంగు, జపనీస్ ఎన్‌సిఫలైటిస్ వంటి వ్యాధులను వ్యాప్తి చేసే దోమ యీడెస్ యీజెప్టీ రెండవ దశ లార్వాలను మిరప ఆకు, కాయ ద్రావణాలు సమర్ధవంతంగా చంపాయి (వినాయక, అతని అనుచరులు, 2010)

వ్యవసాయరంగంలో

  • మిరపకాయ ఇథనాల్ ద్రావణం (30%) మొక్కజొన్న నిల్వ ధాన్యంలో ఆశించే సైటోఫిలిస్ జియామెయిస్ పురుగుని వికర్షణ చర్య ద్వారా నివారించింది (అకిన్ బులుమ, అతని అనుచరులు, 2015).
  • మిరప ఆకు ద్రావణం వేరు శనగ నిల్వ సమయంలో నష్టం కలిగించే ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్ శిలీంద్ర పెరుగుదలను 88.06% అరికట్టింది. కాయ ద్రావణం ఆస్పర్ౙిల్లస్ నైగర్ శిలీంద్ర పెరుగుదలను 88.3% అరికట్టింది. మిరప కాయ ద్రావణంతో శుద్ధి చేసిన వేరుశనగ గింజలలో శిలీంద్రాల పెరుగుదల అధికంగా అరిక\్టబడింది. వేరుశనగ గింజలలో శిలీంద్రాలాశించడాన్ని అరికట్టడానికి మిరపకాయ ద్రావణం బాగా పనిచేస్తుందని ఫలితాలు వెల్లడించాయి (సౌమ్య, నాయర్, 2012).
  • మిరపకాయ ద్రావణం చెదపురుగులను (కాప్టోఎర్మెస్ గెస్ట్రాయ్) నివారించింది (కోలన్, అతని అనుచరులు, 2016).
  • మిరప కాయల ద్రావణం తయారు చేయడానికి 2 పిడికెళ్ళ మిరపకాయలను ఎండబెట్టి మెత్తని పొడి చేయాలి. ఈ పొడిని 2 లీ. నీటిలో కలిపి రాత్రంతా నానబెట్టాలి.
  • మిరప విత్తన పొడి అలసంద, మొక్కజొన్న గింజల నిల్వ సమయంలో ఆశించే బ్రూచిడ్స్, కాల్లసోబ్రోకస్ మాక్యులేటస్, సైటోఫిలా జియామెయిస్ పురుగులను నివారించింది (ఓని, 2010).
  • మినుము గింజలను మిరపకాయ ద్రావణం (600 పిపియం)తో శుద్ధి చేసి కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్ బ్రూచిడ్‌ని 91% నివారించవచ్చు. (మొరాల్లోరీసస్, అతని అనుచరులు).
  • మిరప కాయ ద్రావణం క్యాబేజి పంటనాశించే పేనుబంక, బ్రెవికారినెబ్రాసికె, డైమండ్ బ్యాక్‌మాత్‌ని రసాయన పురుగుమందులతో సమానంగా నివారించింది (అమోనాబెంగ్, అతని అనుచరులు, 2013).
  • మిరప చీమలు, పేనుబంక, లార్వాలు, రైస్‌వీవిల్, అనేక బీటిల్స్ మొదలైన పురుగులను సమర్ధవంతంగా నివారిస్తుంది. 300 గ్రా. మిరప కాయలను రోట్లో బాగా దంచి మెత్తని పొడి చేయాలి. దంచేటపుడు చేతులకు గ్లౌస్ తొడుక్కోవాలి. శరీరంపై పడకుండా జాగ్రత్త వహించాలి. ఈ పొడిని 2 లీ. నీటికి కలిపి 7 గంటలు నిల్వ ఉంచాలి. తర్వాత ఇంకొక 4 లీ. నీరు కలిపి పిడికెడు సబ్బు పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని వడపోసి పిచికారి చేయాలి.
  • మిరప కాయలను ఎండలో ఆరబెట్టి దంచి పొడి చేయాలి. ఈ పొడి నిల్వ చేసిన ఉత్పత్తులనాశించే పురుగులను సమర్ధవంతంగా నివారిస్తుంది.
  • మిరప ద్రావణం వైరస్‌లను కూడా నివారిస్తుంది. అయితే ఈ ద్రావణాన్ని వైరస్ ఆశించక ముందు పంటపై పిచికారి చేయాలి (ప్లూక్, 1999).

పురుగులను నివారించే మిరప ఫార్ములేషన్లు

  1. అన్ని పురుగుల నివారణ ద్రావణం (ఆర్గానిక్ గార్డెనింగ్, 1996)

కావలసిన పదార్థాలు : ఎండు మిరప పొడి 1 చెంచా; వెల్లుల్లి గడ్డ 1, చిన్న ఉల్లి గడ్డ 1, నీరు 1 లీటరు, సబ్బుపొడి 1 చెంచా, కత్తి 1, స్టెయినర్ (వడపోయడానికి) 1, బేసిన్ 1

తయారు చేసే విధానం : వెల్లుల్లి, ఉల్లి గడ్డలను తరగాలి. ఎండుమిరప కాయ పొడి కలపాలి. వీటన్నింటినీ నీటిలో కలిపి ఒక గంట నానబెట్టాలి. తర్వాత వడపోసి సబ్బు పొడి కలిపి బాగా కలపాలి. స్ప్రేయర్లో నింపి మొక్కలు బాగా తడిసేలా పిచికారి చేయాలి.

నివారించబడే పురుగులు : ఆకులను తినే పురుగులు

  1. మిరప కషాయం (హెచ్‌డిఆరఎ, 2000)

కావలసిన పదార్థాలు : ఎండుమిరపకాయలు 4 కప్పులు, లేదా మిరప విత్తనాలు 5 కప్పులు, సబ్బుపొడి 30 గ్రా., మట్టి కుండ 1, స్టెయినర్ 1

తయారు చేసే విధానం : మట్టికుండలో ఎండు మిరపకాయలు లేదా మిరప విత్తనాలను నీటిలో కలిపి 15-20 ని. మరగబెట్టాలి. కుండని పొయ్యిమీద నుంచి దించి 3 లీ. నీరు కలపాలి. చల్లార్చి వడపోయాలి. సబ్బుపొడిని వేసి బాగా కలపాలి. తర్వాత పంటపై పిచికారి చేయాలి.
నివారించబడే పురుగులు : చీమలు, పేనుబంక, లార్వాలు, దోమలు, పిండి నల్లులు.

  1. మిరప వేప ఆకుల ద్రావణం (స్టోల్, 2000)

కావలసిన పదార్థాలు : పచ్చి మిరపకాయ ముక్కలు 10-20, తాజా వేప ఆకులు 2 -2.5 కి., నీరు 2 లీ., సబ్బుపొడి 2 చెంచాలు, రోలు, బండ 1, పాత్ర 1

తయారు చేసే విధానం : మిరపకాయ ముక్కలను, వేప ఆకులను దంచి ఒక లీటరు నీరు కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా నానబెట్టాలి. తర్వాత వడపోసి దీనికి 20 లీ. నీరు, సబ్బుపొడి కలపాలి. ఉదయం వేళల్లో గానీ, సాయంత్రం వేళల్లోగాని మొక్కలపై పిచికారి చేయాలి.
నివారించబడే పురుగులు : లద్దె పురుగు, తెల్లదోమ, మొజాయిక్ వైరస్.

  1. మిరప-వేపగింజల ద్రావణం (స్టోల్, 2000)

కావలసిన పదార్థాలు : కత్తిరించిన పండు మిరప కాయ ముక్కలు 12, పూర్తిగా ఎండిన తొక్కతీసిన వేప గింజలు 200 గ్రా., నీరు 2 లీ., పాత్ర/కుండ 1, గ్రైండర్ 1, కత్తి 1

తయారు చేసే విధానం : వేప గింజలను నూరి నీటిలో రాత్రంతా నానబెట్టాలి. పండు మిరప కాయ ముక్కలను కలిపి వడపోయాలి. స్ప్రేయర్‌లో నింపి మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారి చేయాలి.

నివారించబడే పురుగులు : పేనుబంక, డైమండ్‌బ్యాక్‌మాత్, రసంపీల్చే పురుగులు, తెల్లదోమ

మిరప – సీతాఫలం – వేప ద్రావణం (శ్రీధర్, అతని అనుచరులు, 2002)

కావలసిన పదార్థాలు : ఎండుమిరపకాయలు 25 గ్రా., సీతాఫలం ఆకులు 100 గ్రా., దంచిన వేపకాయలు 50 గ్రా., సబ్బు ద్రావణం 20 మి.లీ., గ్రైండర్ 1, వెడల్పు మూత సీసాలు, ప్రాత 1
తయారు చేసే పద్ధతి : ఎండుమిరప కాయలను నూరాలి. 100 మి.లీ. నీటిలో నానబెట్టాలి. నూరిన వేపకాయలను 200 మి.లీ. నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు రెండు ద్రావణాలను కలపాలి. సీతాఫలం ఆకులను నూరి 500 మి.లీ. నీరు కలపాలి. వడపోసి అన్ని ద్రావణాలను కలపాలి. దీనికి 5-6 లీ. నీరు కలపాలి. సబ్బు ద్రావణం పోసి బాగా కలిపి మొక్కలపై ఉదయం లేదా సాయంత్రం పిచికారి చేయాలి.
నివారించబడే పురుగులు : పేనుబంక, ఆకుచుట్టు పురుగులు, ఎర్రపొలుసు పురుగులు, మచ్చల బీటిల్స్

  • క్యాబేజి పంటలో ఆశించే ప్లూటెల్లా క్జ్లైలోస్టెల్లా, బ్రెవికారిని బ్రాసికె, హెలుల్లా ఆండాలిస్, ట్రైకోఫ్లూసియా ని పురుగులపై మిరప, వెల్లుల్లి ప్రభావాలను రసాయన పురుగు మందు ‘అటాక’ తో పోల్చి చూశారు. ఈ ద్రావణాలు క్యాబేజి పంటపై పురుగులను 10.76% నుండి 55.94% నివారించాయి. రసాయన పురుగుమందు అటాక్ పిచికారి చేసిన మొక్కలకన్నా మిరప, వెల్లుల్లి ద్రావణాలు పిచికారి చేసిన మొక్కలలో సహజ శత్రువులు ఎక్కువగా ఉన్నాయి. సస్యరక్షణ ఖర్చు అటాక్ పిచికారి చేసిన ప్లాటులో మిరప, వెల్లుల్లి ద్రావణాలు పిచికారి చేసిన ప్లాట్లలో కన్నా అధికంగా ఉంది (బయిడూ, మోచయ్య, 2015).
    సేంద్రియ పురుగు మందులు రసాయన పురుగమందుల కన్నా సురక్షితమైనవి మరియు అధిక పర్యావరణహితమైనవి. వాతావరణ కాలుష్యం కలిగించే వ్యర్థాలలో ఒకటైన మానవ లేదా పశువుల మూత్రాన్ని సేంద్రియ పురుగు మందు తయారీలో ముడి పదార్థంగా ఉపయోగిస్తారు. 100 లీ. మూత్రం {1 కి. సుగంధ ద్రవ్యాలను కలిపి సేంద్రియ పురుగు మందు తయారు చేస్తారు.

సేంద్రియ పురుగు మందు
కావలసిన పదార్థాలు : మానవ లేదా పశువుల మూత్రం 100 లీ., పసుపు, ఫిలెసెలోచి మంజారింగ, పార్కియాస్పీసియోసా , టైనోస్పోరాక్రిస్సా ఒక్కొక్కటి 250 గ్రా., మిరప, ఉల్లి 750 గ్రా., ఎంపిక చేసిన సుగంధ ద్రవ్యాలలో మొక్కలలో పురుగుల పెరుగుదలనరికట్టే లక్షణాలున్నాయి.

సేంద్రియ పురుగు మందు తయారు చేసేవిధానం

  • 250 గ్రా. చొప్పున పసుపు, పిథకలోబియం జిరింగి, పార్కియా స్పీసియోసా, టినోస్పొరా క్రిస్పా లను నీటిలో 24 గంటలు నానబెట్టాలి.
  • తర్వాత వీటిని మరిగించాలి.
  • మూత్రాన్ని పెద్దగిన్నెలో పోసి మరగబెట్టిన సుగంధ ద్రవ్యాలను కలపాలి
  • మూత్రం, మరగబెట్టిన సుగంధ ద్రవ్యాలను 2-3 వారాలు పులియబెట్టాలి.
  • 750 గ్రా. పండుమిరప, ఎర్రుల్లి ముక్కలను పులిసిన మిశ్రమానికి కలిపి గిన్నెని 34 రోజులు మూసి ఉంచాలి
  • సేంద్రియ పురుగుమందు ఉపయోగించడానికి సిద్ధం
  • 1 లీ. సేంద్రియ పురుగు మందుని 10 లీ. నీటిలో కలపాలి (రొజాక్, సోఫ్రియాని, 2009)
  • మిరప ఆకు ద్రావణం (5 మి.గ్రా. / మి.లీ.) ఆల్టర్నేరియా (75%), కొల్లెటోట్రైకం (12.5%), ఫ్యుజేరియం (17.5%) శిలీంద్రాల పెరుగుదలనరికట్టింది (దేవ్, వేణు, 2016).
  • మిరప పొడి, మిరియాల పొడి గోధుమ ధాన్యాన్ని నిల్వలో ఆశించే రైజోపెర్తా డామినిక, సైటోఫిలస్ గ్రానరీస్ పురుగుల నుండి కాపాడే సామర్థ్యం కలిగి ఉన్నాయి. (అఫౌరి, షాయేస్టే, 2010).
  • మునగ ఆకులు, మిరపకాయలను నూరి ద్రావణాలు తయారు చేయాలి. ఈ రెండు ద్రావణాలను కలిపి 5-7 రోజులు నిల్వ ఉంచాలి. తర్వాత పురుగుల నివారణకు పంటపై పిచికారి చేయాలి.
  • మిరప కాయల ద్రావణం, ఎమామెక్టిన్ బెంజొయేట్ (ఎటాక్) క్యాబేజి పంటనాశించే డైమండ్ బ్యాక్‌మాత్ (ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లా, పేనుబంక (బైవికారినె బ్రాసికె), తెల్లదోమ (బెమిసియా టబాసి)ను, ఫ్రెంచి చిక్కుడు నాశించే ఫ్లవర్ త్రిప్స్ (మెగాల్యూరోత్రిప్స్ జోస్టెడ్రి), తెల్లదోమ (బెమిసియా టబాసి), దీపపు పురుగులు (ఎంపోవాస్కా స్పీసీస్) అలసంద పేనుబంక (ఎఫిస్ క్రాకివొరా)లను సమర్ధవంతంగా నివారించాయి. క్యాబేజి పంటలో సహజ శత్రువులు కొటేసియా ప్లుటెల్లా, అక్షింతల పురుగు, కెలోమెనెస్ స్పీసీస్, హోవరఈగ, సాలీళ్ళు, ఫ్రెంచి చిక్కుడులో అక్షింతల పురుగులు, సాలీళ్ళకు హాని కలిగించకుండా సంరక్షించాయి (అడమ, టెగ్బె, 2014).
  • మిరప పొడి (5 గ్రా.), మిరప పొడి { మెత్తని ఇసుక (5 గ్రా.) చొప్పున ప్రతి జొన్న మొక్క మొగిలో 10 రోజుల వ్యవధిలో 4 సార్లు వేసి జొన్నలో కాండం తొలుచు పురుగును నివారించారు (ఒక్రికట, అతని అనుచరులు, 2016)
  • మిరప ద్రావణం (100%), 80% మిరప ద్రావణం { 20% మేక ఎరువు టీ శనగపచ్చ పురుగు లార్వాలను చంపాయి (ల్యూటాప్, అతని అనుచరులు, టెక్నికల్ ప్రాజక్ట్ రిపోర్టు)
  • ఉగాండాలోని విక్టోరియా బేసిన్‌లో రైతులు మిరప ద్రావణాలను సహజ పురుగు మందుగా ఉపయోగిస్తారు (మికిండి, అతని అనుచరలు, 2015)
  • కిలో వరి ధాన్యానికి 10-20 గ్రా. మిరప పొడి చొప్పున కలిపి ధాన్యాన్ని ఆశించి నష్టపరిచే పురుగులను నివారించవచ్చు.
  • మిరప, వెల్లుల్లి ద్రావణాలకు టమాట పంటనాశించే ఎర్రనల్లి (టెట్రానైకస్ ఎవాన్సి)ని నివారించే శక్తి ఉంది (ఫాతిమా, ఆమె అనుచరులు, 2015).
  • మిరప ద్రావణాన్ని నేరుగా వ్యవసాయ పంటలలో పిచికారి చేసి బీటిల్స్, పేనుబంక, నల్లి, చిత్త పురుగులు, క్యాబేజి సీడ్‌పాడ్ వీవిల్స్, చారల కుకుంబర్ బీటిల్, మచ్చల కుకుంబర్ బీటిల్, కొలరాడోపొటాటో బీటిల్, డైమండ్ బ్యాక్‌మాత్, మొక్కజొన్న కండె తొలుచు పురుగు, తెల్లదోమ, ఇంపోర్టెడ్ క్యాబేజివర్మ్, క్యాబేజి మాగట్, ఆనియన్ మాగట్, కాటన్ బోల్‌వర్మ్ పురుగులను నివారించవచ్చు.
  • నిల్వ ఉంచిన అలసంద గింజల నాశించే అలసంద వీవిల్ కాల్లసో బ్రూకస్ మాక్యులేటస్‌ని మిరప, వెల్లుల్లి పొడి, ద్రావణాలతో నివారించవచ్చు (వహేది, అతని అనుచరులు, 2014).
  • మిరపలో ఉండే ఆల్కలాయిడ్లు క్యాబేజి నాశించే పేనుబంక, బ్రెవికారినె బ్రాసికే ని 100% నివారించాయి (హబియన, హకిజయేజు, 2014).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

పేనుబంక, పచ్చ దోమ నివారణకు పొగాకు కషాయం

పంటపొలాల చుట్టూ ప్రకృతిలో దొరికే వివిధ రకాల ఆకులను ఉడకపెట్టడం ద్వారా కషాయాలను తయారు చేస్తారు. ఇది మన సంప్రదాయ వ్యవసాయంలో భాగం. ఆకులను ఉడకపెట్టడం వలన అందులో ఉండే మూల పదార్థాలు పూర్తి స్థాయిలో ద్రావణంలో చేరి కషాయం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. పంటల సస్యరక్షణలో ఈ కషాయాలు అనాదిగా రైతులకు తెలిసినవే. ఇందులో ముఖ్యంగా పొగాకు కషాయం రైతులకు వివిధ పంటలలో పురుగుల నియంత్రణ కొరకు ఉపయోగపడుతుంది.

  • పొగాకులో “నికోటిన్” మూలపదార్థంగా ఉండడం వలన ఇది పురుగులను స్పర్శ చర్య ద్వారా నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.
  • పొగాకు కషాయం పంటలలో వచ్చే పేనుబంక, పచ్చ దోమ, తెల్లదోమ నివారణకు ఉపయోగపడుతుంది.

కావలసిన పదార్ధాలు
పొగాకు రద్దు : 1 కిలో (చిన్నచిన్న ఆకులు, కాడలు మొ॥)
సబ్బు పొడి : 100 గ్రాములు (లేదా)
కుంకుడు కాయలు : 500 గ్రాములు

తయారు చేసే విధానం

  • పొగాకు రద్దును 10 లీటర్ల నీటిలో అరగంట నుండి గంట సేపు బాగా ఉడక బెట్టాలి. ఈ విధంగా ఉడకబెట్టిన ద్రావణం సుమారు 5 లీ. వరకు ఉంటుంది.
  • కషాయాన్ని ఒక కర్రతో కలియబెడుతూ ఉండాలి.
  • కషాయాన్ని బాగా చల్లార్చి, పలుచని గుడ్డతో వడపోయాలి.
  • కషాయానికి 100 గ్రాముల సబ్బుపొడినిగానీ లేదా అరకిలో కుంకుడుకాయల రసాన్ని కానీ కలపాలి.
  • పై కషాయానికి 100 లీటర్ల నీటిని చేర్చి, ఒక ఎకరా పొలంలో సాయంత్రం వేళ పిచికారీ చేయాలి.

జాగ్రత్తలు:

  • పొగాకు కషాయం తయారు చేసేటపుడు ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి.
  • పొగాకు కషాయం పిచికారి చేసేటపుడు వంటిపై పూర్తిగా బట్టలు ధరించాలి.
  • పంట కాలంలో ఒకటి, రెండు సార్లు మాత్రమే అవసరాన్ని బట్టి పంటపై పిచికారీ చేయాలి.
  • ఎక్కువ సార్లు పిచికారీ చేసిన ఎడ… పంటలను ఆశించి వుండే రైతుమిత్ర పురుగులు చనిపోయే ప్రమాదం ఉంది.
  • తయారు చేసిన ద్రావణాన్ని వెంటనే ఉపయోగించాలి. కషాయాన్ని నిల్వ ఉంచరాదు.
Read More